‘గాయపడిన మనసు ఎంత దూరమైనా తీసుకెళ్తుంది..’ చై కస్టడి టీజర్‌ అవుట్‌ | Naga Chaitanya Custody Movie Teaser Release | Sakshi
Sakshi News home page

Naga Chaitanya Custady Teaser: ఆకట్టుకుంటున్న కస్టడీ టీజర్‌.. గూస్‌బంప్స్‌ తెప్పిస్తున్న డైలాగ్స్‌

Mar 16 2023 7:55 PM | Updated on Mar 16 2023 7:56 PM

Naga Chaitanya Custody Movie Teaser Release - Sakshi

యంగ్‌ హీరో నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇందులో నటుడు అరవింద్‌ స్వామి కీల పాత్ర పోషిస్తున్నాడు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చై పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార పోస్టర్స్‌ మంచి రెస్పాన్స్‌ రాగా మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక కస్టడీపై మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తూ తాజాగా చిత్రం బృందం మూవీ టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో చై డైలాగ్స్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ‘గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది. అది ఇప్పుడు తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ చావు నన్ను వెంటాడుతుంది..’ అంటూ చై సీరియస్‌ డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది.

శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతిశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకు సంగీతం అందించడం విశేషం. అరవింద్ స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనునున్నారు. సమ్మర్‌ కానుకగా మే 12న తెలుగు, తమిళంలో ఈ చిత్రం విడుదల కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement