
మిర్చి విజయ్, అంజలి నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వైఫ్. ఈ చిత్రం ద్వారా హేమంత్ నాదం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒలింపియ మూవీస్ సంస్థ అధినేత ఎస్.అంబేడ్కర్ నిర్మిస్తున్నారు. గతంలో జిప్సీ, డాడా, కలిగేత్తి మూర్కన్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
దంపతుల మధ్య నవీన అనుబంధాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఇది ఉంటుందని డైరెక్టర్ హేమంత్ నాదం అన్నారు. అందుకే ఈ చిత్రానికి వైఫ్ అని పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి టైటిల్‌ను ఇప్పటివరకు ఎవరూ పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చదరంగంలో రాణికి అపార శక్తి ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక ఇంటిని చక్కదిద్దడంలో భార్య పాత్ర ముఖ్యమన్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య పెరిగే ప్రేమానుబంధాన్ని ఎమోషనల్‌గా ఆవిష్కరించే చిత్రమని చెప్పారు.
ఈ చిత్రం ద్వారా మిర్చి విజయ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కేఏ శక్తివేల్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మైత్రేయన్, రెడిన్ కింగ్స్ లీ, కల్యాణి నటరాజన్, విజయ్‌బాబు, విల్లు, కదిర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Super happy to present the First Look of my next Romcom #Wife with @RJVijayOfficial 👰🏻♀️🤵🏻
Directed by @dir_hemanathan
Produced by @ambethkumarmla @olympiaMovis@Abishek_jg @shakthi_dop @JenMartinmusic @PMohan93 @gayathribala21@sharmaseenu11@VishnuEdavan1 @DoneChannel1 pic.twitter.com/fqnzgwDBaZ— Anjali (@ianjalinair) March 23, 2024