Rajisha Vijayan
-
సర్దార్ సీక్వెల్లో...
‘సర్దార్’ స్పై టీమ్‌లో చేరారు హీరోయిన్ రజీషా విజయన్. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సర్దార్’ (2022) మంచి హిట్‌గా నిలిచింది.ప్రస్తుతం కార్తీ, మిత్రన్ కాంబినేషన్లోనే ‘సర్దార్’కి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది. ఎస్జే సూర్య, మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. హీరోయిన్ రజీషా విజయన్ మరో లీడ్ రోల్లో నటించనున్నట్లు గురువారం మేకర్స్ తెలిపారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
కెమెరామెన్తో పెళ్లి పీటలు ఎక్కనున్న రవితేజ హీరోయిన్
చిత్రపరిశ్రమలో హీరోయిన్ల పెళ్లి అంటేనే పెద్ద వార్తగా మారుతున్న పరిస్థితి. కొంత కాలం పాటు డేటింగ్ చేసి కొందరు పెళ్లి పీటలెక్కుతే.. మరికొందరు మాత్రం పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఓ యంగ్ హీరోయిన్ తన ప్రియుడ్ని పరోక్షంగా పరిచయం చేసింది. త్వరలో పెళ్లితో శుభం కార్డు వేయాలని ఆ బ్యూటీ చూస్తుందట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా..?రజీషా విజయన్ గుర్తుందా. మొదట్లో పలు టీవీ కార్యక్రమాల్లో పాల్గొని పాపులర్ అయిన ఈ కేరళ భామ.. 2016లో మలయాళంలో కథానాయకిగా రంగప్రవేశం చేశారు. మాతృభాషలో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డును కూడా పొందింది. 2021లో తమిళంలో కర్ణన్ చిత్రంలో ధనుష్‌కు జంటగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత జైభీమ్, సర్దార్ వంటి చిత్రాల్లో మెప్పించింది. సర్దార్ చిత్రం తరువాత కోలీవుడ్ లో కనిపించని రజీషా తెలుగులో రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇలా బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈమె త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తాజా సమాచారం. మలయాళ ప్రముఖ చాయాగ్రహకుడు టోపిన్ థామస్‌తో కలిసి ఏడడుగులు వేయనున్నట్లు తెలిసింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఖోఖో', 'లవ్లీ యువర్స్' సినిమాలకు పనిచేశారు. అలా మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు వెళ్లిందనమాట. అయితే దీనికి సబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. View this post on Instagram A post shared by Rajisha Vijayan (@rajishavijayan) -
కెమెరామ్యాన్‌తో ప్రేమలో పడిన రవితేజ హీరోయిన్?
హీరోయిన్లు ఈ మధ్య కాలంలో వరసగా పెళ్లి చేసుకుంటున్నారు. లేదంటే నిశ్చితార్థం కానిస్తున్నారు. మరికొందరైతే తాము ప్రేమలో ఉన్న విషయాన్ని పరోక్షంగా బయటపెడుతున్నారు. ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ అలానే ప్రియుడ్ని పరిచయం చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈమె రిలేషన్లో ఉన్నది కూడా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తే. ఇంతకీ ఎవరీ హీరోయిన్? ఏంటా ప్రేమకథ? (ఇదీ చదవండి: 12 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న హీరోయిన్.. కారణమేంటి?) మలయాళ నటి రజిషా విజయన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కాస్త తెలుసు. ఎందుకంటే ఓటీటీ సినిమాల కాస్త గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'లో ఓ హీరోయిన్గా నటించి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది ఫ్లాప్ కావడంతో ఈమెకు ఇక్కడ పెద్దగా ఛాన్సులు రాలేదు. ప్రస్తుతానికైతే సొంత భాషతో పాటు తమిళంలో అడపాదడపా చిత్రాల్లో నటిస్తోంది. రజిషా విజయన్ ప్రస్తుతం సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం నేరుగా బయటపెట్టనప్పటికీ టోబిన్ తాజాగా పెట్టిన ఇన్ స్టా పోస్ట్ చూస్తే వీళ్ల ప్రేమ నిజమేనేమో అనిపిస్తోంది. రజిషాతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన టోబిన్.. 1461 రోజులు కలిసి ఉన్నాం. ఎంతో ప్రేమ, సంతోషం.. ఇద్దరి అల్లరిని భరిస్తూ.. మరెన్నో ప్రయాణాలు చేయాలనుకుంటున్నాం అని రాసుకొచ్చాడు. టోబిన్ పోస్టుకు రజిషా రిప్లై కూడా ఇచ్చింది. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'ఖోఖో', 'లవ్లీ యువర్స్' సినిమాలకు పనిచేశారు. అలా మొదలైన పరిచయం ఇప్పుడు ప్రేమ వరకు వెళ్లిందనమాట. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. కుర్రాడెవరో తెలుసా?) View this post on Instagram A post shared by Tobin Thomas (@tobin_thomas7) -
అప్పుడే సర్దార్ సీక్వెల్ ప్రకటించిన మేకర్స్, స్పెషల్ వీడియో రిలీజ్
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సర్దార్’. రాశీ ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో చంద్రబోస్ అలియాస్ ‘సర్దార్’, ఆయన తనయుడు ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాశ్ పాత్రల్లో మెప్పించారు కార్తీ. ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం. పోలీసాఫీసర్‌గా రాజీనామా చేసి, ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా చేరాలన్న ఆఫర్‌కు విజయ్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం, విజయ్ కొత్త మిషన్ కంబోడియాలో ఆరంభం కానున్నట్లుగా టీజర్లో చూపించడం జరిగింది. హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్, నిర్మాత లక్ష్మణ్ కాంబినేషన్లోనే ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. #Sardar 💥 Once a spy, always a spy! Mission starts soon!!#Sardar2 💥💥@Karthi_Offl @Prince_Pictures @RedGiantMovies_ @Psmithran @gvprakash @lakku76 @RaashiiKhanna @rajishavijayan @ChunkyThePanday @george_dop @AntonyLRuben @dhilipaction @kirubakaran_AKR @DuraiKv pic.twitter.com/rVu5IxGRZp — Prince Pictures (@Prince_Pictures) October 25, 2022 -
కార్తీ నిరూపించుకున్నాడు: నాగార్జున
‘‘ఓ సూపర్‌స్టార్ అన్నగా(సూర్య) ఉన్నప్పుడు.. ఆ షాడో నుంచి బయటకు వచ్చి... సొంత ప్రతిభను నిరూపించుకోవడం అనేది చాలా తక్కువ. అటువంటి వారిని అరుదుగా నేను ఇద్దర్నే చూశాను. తెలుగులో చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్, కన్నడలో శివరాజ్‌కుమార్ సోదరుడు పునీత్ రాజ్‌కుమార్. ఇప్పుడు తమిళ్లో సూర్య బ్రదర్ కార్తీ. ఇలా నిరూపించుకోవడం కష్టమైన పని. విభిన్నమైన, ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ అన్నలా సూపర్‌స్టార్ అయ్యాడు కార్తీ’’ అని నాగార్జున అన్నారు. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మించిన తమిళ చిత్రం ‘సర్దార్’. రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రంలో లైలా ఓ కీ రోల్ చేశారు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమా తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘సర్దార్’ ప్రీ రిలీజ్‌కి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ– ‘‘ఊపిరి’ సినిమా నుంచి కార్తీతో నా అనుబంధం ప్రారంభమైంది. తను తెలుగులో మాట్లాడతాడు.. పాటలు పాడతాడు. తెలుగులో మాట్లాడినవారిని మనం హృదయాల్లో పెట్టుకుంటాం.. అందుకే కార్తీని తెలుగు ప్రేక్షకులు అంతగా ఆదరిస్తారు. అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాను సమర్పిస్తున్నందుకు చాలా గర్వంగా, హ్యాపీగా ఉంది’’అన్నారు. కార్తీ మాట్లాడుతూ– ‘‘నాగార్జునగారు నాకు రియల్ బ్రదర్.. పెద్ద స్ఫూర్తి. సక్సెస్, ఫెయిల్యూర్స్ అనేవి ఆయన్ని ఎఫెక్ట్ చేయలేవు. సినిమాలంటే ఆయనకు ఎంతో ప్యాషన్. మంచి మనవతావాదిగా ఉంటేనే మంచి యాక్టర్‌గా ఉండగలమని నాగార్జునగారు ఓ సందర్భంలో చెప్పారు. నేనూ ఎప్పట్నుంచో ఫాలో అవుతున్నాను. నాగార్జునగారు యాక్ట్ చేస్తున్నారనే నేను ‘ఊపిరి’ సినిమా చేశాను. నా కెరీర్లో ‘సర్దార్’ చాలా ముఖ్యమైన సినిమా. ‘సర్దార్’ ఇండియన్ స్పై థ్రిల్లర్’’ అన్నారు. ‘‘నేను నటించిన ‘శివపుత్రుడు’ దీపావళికి రిలీజై హిట్ సాధించింది. ‘సర్దార్’ కూడా దీపావళికి విడుదలవుతోంది. నా బర్త్ డే కూడా ఈ దీపావళి రోజునే (అక్టోబరు 24). చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ప్రతి ఒక్కరూ ‘సర్దార్’ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’అన్నారు. గేయ రచయిత రాకేందు మౌళి. అన్నపూర్ణ స్టూడియోస్ సాయిబాబా, కాస్ట్యూమ్ డిజైనర్ ప్రవీణ్ రాజా పాల్గొన్నారు. -
‘రామారావు ఆన్ డ్యూటీ’ హీరోయిన్ రజిషా విజయన్ (ఫొటోలు)
-
‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ ట్విటర్ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. యంగ్ డైరెక్టర్ శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాను పెంచేశాయి. ఈ సారి రవితేజ కొంచెం కొత్త ప్రయత్నించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. తనదైన స్టైల్లో మాస్ డైలాగ్స్‌తో ట్రైలర్ వదలడంతో ‘రామారావు ఆన్ డ్యూటీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 29) ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల రామారావు డ్యూటీ ఎక్కేశాడు. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి. అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #RamaRaoOnDuty #RamaRaoOnDutyFromJuly29th #RamaRaoOnDutyFromTomorrow Blockbuster comeback for ravanna Awesome movie Mainly mass scenes vere level Introduction scene Pre intervel scene Climax scene goose bumbs Songs 💙 Bgm 🔥🔥🔥 Overall rating 3.25/5 pic.twitter.com/BJaalgSfob — vallepu_raghavendra (@vallepuraghav) July 29, 2022 రవితేజకు భారీ హిట్ లభించిందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయని , క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు. మరికొంత మంది ఏమో రామారావు ఆన్ డ్యూటీ యావరేజ్ మూవీ అంటున్నారు. #RamaRaoOnDuty Review: An Above Average Thriller Drama ✌️#RaviTeja performs well in his usual swag 👍 Casting Is Decent 👍 Music is OK but BGM works ✌️ Action Scenes are very good 👍 Decent Story but underwhelming execution 🙏 Rating: ⭐⭐⭐/5#RamaRaoOnDutyReview pic.twitter.com/4uLZVjZEvx — Kumar Swayam (@KumarSwayam3) July 29, 2022 రవితేజ యాక్టింగ్ బాగుందని, పాటలు అంతంత మాత్రమే అయినా.. నేపథ్య సంగీతం అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. ఇంట్రడక్షన్ డీసెంట్‌గానే ఉందని, ఫస్టాఫ్ వరకు కథలో కొత్తదనం ఏం కనిపించడం లేదంటున్నారు. @RaviTeja_offl sir, #RamaRaoOnDuty movie chusanu. Chala bagundi from NJ, USA. — Abhishek (@abhiabhi799) July 29, 2022 #RamaRaoOnDuty Review FIRST HALF: A Decent One 👍#RaviTeja is in his elements & looks perfect ✌️ Songs are average but BGM is Terrific 👏 Production Values Looks Good 👍 Second Half is the key 🙏#RamaRaoOnDutyReview #DivyanshaKaushik #RamaRaoOnDuty — Fancy Motion Pictures (@Fancymotionpic) July 29, 2022 US distrubutor Rating: ⭐️⭐️⭐️2.5/5#RamaRaoOnDutyReview #SarathMandava has picked up the MASSIEST TALE and showcased it on the SILVER screen with his GRAND VISION of presenting #RaviTeja in a massy avatar. #RamaRaoOnDuty reminds you of the olden days. pic.twitter.com/SE0kKP8goB — Praveen Chowdary Kasindala (@PKasindala) July 27, 2022 #RamaRaoOnDuty 1st half way too good...superb interval bang....@RaviTeja_offl in completely mass avatar — Mahesh (@Urkrishh) July 29, 2022 -
Ramarao On Duty Stills: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ స్టిల్స్ (ఫొటోలు)
-
ప్రతి జనరేషన్లో ఒకడుంటాడు – నాని
‘‘రామారావు: ఆన్ డ్యూటీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రవితేజ అన్న గురించి మాట్లాడొచ్చని వచ్చాను. రవి అన్నకు చిరంజీవిగారంటే చాలా ఇష్టం. రవి అన్న కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవిగారిని ఎలా స్ఫూర్తిగా తీసుకున్నారో... మేం కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు రవి అన్నగారు మాకు అది. ప్రతి జనరేషన్‌కు ఒకడుంటాడు. నేను అయ్యాను కదరా.. నువ్వెందుకు కాలేవు అనే ధైర్యం ఇచ్చేవాడు ఒకడుంటాడు. అది మా అందరికీ అప్‌కమింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు రవి అన్న. చిరంజీవిగారితో రవితేజ అన్న సినిమా చేస్తున్నారు. అలా నాకూ రవితేజ అన్నతో సినిమా చేయా లని ఉంది’’ అన్నారు నాని. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రామారావు: ఆన్ డ్యూటీ’. రజీషా విజయన్, దివ్యాంశా కౌశిక్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వర్క్స్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని మాట్లాడుతూ – ‘‘ఇరవైఏళ్ల నుంచి రవితేజ అన్న డ్యూటీ (నటుడిగా). ఈ నెల 29 నుంచి థియేటర్స్‌లో ‘రామారావు: ఆన్ డ్యూటీ’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ – ‘‘సౌత్ ఇండస్ట్రీలో వన్నాఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ నాని. అనుభవం ఉన్న దర్శకుడిలా శరత్ సినిమా చేశాడు. నేను ఇంతకుముందు ఎప్పుడూ చేయని ఓ డిఫరెంట్ ఫిల్మ్ అండ్ క్యారెక్టర్ చేశాను. నిర్మాత సుధాకర్ కూల్ అండ్ పాజిటివ్ పర్సన్. మరో నిర్మాత శ్రీకాంత్ బాగా హెల్ప్ చేశారు’’ అన్నారు. వేణు తొట్టెంపూడి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాను’’ అన్నారు. శరత్ మండవ మాట్లాడుతూ – ‘‘సినిమా టికెట్ ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఆడియన్స్ థియేటర్స్‌కు రావడం లేదన్న విషయంలో ఎంత నిజం ఉందో నాకు తెలియదు. కానీ మా ‘రామారావు ఆన్ డ్యూటీ’ టికెట్ రేట్స్ చెబుతున్నాను. ఈ చిత్రానికి తెలంగాణలో మల్టీప్లెక్స్‌లో చార్జి 195 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్‌లో 150, 100, 50 రూపాయలు. ఏపీలో మల్టీప్లెక్స్‌లో 177, సింగిల్ స్క్రీన్స్‌లో 147, 80 చార్జీలు ఉన్నాయి. ఆన్లైన్లో బుక్ చేస్తే 30 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. దయచేసి థియేటర్స్ కౌంటర్లో టికెట్ తీసుకోండి’’ అన్నారు. కెమెరామేన్ సత్యన్ సూర్యన్, మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సీఎస్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్, లిరిక్ రైటర్ కల్యాణ్ చక్రవర్తి, దర్శకుడు బాబీ, నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిభొట్ల, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
రవితేజ సెట్‌కి వస్తే మెరుపులే.. ఎనర్జీతో నిండిపోతుంది: హీరోయిన్
నేను నార్త్ ఇండియాలో పెరిగాను. రవితేజ సినిమాలు హిందీ డబ్బింగ్ లో చూసేదాన్ని. ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నాం కానీ ఆ రోజుల్లోనే రవితేజ సినిమాలు నార్త్‌లో బాగా చూసేవారు. అలాంటి హీరోతో పని చేయడం గొప్ప అనుభవం. రవితేజ గ్రేట్ మాస్ హీరో, సూపర్ స్టార్. ఆయన సెట్స్ కి వస్తే ఒక మెరుపులా ఉంటుంది. మొత్తం ఎనర్జీతో నిండిపోతుంది. సెట్స్ లో అందరినీ సమానంగా చూస్తారు’ హీరోయిన్ రజిసా విజయన్ అన్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా యంగ్ డైరెక్టెర్ శరత్ మండవ తెరకెక్కిస్తున్న తాజాగా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జులై 29న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరోయిన్ రజిషా విజయన్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► రామారావు ఆన్ డ్యూటీ(Rama Rao On Duty) లో మాళిని అనే పాత్రలో కనిపిస్తా. శరత్ అద్భుతమైన కథ చెప్పారు. నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. ఒక భాషలో పరిచయమౌతున్నపుడు బలమైన కథ, పాత్ర కావాలని ఎదురుచూశాను. నేను ఎదురుచుసిన పాత్ర ఈ సినిమాతో దక్కింది. మాళిని పాత్ర చాలా అందంగా బలంగా ఉంటుంది. ఇంతమంచి సినిమాతో తెలుగులో పరిచయం కావడం ఆనందంగా ఉంది. ► రామారావు ఆన్ డ్యూటీ మాస్ ఫిల్మ్. ఇందులో చాలా ఎంటర్ టైన్మెంట్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అదే సమయంలో బలమైన కథ ఉంది. వినోదం పంచుతూనే ఆలోచన రేకెత్తించే సినిమా ఇది. ఇన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా తీయాలంటే దర్శకుడిలో చాలా క్లారిటీ ఉండాలి. అంత చక్కని క్లారిటీ వున్న దర్శకుడు శరత్. మంచి సాంకేతిక విలువలతో చాలా మంచి క్యాలిటీతో ఈ సినిమాని రూపొందించారు. ► పరిశ్రమలో వేరైనా అందరూ తీసేది సినిమానే. టెక్నిక్ ఒక్కటే. నటన కూడా ఒకటే. మిగతా పరిశ్రమలతో పోలిస్తే తెలుగులో సినిమాల ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. పెద్ద కాన్యాస్ లో సినిమాకు తెరకెక్కుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలని కలుపుకుంటే ఇక్కడ థియేటర్స్, ఆడియన్స్ ఎక్కువ. ► సినిమా అనేది అల్టీమేట్ గా థియేటర్ ఎక్స్ పిరియన్స్. మమ్ముటి గారు ఒక సినిమా షూటింగ్ చేస్తున్నపుడు ఎలా వస్తుందో కనీసం మోనిటర్ కూడా చూడలేదు. కారణం అడిగితే.. ''నేను యాక్ట్ చేస్తుంది మానిటర్ కోసం కాదు .. బిగ్ స్క్రీన్ పై ఎలా వుంటుందో అనేది చూస్తాను''అని చెప్పారు. థియేటర్ ఇచ్చే అనుభవం వేరు. 'రామారావు ఆన్ డ్యూటీ' లాంటి భారీ చిత్రాన్ని అందరూ థియేటర్ లోనే చూడాలి. ఈ చిత్రం అన్ని ఎలిమెంట్స్ తో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది. ఆలోచింపజేస్తుంది. ► నేను నటించిన మలయంకున్జు పాటు మరో నాలుగు మలయాళం సినిమాలు విడుదల కానున్నాయి. మరో రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టాలి.