Divyansha Kaushik
-
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ
నిఖిల్ సీనీ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘స్వామిరారా’ ఒక్కటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కేశవ’ కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో చిత్రమే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. హ్యాట్రిక్ మూవీ అంటే మంచి హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం వస్తుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. చిత్రబృందం కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. చడీ చప్పుడు లేకుండా నేడు(నవంబర్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చినీ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రిషి(నిఖిల్) ఇండియాలో ఉన్నప్పుడు తార(రుక్మిణి వసంత్)ని చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాడు. స్నేహితుడు బయాజ్(వైవా హర్ష) చేసిన ఓ మిస్టేక్ కారణంగా అతన్ని ప్రేమ విఫలం అవుతుంది. దీంతో రిషి లండన్ వెళ్లిపోతాడు. అక్కడ తులసి(దివ్యాంశ కౌశిక్)తో పరిచయం ఏర్పడి,అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని గుడికి వెళ్తారు. సరిగ్గా పెళ్లి సమయానికి తులసి కనిపించకుండా పోతుంది. అసలు తులసి ఎవరు? ఆమె ఎక్కడికి వెళ్లింది? తార లండన్ ఎందుకు వచ్చింది? లోకల్ డాన్ బద్రీనారాయణ(జాన్ విజయ్) రిషిని ఎందుకు వెంబడించాడు? బద్రీ అనుచరుడు మున్నా(అజయ్)కి తులసికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తారతో రిషి ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు రిషి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘కార్తికేయ 2’తో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. అలాంటి హీరో నుంచి ఓ కొత్త సినిమా వస్తుందంటే సహజంగానే భారీ హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం విషయంలో అది ముందు నుంచి జరగలేదు. అసలు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌తో ఓ సినిమా వస్తుందనే విషయం కానీ, అందులో నిఖిల్ హీరోగా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. పైగా చిత్రబృందం కూడా పెద్దగా ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాలను వదిలారు. దీన్ని బట్టే సినిమాపై మేకర్స్‌కి కూడా నమ్మకం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకుడు కూడా అదే ఫీల్ అవుతాడు. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కొత్త విషయం ఒక్కటైనా ఉందా అని బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఆసక్తి గొలిపే సంఘటన కానీ, మలుపు తిప్పే ట్విస్టులు కానీ, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కానీ లేకుండా దర్శకుడు చాలా ‘జాగ్రత్తగా’కథనాన్ని నడిపించాడు.రొటీన్ లవ్‌స్టోరీకి క్రైమ్ థ్రిల్లర్‌ని జోడించి ఓ డిఫరెంట్ స్టోరీని చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అయితే అది తెరపై చూస్తే మాత్రం దర్శకుడు కొత్తగా ఏం చెప్పాలనుకునే విషయం మాత్రం అర్థం కాదు. నిఖిల్ సినిమా కదా కనీసం ఒక్కటి రెండు సీన్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయేమో అని ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. సినిమా ప్రారంభం అయినా పది నిమిషాలకే ఇది రోటీన్ స్టోరీ అని అర్థం అయిపోతుంది. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడు ఈజీగా పసిగట్టగలడు. ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ అంటూ కథను ముందు , వెనక్కి తిప్పుతూ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారిందే తప్పా ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది.సత్య, సుదర్శన్ పాత్రలతో ఓ ప్రత్యేక ట్రాక్‌ని నడిపిస్తూ కథను చెప్పించారు. అందులో ఆరు నెలలు వెనక్కి వెళ్లడం, మళ్లీ రెండేళ్ల క్రితం జరిగిన స్టోరీ చెప్పడం.. గందరగోళానికి గురి చేసిందే తప్ప ప్రేక్షకుడిని కథలో లీనం చేయలేకపోయింది. మధ్య మధ్య వచ్చే పాటలు, యాక్షన్ సీన్స్ అన్ని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇక సెండాఫ్లో కథనం చాలా సింపుల్‌గా సాగుతుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కార్తిక్ పాత్రలో నిఖిల్ చక్కగా నటించాడు.అయితే ఈ కథను ఆయన ఎలా ఒప్పుకున్నాడనేదే అర్థం కాదు. తార పాత్రకి రుక్మిణీ న్యాయం చేసింది. అయితే నటించగానికి పెద్ద స్కోప్‌లేని పాత్ర ఆమెది. ఇక దివ్యాంశ కౌశిక్‌కి ఓ మంచి పాత్ర లభించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న తులసి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. హర్ష కామెడీ అంతగా పండలేదు. సత్య, సుదర్శన్ సినిమాలో ఉన్నారే కానీ.. వారి స్థాయిలో నవ్వించలేకపోయారు. జాన్ విజయ్, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తీక్ పాటలు, సన్నీ ఎం.ఆర్ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
చీర కట్టుతో మతి పోగొడుతున్న.. ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర ఎంతంటే..
'మజిలీ’ తో మొదలుపెట్టిన దివ్యాన్ష కౌశిక్.. అనతికాలంలోనే ఎంతోమంది మదిని దోచి అంతులేని అభివనాన్ని సొంతం చేసుకుంది. తాను అనుకోకుండా నటిగా మారాను. లేకుంటే ఫ్యాషన్ జర్నలిస్ట్‌గా .. ఏదైనా ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్ని కావాలి అనే లక్ష్యంతో ఉండేదాన్ని అని చెబుతోంది దివ్యాన్ష. మరి ఆమె మదిని దోచిన ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. అనుకోకుండా నటిగా మారాను. లేకుంటే ఫ్యాషన్ జర్నలిస్ట్‌గా .. ఏదైనా ఫ్యాషన్ మ్యాగజైన్‌కి ఎడిటర్ని కావాలి అనే లక్ష్యంతో ఉండేదాన్ని. దిల్నాజ్.. ముంబైకి చెందిన దిల్నాజ్ కర్బరీ.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియానీ వద్ద దాదాపు పదిహేనేళ్ల పాటు కోచర్ డిజైన్ హెడ్‌గా పనిచేసింది. ఫ్యాషన్‌పై ప్రావీణ్యం, పట్టు రెండ ఉండటంతో 2009లో తన పేరు మీదనే ముంబైలో ‘దిల్నాజ్’ ఫ్యాషన్ హౌస్‌ని ప్రారంభించింది. వైబ్రెంట్ కలర్స్.. డిజైన్స్‌కి ఈ బ్రాండ్ పెట్టింది పేరు. గ్రాండ్ లుక్‌నిచ్చే దిల్నాజ్ బ్రాండ్ దుస్తులు సెలబ్రిటీలను సైతం మెప్పిస్తున్నాయి. ధర కాస్త ఎక్కువే! ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇక దివ్వాన్ష కౌశిక్ కోసం దిల్నాజ్ డిజైన్ చేసిన చీర బ్రాండ్ ధర రూ. 59,900/- దివ్యాన్ష కౌశిక్జ్యూలరీ బ్రాండ్: జతిన్ మోర్ జ్యూయల్స్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. జతిన్ మోర్.. అతిప్రాచీన, ప్రసిద్ధ జ్యూలరీ బ్రాండ్స్‌లో ఒకటి జతిన్ మోర్ జ్యూయల్స్. 1891లో ఆనంద్ మోర్ ప్రారంభింన వ్యాపారాన్ని.. ప్రస్తుతం వారి నాలుగోతరం వారసుడు జతిన్ మోర్.. ‘జతిన్ మోర్ జ్యూయల్స్’ పేరుతో కొనసాగిస్తున్నాడు. సంస్కృతి, సంప్రదాయ, హస్తకళల సారాన్ని ఆధునిక డిజైన్స్‌లో వర్ణింనట్టుంటాయి ఈ ఆభరణాలు. అదే వీరి బ్రాండ్ వాల్య! ధర ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. పలు ప్రముఖ నగరాలతోపాటు ఆన్‌లైన్‌లోన లభ్యం. దివ్యాన్ష కౌశిక్ -దీపిక కొండి -
ఫ్యామిలీస్టార్ సినిమాలో హీరోయిన్గా లక్కీ చాన్స్?
‘గీత గోవిందం’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే కథ రీత్యా ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు చోటు ఉందని, దీంతో ఈ పాత్రకు దివ్యాంశ కౌశిక్‌ను చిత్రయూనిట్ సెలక్ట్ చేసుకున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదే నిజమైతే దివ్యాంశకు మరో లక్కీ చాన్స్ దక్కినట్లేనని సినిమా ప్రేమికులు చెప్పుకుంటున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఫ్యామిలీస్టార్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
టక్కర్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ గ్లామర్ షో (ఫోటోలు)
-
నా టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది
‘‘నేనో సినిమా తీయాలనుకుంటే ఆ సినిమాను తీసేంత స్వేచ్ఛ నాకు కావాలి. ఇదే నా డ్రీమ్. తమిళంలో నేను చేయగలుగుతున్నాను. కానీ తెలుగులో నాకు అంతగా సపోర్ట్ లభించలేదు. అయినా తెలుగు ఆడియన్స్‌కు, నాకు ఫుల్స్టాప్ కాదు కదా.. చిన్న కామా కూడా పడలేదు.. తెలుగు ప్రేక్షకులకు నాకు మధ్యలో ఉన్నది చిన్న టైమ్ గ్యాప్ మాత్రమే. ఇప్పుడు ‘టక్కర్’తో టైమ్ కలిసొచ్చినట్లుగా నాకు అనిపిస్తోంది’’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా విలేకరుల సమావేశంలో సిద్ధార్థ్ చెప్పిన విశేషాలు. ► ధనవంతుణ్ణి కావాలనే లక్ష్యంతో సిటీకి వస్తాడు ఓ కుర్రాడు. అయితే అన్నీ అతని ఊహలకు వ్యతిరేకంగా జరుగుతుంటే ఏం చేస్తాడు? ఎవరితో అతను ఘర్షణ పడాల్సి వస్తుంది? అన్నదే ‘టక్కర్’ కథాంశం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. హీరో, హీరోయిన్ రిలేషన్‌షిప్‌లోనూ చాలా షేడ్స్ ఉంటాయి. డబ్బు, అహం, లింగబేధం, వయసు.. ఇలాంటి అంశాలు కథలో చర్చకు వస్తాయి. కార్తీక్ క్రిష్ ఈ సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. ► లవ్‌స్టోరీస్ సినిమాల గురించి చర్చకు వస్తే.. వాటిలో ‘బొమ్మరిల్లు’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా!’ సినిమాలు కచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా నాకు లవ్‌స్టోరీ చెబితే, దాదాపు నో చెబుతాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక లవ్‌స్టోరీ సినిమా చేసి, అది హిట్ అయితే నాకు మళ్లీ ఓ పదేళ్ల పాటు లవ్‌స్టోరీలే వస్తాయి. నేను లవ్‌స్టోరీస్ మాత్రమే చేయడానికి ఇండస్ట్రీకి రాలేదు. యాక్టర్‌గా డిఫరెంట్ సినిమాలు చేయాలి. ► రచయితగా ‘గృహం’ ఫ్రాంచైజీకి కథలు రెడీ చేస్తున్నాను. మా ప్రొడక్షన్ హౌస్‌లో కొత్తవారితో సినిమాలు నిర్మిస్తున్నాం. భవిష్యత్‌లో దర్శకత్వం చేస్తాను. ‘బొమ్మరిల్లు 2’ ఆలోచన ఉంది. కానీ అది పెద్ద చాలెంజ్‌తో కూడుకున్న పని.. చూడాలి. ► యాక్టర్‌గా నేను మంచి ఫామ్‌లోకి వచ్చిన ఫీలింగ్ ఇప్పుడు కలుగుతోంది. మళ్లీ తెలుగులో నా టైమ్ స్టార్ట్ అయినట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం ‘ఇండియన్ 2’లో కీలక పాత్ర, ‘ది టెస్ట్’లో ఓ లీడ్ రోల్, ‘చిన్నా’ సినిమా చేస్తున్నాను. ఓ స్ట్రయిట్ లవ్‌స్టోరీ ఫిల్మ్ షూటింగ్ పూర్తి కావొచ్చింది. కార్తీక్ క్రిష్‌తో మరో సినిమా చేయనున్నాను. ► మీకు ఇంకా మ్యారేజ్ చేసుకునే ఏజ్ రాలేదంటారా? అని ఓ విలేకరి అడగ్గా... ‘మ్యారేజ్ చేసుకునే ఏజ్ నాకు వచ్చినప్పుడు.. ఆ పెళ్లి భోజనం తింటున్నప్పుడు మీకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ పెళ్లి భోజనం నాకు గొంతు దిగడం లేదు. సో.. దానికి ఓ టైమ్ ఉంది. డైరెక్షన్ నా డ్రీమ్. నా మ్యారేజ్ నా పేరెంట్స్ డ్రీమ్. నా పెళ్లి, రిలేషన్షిప్స్ గురించి వార్తలు వచ్చాయంటే అవి రాసిన వారిని అడగాలి’’ అని అన్నారు సిద్ధార్థ్. -
ఈ మూడు కారణాల వల్లే తెలుగులో రిలీజ్ అవుతున్న టక్కర్
‘‘తెలుగు కవిత్వం చదివి, చూసి అది నా లోపలకి వెళ్లిపోయింది. సో.. నేను చెప్పినా... చెప్పకపోయినా.. తెలుగు బిడ్డనే’’ అని సిద్ధార్థ్ అన్నారు. సిద్ధార్థ్ హీరోగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘టక్కర్’. ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ హీరోయిన్గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘టక్కర్’ ఒక యాక్షన్ ఫిల్మ్. న్యూ ఏజ్ లవ్‌స్టోరీ కూడా ఉంటుంది. కొంతకాలం తర్వాత నేను చేసిన కమర్షియల్ సినిమా ఇది’’ అన్నారు. ‘‘మా గురువుగారు శంకర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ, మీ హీరో సిద్ధార్థ్, దివ్యాంశ... ఈ మూడు కారణాల వల్లే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అన్నారు కార్తీక్ జి. క్రిష్. ‘‘టక్కర్’ విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్. ‘‘విశ్వప్రసాద్, వివేక్గార్లు నాకు మంచి మిత్రులు. ‘టక్కర్’ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు. ఈ వేడుకలో దర్శకులు ‘బొమ్మరిల్లు’ భాస్కర్, తరుణ్ భాస్కర్, వెంకటేశ్ మహా తదితరులు పాల్గొన్నారు. -
ఒక వర్ణం చేరెలే...
‘రెయిన్ బో చివరే.. ఒక వర్ణం చేరెలే...’ అంటూ కారులో వెళుతూ, దారిలో కలిసినవారితో సరదాగా గడుపుతూ పాడుకుంటున్నారు సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘టక్కర్’ చిత్రంలో పాట ఇది. సినిమాలో వచ్చే ఈ నాలుగో పాట వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు. చిత్ర సంగీతదర్శకుడు నివాస్ కె. ప్రసన్న స్వరపరచిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. బెన్నీ దయాల్, వృషబాబు పాడారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘‘ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. -
అలాంటి వారికి సమాధానమే టక్కర్
‘‘మీరెప్పుడూ లవర్ బోయ్ పాత్రలు చేస్తుంటారు. కంప్లీట్ కమర్షియల్ సినిమా చేయొచ్చు కదా?’ అని చాలామంది నన్ను ప్రశ్నిస్తుంటారు.. వారికి సమాధానమే ‘టక్కర్’. ఫుల్ యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్‌తో ఈ ప్రేమకథ నడుస్తుంది’’ అన్నారు సిద్ధార్థ్. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ జంటగా నటించిన చిత్రం ‘టక్కర్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ– ‘‘బాయ్స్’తో హీరోగా ఎంట్రీ ఇచ్చా. ఈ ఆగస్టుకి హీరోగా 20 ఏళ్ల కెరీర్ పూర్తవుతుంది. ఇప్పటికీ నా చేతిలో అరడజను సినిమాలు ఉండటం హ్యాపీ’’ అన్నారు. ‘‘టక్కర్’ న్యూ జనరేషన్ సినిమా. ఇందులో సిద్ధార్థ్‌ని రగ్డ్ లవర్ బోయ్‌గా చూస్తారు ’’ అన్నారు కార్తీక్ జి. క్రిష్. ‘‘ఈ సినిమాతో మళ్లీ పాత సిద్ధార్థ్‌ని చూస్తాం’’ అన్నారు చిత్ర సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. -
మజిలీ బ్యూటీతో హీరో సిద్ధార్థ్.. రిలీజ్ డేట్ ఆరోజే
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన సిద్ధార్థ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యాంశా కౌశిక్ కథానాయికగా నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘సాధారణంగా సిద్ధార్థ్ సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ‘టక్కర్’లో ప్రేమ సన్నివేశాలతో పాటు అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ సినివ కోసం సిద్ధార్థ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధించి, తన కెరీర్లో మరో గుర్తుండిపోయే సినిమాస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. చదవండి: సుడిగాలి సుధీర్ సరసన దివ్యభారతి.. కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఈ చిత్రాన్ని జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘‘సాధారణంగా సిద్ధార్థ్ సినిమాల్లో ప్రేమ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ‘టక్కర్’లో ప్రేమ సన్నివేశాలతో ΄పాటు అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఈ సినిమా కోసం సిద్ధార్థ్ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధించి, తన కెరీర్లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: నివాస్ కె. ప్రసన్న, కెమెరా: వాంనాథన్ మురుగేశన్, సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. చదవండి: ఆ డైలాగ్స్ వింటే చాలు.. పూనకాలు పుట్టుకొచ్చేస్తాయి! -
కయ్యాలే...కయ్యాలే
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ‘కయ్యాలే...కయ్యాలే’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నివాస్ కె. ప్రసన్న సంగీత సారథ్యంలో కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను నిరంజన్ రామనన్ ఆలపించారు. ఈ సినిమాకు సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. -
'లవ్ అంటేనే ఇష్టం లేదంటోన్న హీరోయిన్'.. ఆసక్తిగా టీజర్
‘నేనంటే ఇష్టం లేదా’ అని అబ్బాయి అంటే... ‘లవ్ అంటేనే ఇష్టం లేదు’ అని అంటుంది అమ్మాయి. ఈ ఇద్దరి కథ ఏంటనేది ‘టక్కర్’లో తెలుస్తుంది. సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘టక్కర్’. సోమవారం సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ పైన పేర్కొన్న సంభాషణలతో సాగుతుంది. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ తెలుగులో విడుదల చేస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం మే 26న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: నివాస్ కె. ప్రసన్న, కెమెరా: వాంచినాథన్ మురుగేశన్. -
Michael Movie Review: మైఖేల్ మూవీ రివ్యూ
టైటిల్: మైఖేల్ నటీనటులు: సందీప్ కిషన్, దివ్యాంశ కౌషిక్, విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్,అనసూయ తదితరులు నిర్మాతలు: భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు సమర్పణ: నారాయణ్ దాస్ కె. నారంగ్ దర్శకత్వం: రంజిత్ జయకొడి సంగీతం: శ్యామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్ విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023 కథేంటంటే.. మైఖేల్(సందీప్ కిషన్) చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అనాథలా పెరుగుతాడు. పదేళ్ల వయసులో ముంబైలోనే అతి పెద్ద డాన్‌గా చలామణి అవుతున్న గురునాథ్(గౌతమ్ మీనన్)కు దగ్గరవుతాడు. రెండు సార్లు అతని ప్రాణాలు కాపాడడంతో మైఖేల్‌ని తన ప్రధాన అనుచరుడిగా నియమించుకుంటాడు. అయితే ఇది గురునాథ్ భార్య చారు(అనసూయ), కొడుకు అమర్ నాథ్(వరుణ్ సందేశ్)కు నచ్చదు. కొడుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కోపం ఇద్దరికీ ఉంటుంది. మరోవైపు తనపై దాడి చేసిన ఆరుగురిలో ఐదుగురిని దారుణంగా చంపేస్తాడు గురునాథ్. మిగిలిన ఒక్కడు ఢిల్లీలో ఉన్నట్లు తెలుసుకొని అతన్ని చంపే బాధ్యత మైఖేల్‌కి ఇస్తాడు. ఢిల్లీ వెళ్లి మైఖేల్ ..అక్కడ తీర(దివ్యాంశ కౌశిక్)తో ప్రేమలో పడతాడు. అసలు తీర ఎవరు? గురునాథ్‌ని చంపడానికి ప్లాన్ చేసిన ఆరో వ్యక్తి ఎవరు? బాస్ అప్పగించిన పనిని మైఖేల్ పూర్తి చేశాడా లేదా? గురునాథ్‌కు, మైఖేల్‌కు ఉన్న సంబంధం ఏంటి? ఈ కథలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీల పాత్ర ఏంటి అనేది తెరపై చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అనాథలా పెరిగే ఓ కుర్రాడు ఓ పెద్ద డాన్ని దగ్గరవ్వడం... ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఒకనొక దశలో అతనికే ఎదురు తిరుగుతాడు. తర్వాత ఒక ఫ్లాష్ బ్యాక్.. చివర్లో ఓ ట్విస్ట్... ఈ తరహా కథలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమి కాదు. ఇదే కాన్సెఫ్ట్‌కి మదర్ సెంటిమెంట్ జోడించి తెరకెక్కించిన కేజీయఫ్ చిత్రం రికార్డులు సృష్టించింది. బహుశా ఈ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకొనే మైఖేల్ కథను అల్లుకున్నాడేమో దర్శకుడు రంజిత్ జయకొడి. కేజీయఫ్ తరహాలోనే హీరో గురించి ఓ వ్యక్తి వాయిస్ ఓవర్ ఇవ్వడం.. పెద్ద పెద్ద డైలాగ్స్..ఎలివేషన్స్‌తో సినిమాను ప్రారంభించాడు. అయితే ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నా.. కేజీయఫ్ తరహాలో తెరపై పండలేదు. పైగా అతి చేశారనే భావనే కలుగుతుంది తప్పా.. ఎక్కడా వావ్ మూమెంట్స్ ఉండవు. సినిమా చూసినంత సేపు కేజీయఫ్, పంజా, బాలు చిత్రాల తాలుకు సీన్స్ గుర్తుకు వస్తాయి. కథ, కథనంలో కొత్తదనం ఉండదు. రెట్రో స్టైల్లో సినిమాను తెరకెక్కించారు. విజువల్స్ పరంగా, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించే సందర్భంలోనూ దర్శకుడు హ్యండిల్ చేసిన పద్ధతి ఆకట్టుకుంటుంది. విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి స్టార్స్‌ని సరిగా వాడుకోలేకపోయారు. సినిమా నిడివి కూడా ఎక్కువైన ఫీలింగ్ ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఇష్టపడేవారికి మైఖేల్ నచ్చే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే.. మైఖేల్ పాత్ర కోసం సందీప్ చాలా కష్టపడ్డాడు. ఆ కష్టమంతా తెరపై కనపడింది. మైఖేల్ పాత్రకు సందీప్ కిషన్ సాధ్యం అయినంత వరకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లో ఆకట్టుకున్నాడు. నటుడిగా సందీప్ కిషన్‌ని ఒక మెట్టు ఎక్కించే సినిమా ఇది. ఇందులో గౌతమ్ మీనన్ చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించాడు. గ్యాంగ్‌స్టర్ గురునాథ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తీర పాత్రకు దివ్యాంశ కౌశిక్ న్యాయం చేసింది. నెగిటివ్ షేడ్ ఉన్న అమర్నాథ్ పాత్రలో వరుణ్ సందేశ్ తనలోని మరో కోణాన్ని చూపించాడు.సెకండాఫ్‌లో వచ్చే విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. గురునాథ్ భార్య చారుగా అనసూయ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. శ్యామ్ సీఎస్ సంగీతం పర్వాలేదు. కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘మైఖేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ : రెడ్ డ్రెస్ లో మెరిసిన హీరోయిన్ దివ్యాంశా కౌశిక్ (ఫొటోలు)
-
మజిలీ బ్యూటీతో నాగచైతన్య పెళ్లా? హీరోయిన్ ఏమందంటే..
సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య పర్సనల్ లైఫ్‌కు సంబంధించి తరుచూ గాసిప్స్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. శోభిత దూళిపాళతో చై డేటింగ్ రూమర్స్ అప్పట్లో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. ఆ మధ్య మజిలీ బ్యూటీ దివ్యాంశ కౌశిక్‌తోనూ చై ప్రేమలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగింది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనే టాక్ వినిపించింది. అంతేకాదు మజిలీ తర్వాత రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో దివ్యాంశకు హీరోయిన్గా ఛాన్స్ రావడానికి కూడా నాగ చైతన్యనే కారణమని, ఆయనే దివ్యాంశ పేరును రికమెండ్ చేసినట్లు గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్‌పై స్వయంగా దివ్యాంశ క్లారిటీ ఇచ్చింది. రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఐ లవ్ నాగచైతన్య. చూడటానికి చాలా బాగుంటాడు. అతనిపై నాకు క్రష్ ఉంది. కానీ మేం పెళ్లి చేసుకోబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. రామారావు ఆన్ డ్యూటీలో నాకు ఛాన్స్ రావడానికి చై కారణమంటూ వచ్చిన రూమర్స్‌లో కూడా నిజం లేదు' అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ. -
సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ అప్పుడే!
సందీప్ కిషన్, దివ్యాంశా కౌశిక్ ‘నువ్వుంటే చాలు...’ అని ప్రేమ పాట పాడుకున్నారు. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘మైఖేల్’ చిత్రంలోని పాట ఇది. సినిమాలోని ఈ తొలి పాటను ఈ 28న విడుదల చేయనున్నారు. ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించి, పాటలోని ఓ పోస్టర్ని చిత్రబృందం విడుదల చేసింది. రంజిత్ జయకొడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పితో కలిసి డిస్ట్రిబ్యూటర్ భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రానికి నారాయణ్ దాస్ కె. నారంగ్ సమర్పకులు. ‘‘సందీప్ కిషన్‌కి తొలి పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ సినిమా కోసం సందీప్ అద్భుతంగా మేకోవర్ అయ్యారు. సామ్ సీఎస్ మంచి పాటలు ఇచ్చారు. రొమాంటిక్ సాంగ్ ‘నువ్వుంటే చాలు..’ని తెలుగు, తమిళ భాషల్లో ఈ 28న విడుదల చేయనున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాతలు తెలిపారు. డైరెక్టర్ గౌతమ్ మీనన్ విలన్‌గా నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్‌కుమార్, వరుణ్ సందేశ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి కెమెరా: కిరణ్ కౌశిక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్: కె. సాంబశివరావు. -
కాలర్ ఎగరేసుకునే సమయం ఇది
సందీప్ కిషన్ హీరోగా, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రంజిత్ జయకొడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మైఖేల్’. దివ్యాంశా కౌశిక్ హీరోయిన్. నారాయణ్‌దాస్ కె.నారంగ్ సమర్పణలో భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ–‘‘నాకు నేను పెట్టుకున్న అతి పెద్ద పరీక్ష మైఖేల్. మూడుసంవత్సరాల క్రితం ‘మైఖేల్’ వర్క్‌ను స్టార్ట్ చేశాం. ఈ సినిమా కోసం దాదాపు 24 కేజీల బరువు తగ్గాను. సినిమాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకులు నంబరవన్ అని నంబర్స్ చెబుతున్నాయి. తెలుగు ఇండస్ట్రీ కాలర్ ఎగరేసుకునే సమయం ఇది’’ అన్నారు. ‘‘మైఖేల్’ చేసేందుకు ఒప్పుకున్న సందీప్ కిషన్, విజయ్ సేతుపతిలతో పాటు నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు రంజిత్. ‘‘మైఖేల్’ పట్ల హ్యాపీగా ఉన్నాం’’ అన్నారు రామ్మోహన్ రావు, భరత్ చౌదరి. -
రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ
టైటిల్ : రామారావు ఆన్ డ్యూటీ నటీనటులు : రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్, వేణు తొట్టెంపూడి తదితరులు నిర్మాణ సంస్థ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మాత: సుధాకర్ చెరుకూరి దర్శకత్వం: శరత్ మండవ సంగీతం : సామ్ సీఎస్ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ఎడిటర్: ప్రవీణ్ కేఎల్ విడుదల తేది: జులై 29, 2022 మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. ‘క్రాక్’తర్వాత రవితేజ ఖాతాలో బిగ్ హిట్ పడిందే లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఖిలాడి’ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేకపోయింది. ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రవితేజ. తన స్టయిల్ని పక్కన పెట్టి, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్ చేయడంతో ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది.భారీ అంచనాల ఈ శుక్రవారం(జులై 29) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రామరావు ఆన్ డ్యూటీ’ని ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమా రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. ఈ సినిమా కథంతా 1993-94 ప్రాంతంలో జరుగుతుంది. రామారావు(రవితేజ) ఓ సిన్సియర్ డిప్యూటీ కలెక్టర్. కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అవుతాడు. కోర్టు తీర్పుతో చిత్తూరు జిల్లాలోని తన సొంత ప్రాంతానికి ఎమ్మార్వోగా నియమించబడతాడు. అక్కడి ప్రజలను సమస్యలను తనదైన స్టైల్లో తీర్చుతుంటాడు. తను ప్రేమించిన యువతి మాలిని(రజిషా విజయన్)భర్త సురేంద్ర అనుమానస్పదంగా మిస్ అయినట్లు తెలుసుకొని విచారణ మొదలు పెడతాడు. రామారావు ఇన్వెస్టిగేషన్లో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. సురేంద్ర మాదిరే ఆ ప్రాంతానికి చెందిన మరో 20 మంది మిస్ అయినట్లు తెలుస్తుంది. దీని వెనక గంధపు చెక్కల స్మగ్లింగ్ ఉన్నట్లు గుర్తిస్తాడు. అసలు గంధపు చెక్కల స్మగ్లింగ్‌కు ఈ 20 మందికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? జిల్లాలో విచ్చలవిడిగా సాగుతున్న గంధపు చెక్కల స్మగ్లింగ్ వెనుక ఎవరు ఉన్నారు? ఒక ఎమ్మార్వోగా తనకు ఉన్న అధికారంతో రామారావు ఈ కేసును ఎలా ఛేదించాడు? ఈ క్రమంలో రామారావుకు ఎదురైన సమస్యలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 1993 లో జరిగిన కొన్ని యధార్ధ సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు శరత్ మండవ. ఇదొక ఎమోషనల్ ఇన్వెస్ట్ గేటివ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. సినిమా ప్రారంభం నుండే ట్విస్ట్ లు మొదలవుతాయి. అడవిలో కప్పిపుచ్చిన ఓ శవం భారీ వర్షానికి బయటకు కనిపిస్తుంటే.. ఓ ముసలాయన ఆ శవం చేతులు నరికేయడంతో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత రామారావు ఎంట్రీ.. ఆయన గొప్పతనం, నిజాయితీ, వృత్తిపట్ల ఆయనకు ఉన్న నిబద్దత తదితర అంశాలను చూపిస్తూ.. హీరో ఎలివేషన్లకి ఎక్కువ సమయం తీసుకున్నాడు దర్శకుడు. ఇక్కడ సినిమా కాస్త నెమ్మెదిగా సాగినట్లు అనిపిస్తుంది. రామారావు మాజీ ప్రియురాలు మాలిని భర్త సురేంద్ర కేసు విచారణ చేపట్టినప్పటి నుంచి కథలో వేగం పెరుగుతుంది. ఈ మిస్సింగ్ కేసుకు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధం ఉందని తెలుసుకోవడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌ని కాస్త ఎమోషనల్ థ్రిల్లర్‌గా మలిచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. రామారావు తండ్రి(నాజర్) హత్య, దాని వెనక ఓ గ్యాంగ్ ఉండడం తదితర అంశాలను ఇంట్రెస్టింగ్ చూపించాడు. అయితే కొన్ని రీపీటెడ్ సీన్స్ వల్ల సెకండాఫ్ కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. పార్ట్ 2 కోసం దర్శకుడు కొన్ని సీన్లను కావాలనే యాడ్ చేశారనే ఫిలీంగ్ కలుగుతుంది. గంధపు స్మగ్లింగ్ మాఫియా లీడర్ విరాజ్‌తో రామారావు యుద్దం పార్ట్2లో ఉండబోతుంది. ఎవరెలా చేశారంటే.. మాములుగా రవితేజ సినిమాలలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్ మ్యాన్ షో నడిచింది. ఎమ్మార్వో రామారావు పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. పోలీసులకు మాత్రమే కాదు ఎమ్మార్వోకు కూడా ఇన్ని అధికారాలు ఉంటాయా? అనేలా ఆయన పాత్ర ఉంటుంది. రొమాన్స్(పాటలతో మాత్రమే)తో పాటు యాక్షన్ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక చాలా కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన వేణుతొట్టంపూడి ఎస్సైగా తన పాత్రకు న్యాయం చేశాడు. ఆయన పాత్రకి ఆయనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం కాస్త మైనస్. రామారావు భార్య నందిని పాత్రలో దివ్యాంశ కౌశిక్ ఒదిగిపోయింది. సాధారణ గృహిణిగా చీరకట్టులో తెరపై అందంగా కనిపించింది. రామారావు మాజీ ప్రియురాలు మాలినిగా రజిషా విజయన్ ఉన్నంతలో బాగానే నటించింది. కథని మలుపు తిప్పే పాత్ర ఆమెది. నాజర్, నరేశ్, ప్రగతి, రాహుల్ రామకృష్ణ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమాకు చాలా ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎటిటర్ ప్రవీణ్ కేఎల్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. యంగ్ డైరెక్టర్ శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాను పెంచేశాయి. ఈ సారి రవితేజ కొంచెం కొత్త ప్రయత్నించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తనదైన స్టైల్లో మాస్ డైలాగ్స్‌తో ట్రైలర్ వదలడంతో ‘రామారావు ఆన్ డ్యూటీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 29) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల రామారావు డ్యూటీ ఎక్కేశాడు. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #RamaRaoOnDuty #RamaRaoOnDutyFromJuly29th #RamaRaoOnDutyFromTomorrow Blockbuster comeback for ravanna Awesome movie Mainly mass scenes vere level Introduction scene Pre intervel scene Climax scene goose bumbs Songs 💙 Bgm 🔥🔥🔥 Overall rating 3.25/5 pic.twitter.com/BJaalgSfob — vallepu_raghavendra (@vallepuraghav) July 29, 2022 రవితేజకు భారీ హిట్ లభించిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని , క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. మరికొంత మంది ఏమో రామారావు ఆన్ డ్యూటీ యావరేజ్ మూవీ అంటున్నారు. #RamaRaoOnDuty Review: An Above Average Thriller Drama ✌️#RaviTeja performs well in his usual swag 👍 Casting Is Decent 👍 Music is OK but BGM works ✌️ Action Scenes are very good 👍 Decent Story but underwhelming execution 🙏 Rating: ⭐⭐⭐/5#RamaRaoOnDutyReview pic.twitter.com/4uLZVjZEvx — Kumar Swayam (@KumarSwayam3) July 29, 2022 రవితేజ యాక్టింగ్ బాగుందని, పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇంట్రడక్షన్ డీసెంట్‌గానే ఉందని, ఫస్టాఫ్ వరకు కథలో కొత్తదనం ఏం కనిపించడం లేదంటున్నారు. @RaviTeja_offl sir, #RamaRaoOnDuty movie chusanu. Chala bagundi from NJ, USA. — Abhishek (@abhiabhi799) July 29, 2022 #RamaRaoOnDuty Review FIRST HALF: A Decent One 👍#RaviTeja is in his elements & looks perfect ✌️ Songs are average but BGM is Terrific 👏 Production Values Looks Good 👍 Second Half is the key 🙏#RamaRaoOnDutyReview #DivyanshaKaushik #RamaRaoOnDuty — Fancy Motion Pictures (@Fancymotionpic) July 29, 2022 US distrubutor Rating: ⭐️⭐️⭐️2.5/5#RamaRaoOnDutyReview #SarathMandava has picked up the MASSIEST TALE and showcased it on the SILVER screen with his GRAND VISION of presenting #RaviTeja in a massy avatar. #RamaRaoOnDuty reminds you of the olden days. pic.twitter.com/SE0kKP8goB — Praveen Chowdary Kasindala (@PKasindala) July 27, 2022 #RamaRaoOnDuty 1st half way too good...superb interval bang....@RaviTeja_offl in completely mass avatar — Mahesh (@Urkrishh) July 29, 2022 -
Ramarao On Duty Stills: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
దివ్యాంశ కౌశిక్ మెస్మరైజింగ్ స్టిల్స్ (ఫొటోలు)
-
రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’ప్రీ రిలీజ్ వేడుక (ఫోటోలు)
-
ప్రతి జనరేషన్లో ఒకడుంటాడు – నాని
‘‘రామారావు: ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రవితేజ అన్న గురించి మాట్లాడొచ్చని వచ్చాను. రవి అన్నకు చిరంజీవిగారంటే చాలా ఇష్టం. రవి అన్న కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవిగారిని ఎలా స్ఫూర్తిగా తీసుకున్నారో... మేం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు రవి అన్నగారు మాకు అది. ప్రతి జనరేషన్‌కు ఒకడుంటాడు. నేను అయ్యాను కదరా.. నువ్వెందుకు కాలేవు అనే ధైర్యం ఇచ్చేవాడు ఒకడుంటాడు. అది మా అందరికీ అప్‌కమింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రవి అన్న. చిరంజీవిగారితో రవితేజ అన్న సినిమా చేస్తున్నారు. అలా నాకూ రవితేజ అన్నతో సినిమా చేయా లని ఉంది’’ అన్నారు నాని. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. రజీషా విజయన్, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వర్క్స్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని మాట్లాడుతూ – ‘‘ఇరవైఏళ్ల నుంచి రవితేజ అన్న డ్యూటీ (నటుడిగా). ఈ నెల 29 నుంచి థియేటర్స్‌లో ‘రామారావు: ఆన్ డ్యూటీ’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ – ‘‘సౌత్ ఇండస్ట్రీలో వన్నాఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ నాని. అనుభవం ఉన్న దర్శకుడిలా శరత్ సినిమా చేశాడు. నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయని ఓ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ క్యారెక్టర్ చేశాను. నిర్మాత సుధాకర్ కూల్ అండ్ పాజిటివ్ పర్సన్. మరో నిర్మాత శ్రీకాంత్ బాగా హెల్ప్ చేశారు’’ అన్నారు. వేణు తొట్టెంపూడి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను’’ అన్నారు. శరత్ మండవ మాట్లాడుతూ – ‘‘సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదన్న విషయంలో ఎంత నిజం ఉందో నాకు తెలియదు. కానీ మా ‘రామారావు ఆన్ డ్యూటీ’ టికెట్ రేట్స్ చెబుతున్నాను. ఈ చిత్రానికి తెలంగాణలో మల్టీప్లెక్స్‌లో చార్జి 195 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్‌లో 150, 100, 50 రూపాయలు. ఏపీలో మల్టీప్లెక్స్‌లో 177, సింగిల్ స్క్రీన్స్‌లో 147, 80 చార్జీలు ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేస్తే 30 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. దయచేసి థియేటర్స్ కౌంటర్లో టికెట్ తీసుకోండి’’ అన్నారు. కెమెరామేన్ సత్యన్ సూర్యన్, మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, లిరిక్ రైటర్ కల్యాణ్ చక్రవర్తి, దర్శకుడు బాబీ, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
సెట్స్‌లో నాగచైతన్య అలా ఉంటాడు : హీరోయిన్
రవితేజ, దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో దివ్యాంశా కౌశిక్ చెప్పిన విశేషాలు. ► ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రం 1995లో జరిగే కథ. ఈ చిత్రంలో నందిని అనే గృహిణి పాత్ర చేశాను. రామారావు (రవితేజ పాత్ర పేరు..)కు భార్యగా, అతనికి మోరల్ సపోర్ట్‌గా ఉంటాను. నటనకు ఎక్కువ స్కోప్ ఉన్న పాత్ర ఇది. షూటింగ్ ముందు కొన్ని వర్క్‌షాప్స్ చేశాను. నందిని పాత్రను చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. ► శరత్‌గారు మంచి విజన్ ఉన్న దర్శకుడు. రజీషాతో నాకు కొన్ని కాంబినేషన్స్ సీన్స్ ఉన్నాయి. సినిమాలో రామారావు ఎక్స్ లవర్ మాలిని పాత్రలో ఆమె కనిపిస్తారు. రామారావు పెళ్లి మాలినితో కాకుండా నందినితో ఎందుకు జరిగింది? అనే విషయాన్ని మాత్రం సినిమాలోనే చూడాలి. ► తెలుగులో నా తొలి చిత్రం ‘మజిలీ’ తర్వాత కోవిడ్ వల్ల నాకు కొంత గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్‌లో నేను కొన్ని డ్యాన్స్, యాక్టింగ్ క్లాసులు, తెలుగు క్లాసులు తీసుకున్నాను. నన్ను నేను తెలుసుకుని, మెరుగయ్యే ప్రయత్నం చేశాను. ఓ యాక్టర్‌గా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. ‘మజిలీ’లో నేను చేసిన అన్షు పాత్రకు, ‘రామారావు ఆన్ డ్యూటీ’లో చేసిన నందిని పాత్రకు చాలా తేడా ఉంది. ► ‘మజిలీ’ చిత్రంలో నాగచైతన్యతో, ‘రామరావు ఆన్ డ్యూటీ’లో రవితేజగారితో వర్క్ చేయడం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సెట్స్‌లో రవితేజగారు యాక్టివ్‌గా ఉంటే, నాగచైతన్య కామ్ అండ్ కూల్‌గా ఉంటారు. అయితే ఇద్దరిలో ఒక కామన్ క్యాలిటీ ఉంది. సెట్స్ లో సరదా ఫ్రాంక్స్ చేస్తుంటారు( నవ్వూతూ..) ► తెలుగులో మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ఇలా అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది (నవ్వుతూ..). ► నందిని పాత్రకు నేను డబ్బింగ్ చెప్పలేదు కానీ నా తర్వాతి చిత్రం ‘మైఖేల్’కు తెలుగులోనే డబ్బింగ్ చెబుతాను. అలాగే సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నాను. స్క్రిప్ట్ నచ్చితే వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తాను. ఏదైనా బయోపిక్‌లో యాక్ట్ చేయాలని ఉంది. ఎవరి బయోపిక్ అనేది నన్ను ఎంచుకునే దర్శకుల ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. -
రవితేజ సెట్‌కి వస్తే మెరుపులే.. ఎనర్జీతో నిండిపోతుంది: హీరోయిన్
నేను నార్త్ ఇండియాలో పెరిగాను. రవితేజ సినిమాలు హిందీ డబ్బింగ్ లో చూసేదాన్ని. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ ఆ రోజుల్లోనే రవితేజ సినిమాలు నార్త్‌లో బాగా చూసేవారు. అలాంటి హీరోతో పని చేయడం గొప్ప అనుభవం. రవితేజ గ్రేట్ మాస్ హీరో, సూపర్ స్టార్. ఆయన సెట్స్ కి వస్తే ఒక మెరుపులా ఉంటుంది. మొత్తం ఎనర్జీతో నిండిపోతుంది. సెట్స్ లో అందరినీ సమానంగా చూస్తారు’ హీరోయిన్ రజిసా విజయన్ అన్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ డైరెక్టెర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న తాజాగా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జులై 29న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ రజిషా విజయన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► రామారావు ఆన్ డ్యూటీ(Rama Rao On Duty) లో మాళిని అనే పాత్రలో కనిపిస్తా. శరత్ అద్భుతమైన కథ చెప్పారు. నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఒక భాషలో పరిచయమౌతున్నపుడు బలమైన కథ, పాత్ర కావాలని ఎదురుచూశాను. నేను ఎదురుచుసిన పాత్ర ఈ సినిమాతో దక్కింది. మాళిని పాత్ర చాలా అందంగా బలంగా ఉంటుంది. ఇంతమంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా ఉంది. ► రామారావు ఆన్ డ్యూటీ మాస్ ఫిల్మ్. ఇందులో చాలా ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అదే సమయంలో బలమైన కథ ఉంది. వినోదం పంచుతూనే ఆలోచన రేకెత్తించే సినిమా ఇది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా తీయాలంటే దర్శకుడిలో చాలా క్లారిటీ ఉండాలి. అంత చక్కని క్లారిటీ వున్న దర్శకుడు శరత్. మంచి సాంకేతిక విలువలతో చాలా మంచి క్యాలిటీతో ఈ సినిమాని రూపొందించారు. ► పరిశ్రమలో వేరైనా అందరూ తీసేది సినిమానే. టెక్నిక్ ఒక్కటే. నటన కూడా ఒకటే. మిగతా పరిశ్రమలతో పోలిస్తే తెలుగులో సినిమాల ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. పెద్ద కాన్యాస్ లో సినిమాకు తెరకెక్కుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుకుంటే ఇక్కడ థియేటర్స్, ఆడియన్స్ ఎక్కువ. ► సినిమా అనేది అల్టీమేట్ గా థియేటర్ ఎక్స్ పిరియన్స్. మమ్ముటి గారు ఒక సినిమా షూటింగ్ చేస్తున్నపుడు ఎలా వస్తుందో కనీసం మోనిటర్ కూడా చూడలేదు. కారణం అడిగితే.. ''నేను యాక్ట్ చేస్తుంది మానిటర్ కోసం కాదు .. బిగ్ స్క్రీన్ పై ఎలా వుంటుందో అనేది చూస్తాను''అని చెప్పారు. థియేటర్ ఇచ్చే అనుభవం వేరు. 'రామారావు ఆన్ డ్యూటీ' లాంటి భారీ చిత్రాన్ని అందరూ థియేటర్ లోనే చూడాలి. ఈ చిత్రం అన్ని ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. ఆలోచింపజేస్తుంది. ► నేను నటించిన మలయంకున్జు పాటు మరో నాలుగు మలయాళం సినిమాలు విడుదల కానున్నాయి. మరో రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టాలి. -
‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా ట్రైలర్ రిలీజ్ (ఫొటోలు)