దళపతి సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ.. సెన్సార్‌ పూర్తి | Thalapathy Vijay Latest Movie GOAT Sensor Review Out Now, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

The GOAT Movie Censor Report: సెన్సార్ పూర్తి చేసుకున్న 'ది గోట్‌' మూవీ

Published Wed, Aug 21 2024 9:17 PM | Last Updated on Thu, Aug 22 2024 1:22 PM

Thalapathy Vijay Latest Movie GOAT Sensor Review Out Now

కోలీవుడ్ స్టార్‌ హీరో, దళపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్‌(ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్‌). సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి సెన్సార్ పూర్తయింది. ఈ విషయాన్ని డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. గోట్‌ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా.. ఈ మూవీని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిర్మించారు.

ఇప్పటికే రిలీజైన ది గోట్‌ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. ఈ మూవీలో విజయ్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా కీలక పాత్రల్లో పోషించారు. ది గోట్‌.. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement