తమిళ స్టార్, దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లియో. త్రిష, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, అర్జున్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఎస్‌ఎస్ లలిత్‌కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.
ట్రైలర్ ప్రారంభంలోనే.. 'ఒక సీరియల్ కిల్లర్ నడిరోడ్డుపై గుడ్డిగా షూట్ చేస్తున్నాడు.. ఆల్‌రెడీ రోడ్డుమీద చాలామంది చనిపోయారు' అనే డైలాగ్‌తో ప్రారంభమైంది. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్ సినిమాగానే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అర్జున్ సర్జా, సంజయ్ దత్ ఈ సినిమాలో నటించడం మరింత ఆసక్తి పెంచుతోంది. ఫైట్ సీన్స్ తోడేళ్లతో కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. కథ మొత్తం గ్యాంగ్‌స్టార్ల చుట్టూ తిరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ చెప్పిన ఓ బూతు డైలాగ్ ఆడియన్స్‌లో షాక్‌కు గురి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
(ఇది చదవండి: లియో ఆడియో వేడుక రద్దు)
ఈ మూవీ ఇప్పటికే షూటింగ్‌ను పూర్తిచేసుకుని అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలోని నా రెండు వరువా అనే పాట ఇప్పటికీ విడుదలై అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment