Majaka Movie
-
మజాకాతో పెద్ద హిట్ కొడుతున్నాం: సందీప్ కిషన్
‘‘మజాకా’(Mazaka) సినిమా కోసం నెల రోజులుగా పగలు, రాత్రి చిత్రీకరణ చేస్తున్నాం. ఈ మూవీ కోసం మేము క్రియేటివ్‌గా ప్రమోషన్స్ చేయాలని భావించాం. అందులో భాగంగా ఔట్‌డోర్‌లో జరుగుతున్న మా సినిమా షూటింగ్‌కి మీడియా వారు వచ్చినందుకు థ్యాంక్స్. ఈ నెల 26న ‘మజాకా’ చిత్రంతో పెద్ద హిట్ కొడుతున్నామనే నమ్మకం ఉంది’’ అని సందీప్ కిషన్ తెలిపారు.త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్(Sundeep Kishan), రీతూ వర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘మజాకా’. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శివరాత్రి కానుకగా ఈ నెల 26న విడుదల కానుంది. కాగా ఈ మూవీలోని ‘రావులమ్మ..’ అంటూ సాగే పాట చిత్రీకరణ షూటింగ్ ప్రస్తుతం ఔట్‌డోర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌ని లైవ్ ద్వారా ప్రేక్షకులకు చూపించారు మేకర్స్. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ–‘‘రావులమ్మ’ ఫుల్ మాస్ అండ్ ఫోక్ సాంగ్. సందీప్, రీతు అద్భుతమైన డ్యాన్స్‌తో ఇరగదీశారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాం’’ అని చెప్పారు రీతూ వర్మ. ‘‘మజాకా’తో ఈసారి మళ్లీ బ్లాక్ బస్టర్ కొడుతున్నాం’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. ‘‘మా బ్యానర్లో ఇది బెస్ట్ సినిమా అని నమ్ముతున్నాను’’ అని పేర్కొన్నారు రాజేష్ దండా. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడారు. -
అలా మజాకాకి చాన్స్ వచ్చింది: నటి అన్షు
‘నాకు పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడే నటిగా కెరీర్ స్టార్ట్ చేశాను. నాగార్జునగారి ‘మన్మథుడు’ సినిమా చేశాను. మరోవైపు చదువుకోవాల్సి వచ్చింది. దీంతో లండన్ వెళ్లిపోయాను. అక్కడ కాలేజ్ స్టడీస్ పూర్తి చేసి, మాస్టర్స్ చేశాను. సైకాలజిస్ట్ అయ్యాను. సొంతంగా ఓ క్లినిక్ కూడా రన్ చేస్తున్నాను. నా 24 ఏళ్ల వయసులో నేను సచిన్ సాగర్‌ను పెళ్లి చేసుకున్నాను.మాకు ఇద్దరు సంతానం. ఒకవేళ ‘మన్మథుడు’ సమయానికి నా వయసు 25 ఏళ్లు ఉండి ఉంటే నేను సినిమాల్లోనే కొనసాగేదాన్నేమో!’’ అని నటి అన్షు అన్నారు. సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మించిన చిత్రం ‘మజాకా’(Majaka). రీతూ వర్మ హీరోయిన్గా, మరో లీడ్ రోల్లో అన్షు(Anshu) నటించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో అన్షు చెప్పిన సంగతులు...⇒ ‘మజాకా’లో నేను యశోద అనే క్యారెక్టర్ చేశాను. యశోద స్ట్రాంగ్ విమెన్. కానీ తనలో మంచి ఎమోషనల్ పెయిన్ ఉంది. సినిమాలో నా రోల్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఇక ‘మన్మథుడు’ సినిమా రీ–రిలీజ్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నా వీడియో బైట్ కోసం నన్ను కాంటాక్ట్ చేశారు. అలా సోషల్ మీడియాలో కనిపించాను. ఆ తర్వాత రచయిత ప్రసన్నకుమార్‌గారు మా మేనేజర్ ద్వారా నన్ను కలిసి, ఈ సినిమా కథ చెప్పారు. అలా ‘మజాకా’కి చాన్స్ వచ్చింది. ఈ కథ వింటున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ⇒ నేను తిరిగి సినిమాలు చేస్తానన్నప్పుడు నా భర్త నన్ను ఎంకరేజ్ చేశారు. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు... ఇలా ఏ తరహా పాత్రలు అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ∙నేను లండన్‌లో ఉన్నప్పుడు ఓ క్యాస్టింగ్ ఏజెన్సీకి నా వివరాలు ఇచ్చి, యాక్ట్ చేస్తానని చెప్పాను. నేను చేసిన సినిమాల గురించి చెప్పాను. వాళ్లు నన్ను రిజెక్ట్ చేశారు. అయితే నేనొక సైకాలజిస్ట్‌ని. సక్సెస్‌తో కన్నా ఫెయిల్యూర్స్‌తోనే ఎక్కువగా నేర్చుకోగలమని నమ్ముతాను. -
కావాలని మాట్లాడలేదు: దర్శకుడు నక్కిన త్రినాథరావు
సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మజాకా’. రావు రమేశ్, ‘మన్మథుడు’ మూవీ ఫేమ్ అన్షు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 21న ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ లో త్రినాథరావు మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై త్రినాథరావు నక్కిన స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. దాని సారాంశం ఏంటంటే.. ‘‘మజాకా’ టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళల మనసులను నొప్పించాయని అర్థమైంది.అయితే నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోటి నుంచి వచ్చిన మాటలే తప్ప కావాలని మాట్లాడిన మాటలు కాదు. అయినా ఆ మాటలు అందరి మనసులను నొప్పించాయి కాబట్టి తప్పు తప్పే. కాబట్టి క్షమాపణలు తెలియజేస్తున్నాను. అన్షుగారికి కూడా క్షమాపణలు తెలియజేస్తున్నాను. అలాగే వినోదం కోసం మా హీరోయిన్ రీతూ వర్మను ఏడిపించే క్రమంలో వాడిన మేనరిజమ్ వల్ల కూడా తప్పు జరిగిపోయింది. అది కావాలని చేసింది కాదు. కానీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే వారికీ క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అన్నారు త్రినాథరావు నక్కిన. త్రినాథరావుగారు మంచి వ్యక్తి: త్రినాథరావు నక్కిన మాటలపై అన్షు స్పందించి, ఓ వీడియోను విడుదల చేశారు. ‘‘మజాకా’ టీజర్‌కి అద్భుతమైన స్పందన వస్తున్నందుకు హ్యాపీగా ఉంది. ఇక త్రినాథరావు నక్కినగారు వేదికపై మాట్లాడిన మాటలు పెద్ద సబ్జెక్ట్ కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. తన కుటుంబంలోని వ్యక్తిగా నన్ను చూసుకుంటారాయన’’ అన్నారు. -
డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు.. స్పందించిన మన్మథుడు హీరోయిన్
మన్మథుడు హీరోయిన్ అన్షు (Anshu)పై దర్శకుడు నక్కిన త్రినాధరావు (Trinadha Rao Nakkina) అసభ్యకర వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఆమె శరీరాకృతి గురించి అభ్యంతరకరంగా మాట్లాడటంతో మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు సోషల్ మీడియాలోనూ నెటిజన్లు దర్శకుడి తీరును ఎండగడుతున్నారు. దీంతో తప్పు తెలుసుకున్న త్రినాధరావు హీరోయిన్ అన్షుతో పాటు మహిళందరికీ క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే!నాపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారుతాజాగా ఈ వివాదంపై అన్షు స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ముందుగా మజాకా సినిమా టీజర్ (Mazaka Movie)ను ఇంతలా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలాకాలం తర్వాత మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు వస్తున్నాను. మీరు చూపిస్తున్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను. త్రినాధరావు చేసిన వ్యాఖ్యల గురించి చాలా కథనాలు వస్తున్నాయి. నాకెన్నో సలహాలు, సూచనలిచ్చారుమీ అందరికీ చెప్పాలనుకుంటున్నదేంటంటే.. ఈ ప్రపంచంలోనే ఆయన చాలా మంచి వ్యక్తి. నన్ను తన ఫ్యామిలీ మెంబర్లా చూసుకున్నారు. తనపై నాకు చాలా గౌరవం ఉంది. మజాకా సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను. త్రినాధ్ సర్‌తో కలిసి పని చేసినందుకు హ్యాపీగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వడానికి నాకు ఇంతకంటే మంచి దర్శకుడు దొరకరేమో! ఆయన నాకెన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. తనపై నాకు ప్రేమ, గౌరవం తప్ప ఎలాంటి కోపం లేదు. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితే ఆపేయండి' అని కోరింది.(చదవండి: త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్.. ఘనంగా సీమంతం)రెండు దశాబ్దాల తర్వాత రీఎంట్రీహీరోయిన్ అన్షు అప్పట్లో వచ్చిన మన్మథుడు సినిమాలో అందంతో, అమాయకత్వంతో ఆకట్టుకుంది. తర్వాత ప్రభాస్‌తో రాఘవేంద్ర సినిమా చేసింది. పెళ్లి తర్వాత లండన్‌లోనే సెటిలైపోయి సినిమాలకు దూరంగా ఉంటోంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత మజాకా మూవీతో అన్షు రీఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో అన్షుతో పాటు సందీప్ కిషన్, రీతూ వర్మ, రావు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథ, డైలాగ్స్ ప్రసన్న కుమార్ బెజవాడ అందించగా త్రినాధ రావు దర్శకత్వం వహించాడు.టీజర్ లాంచ్ ఈవెంట్లో అసభ్యకర వ్యాఖ్యలుఆదివారం (జనవరి 12న) మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు త్రినాధరావు హీరోయిన్ అన్షుపై నోరు జారాడు. మొదటగా ఆమెకు పెద్ద అభిమానిని అన్నట్లుగా ప్రసంగం మొదలుపెట్టిన ఈయన చివరకు వచ్చేసరికి మాత్రం ఆమె శరీరాకృతి గురించి అసభ్య వ్యాఖ్యలు చేశాడు. అన్షు సన్నగా ఉందని.. ఇలా ఉంటే సరిపోదు.. లావెక్కాలి.. అంటూ అసహ్యకరంగా మాట్లాడాడు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా కమిషన్ త్రినాధరావు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. ఇక ఇదే ఈవెంట్లో హీరోయిన్ రీతూ వర్మ పేరు మర్చిపోయినట్లు నాటకం ఆడాడు త్రినాధరావు. దీనిపై కూడా నెట్టింట విమర్శలు వచ్చాయి. మజాకా సినిమా విషయానికి వస్తే ఇది వచ్చే నెల 21న విడుదల కానుంది.చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం