![Blood And Chocolate Trailer Release Event Highlights - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/19/arjun-das.jpg.webp?itok=tZ0lSTes)
అర్జున్ దాస్, దుషారా విజయన్ జంటగా నటించిన చిత్రం ‘బ్లడ్ అండ్ చాక్లెట్’. ఎస్ పిక్చర్స్‌పై ప్రముఖ దర్శకుడు శంకర్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 21న విడుదలకానుంది. ఈ మూవీని తెలుగులో ఎస్‌ఆర్‌డీఎస్ సంస్థపై దేవసాని శ్రీనివాసరెడ్డి రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వసంత బాలన్ మాట్లాడుతూ..‘బ్లడ్ అంటే సాధారణంగా మనకు వయొలెన్స్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఈ సినిమా విషయానికి వస్తే బ్లడ్ అండ్ చాక్లెట్ అంటే ప్రేమ, అభిమానం. మంచి ఎమోషన్స్ కూడా ఉంటాయి’ అన్నారు.
‘బ్లడ్ అండ్ చాక్లెట్’ సినిమాను మా ఎస్.ఆర్.డి.ఎస్ బ్యానర్‌లో రిలీజ్ చేయటంపై చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. సినిమాను అందరూ ఆదరించి సక్సెస్ చేయాలని కోరుతున్నాను’అని అన్నారు నిర్మాత దేవసాని శ్రీనివాసరెడ్డి. ‘నేషనల్ అవార్డ్ గెలుచుకున్న వసంత బాలన్‌గారితో కలిసి పని చేయటం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్’అని హీరో అర్జున్ దాస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment