ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకుపండ్లు పంపిణీచేస్తున్న గౌడ సంఘం నాయకులు
ఘనంగా సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి
Published Thu, Aug 18 2016 6:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
షాద్‌నగర్: సర్ధార్ సర్వాయి పాపన్న జయంతిని పట్టణంలో గౌడ సంఘం, యువజన గౌడ సంఘం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యకూడలిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యకూడలి నుంచి ప్రభుత్వఆస్పత్రి వరకు ర్యాలీగా తరలివెళ్లారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బెడ్డ్రు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడు తూ పాపన్న గ్రామీణ ప్రాంతంలో అతిసాధారణ కుటుంబంలో జన్మించి బడుగు, బలహీన వర్గాల అధిపత్యం కోసం తిరుగుబాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ నెల 20న యూనివర్సల్ ఫంక్షన్‌హల్‌లో జయంతి ఉత్సవాలను చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మణికొండ రంగయ్యగౌడ్, వన్నాడ ప్రకాష్‌గౌడ్, మద్దూరి అశోక్‌గౌడ్, జినికుంట రాములుగౌడ్, కట్ట వెంకటేష్‌గౌడ్, పాలకొండ రజనికాంత్‌గౌడ్,జనార్ధన్‌గౌడ్, శేఖర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
లింగారెడ్డిగూడలో..
మండల పరిధిలోని లింగారెడ్డిగూడలో సర్ధార్ సర్వాయి పాపన్న జయంతిని ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివేకానందుని విగ్రహం వద్ద పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నారాయణగౌడ్, మాజీ సర్పంచ్ బాలనగర్ నర్సింహులు, అంజయ్యగౌడ్, సురేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement