Arjun Das
-
ఓటీటీకి వచ్చేస్తోన్న రొమాంటిక్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అర్జున్ దాస్, తాన్య రవిచంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ చిత్రం 'రసవతి'. ఈ చిత్రం మే 10న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు శాంతకుమార్ దర్శకత్వం వహించారు. అయితే బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.మిస్టరీ థ్రిల్లర్‌గా వచ్చిన రసవతి ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈనెల 21 నుంచి అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా (తమిళం), సింప్లీ సౌత్‌లోనూ స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఓవర్ సీస్ ఫ్యాన్స్ కోసమే సింప్లీసౌత్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ మేరకు రసవతి పోస్టర్‌ను మేకర్స్ పంచుకున్నారు. ఈ చిత్రంలో సదాశివగా అర్జున్ దాస్, సూర్యగా తాన్య రవిచంద్రన్ తమ పాత్రల్లో మెప్పించారు.ఈ చిత్రం కొడైకెనాల్ నేపథ్యంలో సాగుతుంది. ఓ గ్రామంలో వైద్యం చేసే సదాశివ అనే యువకుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. కాగా.. ఇందులో నిఖిలా శంకర్, దీప, అరుల్ జోతి, రిషికాంత్, సుజాత శివకుమార్, రమ్య సుబ్రమణియన్, జిఎమ్ సుందర్, రేష్మా వెంకటేష్, సుజిత్ శంకర్ కీలక పాత్రలు పోషించారు. Rasavathi will be streaming on Amazon prime, Aha and simply south ( in simply south excluding India) from June 21st. #Rasavathi @iam_arjundas @actortanya @Reshmavenkat01 @actorramya @GMSundar_ @MusicThaman @EditorSabu @SPremChandra1 @minu_jayebal @dancersatz @SureshChandraa… pic.twitter.com/f5ElM8y7O0— Santhakumar (@Santhakumar_Dir) June 19, 2024 -
డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఏం చెప్పినా చేస్తా: యువ నటుడు
అర్జున్ దాస్.. ఈ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది అతడి గొంతు. బయపెట్టేలా ఉండే బేస్ వాయిస్ తనకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. 'ఖైదీ' మూవీలో విలన్‌గా చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. ఇప్పుడు హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అలా తన కొత్త మూవీ 'రసవాది' రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.(ఇదీ చదవండి: శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా)ఎక్కడో దుబాయ్‌లో పనిచేసే అర్జున్ దాస్.. చైన్నెకి వచ్చి డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ తీసిన 'ఖైదీ'తో యాక్టర్ అయ్యాడు. దీని తర్వాత 'మాస్టర్'లోనూ లోకేశ్ ఇతడికి ఛాన్స్ ఇచ్చాడు. అందుకే ఆయనంటే అర్జున్‌దాస్‌కు ప్రత్యేక అభిమానం. తాజాగా తన కొత్త మూవీ రిలీజ్ సందర్భంగా అర్జున్ దాస్ పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. విలన్‌గా చేసే మీరు ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. మళ్లీ విలన్‌గా నటించే అవకాశమొస్తే చేస్తారా? అన్న ప్రశ్నకు బదిలిస్తూ.. లోకేశ్ కనకరాజ్ విలన్‌గా చేయమని చెబితే కచ్చితంగా నటిస్తానని అన్నాడు.డైరెక్టర్ లోకేశ్ తనకు మంచి మిత్రుడని, ఆయన అవకాశమిస్తే రజనీకాంత్ 'కూలీ'లో నటించడానికి రెడీ అని అర్జున్ దాస్ అన్నాడు. మళ్లీ డబ్బింగ్ చెప్పే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి అవకాశం లేదని, లోకేశ్ కనకరాజ్ తన సినిమాలో డబ్బింగ్ చెప్పమంటే మాత్రం ఎలాంటి పాత్రకై నా చెబుతానని క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?) -
ద్వి భాషా చిత్రంగా వస్తోన్న పోర్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్స్ అర్జున్‌దాస్, కాళిదాస్ జయరామ్ నటించిన తాజా చిత్రం పోర్. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో డీజే భాను, సంజనా నటరాజన్, మెర్విన్ రోజారియో ప్రధాన పాత్రలు పోషించారు. టీ సిరీస్, రూక్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో సైతాన్, డేవిడ్, వాజీర్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పోర్ మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్జున్‌దాస్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను దర్శకుడు తనకు ఒక హోటల్లో చెప్పారన్నారు. అంతకుముందే కాళిదాస్ జయరామ్ ఎంపికయ్యారని చెప్పారు. ఇది కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో కొంచెం స్నేహం సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఈ చిత్రంలో నటించిన దర్శకుడు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. సాధారణంగా రెండు భాషల్లో రూపొందించే చిత్రాల షూటింగ్లో ఒక భాషలో నటించే నటులకు మరో భాషా సన్నివేశాలను చూపించరన్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు హిందీ వెర్షన్ సన్నివేశాలను చూసే అవకాశం కల్పించడంతో తాను మరింత పర్ఫెక్ట్గా నటించినట్లు చెప్పారు. కాళిదాస్ జయరామ్‌తో మళ్లీ కలిసి నటిస్తానా అనేది సందేహామే అన్నారు. ఆయన కెమెరా ముందుకు వచ్చేవరకు అందరితోనూ ఎంతో సరదాగా ఉంటారని అంత జోవియల్ వ్యక్తి అని చెప్పారు. మంచి స్నేహశీలి అని కూడా అర్జున్ దాస్ పేర్కొన్నారు. -
'విక్రమ్' విలన్‌తో రాజశేఖర్ కూతురు కొత్త సినిమా
గేంబ్రియో పిక్చర్స్ పతాకంపై సుధా సుకుమార్ నిర్మిస్తున్న తొలి చిత్రం ఆదివారం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నటుడు అర్జున్ దాస్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటిస్తున్న ఇందులో నాజర్, కాళీ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విశాల్ వెంకట్ దర్శకుడు. (ఇదీ చదవండి: నా రూమ్‌లో సీక్రెట్ కెమెరా పెట్టారు: స్టార్ హీరోయిన్) ఈ చిత్ర విశేషాల గురించి మాట్లాడిన డైరెక్టర్.. చక్కని వినోదంతో కూడిన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ డ్రామా ఇది అని అన్నాడు. ఈ చిత్రంలో మంచి విషయం ఉందని, నటుడు నాజర్ లాంటి సీనియర్స్‌తో కలిసి పనిచేయటం సంతోషంగా ఉందని అర్జున్ దాస్ ఆనందం వ్యక్తం చేశాడు. సంగీత దర్శకుడు డి.ఇమాన్‌కు తాను పెద్ద అభిమానినని, ఆయన సంగీతాన్ని అందిస్తున్న చిత్రంలో తాను నటించడం ఆనందంగా ఉందన్నాడు. తమిళంలో ఇప్పటికే రెండు మూవీస్ చేసిన శివాత్మిక.. తెలుగులో కంటే తమిళంలోనే బిజీ అవుతుందా అనిపిస్తుంది. (ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?) -
రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తోన్న 'రసవతి'..!
అర్జున్‌దాస్, తాన్యా రవిచంద్రన్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం 'రసవాది'. మౌనగురు, మహాముని వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు శాంతకుమార్. కథలను నమ్మి చిత్రాలు చేసే ఈయన పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకుంటారు. అలా శాంతకుమార్ తెరకెక్కిస్తున్న మూడో చిత్రం 'రసవాది'. డీఎన్ఏ మెకానిక్ కంపెనీ సరస్వతి సినీ క్రియేషన్‌న్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటి రమ్య సుబ్రమణియన్, జీఎం సుందర్, సుజిత్ శంకర్, రేష్మ, సుజాత, రిషీకాంత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తుండగా.. వరవణన్ ఇళవరసు, శివకుమార్‌ల ద్వయం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. (ఇది చదవండి: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? బడ్జెట్లో సగం సూపర్‌స్టార్‌కే! ) దర్శకుడు శాంతకుమార్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో క్రైమ్, రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఇది ఉంటుందని చెప్పారు. తాను గత చిత్రాల తరహాలోనే ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త థియేటర్ ఎక్స్పీరియన్న్స్ ఇస్తుందన్నారు. చిత్ర షూటింగ్‌ను కొడైకనాల్, మదురై, కడలూర్, పళని ప్రాంతాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చిత్ర ఆడియో, విడుదల తేదీ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. (ఇది చదవండి: శ్రీరామ్ కార్తీక్ హీరోగా కొత్త ప్రేమ కథా చిత్రం!) A movie I’ve been super excited about! Can’t wait for you all to watch what @Santhakumar_Dir has made#Rasavathi 🔥💥 A @MusicThaman Musical 💥@actortanya @ReshmaVenkates1 @actorramya @GMSundar_ @SPremChandra1 @saranelavarasu @EditorSabu @minu_jayebal @dancersatz… pic.twitter.com/NshqoLmP5J — Arjun Das (@iam_arjundas) August 5, 2023 -
‘బ్లడ్ అండ్ చాక్లెట్’లో ప్రేమ, అభిమానం రెండూ ఉంటాయి
అర్జున్ దాస్, దుషారా విజయన్ జంటగా నటించిన చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్’. ఎస్ పిక్చర్స్‌పై ప్రముఖ దర్శకుడు శంకర్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 21న విడుదలకానుంది. ఈ మూవీని తెలుగులో ఎస్ఆర్డీఎస్ సంస్థపై దేవసాని శ్రీనివాసరెడ్డి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వసంత బాలన్ మాట్లాడుతూ..‘బ్లడ్ అంటే సాధారణంగా మనకు వయొలెన్స్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే బ్లడ్ అండ్ చాక్లెట్ అంటే ప్రేమ, అభిమానం. మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి’ అన్నారు. ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ సినిమాను మా ఎస్.ఆర్.డి.ఎస్ బ్యానర్లో రిలీజ్ చేయటంపై చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సినిమాను అందరూ ఆదరించి సక్సెస్ చేయాలని కోరుతున్నాను’అని అన్నారు నిర్మాత దేవసాని శ్రీనివాసరెడ్డి. ‘నేషనల్ అవార్డ్ గెలుచుకున్న వసంత బాలన్‌గారితో కలిసి పని చేయటం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్’అని హీరో అర్జున్ దాస్ అన్నారు. -
సస్పెన్స్ థ్రిల్లర్‌గా శంకర్ ‘బ్లడ్ అండ్ చాక్లెట్’
‘ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్ మాల్’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ దర్శకుడు శంకర్ తాజాగా ‘బ్లడ్ అండ్ చాక్లెట్’ చిత్రాన్ని నిర్మించారు. ‘షాపింగ్ మాల్, ఏకవీర’ తదితర చిత్రాల దర్శకుడు వసంత బాలన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో అర్జున్ దాస్ హీరోగా, దుషారా విజయన్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా నిర్మాత ‘దిల్ రాజు’ విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 21న రిలీజ్ కానుంది. తెలుగులో ఎస్.ఆర్.డి.ఎస్ సంస్థ విడుదల చేయనుంది. -
హతి రాంజీ మఠం అర్జున్ దాస్ ను పీఠాధిపతిగా తొలగింపు
-
అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న నటి అనిఖా సురేంద్రన్ తెలుగులో హీరోయిన్గా నటించిన చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్టలు ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్ చిత్రం కప్పేలాకు ఇది రీమేక్. శౌరీ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, జీవితం తలకిందులైంది: సీనియర్ నటి మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ వేదికపై సందడి చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్ ప్రకారం బుట్టబొమ్మ త్వరలోనే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థ సొంతం చేసుకుందట. కాగా మార్చి 4 నుండి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. -
Butta Bomma: అర్జున్ దాస్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా?
సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి బాగా ఫేమస్ అవుతున్న నటుల్లో అర్జున్ దాస్ ఒకడు. ఖైదీ సినిమాతో అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమాలో నెగటివ్ రోల్ అయినా సరే అర్జున్ దాస్ నటన చాలా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా అర్జున్ దాస్ వాయిస్‌కి అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పటికీ యూట్యూబ్ లో అతని వీడియో లు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ‘మాస్టర్’, ‘విక్రమ్’ తర్వాత అర్జున్ దాస్‌కి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఆయన ఇప్పటి వరకు నటించిన చిత్రాలన్నింటిలోనూ నెగెటివ్ రోల్స్ చేశాడు. కానీ తొలిసారి ‘బుట్ట బొమ్మ’ చిత్రంలో పాజిటివ్ రోల్ పోషించి, తనదైన నటనతో మెప్పించాడు. అనిఖా సింగ్, సూర్య వశిష్ట, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం శనివారం(ఫిబ్రవరి 4) విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. ఈ చిత్రంతో ఆర్కేగా అర్జున్ దాస్ అదరగొట్టేశాడు. ఈ పాత్రలో అర్జున్‌ని తప్ప మరే నటుడిని ఊహించుకోలేం. ఇంటర్వెల్‌కి ముందు అతని పాత్ర పరిచయం అవుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం అర్జున్ దాస్ చుట్టు కథ తిరుగుతుంది. ‘బుట్ట బొమ్మ’ విజయంలో అర్జున్ దాస్ కీలక పాత్ర పోషించడమే కాదు.. తనలో మరో యాంగిల్ ఉందని కూడా ప్రేక్షకులు చూపించాడు. కేవలం విలన్ పాత్రలే కాదు.. హీరోగానూ రాణించగలడనే విషయం బుట్టబొమ్మ ద్వారా తెలిసింది. మంచి కథతో సినిమా చేస్తే..అర్జున్ దాస్ హీరోగా రాణించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి మన దర్శక నిర్మాతలు అర్జున్ దాస్‌ని ఎలా వాడుకుంటారో చూడాలి. -
‘బుట్టబొమ్మ’ మూవీ రివ్యూ
టైటిల్ : బుట్టబొమ్మ నటీనటులు : అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ, ప్రేమ్ సాగర్, నవ్యా స్వామి తదితరులు నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య స్క్రీన్ ప్లే, మాటలు : గణేష్ కుమార్ రావూరి దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్ సంగీతం: గోపీసుందర్, స్వీకర్ అగస్తి సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు ఎడిటర్: నవీన్ నూలి కథేంటంటే.. అరకులోని దూది కొండ గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. సత్య(అనికా సురేంద్రన్)ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. తల్లి టైలరింగ్ చేస్తే.. తండ్రి రైసు మిల్లులో పని చేస్తుంటాడు. సత్య స్నేహితురాలు లక్ష్మి ప్రతి రోజు ఫోన్లో తన లవర్‌తో మాట్లాడడం చూసి..తనకు కూడా ఒకడు ఉంటే బాగుండు అనుకుంటుంది. దాని కంటే ముందు ఒక కెమెరా ఫోన్ కొని రీల్స్ చేసి ఫేమస్ అయిపోవాలనుకుంటుంది. అలాంటి సమయంలో తనకు ఒక రాంగ్ కాల్ ద్వారా ఆటో డ్రైవర్ మురళి(సూర్య వశిష్ట) పరిచయం అవుతాడు. ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడతారు. అదే సమయంలో సత్యను ఇష్టపడే జమిందారు చిన్ని..ఇంట్లో వాళ్లతో మాట్లాడి పెళ్లికి ఒప్పిస్తాడు. ఇంట్లో పెళ్లి సంబంధం ఖాయంతో చేయడంతో మురళిని చూడటం కోసం సత్య విశాఖ వెళుతుంది. ఆ తర్వాత ఏమైంది. తనను తను మురళీగా పరిచయం చేసుకున్న ఆర్కే(అర్జున్ దాస్) తర్వాత ఏం చేశాడు? మురళీకి ఆర్కేకి ఎందుకు గొడవైంది? చివరకు సత్య జీవితం ఏమైంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. మలయాళ సూపర్ హిట్ ‘కప్పేలా’ తెలుగు రీమేకే ‘బుట్టబొమ్మ’. ఇదొక సింపుల్ కథ. కేవలం రెండు ట్విస్టులను బేస్ చేసుకొని సినిమాను తెరకెక్కించారు. అయితే కప్పేలా సినిమా చూసిన వారికి ఆ ట్విస్టులు కూడా తెలిసిపోతాయి కాబట్టి.. బుట్టబొమ్మపై ఆసక్తి ఉండదు. కానీ కప్పేలా చూడని వారికి మాత్రం ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అలాగే తెలుగులో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారు. సత్య కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ.. కథను ప్రారంభించాడు దర్శకుడు. స్నేహితురాలిని చూసి తనకు కూడా ఒక బాయ్‌ఫ్రెండ్ ఉండాలనుకోవడం.. ఫోన్లో పరిచయం అయిన వ్యక్తితో చాటింగ్.. ఆ తర్వాత అతన్ని కలిసేందుకు విశాఖ వెళ్లడం..ఇలా ఫస్టాఫ్ అంతా ఓ పల్లెటూరి ప్రేమకథగా సాగుతుంది. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కథ యూటర్న్ తీసుకొని థ్రిల్లర్‌గా కొనసాగుతుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌తో ఇది లవ్‌స్టోరీ కాదు.. వేరే కథ అని అర్థమవుతుంది. ప్రస్తుసం సమాజంలో జరుగుతున్న ఓ మోసాన్ని చూపిస్తూ.. యువతకు మంచి సందేశాన్ని అందించారు. అయితే కేవలం రెండు ట్విస్టుల కోసం అదికూడా ఇంటర్వెల్ ముందు.. క్లైమాక్స్‌లో వచ్చేవి తప్పా.. మిగత కథనం అంతా రొటీన్‌గా.. సింపుల్‌గా సాగుతుంది. మురళీ, సత్యల ప్రేమాయణం కూడా ఆసక్తికరంగా సాగలేదు. కప్పేలా చూడని వారికి ఈ సినిమాలోని ట్విస్టులు నచ్చుతాయి. ఎవరెలా చేశారంటే.. బాలనటిగా పలు చిత్రాల్లో నటించిన అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. సత్య పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ సినిమా కథంతా ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది.తొలి సినిమాతోనే హీరోయిన్గా తనదైన నటనతో మెప్పించింది. ఇక ఆటోడ్రైవర్ మురళీ పాత్రకుసూర్య వశిష్ట న్యాయం చేశాడు. ఆర్కేగా అర్జున్ దాస్ అదరగొట్టేశాడు. అతని వాయిస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నవ్యస్వామి, ప్రేమ్ సాగర్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. గోపీసుందర్, స్వీకర్ అగస్తి సంగీతం జస్ట్ ఒకే. సినిమాటోగ్రఫీ బాగుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Butta Bomma: రీమేకే అయినా భారీ మార్పులు చేశాం
లాక్ డౌన్ సమయంలో మలయాళ కప్పేల చిత్రాన్ని చూశాను. కథలో ఉన్న బలం, కథనం నన్ను బాగా ఆకట్టుకుంది. అందుకే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాను. మెయిన్ పాయింట్ ని తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేసి ‘బుట్ట బొమ్మ’ తెరకెక్కించామని దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ అన్నారు. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుట్టబొమ్మ’. ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► మాది గుంటూరు. కానీ పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. మాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. కానీ నాకు ముందు నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. కుటుంబ సభ్యుల సూచన మేరకు ముందు పీజీ పూర్తి చేసి ఆ తరువాత సినిమాల్లోకి వచ్చాను. ► ముందుగా రామ్ గోపాల్ వర్మ గారికి చెందిన వర్మ కార్పొరేషన్ లో పనిచేశాను. ఆయన నిర్మించిన శూల్ అనే హిందీ ఫిల్మ్ చేశాను. ఆ చిత్రానికి ఈశ్వర్ నివాస్ దర్శకుడు. ఆయన దగ్గరే వరుసగా నాలుగు హిందీ సినిమాలకు వర్క్ చేశాను. ఆ తరువాత మా నాన్నగారు మరణించడంతో హైదరాబాద్ వచ్చేశాను. కొంతకాలానికి ఒక స్నేహితుడి ద్వారా సుకుమార్ గారు పరిచయమయ్యారు. ఆయన దగ్గర జగడం నుంచి పుష్ప సినిమా వరకు పని చేశాను. ► కొన్ని చిత్రాలను రీమేక్ చేయగలం, కొన్ని చిత్రాలు చేయలేం. బుట్ట బొమ్మ పూర్తిగా స్క్రిప్ట్ మీద ఆధారపడిన సినిమా. దీనిని మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేసి, రీమేక్ చేస్తే బాగుంటుందనే నమ్మకం కలిగింది. అప్పటికే ఈ మూవీ రీమేక్ హక్కులను సితార సంస్థ తీసుకుందని తెలిసి.. నేనే వారిని సంప్రదించాను. కొన్ని చర్చల తర్వాత నేను చేయగలనని నమ్మి, వారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. ► మెయిన్ పాయింట్ ని తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశాం. ముఖ్యంగా ఫస్టాఫ్ లో కీలక మార్పులు చేయడం జరిగింది. కామెడీ, ఎమోషన్స్ మన అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేశాం. ఫస్టాఫ్ లో కథనం పరంగా ఒక పెద్ద మార్పు కూడా చేశాం. ► బుట్టబొమ్మ సినిమాలో ఒక కాన్సెప్ట్ రన్ అవుతుంది. అది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అది అనుకున్నప్పుడు అప్పటికే 'బుట్టబొమ్మ' సాంగ్ బాగా పాపులర్ కావడంతో అదే టైటిల్ పెడితే బాగుంటుందని వంశీ గారు సూచించారు. అలా ఈ టైటిల్ ఖరారైంది. ► ఈ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యముంది. పాటలు, నేపథ్య సంగీతం అద్భుతంగా వచ్చాయి. గోపీసుందర్ గారు ఒక పాట, నేపథ్య సంగీతం అందించారు. స్వీకర్ అగస్తి రెండు పాటలు స్వరపరిచారు. ఇప్పటికే విడుదల చేసిన పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ► త్రివిక్రమ్, చినబాబు ఈ చిత్రాన్ని చూసి నన్ను ఎంతో మెచ్చుకున్నారు. వారిచ్చిన ప్రశంసలు మాటల్లో చెప్పలేను. ► తదుపరి సినిమా యాక్షన్ జోనర్ లో చేయాలని ఉంది. కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే కొత్త సినిమా అప్డేట్స్ ఇస్తాను. -
'బుట్ట బొమ్మ' ఒప్పుకోవడానికి కారణం ఇదే : అనిక సురేంద్రన్
ఎన్నో ఏళ్లుగా బాల నటిగా పలు సినిమాల్లో నటించాను. కానీ హీరోయిన్గా నాకిదే(బుట్ట బొమ్మ) తొలి సినిమా. హీరోయిన్గా నటించేటప్పుడు ఎంతో కొంత ఒత్తిడి ఉండడం సహజం. పైగా ఈ సినిమాలో నాది ప్రధాన పాత్ర. అయితే మా మూవీ టీమ్ మద్దతుతో ఎలాంటి ఒత్తిడి లేకుండా సినిమాను పూర్తి చేశాం’ అని హీరోయిన్ అనిక సురేంద్రన్ అన్నారు. సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్, అనికా సురేంద్రన్ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుట్టబొమ్మ’. ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అనిక సురేంద్రన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►మలయాళ మూవీ కప్పేల తెలుగు రీమేకే బుట్టబొమ్మ. మూల కథ అలాగే ఉంటుంది. కానీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశారు. ఒరిజినల్ ఫిల్మ్ కంటే కూడా ఇది ఇంకా కలర్ ఫుల్ గా ఆకట్టుకునేలా ఉంటుంది. ►కప్పేల మూవీని చూశాను. నాకు బాగా నచ్చింది. అలాంటి మంచి సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం, పైగా సితార వంటి ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో.. ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అంగీకరించాను. ►తెలుగులో నాకు సంభాషణలకు అర్థం తెలీదు. కానీ సన్నివేశాలను అర్థం చేసుకొని నటించాను. దర్శకుడు రమేష్ ఆ సన్నివేశాల తాలూకు ఎమోషన్స్ ని వివరించి నటన రాబట్టుకున్నారు. ►నేను ఇప్పటిదాకా పని చేసిన ఉత్తమ నిర్మాణ సంస్థల్లో సితార ఒకటి. వంశీ గారు నన్ను ఈ చిత్రం కోసం ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. సితార లాంటి పెద్ద సంస్థలో హీరోయిన్ గా మొదటి సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా విడుదలకు ముందే తెలుగులో అవకాశాలు వస్తున్నాయి. ►ప్రస్తుతం మలయాళంలో 'ఓ మై డార్లింగ్' అనే మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నాను. తమిళ్ లో ఒక మూవీ చేస్తున్నాను. అలాగే కొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. -
మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెప్పా: అర్జున్ దాస్
‘‘బుట్టబొమ్మ’ తమిళ్ రీమేక్ అయినా తెలుగుకి తగ్గట్టు మార్పులు చేశారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని నాగవంశీగారు నమ్మారు’’ అని నటుడు అర్జున్ దాస్ అన్నారు. అనికా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బుట్టబొమ్మ’. ఎస్.నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలకానుంది. అర్జున్ దాస్ మాట్లాడుతూ– ‘‘ఖైదీ, అంధకారం, మాస్టర్’ సినిమాల వల్లే నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది. అందరూ నా వాయిస్ గురించి మాట్లాడుతుంటారు. అలాగే నా నటనను కూడా ఇష్టపడుతున్నారని ఆశిస్తున్నాము. బుట్టబొమ్మ కోసం మొదటిసారి తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాను. నేను ఈ సినిమా ఒప్పుకునే ముందే నిర్మాత వంశీ గారు సొంతంగా డబ్బింగ్ చెప్పాలని షరతు పెట్టారు.మా నిర్మాతలు సినిమాకు కావాల్సినవన్నీ సమకూర్చారు. దర్శకుడు రమేష్ మీద నమ్మకం ఉంచి, ఆయనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు’ అన్నారు.