Butta Bomma Telugu Movie OTT Release Date, OTT Platform Confirmed - Sakshi

Butta Bomma OTT Streaming: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Mar 1 2023 8:55 AM | Updated on Mar 1 2023 9:59 AM

Butta Bomma Movie Streaming On This OTT Platform Details Here - Sakshi

చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న నటి అనిఖా సురేంద్రన్‌ తెలుగులో హీరోయిన్‌గా నటించిన చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో  అర్జున్ దాస్, సూర్య వశిష్టలు ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో సూపర్ హిట్‌ చిత్రం కప్పేలాకు ఇది రీమేక్‌. శౌరీ చంద్రశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

చదవండి: పెళ్లయిన కొంతకాలానికే భర్త చనిపోయాడు, జీవితం తలకిందులైంది: సీనియర్‌ నటి

మలయాళంలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్‌ వేదికపై సందడి చేసేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం బుట్టబొమ్మ త్వరలోనే ఓటీటీలోకి అందుబాటులోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సొంతం చేసుకుందట. కాగా మార్చి 4 నుండి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement