సంగీతదర్శకుడు, నటుడు విజయ్ ఆంటోని ఇంతకు ముందు కథానాయకుడిగా నటించి నిర్మించిన పిచ్చైక్కారన్ చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'పిచ్చైక్కారన్– 2' (తెలుగులో బిచ్చగాడు-2) చిత్రాన్ని సొంతంగా నిర్మించి, సంగీతాన్ని అందించి, కథానాయకుడిగా నటించారు.
(ఇది చదవండి: ఆయన పరిస్థితిని చూస్తే భయమేసింది: మహేశ్)
ఇందులో విశేషమేమిటంటే ఈ చిత్రం ద్వారా ఆయన దర్శకుడిగా అవతారమెత్తడం. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై ఈయన సతీమణి ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మించిన ఈ చిత్రంలో కావ్య తాపర్ నాయకిగా నటించగా రాధారవి, వైజీ.మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, హరీష్ పేరడీ, జాన్స్ విజయ్, దేవ్ గిల్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి ఓమ్ నారాయణన్ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీన తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ సందర్భంగా బుధవారం చిత్ర యూనిట్ స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ ఆంటోని మాట్లాడుతూ ఈ చిత్ర షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురైన తాను ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. సాధారణంగా యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయనీ, తనకు మాత్రం పాటల చిత్రీకరణలో ప్రమాదం జరిగిందన్నారు.
తాను సంగీతదర్శకుడిగానూ ఎవరి వద్దా పని చేయలేదనీ, చిత్రాలు చూసిన అనుభవమేనన్నారు. చిత్రం చాలా బాగా వచ్చిందనీ, ఇంతకు ముందు చిత్రాల్లో తనకు రొమాన్స్ సన్నివేశాలు పెద్దగా లేవనేవారనీ.. ఈ చిత్రంలో అలాంటి సన్నివేశాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పారు. ఇది అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు.
(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment