
కోలీవుడ్‌లో ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుడు కార్తీ. ఈయన ఇటీవల నటించిన 'సత్యం సుందరం' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. కాగా తాజాగా కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాలలో సర్ధార్ 2 ఒకటి. నటుడు కార్తీ పోలీస్ అధికారిగా, సర్ధార్‌గా ధ్విపాత్రాభినయం చేసిన చిత్రం సర్ధార్. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణన్ నిర్మించిన ఈ చిత్రానికి పీఎస్.మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో అదే కాంబినేషన్‌లో పార్ట్-2 ప్లాన్ చేశారు. ఇందులోనూ కార్తీ ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

ఆయన సరసన నటి మాళవిక మోహన్, ఆషీకా రంగనాథ్, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నటుడు ఎస్‌జే.సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న సర్ధార్ –2 చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అందులో భాగంగా చిత్ర డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంబించారు. కాగా ప్రస్తుతం నటుడు కార్తీ ఈ చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నారు. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భారీ అంచనాలు సంతరించుకున్న ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని, జార్జ్ విల్లియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా సర్ధార్ –2 చిత్రం త్వరలోనే తెరపైకి రానుందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment