
అర్జున్ దాస్.. ఈ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చేది అతడి గొంతు. బయపెట్టేలా ఉండే బేస్ వాయిస్ తనకు చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. 'ఖైదీ' మూవీలో విలన్‌గా చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఇతడు.. ఇప్పుడు హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. తాజాగా అలా తన కొత్త మూవీ 'రసవాది' రిలీజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు. తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
(ఇదీ చదవండి: శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా)
ఎక్కడో దుబాయ్‌లో పనిచేసే అర్జున్ దాస్.. చైన్నెకి వచ్చి డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్ తీసిన 'ఖైదీ'తో యాక్టర్ అయ్యాడు. దీని తర్వాత 'మాస్టర్'లోనూ లోకేశ్ ఇతడికి ఛాన్స్ ఇచ్చాడు. అందుకే ఆయనంటే అర్జున్‌దాస్‌కు ప్రత్యేక అభిమానం. తాజాగా తన కొత్త మూవీ రిలీజ్ సందర్భంగా అర్జున్ దాస్ పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. విలన్‌గా చేసే మీరు ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. మళ్లీ విలన్‌గా నటించే అవకాశమొస్తే చేస్తారా? అన్న ప్రశ్నకు బదిలిస్తూ.. లోకేశ్ కనకరాజ్ విలన్‌గా చేయమని చెబితే కచ్చితంగా నటిస్తానని అన్నాడు.
డైరెక్టర్ లోకేశ్ తనకు మంచి మిత్రుడని, ఆయన అవకాశమిస్తే రజనీకాంత్ 'కూలీ'లో నటించడానికి రెడీ అని అర్జున్ దాస్ అన్నాడు. మళ్లీ డబ్బింగ్ చెప్పే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. అలాంటి అవకాశం లేదని, లోకేశ్ కనకరాజ్ తన సినిమాలో డబ్బింగ్ చెప్పమంటే మాత్రం ఎలాంటి పాత్రకై నా చెబుతానని క్లారిటీ ఇచ్చేశాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment