ఆసక్తి పెంచుతున్న విజయ్‌ ఆంటోని ‘హత్య’ ట్రైలర్‌, చూశారా? | Hero Nani Launches Vijay Antony Hatya Movie Trailer | Sakshi
Sakshi News home page

Vijay Antoni: ఆసక్తిగా విజయ్‌ ఆంటోని హత్య ట్రైలర్‌, చూశారా?

Published Tue, Aug 16 2022 10:12 AM | Last Updated on Tue, Aug 16 2022 10:13 AM

Hero Nani Launches Vijay Antony Hatya Movie Trailer - Sakshi

విజయ్‌ ఆంటోనీ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హత్య’. బాలాజీ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షీ చౌదరి, రితికా సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. కమల్‌ బోరా,  జి. ధనుంజయన్, ప్రదీప్‌ .బి, పంకజ్‌ బోరా, విక్రమ్‌ కుమార్, తాన్‌ శ్రీ దొరైసింగమ్‌ పిళ్లై, సిద్ధార్థ్‌ శంకర్, ఆర్వీఎస్‌ అశోక్‌ కుమార్‌ నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్‌ని హీరో నాని సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేశారు.

హైదరాబాద్‌లో జరిగిన ట్రైలర్‌ లాంచ్‌ వేడుకలో నిర్మాతలు బెల్లంకొండ సురేష్, జీవీజీ రాజు, దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ అతిథులుగా పాల్గొని, చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. ‘‘హత్య నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వేరే భాష నుంచి వచ్చినా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు విజయ్‌ ఆంటోనీ. ‘‘ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. లైలా అనే అమ్మాయి హత్య చుట్టూ ఈ కథ నడుస్తుంది’’ అన్నారు బాలాజీ కుమార్‌. ‘‘త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు నిర్మాతలు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement