
తమిళనాట విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా నరకాసురుడు. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ్‌లో నరగసూరన్ పేరుతో రిలీజ్ కానుంది. 16 సినిమాతో ఆకట్టుకున్న కార్తీక్ నరేన్ మరోసారి నరకాసురుడుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
వేసవి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతున్న నరకాసురుడు ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. లీడ్ క్యారెక్టర్స్ అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియలు సీరియస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. తెలుగు వర్షన్‌ను రమేష్ వర్మ ప్రొడక్షన్ లో కోనేరు సత్యనారాయణ నిర్మాతగా విడుదల చేయనున్నారు.