
రాజేశ్, అనిల్ సుంకర, త్రినాథరావు, రీతూ, సందీప్, అన్షు, ప్రసన్న
‘‘పిల్లలు, పెద్దలు థియేటర్స్‌కు వెళ్లి, నవ్వుకోవాలనే ఉద్దేశంతో ‘మజాకా’ సినిమా చేశాం. ఆడి యన్స్ థియేటర్స్‌లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చివర్లో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. సినిమా జనాల్లోకి వెళ్లింది. థియేటర్స్‌కు వెళ్లి ఈ సినిమా చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు. పైసా వసూల్ సినిమా ఇది’’ అని హీరో సందీప్ కిషన్ అన్నారు. సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రూపోందిన సినిమా ‘మజాకా’.
ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, హాస్య మూవీస్ పతాకాలపై రాజేశ్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదలైంది. ఈ మూవీ థ్యాంక్స్ మీట్‌లో నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ–‘‘ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే సినిమా ‘మజాకా’. ఆడియన్స్‌ను నవ్వించాలన్న మా ప్రయత్నంలో సక్సెస్ అయ్యాం’’ అని తెలిపారు. ‘‘మజాకా’ నవ్వుల కోసమే... లాజిక్స్ కోసం కాదు. మేము ఆశించిన రెస్పాన్స్ వస్తున్నందుకు హ్యాపీ ’’ అని తెలిపారు నిర్మాత అనిల్ సుంకర.
‘‘మజాకా’ మా లైఫ్‌లో హ్యాపీయస్ట్ మెమొరీ’’ అన్నారు రైటర్ ప్రసన్నకుమార్. ‘‘గత ఏడాది ఫిబ్రవరిలో ‘ఊరు పేరు భైరవకోన’తో హిట్ సాధించాం. ఈ ఇయర్ ఫిబ్రవరిలో ‘మజాకా’తో హిట్ కొట్టాం’’ అన్నారు రాజేశ్ దండా. రీతూ వర్మ, అన్షు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు రామ్ అబ్బరాజు, దర్శకుడు వీఐ ఆనంద్ అతిథులుగా పాల్గొని, ‘మజాకా’ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment