aravind swamy
-
ఈయన్ను బయటకు పంపించేయండి: విజయ్ సేతుపతి
భిన్న నటులందరూ ఒకే దగ్గర సమావేశమయ్యారు. తమిళ సినీ స్టార్స్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), అరవింద్ స్వామి, మలయాళ హీరో ఉన్ని ముకుందన్, కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్, తెలుగు హీరో సిద్ధు జొన్నలగడ్డ, హిందీ నటుడు విజయ్ వర్మ.. అందరూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ప్రోమో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతాఇందులో విజయ్ సేతుపతి సరదా వ్యాఖ్యలకు మిగిలినవారంతా పడిపడి నవ్వారు. ఎవరైనా అద్భుతంగా నటిస్తే నేను అభద్రతాభావానికి లోనవుతాను. ఫలానా సన్నివేశంలో అంత ఈజీగా ఎలా యాక్ట్ చేశారు? అని ఆలోచిస్తుంటాను.. అని విజయ్ చెప్పుకుంటూ పోతుంటే అరవింద్ స్వామి నవ్వకుండా ఉండలేకపోయాడు.(చదవండి: Saif Ali Khan: వెన్నెముకలో విరిగిన కత్తి.. నటుడికి ప్లాస్టిక్ సర్జరీ)అంతా ఈయన వల్లే..అతడిని చూసి ప్రకాశ్ రాజ్ సైతం నవ్వేశాడు. ఈయన వల్లే నవ్వానంటూ ప్రకాశ్.. అరవింద్వైపు వేలు చూపించాడు. దీంతో సేతుపతి.. సర్.. ఈయన నన్ను మాట్లాడినవ్వట్లేదు. ఇంటర్వ్యూ మధ్యలో చెడగొడుతున్నాడు. వెంటనే ఈయన్ని బయట నిల్చోబెట్టండి అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తిని కోరాడు. దీంతో అక్కడున్న మిగతా నటులు సైతం ఘొల్లుమని నవ్వారు.రాత్రి సిట్టింగ్..కొన్నిసార్లు అరవింద్ స్వామి నాకు ఫోన్ చేసి ఇంటికి రమ్మంటాడు. వెళ్లాక మేము తాగుతూ కూర్చుంటాం. రెండుమూడు గంటలపాటు నన్ను టీజింగ్ చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లయితే తెల్లవారేవరకు నన్ను ఏడిపిస్తూనే ఉంటాడు అని సీక్రెట్ బయటపెట్టాడు. ఇక మరో సందర్భంలో జీవిత సత్యాన్ని బయటపెట్టాడు. జీవితం కొన్నిసార్లు మనకు పాఠాలు చెప్తుంది. దాన్ని నేర్చుకోకపోతే లైఫ్ మనకు గుణపాఠం చెప్తుందన్నాడు. చదవండి: ఇంట్లో దోపిడీయత్నం.. హీరో సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి! -
ఓటీటీలో 'సత్యం సుందరం'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
కార్తి - అరవింద్ స్వామి కాంబినేషన్లో వచ్చిన సినిమా 'సత్యం సుందరం'. ఫీల్‌గుడ్ చిత్రంగా ప్రేక్షకుల నుంచి మించి రివ్యూస్‌నే దక్కించుకుంది. సూర్య-జ్యోతిక తక్కువ బడ్జెట్లో ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీంతో 'సత్యం సుందరం' అభిమానుల్లో సంతోషం కనిపిస్తుంది.తమిళంలో '96' వంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో అందుబాటులో ఉండనుంది. థియేటర్లో చూడలేకపోయిన వారు తమ ఫ్యామిలీ, స్నేహితులతో తప్పక చూడాల్సిన సినిమాగా నెటిజన్లు చెప్పుకొచ్చారు. కథ అయితే, చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సుమారు 3 గంటలపాటు ప్రేక్షకులను దర్శకుడు మెప్పించాడు. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 60 కోట్లు రాబట్టిన 'సత్యం సుందరం' మంచి లాభాలను అందించారు. చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) -
ఆ సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా : అరవింద్ స్వామి
‘సత్యం సుందరం’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అరవింద్ స్వామి. గతంలో రోజా, బొంబాయ్ లాంటి సినిమాలతో అలరించిన అరవింద్ స్వామి.. చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు. ఈ చిత్రంలో అరవింద్‌తో పాటు కార్తి కూడా ప్రధాన పాత్రలో నటించాడు. సెప్టెంబర్ 28న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విడుదలై వారం దాటినా అటు కార్తితో పాటు ఇటు అరవింద్ స్వామి కూడా వరుస ఇంటర్యూలు ఇస్తూ తమ సినిమాను మరికొంత మందికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరవింద్ స్వామి తన కెరీర్‌పై ఆస్తకికర వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు మణిరత్నం ఇచ్చిన అవకాశంతోనే తన రీఎంట్రీ సాఫీగా సాగిపోతుందని చెప్పారు. ‘కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో కొన్ని సినిమాలను చేయలేకపోయాను. వెన్నెముకకు గాయం కావడంతో రెండేళ్ల పాటు రెస్ట్ తీసుకున్నాను. ఆ సయమంలో తీవ్రమైన నొప్పితో బాధపడ్డా. అదే సమయంలో నా కాలికి పాక్షికంగా పక్షవాతం వచ్చింది. దీంతో దాదాపు 13 ఏళ్ల పాటు నటనకు దూరంగా ఉన్నాను. మళ్లీ సినిమాల్లో నటించాలనుకోలేదు. మణిరత్నం ఆఫర్ ఇవ్వడంతో ఏ ప్లాన్ లేకుండానే రీఎంట్రీ ఇచ్చాను. కడల్(తెలుగులో కడలి) సినిమాతో నా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఆ మూవీ షూటింగ్ పూర్తయ్యాక నా సంతృప్తి కోసం రెండు హాఫ్ మారథాన్‌లో పాల్గొన్నాను. సత్యం సుందరం చాలా ఇష్టంతో చేశాను. తమిళ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తున్నారు. ప్రస్తుతం నా కెరీర్ చాలా బాగుంది’ అని అరవింద్ స్వామి అన్నారు. -
Satyam Sundaram Review: ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యం సుందరంనటీనటులు: కార్తి, అరవింద్ స్వామి, కిరణ్, దివ్య, జయ ప్రకాశ్నిర్మాతలు: సూర్య, జ్యోతిక దర్శకత్వం: ప్రేమ్ కుమార్సంగీతం: గోవింద్ వసంత్విడుదల తేది: సెప్టెంబర్ 28, 2024ఈ వారం బరిలో ఎన్టీఆర్ ‘దేవర’ ఉండడంతో ఇక్కడ మరో చిత్రమేది రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నా.. దేవర ఎంట్రీతో వెనక్కి తగ్గాయి. కానీ ఒక డబ్బింగ్ మూవీ మాత్రం టాలీవుడ్లో దేవరతో పోటీ పడేందుకు సిద్ధమైంది. అదే సత్యం సుందరం. తమిళ స్టార్ హీరోలు కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే...ఈ కథ 1996-2018 మధ్యకాలంలో సాగుతుంది. రామలింగం(జయ ప్రకాశ్) ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తాయి. దీంతో పూర్వికుల నుంచి వచ్చిన ఇంటిని, సొంత ఊరిని వదిలి కొడుకు సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి), భార్యతో కలిసి వైజాగ్‌కి వెళ్తాడు. 22 ఏళ్ల తర్వాత బాబాయ్ కూతురు భువన పెళ్లి కోసమై సత్య మళ్లీ తన సొంతూరు వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంతో సత్య ఊరికి వెళ్తాడు. తనకు ఇష్టమైన చెల్లి భువన పెళ్లిలో కనబడి వెంటనే వైజాగ్‌కి తిరిగి వద్దామనుకుంటాడు. అయితే పెళ్లిలో బావా..అంటూ ఓ వ్యక్తి(కార్తి) వచ్చి సత్యను ఆప్యాయంగా పలకరిస్తాడు. అతను ఎవరో సత్యకు తెలియదు. (చదవండి: దేవర మూవీ రివ్యూ)ఈ విషయం తెలిస్తే బాధపడతాడని తెలిసిన వ్యక్తిగానే ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే చిన్ననాటి విషయాలేవి గుర్తుకు రాకున్నా ఏదోలా మ్యానేజ్ చేస్తుంటాడు. తాను వెళ్లాల్సిన బస్ మిస్ అవ్వడంతో ఓ రాత్రంతా ఆ వ్యక్తితో గడపాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పరిచయంతో సత్య జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? పేరు కూడా తెలియని వ్యక్తి చూపించే అతి ప్రేమకు సత్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అసలు ఆ వ్యక్తి పేరు సుందరం అని సత్యకు ఎప్పుడు,ఎలా తెలిసింది? సత్యాని సుందరం అంత ఆప్యాయంగా చూసుకోవడానికి గల కారణం ఏంటి? సత్యతో సుందరానికి ఉన్న బంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కే చిత్రం ఏ భాషలోనైనా విజయం సాధించడం తథ్యం. ఈ విషయం డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌కి బాగా తెలుసు. అప్పుడు 96, ఇప్పుడు సత్యం సుందరం.. ఈ రెండు సినిమాల కథలు నేచురల్‌గా ఉంటాయి. హీరో పాత్ర మన చుట్టు ఉండే ఓ వ్యక్తిలాగానో లేదా మనలోనే చూసుకునేలా ఉంటుంది. 96 సినిమా మాదిరే సత్యం సుందరం కథ కూడా చాలా చిన్నది. అందరికి తెలిసిన, చూసిన కథ. అయినా కూడా తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. ఇది సినిమా లాగా కాకుండా ఎవరో మన ఆత్మీయులను చూస్తున్నట్లుగా, వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన మనకే జరిగిన అనుభూతి కలిగిస్తుంది.సినిమా ప్రారంభం అయినా కాసేపటికే మనం కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో కనెక్ట్ అయిపోతాం. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు..సన్నివేశాలన్నీ మన ఇంట్లోనో..లేదా మనకు తెలిసివాళ్ల ఇంట్లోనో జరిగినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి కొన్ని చోట్ల నవ్విస్తారు..మరికొన్ని చోట్ల ఏడిపిస్తారు. స్క్రీన్ మీద పండించిన ఎమోషన్‌కి సీట్లలో ఉండే ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్లు చెప్పుకునే చిన్ననాటి ముచ్చట్లు..మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇక సత్య తన చెల్లి భువనకు పట్టీలు పెట్టే సీన్ అయితే గుండెను బరువెక్కిస్తుంది. అతి ప్రేమను చూపించే వ్యక్తి పేరు తెలియక సత్య పడే బాధను చూసి మనకు కన్నీళ్లు వస్తాయి. సుందరం అమాయకత్వం, మంచితనం చూసి నవ్వుతూనే మనలో ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయా లేదా అని వెతుక్కుంటాం. వాళ్లు ఇద్దరు కలిసి మందేస్తే.. మత్తు మనకెక్కుతుంది. సైకిల్ సీన్ చూసి.. మనకు తెలియకుండానే కళ్లు తడిసిపోతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం అయ్యేలా చేయడం దర్శకుడు వందశాతం సక్సెస్ అయ్యాడు. అయితే, ప్రేమ్ కుమార్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ నరేషన్ మరీ స్లో ఉండడం. సినిమా నివిడి చాలా ఎక్కువ. అందుకే కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన కార్తి, అరవింద్ స్వామి ఇద్దరు బడా హీరోలే. కానీ ఆ ఇమేజ్ మాత్రం తెరపై ఏ మాత్రం కనిపించదు. తెరపై మనకు సత్యం, సుందరం పాత్రలే కనిపిస్తాయి కానీ ఎక్కడా కార్తి, అరవింద్ స్వామి గుర్తుకురారు. ప్రేమ్ కుమార్ రాసిన సహజ కథకు తమదైన సహస నటనతో ఇద్దరూ న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్లలో ఇద్దరూ పోటీ పడీ నటించారు. ఇక కార్తి అయితే తన అమాయకత్వపు నటనతో కొన్ని చోట్ల నవ్వించాడు. కిరణ్, దివ్య, జయ ప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ మరోసారి తనదైన మ్యూజిక్‌తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అతను అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజు పని తీరు చాలా బాగుంది. ప్రతిఫేమ్ని తెరపై చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 3.25/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఆ హీరో నా కన్నకొడుకు, కానీ మా మధ్య ఏ బంధమూ లేదు: నటుడి షాకింగ్ కామెంట్స్
అరవింద్ స్వామి.. ఈయన పేరు చెప్పగానే రోజా, బాంబే, ధృవ సినిమాలు గుర్తొస్తాయి. మొదటి రెండు సినిమాల్లో హీరోగా చేసిన ఈయన తర్వాతి కాలంలో విలన్‌గా మారాడు. సినిమాల్లోనే కాకుండా బిజినెస్‌లోనూ పేరు ప్రఖ్యాతలు గడించిన ఆయన తండ్రి ఎవరంటే చాలామంది వెంకటరామ దొరై స్వామి పేరు చెప్తారు. కానీ అరవింద్ స్వామి అసలు తండ్రి సింగం నటుడు డిల్లీ కుమార్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు. అరవింద్ నా కన్న కొడుకు అరవింద్ తన కన్నకొడుకు అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆయన మాట్లాడుతూ.. 'అరవింద్ స్వామి నా కొడుకు. కానీ మా మధ్య తండ్రీకొడుకుల బంధమనేదే లేదు. అతడు పుట్టగానే నా చెల్లెలికి దత్తత ఇచ్చాను. అప్పటి నుంచి అరవింద్ ఆ కుటుంబంలోని వ్యక్తిగానే పెరిగాడు. ఏదైనా ప్రధానమైన ఫంక్షన్స్ ఉంటే మాత్రమే నా ఇంటికి వచ్చేవాడు. ఇలా వచ్చి అలా వెళ్లిపోయేవాడు. మేమిద్దరం తండ్రీకొడుకుల అనుబంధాన్ని పెంచుకోలేదు అని చెప్పుకొచ్చాడు. కెరీర్ తొలినాళ్లలోనే నిజం చెప్పేసిన హీరో కాగా అరవింద్ స్వామి దళపతి సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశాడు. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో తమిళంలో మెట్టియోలి అనే సీరియల్ ప్రసారమైంది. ఇందులో డిల్లీ కుమార్ నటించాడు. ఆ సమయంలో అరవింద్ స్వామి తన తండ్రి డిల్లీ కుమార్ అని ప్రకటించాడు. తర్వాత ఎక్కడా తన తండ్రి గురించి ప్రస్తావించలేదు. అంతేకాదు, వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒక్కటంటే ఒక్కటి కూడా ఎక్కడా కనిపించలేదు. ఇన్నాళ్లకు పెదవి విప్పిన నటుడు వీరు ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోకపోవడమే కాకుండా ఎక్కడా కలిసి నటించకపోవడం గమనార్హం. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అరవింద్ గురించి ఓపెన్‌గా మాట్లాడాడు డిల్లీ కుమార్. కథ కుదిరితే అరవింద్‌తో నటించేందుకు కూడా సిద్ధమేనంటున్నాడు. ఇకపోతే అరవింద్‌ను వి.డి.స్వామి-వసంత దంపతులు దత్తత తీసుకుని పెంచుకున్నారు. చదవండి: ఓటీటీలో భోళా శంకర్.. ఐదు భాషల్లో ఈ వారమే స్ట్రీమింగ్.. -
‘గాయపడిన మనసు ఎంత దూరమైనా తీసుకెళ్తుంది..’ చై కస్టడి టీజర్ అవుట్
యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో నటుడు అరవింద్ స్వామి కీల పాత్ర పోషిస్తున్నాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్ మంచి రెస్పాన్స్ రాగా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక కస్టడీపై మరింత హైప్ క్రియేట్ చేస్తూ తాజాగా చిత్రం బృందం మూవీ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో చై డైలాగ్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది..’ అంటూ చై సీరియస్ డైలాగ్‌తో టీజర్ మొదలైంది. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతిశెట్టి హీరోయిన్గా చేస్తోంది. ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనునున్నారు. సమ్మర్ కానుకగా మే 12న తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కానుంది. -
డైలాగ్స్ లేకుండా విజయ్ సేతుపతి ‘గాంధీ టాక్స్’, ఆసక్తిగా ఫస్ట్‌గ్లింప్స్
ప్రయోగాత్మక చిత్రాల్లో నటించే హీరోల్లో ముందువరుసలో ఉంటారు విజయ్ సేతుపతి. తాజాగా ఆయన ‘గాంధీ టాక్స్’ అనే సైలెంట్ ఫిల్మ్(డైలాగులు లేని)లో లీడ్ రోల్ చేస్తున్నారు. మరాఠి దర్శకుడు కిశోర్ పాండురంగ్ బేలేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అరవింద్ స్వామి, అదితీరావ్ హైదరీ, సిద్ధార్థ్ జాదవ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చదవండి: మహేశ్-త్రివిక్రమ్ చిత్రంలో మలయాళ స్టార్ హీరో! కాగా ఆదివారం గాంధీ జయంతి (అక్టోబరు 2) సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘డైలాగ్స్ లేకుండా కేవలం ఎమోషన్స్‌తోనే కథను చెప్పడం అంత సులువైన విషయం కాదు. ఈ సినిమా నాకు చాలెంజింగ్‌గా అనిపించింది’’ అని కిశోర్ పాండురంగ్ బేలేకర్ అన్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. -
త్రిష ‘చతురంగవేట్టై-2’కి మోక్షం
త్రిషకు కాలం అసలు కలిసిరానట్లు ఉంది. ఈ అమ్మడు నటించిన చిత్రాలు పలు రకాల కారణాలతో విడుదలకు నోచుకోవడం లేదు. ఈమె నటించిన చిత్రాలు తెరపైకి వచ్చి చాలా కాలమైంది. ఆ లోటు తీర్చడానికి మణిరత్నం దర్శకత్వంలో నటించిన భారీ చారిత్రాత్మక కథా చిత్రం పొన్నియన్ సెల్వన్ సెప్టెంబర్ 30వ తేదీ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. దీంతో పాటు అరవిందస్వామికి జంటగా త్రిష నటించిన చతురంగవేట్టై–2 చిత్రం కూడా తెరపై రావడానికి సిద్ధం అవుతోంది. అక్టోబర్ 7వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాలు ఆదివారం అధికారిక పూర్వకంగా ప్రకటించారు. చదవండి: వివాదంలో మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’, కోర్టు నోటీసులు దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన చతురంగవేట్టై చిత్రం మంచి విజయాన్ని సాధించింది. దీంతో దానికి సీక్వెల్‌గా చతురంగవేట్టై –2 చిత్ర నిర్మాణానికి బీజం పడింది. దీనికి హెచ్ వినోద్ కథ, మాటలు అందించారు. సలీమ్ చిత్రం ఫేమ్ నిర్మల్ కుమార్ దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. అరవిందస్వామి, త్రిష జంటగా నటించిన ఇందులో ప్రకాష్‌రాజ్, నాజర్, యోగిబాబు ముఖ్యపాత్రలు పోషించారు. అశ్విన్ గురుమూర్తి సంగీతాన్ని అందించిన ఈ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని చాలా కాలమైంది. ఎట్టకేలకు అక్టోబర్‌లో మోక్షం కలుగనుంది. చదవండి: ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం: పూజా హెగ్డే -
స్క్రీన్ వెనకాల పడ్డ కష్టం ప్రేక్షకులకు కనపడదు
‘‘ఒక మంచి పాత్రలో నటించడానికి ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు అయితే, కెమెరా ముందు సరిగ్గా చేయడం మరో ఎత్తు. ఎంత కష్టపడ్డాం అనేది ముఖ్యం కాదు. స్క్రీన్‌పై మన పెర్ఫార్మెన్స్ ఎలా ఉందన్నదే ముఖ్యం. ఎందుకంటే స్క్రీన్‌పై మంచి నటన కనబర్చడానికి స్క్రీన్ వెనకాల ఎంత కష్టపడ్డామో ప్రేక్షకులకు కనపడదు’’ అన్నారు అరవింద్ స్వామి. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘తలైవి’. జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటించగా, దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్. సింగ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానున్న సందర్భంగా అరవింద్ స్వామి చెప్పిన విశేషాలు. ►ఎంజీఆర్ (ఎం.జి. రామచంద్రన్), శివాజీ గణేశన్ గార్ల సినిమాలు చూస్తూ పెరిగాను. కేవలం సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ ఎంజీఆర్‌గారు తనదైన ముద్ర వేశారు. దర్శకుడు ఏఎల్ విజయ్‌గారు ‘తలైవి’లో ఎంజీఆర్ పాత్రను నాకు ఆఫర్ చేసినప్పుడు పెద్ద బాధ్యత అనిపించింది. ►ఎంజీఆర్గారిలా ట్రాన్స్ఫామ్ అయి, ఆ పాత్ర చేయడం చాలెంజ్లా భావించాను. పాత్ర పరంగా నేను ఏ చిన్న తప్పు చేసినా ప్రేక్షకులు, ఆయన అభిమానులు బాధపడే అవకాశం ఉంది. వాళ్లను దృష్టిలో పెట్టుకుని, నటుడిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి వందశాతం కష్టపడాలని నిర్ణయించుకున్నాను. ఎంజీఆర్గారిని అభిమానించేవారందరూ నేను పోషించిన పాత్ర చూసి హ్యాపీ ఫీలవ్వాలని అనుకున్నాను.! ►నిజానికి ఎంజీఆర్‌గారి బాడీ లాంగ్వేజ్‌కి నా బాడీ లాంగ్వేజ్ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆయన మేనరిజమ్స్ సినిమాల్లో ఒకలా, సాధారణ జీవితంలో మరోలా ఉంటాయి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కోసం కష్టపడ్డాను. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో, నటుడిగా ఎదిగాక, ముఖ్యమంత్రి అయినప్పుడు, ఆయన ఆరోగ్యంగా లేనప్పుడు.. ఇలా ఓ నాలుగు భాగాలుగా విభజించుకుని లుక్స్ పరంగా ప్రిపేర్ అయ్యాను. ►నేను ఎంజీఆర్‌ను కాదు... అరవింద్ స్వామిని. తెరపై ఆయనలా కనిపించడానికి ప్రయత్నించాను. ఒక నటుడిగా ఆయన పాత్ర చేశాను.. అంతే. ‘ధృవ’ సినిమా తర్వాత తెలుగులో పెద్ద ఆఫర్స్ వచ్చాయి. కానీ కుదర్లేదు. ఇప్పుడు కరెక్ట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా చూడను. కథ ఆసక్తికరంగా ఉంటే చాలు. ►ఇరవయ్యేళ్ల క్రితమే నాకు దర్శకత్వం అంటే ఆసక్తి కలిగింది. కానీ యాక్టర్‌గా ఉన్న కమిట్మెంట్స్, ఇతర వ్యాపార వ్యవహారాల వల్ల డైరెక్షన్ చేయలేకపోయాను. ఇటీవల ‘నవరస’ ఆంథాలజీలో ‘రౌద్రం’ భాగానికి దర్శకత్వం వహించడం హ్యాపీ. ప్రస్తుతం నా దగ్గర నాలుగు కథలున్నాయి. ఇవన్నీ మానవీయ సంబంధాల ఆధారంగా తయారు చేసుకున్న కథలే. -
ఈ పాత్రను పోషించగలనంటే నమ్మలేదు: కంగనా రనౌత్
హైదరాబాద్: సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా, విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఏఎల్ విజయ్ దర్శకత్వం వహించారు. ‘తలైవి’ సినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘తలైవీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కంగనా రనౌత్, అరవింద్ స్వామి, విజయేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. కంగనా రనౌత్ : ‘ప్రొడ్యూసర్ విష్ణు సార్‌కి ఈ మూవీ బర్త్ డే గిఫ్ట్ అవుతుంది. మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే బ్లాక్ బస్టర్ బర్త్ డే గిఫ్ట్ ఇదే అవుతుంది. థాంక్యూ వెరీ మచ్. నాకు తమిళం గురించి కానీ, ఇక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు. నేను ఈ పాత్రను పోషించగలను అని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు మాత్రం నాకే వింతగా అనిపిస్తోందని’ అన్నారు. అరవింద్ స్వామి: ‘ఎన్నో సినిమాల్లో నటించాను కానీ ఈ సినిమాలో భాగం కావడం చాలా అద్భుతమైన అనుభవం. ఈ సినిమాతో మీ అందరి ముందుకు రావడం ఆనందంగా ఉంది. విజయ్ సార్‌తో పాటు చిత్రయూనిట్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఓ నటుడిగా ఈ సినిమాలో కంగనా లాంటి స్టార్లతో నటించి చాలా నేర్చుకున్నా. ఈ సినిమాను కంగనా తన భుజాలపై వేసుకొని నటించింది. రెండు రోజుల క్రితం ఈ సినిమా చూశా. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నానని తెలిపారు. దర్శకుడు విజయ్: ‘తెలుగు ప్రేక్షకులంటే నాకు చాలా గౌరవం. వాళ్ళు సినిమాను ఎంతో ప్రేమిస్తారు. మా సినిమా తెలుగులో కూడా రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ కానుంది. అరవింద్ సార్ ఈ సినిమాకు బిగ్ పిల్లర్. జయలలిత క్యారెక్టర్లో కంగనా ఒదిగిపోయింది. ఆమెకు నేషనల్ అవార్డు రావడం ఖాయం. నేను 2000 సంవత్సరంలో కాలేజ్ పూర్తిచేసి విజయేంద్రప్రసాద్ గారి క్లాసులకు వెళ్లి ఆయనతో కూర్చొని స్టోరీలు రాస్తూ ఎన్నో నేర్చుకున్నా. చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు. చదవండి: Bigg Boss 5 Telugu: ఆరో కంటెస్టెంట్‌గా లోబో -
‘తలైవి’ విడుదల తేదీ వచ్చేసింది, అప్పడే థియేటర్లోకి
Kangana Ranaut Thalaivi Movie Release Date: ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ‘తలైవి’ మూవీ విడుదల తేదీ వచ్చేసింది. గతేడాది రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. చివరకు షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధంగా కాగా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూత పడ్డాయి. దీంతో మళ్లీ సినిమా వాయిదా పడింది. దివంగత ముఖ్యమంత్రి జయలలీత బయోపిక్ కావడంతో ఈ మూవీని థియేటర్లోనే విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో ‘తలైవి’ మూవీ ఏప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు పుల్‌స్టాప్ పెడుతూ తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. చదవండి: షాకింగ్: నటి ప్రియాంక పండిట్ న్యూడ్ వీడియో లీక్, స్పందించిన నటి The story of this iconic personality deserves to be witnessed only on the BIG SCREEN! Pave way, for #Thalaivii as she is all set to make a superstar entry into the world of cinema, yet again, a place where she has always belonged! Thalaivii IN CINEMAS near you on 10th September! pic.twitter.com/e20oHvj5bw — VIBRI (@vibri_media) August 23, 2021 సెప్టెంబర్ 10న తలైవి థియేటర్లో రానున్నట్లు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాని నిర్మిస్తున్న విబ్రి మీడియా ట్విట్టర్ ద్వారా ప్రకటించించింది. ‘ఐకానిక్ వ్యక్తి కథని పెద్ద తెరపైనే చూడాలి. తలైవి కోసం, ఆమె సినిమా ప్రపంచంలోకి సూపర్‌స్టార్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేయబోతున్నాం’ అంటూ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. కాగా తమిళనాడు దివంగత ముఖమంత్రి, అలనాటి నటి జయలలిత జీవితం ఆధారంగా ‘తలైవి’ మూవీ రూపొందింది. ఇందులో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ జయలలితగా కనిపించనుండగా, ఎంజీఆర్‌గా అరవింద స్వామి నటిస్తున్నాడు. ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎంజీఆర్ భార్యగా మధుబాల నటిస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ మూవీని ఒకేసారి తెరకెక్కించారు. చదవండి: ‘కాంచన 3’ మూవీ హీరోయిన్ అనుమానాస్పద మృతి.. -
మరోసారి అరవింద్ స్వామితో జతకట్టిన మధుబాల
సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తుండగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుండగా తాజాగా దీని నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఇందులో ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటి మధుబాల నటిస్తున్నారు. ఇందులో ఆమె లుక్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఎంజీఆర్(అరవింద్ స్వామి), మధుబాల సన్నివేశానికి సంబంధించిన వారిద్దరి ఫొటోను షేర్ చేశారు. 1992లో వచ్చిన మణిరత్నం మ్యుజికల్ హిట్ చిత్రం ‘రోజా’లో అరవింద్ స్వామి, మధుబాల జోడి హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక 28 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి ‘తలైవి’ కోసం జతకట్టారు. ఈ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ.. ‘తలైవి మూవీ షూటింగ్ చాలా బాగా వచ్చింది. ఈ మూవీ ఎప్పుడేప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంతో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. దీంతో మార్చిలో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. అయితే థియేటర్లోకి ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. కానీ ‘తలైవి’ మాత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా మధుబాల రోజా మూవీ తర్వాత పలు సినిమాల్లో నటించి ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. 2017లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాలేజీ కుమార్’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీకి అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు తాజాగా ఆమె మరోసారి తలైవి మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. View this post on Instagram A post shared by Thalaivi (@thalaivithefilm) -
‘ఒట్టు’తో మాలీవుడ్‌కు వెళ్తున్న తెలుగు హీరోయిన్
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా మలయాళం డైలాగ్స్ చెప్పనున్నారు. ఎందుకంటే ఈషాను మాలీవుడ్ పిలిచింది. అరవింద్ స్వామి, కుంచకో బోబన్స్ ప్రధాన పాత్రల్లో ఫెల్లిని దర్శకత్వంలో మలయాళం, తమిళ భాషల్లో ‘ఒట్టు’అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా ద్వారా ఈషా మలయాళ పరిశ్రమకు పరిచయం కానున్నారు. ఇద్దరు స్నేహితుల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘నేను నటించిన ఓ సినిమా చూసి డైరెక్టర్ ఫెల్లిని ఇంప్రెస్ అయ్యారు. ‘ఒట్టు’లోని ఓ లీడ్ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుందని ఆయన నన్ను సంప్రదించారు. కథ నచ్చడంతో ఓకే చెప్పాను. మార్చి 27 నుంచి ఈ సినిమా షూటింగ్ గోవాలో ఆరంభం కానుంది. ఒకసారి షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత లొకేషన్స్‌లో రోజువారీగా మలయాళ భాషపై పట్టు సాధిస్తాననే నమ్మకం ఉంది. నా ఫేవరెట్ యాక్టర్లు అరవింద్ స్వామి, కుంచకోలతో స్క్రీన్స్ షేర్ చేసుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని అన్నారు ఈషా. ఈ సంగతి ఇలా ఉంచితే... అరవింద్ స్వామి నటిస్తున్న మూడో మలయాళ చిత్రం ‘ఒట్టు’. ఇంతకుముందు ‘డాడీ’ (1992), ‘దేవరాగమ్’ (1996) చిత్రాల్లో ఆయన నటించారు. అంటే.. అరవింద్ స్వామి మళ్లీ దాదాపు పాతికేళ్ల తర్వాత మలయాళ సినిమా చేస్తున్నారన్న మాట. చదవండి: రాముడిగా కనిపించేందుకు బరువు తగ్గుతున్న ప్రభాస్! -
తలైవి ఫస్ట్‌లుక్ విడుదల
జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేశారు. యంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. ఆదివారం యంజీఆర్ జయంతి. ఈ సందర్భంగా ‘తలైవి’లోని ఓ కొత్త స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం. యంజీఆర్ అద్భుతమైన నాయకులని, అలానే జయలలితకు ఆయన మార్గనిర్దేశకుడు అంటూ కంగనా తన ట్విటర్ ఖాతాలో ఫస్ట్‌లుక్ పంచుకున్నారు. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ అన్నింటికీ విశేష ఆదరణ లభిస్తోందని, ఇలానే సినిమాను కూడా ఆదరిస్తారనుకుంటున్నామని నిర్మాతలు విష్ణువర్ధన్, శైలేష్‌లు పేర్కొన్నారు. Tribute to the legend #MGR on his birth anniversary,revolutionary leader n a mentor to #Thalaivi @thearvindswami #Vijay @vishinduri @ShaaileshRSingh @BrindaPrasad1 @neeta_lulla #BhushanKumar @KarmaMediaent @TSeries @vibri_media #SprintFilms #GothicEntertainment @Thalaivithefilm pic.twitter.com/S5dZoCuIr9 — Kangana Ranaut (@KanganaTeam) January 17, 2021 -
అప్పుడు తనయుడికి.. ఇప్పుడు తండ్రికి..
సాక్షి, హైదరాబాద్: ‘రోజా’ సినిమాతో హీరోగా పరిచయమై ఆ తర్వాత ‘ముంబాయి’ వంటి చిత్రాలతో లవర్ బాయ్‌గా పెరుతెచ్చుకున్నారు నటుడు అరవింద్ స్వామి. అదే విధంగా వెండితెరపై అందగాడిగా అమ్మాయిల మనసు దోచుకున్న అరవింద్ స్వామి కొద్ది రోజులకు కనుమరుగయ్యారు. ఇక కొంతకాలనికి విలన్‌గా తిరిగి సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టారు. ఈ క్రమంలో 2016లో వచ్చిన రామ్‌చరణ్ ‘ధృవ’ చిత్రంలో విలన్‌గా నటించి విలన్‌గా వందకు వందశాతం మార్కులు కొట్టేశారు. అంతేగాక పలు సినిమాల్లో కూడా ప్రతినాయకుడిగా నటిస్తూ ఆయన విలన్‌గా సెటిల్ ఆయిపోయరు. ఈ నేపథ్యంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ చిత్రంలో అరవింద్ స్వామి ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. (చదవండి: చిరంజీవికి కరోనా రాలేదు) అయితే ఇందులో ప్రతినాయకుడి పాత్ర కోసం దర్శకుడు కొంతమంది స్టార్ విలన్లను పరిశీలించగా చివరకు అరవింద్ స్వామిని ఒకే చేసినట్లు తెలుస్తోంది. ‘ఆచార్య’లో హీరోకు, విలన్‌కు మధ్య ఉండే సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయంట. దీంతో ప్రధాన విలన్‌గా అరవింద్ స్వామి కరెక్ట్‌గా సరిపోతారని భావించిన దర్శకుడు ఆయనను ఖారారు చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంతవరకు సినిమా యూనిట్ స్పష్టత ఇవ్వలేదు. కాగా కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమలైన లాక్డౌన్ కారణంగా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇటీవల షూటింగ్‌లు తిరిగి ప్రారంభం కావడంతో ప్రస్తుతం ‘ఆచార్య’ హైదరాబాద్‌లోని రామోజీ ఫీలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. మరికొద్ది రోజుల్లో చిరంజీవి షూటింగ్లో పాల్గొననున్నారు. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న కాజల్ అగర్వాల్ వచ్చే నెల మొదటి వారంలో షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం. (చదవండి: పారితోషికం తీసుకోవడంలేదు) -
పారితోషికం తీసుకోవడంలేదు
మణిరత్నం నిర్మాణంలో ‘నవరస’ అనే వెబ్ యాంథాలజీ రూపొందనుందనే విషయం తెలిసిందే. అందులో క్రేజీ స్టార్స్ నటిస్తారని ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్న ఈ యాంథాలజీలో తొమ్మిది మంది దర్శకులు తొమ్మిది రసాల ఆధారంగా తొమ్మిది కథలను చూపించనున్నారు. దర్శకులు మణిరత్నం, జయేంద్ర ఈ యాంథాలజీను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి పని చేసే నటులు, సాంకేతిక నిపుణులు ఎవ్వరూ పారితోషికం తీసుకోవడం లేదు. ఈ యాంథాలజీ నుంచి వచ్చిన లాభాలన్నీ కూడా కోవిడ్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న సౌతిండియా ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులకు అందించనున్నారు. ఈ యాంథాలజీకు మణిరత్నం కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తున్నారు. ఈ ‘నవరస’ ద్వారా తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు సూర్య, రేవతి, సిద్ధార్థ్, విజయ్ సేతుపతి, పార్వతి... మరికొందరు. ఒక కథను తెరకెక్కిస్తూ, అరవింద్ స్వామి తొలిసారి దర్శకుడిగా మారారు. ఈ 9 కథలకు కెమెరామేన్లుగా సంతోష్ శివన్, బాలసుబ్రహ్మణ్యం, మనోజ్ పరమహంస, అభినందన్ రామానుజం, శ్రేయస్ కృష్ణ, హర్ష్‌వీర్ ఒబెరాయ్, సుజిత్ సారంగ్, వి. బాబు, విరాజ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. అలాగే ఏఆర్ రెహమాన్, ఇమ్మాన్, జిబ్రాన్, అరుళ్ దేవ్, కార్తీక్, రోన్ ఎథన్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్‌లు సంగీతం సమకూరుస్తున్నారు. అలాగే పట్టుకోటై్ట ప్రభాకర్, సెల్వ, మదన్ కార్కీ, సోమీథరన్ రచయితలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. దర్శకులు కేవీ ఆనంద్ గౌతమ్ మీనన్ బీజోయ్ నంబియార్ కార్తీక్ సుబ్బరాజ్ పొన్రామ్ హలీత షహీమ్ కార్తీక్ నరేన్ రతీంద్రన్ ఆర్. ప్రసాద్ అరవింద్ స్వామి నటీనటులు రేవతి నిత్యామీనన్ పార్వతీ తిరువోత్తు ఐశ్వర్యా రాజేష్ పూర్ణ రిత్విక అరవింద్ స్వామి సూర్య సిద్ధార్థ్ విజయ్ సేతుపతి ప్రకాష్ రాజ్ శరవణన్ ప్రసన్న గౌతమ్ కార్తీక్ -
తలైవీ షూటింగ్ షురూ..!
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత జీవతం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా 'తలైవీ'. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. దాదాపు ఏడు నెలల తర్వాత ఈ సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభమైంది. వీటికి సంబంధించి సినిమా డైరెక్టర్ ఏఎల్ విజయ్‌తో కలిసి సెట్స్‌లో దిగిన ఫోటోను తన ట్విట్టర్లో షేర్ చేసింది. విజయ్ టాలెంట్ ఉన్న డైరెక్టరే కాకుండా మంచి వ్యక్తని కంగనా తెలిపింది. కంగనా పోస్ట్ చేసిన ఫొటోలో చీరకట్టులో కనిపించగా డైరెక్టర్ ఆమెకు సీన్ వివరిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నా నాకు ఇష్టమైంది మాత్రం సినిమా సెట్ అని కంగనా ట్విట్టర్లో పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా కంగనా గత కొన్ని నెలలుగా హిమాచల్ ప్రదేశ్‌లోని తన ఇంటి వద్దే ఉంటుంది. Good morning friends, these are some stills from yesterday’s early morning scene discussion with my absolutely talented and most affectionate director A.L Vijay ji, there are many amazing places in this world but the most soothing and comforting to me is a film set #Thalaivi pic.twitter.com/qGjw0nQjRQ — Kangana Ranaut (@KanganaTeam) October 5, 2020 జయలలిత సినీ ప్రస్థానం మొదలుకొని రాజకీయాల్లో తలైవీగా ఎలా మారిందన్న అంశాలు ఈ సినిమాలో చూపించనున్నారు. గత ఏడాది నవంబర్‌లో జయలలిత జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దివంగత ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషలో ఈ సినిమా తెరకెక్కనుంది. -
కొత్త నిర్మాతలకు తరగతులు
‘‘ప్రస్తుతం మంచి సినిమాలకే ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన ‘భాస్కర్ ఒక రాస్కెల్’ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. చిత్ర నిర్మాణం పట్ల నూతన నిర్మాతలకు అవగాహన కల్పించడం కోసం నిర్మాత మండలి తరఫున తరగతులు నిర్వహిస్తున్నాం’’ అన్నారు నిర్మాత దామోదర ప్రసాద్. అరవింద స్వామి, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో సిద్ధిఖీ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళం చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. ఈ చిత్రాన్ని ‘భాస్కర్ ఒక రాస్కెల్’ అనే పేరుతో కార్తికేయ మూవీస్ పతాకంపై పఠాన్ చాన్‌బాషా ఈ నెలాఖరులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను దర్శకుడు వి. సముద్ర, నిర్మాత దామోదర ప్రసాద్ విడుదల చేశారు. ‘‘కథా బలమే సినిమాకు ప్రాణం’’ అన్నారు సెన్సార్ బోర్డు సభ్యుడు వేణుగోపాల్ యాదవ్. ‘‘తోడులేని ఇద్దరు వ్యక్తులు ఎలా కలిశారు? ఇందుకోసం ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేశారు? అనే అంశాలతో ఈ సినిమా సాగుతుంది’’ అన్నారు పఠాన్ బాషా. -
తోడు లేని జీవితాలు
అరవింద్‌స్వామి, అమలాపాల్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. ఈ చిత్రాన్ని ‘భాస్కర్ ఒక రాస్కెల్’ పేరుతో పఠాన్ చాన్‌బాషా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెలలోనే చిత్రం విడుదల కానుంది. చాన్ బాషా మాట్లాడుతూ– ‘‘మలయాళ చిత్రం ‘భాస్కర్ ది రాస్కెల్’ని తమిళంలో ‘భాస్కర్ ఒరు రాస్కెల్’గా రీమేక్ చేశారు. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించగా సిద్ధిక్ దర్శకత్వం వహించారు. మలయాళంలో విజయం సాధించటంతో తమిళంలో అరవింద్‌స్వామి, అమలాపాల్ జంటగా సిద్ధిక్ రీమేక్ చేశారు. అక్కడ కూడా విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో నేను విడుదల చేయటం ఆనందంగా ఉంది. తోడు లేని ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా కలిశారు, ఆ ఇద్దరూ కలవటానికి ఇద్దరు పిల్లలు ఎలాంటి ప్రయత్నం చేశారనేది ఈ సినిమా. నటి మీనా కూతురు నైనిక ఈ చిత్రంలో ముఖ్య పాత్ర చేసింది’’ అన్నారు. -
‘నరకాసురుడు’ ఫస్ట్ లుక్
తమిళనాట విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా నరకాసురుడు. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్లో నరగసూరన్ పేరుతో రిలీజ్ కానుంది. 16 సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్ నరేన్ మరోసారి నరకాసురుడుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వేసవి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న నరకాసురుడు ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. లీడ్ క్యారెక్టర్స్ అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియలు సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలుగు వర్షన్‌ను రమేష్ వర్మ ప్రొడక్షన్ లో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా విడుదల చేయనున్నారు. -
మణిరత్నం.. ‘నవాబ్’ మూవీ రివ్యూ
టైటిల్ : నవాబ్ జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ తదితరులు సంగీతం : ఏఆర్ రెహమాన్ దర్శకత్వం : మణిరత్నం నిర్మాత : మణిరత్నం, ఏ సుధాకరన్ లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్నారు. ఓకె బంగారం సినిమాతో ఆకట్టుకున్నా తరువాత చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచారు. అయితే రిజల్ట్‌తో సంబంధం లేకుండా మణి సినిమాలపై క్రేజ్ మాత్రం అలాగే ఉంది. అందుకే నవాబ్ సినిమాపై కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఆ అంచనాలను మణిరత్నం అందుకున్నారు..? రొమాంటిక్ జానరను పక్కన పెట్టి తన పాత స్టైల్ క్రైమ్ థ్రిల్లర్‌తో సక్సెస్ సాధించారా..? కథ ; భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్) సమాంతర ప్రభుత్వంగా ఎదిగిన మాఫియా లీడర్. ఆయనకు ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు వరద (అరవింద్ స్వామి) గ్యాంగ్ స్టార్‌గా తండ్రి తరువాత ఆ స్థానం కోసం ఎదురుచూస్తుంటాడు. రెండో కొడుకు త్యాగు (అరుణ్ విజయ్) దుబాయ్‌లో.. మూడో కొడుకు రుద్ర(శింబు) సెర్బియాలో వ్యాపారాలు చేస్తుంటారు. ఒక రోజు భూపతి రెడ్డి మీద ఫేక్ పోలీసులు ఎటాక్ చేస్తారు. దీంతో అన్నదమ్ములంత తండ్రి దగ్గరకు వస్తారు. భూపతి రెడ్డి మీద ఎటాక్ చేసింది ఎవరో తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నంలో భాగంగా భూపతి రెడ్డి ప్రత్యర్థి చిన్నప్ప అల్లుడిని చంపటంతో గ్యాంగ్ వార్ స్టార్ట్ అవుతుంది. కానీ భూపతి రెడ్డి తన మీద ఎటాక్ చేసింది చిన్నప్ప కాదని చెపుతాడు. దీంతో కొడుకులే ఆధిపత్యం కోసం భూపతి రెడ్డి మీద ఎటాక్ చేశారన్న అనుమానం కలుగుతుంది. అదే సమయంలో భూపతి రెడ్డి చనిపోతాడు. దీంతో అన్నదమ్ములకి ఒకరి మీద ఒకరి అనుమానం కలుగుతుంది. ఆదిపత్య పోరు మొదలవుతుంది. ఈ పోరాటంలో ఎవరు గెలిచారు..? ఎవరు మిగిలారు..? అసలు భూపతి రెడ్డి మీద ఎటాక్ చేసింది ఎవరు.? రసూల్ (విజయ్ సేతుపతి)కి భూపతి రెడ్డి కుటుంబంతో ఉన్న సంబంధం ఏంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; మణిరత్నం సినిమా అంటే నటీనటులకు వంక పెట్టడానికి ఉండదు. తన పాత్రలకు పూర్తి న్యాయం చేయగలిగిన నటులను మాత్రమే తీసుకుంటాడు మణి. అదే ఫార్ములాను నవాబ్లోనూ ఫాలో అయ్యాడు. ప్రతీ ఒక్కరు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అయితే ప్రకాష్ రాజ్ లాంటి ఒకరిద్దరు తప్ప అంతా తమిళ నటులే కావటంతో తెలుగు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వటం కాస్త కష్టమే. భూపతి రెడ్డిగా ప్రకాష్ రాజ్ జీవించాడు. అరవింద్ స్వామి కెరీర్లో వరద మరో బెస్ట్ క్యారెక్టర్ అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. క్రైమ్ థ్రిల్లర్‌గా సీరియస్ నోట్ లో సాగే సినిమాకు విజయ్ సేతుపతి కామెడీ టచ్ ఇచ్చాడు. శింబు, అరుణ్ విజయ్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇతర పాత్రల్లో జయసుధ, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితీ రావ్ హైదరీ, త్యాగరాజన్, మన్సూర్ అలీఖాన్‌లు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; చాలా రోజుల తరువాత ఓ భారీ మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందు వచ్చారు దర్శకుడు మణిరత్నం. సినిమాను ఇంట్రస్టింగ్ సీన్స్ తో స్టార్ట్ చేసిన దర్శకుడు అసలు కథను వెంటనే మొదలు పెట్టాడు. ఓపెనింగ్‌లోనే భూపతి రెడ్డి మీద ఎటాక్, తరువాత ఇతర పాత్రల పరిచయం, ఎటాకర్స్ కోసం వేట లాంటి సీన్స్‌తో ఫస్ట్ హాఫ్ రేసీగా సాగుతుంది. అయితే ఆ వేగం ద్వితీయార్థంలో మిస్ అయ్యింది.నటీనటుల సెలక్షన్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. పాత్రల ఎంపికలోనే కాదు వారి నుంటి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ ఇలా టాప్ టెక్నిషియన్స్ పనిచేసినా.. ప్రేక్షకులకు మణిరత్నం మార్క్ మిస్ అయిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. ముఖ్యంగా గ్యాంగ్ వార్స్ సన్నివేశాలు చాలా సాధాసీదాగా అనిపిస్తాయి. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు పరవాలేదనిపించినా నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ ; లీడ్ యాక్టర్స్ నటన నేపథ్య సంగీతం కథనంలో మలుపులు మైనస్ పాయింట్స్ ; మణిరత్నం మార్క్ కనిపించకపోవటం సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ -
నవాబ్ వస్తున్నాడు
శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేష్, అదితీరావ్ హైదరి, జయసుధ, ప్రకాశ్‌రాజ్ ముఖ్య తారలుగా రూపొందిన మల్టీస్టారర్ ‘నవాబ్’. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు రిలీజ్ హక్కులను అశోక్ వల్లభనేని సొంతం చేసుకున్నారు. నాని ‘సెగ’, గౌతమ్‌మీనన్ ‘ఎర్ర గులాబీలు’ చిత్రాలను విడుదల చేయడంతో పాటు నాగశౌర్య ‘ఛలో’, రాజశేఖర్ ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి చిత్రాలకు ఫైనాన్స్ చేశారు అశోక్. ‘నవాబ్’ గురించి అశోక్ మాట్లాడుతూ– ‘‘తమిళంలో ‘చెక్క చివంద వానం’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘నవాబ్’ పేరుతో ఈ నెల 27న తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. ఈ నెల 25న హైదరాబాద్‌లో జరగనున్న ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో మణిరత్నం, ఏఆర్ రెహమాన్ పాల్గొంటారు’’ అన్నారు. -
‘నవాబ్’ కూడా నిజజీవిత పాత్రల నేపథ్యమే..!
లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం నవాబ్. మణి స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా భారీ తారాగణంతో తెరకెక్కుతోంది. అయితే యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈసినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మణిరత్నం గత చిత్రాలు ఎక్కువగా పురాణేతిహాసాలు, చారిత్రక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కినవే. ప్రేమకథా చిత్రాలు తప్ప మణి దర్శకత్వంలో తెరకెక్కిన ఇతర చిత్రాలు రామాయణ మహాభారతాలు, తమిళ రాజకీయ నాయకుల కథల ఇన్పిపిరేషన్‌తో తెరకెక్కించారు. తాజా చిత్రం నవాబ్ కూడా అలా నిజజీవిత పాత్రల నేపథ్యంలో తెరకెక్కిన సినిమానే అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తమిళ రాజకీయాల నేపథ్యంలోనే ఈ సినిమా రూపొందించారని ప్రధాన పాత్రలైన ప్రకాష్ రాజ్, అరవింద్ స్వామిల పాత్రలు తమిళ నాయకులను గుర్తు చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై మణి టీం మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. -
అరవిందస్వామి, రెజీనాల ‘కల్లపార్ట్’
చార్మింగ్ నటుడు అరవిందస్వామి హీరోగా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కల్లపార్ట్ చిత్రం బుధవారం ఉదయం చెన్నైలోని ఏవీఎం స్టూడియోలో ప్రారంభమైంది. ఇంతకు ముందు విక్రమ్, తమన్నా జంటగా స్కెచ్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన మూవింగ్ ప్రేమ్ సంస్థ అధినేతలు ఎస్.పార్తీ, ఎస్ఎస్.వాసన్ నిర్మిస్తున్న తా జా చిత్రం ఈ కల్లపార్ట్. ఈ సినిమాలో అరవిందస్వామికి జంటగా రెజీనా నటిస్తోంది. ఎన్నమో నడక్కుదు, అచ్చమిండ్రి చిత్రాల ఫేమ్ రాజాపాండి దర్శకత్వం వహిస్తున్న మూవీలో ఆనందరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఏవీఎం స్టూడియోలో భారీ సెట్ వేశారు. ఈ సెట్లోనే భాగం చిత్రీకరించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. చెన్నైలోనే 40 రోజులు షూటింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఒక రోజు ముందే...
జ్యోతిక పర్ఫెక్ట్ ప్లాన్‌తో దూసుకెళుతున్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఆమె నటించిన ‘నవాబ్’ ఈ నెల 27న విడుదల కానుంది. వాస్తవానికి 28న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ, ఒక రోజు ముందే వస్తున్నామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ ఆనంది, నిర్మాతల్లో ఒకరైన సుభాష్ కరణ్ తెలిపారు. అరవింద్ స్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్యా రాజేశ్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, త్యాగరాజన్ ప్రధాన తారలుగా లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందింది. మరోవైపు రాధామోహన్ డైరెక్షన్లో జ్యోతిక చేస్తున్న ‘కాట్రిన్ మొళి’ వచ్చే నెల 18న రిలీజ్‌కి రెడీ అవుతోంది. అయితే ఇక జ్యోతిక ఖాళీ అన్న మాట అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆమె ఓ కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నూతన దర్శకుడు ఎస్. రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. జ్యోతిక లీడ్ రోల్లో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్‌లో మొదలు కానుంది. ఇదే సంస్థ సూర్య హీరోగా ‘ఎన్జీకే’ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే మూడేళ్ల క్రితం ‘36 వయదినిలే’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన జ్యోతిక వరుసగా లీడ్ రోల్స్ చేస్తూ బిజీగా ఉండటం విశేషం. పెళ్లయిన తారలకు అవకాశాలు తగ్గుతాయనే మాట నిజం కాదని జ్యోతికలాంటి వాళ్లు నిరూపిస్తున్నారు. -
‘నవాబ్’ ట్రైలర్ విడుదల
-
బిగ్గెస్ట్ మల్టీస్టారర్ : నవాబ్ ట్రైలర్
లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా నవాబ్. అరవింద్ స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ ఇలా భారీ తారాగణంతో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగు ట్రైలర్‌ను కింగ్ నాగార్జున రిలీజ్ చేయగా తమిళ వర్షన్ ట్రైలర్‌ను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ రిలీజ్ చేశారు. సినిమాలోని అన్ని పాత్రలను పరిచయం చేస్తూ రూపొదించిన ఈ ట్రైలర్లో అందరూ ప్రతినాయకులలాగే కనిపిస్తున్నారు. మణి మార్క్ టేకింగ్ టాప్ స్టార్స్‌తో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తుండగా మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు. -
రెజీనాతో రొమాన్స్‌కు రెడీ!
తమిళసినిమా: ఒక కొత్త కాంబినేషన్ సెట్ అయ్యింది. ఆరడుగుల అందగాడు అరవిందస్వామి, రైజింగ్ బ్యూటీ రెజీనాల రేర్ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కబోతోందన్నది తాజా వార్త. స్మార్ట్ హీరో, స్టైలిష్ విలన్, మళ్లీ స్టార్ హీరో ఇలా తనను తాను మార్చుకుంటూ దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అరవిందస్వామి. తనీఒరవన్ చిత్రంలో ఆయన విలనీయం చూసిన వారు రోజా చిత్ర హీరోనా ఈయన అని ఆశ్చర్యపోయారు. అలా విలన్‌గా మెప్పించిన అరవిందస్వామి భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంతో మళ్లీ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ఈయన నటించిన చతురంగవేట్టై– 2 చిత్రం తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపేశారు. అవును ఎన్నమో నడక్కుదు, అచ్చమిండ్రి చిత్రాల ఫేమ్ రాజపాండి దర్శకత్వంలో అరవిందస్వామి హీరోగా నటించనున్నారు. దర్శకుడు చెప్పిన కథ వినగానే చాలా కొత్తగా ఉందని ప్రశంసిస్తూ అందులో నటించడానికి వెంటనే ఓకే చెప్పారట. ఇకపోతే ఇందులో అరవిందస్వామితో రొమాన్స్ చేయడానికి నటి రెజీనా రెడీ అనేసిందట. ఈమెకు కథ పిచ్చపిచ్చగా నచ్చేయడం, ముఖ్యంగా తన పాత్ర విపరీతంగా ఆకట్టుకోవడంతో నటించడానికి రెడీ అనడంతోపాటు చాలా మంచి పాత్రలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శకుడికి థ్యాంక్స్ చెప్పింది. ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో అందాలను విచ్చలవిడిగా ఆరబోసేసినా ఆ చిత్రం రెజీనా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదని తెగ బాధ పడిపోయిందట. అయితే తాజాగా అరవిందస్వామితో జతకట్టే అవకాశం రావడంతో ఫుల్ ఖుషీ అవుతోందని సమాచారం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం వచ్చే నెలలో సెట్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రం కోసం స్థానిక వడపళినిలోని ఏవీఎం.స్టూడియోలో ఒక బ్రహ్మాండమైన సెట్‌ను వేస్తున్నారని చిత్ర వర్గాలు తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. -
పుత్రికోత్సాహం
అరవింద్ స్వామి ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇంట్లో ఇప్పుడు ఇద్దరు గ్రాడ్యువేట్లు ఉన్నారు కాబట్టి. రీసెంట్గా అరవింద్ స్వామి తనయుడు గ్రాడ్యువేట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కుమార్తె అధీరా కూడా గ్రాడ్యువేట్ అయ్యారు. గ్రాడ్యువేషన్ కూడా గోల్డ్ మెడల్ అందుకుని మరీ కంప్లీట్ చేశారు. ఈ ఆనందాన్ని అరవింద్ స్వామి పంచుకుంటూ – ‘‘ఇంట్లో మరో గ్రాడ్యువేట్ యాడ్ అయ్యారు. అధీరా.. నీ అచీవ్మెంట్స్, నీ జర్నీని చూసి ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. ఇక ప్రపంచమే నీ వంటిల్లు. వెళ్లు.. నీ ఇష్టమొచ్చింది వండేసేయ్’’ అని పేర్కొన్నారు. -
‘నవాబ్’ షూటింగ్ పూర్తి చేసిన శింబు
ఇటీవల కాలం ఒక్క ‘ఓకె బంగారం’ సినిమా తప్ప మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఏ సినిమా కూడా విజయం సాధించలేదు. చెలియా సినిమాతో నిరాశపరిచిన ఆయన తన తదుపరి చిత్రం నవాబ్ షూటింగ్‌ను శరవేగంగా ముగించేస్తున్నారు. భారీ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను మణి చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. శింబు, అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్‌లు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సెర్బియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో తన పోర్షన్ షూటింగ్‌ను పూర్తి చేశారు శింబు. శింబు షూటింగ్‌లకు ఆలస్యంగా వస్తారని, అనుకున్న సమయానికి సినిమా పూర్తికాదన్న అపవాదు ఉంది. అయితే అలాంటి రూమర్స్‌కు చెక్ పెడుతూ శింబు కూడా తన పోర్షన్ అనుకున్న సమయానికే పూర్తి చేశారు. ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నారు. సోషల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా న్యూక్లియర్ ప్లాంట్ నేపథ్యంలో తెరకెక్కుతుందన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాను మణిరత్నం స్వయంగా నిర్మిస్తున్నారు. -
ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్
...అని తమిళ నటుడు విజయ్ సేతుపతి అంటున్నారు. మరి.. ఆ అన్ఎక్స్పెక్టెడ్ విషయం ఎంటో ‘నవాబ్’ సినిమాలో చూడాల్సిందే. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, ఐశ్వర్యా రాజేశ్, అదితీరావ్ హైదరీలు ముఖ్య తారలుగా రూపొందుతోన్న సినిమా ‘చెక్కా చివంద వానమ్’. తెలుగులో ‘నవాబ్’. ఈ చిత్రంలోని కీలక సన్నివేశాలను అబుదాబిలో షూట్ చేశారట. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి షూటింగ్ పార్ట్ పూర్తయ్యింది. ‘‘మణిరత్నంగారితో వర్క్ చేయడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. కల నిజమైనట్లుంది. ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ ‘నవాబ్’’ అన్నారు విజయ్ సేతుపతి. రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో తన పాత్ర గురించి విజయ్ మాట్లాడుతూ –‘‘కార్తీక్‌పై నాకు నమ్మకం ఉంది. ఇంకా స్క్రిప్ట్ వినలేదు. రజనీసార్‌తో నటించబోతున్నందుకు హ్యాపీ’’ అన్నారు. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైరా’ చిత్రంలో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. -
పుత్రోత్సాహం
పుత్రోత్సాహం కొడుకు పుట్టినప్పుడు కాదు ఏదైనా సాధించినప్పుడు కలుగుతుంది అని సుమతీ శతకం చెబుతుంది. అరవింద్ సామి కూడా ఇప్పుడు ‘పుత్రోత్సాహాన్ని’ ఆస్వాదిస్తున్నారు. ఆయన కుమారుడు రుద్ర ఐబీ ప్రోగ్రామ్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ ఆనందాన్ని షేర్ చేసుకుంటూ – ‘‘ఐబీ ప్రోగ్రామ్ నుంచి మా అబ్బాయి గ్రాడ్యుయేట్ అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ మైల్స్టోన్ రీచ్ అయిన అందరికీ కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. ‘నీ లైఫ్‌ను హ్యాపీగా, ప్రేమతో, ప్రశాంతంగా, నిజాయితీగా, సమగ్రతతో లీడ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచానికి ఉపయోగపడేలా ఉండు. పెద్ద పెద్ద కలల్ని కను. గుర్తుపెట్టుకో.. పతీదీ పాజిబులే’’ అని రుద్రకు నాలుగు మంచి మాటలు చెప్పారు అరవింద్ సామి. ఐబీ (ఇంటర్నేషనల్ బ్యాకులోరియట్) డిగ్రీ చాలా ప్రెస్టీజియస్ గ్లోబల్ డిగ్రీ. ఐబీ ఫాలో అయ్యే స్కూల్స్ అందరూ గ్లోబల్ సిలబస్ ఫాలో అవుతుంటారు. కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా టైమ్ మేనేజ్మెంట్, రియల్ వరల్డ్ స్కిల్స్ ఇలా ప్రతీదాంట్లో స్టూడెంట్స్‌ను ట్రైన్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా బతకగలిగే పర్ఫెక్ట్ సిటిజన్‌గా తీర్చిదిద్దుతారు. ఇలాంటి ప్రెస్టీజియస్ డిగ్రీను కొడుకు సంపాదించాడు అంటే పుత్రోత్సాహమే కదా.6 -
కల నిజమైంది
దర్శకుడు మణిరత్నం సినిమాల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఆయన డైరెక్షన్ స్టైల్ డిఫరెంట్. అందుకే మణిరత్నం సినిమాల్లో నటించేందుకు యాక్టర్స్ ఇష్టపడుతుంటారు. కొందరైతే అదృష్టంగా భావిస్తుంటారు. ఆ అదృష్టం దక్కినందుకు ఆనందపడుతున్నారు తమిళ నటి ఐశ్వర్యా రాజేశ్. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్, జ్యోతిక, అదితీ రావ్ హైదరీ, ఐశ్వర్యా రాజేశ్ ముఖ్య తారలుగా నటిస్తున్న చిత్రం ‘చెక్క చివంద వానమ్’. తెలుగులో‘నవాబ్’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో తమ వంతు షూటింగ్స్‌ను కంప్లీట్ చేశారు ఐశ్వర్య రాజేశ్ అండ్ అరుణ్ విజయ్. ‘‘నవాబ్’ సినిమాలో నా వంతు షూటింగ్ కంప్లీటైంది. మణిరత్నంగారితో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్. కల నిజమైనట్లు ఉంది’’ అన్నారు ఐశ్వర్య. అంతేకాదు తమిళ హీరో శివకార్తీకేయన్ ప్రొడక్షన్స్ హౌస్‌లో రూపొందనున్న సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు ఐశ్వర్య. అరుణ్ రాజా దర్శకత్వంలో తెరకెక్కతోన్నఈ సినిమా ఫస్ట్‌లుక్ అండ్ టైటిల్ ఎనౌన్స్మెంట్ రేపు రానుంది. -
స్టార్ట్ కెమెరా.. యాక్షన్
లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్... అని డైరెక్టర్ అనగానే కెమెరా ముందు నటించే అరవింద్ స్వామి త్వరలో మెగా ఫోన్ పట్టుకోనున్నారట. మానిటర్ ముందు కూర్చుని లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్... అనబోతున్నారని చెన్నై టాక్. నటనకు బ్రేక్ ఇచ్చిన ఆయన ‘కడల్’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి, వరుసగా సినిమాలు చేస్తున్నారు. తెలుగు చిత్రం ‘ధృవ’లో విలన్‌గా నటించిన అరవింద్ స్వామి మరోవైపు తమిళంలో లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఆయన హీరోగా నటించిన ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ ఈరోజు రిలీజ్ అవుతోంది. మరోవైపు ‘సదురంగవేట్టై 2’, ‘వనంగాముడి’, ‘నరకాసురన్’, ‘చెక్క చివంద వానమ్’ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. నటుడిగా బిజీగా ఉన్నా దర్శకుడిగా కూడా చేయాలను కుంటున్నారట. కథ కూడా రెడీ చేశారట. -
రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు
‘‘నాకు రాజకీయాలు తెలియవు. అందుకే.. రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు’’ అన్నారు అరవింద్ స్వామి. ‘కడల్’ సినిమాతో నటుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆయన నటించిన తాజా చిత్రం ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. ఇందులో అమలా పాల్ కథానాయిక. మలయాళ దర్శకుడు సిద్ధిక్ తెరకెక్కించిన ఈ సినిమా మే 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించింది. అరవింద్ స్వామి మాట్లాడుతూ– ‘‘నేను రాజకీయాల గురించి మాట్లాడటంగానీ, రావడంగానీ జరగదు. అయితే.. రాజకీయ నాయకుల నిర్ణయాలు సామాన్య ప్రజలపై ప్రభావం చూపితే స్పందిస్తా’’ అన్నారు. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ– ‘‘మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘భాస్కర్ ది రాస్కెల్’ చిత్రానికి రీమేక్ ‘భాస్కర్ ఒరు రాస్కెల్’. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులకు నచ్చుతుంది. పిల్లల నుంచి పెద్దవారి వరకూ అందర్నీ మా సినిమా అలరిస్తుంది’’ అన్నారు. -
నాకు రాజకీయాలు తెలియవు
తమిళసినిమా: నాకు రాజకీయాలు తెలియవు. కాబట్టి రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశమే లేదు అన్నారు నటుడు అరవిందస్వామి. ఈయన రీఎంట్రీ తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్. నటి అమలాపాల్ నాయకిగా నటించిన ఈ చిత్రం మలయాళంలో మంచి విజయం సాధించిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రానికి రీమేక్. నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్, మాస్టర్ రాఘవ్, బేబీ నైనిక ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు సిద్ధిక్‌నే దర్శకత్వం వహించారు. చిత్రం మే 11న విడుదలకు సిద్ధం అవుతోంది. గురువారం చెన్నైలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో అరవిందస్వామి మాట్లాడుతూ ఇది మలయాళంలో మంచి విజయం సాధించిన చిత్రానికి రీమేక్ అని చెప్పారు. అయితే తమిళం కోసం కొన్ని మార్పులు చేసి రూపొందించినట్లు తెలిపారు. భాస్కర్ ఒరు రాస్కెల్ పూర్తిగా కమర్షియల్ ఎంటర్టెయినర్ చిత్రంగా ఉంటుందన్నారు. తాను వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించాలని ఆశిస్తున్నానని, తనీ ఒరువన్ చిత్రంలో విలన్‌గా నటించడంతో అదే తరహా చిత్రంల్లో నటించే అవకాశాలు 15కు పైగా వచ్చినా అంగీకరించలేదని అన్నారు. హీరోగానైనా, విలన్‌గానైనా మంచి పాత్ర అయితే కచ్చితంగా నటిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తారా? అని అడుగుతున్నారని, తనకు రాజకీయాలు తెలియవని, అందువల్ల అలాంటి అవకాశం లేదని పేర్కొన్నారు. హర్షిణి మూవీస్ పతాకంపై హర్షిణి నిర్మించిన ఈ చిత్రానికి అమ్రేశ్ గణేశ్ సంగీతాన్ని, విజయ్ ఉలగనా«థ్ ఛాయాగ్రహణం అందించారు. -
పవర్ఫుల్ పాత్రలో..
తమిళసినిమా: రీఎంట్రీలోనూ తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి జ్యోతిక. ఇంతకుముందు సూపర్‌స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు కమలహాసన్‌ల నుంచి అజిత్, విజయ్, సూర్య,శింబు వరకూ జతకట్టి కథానాయకిగా రాణించిన ఈ నటి, నటుడు సూర్యను ప్రేమ వివాహం చేసుకుని నటనకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక సంసార జీవితంలో సెటిల్ అవుతారనుకున్న వారికి షాక్ ఇచ్చే విధంగా ఇద్దరు పిల్లల తల్లి అయిన తరువాత 36 వయదినిలే చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్ర విజయానందంతో వరుసగా నటించడం మొదలెట్టిన జ్యోతిక ప్రస్తుతం తన వయసుకు తగ్గ పాత్రలను ఎంచుకుని నటిస్తున్నారు. అలా నటించిన తాజా చిత్రం నాచియార్ మంచి సక్సెస్‌నే అందుకుంది. రీఎంట్రీ తరువాత జ్యోతిక బయట చిత్ర నిర్మాణ సంస్థలో నటించిన తొలి చిత్రం ఇదే. అదేవిధంగా తాజాగా మణిరత్నం దర్శకత్వంలో సెక్క సెవంద వానం అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది మల్టీస్టారర్ చిత్ర. అంతే కాదు తమిళం, తెలుగు, మలయాళం అంటూ బహుభాషా చిత్రం కూడా. మణిరత్నం తన మద్రాస్ టాకీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో నటుడు అరవిందస్వామి రాజకీయనాయకుడిగానూ, శింబు ఇంజినీర్‌గా, విజయ్‌సేతుపతి పోలీస్‌ఇన్‌స్పెక్టర్‌గా నటిస్తున్నారు. ఇక జ్యోతిక పురుషాధిక్యతను వ్యతిరేకించే ఒక శక్తి వంతమైన స్త్రీ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మరోసారి ఈమె నట విశ్వరూపన్ని చూడవచ్చు అనేది కోలీవుడ్ వర్గాల టాక్. మరో ముఖ్య పాత్రలో నటి ఐశ్యర్యరాజేశ్ నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, మణిరత్నం ఆస్థాన సంగీతదర్శకుడు ఏఆర్.రెహ్మాన్ బాణీలను కడుతున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సెక్క సెవంద వానం చిత్రం ఈ ఏడాదిలోనే తెరపైకి వచ్చే అవకాశం ఉంది. చాలా కాలం తరువాత మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. -
నలుగురి గురి.. సింగిల్ టార్గెట్!
ఒక పోలీస్, ఇంజనీర్, రాజకీయ నాయకుడు, రౌడీ.. ఈ నలుగురి ప్రొఫెషన్స్ వేరు అయినా టార్గెట్ మాత్రం ఒక్కటే. అయితే ఈ టార్గెట్‌ను గెలిచి ఎవరు నవాబ్‌గా నిలుస్తారో తెలుసుకోవాలంటే మాత్రం ‘చెక్క చివంద వానమ్’ చూడాల్సిందే. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, జ్యోతిక, అతిదీ రావ్ హైదరీ, ప్రకాశ్‌రాజ్ ముఖ్య తారలుగా తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ ఇది. తెలుగులో ‘నవాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఓ న్యూక్లియర్ ప్రాజెక్ట్ చుట్టూ సినిమా కథాంశం సాగుతుందని సమాచారం. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అరుణ్ విజయ్ల్లో ఒకరు పోలీస్‌గా, మరొకరు రాజకీయ నాయకుడిగా, ఇంకొకరు ఇంజనీర్‌గా నటిస్తున్నారని చెన్నై ఇండస్ట్రీ టాక్. ఈ సినిమాలో అరవింద్ స్వామికి జోడీగా జ్యోతిక నటిస్తున్నారన్నది తాజా సమాచారం. ఆల్రెడీ రీసెంట్గా జరిగిన షూట్లో వీరిపై పెళ్లి సీన్ కూడా షూట్ చేశారట. సగానికి పైగా షూట్‌ను కంప్లీట్ చేసుకున్న ‘నవాబ్’ చిత్రాన్ని ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
పొంగల్ బరిలో మరో సినిమా
తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా సంక్రాంతి సీజన్ కు భారీగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. ఈ ఏడాది కూడా అదే జోరు కనిపిస్తోంది. ఇప్పటికే సూర్య హీరోగా తెరకెక్కిన తాన సేరంద కూటం, విక్రమ్ స్కెచ్, త్రిష మోహిని సినిమాలు పొంగల్ బరిలో రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఈ రేసులోకి మరో సినిమా వచ్చి చేరింది. రీ ఎంట్రీలో విలన్ గా, హీరోగా దూసుకుపోతున్న సీనియర్ నటుడు అరవింద్ స్వామి కీలక పాత్రలో తెరకెక్కిన సినిమా భాస్కర్ ఒరు రాస్కెల్. మలయాళంలో మమ్ముట్టి, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన భాస్కర్ ది రాస్కెల్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. అరవింద్ స్వామి సరసన అమలాపాల్ హీరోయిన్ గా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను పొంగల్ బరిలో జనవరి 12న రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. ఈ పోటిలో తమిళ ప్రజలు ఎవరికి విజయాన్ని కట్టబెడతారో చూడాలి. -
శింబు ఫిక్స్
‘ముందుగా అనుకున్న అందరూ ఉన్నారు. ఆ హీరో ప్లేస్ ఒక్కటే డౌట్. మలయాళ హీరో నివిన్ పౌలీని అతని ప్లేస్‌లో సంప్రదించారు’... ఇది నిన్న మొన్నటి వరకు కోలీవుడ్‌లో మణిరత్నం మెగా మల్టీస్టారర్ సినిమా గురించి వినిపించిన వార్త. అతను శింబు అని ఊహించే ఉంటారు. శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, అరవింద్ స్వామి, ఐశ్యర్య రాజేష్, ఫాజిల్ ముఖ్య పాత్రల్లో మణిరత్నం ఓ మెగా మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే శింబు ఈ ప్రాజెక్ట్‌లో ఉంటారా? లేదా అనే సందేహం చాలామందికి ఉండేది. దానికి కారణం అతను తమిళంలో చేసిన ‘అన్బానవన్ అసరాదవన్, అడంగాదవన్ (ఏఏఏ) సినిమా వివాదంలో చిక్కుకుంది. శింబుపై ఈ చిత్రనిర్మాత మైఖేల్ రాయప్పన్ కొన్ని ఆరోపణలు చేశారు. దీంతో ఈ హీరోగారిపై కోలీవుడ్‌లో కొంతకాలం వేటు పడుతుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వివాదం ఇప్పుడు సద్దుమణిగింది. దాంతో మణిరత్నం మెగా మల్టీస్టారర్ మూవీలో శింబునే ఫైనల్ అయ్యారు. అంతేకాదు మణిరత్నం స్టార్ట్ చేసిన యాక్టర్స్ వర్క్ షాష్‌కు కూడా శింబు హాజరవుతున్నారు. జనవరిలో షూటింగ్ ఆరంభం కానుంది. -
లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్
...అని డైరెక్టర్ అనగానే ఇప్పటివరకూ నటించిన అరవింద్ స్వామి వచ్చే ఏడాది లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్ అనబోతున్నారు. ‘బొంబాయి, రోజా’ సినిమాలతో చాలామంది మనసుల్లో నిలిచిపోయారు ఈ అప్పటి లవర్ బోయ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారాక ఇటీవల రామ్‌చరణ్ ‘ధృవ’లో విలన్‌గా కూడా చేశారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే, హీరోగానూ నటిస్తున్నారు. ఆర్టిస్ట్‌గా ఆయన ఫుల్ బిజీ. అయినప్పటికీ అరవింద్‌స్వామి మెగా ఫోన్ పట్టనున్నారంటూ చాలా రోజులుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతానికి నా దృష్టంతా నటనపైనే అంటూ చెప్పుకొచ్చిన ఆయన తాజాగా తన మనసులోని మాటను అభిమానులతో పంచుకున్నారు. దర్శకత్వం చేసే ఆలోచన ఉందా? అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. ‘‘కొత్త సంవత్సరం 2018లో డైరెక్షన్ చేసే ఆలోచన ఉంది. ఎవరి ఊహకు అందని కథతో సినిమా తీస్తా’’ అని సమాధానమిచ్చారు. -
భాస్కర్ ఒరు రాస్కెల్ ఆడియో రిలీజ్
తమిళ సినిమా: భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్ర గీతాలావిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం స్థానిక ట్రిప్లికేన్‌లోని కలైవానం ప్రాంగణంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. మలయాళంలో ప్రముఖ దర్శకుడిగా రాణిస్తున్న సిద్ధిక్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం భాస్కర్ ఒరు రాస్కెల్. మలయాళంలో మమ్ముట్టి, నయనతారలతో నిర్మించిన ఈ చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. చిత్ర తమిళం రీమేక్‌లో అజిత్‌ను, ఆ తరువాత రజనీకాంత్‌ను నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. చిత్రం చూసిన రజనీకాంత్ చాలా బాగుందని మెచ్చుకున్నారు. అయితే ఆయన కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో నటించలేకపోయారు. ఆ పాత్రలో ఇప్పుడు అరవిందస్వామి నటిస్తున్నారు. హీరోయిన్ పాత్రలో బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా, నయనతారలో ఒకరిని నటింపజేయాలని ప్రయత్నించినా, చివరికి ఆ అవకాశం నటి అమలాపాల్‌ను వరించింది. నటి మీనా కూతురు నైనిక, మాస్టర్ రఘువరన్, నటి నికీషాపటేల్ ప్రముఖ పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి అమ్రేష్ సంగీతం అందిస్తున్నారు. ఈయన ప్రముఖ నటి జయచిత్ర వారసుడన్నది తెలిసిన విషయమే. అమ్రేష్ ఇంతకు ముందు లారెన్స్ నటించిన మొట్టశివ కట్టశివ చిత్రానికి సంగీతం అందించారు. ఆ చిత్రంలోని పాటలు కమర్షియల్ ఫార్ములాలో ఫాస్ట్ బీట్‌లో మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా అలరించాయి. కాగా ప్రస్తుతం త్రిష ప్రధాన పాత్రను పోషిస్తున్న గర్జణై, ప్రభుదేవా, లక్ష్మీమీనన్ జంటగా నటిస్తున్న యంగ్ మంగ్ ఛంగ్, భరత్ హీరోగా పొటు అంటూ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కాగా ఈయన సంగీతబాణీలు కడుతున్న ఆ భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రాన్ని హర్షిణి ఫిలింస్ పతాకంపై ఏ.హర్షిణి నిర్మిస్తున్నారు. -
గోవాలో తొలి అడుగు!
హిట్టూ, ఫ్లాపు, వసూళ్లు వంటి వర్డ్స్‌ను పక్కన పెడితే దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సినిమాలు రత్నాలని ప్రేక్షకులు చెబుతుంటారు. ఎందుకంటే ఆయన సినిమాలో అంత కంటెంట్ ఉంటుందన్నది వారి అభిప్రాయం. అందుకే మణిరత్నం సినిమా ఎప్పుడు మొదలవుతుందా? ఎప్పుడు చూద్దామా? అని ఎదురు చూస్తుంటారు. మణిరత్నం కూడా త్వరలో సినిమా చూపించే పని మీదే ఉన్నారు. మల్టీస్టారర్ మూవీకి ఆయన శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ గోవాలో జరుగుతున్నాయి. అంటే.. సినిమాకు గోవాలో తొలి అడుగు వేశారన్నమాట. విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, జ్యోతిక, ఐశ్యర్యా రాజేశ్, ఫాహద్ ఫాజిల్, శింబు ముఖ్య పాత్రల్లో రూపొందనున్న చిత్రమిది. ఏఆర్ రెహమాన్ స్వరకర్త. ‘‘మణిరత్నం, ఏఆర్. రెహమాన్, రచయిత వైరముత్తు కాంబినేషన్లో రూపొందనున్న ఈ మెగా మల్టీస్టారర్ ఫిల్మ్ సాంగ్ కంపోజిషన్స్ గోవాలో జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు విజయ్ సేతుపతి. ఈ సినిమా షూటింగ్‌ను జనవరిలో మొదలు పెట్టనున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... కోలీవుడ్‌లో శింబూపై కొందరు నిర్మాతలు ఫిర్యాదు చేయడంతో అతను కొత్త సినిమాలేవీ ఒప్పుకోకూడదనే నిబంధన ఉన్నట్లు సమాచారం. దాంతో శింబు స్థానంలో మలయాళ నటుడు నివిన్ పౌలీని తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తోందని చెన్నై టాక్. ఈ విషయంపై ఆఫిషియల్గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. -
మణి సినిమాలో మన హీరో లేడు..!
చెలియా సినిమాతో మరోసారి నిరాశపరిచిన మణిరత్నం ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాతో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలుగు, తమిళ భాషలతో పాటు ఒకేసారి హిందీలోనూ ఓ సినిమాకు ప్లాన్ చేశారు. అయితే ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నాడన్న ప్రచారం జరిగింది. శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఫహాద్ ఫాజిల్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో నాని మరో హీరోగా నటించనున్నాడన్న టాక్ వినిపించింది. ఈ వార్తలపై దర్శకుడు మణిరత్నం క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తెలుగు, హిందీ భాషల నుంచి ఎవరినీ ఎంపిక చేయలేదని తెలిపారు. హీరోయిన్లుగా సీనియర్ నటి జ్యోతికతో పాటు ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించనున్నారు. మణి ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాకు సంతోష్ శివన్ సినిమాటోగ్రఫి, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ లు అదనపు ఆకర్షణలుగా నిలువనున్నాయి. మద్రాస్ టాకీస్ బ్యానర్ పై 17వ సినిమాగా మణిరత్నం స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
తెలుగులో మరోలా..!
సాక్షి, చెన్నై: ఒక భాషలో హిట్ అయిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ కావడం సహజమే. ఆ మధ్య తమిళ చిత్రం తనీఒరువన్ తెలుగులో రీమేక్ అయ్యింది. రామ్‌చరణ్ హీరోగా నటించిన ఈ చిత్రంలో తమిళంలో విలన్ గా నటించిన అరవిందస్వామినే తెలుగులోనూ నటించారు. అలా తెలుగులో రీమేక్ అవుతున్న మరో తమిళ చిత్రం బోగన్. తమిళంలో జయంరవి, అరవిందస్వామి కలిసి నటించిన ఇందులో హన్సిక నాయకి. లక్ష్మణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో పునర్నిర్మాణం కానుంది. లక్ష్మణ్‌నే దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో జయంరవి పాత్రలో రవితేజ నటించనున్నారట. కాగా అరవిందస్వామి పాత్రను తెలుగులోనూ ఆయననే నటించాలని కోరగా అందుకు నిరాకరించినట్లు ప్రచారం జరుగుతోంది. దీని గురించి దర్శకుడిని అడగ్గా అసలు బోగన్ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించమని తాము అరవిందస్వామిని సంప్రదించలేదన్నారు. నిజం చెప్పాలంటే, తమిళంలో అరవిందస్వామి ఆ పాత్రను చాలా బాగా నటించారని, అందువల్ల నిర్మాత తెలుగులోనూ ఆయనే నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డ మాట వాస్తమేనన్నారు. అయితే ఈ పాత్ర తెలుగులో మరో విధంగా ఉంటుందని చెప్పారు. అందువల్ల తాను ఆ పాత్రకు అరవిందస్వామిని నటింపచేయాలని అనుకోలేదన్నారు. ఆ పాత్రకు తెలుగులో ఎస్జే.సూర్యను నటింపజేయాలని భావిస్తున్నానని అన్నారు. అయితే కొంత గ్యాప్ తరువాత విలన్ గా రీఎంట్రీ అయిన అరవిందస్వామి ఇప్పుడు మళ్లీ హీరోగా నటిస్తున్నారు. ప్రస్తుతం చతురంగవేట్టై 2, భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. అందుకే ఆయన మళ్లీ విలన్ గా నటిండానికి అంగీకరించడం లేదన్నది కోలీవుడ్ వర్గాల సమాచారం. -
నరకాసురుడు ఎవరు?
‘నేరమే నా నెత్తుటి వర్ణంరా... ద్రోహమే నా సృష్టిలో స్వర్గంరా...’ అంటూ ‘ధృవ’ సినిమాలో సై్టలిస్ట్ విలన్‌గా యాక్ట్ చేసి తనలోని కొత్త నటుణ్ణి బయటపెట్టారు అరవింద్ స్వామి. తాజాగా ఈ సై్టలిస్ట్ విలన్ తమిళ దర్శకుడు నరేన్ తెరకెక్కించనున్న ‘నరగాసురన్’లో యాక్ట్ చేయనున్నారు. ఇందులో సందీప్ కిషన్ యాక్ట్ చేస్తున్నారు. డార్క్ అండ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు తెలుగులో ‘నరకాసురుడు’ అని టైటిల్ ఫిక్స్ చేసినట్లు, ఇందులో అరవింద్ స్వామి, సందీప్ కిషన్, ఇంద్రజిత్, శ్రియ నటిస్తున్నట్లు దర్శకుడు నరేన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. వెంటనే ‘గుడ్‌లక్ టు ఆల్ నరగాసురన్ టీమ్’ అని అరవింద్ ట్వీట్ చేశారు. మరి.. ఇందులో సందీప్ కిషన్ హీరోగా యాక్ట్ చేస్తున్నారా లేక మరేదైనా రోల్ చేస్తున్నారా? ఇంతకీ వెండితెర ‘నరకాసురుడు’ ఎవరో మరి? -
'ఆ పాత్ర కోసం ఎవరినీ అడగలేదు'
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ధృవ. తమిళ సూపర్ హిట్ తనీ ఒరువన్కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. థ్రిల్లింగ్ మైండ్ గేమ్‌తో సాగే ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర కూడా హీరోకు సమానంగా ఉంటుంది. తమిళ నాట ఈ పాత్రలో నటించిన అరవింద్ స్వామికి మంచి గుర్తింపు వచ్చింది. అందుకే తెలుగు వర్షన్ లోనూ ఆయన్నే విలన్‌గా తీసుకున్నారు. అయితే ధృవ సినిమా ప్రారంభానికి ముందు విలన్ పాత్రకు టాలీవుడ్ ప్రముఖులను సంప్రదించారన్న టాక్ వినిపించింది. ముఖ్యంగా సీనియర్ హీరో నాగార్జున ఈ విలన్ పాత్రకు అంగీకరించాడన్న వార్త అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అదే సమయంలో జగపతిబాబు లాంటి సీనియర్ హీరోల పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా ఈ రూమర్స్ క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. తనీ ఒరువన్ సినిమాను రీమేక్ చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడే విలన్ పాత్రకు అరవింద్ స్వామినే తీసుకోవాలని ఫిక్స్ అయినట్టుగా తెలిపాడు. మరే నటుణ్ని సంప్రదించలేదన్న డైరెక్టర్, ఈ పాత్ర కేవలం ఆయన కోసం పుట్టింది. ఆయన తప్ప ఇంకెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరన్నాడు. తొలి రోజే 10 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ధృవ ఓవర్సీస్లో హాఫ్ మిలియన్ మార్క్‌ను దాటి వన్ మిలియన్ క్లబ్లో స్థానం కోసం పరుగులు తీస్తోంది. -
విలన్ పాత్రకు కత్తెర
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ధృవ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ్లో ఘనవిజయం సాధించిన తనీఒరువన్కు ధృవ రీమేక్‌గా తెరకెక్కింది. ఒరిజినల్ వర్షన్లో హీరోకు ధీటుగా కనిపించే విలన్ పాత్రలో నటించిన అరవింద్ స్వామి, తెలుగు వర్షన్ లోనూ విలన్ రోల్లో నటిస్తున్నాడు. అయితే ఒరిజినల్ వర్షన్ విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాదాపు హీరో కనిపించినంత సేపు విలన్ కూడా తెర మీద కనిపిస్తాడు. కానీ తెలుగు వర్షన్లో మాత్రం ఆ క్యారెక్టర్‌కు ఉన్న ఇంపార్టెన్స్‌కు కోత పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. తమిళ్‌తో పొలిస్తే ధృవ సినిమాలో అరవింద్ స్వామి పాత్ర చాలా తక్కువగా ఉంటుందట. అయితే కోలీవుడ్‌లో సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసిన విలన్ క్యారెక్టర్‌కు కోత పెడితే.., తెలుగులో సినిమా రిజల్ట్ తేడా పడే చాన్స్ ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. -
ధృవలో అరవింద్ స్వామికి డబ్బింగ్ ఎవరు..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుండగా.. అరవింద్ స్వామి విలన్‌గా కనిపించనున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీఒరువన్కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ఎంతో మందిని సంప్రదించిన తరువాత ఒరిజినల్ వర్షన్లో నటించిన అరవింద్ స్వామినే ఆ పాత్రకు తీసుకున్నారు. అయితే ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్‌కు తెలుగులో డబ్బింగ్ ఎవరు చెపుతున్నారు. అన్న చర్య జరుగుతోంది. తమిళ నటుడైన అరవింద్ స్వామి తెలుగులో స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోలేడు. అందుకే తెలుగులో ఈ పాత్రకు ఓ యువ గాయకుడితో డబ్బింగ్ చెప్పించారట. గతంలో స్నేహితుడు సినిమాలో విజయ్‌కి డబ్బింగ్ చెప్పిన గాయకుడు హేమచంద్ర, ధృవ సినిమాలో అరవింద్ స్వామికి డబ్బింగ్ చెపుతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో హేమచంద్ర వాయిస్‌కు మంచి మార్కులే పడ్డాయి. -
ధృవ సినిమాలో మరో హీరో
బ్రూస్ లీ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్నా.. చరణ్ మాత్రం మూడో షెడ్యూల్ నుంచే షూటింగ్లో పాల్గొంటున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంట్రస్టింగ్ కాస్టింగ్‌ను సెట్ చేస్తున్నారు. చరణ్ సరసన హీరోయిన్గా మరోసారి రకుల్ ప్రీత్ కనిపిస్తుండగా, తమిళ వర్షన్లో విలన్‌గా నటించిన అరవింద్ స్వామి, చరణ్ తోనూ ఢీ అంటున్నాడు. చరణ్ షూటింగ్లో పాల్గొంటున్న తాజా షెడ్యూల్లో యువ నటుడు నవదీప్ కూడా ధృవ టీంతో జాయిన్ అవుతున్నాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్న నవదీప్, తన పాత్ర ఏంటి అన్నది మాత్రం రివీల్ చేయలేదు. Happy to be onboard charans #dhruva :) lets see what comes out of this :) #oldwaysdontopennewdoors :) — Navdeep (@pnavdeep26) 7 June 2016 -
15 ఏళ్ల తరువాత బాలీవుడ్లో..!
సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక జెట్ స్పీడులో దూసుకుపోతున్నాడు సౌత్ స్టార్ అరవింద్ స్వామి. హీరోగా రిటైరయిన ఈ చాక్లెట్ బాయ్, రీ ఎంట్రీలో స్పెషల్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అంతేకాదు తనీఒరువన్ సినిమాలో నెగెటివ్ రోల్లో నటించిన అరవింద్ స్వామి నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాను ఏ భాషల్లో రీమేక్ చేసినా అరవింద్ స్వామి పాత్రకు మరో నటుడ్ని ఎంపిక చేయటం కష్టం అనిపించే స్థాయిలో ఆ పాత్రకు ప్రాణం పోశాడు. అదే జోరులో బాలీవుడ్లో కూడా రీ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత ఓ బాలీవుడ్ సినిమాలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. డియర్ డాడ్ పేరుతో తెరకెక్కుతన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. 45 ఏళ్ల తండ్రికి, 14 ఏళ్ల కొడుకు మధ్య జరిగే కథగా రూపొందుతున్న ఈ సినిమాకు తనూజ్ బ్రమర్స్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను మే 6 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
చెర్రీ హీరోయిన్ ఫిక్స్ అయ్యింది
బ్రూస్ లీ సినిమాతో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తమిళ సూపర్ హిట్ సినిమా తనీ ఒరువన్‌ను రీమేక్ చేస్తున్నట్టుగా ప్రకటించిన చెర్రీ ఆ సినిమా కాస్టింగ్ విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. సినిమాలో కీలకమైన విలన్ విషయంలో ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోయినా హీరోయిన్ విషయంలో మాత్రం ఫైనల్ డెసిషన్ తీసుకున్నారట. రామ్‌చరణ్‌తో ఎవడు సినిమాలో కలిసి నటించిన శృతిహాసన్ తనీఒరువన్ రీమేక్‌లోనూ చరణ్‌తో కలిసి నటిస్తోంది. ఇప్పటికే శృతి కూడా తన అంగీకారాన్ని తెలపటంతో ఇక మిగతా పనుల మీద దృష్టిపెట్టారు చిత్రయూనిట్. విలన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తారని భావించినా భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ఇతర నటీనటులను ప్రయత్నిస్తున్నారట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
రామ్ చరణ్ vs మంచు మనోజ్
బ్రూస్ లీ రిజల్ట్‌తో నిరాశపరిచిన మెగాహీరో రామ్ చరణ్. తరువాత సినిమా విషయంలో ఇంకా ఊరిస్తూనే ఉన్నాడు. బ్రూస్ లీ సెట్స్ మీద ఉండగానే తమిళ సినిమా తనీ ఒరువన్‌ను రీమేక్ చేస్తాడన్న వార్తలు వినిపించినా, ఇప్పటివరకు ప్రకటన చేయలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందన్న వార్తతో పాటు ఎన్నో ఈ సినిమాలో విలన్‌గా నటించే నటుడి విషయంలో కూడా చాలా వార్తలు వినిపించాయి. తమిళ సినిమాలో అరవింద్ స్వామి చేసిన పాత్రను తెలుగు కూడా తనతోనే చేయించాలని భావించినా అరవింద్ స్వామి మాత్రం సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో ఇతర నటుల మీద దృష్టిపెట్టారు. సినిమాకు చాలా కీలక పాత్ర కావటంతో స్టార్ ఇమేజ్ ఉన్న నటుడితో ఈ పాత్ర చేయించాలని భావిస్తున్నారు చరణ్ టీం. అందుకు తగ్గట్టుగానే రానా, నాగార్జున, నారా రోహిత్‌ల పేర్లు వినిపించినా ఏదీ ఫైనల్ కాలేదు. తాజాగా మరో యంగ్ హీరో పేరు వినిపిస్తోంది. చిరంజీవి సినిమాల్లో విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్.., చిరు తనయుడి సినిమాలో విలన్‌గా నటించే అవకాశం ఉదంట. ఈమధ్యే, నాన్నగారిలా ప్రతినాయక పాత్రలో మెప్పించాలని ఉందని ప్రకటించిన మనోజ్, ఈ పాత్రకు న్యాయం చేయగలడని భావిస్తున్నారట చిత్రయూనిట్. మరి మనోజ్ ఈ క్యారెక్టర్ చేస్తున్నాడో లేదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
నేను ఆ సినిమా చేయట్లేదు..
ప్రస్తుతం సౌత్ సినీ రంగంలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా ఉన్న సినిమా 'తనీ ఒరువన్'. తమిళ్లో ఘనవిజయం సాధించిన ఈ సినిమాను ఇతర భాషల్లోనూ రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్న నిర్మాతలు, ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. తనీ ఒరువన్ సినిమాలో హీరో పాత్రతో పాటు విలన్ పాత్రకు సమానమైన ప్రాధాన్యం ఉంది. తమిళ్లో అరవింద్ స్వామి చేసిన ఈ పాత్రను తెలుగులో ఎవరితో చేయించాలన్న చర్చ చాలారోజులుగా నడుస్తుంది. యంగ్ హీరో రానా నుంచి సీనియర్ హీరో నాగార్జున వరకు చాలా పేర్లు చర్చకు వచ్చాయి. అయితే ఫైనల్‌గా లవర్ బాయ్ మాధవన్ ఈ పాత్రకు సెలెక్ట్ అయ్యాడంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను మాధవన్ ఖండించాడు. ప్రస్తుతం 'సాల ఖదూస్' సినిమాలో నటిస్తున్నఅతడు, తన నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించాడు. తను ఓ రీమేక్ సినిమాలో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్ని అవాస్తమని తెలిపాడు. తన అఫీషియల్ ట్విట్టర్ ద్వారా అభిమానులకు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన విశేషాలను వెల్లడించాడు. Hey Folks.This being a verified site I shall personally tell you about the projects I have signed and doing.The rest are all rumours. — Ranganathan Madhavan (@ActorMadhavan) October 23, 2015 I have not signed nor approved any other project in any language. Right now my life is only Saala Khadoos and Irrudhi Suttru. — Ranganathan Madhavan (@ActorMadhavan) October 23, 2015 -
చరణ్ బెస్ట్ ఫ్రెండే విలన్..?
ప్రస్తుతం బ్రూస్లీ సినిమా పనుల్లో బిజీగా ఉన్న చరణ్ తన తదుపరి సినిమాను కూడా ఫైనల్ చేశాడు. ఇప్పటికే చరణ్ కోసం డివివి దానయ్య రూ. 5.5 కోట్లు ఖర్చుపెట్టి తనీఒరువన్ రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉంది. అయితే తమిళంలో విలన్ పాత్ర పోషించిన అరవింద్ స్వామి రీమేక్ లో ఆ పాత్ర ఆసక్తి చూపించకపోవటంతో ఇప్పుడు ఆ పాత్ర లో నటించే నటుడి కోసం టాలీవుడ్లో వేట మొదలైంది. ఈ సినిమాలో హీరో పాత్రకు ఉన్నంత ప్రాముఖ్యం విలన్ పాత్రకు కూడా ఉండటంతో ఆ పాత్రలోనూ స్టార్ ఇమేజ్ ఉన్న నటుడైతే మంచిదని భావిస్తున్నారు. అందుకే యంగ్ హీరో రానాను ఈ పాత్రలో నటింపజేయాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే బాహుబలి సినిమాలో విలన్‌గా నటిస్తున్న రానా, తనీఒరువన్ రీమేక్‌లో కూడా ఆ తరహా పాత్ర చేస్తాడేమో చూడాలి. క్యారెక్టర్ కోసం కాకపోయినా తన బెస్ట్ ఫ్రెండ్ చరణ్ కోసం అయినా రానా అంగీకరిస్తాడన్న టాక్ వినిపిస్తోంది. ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా అందరికీ తెలిసిన ఈ ఇద్దరు స్టార్లు వెండితెర మీద పోటా పోటీగా నటిస్తే అది మార్కెట్‌కు కూడా ప్లస్ అవుతుందన్న ఆలోచనలో ఉంది చిత్రయూనిట్. ఇప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న రానా ఈ పాత్ర చేయడానికి అంగీకరిస్తాడో లేదో చూడాలి.