ఆ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా : అరవింద్‌ స్వామి | Arvind Swamy Opens Up About Spinal Injury That Left Him Bedridden For Two Years | Sakshi

తీవ్రమైన నొప్పితో బాధపడ్డా.. అందుకే 13 ఏళ్లు గ్యాప్‌ ఇచ్చా: అరవింద్‌ స్వామి

Oct 3 2024 6:04 PM | Updated on Oct 3 2024 6:47 PM

Arvind Swamy Opens Up About Spinal Injury That Left Him Bedridden For Two Years

‘సత్యం సుందరం’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అరవింద్‌ స్వామి. గతంలో రోజా, బొంబాయ్‌ లాంటి సినిమాలతో అలరించిన అరవింద్‌ స్వామి.. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు. ఈ చిత్రంలో అరవింద్‌తో పాటు కార్తి కూడా ప్రధాన పాత్రలో నటించాడు. సెప్టెంబర్‌ 28న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విడుదలై వారం దాటినా అటు కార్తితో పాటు ఇటు అరవింద్‌ స్వామి కూడా వరుస ఇంటర్యూలు ఇస్తూ తమ సినిమాను మరికొంత మందికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్‌ స్వామి తన కెరీర్‌పై ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు మణిరత్నం ఇచ్చిన అవకాశంతోనే తన రీఎంట్రీ సాఫీగా సాగిపోతుందని చెప్పారు. 

‘కెరీర్‌ పీక్‌లో ఉన్న  సమయంలోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో కొన్ని సినిమాలను చేయలేకపోయాను. వెన్నెముకకు గాయం కావడంతో రెండేళ్ల పాటు రెస్ట్‌ తీసుకున్నాను. ఆ సయమంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా. అదే సమయంలో నా కాలికి పాక్షికంగా పక్షవాతం వచ్చింది. దీంతో దాదాపు 13 ఏళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నాను. మళ్లీ సినిమాల్లో నటించాలనుకోలేదు.  

మణిరత్నం ఆఫర్‌ ఇవ్వడంతో ఏ ప్లాన్‌ లేకుండానే రీఎంట్రీ ఇచ్చాను. కడల్‌(తెలుగులో కడలి) సినిమాతో నా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. ఆ మూవీ షూటింగ్‌ పూర్తయ్యాక నా సంతృప్తి కోసం రెండు హాఫ్‌ మారథాన్‌లో పాల్గొన్నాను. సత్యం సుందరం చాలా ఇష్టంతో చేశాను. తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ప్రస్తుతం నా కెరీర్‌ చాలా బాగుంది’ అని అరవింద్‌ స్వామి అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement