పీచు మిఠాయ్‌... | Dhanush Raayan Second Song Release | Sakshi
Sakshi News home page

పీచు మిఠాయ్‌...

Published Sun, May 26 2024 2:32 AM | Last Updated on Sun, May 26 2024 2:41 AM

Dhanush Raayan Second Song Release

సైకిలు మీద ప్రేమ షికారుకు వెళ్లారు సందీప్‌ కిషన్, అపర్ణా బాలమురళి. ఈ జాలీ రైడ్‌లో ‘పీచు మిఠాయ్‌...’ అంటూ పాట పాడుకున్నారు. ధనుష్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్‌’లో సందీప్‌ కిషన్, అపర్ణా బాలమురళి ఓ జంటగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరి మధ్య ‘పీచు మిఠాయ్‌..’ అంటూ సాగే రొమాంటిక్, మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.

ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా విజయ్‌ ప్రకాశ్, హరిప్రియ పాడారు. తెలుగు, తమిళ భాషల్లో సన్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 13న రిలీజ్‌ కానుంది. తెలుగు వెర్షన్‌ని ఏషియన్‌–సురేష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎల్‌ఎల్‌పి విడుదల చేయనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement