
రంజిత్, భరత్ చౌదరి, సందీప్ కిషన్, దివ్యాంశ, రామ్‌మోహన్ రావు
సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రంజిత్ జయకొడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మైఖేల్’. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్‌దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్‌మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నాకు నేను పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష మైఖేల్. మూడుసంవత్సరాల క్రితం ‘మైఖేల్’ వర్క్‌ను స్టార్ట్ చేశాం.
ఈ సినిమా కోసం దాదాపు 24 కేజీల బరువు తగ్గాను. సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు నంబరవన్ అని నంబర్స్ చెబుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది’’ అన్నారు. ‘‘మైఖేల్’ చేసేందుకు ఒప్పుకున్న సందీప్ కిషన్, విజయ్ సేతుపతిలతో పాటు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రంజిత్. ‘‘మైఖేల్’ పట్ల హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు రామ్‌మోహన్ రావు, భరత్ చౌదరి.
Comments
Please login to add a commentAdd a comment