Ramarao On Duty Movie Twitter Review In Telugu - Sakshi
Sakshi News home page

Ramarao on Duty Twitter Review ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ టాక్‌ ఎలా ఉందంటే..

Published Fri, Jul 29 2022 7:22 AM | Last Updated on Fri, Jul 29 2022 8:28 AM

Ramarao on Duty Movie Twitter Review In Telugu - Sakshi

మాస్‌ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. యంగ్‌ డైరెక్టర్‌ శరత్‌ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో  రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్స్ గా నటించారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌ సినిమాపై అంచనాను పెంచేశాయి. ఈ సారి రవితేజ కొంచెం కొత్త ప్రయత్నించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. తనదైన స్టైల్లో మాస్‌ డైలాగ్స్‌తో ట్రైలర్‌ వదలడంతో ‘రామారావు ఆన్‌ డ్యూటీ’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 29) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 

ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల రామారావు డ్యూటీ ఎక్కేశాడు. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్‌ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

రవితేజకు భారీ హిట్‌  లభించిందని కొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని , క్లైమాక్స్‌  అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.  మరికొంత మంది ఏమో రామారావు ఆన్‌ డ్యూటీ యావరేజ్‌ మూవీ అంటున్నారు. 

రవితేజ యాక్టింగ్‌ బాగుందని, పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం అదిరిపోయిందని కామెంట్‌ చేస్తున్నారు. ఇంట్రడక్షన్‌ డీసెంట్‌గానే ఉందని, ఫస్టాఫ్‌ వరకు కథలో కొత్తదనం ఏం కనిపించడం లేదంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement