Sardar
-
సర్దార్ సీక్వెల్లో...
‘సర్దార్’ స్పై టీమ్‌లో చేరారు హీరోయిన్ రజీషా విజయన్. కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సర్దార్’ (2022) మంచి హిట్‌గా నిలిచింది.ప్రస్తుతం కార్తీ, మిత్రన్ కాంబినేషన్లోనే ‘సర్దార్’కి సీక్వెల్‌గా ‘సర్దార్ 2’ తెరకెక్కుతోంది. ఎస్జే సూర్య, మాళవికా మోహన్, ఆషికా రంగనాథ్ ఈ చిత్రంలో ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. హీరోయిన్ రజీషా విజయన్ మరో లీడ్ రోల్లో నటించనున్నట్లు గురువారం మేకర్స్ తెలిపారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
చిరంజీవితో సినిమా తర్వాత మరో ఛాన్స్ కొట్టేసిన ఆషికా రంగనాథ్
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది. ఇప్పటికే మెగాస్టార్ విశ్వంభరలో ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీకి సౌత్ ఇండియా స్టార్ హీరో సినిమాలో ఎంట్రీ ఇచ్చేసింది. 'సర్దార్ 2' సినిమా కోసం కార్తితో ఆషికా రంగనాథ్ జోడీ కట్టనున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే, ఆమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా పోస్ట్ చేసింది.ఆషికా రంగనాథ్‌ను సర్దార్2 ప్రాజెక్ట్‌లోకి స్వాగతిస్తున్నట్లు తెలియజేస్తూ మేకర్స్ ఒక పోస్టర్‌ను కూడా వివడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాలో మాళవిక మోహనన్ కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎస్.జె. సూర్య కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదల కానుంది.అమిగోస్ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆషిక ఈ ఏడాదిలో నాగార్జున సరసన ‘నా సామిరంగ’లో మెప్పించింది. దీంతో తెలుగులో రెండు సినిమాల అనుభవంతోనే తన మూడో సినిమా మెగాస్టార్‌తో నటించే అవకాశం అందుకుంది. ‘విశ్వంభర’లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కార్తితో ఆమెకు ఛాన్స్ దక్కడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. -
సర్దార్కి జోడీగా...
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ హిట్ కాంబినేషన్లోనే ‘సర్దార్ 2’ రూపొందుతోంది. ఈ మూవీలో కార్తీకి జోడీగా మాళవికా మోహనన్ నటిస్తున్నట్లు శుక్రవారం మేకర్స్ ప్రకటించారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.‘‘సర్దార్’ తమిళ, తెలుగు భాషల్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా రూపొందిస్తున్న ‘సర్దార్ 2’ షూటింగ్ చెన్నైలో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఎస్జే సూర్య ఓ పవర్ఫుల్పాత్ర చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. -
సర్దార్ 2 సెట్స్‌లో ప్రమాదం.. ఒకరి మృతి
కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సర్దార్ 2’ చిత్ర షూటింగ్లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఒక భారీ ఫైట్ సీన్ షూట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన సర్దార్ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ -2 ప్రకటన వచ్చిన కొద్దిరోజుల్లోనే షూటింగ్‌ను ప్రారంభించారు.మిషన్ కంబోడియా నేపథ్యంలో సాగే సర్దార్ 2 పూజా కార్యక్రమం ఇటీవలే చెన్నైలో జరిగింది. జులై 15 నుంచి సర్దార్ 2 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఒక ఫైట్ సీన్‌ను తెరకెక్కిస్తున్న క్రమంలో సెట్స్‌లో ప్రమాదం జరిగింది. ఎజుమలై అనే ఫైట్ మాస్టర్ సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడి మరణించారు. ఎక్కువ ఎత్తు నుంచి కిందపడటంతో ఆయన ఛాతీ భాగంలో తీవ్ర గాయం అయింది. దీంతో ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కావడం వల్లే అతడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. అయితే, ప్రమాదం జరిగన సమయంలో హీరో కార్తీ కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కంగువ, భారతీయుడు, దేవర వంటి సినిమా చిత్రీకరణ సమయంలో కూడా పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. అలాంటి సమయంలో ఎక్కువగా ఫైట్ మాస్టర్స్ గాయపడటం వల్ల చిత్రపరిశ్రమను ఆందోళనకు గురిచేస్తుంది. -
ప్రతి భారతీయుడిలో దేశభక్తిని రగిలించే సినిమాలు ఇవే
సినిమా అనేది వినోదాన్ని మాత్రమే కాదు పంచుతుందనుకుంటే పొరపాటే.. కొన్ని సనిమాలు యువకుల్లో దేశభక్తిని రగిలించింది. అందుకు తగినట్లుగానే కొందరు హీరోలు,దర్శకులు కథలను ఎంచుకుంటుంటారు. ఇలా వారు భారీ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు. మన హీరోలు స్వాతంత్ర సమర యోధులుగా, దేశాన్ని రక్షించే వీరులుగా కనిపించి ఆకట్టుకున్నారు. అలాంటి సినిమాలపై 77వ స్వాతంత్య్రం సందర్భంగంగా కొన్నింటిపై ఫోకస్ చేయండి. గాంధీ (1982) 1982లో వచ్చిన గాంధీ సినిమా రిచర్డ్ అటెన్ బరో తీశారు. అస్కార్ అవార్డు పొందిన సినిమా ఇది. బెన్ కింగ్ స్లే గాంధీగా నటించారు. భారత స్వతంత్ర పోరాటాన్ని, గాంధీ జీవితాన్ని తెరకెక్కించిన మొదటి సినిమా ఇదే. గాంధీజీ పై చాలా సినిమాలు వచ్చాయి. కానీ 1982లో తెరకెక్కిన గాంధీ సినిమా మాత్రం ప్రత్యేకం. అయితే దానికి ప్రత్యేకమయిన కారణం కూడా ఉంది. ఈ సినిమాను రూపొందించింది ఇంగ్లాండ్‌లో పుట్టిపెరిగిన రిచర్డ్ అటెన్‌బరో అనే ఫిల్మ్ మేకర్. ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కూడా. ఇక ఆ సినిమాలో గాంధీగా నటించింది కూడా బ్రిటిష్ యాక్టర్ అయిన బెన్ కింగ్స్లే. ఇలా ఏ దేశం పై అయితే గాంధీజీ తన పోరాటాన్ని సాగించారో వాళ్ళే మళ్ళీ ఆయనపై సినిమా తియ్యడం, దాన్ని ఇంగ్లాండ్‌లో కూడా రిలీజ్ చేస్తే అక్కడ అది ఘనవిజయం సాధించడం అనేది సామాన్యమయిన విషయం కాదు. పైగా ఆ సినిమాలో గాంధీజీ పాత్రను అద్బుతంగా పోషించిన బెన్ కింగ్స్లే కి అకాడెమీ అవార్డు కూడా వచ్చింది. అంటే గాంధీజీ జీవితంలో ఉన్న సారాంశం ఎంత గొప్పది అనేది ఆ సినిమాలో చూపించడం వల్ల, అది అందరి మనసులకు హత్తుకోవడం వల్ల ఆ విజయం సాధ్యమయింది. భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని 582 సినిమా థియేటర్లలో ఆగష్ట్రు 14వ తేదీ నుంచి 24 వరకు 'గాంధీ' చిత్రాన్ని విద్యార్థులకు ఉచితంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ (2000) భీంరావ్ రాంజీ అంబేడ్కర్ పాత్రలో మమ్ముట్టి రోల్ ఔట్‌స్టాండింగ్ అనే చెప్పవచ్చు. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా జబ్బర్ పటేల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదట ఆంగ్లంలో నిర్మించబడింది. తరువాత ప్రాంతీయ భాషలలోకి డబ్ చేయబడింది. ఈ చిత్రంలో మమ్ముట్టి డాక్టర్ అంబేడ్కర్ పాత్రను పోషించారు. అతని నటనకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు అంబేద్కర్ యొక్క పోరాటాలను దృశ్యమానం చేసిన జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్రం, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించాలని పిలుపునిచ్చింది. నిర్మాణాన్ని ప్రభుత్వ యాజమాన్యంలోని నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. డాక్టర్ అంబేద్కర్గా మమ్ముట్టి నటన మనసుకు హత్తుకునేలా ఉంటుంది. ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ (2002) హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ తోటి సభ్యులతో కలిసి భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుడు భగత్ సింగ్ గురించి 2002లో ఈ చిత్రం విడుదల అయింది. ఇందులో అజయ్ దేవగన్ టైటిల్ క్యారెక్టర్‌తో పాటు సుశాంత్ సింగ్ కూడా ఉన్నారు. ఈ సినిమాలో భారత స్వాతంత్రం కోసం పోరాడిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పూర్తిగా చూపించారు. 1931 మార్చి 24న అధికారిక విచారణకు ముందు జలియన్ వాలాబాగ్ మారణకాండను చూపినప్పటి నుంచి భగత్ సింగ్ ని ఉరి తీసే వరకు ఈ సినిమాలో చూయించారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికంబానికి ఎలా ఎక్కాడో తెలిపే చిత్రమే ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. లగాన్ (2001) బ్రిటీషు పాలనలో భూమి పన్ను రద్దుకు వ్యతిరేకంగా ఓ గ్రామ ప్రజలు క్రికెట్ ఆడటానికి నిర్ణయించుకుంటారు. అప్పటివరకూ అలవాటు లేని ఆట అది. పన్ను భారం తగ్గాలంటే ఆడి గెలవాల్సిందే. ఆడారు.. గెలిచారు. ఆమిర్ ఖాన్ నటించిన ఈ ‘లగాన్’ చిత్రకథను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. 2001లో ఈ సినిమా విడుదలైంది. అప్పట్లో ఎందరిలోనే దేశభక్తిని రగిలించిన సినిమా ఇది. ఇప్పటికి ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు దాటినా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ (2004) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం ఆధారంగా వచ్చిన Netaji Subhas Chandra Bose: The Forgotten Hero హిందీ చిత్రం 2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియన్ ఎపిక్ బయోగ్రాఫికల్ వార్ని సినిమాగా తెరకెక్కించింది. ఇందులో నేతాజీగా సచిన్ ఖేడేకర్ కరెక్ట్‌గా సెట్ అయ్యారు. బ్రిటీష్ ఇండియాలో మహాత్మా గాంధీతో రాజకీయ విబేధాల తర్వాత, బోస్ అరెస్టు, విడుదలయ్యాక జరిగిన కథను వివరించారు. ఈ చిత్రానికి ఇండియన్ ఆడియెన్స్ నుంచి విశేష ఆదరణ దక్కింది. సినిమాకు నేషనల్ ఫిల్మ్ అవార్డు ఫర్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ అవార్డును కూడా దక్కింది. అలాగే 70వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సంయుక్తంగా సమర్పించిన ఇండిపెండెన్స్ డే ఫిల్మ్ ఫెస్టివల్లో ఆగష్టు 14, 2016న ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. ఈ సినిమాకు శ్యామ్ బెనెగల్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ దర్శకత్వం వహించారు. ఎమ్ ఎక్స్ ప్లేయర్,యూట్యూబ్‌లో ఈ సినిమా ఉంది. సర్దార్ (1993) 1993లో ఈ చిత్రం విడుదలైంది. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని రాష్ట్రాలను ఇండియన్ ఆఫ్ యూనియన్‌లో చేరేలా శ్రమించిన సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జీవితం ఆధారంగా నిర్మించిందే ఈ చిత్రం. ఈ సినిమాలో పరేష్ రావల్ సర్దార్‌గా నటించారు. ఈ సినిమాలో క్విట్ ఇండియా ఉద్యమంలో జరిగిన అల్లర్లతో పాటు నెహ్రుతో సర్దార్కు ఉన్న విబేధాలను చూపుతుంది. సర్దార్ లాంటి వ్యక్తి లేకుండా ఉండి ఉంటే భారత్ ఇప్పటికి కూడా చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేదని చెప్పవచ్చు. యూట్యూబ్‌లో ఈ సినిమాను చూడొచ్చు కేసరి (2019) కేసరి 2019లో విడుదలైన బాలీవుడ్ సినిమా. 1897న భారత్‌లోకి సుమారు 10 వేలకు పైగా ఆఫ్ఘన్ దళాలు ఒక్కసారిగా చొచ్చుకొని వస్తారు. అప్పుడు వారందరినీ కేవలం 21 మంది సిక్కులు మాత్రమే ఎలా అడ్డుకున్నారు. అనేది ఈ సినిమాలో చూపిస్తారు .ఈ దళాల మధ్య 30 గంటల పాటు జరిగిన భీకర పోరాట సన్నివేశాలు మెప్పిస్తాయి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, పరిణీతి చోప్రా, సుమీత్ సింగ్ బస్రా, రాకేష్ శర్మ, మీర్ సర్వర్, అశ్వథ్ భట్, రామ్ అవానా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మంగళ్ పాండే: ది రైజింగ్ (2005) మంగళ్ పాండే జీవితం ఆధారంగా 2005లో కేతన్ మెహతా దర్శకత్వంలో మంగళ్ పాండే: ది రైజింగ్ మూవీ వచ్చింది. ఇందులో ఆమీర్ ఖాన్ లీడ్ రోల్లో నటించారు. మంగళ్ పాండే ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలో జులై 19, 1827న జన్మించారు. పాండే బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన 34వ బెంగాల్ నేటివ్ ఇన్ఫాంట్రీలో రెజిమెంట్‌లో సిపాయిగా చేరారు. అప్పట్లో అతను తన అసాధారణమైన ప్రతిభ, తెగువతో సైనిక దళ నాయకుడిగా ఎదిగారు. అయితే ఆ కాలంలో బ్రిటిష్ వారు అందించిన తుపాకీ తూటాలను సిపాయిల వీసమెత్తు నచ్చలేదు. ఈ గుండ్లకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసేవారు. వాటిని పేల్చాలంటే సిపాయిలు నోటితో కొరికి తొక్క తీయాల్సి ఉంటుంది. హిందువులు, ముస్లింల మత విశ్వాసాలకు ఇది విరుద్ధమని భావించిన సిపాయిలు వ్యతిరేకత వ్యక్తం చేశారు. బ్రిటీషర్లు మొదట జంతువుల కొవ్వును ఉపయోగించలేదని చెప్పారు. కానీ అది కోవ్వేనని పాండే, ఇతర సైనికుల్లో సందేహాలు మరింత బలపడ్డాయి. ఆ సందేహాలే చివరికి బ్రిటిష్ రాజ్యాధిపత్యంపై తిరుగుబాటుకు ఎలా దారితీసింది. పాండే ఉరి శిక్ష సమయంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశారు.ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. మణికర్ణిక (2019) 2019లో వచ్చిన ఈ సినిమా ఝాన్సీ లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఆదారంగా బాలీవుడ్లో తెరకెక్కించారు. ఇందులో కంగనా రనౌత్ ఝాన్సీగా తన నటనతో భారతీయులను మెప్పించింది.1828లో వారణాసిలో తన పుట్టుకతో కథ మొదలౌతుంది. పరాక్రమానికి మారుపేరుగా లక్ష్మీ భాయ్ జీవిత చరిత్ర ఉంటుంది. ఝాన్సీ రాజు అయిన గంగాధర్ రావుతో ఆమెకు వివాహం అవుతుంది. రాజ్యం గంగాధర్ అన్న అయిన సధాశివ్ బ్రిటీష్ వారితో కలిసి కుట్ర పన్నుతాడు. అందులో భాగంగా గంగాధర్ రావును బ్రిటీష్ వారు చంపేస్తారు. తన భర్తకు ఇచ్చిన మాట కోసం ఝాన్సీ లక్ష్మీ భాయ్‌గా రాజ్యాధికారం అందుకుంటుంది. ఈ క్రమంలో తెల్లవారిపై ఆమె చేసిన దండయాత్ర ఎలా ఉంటుందో చెప్పేదే మణికర్ణిక చిత్రం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. -
నోరుజారిన నేపాల్ ప్రధాని.. ఏకి పారేస్తున్న ప్రతిపక్షాలు
ఖాట్మండు: నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహాల్ ఇటీవల భారతీయ వ్యాపారి సర్దార్ ప్రీతమ్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తాను ప్రధానమంత్రి కావడానికి ఆయన చాలా సహాయం చేశారని చేసిన వ్యాఖ్యలు నేపాల్ లో పెను దుమారాన్ని రేపాయి. నేపాల్ ప్రధాని నియామకం ఢిల్లీ కనుసన్నల్లో జరిగిందని ప్రధాని ప్రచండకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశాయి అక్కడి ప్రతిపక్షాలు. ప్రఖ్యాత భారత వ్యాపారి ప్రీతమ్ సింగ్ పేరిట కిరణ్ దీప్ సంధు రాసిన జీవితచరిత్ర పుస్తకం "రోడ్స్ టు ది వ్యాలీ: ది లెగసీ ఆఫ్ సర్దార్ ప్రీతమ్ సింగ్ ఇన్ నేపాల్" ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేశారు నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ ప్రచండ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారత్-నేపాల్ సంబంధాలు బలపడటానికి ప్రీతమ్ సింగ్ చాలా సహాయపడ్డారని, తన రాజకీయ జీవితం తొలినాళ్లలో కూడా అయన చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చారు. నన్ను ప్రధాన మంత్రిని చేయడానికి ఆయన అనేకమార్లు ఢిల్లీ వెళ్లడమే కాదు అటు ఢిల్లీ నాయకులతోనూ, ఇటు ఖాట్మండు నాయకులతోనూ సంప్రదింపులు జరిపారని తెలిపారు. ఈ వ్యాఖ్యలకు నేపాల్ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో స్పందించాయి. ప్రధాని వ్యాఖ్యలు జాతి స్వాతంత్య్రానికి, గౌరవానికి, రాజ్యాంగానికి, చట్టసభకే అవమానకరమని ప్రతిపక్ష నాయకుడు కెపి శర్మ ఓలి అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ తోపాటు ఇతర ప్రతిపక్షాలు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీల నేతలు ప్రధాని ప్రచండ రాజీనామాను డిమాండ్ చేస్తూ బుధవారం జాతీయ అసెంబ్లీ సమావేశాలకు తీవ్ర అంతరాయం కలిగించారు. నేపాల్ ప్రధాని ప్రచండ ప్రతిస్పందిస్తూ నేపాల్ అంతర్గత రాజకీయాల్లో భారత్ పాత్ర ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు ప్రీతమ్ సింగ్ కు సాంఘిక సంక్షేమం మీదనే కాదు రాజకీయాల పైన కూడా అంతే ఆసక్తి ఉండేదని చెప్పాలనుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాలు మాత్రం మాకు మీ వివరణ అక్కర్లేదు.. మీ రాజీనామా మాత్రమే కావాలని పట్టుబట్టడంతో నేపాల్ జాతీయ అసెంబ్లీ సమావేశానికి నిరవధికంగా అంతరాయం కలిగింది. ఇది కూడా చదవండి: వింబుల్డన్‌లో దారుణం.. స్కూల్లోకి దూసుకెళ్లిన కారు.. -
'సర్దార్' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
హీరో కార్తీతో రాశీ ఖన్నా స్టెప్పులు
‘సర్దార్’తో స్టెప్పులేస్తున్నారు హీరోయిన్ రాశీ ఖన్నా. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా నటిస్తున్న చిత్రం ‘సర్దార్’. ఈ చిత్రంలో హీరోయిన్గా రాశీ ఖన్నా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మైసూర్లో జరుగుతోంది. కార్తీ, రాశీ ఖన్నాపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ పాటను కూడా చిత్రీకరించే ప్లాన్‌లో ఉంది యూనిట్. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా కార్తీ రెండు పాత్రలు చేస్తున్నారు. ఆఫీసర్ అయిన కొడుకు పాత్రకు జోడీగా రాశీ ఖన్నా కనిపిస్తారు. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానుంది. ఇక రాశీ ఖన్నా తెలుగులో నటించిన ‘పక్కా కమర్షియల్’, ‘థ్యాంక్యూ’ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. -
హీరో కార్తీ ఇలా అయ్యాడేంటి? షాకవుతున్న నెటిజన్లు
ఈ మధ్యకాలంలో సినిమా కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతున్నారు మన హీరోలు. ఒక్కో సినిమాకి ప్రాణం పెట్టి పని చేస్తారు. క్యారెక్టర్ కోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్నారు. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కూడా ఇదే చేశాడు. తమిళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కార్తి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు సర్దార్ అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం తెగ కష్టపడుతున్న కార్తీ కంప్లీట్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. పీఎస్ మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ సగానికిపైగా పూర్తయింది. తాజాగా ఈ సినిమాలోని కొన్ని స్టిల్స్‌ని మూవీ టీం రిలీజ్ చేసింది. ఇందులో పూర్తిగా గుర్తు పట్టకుండా ఉన్న కార్తీని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పూర్తి మేకోవర్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తీ సరసన రాశీఖన్నా నటిస్తుంది. -
సర్దార్ షురూ..
కార్తీ హీరోగా నటించనున్న తాజా చిత్రానికి ‘సర్దార్’ టైటిల్ ఖరారైంది. ‘ఇరుంబు తిరై’ (తెలుగులో ‘అభిమన్యుడు’) ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించారు. ‘‘పీఎస్ మిత్రన్ తన సినిమాల్లో చెప్పే విషయాలు, చెప్పే విధానం నాకు ఆసక్తికరంగా ఉంటుంది. మిత్రన్‌తో కలిసి ‘సర్దార్’ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కార్తీ. ఈ చిత్రంలో హిందీ నటుడు చంకీ పాండే ఓ కీలక పాత్ర చేయనున్నారు. -
నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్లు జైలు శిక్ష
ఇస్లామాబాద్ : అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. షరీఫ్ తనయ మర్యమ్, అల్లుడు కెప్టెన్ సర్దార్లు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. పనామా కుంభకోణంలో బయటపడ్డ షరీఫ్ అవినీతి బాగోతంపై పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. షరీఫ్‌పై మొత్తం నాలుగు అవినీతి కేసులు ఉన్నాయి. వీటిలో లండన్ అవెన్ఫీల్డ్లోని నాలుగు ఫ్లాట్ల కేసు ఒకటి. కాగా, తీర్పును వారం రోజుల పాటు వాయిదా వేయాల్సిందిగా షరీఫ్ కోర్టును కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. ఈ మేరకు ఏర్పాటైన ప్రత్యేక న్యాయస్థానం పలు దఫాలుగా కేసును విచారిస్తూ వస్తోంది. శుక్రవారం కేసులో తీర్పును వెలువరించిన న్యాయమూర్తి నవాజ్ షరీఫ్ 10 ఏళ్ల ఖైదుతో పాటు 8 మిలియన్ పౌండ్ల జరిమానా విధించారు. మర్యమ్‌కు ఏడేళ్ల జైలు శిక్షతో పాటు 2 మిలియన్ పౌండ్ల జరిమానా, సర్దార్కు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, తీర్పు నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్లు పాకిస్తాన జాతీయ పత్రిక డాన్ పేర్కొంది. కోర్టు ప్రసారాలను లండన్ నుంచి షరీఫ్ ఫ్యామిలీ లైవ్‌లో తిలకించినట్లు రిపోర్టులు కూడా వస్తున్నాయి. -
కాసిపేట గని సర్ధార్‌పై సస్పెన్షన్ వేటు
కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేట గనిలో సర్ధార్ సారం శంకరయ్యపై సస్పెన్షన్ వేటు పడింది. బుధవారం పది రోజుల సస్పెండ్ ఉత్తర్వులు అందించి ఒక్కరోజు గడవగానే సస్పెన్షన్ ఆర్డర్ రద్దు చేశారు. సూపర్వైజర్, ఇంజినీర్లకు హెచ్చరికలతో వదిలి సర్ధార్‌ను సస్పెండ్ చేయడం మానసికంగా వేధించడమేనని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 15న గనిలో స్టార్టర్ మీదపడి కోట శ్రీనివాస్ అనే ఎలక్ట్రీషీయన్ కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. మొదట సాధారణ గాయాలు అని సరిపెట్టుకున్న అధికారులు పరిస్థితి తీవ్రంగా ఉండి శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో ఆపరేషన్ కావడంతో విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిబ్బంది కేటాయింపు పనుల పర్యవేక్షణలో సూపర్వైజర్, ఇంజినీరింగ్ అధికారుల బాధ్యత ఉండగా కేవలం సర్ధార్లను బలిచేయడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. వేధింపులు మానుకోవాలి సింగరేణిలో అధికారులు, సూపర్వైజర్లు సర్ధార్‌లు, ఓర్మెన్లపై వేధింపులు మానుకోవాలని హెచ్ఎమ్మెఎస్ ఏరియా ఉపాద్యక్షుడు బోనాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ డిస్ట్రిక్ సర్దార్ పరిధిలో టెండల్, జనరల్ మజ్ధూర్, టింబర్‌మెన్, సఫోర్ట్మెన్, కోల్‌కట్టర్, ఎలక్ట్రీషీయన్, హాలర్ డ్రైవర్స్, ఎస్‌డీయల్ అపరేటర్స్, పుషర్స్, హెల్ఫర్స్, షార్ట్ ఫైరర్, ట్రామర్, బెలన్మజ్ధూర్ వివిధ విభాగాలకు చెందిన కార్మికులు వివిధ పనిస్థలాల్లో పనిచేస్తుంటారన్నారు. ఎవరికి ఏం జరిగిన సర్ధార్‌ను బాధ్యడిని చేయడం సరికాదన్నారు. సంభంధం లేని విషయంలో కాసిపేటగనిలో ఎలక్ట్రీషియన్‌కు గాయాలు కాగా సర్ధార్‌ను సస్పెండ్ చేయడం దారుణమన్నారు. -
ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి
షాద్‌నగర్: సర్ధార్ సర్వాయి పాపన్న జయంతిని పట్టణంలో గౌడ సంఘం, యువజన గౌడ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యకూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యకూడలి నుంచి ప్రభుత్వఆస్పత్రి వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బెడ్డ్రు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ పాపన్న గ్రామీణ ప్రాంతంలో అతిసాధారణ కుటుంబంలో జన్మించి బడుగు, బలహీన వర్గాల అధిపత్యం కోసం తిరుగుబాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ నెల 20న యూనివర్సల్ ఫంక్షన్హల్లో జయంతి ఉత్సవాలను చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మణికొండ రంగయ్యగౌడ్, వన్నాడ ప్రకాష్‌గౌడ్, మద్దూరి అశోక్‌గౌడ్, జినికుంట రాములుగౌడ్, కట్ట వెంకటేష్‌గౌడ్, పాలకొండ రజనికాంత్గౌడ్,జనార్ధన్‌గౌడ్, శేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లింగారెడ్డిగూడలో.. మండల పరిధిలోని లింగారెడ్డిగూడలో సర్ధార్ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివేకానందుని విగ్రహం వద్ద పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నారాయణగౌడ్, మాజీ సర్పంచ్ బాలనగర్ నర్సింహులు, అంజయ్యగౌడ్, సురేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్ధార్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమా?
తలపై బండరాయితో మోది మట్టుబెట్టిన దుండగులు కోదాడ మండలం గణపవరంలో ఘటన కోదాడరూరల్: ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దుండగు లు బండరాయితో తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. కోదాడ మండలం గణపవరం గ్రామంలో మంగళవారం ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన షేక్.సర్ధార్ (52) లారీడ్రైవర్‌గా పని చేస్తు జీవిస్తున్నాడు. ఎప్పటిలాగే డ్యూటీ ముగించుకుని సోమవారం ఇంటికి వచ్చాడు. అన్నం తిన ్న తర్వాత ఇంటి ఎదురుగా ఉన్న అరుగుపై పడుకునేందుకు వెళ్లాడు. అదే అరుగుపై పడుకోవాడానికి ఇంటి పక్కన ఉన్న మరో వ్యక్తి అక్కడకు వచ్చి చూడగా సర్ధార్ తలపై రాయిపడి ఉండటం గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఈలోపు చుట్టుపక్కల ఇంటి వారు గుమిగూడి అతడిని పరిశీలించగా అప్పటికే మృతిచెంది ఉన్నాడు. దాదాపుగా 50 కేజీల బరువున్న రాయిని తలపై ఎత్తివేయడంతో నుదుటి భాగం నుజ్జునుజ్జై తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. సమాచారం తెలుసుకుని కోదాడ రూరల్ సీఐ మధుసూదన్‌రెడ్డి, ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ ఆధ్వర్యంలో సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి డ్వాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంను పిలిపించి విచారణ చేపట్టారు. జాగిలాలు గ్రామ వీధుల నుంచి మేళ్లచెర్వు మండలం రామాపురం వైపు ఉన్న కల్వకట్ట వరకు వెళ్లి నిలిచి పోయాయి. మృతదేహానికి కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. వివాహేతర సంబంధమే కారణమా? సర్ధార్ హత్యకు వివాహేతర సంబంధమే కారణమై ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్ధార్ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని పదిహేనేళ్లుగా అక్కడే ఉన్నాడు. నాలుగేళ్ల క్రితం కుమారుడి వివాహానికి వచ్చి భార్య వద్దనే ఉంటున్నాడు. తమను దూరం చేశాడనే ఉద్దేశంతోనే వివాహేతర సంబంధం పెట్టుకున్న సదరు మహిళ, ఆమె కుమారుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి కుమారుడు జానీపాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లారీడ్రైవ ర్గా పనిచేస్తున్న సర్ధార్ ఇంకా ఎరితోనైనాన గొడవలు పెట్టుకున్నాడా.. అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, వివాహాలైన ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
నల్లగొండలో వ్యక్తి దారుణ హత్య
కోదాడ: నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. కోదాడ మండలం గణపవరానికి చెందిన సర్దార్ అనే వ్యక్తి సోమవారం రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండగా గుర్తు తెలియని దుండగులు రాళ్లతో అతని తలపై మోది చంపారు. కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం చూసేసరికి సర్దార్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
పటేల్‌కు న్యాయం జరగలేదు
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు చరిత్రలో న్యాయం జరగలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం ఇక్కడ తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘దేశ సమైక్యతకు, సంస్థానాల విలీనానికి, స్వాతంత్య్రానంతరం దేశంలో శాంతి నెలకొల్పేందుకు పటేల్ చేసిన కృషిని నేడు దేశం స్మరించుకుంటోంది. దేశ తొలి ప్రధానిగా పటేల్ అయి ఉంటే దేశ ప్రగతి వేరేలా ఉండేదని దేశ ప్రజల భావన. పటేల్ పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరం. చరిత్రలో చాలా మంది నాయకులకు తగిన గుర్తింపు లభించలేదు. దేశం కోసం కృషిచేసిన నాయకులను దేశానికి ప్రస్తుతం తెలియపరుస్తున్నాం..’ అని పేర్కొన్నారు. ‘సర్దార్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు కాదు. ఆయన జాతీయ నాయకుడు. పటేల్ జయంతిని కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది..’ అని పేర్కొన్నారు. -
సంక్రాంతి బరిలో కూడా 'సర్ధార్' లేనట్టేనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ లో భారీ మాస్ పాలోయింగ్ ఉన్న స్టార్ హీరో.. వరుస సూపర్ హిట్స్ తో ఇండస్ట్రీ రికార్డ్స్ సెట్ చేసిన పవర్ స్టార్ చాలా రోజులుగా షూటింగ్ లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అత్తారింటింకి దారేది లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత గోపాల గోపాల మూవీలో స్పెషల్ క్యారెక్టర్ చేసిన పవన్ ఆ తరువాత చాలా కాలం పాటు ముఖానికి రంగు వేసుకోలేదు. మధ్యలో పొలిటికల్ టర్న్ తీసుకున్న పవన్ చాలా రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. గబ్బర్ సింగ్ సక్సెస్ తరువాత ఆ సినిమాకు సీక్వల్ ఉంటుందని ఎనౌన్స్ చేసిన పవన్... సంపత్ నందితో కలిసి కథ కథనాలను కూడా రెడీ చేశాడు. అయితే మధ్యలో ఏ సమస్య వచ్చిందో ఏమోగాని సంపత్ ను సీన్ నుంచి తప్పించి పవర్ ఫేం బాబీతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అంతా రెడీగా ఉన్న పవన్ మాత్రం ఈ సినిమాను ఎప్పటికి పూర్తి చేస్తాడో అర్థం కావటం లేదు. నటీనటుల ఎంపిక కోసం నెలల తరబడి వెయిట్ చేయించిన పవర్ స్టార్ ఇంకా చాలా మంది ఎంపిక విషయంలో ఆలోచనలోనే ఉన్నాడు. దీనికి తోడు రెండు షెడ్యూల్లు పూర్తయినట్టుగా చెపుతున్నా అందులో పవన్ నటించిన సీన్స్ మాత్రం ఒకటి రెండుకు మించి లేవన్న టాక్ వినిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలోకి సర్ధార్ ను తీసుకురావటం కష్టంగానే కనిపిస్తుంది. -
సర్ధార్‌గా మారిన గబ్బర్ సింగ్
-
సర్దార్... స్టార్టయ్యాడు
పవన్ కల్యాణ్ ఎట్టకేలకు మళ్ళీ కెమెరా ముందుకొచ్చారు. ‘గోపాల... గోపాల’ చిత్రం తరువాత కొద్ది నెలలుగా మేకప్ వేసుకోని పవర్‌స్టార్ ఇప్పుడు తన తాజా చిత్రం ‘సర్దార్’ షూటింగ్లో పాల్గొనడం మొదలుపెట్టారు. గతంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో బాక్సాఫీస్ హిట్ ‘గబ్బర్‌సింగ్’ ద్వారా జనసామాన్యాన్ని ఉర్రూతలూపిన పవన్ దాదాపు దానికి సీక్వెల్ తరహాలో ఉండేలా ఈ కొత్త సినిమాను డిజైన్ చేశారు. ముందుగా ‘గబ్బర్‌సింగ్-2’ అని టైటిల్ ప్రచారమైనా, చివరకు ‘సర్దార్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఆ మధ్య పుణే సమీపంలోని కొండ ప్రాంతాల్లో జరిగిన సంగతి తెలిసిందే. మూడు రోజులుగా హైదరాబాద్‌లో జరుగుతున్న రెండో షెడ్యూల్లో పవన్‌కల్యాణ్ రంగప్రవేశం చేశారు. ‘‘సర్దార్... గబ్బర్‌సింగ్ షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఎప్పటిలానే చాలా డైనమిక్‌గా, డ్యాషింగ్‌గా కనిపిస్తున్నారు’’ అని చిత్ర నిర్మాత శరత్ మరార్ పేర్కొన్నారు. సాధారణంగా సినిమా మొదలైన చాలా రోజుల తరువాత కానీ ఫస్ట్‌లుక్‌లు విడుదల చేయరు. కానీ, ‘సర్దార్’కున్న క్రేజ్ దృష్ట్యానో, మరింత క్రేజ్‌ను తెచ్చేందుకనో కానీ, ఫస్ట్‌లుక్ స్టిల్ ఒకటి శుక్రవారం మధ్యాహ్నం విడుదల చేశారు. శరత్ మరార్ సైతం ఆ మాటే ఒప్పుకుంటూ, ‘‘ఫోటోలను కొంత ఆలస్యంగా రిలీజ్ చేయడం ఆనవాయితీ. కానీ, పవన్ కల్యాణ్ మాత్రం ఫ్యాన్స్ కోసం వ్యక్తిగతంగా ఈ చిత్రాన్ని షూట్ చేయించి, కంపోజ్ చేశారు’’ అని వివరించారు. పవన్‌కల్యాణ్ కేవలం వెనక నుంచి పోలీస్ డ్రెస్‌లో, తుపాకీతో, గ్యాంగ్‌ను ఎదుర్కొంటున్నట్లు స్టిల్‌లో కనిపించారు. ఆయన ముఖం కూడా కనిపించకపోయినా, సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే ఈ స్టిల్ వైరల్‌గా వ్యాపించడం విశేషం. ‘పవర్’ చిత్ర ఫేమ్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఒక ఘట్టం కోసం ఇప్పటికే పవన్‌కల్యాణ్ గుబురు గడ్డం పెంచారు. ఇక, పవన్ కల్యాణ్ ఈ సినిమాలో ఎన్ని గెటప్‌లు వేస్తారో, ఏవేం డైలాగ్‌లు చెబుతారో వేచిచూడాలి. -
గబ్బర్‌సింగ్-2 పేరు మార్చిన పవన్