Sandeep Kishan.
-
సందీప్ కిషన్ 'మజాకా'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం మజాకా. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమాకు సంబంధించి క్రేజీ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'హేయ్ పగిలి పగిలి అంటూ సాగే' లిరికల్ పాటను రిలీజ్ చేశారు. ఈ మాస్ సాంగ్ ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. కాగా.. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతమందించారు. -
బాలీవుడ్ సినిమాలకు సంతకం చేశా.. చివరకు నన్నే పక్కనపెట్టేశారు!
సినిమాకు సంతకం చేసినవారిని పక్కనపెట్టేసి వేరే హీరోహీరోయిన్లతో సినిమాలు తీసిన సంఘటనలు కోకొల్లు. తనకూ అలాంటి చేదు అనుభవం ఎదురైందంటున్నాడు తెలుగు హీరో సందీప్ కిషన్ (Sundeep Kishan). హిందీలో అలాంటి ఘోర అనుభవాలు ఎదుర్కొన్నానన్నాడు. ఇతడు షోర్ ద సిటీ (2010) మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత మరే హిందీ చిత్రంలోనూ కనిపించలేదు. 2019లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో మరోసారి బాలీవుడ్ ప్రేక్షకులను ఓటీటీ మాధ్యమం ద్వారా పలకరించాడు.మొదట్లో ఎగ్జయిటయ్యా!హిందీలో సినిమాలు చేయకపోవడానికి గల కారణాలను తాజా ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ బయటపెట్టాడు. అతడు మాట్లాడుతూ.. షోర్ ఇన్ ద సిటీ సినిమా కంటే ముందే నేను రెండు హిందీ చిత్రాలకు సంతకం చేశాను. ఆ రెండూ కూడా ప్రముఖ నిర్మాణ సంస్థల బ్యానర్లో కావడంతో చాలా ఎగ్జయిట్ అయ్యాను. నేను అనుకుందొకటైతే జరిగింది మరొకటి! రెండేళ్లపాటు ముంబైలో ఖాళీగా కూర్చున్నాను. ఆ సమయంలో ఒక తమిళ్, రెండు తెలుగు చిత్రాలు నా చేతిలో ఉన్నప్పటికీ ఆసక్తి చూపించలేదు. సౌత్‌లో ఆఫర్స్ వదిలేసుకున్నా..ఆల్రెడీ హిందీలో రెండింటికి సంతకం చేసినందున వేరే ఆఫర్లను వదిలేసుకున్నాను. పోనీ ఇంత చేసినా నాకేమైనా ఉపయోగం ఉందా? అంటే అదీ లేదు! నన్ను అంతకాలం వెయిట్ చేయించి చివరి నిమిషంలో ఆ సినిమాల్ని వేరేవారితో మొదలుపెట్టారు. మోసపోయాననిపించింది. అందుకే దక్షిణాది ఇండస్ట్రీలోనే నిజాయితీగా ఉండాలనుకున్నాను. ఇక్కడే కొనసాగుతున్నాను.(చదవండి: ఒకప్పుడు క్షమించేవాళ్లు.. ఇప్పుడలా కాదు!: బాలీవుడ్ హీరో)కేవలం భాష కోసం..బాలీవుడ్ (Bollywood)లో సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకోలేదు. కాకపోతే కేవలం హిందీ భాష కోసం అక్కడ సినిమాలు చేయాలనుకోవడం కరెక్ట్ కాదనిపించింది. నా భాషలోనే సినిమాలు చేస్తాను. అది అందరికీ నచ్చుతుందనుకుంటే హిందీలోనూ రిలీజ్ చేస్తాను. ఇప్పుడందరూ చేస్తుందదేగా! అని చెప్పుకొచ్చాడు.కెరీర్ మొదలుసందీప్ కిషన్ చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు చోటా కె నాయుడు, శ్యామ్ కె నాయుడుకు దగ్గరి బంధువు. సినిమానే వృత్తిగా ఎంచుకోవాలని 2008లో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. ఇందుకోసం మొదటగా డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ వద్ద ఏడాదిపాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలోనే స్నేహగీతం సినిమా ఛాన్స్ అందుకున్నాడు. తెలుగులో హీరోగా..అడల్ట్ కామెడీ సినిమా ఆఫర్లు వస్తే తిరస్కరించాడు. అలాంటి చిత్రాల్లో నటించబోయేది లేదని తేల్చి చెప్పాడు. ప్రస్థానం సినిమాతో వెండితెరపై తన ప్రయాణం మొదలుపెట్టాడు. స్నేహ గీతం చిత్రంతో హీరోగా మారాడు. రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి, డి ఫర్ దోపిడి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, బీరువా, జోరు, రారా కృష్ణయ్య, ఒక్క అమ్మాయి తప్ప, శమంతకమణి, నక్షత్రం, మనసుకు నచ్చింది, ఏ1 ఎక్స్‌ప్రెస్, మైఖేల్ వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు.నిర్మాతగానూ..గతేడాది ఊరు పేరు భైరవకోనతో అలరించాడు. కెప్టెన్ మిల్లర్, రాయన్ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషించాడు. ప్రస్తుతం కూలీ మూవీలో నటిస్తున్నాడు. ఇది కాకుండా అతడి చేతిలో మరో మూడు సినిమాలున్నాయి. ఇతడు హీరో మాత్రమే కాదు నిర్మాత కూడా! నిను వీడని నీడను నేనే, వివాహ భోజనంబు, ఏ1 ఎక్స్‌ప్రెస్ వంటి చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించాడు.చదవండి: ఈ హీరోయిన్ను చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉంది: ఆమిర్ ఖాన్ -
స్టార్ హీరో కాళ్లు మొక్కిన సందీప్ కిషన్!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం రాయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధనుశ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సందీప్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్.. ధనుశ్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు అన్న, గురువు అన్నీ ధనుశ్ అని అన్నారు. ఈ సినిమాలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. గురువుకు గురుపౌర్ణమి రోజున ధన్యవాదాలు అంటూ ధనుశ్ కాళ్ల మొక్కారు. అయితే ఇద్దరం సినిమాలో నటిస్తున్నప్పటికీ ఆయన ఫోన్ నంబర్ కూడా తన వద్ద లేదని సందీప్ అన్నారు. కాగా.. రాయన్‌లో ధనుశ్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. With a special gesture, actor #SundeepKishan expressed his love for #Dhanush at #Raayan Pre-Release Event.Event by @shreyasgroup ✌️#RaayanPreReleaseEvent #RaayanFromJuly26 #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/qbUBEm8yg3— Shreyas Media (@shreyasgroup) July 22, 2024 -
ఓటీటీలో దూసుకెళ్తోన్న టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ప్రాజెక్ట్- జెడ్ '. సీవీ కుమార్ డైరెక్షన్లో ఎస్బీకే ఫిల్మ్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవలే ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చేసింది. మొదట తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీ 2017లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా తెలుగులో డబ్ చేసి ఆహాలో రిలీజ్ చేశారు.ఓటీటీలో రిలీజైన ఈ చిత్రానికి అధిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఆద్యంతం ఆసక్తి కలిగించే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆహా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో ఆడియన్స్ నుంచి ఊహించని రెస్పాన్స్ దక్కించుకుంటోంది. కాగా.. ప్రస్తుతం హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్, తమిళ వెర్షన్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. -
పీచు మిఠాయ్...
సైకిలు మీద ప్రేమ షికారుకు వెళ్లారు సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి. ఈ జాలీ రైడ్‌లో ‘పీచు మిఠాయ్...’ అంటూ పాట పాడుకున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’లో సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి ఓ జంటగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరి మధ్య ‘పీచు మిఠాయ్..’ అంటూ సాగే రొమాంటిక్, మెలోడీ సాంగ్‌ను విడుదల చేశారు.ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా విజయ్ ప్రకాశ్, హరిప్రియ పాడారు. తెలుగు, తమిళ భాషల్లో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 13న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌ని ఏషియన్–సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి విడుదల చేయనుంది. -
లొంగని రాక్షసుడు
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ లీడ్ రోల్స్‌లో నటించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ‘అడంగాద అసురన్ (లొంగని రాక్షసుడు) పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఈ పాటకు లిరిక్స్ రాయడంతో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో కలిసి పాడారు ధనుష్. ‘‘అడంగాద అసురన్’ పాటను ఏఆర్ రెహమాన్‌గారు రెడీ చేసినప్పట్నుంచి, మీతో (ప్రేక్షకులు) ఈ పాటను షేర్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ పాటను ఇప్పుడు రిలీజ్ చేశాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. -
ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రారంభం
సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా మంగళవారం ఆరంభమైంది. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించనున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు విజయ్ కనకమేడల కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఈ సినిమాలో సందీప్ కిషన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుంది. రావు రమేశ్ ఓ కీలక పాత్రలో నటిస్తారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించనున్నాం. దర్శకుడిగా నక్కిన త్రినాథరావు విజయవంతమైన ప్రయాణంలో భాగమైన రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు డైలాగ్ రైటర్‌గా చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
యాక్షన్ వైబ్
సందీప్ కిషన్ హీరోగా స్వరూప్ ఆర్ఎస్జె దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘వైబ్’ టైటిల్ ఖరారైంది. రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ లోగో శనివారం విడుదలైంది. ‘‘కాలేజ్ బేస్డ్ యాక్షన్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఒక స్టూడెంట్, అతని స్నేహితులు సాధారణ వ్యక్తుల నుంచి రెబల్‌గా మారడానికి దారి తీసిన కారణాలేంటి? అనేది ఈ చిత్రం కథాంశం. వచ్చే ఏడాది వేసవిలో ‘వైబ్’ని విడుదల చేస్తాం’’ అని మేకర్స్ తెలిపారు. -
ఆ స్ఫూర్తితోనే ఈ కథ రాశాను
‘‘సూపర్ నేచురల్ ఫ్యాంటసీ జోనర్లో ‘ఊరు పేరు భైరవకోన’ సినిమా రూపొందింది. మనిషి చనిపోయిన తర్వాత 11 రోజులు ఆత్మ తాలూకు ప్రయాణం ఎలా ఉంటుందన్నది గరుడ పురాణంలో చదివాను. ఆ స్ఫూర్తితో ఈ చిత్రకథ రాశాను. యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు’’ అని డైరెక్టర్ వీఐ ఆనంద్ అన్నారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించిన ఈ సినిమా ఈ 16న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వీఐ ఆనంద్ పంచుకున్న విశేషాలు. ► సందీప్ కిషన్‌కి రెండు ఐడియాలు చెబితే ‘ఊరు పేరు భైరవకోన’ కథకు ఎగ్జయిట్ అయ్యాడు. నాకు కూడా ఈ కథ చేస్తే చాలా కొత్తగా ఉంటుంది, ఒక ట్రెండ్ సెట్ చేసేలా ఉంటుందని ఫిక్స్ అయ్యాం. రాజేశ్ దండా ఈ కథ వినగానే ఎగ్జయిట్ అయ్యారు. సందీప్, నా మంచి కోరే అనిల్ సుంకరగారు కూడా ఈప్రాజెక్ట్‌లోకి రావడంతో ఈ సినిమాప్రారంభమైంది. బిగ్ స్క్రీన్‌పై విజువల్, సౌండ్ పరంగా ఆడియన్స్‌కి గొప్ప అనుభవాన్ని ఇచ్చే సినిమా ఇది. ► ఈ చిత్రకథలో కర్మ సిద్ధాంతం, గరుడపురాణం, శివదండం.. వంటి నేపథ్యాలు ఉన్నాయి కాబట్టి ‘ఊరు పేరు భైరవకోన’ యాప్ట్ అనిపించి ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. ‘టైగర్’ టైమ్‌లో ఉన్న ఫైర్, ప్యాషన్ సందీప్‌లో ఇప్పుడూ ఉన్నాయి. ప్రతి సినిమాని తొలి సినిమాలానే చేస్తున్నాడు. నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌తో వస్తున్న సినిమా ఇది. ► నేను గతంలో అల్లు అర్జున్‌తో ఓ సినిమాతో పాటు, గీతా ఆర్ట్స్‌లో ఓ మూవీ చేయాల్సింది. కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు. ప్రస్తుతం హీరో నిఖిల్‌తో ఓ సినిమా చర్చల్లో ఉంది. అలాగే ఓ పెద్ద హీరోకి యాక్షన్ కథ రాస్తున్నాను. -
‘ఊరు పేరు భైరవకోన’ కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం: సందీప్ కిషన్
సందీప్ కిషన్ హీరోగా నటించిన ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రంలో కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రెస్మీట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘ఇది నాకు స్పెషల్ మూవీ.రెండున్నర సంత్సరాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతూనే ఉన్నాం. ఫ్యాంటసీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉన్న మంచి కమర్షియల్ సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం అద్భుతమైన జర్నీ. ఈ సినిమాలోని ప్రతి మూమెంట్ మాకు ఓ కొత్త అనుభవం. ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌తో పాటు కథలో మంచి లవ్‌స్టోరీ కూడా ఉంది’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఈ సినిమాతో సందీప్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్తాడు’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇచ్చే చిత్రం ఇది. సాంగ్స్, ఆర్ఆర్ ప్రేక్షకులను మెప్పిస్తాయి’’ అన్నారు సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర. -
బెల్లంకొండ గణేశ్‌తో లవ్? హీరోయిన్ ఏమందంటే?
‘‘పాత్ర నిడివి కాదు... నా పాత్ర ప్రాముఖ్యతను బట్టి కథలు ఓకే చేయడానికి ఆసక్తి చూపిస్తాను. ఇప్పటి వరకు నేను చేసిన పాత్రలన్నీ అలా ఎంచుకున్నవే’’ అన్నారు వర్షా బొల్లమ్మ. సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రంలో కావ్యా థాపర్, వర్షా బొల్లమ్మ హీరోయిన్లు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 16న విడుదల కానుంది. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ– ‘‘ఊరు పేరు భైరవకోన’ సినిమాలో నేను ట్రైబల్ అమ్మాయి భూమి పాత్రలో కనిపిస్తాను. తన ఊర్లో చదువుకున్న అమ్మాయి ఒక్క భూమి మాత్రమే. అందంగా, అమయాకంగా కనిపించే ఈ పాత్రలో స్ట్రెంత్, పవర్ ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న సందేశం కూడా నా పాత్రతోనే వస్తుంది. నా రియల్ లైఫ్ క్యారెక్టర్‌కు భూమి పాత్ర కాస్త దగ్గరగా అనిపించింది. వీఐ ఆనంద్‌గారు ఈ సినిమా కథ చెప్పినప్పుడు అలా ఎలా ఆలోచించి కథలు రెడీ చేస్తారు? అనుకున్నాను. కథ అంత బాగా అనిపించింది. ప్రస్తుతం తమిళ, తెలుగు, మలయాళంలో సినిమాలు చేస్తున్నాను. తెలుగులో ఓ కొత్త ప్రాజెక్ట్ సైన్ చేశాను. ఇక హీరో బెల్లంకొండ గణేశ్‌తో నేను ప్రేమలో ఉన్నానన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదు’’ అని చెప్పుకొచ్చారు. -
ఓటీటీకి స్టార్ హీరో సంక్రాంతి సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ నటించిన చిత్రం కెప్టెన్ మిల్లర్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచింది. తమిళంలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కోలీవుడ్ పొంగల్ బరిలో నిలిచి హిట్‌ను సొంతం చేసుకుంది. అయితే తెలుగులో ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కలేదు. రిలీజ్ ఆలస్యం కావడంతో పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజ్ కాగా...కేవలం రూ.కోటి వరకు మాత్రమే వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌పై నెట్టింట చర్చ నడుస్తోంది. జవనరి 12న థియేటర్లకు వచ్చిన ఈ చిత్రం నెల రోజుల్లోనే ఓటీటీ రానుందని టాక్ వినిపిస్తోంది. ఈనెల 9 నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఈ విషయంపై త్వరలోనే మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీలో మాత్రం తెలుగు, తమిళంలో ఓకేసారి స్ట్రీమింగ్కు రానుందని టాక్. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించారు. అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి.. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు. కథేంటంటే.. ఈ సినిమా కథంతా స్వాతంత్రానికి పూర్వం అంటే 1930లో సాగుతుంది. తమిళనాడులోని ఓ చిన్న గ్రామానికి చెందిన అగ్ని అలియాస్ అగ్నీశ్వర(ధనుష్) సొంత ఊరిలోనే కుల వివక్షకు గురవుతాడు.తక్కువ కులానికి చెందిన వారనే సాకుతో ఆ ఊరి వాళ్లని గుడిలోకి రానివ్వడు అక్కడి రాజు(జయప్రకాష్). ఆ కోపంతో అగ్ని బ్రిటీష్ సైన్యంలో చేరతాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తయ్యాక అతనికి మిల్లర్ అనే పేరుపెట్టి విధుల్లోకి పంపుతారు. ఫస్ట్ డ్యూటీలోనే తన పై అధికారిని చంపేస్తాడు. అనంతరం తోటి సైనికుడు రఫీక్(సందీప్ కిషన్) సహాయంతో అక్కడ నుంచి పారిపోయి దొంగగా మారుతాడు. రాజన్న(ఎలగో కుమారవేల్) ముఠాతో కలిసి దొంగతనాలు చేస్తూ..వచ్చిన డబ్బులో కొంచెం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న సంఘాలకు పంపుతుంటారు. ఓ సారి తన ఊరిలోని గుడిలో రహస్యంగా దాచిపెట్టిన విలువైన ఓ పెట్టెను బ్రిటీష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వారి నుంచి ఆ పెట్టెను మిల్లర్ దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పెట్టెను మిల్లర్ ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది? అందులో ఏం ఉంది? తన ఊరి ప్రజలపై దండయాత్రకు వచ్చిన బ్రిటీష్ సైన్యాన్ని కెప్టెన్ మిల్లర్ ఎలా తిప్పికొట్టాడు? ఈ కథలో భానుమతి(ప్రియాంక అరుల్ మోహన్), శివన్న(శివరాజ్‌కుమార్)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
3 సంవత్సరాలు కష్టపడి భయం తో ఈ సినిమా తీశాం
-
డేట్ ఫిక్స్
హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. చివరి దశకు చేరుకున్న ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘‘ఊరు పేరు భైరవకోన’లో సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర. -
కిక్కెక్కుతోందే జన్మ...
సందీప్ కిషన్ హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నా వల్ల కాదే బొమ్మ.. నీ కళ్లు చూస్తే అమ్మా.. కిక్కెక్కుతోందే జన్మ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, తిరుపతి జావన లిరిక్స్ అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ఈ సినిమాకు సహనిర్మాత: బాలాజీ గుత్తా. -
ఒక సామాన్యుడి ఘర్షణ
సందీప్ కిషన్ హీరోగా సోమవారం కొత్త చిత్రం ఆరంభమైంది. సందీప్ కిషన్‌తో త్వరలో రిలీజ్‌కు రెడీ కానున్న ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రం రూ΄÷ందించిన ఏకే ఎంటర్టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుంది. ‘మాయవన్’ చిత్రం తర్వాత సందీప్ కిషన్, దర్శకుడు సీవీ కుమార్ కాంబినేషన్లో ‘మాయవన్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూ΄÷ందనుంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి వెంకట్ బోయనపల్లి కెమెరా స్విచాన్ చేయగా, దామోదర్ ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. పి. కిరణ్ దర్శకత్వం వహించారు. ‘‘ఒక సూపర్ విలన్‌తో ఓ సామాన్యుడి ఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్‌ని నవంబర్‌లో ఆరంభిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: కార్తీక్ కె. తిల్లై, ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్: కిషోర్ గరికి΄ాటి (జీకే). -
థియేటర్లలో మిమ్మల్ని భయపెట్టేందుకు వస్తున్న సినిమాలు ఇవే..
హారర్ చిత్రాలంటే వెన్నులోంచి టెర్రర్ పుట్టాల్సిందే. అలా క్షణ క్షణం భయపడుతూ హారర్ చిత్రాలు చూడటంలో చాలామందికి ఓ కిక్ దొరుకుతుంది. ఆ భయమే వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పుడలా థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టి, వసూళ్లు రాబట్టడానికి కొందరు హారర్ చిత్రాలు చేస్తున్నారు. ఆ చిత్రాలేంటో తెలుసుకుందాం. భ్రమ యుగంలో... సుధీర్ఘమైన కెరీర్లో ఎన్నో రకాల సినిమాల్లో నటించారు మమ్ముట్టి. ఈ ప్రయాణంలో ΄పొలిటికల్, థ్రిల్లర్, హారర్, సస్పెన్స్.. ఇలా ఎన్నో జానర్స్‌ను టచ్ చేశారాయన. తాజాగా ‘భ్రమ యుగం’ అనే హారర్ ఫిల్మ్‌లో మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో సాగే కథతో రాహుల్ సదా శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ఏక కాలంలో వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది. హారర్ రాజా లవ్, కామెడీ, ఫ్యామిలీ డ్రామాలతో సాగే చిత్రాలు చేస్తున్నప్పటికీ ఎక్కువగా యాక్షన్ చిత్రాల్లోనే నటిస్తారు ప్రభాస్. అయితే తొలిసారి ప్రభాస్ హ్యూమర్‌తో కూడిన హారర్ అంశాలు ఉండే ఓ సినిమాలో నటిస్తున్నారు. మారుతి ఈ సినిమాకు దర్శకుడు. ఈ చిత్రానికి ‘రాజా డీలక్స్’, ‘వింటేజ్ కింగ్’, ‘అంబాసిడర్’ అనే టైటిల్స్ తెరపైకి వచ్చాయి. ఈ చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని సమాచారం. మాళవికా మోహనన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఓ కీ రోల్లో సంజయ్ దత్ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా టైటిల్, రిలీజ్‌లపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. చంద్రముఖి తిరిగొస్తే.. హారర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులు ‘చంద్రముఖి’ని అంత సులభంగా మర్చిపోలేరు. వెంకటపతి రాజుగా రజనీకాంత్, చంద్రముఖిగా జ్యోతిక వెండితెరపై ప్రదర్శించిన నటన అలాంటిది. ఇప్పుడు ‘చంద్రముఖి’ మళ్లీ వస్తోంది. కానీ రజనీ, జ్యోతికలు రావడం లేదు. ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా రూ΄పొందిన ‘చంద్రముఖి 2’లో రజనీ, జ్యోతికల స్థానాల్లో రాఘవా లారెన్స్, కంగనా రనౌత్ నటించారు. ‘చంద్రముఖి’ని డైరెక్ట్ చేసిన పి. వాసుయే ‘చంద్రముఖి 2’ని తెరకెక్కించారు. ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. భైరవకోనలో ఏం జరిగింది? ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’తో ప్రేక్షకులను భయపెడుతూ, కథలో వీలైనప్పుడు నవ్వించారు దర్శకుడు వీఐ ఆనంద్. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా ‘ఊరుపేరు భైరవకోన’. ఇందులో సందీప్‌కిషన్ హీరోగా నటిస్తున్నారు. వర్ష బొల్లమ్మ హీరోయిన్. ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రంలో హారర్ అండ్ సస్పెన్స్ అంశాలు పుష్కలంగా ఉన్నట్లు ఇటీవల విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. భైరవకోన అనే ఊర్లో జరిగే కొన్ని కల్పిత ఘటనల సమాహారంగా ఈ సినిమా కథనం సాగనున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మంత్రం.. తంత్రం.. ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న తెలుగు కథానాయికల్లో అనన్య నాగళ్ల ఒకరు. అరడజనుకు పైగా సినిమాలు చేస్తున్న ఈ బిజీ అమ్మాయి లిస్ట్‌లో ‘తంత్ర’ అనే ఓ హారర్ ఫిల్మ్ కూడా ఉంది. తాంత్రిక శాస్త్రం, పురాణ గాధల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని ఈ చిత్రదర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి పేర్కొన్నారు. ధనుష్ (దివంగత నటుడు శ్రీహరి తమ్ముడు కొడుకు) నటుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ మంచి దెయ్యం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ప్రేమకథా చిత్రమ్ 2’.. ఇలా హీరోయిన్ నందితా శ్వేతకు హారర్ జానర్లో నటించిన అనుభవం ఉంది. ఈ క్రమంలో నందితా శ్వేత చేసిన మరో హారర్ ఫిల్మ్ ‘ఓఎమ్‌జీ’. ‘ఓ మంచి ఘోస్ట్’ ఉపశీర్షిక. ‘వెన్నెల’ కిశోర్, ‘షకలక’ శంకర్, నవమి గాయక్ ఈ సినిమాలో ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. మార్తాండ్ కె. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానుంది. మరి.. మంచి దెయ్యంగా నందితా శ్వేత ఏ రేంజ్లో భయపెడతారో చూడాలి. కేరాఫ్ దెయ్యం గ్రామాల్లో ఒకప్పుడు మాతంగులుగా జీవించిన వారి జీవితాల ఆధారంగా రూ΄పొందుతున్న హారర్ ఫిల్మ్ ‘భయం కేరాఫ్ దెయ్యం’. ఈ చిత్రంలో ఓ మాతంగిగా రమ్య, మాంత్రికుడిగా రవిబాబు, తాంత్రికుడిగా సత్యప్రకాష్ నటిస్తున్నారు. సీవీఎమ్ వెంకట రవీంద్రనాథ్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో రూ΄పొందుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తంతిరం హారర్ అంశాలతో కూడిన కుటుంబ కథాచిత్రం ‘తంతిరం’. భార్యాభర్తల మధ్య ఒక ఆత్మ ప్రవేశిస్తే వారి దాంపత్య జీవితం ఎలా ప్రభావితం అవుతుందనేది ఈ సినిమా కథాంశం. మెహర్ దీపక్ దర్శకుడు. ఈ సినిమా మేజర్ షూటింగ్ కేరళలో జరి గింది. శ్రీకాంత్, ప్రియాంక లీడ్ రోల్స్ చేశారు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రాలే కాదు.. హారర్ జానర్లో ప్రేక్షకులను భయ పెట్టే మరికొన్ని చిత్రాలు కూడా ఉన్నాయి. -
యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న 'నిజమే నే చెబుతున్నా' పాట విన్నారా?
సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. ఈ చిత్రం కోసం సంగీతదర్శకుడు శేఖర్ చంద్ర స్వరపరచగా, సిధ్ శ్రీరామ్పాడిన ‘నిజమే నే చెబుతున్నా..’పాట మార్చిలో విడుదలైంది. ‘‘ఈపాట లిరికల్ వీడియోకు శ్రోతల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాట భారీ హిట్ సాధించింది. ఇప్పటికే సుమారు 30 మిలియన్ల వ్యూస్ క్రాస్ అయింది. ఈపాట ఇప్పటికే 3 కోట్ల వ్యూస్ సాధించింది. ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’, ‘ప్రియతమా ప్రియతమా, ‘మనసు దారి తప్పెనే’... వంటిపాటల తర్వాత సిధ్ శ్రీరామ్, నా కాంబినేషన్లో వచ్చిన ఈపాట హిట్ కావడం హ్యాపీగా ఉంది. సందీప్ కిషన్, వీఐ ఆనంద్, గీత రచయిత శ్రీమణిలకు థ్యాంక్స్’’ అని అన్నారు. -
గౌరవమే స్వేచ్ఛ
ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’. ప్రియాంకా అరుళ్ మోహనన్, నివేదితా సతీష్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో టీజీ త్యాగరాజన్ సమర్పణలో జి. శరవణన్, సాయి సిద్ధార్థ్, సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ‘గౌరవమే స్వేచ్ఛ’ అనే క్యాప్షన్ తో శుక్రవారం ‘కెప్టెన్ మిల్లర్’ ఫస్ట్ లుక్‌ను షేర్ చేశారు ధనుష్. ‘‘స్వాతంత్య్రానికి పూర్వం అంటే 1930–1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ చిత్రంలో ధనుష్ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. ఆల్రెడీ 85 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అలాంటి సినిమాలంటే చాలా ఇష్టం
‘‘డైరెక్టర్ ఆనంద్, నేను మంచి స్నేహితులం. ‘ఊరు పేరు భైరవకోన’ లాంటి సినిమాని ఆయన నాతో చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఫాంటసీ, అడ్వెంచర్ సినిమాలంటే నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా, వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నా పుట్టినరోజున(ఆదివారం) ఈ మూవీ టీజర్ విడుదల కావడం స్పెషల్ మూమెంట్. తొలిసారి చండీయాగం చేసి టీజర్ రిలీజ్ చేయడం చాలా పాజిటివ్‌గా ఉంది. అనిల్ సుంకరగారు లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకూ వచ్చేది కాదు’’ అన్నారు. ‘‘టైగర్’ సినిమా నుంచి సందీప్, నాకు స్నేహం మొదలైంది. మరోసారి కలసి సినిమా చేస్తే ఇంకా గ్రాండ్‌గా ఉండాలని ‘ఊరు పేరు భైరవకోన’ చేశాం’’ అన్నారు వీఐ ఆనంద్. ‘‘ఈ సినిమా సందీప్ కెరీర్లో మరచిపోలేని బహుమతి అవుతుందని మాట ఇస్తున్నా’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘మహాచండీ యాగంతో టీజర్‌లాంచ్ చేయడం ఇండస్ట్రీలో ఇదే తొలిసారి. ఈ ఐడియా ఇచ్చిన సందీప్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు రాజేష్ దండా. హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: శేఖర్ చంద్ర, కెమెరా: రాజ్ తోట. -
బాక్సాఫీస్‌ను ఆవహించేందుకు వస్తున్న ఆత్మకథలు ఇవే!
ప్రతి సినిమా కథకీ ఒక సోల్ ఉంటుంది. ఆ ఆత్మ ఎంత బలంగా ఉంటే సినిమా అంతగా ప్రేక్షకులకు దగ్గరవుతుంది. ఒకవేళ సినిమా కథే ‘ఆత్మ’ చుట్టూ తిరిగితే.. ఆ ఆత్మ భయపెడుతుంది... థ్రిల్‌కి గురి చేస్తుంది. ఆత్మ చుట్టూ అల్లిన కథ బలంగా ఉంటే.. బాక్సాఫీస్ ఖజానాని వసూళ్లు ఆవహించినట్టే. ఇక ప్రస్తుతం ఆత్మ, ప్రేతాత్మల నేపథ్యంలో నిర్మాణంలో ఉన్న ‘ఆత్మ’కథా చిత్రాల గురించి తెలుసుకుందాం.. రాశీ ఖన్నాకి హారర్ జానర్ అంటే ఇష్టం. అందుకే హారర్ జానర్లో సాగే ‘అరణ్మణై 3’కి చాన్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఓకే చెప్పేశారు. ఇప్పుడు నాలుగో భాగంలోనూ నటిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుందర్.సి కీలక పాత్ర పోషించి, దర్శకత్వం వహించిన ‘అరణ్మణై’, ‘అరణ్మణై 2’, ‘అరణ్మణై 3’ ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు నాలుగో భాగం నిర్మాణంలో ఉంది. ఈ చిత్రంలో ఆర్య హీరో. గత మూడు భాగాల్లో నటించిన చిత్రదర్శకుడు సుందర్ ఇందులోనూ కీలక పాత్రలో కనిపిస్తారు. రాశీ ఖన్నా ఒక కథానాయిక కాగా మరో నాయికగా తమన్నా నటిస్తున్నారు. మూడో భాగంలో ఆండ్రియా ఆత్మగా కనిపించారు. నాలుగో భాగంలో తమన్నానే ఆత్మ అని సమాచారం. మరి.. తమన్నా, రాశీల్లో ఆత్మ ఎవరనేది ఈ ఏడాది చివర్లో తెలిసిపోతుంది. డిసెంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. క్యూట్ బ్యూటీ సమంత ప్రేతాత్మగా భయపెట్టనున్నారని సమాచారం. అది కూడా హిందీ ప్రేక్షకులను. ఆయుష్మాన్ ఖురానా, సమంత జంటగా అమర్ కౌశిక్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హారర్–కామెడీ జానర్లో సాగే ఈ చిత్రంలో సమంత రెండు పాత్రల్లో కనిపిస్తారని, అందులో ఒకటి ప్రేతాత్మ పాత్ర అని టాక్. ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్ నగర్’ టైటిల్‌తో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ఆరంభమవుతుందని బాలీవుడ్ ఖబర్. ‘ఎవరికీ అంతు చిక్కని రహస్య ప్రపంచం భైరవ కోనలోకి ప్రవేశించండి’ అంటూ సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ‘ఊరు పేరు భైరవకోన’ ఫస్ట్ లుక్ విడుదలైన విషయం తెలిసిందే. హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మిస్టరీ మూవీలో ఆత్మల నేపథ్యం కూడా ఉంటుందని సమాచారం. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఓ యువకుడు డిటెక్టివ్ కావాలనుకుంటాడు. ప్రేమలో పడిన అతడు తన ప్రేయసితో ఆనందంగా ఉంటాడు. అతని హ్యాపీ లైఫ్ ఒక టర్న్ తీసుకుంటుంది. రాత్రి సమయంలో రాకపోకలు నిషేధం అయిన మారేడు కోన ప్రాంతానికి అతను వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఊరికి ఆ యువకుడు ఎందుకు వెళ్లాడు? ఆ తర్వాత ఏం జరిగిందనే అంశంతో రూపొందుతున్న చిత్రం ‘అన్వేషి’. విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా వీజే ఖన్నా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రకథ ఆత్మలు ఉన్నాయా? అనే కోణంలో సాగుతుంది. ఈ చిత్రాలే కాదు.. మరికొన్ని ‘ఆత్మ’కథలు కూడా ఉన్నాయి. హారర్ జానర్‌కి ట్రెండ్‌తో పని లేదు. ఎప్పుడు తీసినా.. సరిగ్గా తీస్తే ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.. మరి.. రానున్న ‘ఆత్మ’కథల్లో ఎన్ని కథలు ప్రేక్షకులకు నచ్చుతాయో చూడాలి. చదవండి: ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం -
డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి నిర్మాతగా..
‘‘డిస్ట్రిబ్యూటర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, ఆ తర్వాత నిర్మాతగా మారాను. నా వరకు నిర్మాతగానే బావుంది. మనకి నచ్చిన కథతో సినిమా నిర్మించామనే సంతృప్తి ఉంటుంది’’ అన్నారు రాజేష్ దండా. సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘ఊరు పేరు భైరవకోన’, శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘సామజవరగమన’ చిత్రాలను అనిల్ సుంకర సమర్పణలో నిర్మించారు రాజేష్ దండా. ఈ రెండు చిత్రాల గురించి రాజేష్ దండా మాట్లాడుతూ– ‘‘స్వామి రారా’తోపాటు దాదాపు 80 చిత్రాలు పంపిణీ చేశాను. ‘కేరాఫ్ సూర్య, ఒక్క క్షణం, నాంది’ చిత్రాలకి కోప్రొడ్యూసర్‌గా చేశాను. ‘టైగర్’ సినిమా నుంచి సందీప్ కిషన్, వీఐ ఆనంద్‌లతో ఉన్న పరిచయంతో హాస్య మూవీస్ బ్యానర్‌ని ప్రారంభించాను. ముందు ‘ఊరు పేరు భైరవకోన’ ప్రారంభించినా, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఫస్ట్ విడుదలైంది. ‘సామజవరగమన’ చిత్రాన్ని ఈ వేసవిలో, ‘ఊరు పేరు భైరవకోన’ చిత్రాన్ని జులై లేదా ఆగస్ట్‌లో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం. అలాగే సుబ్బు దర్శకత్వంలో ‘అల్లరి’ నరేశ్‌తో నిర్మించనున్న మరో సినిమాను ఆగస్ట్‌లోప్రారంభిస్తాం. శ్రీవిష్ణుతో మరో సినిమా చర్చల దశలో ఉంది. సాయిధరమ్ తేజ్‌తో విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ప్లాన్ ఉంది’’ అన్నారు. -
ఆయనతో చేసిన చాలా సీన్స్ తొలగించారు, బాధగా అనిపించింది: మైఖేల్ హీరోయిన్
చాలా గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటి దీప్శిక హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. ఇక ఈ మూవీ రిలీజ్ అనంతరం ఆమె రీసెంట్గా ఓ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మూవీ విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ చిత్రంలో తను నటించిన అనేక సన్నివేశాలను తొలగించారని ఆమె విచారం వ్యక్తం చేసింది. చదవండి: తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం ‘నా పాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది నేను చేయాల్సింది కాదు. ఈ మూవీ కోసం మొదట మరో నటి నటించాల్సి ఉంది. కానీ ఆమె చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆ అవకాశం నాకు వచ్చింది. దర్శకుడు రంజిత్ జయకొడి నాకు ఒక్కలైన్ స్టోరీనే చెప్పారు. నాకు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాను. ఈ మూవీ మొత్తం నా పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అందుకే స్టోరీ వినగానే మరో ఆలోచనకు లేకుండా నటించేందుకు ఒప్పుకున్నా. ఇందులో విజయ్ సేతుపతికి, నాకు మధ్య అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ, మూవీ లెంగ్త్‌ను దృష్టిలో ఉంచుకుని వాటిని తొలగించారు. ఇది చాలా బాధ కలిగించింది’ అని ఆమె చెప్పుకొచ్చింది. -
పద్దెనిమిది రోజులు ఫుడ్ తీసుకోలేదు!
‘‘సందీప్‌లో ప్రతిభ, కష్టం కనిపించాయి కానీ అదృష్టం కనిపించలేదు’ అని హీరో నాని అన్నారు. నిజంగానే నాకు అదృష్టం కలసిరాలేదని, రావాల్సినంత పేరు రాలేదని చాలామంది అంటుంటారు. నాని చెప్పినట్లు ‘మైఖేల్’తో నాకు అదృష్టం కూడా కలిసొస్తుందని నమ్ముతున్నా’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్’. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సందీప్ చెప్పిన విశేషాలు. ► ఇప్పుటివరకూ నేను చేయాలనుకుని చేయలేకపోయినది ఏంటి? అని ఆలోచించినప్పుడు ‘మైఖేల్’ ఐడియా వచ్చింది. నా ఆలోచన రంజిత్‌కి చెప్పాను. ఆ ఆలోచన తీసుకుని తను చెప్పిన ‘మైఖేల్’ కథ బాగా నచ్చింది. భరత్ చౌదరి, రామ్మోహన్ రావు, సునీల్ నారంగ్ వంటి నిర్మాతలు తోడవ్వడంతో ఈ సినిమా స్థాయి భారీగా పెరిగింది. ఈ చిత్రకథకి, విజువల్ నెరేటివ్‌కి, సినిమాకి పాన్ ఇండియా స్థాయి ఉంది.. అందుకే పాన్ ఇండియా మూవీగా తీశాం. ► ‘మైఖేల్’ యూనిక్ స్టోరీ. చెడ్డవాళ్ల మధ్య జరిగే ప్రేమకథ ఇది. యాక్షన్, ఎమోషన్స్, డార్క్ కామెడీ ఉంటుంది. మైఖేల్ చాలా వైల్డ్. గ్యాంగ్‌స్టర్ కాకపోయినా నా పాత్ర ఎగ్రెసివ్‌గా ఉంటుంది. ► ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం దాదాపు 18 రోజులు పాటు ఫుడ్ తీసుకోకుండా నీళ్లు మాత్రమే తాగేవాణ్ణి. ఒక దశలో కుడి కాలు పని చేయడం మానేసింది. అయినా ఒక ఫైట్ షూట్ చేసి, ప్యాకప్ చెప్పాం. తమిళ సంస్కృతి, భాష నాకు తెలుసు. అందుకే తమిళ ప్రేక్షకుల నుంచి నాకు మంచి ప్రేమ లభించింది.. అలాగే విజయ్ సేతుపతిగారు ‘మైఖేల్’లో భాగమయ్యారు. ధనుష్‌గారు ‘కెప్టెన్ మిల్లర్’లో నన్ను తీసుకున్నారు. ‘మైఖేల్’కి తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నేనే డబ్బింగ్ చెప్పాను. ► ‘మైఖేల్’ నాకు చాలా స్పెషల్ జర్నీ. ఈ ప్రయాణంలో బరువు తగ్గాను, స్కూబా డైవింగ్ నేర్చుకున్నాను. అండర్ వాటర్‌లోనూ షూటింగ్ చేశాం. ప్రస్తుతం ‘భైరవ కోన, కెప్టన్ మిల్లర్, బడ్డీ’ సినిమాలు చేస్తున్నాను. అలాగే ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వెబ్ సిరీస్ ఉంది. -
నాపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇదే: సందీప్ కిషన్
‘‘నేను, నాని మా కెరీర్ ప్రారంభం నుంచి ఫ్రెండ్స్. కానీ, నా సినిమా వేడుకల్లో నాని పాల్గొన్న తొలి ఈవెంట్ ఇదే. ఒక సినిమా కోసం ఎంత చేయగలనో ‘మైఖేల్’ కోసం అంత చేశా. నాపై వచ్చిన విమర్శలకు ఈ సినిమానే సమాధానం’’ అన్నారు సందీప్ కిషన్. రంజిత్ జయకొడి దర్శకత్వంలో సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మైఖేల్’. నారాయణ్ దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో నాని మాట్లాడుతూ.. ‘‘సినిమా ఇండస్ట్రీలో కష్టం, అదృష్టం, ప్రతిభ ఉంటే చాలా పైస్థాయికి చేరుకుంటారు.. సందీప్‌లో నాకు కష్టం, ప్రతిభ కనిపించింది.. కానీ అదృష్టం కనిపించలేదు.. అది ‘మైఖేల్’తో తనకి మొదలవుతుంది. ‘మైఖేల్’ టీజర్, ట్రైలర్ చూసినప్పుడు ఈ మూవీతో ఓ కొత్త ఒరవడి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ‘శివ’ సినిమా వచ్చినప్పుడు కొత్తగా ఉందనిపించింది.. అలాంటి ఓ సినిమా ‘మైఖేల్’ కావాలని కోరుకుంటున్నాను. సునీల్, రామ్మోహన్, భరత్గార్లకు ఈ సినిమా ఒక మైలురాయిగా నిలవాలి’’ అన్నారు. చదవండి: చేతులారా ప్రాణాలు తీసుకున్నాడు.. అసలు మాట వినలేదు: వేణు మాధవ్ తల్లి ఆవేదన ‘‘మైఖేల్’ని ఇండియాలో 1500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. ‘‘యూనివర్శల్ సబ్జెక్ట్ ఇది.. నిర్మాతలుగా మేము సంతోషంగా ఉన్నాం’’ అన్నారు భరత్ చౌదరి. ‘‘నాది చెన్నై.. నేను హైదరాబాద్ వచ్చి సినిమా తీస్తున్నాను అనే అనుభూతి నాకు కలగకుండా నాదీ హైదరాబాదే అనేలా చూసుకున్న ఈ చిత్ర నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రంజిత్ జయకొడి. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో రానున్న సినిమాలివే..!
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. సంక్రాంతికి పెద్ద హీరోల సినిమాలు థియేటర్లలో సందడి చేయగా.. ఆ తర్వాత చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక ఫిబ్రవరి మొదటి వారంలోనే పలు సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ వారం సినీ ప్రేక్షకులకు కనువిందు చేయనున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. థియేటర్లతో పాటు ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైన సినిమాలేవో ఓసారి చూసేద్దాం. సందీప్ కిషన్- మైఖేల్ టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం మైఖేల్. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి3న ప్రేక్షకుల ముందుకు రానుంది. సుహాస్- రైటర్ పద్మభూషణ్ కలర్ ఫోటో ఫేమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రైటర్ పద్మభూషణ్. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టీనా శిల్పరాజ్ హీరోయిన్గా నటిస్తుంది.చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పోస్టర్లు, టీజర్ ఇప్పటికే పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జయప్రద- సువర్ణ సుందరి సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. డాక్టర్ ఎమ్వీకే రెడ్డి సమర్పణలో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3న భారీ స్థాయిలో విడుదల కానుంది. ప్రేమదేశం త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన చిత్రం ‘ప్రేమదేశం’. శ్రీకాంత్ సిద్ధమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మధుబాల ప్రత్యేక పాత్రలో నటించారు. శిరీష సిద్ధమ్ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ కానుంది. బుట్టబొమ్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో అవార్డులు అందుకున్న అనిఖా సురేంద్రన్ తెలుగులో హీరోయిన్గా నటిస్తున్న చిత్రం బుట్టబొమ్మ. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్ పమీలా (హాలీవుడ్) జనవరి 31 గంతర్స్ మిలియన్స్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 1 క్లాస్ (వెబ్‌సిరీస్- సీజన్-1) ఫిబ్రవరి 3 ట్రూ స్పిరిట్ ఫిబ్రవరి 3 ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్) ఫిబ్రవరి 3 స్ట్రామ్ బాయిల్ ఫిబ్రవరి 3 వైకింగ్ ఊల్ఫ్ ఫిబ్రవరి 3 డిస్నీ+హాట్‌స్టార్ బ్లాక్ పాంథర్ వాఖండా ఫరెవర్ (హాలీవుడ్) ఫిబ్రవరి 1 సెంబి (తమిళ్) ఫిబ్రవరి 3 ఆహా అన్‌స్టాపబుల్ సీజన్-2 విత్ ఎన్బీకే- ఫిబ్రవరి 3 ముఖచిత్రం(తెలుగు)- ఫిబ్రవరి 3 కపుల్ ఆన్ బ్యాక్‌ట్రాక్( కొరియన్ మూవీ ఇన్ తెలుగు)- ఫిబ్రవరి 4 కామెడీ స్టాక్ ఎక్సేంజ్- ఫినాలే ఎపిసోడ్- ఫిబ్రవరి 4 సోనీలివ్ జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్ (హిందీ) ఫిబ్రవరి 3 -
ఆది నా బెస్ట్ ఫ్రెండ్: హీరో సందీప్ కిషన్
లవ్లీ హీరో ఆది సాయి కుమార్ తాజా చిత్రం టాప్ గేర్. ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ సినిమా తెరకెక్కించారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ మాట్లాడుతూ.. 'మా నాన్నతో మొదలైన మా జర్నీ ఆది వరకు వచ్చింది. ఆది క్రికెటర్ అవ్వాలనుకున్నాం. కానీ మెగాస్టార్ అన్నయ్య సాంగ్‌తో ఇండస్ట్రీకి వచ్చాడు. అందరూ ఈ "టాప్ గేర్" సినిమా ట్రైలర్, టీజర్ బాగుందని మెచ్చుకుంటున్నారు. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా మా ఆదికి బిగ్ బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నా.' అని అన్నారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. 'శశి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం చాలా హ్యాపీగా ఉంది. ప్రస్థానం సినిమాతో నా జర్నీ మొదలైంది. ఆది నాకు బెస్ట్ ఫ్రెండ్. ఈ సినిమా బిగ్ హిట్ అవ్వడమే కాకుండా ఈ "టాప్ గేర్" సినిమాతో ఆది కెరీర్ బ్రేక్ లేకుండా సాగిపోవాలి. అలాగే రాబోయే 2023 లో ఆదితో నేను ఒక సినిమా తీసేందుకు ప్లానింగ్ చేస్తున్నా. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. హీరో ఆది మాట్లాడుతూ.. 'శ్రీధర్ చాలా పాజిటివిటి ఉన్న వ్యక్తి. తను ఇంకా ఇలాంటి సినిమాలు చాలా తీయాలి. శశి చాలా డెడికేషన్ ఉన్న వ్వక్తి. తను ఈ సినిమాకు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. మా "టాప్ గేర్" సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. చిత్ర దర్శకుడు శశికాంత్ మాట్లాడుతూ... 'థ్రిల్లర్, సస్పెన్స్ ఇలా అన్నీ ఏమోషన్స్ ఉన్న ఇలాంటి మంచి కథ. ప్రొడ్యూసర్ శ్రీధర్ రెడ్డి నన్ను సెలెక్ట్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా "టాప్ గేర్" సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. ఈ కార్యక్రమానికి హీరో సందీప్ కిషన్, సాయి కుమార్, బెక్కం వేణుగోపాల్, యన్ శంకర్, నిర్మాతలు దామోదర ప్రసాద్, అనిల్ సుంకర, రాధా మోహన్, నటుడు డి. యస్. రావు, డైరెక్టర్ శేఖర్ సూరి, సత్తి బాబు, నారాయణ్ గౌడ్, హరీష్, సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హీరో సందీప్ కిషన్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ గారు టాప్ గేర్ బిగ్ టికెట్‌ను లాంఛ్ చేశారు . -
సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ అప్పుడే!
సందీప్ కిషన్, దివ్యాంశా కౌశిక్ ‘నువ్వుంటే చాలు...’ అని ప్రేమ పాట పాడుకున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మైఖేల్’ చిత్రంలోని పాట ఇది. సినిమాలోని ఈ తొలి పాటను ఈ 28న విడుదల చేయనున్నారు. ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించి, పాటలోని ఓ పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. రంజిత్ జయకొడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పితో కలిసి డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పకులు. ‘‘సందీప్ కిషన్‌కి తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ సినిమా కోసం సందీప్ అద్భుతంగా మేకోవర్ అయ్యారు. సామ్ సీఎస్ మంచి పాటలు ఇచ్చారు. రొమాంటిక్ సాంగ్ ‘నువ్వుంటే చాలు..’ని తెలుగు, తమిళ భాషల్లో ఈ 28న విడుదల చేయనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్‌గా నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: కె. సాంబశివరావు. -
కాలర్ ఎగరేసుకునే సమయం ఇది
సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రంజిత్ జయకొడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మైఖేల్’. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్‌దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నాకు నేను పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష మైఖేల్. మూడుసంవత్సరాల క్రితం ‘మైఖేల్’ వర్క్‌ను స్టార్ట్ చేశాం. ఈ సినిమా కోసం దాదాపు 24 కేజీల బరువు తగ్గాను. సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు నంబరవన్ అని నంబర్స్ చెబుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది’’ అన్నారు. ‘‘మైఖేల్’ చేసేందుకు ఒప్పుకున్న సందీప్ కిషన్, విజయ్ సేతుపతిలతో పాటు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రంజిత్. ‘‘మైఖేల్’ పట్ల హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు రామ్మోహన్ రావు, భరత్ చౌదరి. -
‘ఓరి దేవుడా’ దివాలీ దావత్, సందడి చేసిన యంగ్ హీరోలు
యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం ఓరి దేవుడా. అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విక్టరి వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్లుగా నటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా గురువారం రాత్రి ‘దివాలీ దావత్’ పేరుతో వేడుకను నిర్వహించారు. ఈ పార్టీకి పలువుకు టాలీవుడ్ యంగ్ హీరోలు హాజరై సందడి చేశారు. అల్లరి నరేశ్, టీజే టిల్లు ఫేం సద్ది జొన్నలగడ్డ, సందీప్ కిషన్, ఆది సాయి కుమార్, ఆకాశ్ పూరి, విశ్వక్ సేన్, హీరో కార్తికేయతో పాటు తదితరులు, చిత్ర బృందం పాల్గొంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘ఊరు పేరు భైరవకోన’ పోస్టర్ రిలీజ్
హీరో సందీప్ కిషన్ పుట్టినరోజు (07.05.) సందర్భంగా ఆయన తాజా చిత్రాల (మైఖేల్, ఊరు పేరు భైరవకోన) నుంచి లుక్స్ రిలీజయ్యాయి. పాన్ ఇండియా మైఖేల్ .. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘మైఖేల్’. రంజిత్ జయకొడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: శివ చెర్రీ. ఊరు పేరు భైరవకోన.. సందీప్ హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, కెమెరా: రాజ్ తోట, సంగీతం: శేఖర్ చంద్ర. -
సందీప్ కిషన్ 'మైఖేల్' ఫస్ట్‌లుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న తాజా చిత్రం మైఖేల్. రంజిత్ జేయకొడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్ మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కతున్న ఈ సినిమాలో విజయ్ సేతపతి, గౌతమ్ మీనన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా శనివారం(మే7)న సందీప్ కిషన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సిక్స్‌ప్యాక్ బాడీతో చేతిలో గన్ పట్టుకొని పవర్‌ఫుల్‌గా కనిస్తున్నాడు.తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. సందీప్ సరసన దివ్యాంశ కౌశిక్ హీరోయిన్గా నటిస్తుంది. వరలక్ష్మి శరత్‌కుమార్, వరుణ్ సందేశ్‌లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. Happy to share the Fiery 1st Look of my Dear most director @jeranjit ‘s #Michael 👊🏽@Dir_Lokesh presents 🌟#HBDSundeepKishan ❤️@sundeepkishan @menongautham @varusarath5 @itsdivyanshak @SVCLLP @KaranCoffl @SamCSmusic @adityamusic @sivacherry9 @proyuvraaj pic.twitter.com/N6qZc498Jz — VijaySethupathi (@VijaySethuOffl) May 7, 2022 -
రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా అదరగొట్టిన హీరో ఆది
విలక్షణ కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో ఆది సాయికుమార్ కొత్త సినిమా 'తీస్ మార్ ఖాన్'. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు దర్శకనిర్మాతలు. ఇందులో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో ప్రముఖ హీరో సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా 'తీస్ మార్ ఖాన్' గ్లాన్స్ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఆది సాయికుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌లో కనిపించారు. సాయి కార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. స్టూడెంట్‌గా, రౌడీగా, పోలీస్ ఆఫీసర్‌గా ఆది సాయికుమార్ త్రీ షేడ్స్‌లో అదరగొట్టనున్నారని తెలుస్తోంది. ఈ గ్లాన్స్ వీడియో ద్వారా సినిమాలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయని స్పష్టమవుతోంది. ఈ సినిమాలో అది సాయికుమార్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. చిత్రం లోని యాక్షన్ సీన్స్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి. చిత్రానికి బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. -
సందీప్ కిషన్ చిత్రంలో విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్
యంగ్ హీరో సందీప్ కిషన్ తాజా చిత్రం మైకేల్. ఈ మూవీలో విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలో నటించనున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ప్రతినాయకుడిగా దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ నటిస్తున్నారు. ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని నారాయణ దాస్ కె నరంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్బి, కరన్.సీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్బి సంస్థల అధినేతలు భరత్ చౌదరి, పుష్కర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. చదవండి: పునీత్ స్టైల్లో ‘నాటు నాటు’ సాంగ్, ఆర్ఆర్ఆర్ టీం ఫిదా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ తదితర భాషలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రానికి రంజిత్ జయకొడి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు వెల్లడించారు. సోమవారం చిత్ర పోస్టర్‌ను విడుదల చేయగా మంచి ఆదరణ వచ్చిందన్నారు. -
నాకు లైఫ్ ఇచ్చింది ఆ దర్శకులే: సందీప్ కిషన్
సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రధారులుగా జయకిశోర్ బండి దర్శకత్వంలో రాజేష్, సృజన్ నిర్మించిన చిత్రం ‘మధుర వైన్స్’. ఈ సినిమా అక్టోబరు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో అతిథిగా యంగ్ హీరో సందీప్ కిషన్ హాజరయ్యాడు. సందీప్ మాట్లాడుతూ – ‘‘హీరోగా నాకు లైఫ్ ఇచ్చింది షార్ట్‌ఫిల్మ్స్ తీసిన దర్శకులే. ఈ సినిమా వారు కూడా షార్ట్ ఫిల్మ్స్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నవారే. వారి మాటలు వింటుంటే ఈ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం కలుగుతోంది’’ అన్నారు. ‘‘షార్ట్ ఫిలింసే తీస్తున్నానని కొందరు నన్ను నిరుత్సాహపరిస్తే నా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. నేను హీరోగా పరిచయమవుతున్న తొలి సినిమా ఇది’’ అన్నారు సన్నీ. ‘‘మా సినిమా రిలీజ్ వెనక చాలా కారణాలు ఉన్నాయి. వాటితో ఓ వెబ్‌సిరీస్ తీయొచ్చు’’ అన్నారు జయకిశోర్. చదవండి: మలయాళంలోకి డబ్బింగ్ కానున్న 'లవ్ స్టోరీ' -
మెగాస్టార్ చేతుల మీదుగా గల్లీరౌడీ ట్రైలర్
సందీప్‌కిషన్, నేహాశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘గల్లీరౌడీ’. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ నెల 17న గల్లీరౌడీ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ మూవీ ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదలచేశారు. వినోదం, యాక్షన్ అంశాలతో ఆద్యంతం ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. రౌడీయిజం చేయడం ఇష్టం లేకపోయినా ప్రేమించిన అమ్మాయి కోసం రౌడీగా చెలామణి అవుతూ సందీప్‌కిషన్ కనిపిస్తున్నాడు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘వారసత్వంగా రౌడీయిజాన్ని వృత్తిగా ఎంచుకున్న ఓ యువకుడి కథ ఇది. ఓ అమ్మాయి కారణంగా ఆ రౌడీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది నవ్విస్తూనే ఉత్కంఠను పంచుతుంది. రాజేంద్రప్రసాద్, బాబీసింహ నటన ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, వెన్నెలకిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
గల్లీ రౌడీ మూవీ టీంతో ముచ్చట్లు
-
'గల్లీరౌడీ'గా హీరో సందీప్ కిషన్..
‘గల్లీ రౌడీ’ ఆగస్ట్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సందీప్ కిషన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గల్లీరౌడీ’. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. నేహా శెట్టి హీరోయిన్. కోన వెంకట్ సమర్పణలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. ఆగస్ట్‌లో సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. ‘‘హిలేరియస్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘గల్లీ రౌడీ’. టీజర్‌కి మంచి ప్రశంసలు వచ్చాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: జి.వి, సంగీతం: చౌరస్తా రామ్, సాయికార్తీక్. -
Gully Rowdy: దుమ్మురేపుతున్న రామ్ మిర్యాల పాట
‘పుట్టినే ప్రేమ పడగొట్టెనే ప్రేమ.. ఏం చేశావో ఏమో కదమ్మా, ఇంతలో ప్రేమ అంతలో కోమా, అతలాకుతలం అవుతున్నానమ్మా..’ అంటూ ప్రేయసిని చూసి పాడేస్తున్నాడు గల్లీరౌడీ. ఈ రౌడీ ప్రేమ కహానీ తెలుసుకోవాలంటే మా ‘గల్లీరౌడీ’ సినిమా చూడాల్సిందే అంటున్నారు ఎంవీవీ సత్యనారాయణ, కోన వెంకట్. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాలోని ‘పుట్టినే ప్రేమ..’ పాటను సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశారు. రామ్ మిర్యాల సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న మా సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు ఎం.వి.వి.సత్యనారాయణ, కోన వెంకట్. -
Sundeep Kishan: ప్రయోగాత్మక సినిమాలో...
హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘టైగర్’ సినిమా విడుదలై ఆరేళ్లు అయింది. తాజాగా వీరి కాంబినేషన్లో మరో సినిమాని ప్రకటించారు. ఇది సందీప్‌కి 28వ సినిమా. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శుక్రవారం సందీప్ కిషన్ బర్త్ డే సందర్భంగా ఈ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘కథ, కథనాల ప్రకారం ఇది సందీప్ కెరీర్లో ఓ ప్రయోగాత్మక చిత్రంలా నిలుస్తుంది. సందీప్ నుంచి ప్రేక్షకులు ఆశించే కొత్తదనం, వైవిధ్యమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఈ చిత్రంలో నటించనున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బాలాజీ గుట్ట. -
బాబు రావాలి.. రౌడీ కావాలి..
‘బాబు రావాలి... రౌడీ కావాలి అని విశాఖపట్నం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు’, ‘ఎవరన్నా వాళ్ల మనవణ్ణి ఇంజనీర్ చేస్తాడు, డాక్టర్ చేస్తాడు... ఈ రౌడీ చేయడమేంట్రా?’, ‘నెపోటిజమ్ రా’.. వంటి డైలాగులు ‘గల్లీ రౌడీ’ టీజర్లో ఆకట్టుకుంటున్నాయి. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సోమవారం ‘గల్లీ రౌడీ’ టీజర్‌ను హీరో విజయ్ దేవరకొండ విడుదల చేశారు. ‘‘కోన వెంకట్ కథను ఫన్ రైడర్‌గా మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. కామెడీ ఎంటర్‌టైనర్స్‌ను తెరకెక్కించే నాగేశ్వరరెడ్డి తనదైన స్టైల్లో తెరకెక్కించాడు. వైవిధ్యమైన పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నవ్వులు పంచుతారు’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. చదవండి: ఆ సినిమాను 267 సార్లు చూశాను: హీరోయిన్ -
అందుకు కారణం సీఎం వైఎస్ జగన్: కోన వెంకట్
‘‘ఎంవీవీ సత్యనారాయణగారు మంచి వ్యక్తి. ప్రతిభ ఎక్కడ ఉన్నా పట్టుకోవడంలో కోన వెంకట్ స్పెషలిస్ట్. కామెడీ సినిమాలు తీయడంలో నాగేశ్వర రెడ్డిది ప్రత్యేక శైలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘గల్లీ రౌడీ’. కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా మే 21న విడుదలకానుంది. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో వీవీ వినాయక్, డైరెక్టర్ నందినీ రెడ్డి ‘గల్లీ రౌడీ’ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ని విడుదల చేశారు. వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘సందీప్ కిషన్ నాకు మేనల్లుడితో సమానం. తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునే నటుడు రాజేంద్రప్రసాద్. ‘గల్లీ రౌడీ’ హిట్ అయ్యి కోన, ఎంవీవీలకు బాగా డబ్బులు రావాలి’’ అన్నారు. ‘‘కరోనా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే నాగేశ్వర రెడ్డిగారి సినిమాలు చూడాలి’’ అని నందినీ రెడ్డి అన్నారు. కోన వెంకట్ మాట్లాడుతూ– ‘‘మా సినిమా ఇంత త్వరగా పూర్తయిందంటే కారణం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిగారు. ఏపీలో షూటింగ్‌లకు సింగిల్ విండో విధానం తీసుకొచ్చారాయన. ఈ విధానంలో పూర్తయిన తొలి చిత్రం మాదే. ఇందుకు జగన్‌గారికి, ఏపీ ఎఫ్డీసీ చైర్మన్ విజయ్ చందర్గారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నేను నటించిన ‘లేడీస్ టైలర్’కు ఎంత మంచి అభినందన వచ్చిందో ‘గల్లీ రౌడీ’కి కూడా మంచి అభినందన వస్తుంది’’ అన్నారు నటుడు డా. రాజేంద్ర ప్రసాద్. ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘నేను, కోన వెంకట్ చేసిన ‘గీతాంజలి’ కంటే ‘గల్లీ రౌడీ’ పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమా హిట్ కాకపోతే నా జడ్జ్మెంట్లో రాంగ్ ఉన్నట్లే. ఆ తర్వాత నేను సినిమాలు చేయలేనేమో? అనేంత నమ్మకంతో సినిమా సక్సెస్ అవుతుందని చెబుతున్నాను’’ అన్నారు. ‘‘నేను కథ వినేటప్పుడు ప్రేక్షకుడి కోణంలో వింటాను. అందరి సహకారం వల్లే మా సినిమాను 60 రోజుల్లో పూర్తి చేశాం’’ అన్నారు జి. నాగేశ్వర రెడ్డి. ‘‘అందరూ నవ్వుకునే సినిమా ‘గల్లీ రౌడీ’’ అన్నారు సందీప్ కిషన్. ఈ కార్యక్రమంలో నేహా శెట్టి, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, రచయితలు భాను, నందు తదితరులు పాల్గొన్నారు. -
నాకీ సినిమా జీవితాంతం గుర్తుంటుంది
‘‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ఇంటర్వెల్ బ్యాంగ్ రజనీకాంత్ గారి ‘బాషా’ స్థాయిలో ఉందని అందరూ అభినందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకుల స్పందన మాకొక ధైర్యాన్ని ఇచ్చింది. కొత్త కంటెంట్‌తో సినిమాలు చేయవచ్చనే నమ్మకం పెరిగింది. మా సినిమా డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు లాభాలతో హ్యాపీగా ఉన్నాం అని చెబుతున్నారు. జీవితాంతం నాకీ సినిమా గుర్తుంటుంది’’ అన్నారు. ‘‘నా ఫస్ట్ మూవీని హిట్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు డెన్నిస్ జీవన్. ‘‘మా సినిమా పంపిణీదారులందరూ ఫోన్ చేసి, ‘సేఫ్ అయ్యాం, సంతోషంగా ఉన్నాం’ అని చెబుతుంటే ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘ఒక ప్రేక్షకుడిగా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ లాంటి మంచి సినిమా చూసినందుకు గర్వంగా ఫీలవుతున్నాను’’ అన్నారు కోన వెంకట్. -
ఈ సినిమా చేయడం నా అదృష్టం
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద ్, అభిషేక్ అగర్వాల్, సందీప్‌కిషన్ , దయా పన్నెం నిర్మించిన ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ నేడు రిలీజవుతోంది. సందీప్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దేశభక్తితో కూడిన స్పోర్ట్స్ సినిమాలను ఇండియన్స్ అందరూ చూస్తారు. అలాంటి ఓ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం ఇది. వరంగల్‌లో ఉండే రాకేష్ అనే వ్యక్తి కొంతమందికి హాకీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. కానీ సరైన సౌకర్యాలు లేవు. వారికి కొంత ఆర్థిక సహాయం అందించడంతో పాటు సినిమా లాభాల్లో కొంత పిల్లల చదువు కోసం వినియోగిస్తాం’’ అన్నారు. ‘‘కథపై నమ్మకంతో మంచి ప్రయత్నం చేశాం’’ అన్నారు వివేక్ కూచిభొట్ల. -
సక్సెస్ అయితేనే మాట్లాడతారు: సందీప్ కిషన్
‘‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత హాకీ క్రీడను ఎక్కువమంది ఇష్టపడతారా? అంటే అది నేను చెప్పలేను. ‘చెక్ దే’ సినిమా తర్వాత హాకీ గురించి, ‘ఒక్కడు’ సినిమా తర్వాత కబడ్డీ గురించి, ‘సై’ సినిమా సమయంలో రగ్బీ గురించి చెప్పుకున్నారు. కానీ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా ద్వారా కొందరిలోనైనా ఓ ఆలోచన కలుగుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్ కిషన్ . డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో సందీప్, లావణ్యా త్రిపాఠీ జంటగా రూపొందిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. సందీప్ కిషన్ చెప్పిన విశేషాలు... ► నా కెరీర్లో 25వ చిత్రం ఇది. కొత్త దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేశాను. కొత్త దర్శకుడు జీవన్ తో ఇలాంటి స్పోర్ట్స్ ఫిల్మ్ చేయడం రిస్క్ అనిపించలేదు. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం. ► స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీ అంటే ఎక్కువ కష్టపడాలి. ఈ సినిమా కోసం ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. హాకీ ప్లేయర్స్ బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ లుక్స్ కోసం మ్యాచ్‌లు చూశాను. ► ఏ రంగంలోనైనా ప్రతిభకు, కష్టానికి ఒక్కోసారి విలువ, గుర్తింపు ఉండవు. సక్సెస్ అయితేనే మాట్లాడతారు. కానీ మన వంతుగా మనం వంద శాతం కష్టపడాలి. ప్రొడక్షన్స్ అనేది క్రియేటివ్ జాబ్. ప్రస్తుతం నా ప్రొడక్షన్ లో ‘వివాహ భోజనంబు’ సినిమా చేస్తున్నాం. ‘రౌడీ బేబీ’, మహేశ్ కోనేరు నిర్మాణంలో ఒక సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్స్లో మరో సినిమాలో పాత్రపోషణ చేస్తున్నాను. -
ప్రపంచం ఎదురుచూస్తోంది
‘‘తెలుగు సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి.. మేమంతా ఎదురు చూస్తున్నాం’ అని లాక్డౌన్ సమయంలో దుబాయ్‌కి చెందిన ఓ నిర్మాత అన్నారు.. అంటే మన తెలుగు సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ప్రతి యాక్టర్‌కీ ఒక పెద్ద హిట్ సినిమా అనేది వస్తుంది. సందీప్ కెరీర్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అని హీరో రామ్ అన్నారు. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠీ జంటగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకలో డెన్నిస్ జీవన్ మాట్లాడుతూ– ‘‘కథ వినగానే సందీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు’’ అన్నారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ – ‘‘ఎవరికీ అవకాశాలు రావు. వాటిని మనమే సృష్టించుకోవాలి. ఆ టైమ్‌లో అండగా నిలబడ్డవారే మనకు దేవుళ్లు... గొప్పవాళ్లు. హాకీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది’’ అన్నారు. ‘‘సందీప్ 25వ సినిమా మా బ్యానర్లో చేయడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్. -
ఆ పాత్రలు చేసీ చేసీ బోర్ కొట్టింది
‘‘ఈ మధ్య కాలంలో నేనెక్కువ సినిమాలు కమిట్ కాలేదు. దానికి ముఖ్య కారణం ఆ పాత్రలన్నీ నేను గతంలో చేసినట్టుగా అనిపించడమే. రెగ్యులర్ పాత్రలు చేసీ చేసీ బోర్ కొట్టింది. ఏదైనా చాలెంజింగ్‌గా చేయాలనుకుంటున్న సమయంలో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ నా వద్దకు వచ్చింది’’ అని లావణ్యా త్రిపాఠి అన్నారు. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మించారు. ఈ సినిమా మార్చి 5న విడుదల కానున్న సందర్భంగా లావణ్యా త్రిపాఠి చెప్పిన విశేషాలు. – ఈ సినిమా పాయింట్‌ను ఒకసారి సందీప్ కిషన్ నాతో పంచుకున్నారు. చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఇందులో నేను, సందీప్ ఇద్దరం హాకీ క్రీడాకారులుగా కనిపిస్తాం. తమిళ సినిమాకు ఇది రీమేక్ అయినా తెలుగు నేటివిటీకు తగ్గట్టు మార్పులు చేశారు. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నా నిజజీవితానికి దగ్గరగా అనిపించింది. పాత్రలోకి సులభంగా ఒదిగిపోయాను. హాకీ క్రీడాకారుల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో గమనించాను. శిక్షణ తీసుకున్నాను. పాత హకీ మ్యాచ్‌లు చూశాను. ► ఓ డైలాగ్ చెప్పి, ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్లిపోయే పాత్రలు బోర్ కొట్టేశాయి. ఓ పాత్ర కోసం మానసికంగా, శారీరకంగా కష్టపడాలి అనిపించింది. అందుకే హాకీ బ్యాట్ తీసుకుని మైదానంలోకి అడుగుపెట్టాను. చెమటలు పట్టేలా శ్రమించా. ఈ పాత్ర నాకు చాలా సంతప్తినిచ్చింది. ∙హాకీ ప్లేయర్ పాత్ర కోసం ప్రత్యేకమైన కసరత్తులు ఏం చేయలేదు. ఫిట్నెస్ మీద ఎప్పుడూ దృష్టిపెడతాను. ఈ పాత్రకు తగ్గట్టు కొన్ని వర్కౌట్స్ చేశా. స్కూల్లో బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్ ఎక్కువగా ఆడేదాన్ని. స్కూల్లో హాకీ ఉండేది కాదు. కానీ ఈ సినిమా చేశాక స్కూల్స్‌లో హాకీని కూడా భాగం చేస్తే బావుంటుందనిపించింది. రాజకీయాల వల్ల ఎంత ప్రతిభ ఉన్న క్రీడాకారులైనా కొన్నిసార్లు నష్టపోతుంటారు అనే పాయింట్‌ని ఈ సినిమాలో చెప్పాం. ► సందీప్‌తో గతంలో ‘మాయవన్ ’ అనే సినిమా చేశా. తను మంచి కోస్టార్. షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం కలిగింది. ► ఇంకొన్నేళ్ల పాటు సినిమాలే చేయాలనుకుంటున్నాను. ఓటీటీలో అప్పుడే చేయాలనుకోవడం లేదు. విలన్ గా యాక్ట్ చేయాలనుంది. అప్పుడే మన సామర్థ్యం తెలుస్తుంది. కొన్ని స్క్రిప్ట్‌లు విన్నాను. వాటి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను. -
హాకీ ఎక్స్‌ప్రెస్
సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన న్యూఏజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం నిర్మించారు. ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ ఫస్ట్ లుక్‌ను శనివారం విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్లో ఎయిట్ప్యాక్ బాడీతో ఒక చేతిలో హాకీ స్టిక్ పట్టుకుని మరో చేతిలో చొక్కా ఊపుతూ కనిపించారు సందీప్. త్వరలో థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్దమవుతుందీ సినిమా. తెలుగు సినిమా పరిశ్రమలో హాకీ నేపథ్యంలో వస్తున్న ఈ తొలి చిత్రానికి హిప్హాప్ తమిళ సంగీత దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. -
రౌడీ బేబీ కామెడీ
సందీప్ కిషన్, నేహా శెట్టి జంటగా రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో నటì స్తున్న చిత్రం ‘రౌడీ బేబీ’. జి. నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో కోన వెంకట్ సమర్పణలో విశాఖపట్నం పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సహ నిర్మాత జీవీ కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎంవీవీ సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. కోన వెంకట్ గౌరవ దర్శకత్వం వహించారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మరగాని భరత్, పెందుర్తి ఎమ్మెల్యే అదిప్‌రాజ్, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే అమర్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘‘కామెడీ చిత్రాలతో స్టార్ రైటర్‌గా ఎదిగాను. అదే కామెడీని బేస్ చేసుకుని ప్రేక్షకులను నవ్వించడానికి రెడీ అయ్యాం’’ అన్నారు కోన వెంకట్. ‘‘రెగ్యులర్ షూటింగ్‌ని బుధవారమే ప్రారంభించాం. వైజాగ్ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్లో సినిమాని పూర్తి చేసి, వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తాం’’ అన్నారు ఎంవీవీ సత్యనారాయణ. ఈ చిత్రానికి కెమెరా: సుజాత సిద్ధార్థ్, సంగీతం: చౌరస్తా రామ్. -
హిందీలోకి మానగరం
సందీప్ కిషన్, శ్రీ, రెజీనా ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మానగరం’. ‘నగరం’ టైటిల్‌తో తెలుగులో విడుదలైంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. ఒక్క రాత్రిలో జరిగే కథాంశంగా ఈ సినిమా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేస్తున్నారు. విక్రాంత్ మాస్సీ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ కెమెరామేన్ సంతోష్ శివన్ డైరెక్ట్ చేయబోతున్నారు. జనవరిలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
బ్యాక్ టు వర్క్
కరోనా వల్ల ఇండస్ట్రీలో ఆరు నెలలుగా పని మొత్తం స్తంభించిపోయింది. మెల్లిగా చిత్రీకరణలు ప్రారంభం అవుతున్నాయి. నేటి నుంచి నటుడు, నిర్మాత సందీప్ కిషన్ కూడా పని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇందులో సందీప్ కిషన్ హాకీ క్రీడాకారుడిగా నటించనున్నారు. అలాగే ఆయన నిర్మిస్తున్న ‘వివాహ భోజనంబు’ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం అవుతోంది. ఈ చిత్రం ముహూర్తం నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ప్రభుత్వం చెప్పిన గైడ్‌లైన్స్ అన్నీ పాటిస్తూ ఈ సినిమాల చిత్రీకరణలను జరపనున్నారు. -
ఆయనెవరో ఊహించండి!
నటుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సందీప్ కిషన్ నిర్మాతగానూ అభిరుచి గల సినిమాలు నిర్మిస్తున్నారు. వెంకటాద్రి టాకీస్ నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా ‘నిను వీడని నీడను నేనే’ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’లో నిర్మాణ భాగస్వామిగానూ ఉన్నారు సందీప్. తాజాగా ‘వివాహ భోజనంబు’ అనే సినిమా నిర్మించనున్నట్లు ప్రకటించారాయన. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకుడు. ఆనంది ఆర్ట్స్ క్రియేష¯Œ ్స పతాకంపై నిర్మాత పి. కిరణ్ సమర్పణలో వెంకటాద్రి టాకీస్, సోల్జర్స్ ఫ్యాక్టరీ పతాకాలపై సందీప్ కిషన్ , శినీష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఓ ప్రముఖ సహాయ నటుడు ఈ చిత్రంలో లీడ్ రోల్ చేయబోతున్నారు. ఆయనెవరో ఊహించండి?’’ అంటూ ఈ సినిమా ప్రీ–లుక్‌ని సోమవారం విడుదల చేశారు. త్వరలో ఫస్ట్ లుక్‌తో పాటు హీరో, హీరోయిన్ , ఇతర నటీనటుల వివరాలను వెల్లడించనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మణికందన్ , ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శివా చెర్రీ, సీతారామ్. -
టార్గెట్ 15
ఈ లాక్డౌన్ సమయంలో హీరో సందీప్ కిషన్ దాదాపు 12 కేజీల బరువు తగ్గారు. కారణం తన తాజా చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ కోసమే. సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ఇది. ఇందులో హాకీ ప్లేయర్‌గా కనిపించనున్నారు సందీప్ కిషన్. లావణ్యా త్రిపాఠి హీరోయిన్. హ్యాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో హాకీ ప్లేయర్‌గా స్క్రీన్‌పై ఫిట్‌గా కనిపించేందుకు సందీప్ 15 కేజీల బరువు తగ్గాలని టార్గెట్ పెట్టుకున్నారట. ప్రస్తుతానికి 12 కేజీల బరువు తగ్గారు. మిగతా 3 కిలోలు తగ్గే పనిలో ఉన్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, దయా పన్నెం, సందీప్ కిషన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా ఉన్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతదర్శకుడు. -
మూడో సినిమా
సందీప్ కిషన్ హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘బీరువా’ వంటి చిత్రాలు అందించిన నిర్మాత పి. కిరణ్ సందీప్‌తోనే మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. గురువారం సందీప్ కిషన్ పుట్టినరోజుని పురస్కరించుకుని తమ కాంబినేషన్లో రూపొందనున్న మూడో సినిమాని ప్రకటించారు. ఈ చిత్రానికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించనున్నారు. ఆనంది ఆర్ట్స్ క్రియేష¯Œ ్స పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 15గా రూపొందనున్న ఈ చిత్రానికి భాను బోగవరపు కథ అందిస్తున్నారు. అందమైన రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న చిత్రమిది. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నటిస్తోన్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సినిమా షూటింగ్ ఆరంభమవుతుంది. -
సింగిల్ కింగులం..
హాకీ నేపథ్యంలో తెలుగులో తెరకెక్కుతోన్న తొలి చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిష¯Œ , దయా పన్నెం నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. సామ్రాట్ సాహిత్యం అందించగా హిప్ హాప్ తమిళ స్వరపరచిన ఈ చిత్రంలోని తొలి పాట ‘సింగిల్ కింగులం..’ని యూ ట్యూబ్‌లో రిలీజ్ చేశారు. రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాటకి శేఖర్ మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ‘‘న్యూ ఏజ్ స్పోర్ట్స్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రమిది. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి కలసి ఆడి పాడిన ‘సింగిల్ కింగులం..’ పాట ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: కవిన్ రాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: శివ చెర్రీ, సీతారాం, దివ్య విజయ్, మయాంక్ సింఘానియా, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
స్ట్రైకింగ్‌కి సిద్ధం
హాకీ స్టిక్ పట్టుకొని గ్రౌండ్లో సిద్ధంగా ఉన్నారు లావణ్యా రావ్. బాల్ రావడం ఆలస్యం నేరుగా గోల్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. తన గేమ్‌ని చూడటానికి కొంచెం టైమ్ ఉంది. సందీప్ కిషన్, లావణ్యా త్రిపాఠి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు. హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్, లావణ్య హాకీ క్రీడా కారులుగా కనిపిస్తారు. ఆదివారం లావణ్య త్రిపాఠి పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమాలో తన లుక్‌ను రిలీజ్ చేశారు. ‘‘లావణ్య రావ్ అనే హాకీ ప్లేయర్ పాత్ర చేయడం చాలా సంతోషంగా, ఎగ్జయి టింగ్‌గా ఉంది. ఈ పాత్ర నా కెరీర్లో స్పెషల్‌గా ఉండబోతోంది’’ అన్నారు లావణ్య. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, సహ–నిర్మాత: వివేక్ కూచిభొట్ల. -
హాకీ స్టిక్ పట్టిన లావణ్య త్రిపాఠి
‘అందాల రాక్షసి’సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన లావణ్య త్రిపాఠి.. అతికొద్ది కాలంలోనే అభిమానుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్నారు. ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’, ‘అర్జున్ సురవరం’, వంటి హిట్ చిత్రాల్లో నటిగా వందకు వంద మార్కులను సొంతం చేసుకున్నారు. తాజాగా సందీప్ కిషన్ హీరోగా హాకీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సందీప్ కిషన్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం.. ఈ రోజు లావణ్య త్రిపాఠి బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్‌ను తాజాగా రివీల్ చేసింది. ఈ సినిమాలో ‘హాకీ ప్లేయర్ లావణ్య రావు’ పాత్రలో లావణ్య త్రిపాఠి కనిపించనున్నారు. ఈ పాత్రలో జీవించాలనే ఉద్దేశంతో హాకీలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంపై సందీప్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతమందిస్తున్నాడు. ఈటీవలే నిఖిల్, లావణ్య హీరోహీరోయిన్లుగా నటించిన ‘అర్జున్ సురవరం’ బ్లాకబస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి లావణ్య త్రిపాఠిపై ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా ఆమె నవ్వంటే తనకు ఎంతో ఇష్టమని మనసులోని మాటను బయటపెట్టారు చిరు. -
రెండుగంటలు నవ్విస్తాం
‘‘కమర్షియల్ ఎంటర్టైన్మెంట్తో థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామాగా ‘తెనాలి రామకృష్ణ’ చిత్రాన్ని రూపొందించాం. నాలోని ప్లస్సులను హైలెట్ చేసి, మైనస్‌లను కవర్ చేసి అద్భుతంగా ఈ సినిమా తీశారు నాగేశ్వరరెడ్డిగారు. మా చిత్రంతో రెండుగంటలపాటు ప్రేక్షకులను నవ్విస్తాం’’ అని సందీప్ కిషన్ అన్నారు. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, హన్సిక జంటగా నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, శ్రీనివాస్, కె.సంజీవ్ రెడ్డి నిర్మించిన సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ–‘‘సందీప్ కిషన్ సినిమా పిచ్చోడు. తనకు సినిమా తప్ప మరేం తెలియదు. ఈ చిత్రాన్ని నిర్మాతలు ప్యాషన్‌తో నిర్మించారు. టీమ్ అందరం కష్టపడి ఈ సినిమా చేశాం.. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా సినిమా అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు హన్సిక. ‘‘ఈ చిత్రాన్ని తమిళంలోనూ రీమేక్ చేస్తాం’’ అన్నారు నిర్మాతలు. రచయిత రాజసింహా, నటుడు ప్రభాస్ శ్రీను, సంగీత దర్శకుడు సాయి కార్తీక్ మాట్లాడారు. -
మంచి కథ కుదరకపోతే ఖాళీగా ఉంటా
‘‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా తర్వాత నేను కామెడీ ఫిల్మ్ చేయలేదు. చాలా విరామం తర్వాత ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ చిత్రంలో పూర్తి స్థాయి వినోదాత్మక పాత్ర చేశా. నాకు వినోదం అంటే చాలా ఇష్టం. అందుకే బాగా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశా. ప్రేక్షకులు రెండు గంటల ఎనిమిది నిమిషాలు పడి పడి నవ్వుతారు’’ అని సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్, హన్సిక జంటగా నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉపశీర్షిక. జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మీడియాతో పంచుకున్న విశేషాలు. ►నా కెరీర్లో తొలిసారి ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాలో లాయర్ పాత్ర చేశా. కర్నూల్ టౌన్లో ఈ కథ సాగుతుంది. కోర్టులో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పట్టుకుని కోర్టు బయట రాజీ చేయిస్తుంటా. అలాంటిది ఓ పెద్ద కేసుతో అనుకోని ఇబ్బంది వస్తుంది. దాన్ని ఎలా పరిష్కరించానన్నది ఆసక్తిగా ఉంటుంది. నా పాత్ర చాలా సరదాగా, నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. సింపుల్, స్వీట్ స్టోరీ ఇది. థ్రిల్ కలిగించే అంశాలూ ఉంటాయి. ►నాగేశ్వర రెడ్డిగారు అంటేనే వినోదం. ఈ టైమ్‌లో ఆయనలాంటి డైరెక్టర్ నాకు కుదరడం నేను సూపర్ లక్కీ. ఇలాంటి సినిమాల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంది. కథలో కామెడీ ఉండాలి కానీ, కామెడీ కోసం కథ ఉండకూడదు. మా సినిమా మొదటి కోవలోకి వస్తుంది. ►ప్రేక్షకులు నన్ను ఓ జానర్లో ఆదరించినప్పుడు వెంటనే మరో జానర్‌కి వెళ్లడంతో కొన్ని పరాజయాలు వచ్చాయి. అందుకే ప్రస్తుతం చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నా. మంచి కథ కుదరకపోతే ఖాళీగా ఇంట్లో అయినా ఉంటాను కానీ, ఫ్లాప్ అయ్యే సినిమాలు మాత్రం చేయకూడదని నిర్ణయించుకున్నా. ‘నక్షత్రం’ సినిమా పరాజయం నుంచి బయటపడటానికి కొంచెం సమయం పట్టింది (నవ్వుతూ). ►హిందీలో ‘ది ఫ్యామిలీ మేన్’ అనే వెబ్ సిరీస్ తొలి భాగంలో మేజర్ విక్రమ్ పాత్రలో నటించా. చాలా మంచి స్పందన వచ్చింది. రెండో భాగంలో నేను ఉండను.. మూడో భాగంలో ఉంటా. తెలుగులోనూ గతంలో కంటే ప్రస్తుతం వెబ్ సిరీస్‌లు బాగా వస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ►ఓ సినిమా చేస్తున్నప్పుడే మూడు నాలుగు కథలు లాక్ చేసి పెట్టుకోవాలనుకోను. ఓ సినిమా విడుదలైన తర్వాతే మరో సినిమా గురించి ఆలోచిస్తా. ప్రస్తుతం నా దృష్టంతా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాపైనే ఉంది. దీని తర్వాత ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా ఒప్పుకున్నా. ఈ చిత్రంలో హాకీ ప్లేయర్ పాత్ర చేస్తున్నా. నా ప్రొడక్షన్లో రాహుల్ రామకృష్ణ–ప్రియదర్శిలతో ఓ సినిమా నిర్మించనున్నా. ‘ది ఫ్యామిలీ మేన్’ తర్వాత బాలీవుడ్లో వెబ్ సిరీస్‌లకు, సినిమాలకు అవకాశాలొచ్చాయి. అయితే ప్రస్తుతం నా దృష్టి తెలుగు చిత్రాలపైనే. తమిళంలో నేను నటించిన మూడు సినిమాలు రిలీజ్‌కి సిద్ధంగా ఉన్నాయి. అవి విడుదలయ్యాకే వేరే తమిళ సినిమాల గురించి ఆలోచిస్తా. -
నవ్వడం మానేశారు
‘‘ఇప్పటి మనుషులు డబ్బు వేటలో, ఉద్యోగాల ఒత్తిడి వల్ల నవ్వడం మానేశారు. పైగా ఈ మధ్య టాలీవుడ్లో పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రాలు రావడం తగ్గింది. అందుకే పూర్తి వినోదాత్మకంగా ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’ సినిమాని తెరకెక్కించాం’’ అని డైరెక్టర్ జి. నాగేశ్వర రెడ్డి అన్నారు. సందీప్ కిషన్, హన్సిక జంటగా వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉపశీర్షిక. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి చెప్పిన విశేషాలు. ► తెనాలి రామకృష్ణ అంటే తిమ్మిని బొమ్మి చేయగల సమర్థుడని చరిత్రలో చదువుకున్నాం. మా చిత్రంలో లాయర్‌గా సందీప్ పాత్ర కూడా అలాగే ఉంటుంది. తెనాలి రామకృష్ణకు ఉండే అన్ని లక్షణాలు ఈ లాయర్ పాత్రకు ఉంటాయి. అందుకే ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్’ అనే టైటిల్ పెట్టాం. ► రాజీపడితే కేసులు, గొడవలు, కోర్టులు ఉండవు అనే ధోరణిలో ఉండే హీరో ఓ కేసులో రాజీపడే ప్రసక్తే లేదు అన్నట్టుంటాడు. రెండు ఉద్దేశాలు కలిగిన హీరో పాత్రని వినోదాత్మకంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాతో సందీప్‌కి కొత్త ఇమేజ్ వస్తుంది. ఈ సినిమా చిత్రీకరణలో ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు సందీప్‌కి గాయం అయింది. దాంతో రెండు నెలలు షూటింగ్ వాయిదా పడింది. ► ఈ చిత్రంలో హన్సికది కూడా లాయర్ పాత్రే. మహా మేధావి అనుకునే ఇన్నోసెంట్ లాయర్ పాత్ర ఆమెది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ని ముఖ్యమైన పాత్ర కోసం తీసుకున్నాం. ► ఈ సినిమాలో కమెడియన్స్‌గా నటించిన పోసాని కృష్ణమురళి, ‘వెన్నెల’ కిషోర్, సప్తగిరి, సత్య కృష్ణల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. వీరి కామెడీ ట్రాక్ తెనాలి రామకృష్ణ పాత్రకు మించి ఉంటుంది. -
కడుపుబ్బా నవ్వుకుంటారు
‘‘కర్నూలు జిల్లాకు చెందిన దర్శక– నిర్మాతలు కలిసి ‘తెనాలి రామకృష్ణ: బీఏ బీఎల్’ సినిమాను రూపొందించారు. ఈ సినిమా మేకింగ్ విషయంలో నన్ను సంప్రదిస్తే నా వంతు సాయం చేశాను. సందీప్ చక్కగా నటించాడు. దర్శక–నిర్మాతలతో పాటు చిత్రబృందానికి అభినందనలు’’ అని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ అన్నారు. సందీప్‌కిషన్, హన్సిక జంటగా నటించిన తాజా చిత్రం ‘తెనాలి రామకృష్ణ: బీఏ బీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అనేది ఉపశీర్షిక. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్‌రెడ్డి, రూపా జగదీష్, ఇందుమూరి శ్రీనివాసులు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. కర్నూలులో జరిగిన ప్రీ–రిలీజ్ వేడుకలో సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను టీజీ వెంకటేశ్ విడుదల చేశారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ–‘‘మా చిత్రబృందంలో తెనాలి రామకృష్ణుడు నాగేశ్వరరెడ్డిగారే. ఆయనలాంటి దర్శకుడు ప్రస్తుతం నాకు దొరకడం నా అదృష్టం. ఈ సినిమా చూసి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు’’ అన్నారు. ‘‘సందీప్ కెరీర్లోనే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు జి. నాగేశ్వరరెడ్డి. ‘‘ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి. ‘‘కర్నూలులో 18రోజులు చిత్రీకరణ జరిపాం. సినిమా వినోదాత్మకంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాతలు. ‘‘కర్నూలులో చిత్రీకరణ జరుపుకున్న సినిమాలన్నీ పెద్ద విజయం సాధించాయి. ఈ సినిమా కూడా హిట్ కావాలి’’ అన్నారు కర్నూలు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ. హన్సిక, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, నటుడు సప్తగిరి, ఎడిటర్ గౌతంరాజు, అశోక్‌కుమార్, కోట్ల హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ∙కాటసాని రాంభూపాల్ రెడ్డి, టి.జి.వెంకటేశ్, సందీప్ కిషన్, జి.నాగేశ్వరరెడ్డి, సంజీవ్ రెడ్డి -
హాకీ ఎక్స్‌ప్రెస్
నిన్న కాక మొన్న విడుదలైన సూపర్‌హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘నినువీడని నీడను నేను’తో మంచి సక్సెస్ సాధించారు. ఈ నెల 15న ‘తెనాలి రామకృష్ణ’ అంటూ కామెడీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సోమవారం స్పోర్ట్స్ డ్రామా ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ని ప్రారంభించి మంచి స్పీడు మీదున్నారు ప్రామిసింగ్ హీరో సందీప్ కిషన్. డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా వన్నెం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాకీ ఆట ప్రధాన ఇతివృత్తంగా ఈ సినిమా ఉంటుంది. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సందీప్ కిషన్ తొలిసారిగా నటిస్తున్నారు. సోమవారం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. సందీప్, మురళీశర్మ, రఘుబాబులపై సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్ తమిళ, కెమెరా: కెవిన్రాజు, ఎడిటింగ్: ఛోటా.కె. ప్రసాద్ -
కేసులు ఇవ్వండి ప్లీజ్
సందీప్ కిషన్ హీరోగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో లె రకెక్కిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్’. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్’ అన్నది ఉపశీర్షిక. హన్సిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎన్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ చిత్రం టైటిల్ సాంగ్‌ను తెనాలిలో ఆదివారం విడుదల చేశారు. ‘‘ఇంతకాలం రకరకాల భోజనాలు తిన్నట్టుగా అనిపించినా, ఈ సినిమాతో అమ్మ చేతి వంట తిన్నంత తృప్తిగా ఉంది. చాలాకాలం తర్వాత నా సినిమాను నేనే డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాను’’ అని తెనాలిలో జరిగిన సాంగ్ రిలీజ్ కార్యక్రమంలో అన్నారు సందీప్ కిషన్. బ్రహ్మానందం, మురళీ శర్మ, ‘వెన్నెల’ కిశోర్, ప్రభాస్ శ్రీను, పృథ్వి, రఘుబాబు, రజిత, కిన్నెర, అన్నపూర్ణమ్మ, వై.విజయ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సీతారామరాజు మల్లెల, కెమెరా: సాయిశ్రీరాం, సంగీతం: సాయికార్తీక్. -
ఎక్స్‌ప్రెస్ వేగం
హాకీ ఆట ఆడబోతున్నారు హీరో సందీప్ కిషన్. మరి.. ఈ ఆటలో సందీప్ ప్రత్యర్థులను బోల్తా కొట్టించి ఎక్స్‌ప్రెస్ వేగంతో ఎలా గోల్స్ చేస్తారో చూడటానికి కాస్త సమయం ఉంది. సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రానికి ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మించనున్నారు. వివేక్ కూచిభొట్ల సహ–నిర్మాత. స్పోర్ట్స్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో హాకీ ప్లేయర్‌గా కనిపిస్తారు సందీప్. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తారు. ఈ సినిమా ప్రీ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. నవంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది విడుదల చేయాలను కుంటున్నారు. -
నవ్వులే నవ్వులు
‘‘తొలిసారి నా పనిని సిన్సియర్‌గా, ఫుల్ ఎంజాయ్ చేస్తూ చేశాను. ఈ క్రెడిట్ మొత్తం దర్శకుడు నాగేశ్వరరెడ్డిగారిదే. ఈ సినిమాకు ఆయన దొరకడం నా అదృష్టం’’ అని సందీప్ కిషన్ అన్నారు. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన చిత్రం ‘తెనాలి రామకృష్ణ బిఎ.బిఎల్’. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను హన్సిక, సందీప్ కిషన్ రిలీజ్ చేశారు. సందీప్‌కిషన్ మాట్లాడుతూ– ‘‘పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. సినిమా మొత్తం నవ్వులే. నేను చాలా కొత్తగా కనిపిస్తాను. అన్నీ తానై చక్కగా రూపొందించారు నాగేశ్వరరెడ్డిగారు’’అన్నారు. ‘‘నిర్మాతలు బాగా సహకరించారు. వాళ్లకో మంచి సినిమా ఇవ్వడమే నేను వాళ్లకు ఇచ్చే గిఫ్ట్. సినిమా బాగా వచ్చింది. నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు నాగేశ్వరరెడ్డి. ‘‘ఈ సినిమాలో భాగమవ్వడం çహ్యాపీగా ఉంది’’ అన్నారు హన్సిక. ‘‘నాగేశ్వరరెడ్డి, మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చి ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం’’ అన్నారు నాగిరెడ్డి. ‘‘మేము షూటింగ్‌కి వెళ్లకపోయినా నాగేశ్వరరెడ్డి వన్‌మ్యాన్ ఆర్మీగా అన్నీ చూసుకున్నాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది’’ అన్నారు సంజీవ్ రెడ్డి. ‘‘సంగీత దర్శకుడిగా ఇది నా 75వ సినిమా. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు సాయి కార్తీక్. -
అభిమానిగా అడుగుపెట్టి.. నేడు!
సాక్షి, గుంటూరు: శివ చెర్రి...సినిమా పరిశ్రమలో మెగా కుటుంబానికి, రాష్ట్రంలోని ఆ హీరోల అభిమానులకు సుపరిచితమైన పేరు. మెగా హీరోల సినిమాలకు ఆడియో ఫంక్షన్ల నుంచి, హైదరాబాద్ వెలుపల వారు పాల్గొనే పలు సభలు, సమావేశాలకు కీలక బాధ్యతల్లో తరచుగా వినిపిస్తుందా పేరు. ఆ క్రమంలోనే ఇప్పుడు సినీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత అయ్యాడు. ఒకప్పుడు సినిమా ఫంక్షన్ల పాస్‌ల కోసం పాకులాడిన ఈ తెనాలి కుర్రోడు నేడు తన ఆధ్వర్యంలోనే మెగా హీరోల ఆడియో ఫంక్షన్లు జరిగేంతలా ఎదిగాడు. సినిమా అభిమానులంటే పనీపాట లేనివాళ్ల వ్యాపకమని చిన్నచూపు చూసే సమాజానికి, నిజమైన ‘అభిమానం’ జీవితాన్నిస్తుందని నిరూపించాడు. సినిమా నిర్మాణ రంగంలో తెనాలి కీర్తిప్రతిష్టలను నిలబెడతానని చెబుతున్నాడు శివ చెర్రీ. రాంచరణ్ అభిమాని నుంచి సినీ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా... శివ చెర్రి అసలు పేరు పసుపులేటి శివ. మధ్యతరగతి కుటుంబం. తండ్రి హజరత్ సినిమా థియేటర్లో క్యాంటిన్ నడిపేవారు. నష్టం రావటంతో కుటుంబంతో సహా కొల్లూరు మకాం మార్చారు. అక్కడో చిన్న క్యాంటిన్ తీసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత తెనాలి తిరిగొచ్చారు. అప్పటికి శివకు పదోతరగతి పూర్తవటంతో ఇక్కడే ఇంటర్లో చేరాడు. హైస్కూలులో రెండేళ్లు విద్యార్థి నాయకుడిగా, హౌస్ కెప్టెన్‌గా వున్న అనుభవం కలిగిన శివకు ఏదొకటి చేయాలన్న ఉత్సాహం. తాను అభిమానించే సినీనటుడు రామ్‌చరణ్ సినిమా మగధీర రిలీజయ్యే సమయం. తోటి స్నేహితులను కూడగట్టి, చరణ్ ఫాన్స్ అసోసియేషన్ స్థాపించాడు...అధ్యక్షుడయ్యాడు. చేతిలో రూపాయి లేకున్నా, సభ్యుల చందాలు రూ.80 వేలతో సినిమా విడుదల రోజున పట్టణాన్ని ఫ్లెక్సీలతో నింపేశాడు...తొలియత్నంలోనే తెనాలి సినీ అభిమానులు శివకేసి చూశారు. తర్వాతి సినిమాకు మరింత ఆర్భాటం చేశారు. తొలినుంచీ సినిమాపై గల పిచ్చి, తండ్రి చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు కావటం ఇందుకు పురిగొల్పాయంటారు శివ. మరోవైపు చరణ్, చిరంజీవి జన్మదినాల్లో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాల నిర్వహణ, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటం మామూలే... శివచెర్రీగా..పసుపులేటి శివ హైదరాబాద్‌లో చిరంజీవి ఆధ్వర్యంలో నడిచే బ్లడ్‌బ్యాంకుకు శనివారం వెళితే ‘మెగా’ నటులను కలుసుకోవచ్చని తెలిసి.. ప్రతి శుక్రవారం డెల్టా ప్యాసింజరుకు వెళ్లటం, ఉదయాన్నే బ్లడ్‌బ్యాంకుకు వెళ్లి, సాయంత్రం వరకు అక్కడ ఎదురుచూడటం...నిత్య కార్యక్రమంగా చేసుకున్నాడు. ఒకరోజు చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు, బ్లడ్‌బ్యాంక్ సీఈఓ స్వామినాయుడు దృష్టిలో పడ్డాడు. చిన్నవయసులోనే రక్తదానం వంటి పలు సేవాకార్యక్రమాలు నిర్వహించడం తెలుసుకున్న అతను టచ్‌లో ఉండమని చెప్పాడు. ఒకరోజు స్వామినాయుడు నుంచి పిలుపురావడంతో అమ్మతో కలిసి హైదరాబాద్ వెళ్లటం శివ జీవితానికి మలుపు. ‘శివలో సేవాగుణం ఉంది...ఇక్కడ వదిలేసి వెళ్లండి...మేం చూసుకుంటాం’ అనటంతో బట్టలు, రూ.3 వేల నగదు ఇచ్చేసి అమ్మ వెళ్లిపోయింది’ అని చెప్పారు శివ. స్పోకెన్ ఇంగ్లిష్, కంప్యూటర్ కోర్సులో చేర్పించారు. తర్వాత అక్కడే బీకెట్ పూర్తిచేశారు. అప్పుడే రాష్ట్ర ‘రామ్‌చరణ్ యువశక్తి’ని ప్రారంభించి, రాష్ట్రమంతా తిరిగి, అన్ని జిల్లాల్లో యువశక్తి విభాగాలను ఆరంభించారు. దీంతో పసుపులేటి శివ, శివ చెర్రీగా స్థిరపడిపోయారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా.. ఈ క్రమంలో రామ్‌చరణ్, అల్లు అర్జున్‌తో సహా మెగా కుటుంబంతో సాన్నిహిత్యం పెరిగింది. ఆడియో ఫంక్షన్లు, టీజర్ల విడుదల సహా అన్ని కార్యక్రమాల్లోనూ తన బాధ్యతలు తప్పనిసరైంది. బయట హీరోలతోనూ సంబంధాలు ఏర్పడ్డాయి. హీరో సందీప్‌కిషన్ ఆహ్వానంపై అతనికి మేనేజరుగా వెళ్లాడు. అదే హీరో వెంకటాద్రి టాకీస్ స్థాపించి, ‘నిను వీడని నీడను నేను’ సినిమాకు శ్రీకారం చుట్టినపుడు, శివ చెర్రీకి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా అవకాశం కల్పించారు. ఆ సినిమా హిట్ కావటంతో రెండోసినిమా ‘తెనాలి రామకృష్ణ బీఏ.,బీఎల్’ చిత్రం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని శివ వెల్లడించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా 20 మంది స్నేహితులకూ ఉపాధి చూపాననీ, ఎప్పటికైనా సొంతంగా ప్రొడక్షన్ సంస్థను స్థాపించాలనేది తన తాజా కలగా శివ చెప్పారు. తెనాలిలో ఏటా వినాయక చవితి వేడుకల్లో పాల్గొనటం శివకు అలవాటు, ఏటా ఒక సినిమా హీరోను ఇక్కడకు తీసుకొస్తున్నారు. ఈసారి సంపూర్ణేష్‌బాబు, విశ్వక్సేన్తో ఇక్కడ చవితి సందడి చేయించారు. తన ఎదుగుదలకు కారణమైన సినిమాకు, మెగా కుటుంబానికి రుణపడి ఉంటానని చెబుతారు శివ. -
అదే నిజమైన విజయం
‘‘రోడ్డు మీద నిలబడితే జనాలు పరిగెడుతూ వచ్చి ‘సినిమా చూశాం. చాలా చాలా బాగుంది. ఫలానా సీన్ బాగుంది. చివర్లో మదర్ సెంటిమెంట్ బాగుంది’ అని చెప్పారు. అదే నిజమైన విజయమని భావిస్తున్నాను. బ్లాక్‌బస్టర్, సూపర్‌హిట్ అనను. దాదాపు రెండేళ్ల తర్వాత మంచి హిట్ సాధించానని చెప్పగలను’’ అని సందీప్ కిషన్ అన్నారు. కార్తీక్ రాజు దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యాసింగ్ కథానాయికగా నటించారు. విజి. సుబ్రహ్మణ్యన్, దయా పన్నెం, సందీప్ కిషన్ నిర్మించిన ఈ చిత్రం అనిల్ సుంకర సమర్పణలో ఈ నెల 12న విడుదలైంది. ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నుంచి ఒక పెద్దావిడ ఫోన్ చేశారు. మా అబ్బాయి లవ్ ఫెయిల్యూర్‌తో మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా 3 నెలల కింద వచ్చి, మా అబ్బాయి చూసి ఉంటే ఆత్మహత్య చేసుకునే ముందు మా గురించి ఆలోచించేవాడేమో అని బాధపడ్డారు. నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. మమ్మల్ని నమ్మి ఈ సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూటర్ సేఫ్ అయ్యారని చెప్పగలను. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన దయా, అనిల్ సుంకరగారు హ్యాపీగా ఉన్నారు’’ అన్నారు. ‘‘చాలామందికి ఇటువంటి కథతో సినిమా చేయడానికి ధైర్యం చాలదు. ఆ ధైర్యం చేసిన సందీప్‌ను మెచ్చుకోవాలి. ఇలాంటి డిఫరెంట్ సినిమాను నిర్మించడానికైనా సందీప్‌లాంటి హార్డ్‌వర్కర్ గెలవాలి’’ అన్నారు తమన్. ‘‘నిర్మాతగా మా తొలి సినిమా ఇది. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు దయా పన్నెం. ‘‘ఈ సినిమా విజయంలో భాగస్వామ్యం కల్పించిన సందీప్ కిషన్‌కి థ్యాంక్స్’’ అన్నారు నిర్మాత సుప్రియ. ‘‘తెలుగు సినీ పరిశ్రమలోకి నాకు మంచి స్వాగతం లభించింది. ప్రేక్షకులు ఎంతో ప్రేమ చూపించారు’’ అన్నారు అన్యా సింగ్. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ తదితరులు పాల్గొన్నారు. -
‘నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు’
సాక్షి, జంగారెడ్డిగూడెం(పశ్చిమ గోదావరి) : మంచి సినిమాని, నిజాయితీగా తీస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘నిను వీడని నీడను నేనే’ చిత్ర నిర్మాత, హీరో సందీప్ కిషన్ అన్నారు. ‘నిను వీడని నీడను నేనే’ చిత్రం విజయోత్సవంలో భాగంగా బుధవారం చిత్ర యూనిట్ జంగారెడ్డిగూడెం వచ్చింది. ఈ సందర్భంగా స్థానిక జెట్టి గురునాథరావు అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం నిర్మాతగా తనకు తొలి చిత్రం అని, ఏడాది గ్యాప్ తరువాత హీరోగా చేశానన్నారు. సినిమా పోస్టర్‌ను చూసి ప్రేక్షకులు హర్రర్ సినిమా అనుకున్నారని, సినిమాలో చాలా సందర్భాల్లో భయపడ్డామని, కాని చివర్లో కన్నీళ్లు వచ్చాయని వారు పేర్కొనడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఆంజనేయస్వామి అంటే చాలా సెంటిమెంట్ అని సందీప్ కిషన్ అన్నారు. మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకున్నానని, ఇకపై ప్రతి సినిమాకు ఇక్కడకు రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తన తర్వాత చిత్రం జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో హన్సిక హీరోయిన్గా ఓ సినిమా చేస్తున్నట్లు చెప్పారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా తర్వాత పూర్తి కామెడీ చిత్రంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. హీరోయిన్ అన్యాసింగ్ మాట్లాడుతూ నిను వీడని నీడను నేనే చిత్ర కథ, కథనం విభిన్నంగా ఉంటాయన్నారు. మరో నిర్మాత దయ పన్నెం మాట్లాడుతూ చిత్రానికి మంచి ఆదరణ వస్తోందన్నారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుప్రియ కంచర్ల మాట్లాడుతూ చిత్రం కొత్త కథ అని, దర్శకుడు కార్తీక్ రాజ్ చిత్రాన్ని చాలా బాగా తీశారన్నారు. చిత్ర బృందానికి మద్దాల ప్రసాద్, వలవల తాతాజీ, మైరెడ్డి పవన్, వసంతాటి మంగరాజు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివచెర్రి, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
అంతకన్నా ఏం కావాలి?
‘‘నిను వీడని నీడను నేనే’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బావుందని చెబుతున్నారు. ఫస్టాఫ్ సూపర్ అని, క్లైమాక్స్‌లో భావోద్వేగ సన్నివేశాలు తమ మనసును కదిలించాయని చెబుతున్నారు’’ అని అన్య సింగ్ అన్నారు. సందీప్ కిషన్, అన్య సింగ్ జంటగా కార్తీక్ రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర సమర్పణలో దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన హీరోయిన్ అన్యసింగ్ పంచుకున్న విశేషాలు... ► మాది ఢిల్లీ. అజ్మీర్‌లోని బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నా. డిగ్రీ కోసం మళ్లీ ఢిల్లీ వచ్చా. పొలిటికల్ సైన్స్, సోషియాలజీ నా సబ్జెక్ట్స్. నిజానికి సైకాలజీ నా ఫేవరెట్ సబ్జెక్ట్. కానీ, సైకాలజీలో డిగ్రీ చేయాలంటే స్ట్రిక్ట్ యూనివర్సిటీకి వెళ్లాలని మానేశా. కాలేజీలో ఉన్నప్పుడు వెడ్డింగ్ ప్లానర్‌తో కలిసి పనిచేశా. చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. అందుకే చదువు పూర్తయిన తర్వాత ముంబై షిఫ్ట్ అయ్యాను. నా తొలి హిందీ సినిమా ‘ఖైదీ బాండ్’ లో నా నటన నచ్చి సందీప్ కిషన్, కార్తీక్ రాజు ఈ సినిమా అవకాశం ఇచ్చారు. ► శుక్రవారం ఉదయం కొంచెం టెన్షన్ పడ్డాను. సుమారు 11 గంటల సమయంలో సినిమా బాలేదని ఎవరో రాస్తే చదివి, నిరాశతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి హోటల్‌కి వెళ్లిపోయా. మధ్యాహ్నం తర్వాత మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత సీతారామ్ ఫోన్ చేసి, సక్సెస్ సెలబ్రేషన్స్‌కి రమ్మని చెప్పారు. సోషల్ మీడియాలో, రివ్యూస్‌లో సినిమా చాలా బాగుందని రాయడంతో సంతోషంగా అనిపించింది. వసూళ్లు బాగున్నాయి. థియేటర్ల సంఖ్యను పెంచుతున్నారు. అంతకన్నా ఏం కావాలి. నేను చాలా సంతోషంగా ఉన్నా. ► సినిమా విడుదలైన రోజు హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించినప్పుడు ప్రేక్షకులు సన్నివేశాల గురించి చెబుతుంటే సంతోషంగా అనిపించింది. ఎక్కువమంది నన్ను గుర్తు పట్టలేదు. సందీప్ కిషన్‌తో సెల్ఫీలు తీసుకోవటానికి పోటీ పడ్డారు. ‘నిను వీడని నీడను నేనే’ సమయంలో క్యాన్సర్ వల్ల మా నాన్నగారు మరణించారు. దాంతో షాక్‌లోకి వెళ్లాను. తర్వాత నెమ్మదిగా కోలుకున్నాను. ► సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి 20 రోజుల ముందు నాకు కథ చెప్పారు. కొంచెం ప్రిపేర్ అయ్యాను. హారర్ సన్నివేశంలో ఈజీగానే నటించా. కానీ, ఎమోషనల్ సన్నివేశాలు చేసేటప్పుడు కష్టపడ్డాను. హారర్ సినిమాలు చూడాలన్నా, చేయాలన్నా భయపడతా. థ్రిల్లర్స్ అంటే ఇష్టం. ► సందీప్ కిషన్‌తో పనిచేయడం సౌకర్యంగా ఉంది. నాకు తెలుగు రాదు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. షూటింగ్లో నాకు డైలాగులు అర్థం కాకపోతే చెప్పేవాడు. కార్తీక్ రాజు కూడా బాగా సహకరించారు. ఈ సినిమాలో నేను సహజంగా నటించానని, సహజ నటి అంటూ ప్రేక్షకులు అంటుంటే సంతోషంగా ఉంది. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు.. పరవాలేదు. ► తెలుగులో కొంతమంది నిర్మాతలు సంప్రదించారు.. అయితే ఇంకా ఏ ప్రాజెక్టు కూడా ఫైనలైజ్ కాలేదు. హిందీలో యష్ రాజ్ ఫిలిమ్స్‌తో మూడు సినిమాల అగ్రిమెంట్ ఉంది. ఒక సినిమా చేశా. త్వరలో మిగతా రెండు చేస్తా. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తర్వాత భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు అన్ని సినిమాలను చూస్తున్నారు. మంచి కథ, పాత్ర లభిస్తే ఏ భాషలోనైనా నటించడానికి సిద్ధమే. -
నలుగురు హీరోలు.. నాలుగు నెలల్లో పూర్తి!
నారా రోహిత్, సందీప్ కిషన్, సుధీర్ బాబు, ఆదీ సాయికుమార్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘శమంతకమణి’. ‘భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. నారా రోహిత్ మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన చిత్రమిది. క్యారెక్టర్ బాగా నచ్చడంతోనే ఈ సినిమా చేశా. నలుగురు హీరోలను ఒక తాటి మీదకు తీసుకొచ్చారు ఆనంద్ ప్రసాద్‌గారు. ‘బాణం, సోలో’ చిత్రాల తర్వాత మణిశర్మ సంగీతంలో చేశాను’’ అన్నారు. ‘‘రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా చాలా కొత్తగా ఉండే కథ ఇది. ఈ చిత్రంలో తల్లిని కోల్పోయిన కొడుకు పాత్ర చేశా. నలుగురు హీరోలతో సినిమా చేయడం ఇబ్బంది అనుకుంటున్న ఈ తరుణంలో దాన్ని సుసాధ్యం చేసిన ఘనత ‘శమంతకమణి’ టీమ్‌ది’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘కార్తిక్ అనే లవబుల్ పాత్ర చేశా. ఈ చిత్రానికి మంచి టీమ్ కుదరడంతో నాలుగు నెలల్లోనే పూర్తి చేయగలిగాం’’ అన్నారు ఆది. ‘‘శ్రీరామ్ ఆదిత్య డిఫరెంట్ కథతో ఈ సినిమా తీశారు. ఈ మల్టీస్టారర్ అన్ని వర్గాలవారికీ నచ్చే విధంగా ఉంటుంది. జూలై 14న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు ఆనంద్ ప్రసాద్. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘నేను తొలిసారి రాసుకున్న కథ ఇది. నలుగురు హీరోలూ నాకు చాలా సపోర్ట్ చేశారు. రాజేంద్రప్రసాద్, సుమన్, తనికెళ్ల భరణి, మణిశర్మ వంటి సీనియర్లతో పనిచేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ఇంద్రజ, చాందినీ చౌదరి, అనన్యా సోని, జెన్ని తదితరులు నటించిన ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి, కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: మణిశర్మ.