నటుడు విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'లియో'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్ లలిత్‌కుమార్ భారీ ఎత్తున నిర్మిస్తున్న విషయం తెలిసిందే. నటి త్రిష , ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో బాలీవుడ్ స్టార్ సంజయ్‌దత్, నటుడు అర్జున్, మన్సూర్ అలీఖాన్ దర్శకుడు మిష్కిన్, గౌతమ్ వాసుదేవన్, శాండీ మాస్టర్, మాథ్యూథామస్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
(ఇది చదవండి: జీవితంలో ఏదీ అంతా ఈజీ కాదు: హీరోయిన్)
మాస్టర్ చిత్రం తర్వాత విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో లియోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా చిత్రం చివరి దశకు చేరుకుంది. దీంతో చిత్రం గురించి దర్శకుడు లోకేష్ కనకరాజ్ అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు ముందే ఆడియో హక్కులు, ఓటీటీ హక్కును అంటూ ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్లు టాక్ వైరల్ అవుతోంది.
తాజాగా మరో అప్‌డేట్ వెల్లడించారు. ఈనెల 22న నటుడు విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలోని అలర్ట్ ఈగో నా రెడీ అనే పల్లవితో సాగే తొలి పాటను విడుదలైనట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ పోస్టర్లో విజయ్ చేతుల్లో గన్ను, నోట్లో సిగరెట్ పెట్టుకుని ఫోర్స్‌గా కనిపించడంతో ఆయన అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అయితే దీనిపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా పీఎంకే పార్టీ నేత రామదాసు విజయ్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ విజయ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. చాలా కాలం క్రితం తన చిత్రాల్లో సిగరెట్లు కాల్చే సన్నివేశాలను, మద్యం తాగే సన్నివేశాలను చోటు చేసుకోవడాన్ని తాను అనుమతించనని వాగ్దానం చేశారన్నారు. అలాంటిది ఇప్పుడు ఆ మాట తప్పి ఇప్పుడు లియో చిత్రంలో అలా రెండు అంశాలు చోటు చేసుకోవడం ఆయన అభిమానులను చెడు త్రోవ పట్టించడం కాదా అని ప్రశ్నించారు.
(ఇది చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్)
First Single #NaaReady on @actorvijay Anna's Birthday #Leo 🔥🧊 pic.twitter.com/xG5T46GWyR
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 16, 2023
Comments
Please login to add a commentAdd a comment