రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' పేరు చెప్పగానే ఫ్యాన్స్ డీలా పడిపోతారు. ఎందుకంటే అప్పుడెప్పుడో కరోనా టైంలో ప్రకటన వచ్చింది. దీంతో ఆహా ఓహో అనుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇంకా సెట్స్ మీదే ఉంటోంది. శంకర్ ఒకేసారి రెండు మూవీస్ చేయడం వల్లే ఈ చిక్కొచ్చిపడింది. ఇప్పుడు 'భారతీయుడు 2' రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన తర్వాత మూవీ గురించి దర్శకుడు శంకర్ అప్డేట్ ఇచ్చేశాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 24 మూవీస్.. ఆ నాలుగు స్పెషల్)
'గేమ్ ఛేంజర్' మరో 10-15 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలుందని అన్నారు. 'భారతీయుడు 2' రిలీజైన వెంటనే ఆ పనిమీదే ఉంటానని చెప్పుకొచ్చాడు. అలానే ఈ రెండు చిత్రాలకు అస్సలు పోలికే లేదని క్లారిటీ ఇచ్చాడు. 'గేమ్ ఛేంజర్' విషయంలో రెండో భాగం లాంటిది ఏం ఉండదని, ఆ స్టోరీ స్కోప్ లేదని పేర్కొన్నాడు. దీంతో చరణ్ మూవీకి సీక్వెల్ ఏం ఉండదని స్పష్టత వచ్చేసింది.
'గేమ్ ఛేంజర్'లోని రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ అంతా ఇప్పటికే పూర్తయింది. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ నటిస్తాడు. నవంబరులో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా అదే టైంలో అంటే దీపావళికి 'గేమ్ ఛేంజర్' థియేటర్లలోకి రానుందని అంటున్నారు. ఒకవేళ ఈ తేదీ మిస్సయితే క్రిస్మస్ మాత్రం పక్కా అనేది గట్టిగా వినిపిస్తున్న మాట.
(ఇదీ చదవండి: రొమాన్స్ అంటే మీరనుకునేది కాదు: మృణాల్ ఠాకుర్)
10-15 Days Shoot Pending. #GameChanger. pic.twitter.com/sROnvfAWIY
— Johnnie Walker (@Johnnie5ir) July 1, 2024
Comments
Please login to add a commentAdd a comment