
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం రాయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధనుశ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సందీప్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్.. ధనుశ్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు అన్న, గురువు అన్నీ ధనుశ్ అని అన్నారు. ఈ సినిమాలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. గురువుకు గురుపౌర్ణమి రోజున ధన్యవాదాలు అంటూ ధనుశ్ కాళ్ల మొక్కారు. అయితే ఇద్దరం సినిమాలో నటిస్తున్నప్పటికీ ఆయన ఫోన్ నంబర్ కూడా తన వద్ద లేదని సందీప్ అన్నారు.
కాగా.. రాయన్‌లో ధనుశ్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, కాళిదాస్ జయరాం, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
With a special gesture, actor #SundeepKishan expressed his love for #Dhanush at #Raayan Pre-Release Event.
Event by @shreyasgroup ✌️#RaayanPreReleaseEvent #RaayanFromJuly26 #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/qbUBEm8yg3— Shreyas Media (@shreyasgroup) July 22, 2024
Comments
Please login to add a commentAdd a comment