Hero Nani Speech At Ramarao On Duty Pre Release Event | Hero Ravi Teja - Sakshi
Sakshi News home page

Ramarao On Duty: ప్రతి జనరేషన్‌లో ఒకడుంటాడు – నాని

Published Mon, Jul 25 2022 12:59 AM | Last Updated on Mon, Jul 25 2022 10:48 AM

Hero Nani Talks About Ramarao on Duty Pre Release Event - Sakshi

అన్వేషి, దివ్యాంశ, రజీషా, నాని, రవితేజ, శరత్, వేణు, సుధాకర్‌

‘‘రామారావు: ఆన్‌ డ్యూటీ’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రవితేజ అన్న గురించి మాట్లాడొచ్చని వచ్చాను. రవి అన్నకు చిరంజీవిగారంటే చాలా ఇష్టం. రవి అన్న కెరీర్‌ స్టార్ట్‌ చేసినప్పుడు చిరంజీవిగారిని ఎలా స్ఫూర్తిగా తీసుకున్నారో... మేం కెరీర్‌ స్టార్ట్‌ చేసినప్పుడు రవి అన్నగారు మాకు అది. ప్రతి జనరేషన్‌కు ఒకడుంటాడు. నేను అయ్యాను కదరా.. నువ్వెందుకు కాలేవు అనే ధైర్యం ఇచ్చేవాడు ఒకడుంటాడు.

అది మా అందరికీ అప్‌కమింగ్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు రవి అన్న. చిరంజీవిగారితో రవితేజ అన్న సినిమా చేస్తున్నారు. అలా నాకూ రవితేజ అన్నతో సినిమా చేయా లని ఉంది’’ అన్నారు నాని. రవితేజ హీరోగా శరత్‌ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’. రజీషా విజయన్, దివ్యాంశా కౌశిక్‌ హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, ఆర్‌టీ టీమ్‌ వర్క్స్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని మాట్లాడుతూ – ‘‘ఇరవైఏళ్ల నుంచి రవితేజ అన్న డ్యూటీ (నటుడిగా). ఈ నెల 29 నుంచి థియేటర్స్‌లో ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ – ‘‘సౌత్‌ ఇండస్ట్రీలో వన్నాఫ్‌ ది ఫైనెస్ట్‌ యాక్టర్స్‌  నాని. అనుభవం ఉన్న దర్శకుడిలా శరత్‌ సినిమా చేశాడు.

నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయని ఓ డిఫరెంట్‌ ఫిల్మ్‌ అండ్‌ క్యారెక్టర్‌ చేశాను. నిర్మాత సుధాకర్‌ కూల్‌ అండ్‌ పాజిటివ్‌ పర్సన్‌. మరో నిర్మాత శ్రీకాంత్‌ బాగా హెల్ప్‌ చేశారు’’ అన్నారు. వేణు తొట్టెంపూడి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తున్నాను’’ అన్నారు. శరత్‌ మండవ మాట్లాడుతూ – ‘‘సినిమా టికెట్‌ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఆడియన్స్‌ థియేటర్స్‌కు రావడం లేదన్న విషయంలో ఎంత నిజం ఉందో నాకు తెలియదు.

కానీ మా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ టికెట్‌ రేట్స్‌ చెబుతున్నాను. ఈ చిత్రానికి తెలంగాణలో మల్టీప్లెక్స్‌లో చార్జి 195 రూపాయలు, సింగిల్‌ స్క్రీన్స్‌లో 150, 100, 50 రూపాయలు. ఏపీలో మల్టీప్లెక్స్‌లో 177, సింగిల్‌ స్క్రీన్స్‌లో 147, 80 చార్జీలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో బుక్‌ చేస్తే 30 రూపాయలు ఎక్స్‌ట్రా ఉంటుంది. దయచేసి థియేటర్స్‌ కౌంటర్‌లో టికెట్‌ తీసుకోండి’’ అన్నారు.

కెమెరామేన్‌ సత్యన్‌ సూర్యన్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సామ్‌ సీఎస్, ఆర్ట్‌ డైరెక్టర్‌ సాహి సురేష్, లిరిక్‌ రైటర్‌ కల్యాణ్‌ చక్రవర్తి, దర్శకుడు బాబీ, నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్, వివేక్‌ కూచిభొట్ల, ఓవర్‌సీస్‌ డిస్ట్రిబ్యూటర్‌ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement