సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా శంకర్‌ ‘బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌’ | Blood And Chocolate Movie First Look Poster By Dil Raju | Sakshi
Sakshi News home page

సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా శంకర్‌ ‘బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌’

Published Sun, Jul 2 2023 3:27 PM | Last Updated on Sun, Jul 2 2023 3:27 PM

Blood And Chocolate Movie First Look Poster By Dil Raju - Sakshi

‘ప్రేమిస్తే, వైశాలి, షాపింగ్‌ మాల్‌’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ దర్శకుడు శంకర్‌ తాజాగా ‘బ్లడ్‌ అండ్‌ చాక్లెట్‌’ చిత్రాన్ని నిర్మించారు. ‘షాపింగ్‌ మాల్, ఏకవీర’ తదితర చిత్రాల దర్శకుడు వసంత బాలన్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఎస్‌ పిక్చర్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో అర్జున్‌ దాస్‌ హీరోగా, దుషారా విజయన్‌ హీరోయిన్‌గా నటించారు.

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్, టీజర్‌ను సోషల్‌ మీడియా ద్వారా నిర్మాత ‘దిల్‌ రాజు’ విడుదల చేశారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. తెలుగులో ఎస్‌.ఆర్‌.డి.ఎస్‌ సంస్థ విడుదల చేయనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement