![Manmadhudu Fame Actress Anshu About Majaka Movie](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/9/anshu.jpg.webp?itok=Sc9YsgjS)
‘నాకు పదిహేనేళ్ల వయసు ఉన్నప్పుడే నటిగా కెరీర్ స్టార్ట్ చేశాను. నాగార్జునగారి ‘మన్మథుడు’ సినిమా చేశాను. మరోవైపు చదువుకోవాల్సి వచ్చింది. దీంతో లండన్ వెళ్లిపోయాను. అక్కడ కాలేజ్ స్టడీస్ పూర్తి చేసి, మాస్టర్స్ చేశాను. సైకాలజిస్ట్ అయ్యాను. సొంతంగా ఓ క్లినిక్ కూడా రన్ చేస్తున్నాను. నా 24 ఏళ్ల వయసులో నేను సచిన్ సాగర్‌ను పెళ్లి చేసుకున్నాను.
మాకు ఇద్దరు సంతానం. ఒకవేళ ‘మన్మథుడు’ సమయానికి నా వయసు 25 ఏళ్లు ఉండి ఉంటే నేను సినిమాల్లోనే కొనసాగేదాన్నేమో!’’ అని నటి అన్షు అన్నారు. సందీప్ కిషన్ హీరోగా నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రాజేశ్ దండా నిర్మించిన చిత్రం ‘మజాకా’(Majaka). రీతూ వర్మ హీరోయిన్‌గా, మరో లీడ్ రోల్‌లో అన్షు(Anshu) నటించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో అన్షు చెప్పిన సంగతులు...
⇒ ‘మజాకా’లో నేను యశోద అనే క్యారెక్టర్ చేశాను. యశోద స్ట్రాంగ్ విమెన్. కానీ తనలో మంచి ఎమోషనల్ పెయిన్ ఉంది. సినిమాలో నా రోల్‌కి మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఇక ‘మన్మథుడు’ సినిమా రీ–రిలీజ్ సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నా వీడియో బైట్ కోసం నన్ను కాంటాక్ట్ చేశారు. అలా సోషల్ మీడియాలో కనిపించాను. ఆ తర్వాత రచయిత ప్రసన్నకుమార్‌గారు మా మేనేజర్ ద్వారా నన్ను కలిసి, ఈ సినిమా కథ చెప్పారు. అలా ‘మజాకా’కి చాన్స్ వచ్చింది. ఈ కథ వింటున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను.
⇒ నేను తిరిగి సినిమాలు చేస్తానన్నప్పుడు నా భర్త నన్ను ఎంకరేజ్ చేశారు. హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు... ఇలా ఏ తరహా పాత్రలు అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ∙నేను లండన్‌లో ఉన్నప్పుడు ఓ క్యాస్టింగ్ ఏజెన్సీకి నా వివరాలు ఇచ్చి, యాక్ట్ చేస్తానని చెప్పాను. నేను చేసిన సినిమాల గురించి చెప్పాను. వాళ్లు నన్ను రిజెక్ట్ చేశారు. అయితే నేనొక సైకాలజిస్ట్‌ని. సక్సెస్‌తో కన్నా ఫెయిల్యూర్స్‌తోనే ఎక్కువగా నేర్చుకోగలమని నమ్ముతాను.
Comments
Please login to add a commentAdd a comment