Satyam Sundaram Movie
-
OTT Review: నాటి తీపి గుర్తుల నేటి సినిమా
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం ‘సత్యం సుందరం’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనల్ని కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. మరి కొన్ని సినిమాలు ఆవేశాన్నిస్తాయి. ఇంకొన్ని సినిమాలు ఆనందాన్నిస్తాయి. చాలా కొన్ని సినిమాలు మన మనసులో పదిలంగా నిలిచిపోతాయి. ఎందుకంటే పరోక్షంగానో, ప్రత్యక్షంగానో అవి మన గడిచిన జీవితపు గతాల తెరలను తొలగిస్తాయి కాబట్టి. అటువంటి వాటి కోవలో ముందుండే సినిమా ‘మెయ్యళగన్’. ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘సత్యం సుందరం’ నెట్‌ఫ్లిక్స్ వేదికగా లభ్యమవుతోంది.దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఈ సినిమాని సినిమాలా తీయలేదు, మన గత జీవితాలను మళ్లీ మనకు పరిచయం చేశారంతే. ఒకరిద్దరు భారీ తారాగణం తప్ప పెద్ద కథ, పెద్ద సెట్లు, పెద్ద లొకేషన్లు ఇలాంటి ఆకర్షణలేవీ లేవు ఈ సినిమాలో. కానీ మనసున్న ప్రతి ఒక్కరినీ ఈ సినిమా మెప్పిస్తుందనడంలో సందేహమే లేదు. ప్రతి ఇంట్లో జరిగే ఓ సున్నితమైన అంశాన్ని కథగా తీసుకుని చాలా నేచురల్‌గా తెరకెక్కించారు దర్శకుడు. కథాపరంగా సత్యం ఉంటున్న ఇల్లు దాయాదుల గొడవల్లో పోతుంది. ఆ బాధతోనే సత్యం కుటుంబం ఉన్న ఊరిని ఉన్న పళంగా విడిచి వెళ్లిపోతుంది. ఇక్కడ నుండే సినిమా ్రపారంభమవుతుంది.పద్దెనిమిదేళ్ల తర్వాత సత్యం తన బాబాయి కూతురు పెళ్లి కోసం మళ్లీ ఆ ఊరులోకి బాధతోనే అడుగుపెట్టవలసివస్తుంది. పెళ్లిలో సత్యాన్ని అతని చుట్టం సుందరం కలుస్తాడు. కానీ సుందరాన్ని సత్యం గుర్తు పట్టడు. సుందరం మాత్రం సత్యం మీద వల్లమాలిన అభిమానాన్ని, ప్రేమను చూపిస్తాడు. అసలే ఆ ఊరితో ఉన్న చికాకుతో పాటు సుందరం ఎవరో గుర్తు రాకపోయినా అతను చూపించే ప్రేమ సత్యాన్ని మరింత మధనపెడుతుంది. మరి... ఆఖరికి సుందరం ఎవరో సత్యం గుర్తుపట్టాడా లేదా? అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. సత్యం పాత్రలో అరవిందస్వామి, సుందరం పాత్రలో కార్తీ తమ పాత్రలలో జీవించేశారు. సినిమా మొత్తం ఈ రెండు పాత్రల మీదే ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఇది సినిమా కాదు... మన గతం. నాటి తీపి గుర్తుల నేటి సినిమా ఈ ‘సత్యం సుందరం’. వర్త్ టు వాచ్. – ఇంటూరు హరికృష్ణ -
ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు
మరో వీకెండ్ వచ్చేసింది. కాకపోతే ఈసారి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. ఉన్నంతలో 'పొట్టేల్' మూవీ కాస్త కనిపిస్తుంది. మిగిలినవన్నీ చిన్న మూవీస్. మరోవైపు ఓటీటీలో మాత్రం ఏకంగా 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో తెలుగు స్ట్రెయిట్ మూవీస్ దగ్గర నుంచి డబ్బింగ్ బొమ్మల వరకు ఉన్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ తెలుగు మూవీ)ఓటీటీల్లోకి ఈ వీకెండ్ వచ్చిన వాటిలో చూడాల్సిన సినిమాలైతే నాలుగైదు వరకు ఉన్నాయి. వీటిలో స్వాగ్, సత్యం సుందరం, దో పత్తి, లిటిల్ హార్ట్స్ చిత్రాల్ని అస్సలు మిస్సవ్వొద్దు. వీటితో పాటు జ్విగటో అనే హిందీ మూవీ, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 సిరీస్ కుదిరితే చూడొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీల్లోకి వచ్చిందనేది చూద్దాం.ఓటీటీలోకి వచ్చేసిన సినిమాల జాబితా (అక్టోబర్ 25)అమెజాన్ ప్రైమ్స్వాగ్ - తెలుగు సినిమాలైక్ ఏ డ్రాగన్: యకూజా - జపనీస్ సిరీస్నౌటిలిస్ - ఇంగ్లీష్ సిరీస్జ్విగటో - హిందీ మూవీకడసై ఉలగ పొర్ - తమిళ సినిమాక్లౌడీ మౌంటైన్ - చైనీస్ మూవీహాట్స్టార్ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 - తెలుగు డబ్బింగ్ సిరీస్ఆహాఅన్స్టాపబుల్ సీజన్ 4 - తెలుగు టాక్ షోక్రిమినల్ ఆర్ డెవిల్ - తెలుగు సినిమాలిటిల్ హార్ట్స్ - తెలుగు డబ్బింగ్ మూవీనెట్ఫ్లిక్స్సత్యం సుందరం - తెలుగు డబ్బింగ్ మూవీదో పత్తి - హిందీ సినిమాడోంట్ మూవ్ - ఇంగ్లీష్ మూవీహెల్ బౌండ్ సీజన్ 2 - కొరియన్ సిరీస్హైజాక్ 93 - ఇంగ్లీష్ సినిమాఇబిలిన్ - నార్వేజియన్ మూవీసైమన్ బైల్స్ రైజింగ్ పార్ట్ 2 - ఇంగ్లీష్ సిరీస్ద లాస్ట్ నైట్ ఎట్ ట్రెమొరో బీచ్ - స్పానిష్ సిరీస్జియో సినిమాద మిరండా బ్రదర్స్ - హిందీ సినిమాబుక్ మై షోద ఎక్స్టార్షన్ - స్పానిష్ మూవీజీ5ఐందమ్ వేదమ్ - తెలుగు డబ్బింగ్ మూవీఆయ్ జిందగీ - హిందీ సినిమాఆపిల్ ప్లస్ టీవీబిఫోర్ - ఇంగ్లీష్ సిరీస్(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: వెనకబడ్డ నిఖిల్.. విన్నింగ్ రేస్‌లో ప్రేరణ!) -
ఓటీటీలో 'సత్యం సుందరం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
కార్తి - అరవింద్ స్వామి కాంబినేషన్లో వచ్చిన సినిమా 'సత్యం సుందరం'. ఫీల్‌గుడ్ చిత్రంగా ప్రేక్షకుల నుంచి మించి రివ్యూస్‌నే దక్కించుకుంది. సూర్య-జ్యోతిక తక్కువ బడ్జెట్లో ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీంతో 'సత్యం సుందరం' అభిమానుల్లో సంతోషం కనిపిస్తుంది.తమిళంలో '96' వంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో అందుబాటులో ఉండనుంది. థియేటర్లో చూడలేకపోయిన వారు తమ ఫ్యామిలీ, స్నేహితులతో తప్పక చూడాల్సిన సినిమాగా నెటిజన్లు చెప్పుకొచ్చారు. కథ అయితే, చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సుమారు 3 గంటలపాటు ప్రేక్షకులను దర్శకుడు మెప్పించాడు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 60 కోట్లు రాబట్టిన 'సత్యం సుందరం' మంచి లాభాలను అందించారు. చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఈ వారం ఓటీటీల్లో 24 సినిమాలు రిలీజ్.. ఆ మూడు స్పెషల్
మరో వారంలో దీపావళి రానుంది. దీంతో ఈ వారం థియేటర్ల దగ్గర పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేం రావట్లేదు. 'పొట్టేల్', లగ్గం, సీ 202, రోటి కపడా రొమాన్స్, నరుడి బ్రతుకు నటన తదితర చిత్రాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో 'పొట్టేల్'పై కాస్త కూస్తో బజ్ ఉన్నట్లు కనిపిస్తుంది. మరోవైపు ఓటీటీలో మాత్రం దాదాపు 24 సినిమాలు/వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: ప్లేటు తిప్పేసిన మణికంఠ.. ఎలిమినేషన్ తర్వాత కూడా)ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ విషయానికొస్తే దో పత్తి, సత్యం సుందరం సినిమాలతో పాటు అన్‌స్టాపబుల్ సీజన్ 4 టాక్ షో, ఐందమ్ వేదమ్, ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ ఐదో సీజన్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇవి కాకుండా ఏమైనా సర్ప్రైజ్ స్ట్రీమింగ్ ప్రకటనలు ఉన్నా సరే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో వస్తుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ జాబితా (అక్టోబర్ 21 నుంచి 27వరకు)నెట్ఫ్లిక్స్హసన్ మిన్హా (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 22ఫ్యామిలీ ప్యాక్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 23ద కమ్ బ్యాక్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 23బ్యూటీ ఇన్ బ్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 24టెర్రిటరీ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 24ద 90'స్ షో పార్ట్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 24దో పత్తి (హిందీ సినిమా) - అక్టోబర్ 25డోంట్ మూవ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 25హెల్ బౌండ్ సీజన్ 2 (కొరియన్ సిరీస్) - అక్టోబర్ 25ద లాస్ట్ నైట్ ఎట్ ట్రెమోర్ బీచ్ (స్పానిష్ సిరీస్) - అక్టోబర్ 25సత్యం సుందరం (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 25 (రూమర్ డేట్)అమెజాన్ ప్రైమ్కడైసి ఉలగ పొర్ (తమిళ సినిమా) - అక్టోబర్ 25లైక్ ఏ డ్రాగన్: యాకుజా (జపనీస్ సిరీస్) - అక్టోబర్ 25జ్విగటో (హిందీ సినిమా) - అక్టోబర్ 25నౌటిలస్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 25హాట్స్టార్ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 5 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 25ఆహాఅన్స్టాపబుల్ సీజన్ 4 (తెలుగు టాక్ షో) - అక్టోబర్ 25జీ5ఐందమ్ వేదమ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - అక్టోబర్ 25ఆయ్ జిందగీ (హిందీ మూవీ) - అక్టోబర్ 25జియో సినిమాద బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 21ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (తెలుగు డబ్బింగ్ మూవీ) - అక్టోబర్ 23ద మిరండా బ్రదర్స్ (హిందీ సినిమా) - అక్టోబర్ 25ఆపిల్ ప్లస్ టీవీబిఫోర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 25బుక్ మై షోద ఎక్స్టార్షన్ (స్పానిష్ మూవీ) - అక్టోబర్ 25(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో) -
ఓటీటీలోకి కార్తీ ఫీల్ గుడ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
ఎన్టీఆర్ 'దేవర'తో పాటు ఓ తమిళ డబ్బింగ్ సినిమా రిలీజైంది. అదే 'సత్యం సుందరం'. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన కార్తీ ఇందులో హీరోగా నటించాడు. ఫీల్ గుడ్ స్టోరీతో తీసిన ఈ మూవీకి అద్భుతమైన స్పందన వచ్చింది. చూసినోళ్లందరూ మెచ్చుకున్నారు. కానీ 'దేవర' వల్ల ఎక్కువమందికి చూడలేకపోయారు. ఇప్పుడు ఇది ఓటీటీలోకి వచ్చేయడానికి సిద్ధమైపోయింది.'96' సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ చిత్ర దర్శకుడు ప్రేమ్ కుమార్ తీసిన లేటెస్ట్ మూవీ 'సత్యం సుందరం'. తమిళంలో మైయళగన్ పేరుతో రిలీజ్ చేశారు. తెలుగు వరకు వచ్చేసరికి టైటిల్ మార్చారు. ఓ రాత్రిలో జరిగే కథతో దీన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీ డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. లెక్క ప్రకారం దీపావళికి స్ట్రీమింగ్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఓ వారం ముందే తీసుకొచ్చే ప్లాన్‌లో ఉన్నారట.(ఇదీ చదవండి: సాయిపల్లవి.. నన్ను అన్నయ్య అనేసరికి బాధపడ్డా: స్టార్ హీరో)అక్టోబర్ 25 నుంచే 'సత్యం సుందరం' సినిమా తెలుగులోనూ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమా విషయానికొస్తే.. సత్యం (అరవింద స్వామి) అనే వ్యక్తి కొన్ని పరిస్థితుల వల్ల సొంతూరిని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. చిన్నాన్న కూతురు పెళ్లి కోసం దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తిరిగి వస్తాడు. ఆ పెళ్లిలో సుందరం (కార్తి) బావ అని తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి జర్నీ ఎలా సాగిందనేదే స్టోరీ.ఈ సినిమాలో చెప్పుకోవడానికి పెద్ద కథేం ఉండదు. కానీ చిన్న అనుభూతుల్ని కూడా ఎంతో అందంగా చూపించిన విధానం, అలానే కుటుంబం, బంధాల్ని ఎష్టాబ్లిష్ చేసిన విధానం కన్నీళ్లు పెట్టిస్తుంది. మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టమున్నవాళ్లు మాత్రం ఓటీటీలోకి వచ్చిన తర్వాత దీన్ని అస్సలు మిస్సవ్వొద్దు.(ఇదీ చదవండి: అరెస్ట్ న్యూస్.. వీడియో రిలీజ్ చేసిన బిగ్ బాస్ శేఖర్ భాషా) -
బాలపిట్టలూ బయటికెగరండి
Dasara holidays: తెలిసిన ఊరే. దసరా సెలవుల్లో కొత్తగా హుషారుగా అనిపిస్తుంది. మేనమామ కొడుకు మనం ఎప్పుడొస్తామా... ఊరంతా తిప్పి ఎప్పుడు చూపుదామా అని ఉంటాడు. మేనత్త కూతురి దగ్గర బోలెడన్ని బొమ్మలు. ఒకరోజు అందరూ కూడి బొమ్మల పెళ్లి కూడా చేయొచ్చు. చిన్న ఊరే. కాని మిఠాయి కొట్టు దగ్గరకు వెళ్లి మిఠాయి కొనుక్కోవడం... పాత సినిమా హాల్లో ఆడే పాత సినిమాను చూడటం... వీధిలోని కుర్రాళ్లను పిలవనవసరం లేకుండా మన బంధుగణంలోని పిల్లలే సరిపోయే విధంగా క్రికెట్ ఆడటం... సరే... ఓటీటీలో సినిమాలు చూడటం.సెలవులొచ్చేది మనవాళ్లను కలవడానికి. కలిసి ఆటలు ఆడటానికి. పెద్దయ్యాక గుర్తు చేసుకోవడానికి. పూర్వం దసరా కోసం పిల్లలు కాచుకుని కూచునేవారు. ఇవాళ రేపు సెలవులొచ్చినా మంచి ర్యాంకుల కోసం తల్లిదండ్రులు ‘ఎక్కడికీ కదిలేది లేదని’ అదిలిస్తున్నారు. మరికొందరికి పిల్లల్ని తీసుకొని బంధువుల ఇంటికి వెళ్లడానికి తీరికే ఉండటం లేదు. కొందరికసలు బంధువులే లేరు. అంటే లేరని కాదు. ఉన్నా లేనట్టుగా వీరుంటారు. లేదా వారుంటారు. నడుమ అనుబంధాలు తెగేది పిల్లల మధ్య.పెద్దయ్యాక జ్ఞాపకాలు ఏమీ ఉండవు. ఉన్నా అవి చెప్పుకోదగ్గవి కావు. జ్ఞాపకాలంటే బాల్యమే. బాల్యంలో ఇష్టంగా గడిపే రోజులు సెలవులు. పిన్ని ఇల్లు, పెద్దమ్మ ఊరు, బాబాయి మిద్దె, పెదనాన్న వాళ్ల తోట, తాతయ్య వాళ్ల చేను, సొంతపల్లెలోని చెరువు గట్టు... ఇవన్నీ కజిన్స్‌తో... దగ్గరి బంధువులతో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది.ఇటీవల వచ్చిన ‘సత్యం సుందరం’ ఈ బాల్యాన్నే చూపుతుంది. సత్యం అనే పేరుండే అరవింద స్వామి ఇంటికి సుందరం అనే కార్తీ చిన్నప్పుడు సెలవుల్లో వస్తాడు. ఆ సెలవుల్లో చిన్న అరవింద స్వామి, చిన్న కార్తీ కలిసి ఎన్నో ఆటలు ఆడతారు. సినిమాలు చూస్తారు. ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. ఆ అభిమానమే కార్తీని పెద్దయ్యాక కూడా అరవింద స్వామి అంటే ప్రాణం ఇచ్చేలా చేస్తుంది. ప్రేమ పంచేలా చూస్తుంది. చిన్నప్పుడు వీళ్లు ఆడుకున్న ఆట ఏమిటో తెలుసా? చిన్న అరవింద స్వామిని కూరగాయలు తెమ్మని ఇంట్లో చెప్తే పిల్లలనందరినీ తీసుకొని బయలుదేరుతాడు. ఒకడి పేరు బెండకాయ అని పెడతాడు. ఎన్ని కిలోల బెండకాయలు తేవాలో పట్టిక అవసరం లేకుండా ఆ బెండకాయ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇంకొకడి పేరు వంకాయ అని పెడతాడు. ఒకమ్మాయి పేరు కాకర. మరి కార్తీకి ఏం పేరు పెడతాడు? సినిమా చూస్తే తెలుస్తుంది.‘చిన్నప్పుడు ఎంత బాగుండేది’ అని ఏ కాలంలో అయినా పిల్లలు అనుకునేలా వారి ఆటపాటలు సాగేలా పెద్దలు చూడాలి. ఆ ఆట΄ాటలన్నీ అయినవాళ్లతో జరగాలి. దసరా సెలవులు బంగారు గనులు. ఆ గనుల్లోకి పిల్లల్ని పంపండి. మర్చిపోవద్దు. -
ఆ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా : అరవింద్ స్వామి
‘సత్యం సుందరం’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అరవింద్ స్వామి. గతంలో రోజా, బొంబాయ్ లాంటి సినిమాలతో అలరించిన అరవింద్ స్వామి.. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు. ఈ చిత్రంలో అరవింద్‌తో పాటు కార్తి కూడా ప్రధాన పాత్రలో నటించాడు. సెప్టెంబర్ 28న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విడుదలై వారం దాటినా అటు కార్తితో పాటు ఇటు అరవింద్ స్వామి కూడా వరుస ఇంటర్యూలు ఇస్తూ తమ సినిమాను మరికొంత మందికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ స్వామి తన కెరీర్‌పై ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు మణిరత్నం ఇచ్చిన అవకాశంతోనే తన రీఎంట్రీ సాఫీగా సాగిపోతుందని చెప్పారు. ‘కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో కొన్ని సినిమాలను చేయలేకపోయాను. వెన్నెముకకు గాయం కావడంతో రెండేళ్ల పాటు రెస్ట్ తీసుకున్నాను. ఆ సయమంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా. అదే సమయంలో నా కాలికి పాక్షికంగా పక్షవాతం వచ్చింది. దీంతో దాదాపు 13 ఏళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నాను. మళ్లీ సినిమాల్లో నటించాలనుకోలేదు. మణిరత్నం ఆఫర్ ఇవ్వడంతో ఏ ప్లాన్ లేకుండానే రీఎంట్రీ ఇచ్చాను. కడల్(తెలుగులో కడలి) సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యాక నా సంతృప్తి కోసం రెండు హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నాను. సత్యం సుందరం చాలా ఇష్టంతో చేశాను. తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ప్రస్తుతం నా కెరీర్ చాలా బాగుంది’ అని అరవింద్ స్వామి అన్నారు. -
కార్తి ‘సత్యం సుందరం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
డియర్ కార్తీ.. మళ్లీ ఆ రోజుల్ని గుర్తుచేశావ్: నాగార్జున
కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్మెంట్పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదలైంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసింది. తమిళ్లో '96' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సి. ప్రేమ్‌కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.కుటుంబ కథా చిత్రంగా విడుదలైన ‘సత్యం సుందరం’ పట్ల ప్రేక్షకులు ఆధరణ భారీగానే ఉంది. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేస్తుంది. దీంతో తాజాగా ఈ చిత్రాన్ని చూసిన అక్కినేని నాగార్జున.. చిత్ర యూనిట్‌ను అభినందించారు. సినిమాకు ప్రధాన బలం అయిన కార్తీ, అరవింద్ స్వామి నటనకు ఆయన ఫిదా అయ్యారు.'డియర్ కార్తీ, నిన్న రాత్రి 'సత్యం సుందరం' సినిమా చూశాను!! మీరు, అరవింద్ స్వామి చాలా బాగా నటనతో మెప్పించారు. సినిమాలో నువ్వు కనిపించిన ప్రతిసారి నేను నవ్వుతూనే ఉన్నాను. అనంతరం ఆ చిరునవ్వుతోనే ప్రశాంతంగా నిద్రపోయాను. ఈ సినిమా ద్వారా ఎన్నో చిన్ననాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేశావ్... అలాగే మన సినిమా 'ఊపిరి' రోజులను కూడా గుర్తుచేశావ్. ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి కూడా ఈ చిత్రానికి ప్రశంసలు అందుతున్నాయి. ఇది చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. చిత్ర యూనిట్ అందరికీ నా అభినందనలు.' అని ఆయన మెచ్చుకున్నారు.అయితే, కార్తీ కూడా ఇలా స్పందించారు. థ్యాంక్యూ అన్నయా.. మీ మాటలతో అందించే ప్రోత్సాహం మాలో ఆనందాన్ని నింపింది. సినిమా మీకు నచ్చినందుకు సంతోసిస్తున్నాం. ఈ చిత్రంపై మీరు చూపించిన ఆదరణ మా అందరికీ ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది.' అని ఆయన అన్నారు. -
Satyam Sundaram Review: ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యం సుందరంనటీనటులు: కార్తి, అరవింద్ స్వామి, కిరణ్, దివ్య, జయ ప్రకాశ్నిర్మాతలు: సూర్య, జ్యోతిక దర్శకత్వం: ప్రేమ్ కుమార్సంగీతం: గోవింద్ వసంత్విడుదల తేది: సెప్టెంబర్ 28, 2024ఈ వారం బరిలో ఎన్టీఆర్ ‘దేవర’ ఉండడంతో ఇక్కడ మరో చిత్రమేది రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నా.. దేవర ఎంట్రీతో వెనక్కి తగ్గాయి. కానీ ఒక డబ్బింగ్ మూవీ మాత్రం టాలీవుడ్లో దేవరతో పోటీ పడేందుకు సిద్ధమైంది. అదే సత్యం సుందరం. తమిళ స్టార్ హీరోలు కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే...ఈ కథ 1996-2018 మధ్యకాలంలో సాగుతుంది. రామలింగం(జయ ప్రకాశ్) ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తాయి. దీంతో పూర్వికుల నుంచి వచ్చిన ఇంటిని, సొంత ఊరిని వదిలి కొడుకు సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి), భార్యతో కలిసి వైజాగ్‌కి వెళ్తాడు. 22 ఏళ్ల తర్వాత బాబాయ్ కూతురు భువన పెళ్లి కోసమై సత్య మళ్లీ తన సొంతూరు వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంతో సత్య ఊరికి వెళ్తాడు. తనకు ఇష్టమైన చెల్లి భువన పెళ్లిలో కనబడి వెంటనే వైజాగ్‌కి తిరిగి వద్దామనుకుంటాడు. అయితే పెళ్లిలో బావా..అంటూ ఓ వ్యక్తి(కార్తి) వచ్చి సత్యను ఆప్యాయంగా పలకరిస్తాడు. అతను ఎవరో సత్యకు తెలియదు. (చదవండి: దేవర మూవీ రివ్యూ)ఈ విషయం తెలిస్తే బాధపడతాడని తెలిసిన వ్యక్తిగానే ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే చిన్ననాటి విషయాలేవి గుర్తుకు రాకున్నా ఏదోలా మ్యానేజ్ చేస్తుంటాడు. తాను వెళ్లాల్సిన బస్ మిస్ అవ్వడంతో ఓ రాత్రంతా ఆ వ్యక్తితో గడపాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పరిచయంతో సత్య జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? పేరు కూడా తెలియని వ్యక్తి చూపించే అతి ప్రేమకు సత్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అసలు ఆ వ్యక్తి పేరు సుందరం అని సత్యకు ఎప్పుడు,ఎలా తెలిసింది? సత్యాని సుందరం అంత ఆప్యాయంగా చూసుకోవడానికి గల కారణం ఏంటి? సత్యతో సుందరానికి ఉన్న బంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కే చిత్రం ఏ భాషలోనైనా విజయం సాధించడం తథ్యం. ఈ విషయం డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌కి బాగా తెలుసు. అప్పుడు 96, ఇప్పుడు సత్యం సుందరం.. ఈ రెండు సినిమాల కథలు నేచురల్‌గా ఉంటాయి. హీరో పాత్ర మన చుట్టు ఉండే ఓ వ్యక్తిలాగానో లేదా మనలోనే చూసుకునేలా ఉంటుంది. 96 సినిమా మాదిరే సత్యం సుందరం కథ కూడా చాలా చిన్నది. అందరికి తెలిసిన, చూసిన కథ. అయినా కూడా తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. ఇది సినిమా లాగా కాకుండా ఎవరో మన ఆత్మీయులను చూస్తున్నట్లుగా, వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన మనకే జరిగిన అనుభూతి కలిగిస్తుంది.సినిమా ప్రారంభం అయినా కాసేపటికే మనం కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో కనెక్ట్ అయిపోతాం. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు..సన్నివేశాలన్నీ మన ఇంట్లోనో..లేదా మనకు తెలిసివాళ్ల ఇంట్లోనో జరిగినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి కొన్ని చోట్ల నవ్విస్తారు..మరికొన్ని చోట్ల ఏడిపిస్తారు. స్క్రీన్ మీద పండించిన ఎమోషన్‌కి సీట్లలో ఉండే ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్లు చెప్పుకునే చిన్ననాటి ముచ్చట్లు..మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇక సత్య తన చెల్లి భువనకు పట్టీలు పెట్టే సీన్ అయితే గుండెను బరువెక్కిస్తుంది. అతి ప్రేమను చూపించే వ్యక్తి పేరు తెలియక సత్య పడే బాధను చూసి మనకు కన్నీళ్లు వస్తాయి. సుందరం అమాయకత్వం, మంచితనం చూసి నవ్వుతూనే మనలో ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయా లేదా అని వెతుక్కుంటాం. వాళ్లు ఇద్దరు కలిసి మందేస్తే.. మత్తు మనకెక్కుతుంది. సైకిల్ సీన్ చూసి.. మనకు తెలియకుండానే కళ్లు తడిసిపోతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం అయ్యేలా చేయడం దర్శకుడు వందశాతం సక్సెస్ అయ్యాడు. అయితే, ప్రేమ్ కుమార్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ నరేషన్ మరీ స్లో ఉండడం. సినిమా నివిడి చాలా ఎక్కువ. అందుకే కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన కార్తి, అరవింద్ స్వామి ఇద్దరు బడా హీరోలే. కానీ ఆ ఇమేజ్ మాత్రం తెరపై ఏ మాత్రం కనిపించదు. తెరపై మనకు సత్యం, సుందరం పాత్రలే కనిపిస్తాయి కానీ ఎక్కడా కార్తి, అరవింద్ స్వామి గుర్తుకురారు. ప్రేమ్ కుమార్ రాసిన సహజ కథకు తమదైన సహస నటనతో ఇద్దరూ న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్లలో ఇద్దరూ పోటీ పడీ నటించారు. ఇక కార్తి అయితే తన అమాయకత్వపు నటనతో కొన్ని చోట్ల నవ్వించాడు. కిరణ్, దివ్య, జయ ప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ మరోసారి తనదైన మ్యూజిక్‌తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అతను అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజు పని తీరు చాలా బాగుంది. ప్రతిఫేమ్ని తెరపై చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 3.25/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
కార్తీ 'సత్యం సుందరం' HD మూవీ స్టిల్స్
-
ఆ ఇద్దరే ఈ సినిమాకి పెద్ద బలం : డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్
‘‘నేను తీసిన ‘96’ సినిమా ప్రేమకథ. కానీ, ‘సత్యం సుందరం’ కుటుంబ కథా చిత్రం. కార్తీ, అరవింద్ స్వామిగార్ల పాత్రల మధ్య ఒక రాత్రిలో జరిగే కథ. వాళ్ల మధ్య అనుబంధం ఏంటి? ఆ ఒక్క రాత్రిలో వారి మధ్య ఎలాంటి మానసిక సంఘర్షణ జరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ ఫ్యామిలీ డ్రామా బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ సి. ప్రేమ్‌కుమార్ అన్నారు. కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్మెంట్పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సి. ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘సత్యం సుందరం’ నవలని సినిమా స్క్రిప్ట్లాగానే రాశాను. కార్తీ, అరవింద్ స్వామిగార్లు ముందు నవలని చదివారు... వారికి బాగా నచ్చింది. ఆ నవలని స్క్రిప్ట్‌గా మలచడం సులభంగా అనిపించింది. కార్తీ, అరవింద్ స్వామిగార్లలో ఏ ఒక్కరు అంగీకరించకపోయినా ఈ సినిమా చేసేవాడిని కాదు. వాళ్లిద్దరే అలా నటించగలరు. వాళ్ల కెమిస్ట్రీ, కాంబినేషన్ ఈ సినిమాకి పెద్ద బలం. సూర్యగారికి సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం నిర్మించారు. గోవింద్ వసంత ‘96’కి ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చారో అందరికీ తెలుసు. ‘సత్యం సుందరం’కి కూడా అంతే అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమా తెలుగు వెర్షన్ డబ్బింగ్ అద్భుతంగా వచ్చింది’’ అన్నారు.