
‘సర్దార్’ స్పై టీమ్‌లో చేరారు హీరోయిన్ రజీషా విజయన్. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సర్దార్’ (2022) మంచి హిట్‌గా నిలిచింది.
ప్రస్తుతం కార్తీ, మిత్రన్ కాంబినేషన్‌లోనే ‘సర్దార్’కి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది. ఎస్‌జే సూర్య, మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. హీరోయిన్ రజీషా విజయన్ మరో లీడ్ రోల్‌లో నటించనున్నట్లు గురువారం మేకర్స్ తెలిపారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment