'Rasavadhi' Movie First Look Poster Out Now - Sakshi
Sakshi News home page

Rasavathi: రొమాంటిక్‌ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న 'రసవతి'.. ఆసక్తిగా పోస్టర్!

Published Sat, Aug 5 2023 3:03 PM | Last Updated on Sat, Aug 5 2023 3:36 PM

Romantic Crime Thriller Movie Rasavadhi First Look Poster Out now - Sakshi

అర్జున్‌దాస్‌, తాన్యా రవిచంద్రన్‌ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'రసవాది'.  మౌనగురు, మహాముని వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శాంతకుమార్‌. కథలను నమ్మి చిత్రాలు చేసే ఈయన పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకుంటారు. అలా శాంతకుమార్‌ తెరకెక్కిస్తున్న మూడో చిత్రం 'రసవాది'. డీఎన్‌ఏ మెకానిక్‌ కంపెనీ సరస్వతి సినీ క్రియేషన్‌న్స్‌ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి రమ్య సుబ్రమణియన్‌, జీఎం సుందర్‌, సుజిత్‌ శంకర్‌, రేష్మ, సుజాత, రిషీకాంత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎస్‌ తమన్‌ సంగీతమందిస్తుండగా.. వరవణన్‌ ఇళవరసు, శివకుమార్‌ల ద్వయం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు.

(ఇది చదవండి: రజనీకాంత్‌ రెమ్యునరేషన్‌ అన్ని కోట్లా? బడ్జెట్‌లో సగం సూపర్‌స్టార్‌కే! )

దర్శకుడు శాంతకుమార్‌ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో క్రైమ్‌, రొమాంటిక్‌, యాక్షన్‌, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. తాను గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థియేటర్‌ ఎక్స్‌పీరియన్‌న్స్‌ ఇస్తుందన్నారు. చిత్ర షూటింగ్‌ను కొడైకనాల్‌, మదురై, కడలూర్‌, పళని ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర ఆడియో, విడుదల తేదీ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

(ఇది చదవండి: శ్రీరామ్‌ కార్తీక్‌ హీరోగా కొత్త ప్రేమ కథా చిత్రం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement