చిరంజీవితో సినిమా తర్వాత మరో ఛాన్స్‌ కొట్టేసిన ఆషికా రంగనాథ్‌ | Ashika Ranganath Get Movie Chance With Karthi | Sakshi
Sakshi News home page

చిరంజీవితో సినిమా తర్వాత మరో ఛాన్స్‌ కొట్టేసిన ఆషికా రంగనాథ్‌

Published Tue, Aug 6 2024 6:57 AM | Last Updated on Tue, Aug 6 2024 8:45 AM

Ashika Ranganath Get Movie Chance With Karthi

కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ మరో బంపర్‌ ఆఫర్‌ దక్కించుకుంది. ఇప్పటికే మెగాస్టార్‌ విశ్వంభరలో ఛాన్స్‌ అందుకున్న ఈ బ్యూటీకి సౌత్‌ ఇండియా స్టార్‌ హీరో సినిమాలో ఎంట్రీ ఇచ్చేసింది. 'సర్దార్‌ 2' సినిమా కోసం కార్తితో ఆషికా రంగనాథ్‌ జోడీ కట్టనున్నట్లు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే, ఆమె పుట్టినరోజు సందర్భంగా తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా  పోస్ట్‌ చేసింది.

ఆషికా రంగనాథ్‌ను సర్దార్‌2 ప్రాజెక్ట్‌లోకి స్వాగతిస్తున్నట్లు తెలియజేస్తూ మేకర్స్‌ ఒక పోస్టర్‌ను కూడా వివడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాలో మాళవిక మోహనన్‌ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎస్‌.జె. సూర్య కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.  స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీఎస్‌.మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాదిలో  ఈ చిత్రం విడుదల కానుంది.

అమిగోస్‌ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఆషిక ఈ ఏడాదిలో నాగార్జున సరసన ‘నా సామిరంగ’లో మెప్పించింది. దీంతో తెలుగులో రెండు సినిమాల అనుభవంతోనే తన మూడో సినిమా  మెగాస్టార్‌తో నటించే అవకాశం అందుకుంది. ‘విశ్వంభర’లో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కార్తితో ఆమెకు ఛాన్స్‌ దక్కడంతో అభిమానులు సంతోషిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement