టాలీవుడ్ సినిమా బడ్జెట్ రోజు రోజుకు పెరిగిపోతుంది. పదేళ్ల కిందట రూ.30, 50 కోట్ల బడ్జెట్‌తో సినిమా తెరకెక్కిస్తేనే అది భారీ బడ్జెట్ మూవీ అనేవారు. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఆ స్థాయిలో ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చిన్న హీరోలు సైతం రూ.50 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసుకున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాల బడ్జెట్‌కు అయితే లెక్కే లేదు. మినిమం రూ.150-200 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే. కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. అందుకే నిర్మాతలు పెద్ద హీరోలకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. త్వరలోనే టాలీవుడ్ నుంచి మరో భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కాబోతుంది. అదే గేమ్ ఛేంజర్(Game Changer).
దిల్ రాజు కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్
ఆర్‌ఆర్‌ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram charan) నటించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రానికి శంకర్(shankar) దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు కెరీర్‌లోనే ఇది అత్యధిక బడ్జెట్. మూడేళ్ల క్రితం ఈ సినిమాకి బీజం పడింది. కరోనాతో పాటు ఇతర కారణాలతో సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో బడ్జెట్ పెరుగుతూ వచ్చింది. పబ్లిసిటీ, రెమ్యునరేషన్స్‌తో కలిసి చూస్తే.. ఈ సినిమాకు రూ.500 కోట్లకు పైనే ఖర్చు అయినట్లు తెలుస్తోంది.
శంకర్ సినిమాలు అంటేనే బడ్జెట్‌కు పరిమితులు ఉండవనే విషయం తెలిసిందే. క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ కారు. పాటలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది. పాటలతో పాటు కొన్ని సీన్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ చూస్తేనే ఆ విషయం అర్థమైపోతుంది.
రూ.300 కోట్ల భారం
గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటి వరకు ఎవరూ చేయని రీతిలో ఈ సినిమాను ప్రచారం చేస్తున్నారు మేకర్స్. అమెరికాలో భారీ ఈవెంట్ నిర్వహించడంతో గేమ్ ఛేంజర్‌పై మరింత హైప్ పెరిగింది. అయితే ఈ సినిమాకు ఇప్పటి వరకు రూ.200 కోట్ల వరకు నాన్ థియేటర్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. థియేటర్ నుంచి 300 కోట్లకు పైగా రాబడితే సినిమా సేఫ్ జోన్‌లోకి వెళ్తుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది కాబట్టి.. హిట్ టాక్ వస్తే వీకెండ్‌లోనే ఆ సంఖ్యను దాటేయ్యొచ్చు. కానీ ఒకవెళ తేడా కొడితే మాత్రం అంత మొత్తం రాబట్టడం చాలా కష్టమే. తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు రూ.150 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. మరో రూ.150 కోట్ల తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ, ఓవర్సీస్ నుంచి రావాలి.
దిల్ రాజు ప్లాన్ ఏంటి?
సినిమాను నిర్మించడమే కాదు.. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడంలోనూ దిల్ రాజు దిట్ట. తనదైన శైలీలో ప్రమోషన్స్ చేసి యావరేజ్ సినిమాను కూడా హిట్ చేయించగలడు.గతంలో చాలా సినిమాలు దిల్ రాజు ప్రమోషన్స్ వల్లే మంచి కలెక్షన్స్‌ని రాబట్టాయి. ఇక తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్‌పై దిల్ రాజు స్పెషల్ ఫోకస్ పెట్టారు.
రిలీజ్‌ని సంక్రాంతికి పోస్ట్ పోన్ చేసి మంచి పనే చేశాడు. పండగ సీజన్‌లో యావరేజ్ టాక్ వచ్చినా సరే.. కలెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే దిల్ రాజు కాస్త లేట్ అయినా..రిలీజ్‌ని సంక్రాంతికి మార్చాడు. ఇక నైజాంతో పాటు వైజాగ్‌లోనూ ఆయనే సొంతంగా రిలీజ్ చేస్తున్నాడు. మిగతా ప్రాంతాల్లో తన రెగ్యులర్ బయ్యర్లుకు సినిమాను అప్పజెప్పాడు. సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా సరే.. ఈజీగా బ్రేక్ ఈవెట్ దాటేస్తుంది. ఇక హిందీలో బాగా ఆడితే మాత్రం.. దిల్ రాజు పంట పండినట్లే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment