దళపతి విజయ్ లియో మూవీ విడుదలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే తమిళనాడులో బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ విషయంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా నిర్మాతలకు చుక్కెదురైంది. తాజాగా తెలుగు వర్షన్ అయినా బెనిఫిట్ షోలు చూడొచ్చని భావించిన అభిమానులకు మరో షాక్ తగిలింది. లియో సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్‌పై స్టే విధిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 20వ తేదీ వరకు ఈ చిత్రాన్ని విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది.
(ఇది చదవండి: లియో నిర్మాతలకు షాకిచ్చిన మద్రాస్ హైకోర్ట్!)
లియో తెలుగు వర్షన్ ఈనెల 19న విడుదల చేయవద్దంటూ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. లియో టైటిల్ వివాదం నేపథ్యంలో డి-స్టూడియోస్ ప్రతినిధులు సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. డి స్టూడియోస్ పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం ఈ నెల 20 వరకు విడుదల చేయవద్దని ఆదేశాలిచ్చింది.
తీవ్ర నిరాశలో ఫ్యాన్స్!
ఈ నిర్ణయంతో విజయ్ అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తమిళంలో బెనిఫిట్ షోలు లేకపోవడంతో కోలీవుడ్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తెలుగులోనైనా మార్నింగ్ షోలు చూడొచ్చని అభిమానులు భావించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్స్ కొనుగోలు చేసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అటు కోలీవుడ్.. ఇటు టాలీవుడ్‌లో లియోకు షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, అర్జున్ సర్జా కీలక పాత్రలు పోషించారు.
(ఇది చదవండి: ఊర్వశి రౌతేలా బంగారు ఐఫోన్.. రివార్డ్ ప్రకటించిన భామ!)
Comments
Please login to add a commentAdd a comment