Manmadhudu
-
పెళ్లయి 14 ఏళ్లు.. 'మన్మథుడు' హీరోయిన్ మధుర జ్ఞాపకాలు (ఫొటోలు)
-
సాగర తీరాన మన్మధుడు హీరోయిన్.. రీ ఎంట్రీ ఇవ్వనుందా?
-
మన్మధుడు హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటి? (ఫొటోలు)
-
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
'మన్మథుడు' సినిమా పేరు చెప్పగానే కామెడీ డైలాగ్స్ గుర్తొస్తాయి. అలానే హీరోయిన్ అన్షు కూడా జ్ఞాపకమొస్తుంది. ఎందుకంటే మూవీలో ఉన్నది కాసేపే అయినా తన అందంతో మెస్మరైజ్ చేసింది. అయితే మరిన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తుందని అనుకుంటే.. సడన్‌గా పెళ్లి చేసుకుని షాకిచ్చింది. దేశమే వదిలేసి వెళ్లిపోయింది. అలాంటిది ఇప్పుడు దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందట.(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)లండన్‌లో పుట్టి పెరిగిన అన్షు.. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ చేసి, హీరోయిన్ అయిపోయింది. మన్మథుడు, రాఘవేంద్ర, మిస్సమ్మ సినిమాలు చేసింది. తమిళంలో మరో మూవీ చేసింది. హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ అవుతుందనుకుంటే.. 2003లో సచిన్ నిగ్గర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని తిరిగి లండన్ వెళ్లిపోయింది. యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది.ఇక కొడుకు, కూతురు పుట్టారు. కొన్నాళ్ల పాటు గార్మెంట్ బిజినెస్ కూడా చేసింది. గత కొన్నేళ్ల నుంచి మళ్లీ గ్లామర్ చూపిస్తూ వచ్చింది. అలా గత కొన్నాళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ తెలుగు దర్శకనిర్మాతల దృష్టిలో పడింది. అలా ఇప్పుడు సందీప్ కిషన్ కొత్త మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో రావు రమేశ్‌కి జోడీగా ఈమె కనిపించనుందని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంటుంది. (ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) -
20 ఏళ్ల తర్వాత కలిసిన 'మన్మథుడు' జోడీ.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్!
తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమాల్లో 'మన్మథుడు' ఒకటి. నాగార్జున, సోనాలి బింద్రే, బ్రహ్మానందం, త్రివిక్రమ్, దేవిశ్రీ ప్రసాద్.. ఇలా ఒకరిని మించి మరొకరు ఈ మూవీకి బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చారు. కల్ట్ క్లాసిక్ మూవీగా నిలబెట్టారు. ఇప్పుడు ఈ మూవీ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. 'మన్మథుడు'లో ఓ హీరోయిన్గా చేసిన అన్షు.. ఇప్పుడు నాగార్జునని కలిసింది. ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా పెట్టింది. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీలోకి స్టార్ హీరోయిన్ కొత్త సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే) 2002లో వచ్చిన 'మన్మథుడు' సినిమాలో హీరోగా నాగార్జున ఎంత అందంగా కనిపిస్తారో.. హీరోయిన్లుగా చేసిన సోనాలి బింద్రే, అన్షు కూడా అంతే అందంగా కనిపిస్తారు. అయితే ఈ మూవీ చేసిన తర్వాత అన్షు.. మరో రెండు తెలుగు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా నటనకు దూరమైపోయింది. పెళ్లి చేసుకుని ఇంగ్లాండ్‌లో సెటిలైపోయింది. దాదాపు 20-21 ఏళ్ల తర్వాత భారత్ తిరిగొచ్చిన అన్షు.. ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. నాగార్జునతో కలిసి పార్టీ కూడా చేసుకుంది. రీసెంట్గా 'మన్మథుడు' జోడీ నాగార్జున-అన్షు కలిసి పార్టీ చేసుకున్నారు. పలు ఫొటోలు బయకొచ్చాయి. తాజాగా ఇప్పుడు నాగార్జునని కలవడం గురించి స్వయంగా హీరోయిన్ అన్షునే ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. 'ఔదర్యం, మంచిగా ఉండటం అనేవి నాగ్ సర్‌లో మరింతగా పెరిగాయి. ఈ జ్ఞాపకాలు మరింత పదిలంగా ఉంటాయి' అని అన్షు రాసుకొచ్చింది. ఇప్పుడు ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేస్తున్నాయి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) -
Manmadhudu: 22 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన మన్మథుడు జంట ఫోటోలు వైరల్
-
ఆ ఒక్క కారణం వల్లే సినిమాలు మానేశా: మన్మథుడు హీరోయిన్
అన్షు అంబానీ.. చేసింది నాలుగే నాలుగు సినిమాలు.. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్లో గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికీ ఆమెను తెలుగు ఆడియన్స్ ఇట్టే గుర్తుపడతారు. తను నటించిన తొలి చిత్రం మన్మథుడు. ఈ మూవీ అటు నాగార్జునకు, ఇటు అన్షుకు ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ మరుసటి ఏడాదే రాఘవేంద్ర సినిమా చేసిందీ బ్యూటీ. మిస్సమ్మలో అతిథి పాత్రలో మెరిసింది. 2004లో జై అనే తమిళ చిత్రంలో చివరిసారిగా నటించింది. తర్వాత మరే సినిమా ఒప్పుకోలేదు. 2003లో సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లాడి లండన్‌లో సెటిలైంది. తర్వాత ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు ఇరవై ఏండ్ల తర్వాత ఈమె మీడియా ముందుకు వచ్చింది. 16 ఏళ్ల వయసులోనే.. తాజాగా ఏదో పని మీద భారత్‌కు వచ్చిన ఆమె ఓ ఇంటర్వ్యూలో తను సినిమాలు మానేయడానికి గల కారణాన్ని బయటపెట్టింది. అన్షు మాట్లాడుతూ.. నేను ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగాను, కానీ నా పూర్వీకులు భారతీయులే. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు ఇండియాకు వచ్చాను. అప్పుడే మన్మథుడు సినిమాలో ఆఫర్ వచ్చింది. ఓపక్క సినిమాల్లో యాక్టివ్ అవ్వాలనుకున్నా.. మరోవైపు చదువుపైనా దృష్టి పెట్టాలనుకున్నాను. పదేపదే అలాంటి క్యారెక్టర్.. తెలుగులో చేసిన రెండు సినిమాల్లో సెకండ్ హీరోయిన్‌గానే ఛాన్స్ వచ్చింది. ఆ రెండింటిలోనూ నా పాత్ర చనిపోతుంది. ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాల్లో కూడా ఇలా చనిపోయే రోల్సే ఆఫర్ చేశారు. పదేపదే అలాంటి క్యారెక్టర్సే వస్తుండటంతో విసుగెత్తిపోయాను. ఇవి చేసే బదులు ఖాళీగా ఉండటం నయమనుకున్నాను. అందుకే సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోయాను. ఒక క్యారెక్టర్ బాగా చేశారని పదేపదే ఆ నటులను అదే పాత్రకు పరిమితం చేయడం కరెక్ట్ కాదు' అని చెప్పుకొచ్చింది అన్షు అంబానీ. చదవండి: సహజీవనం వేస్ట్.. ఇద్దరు తప్పు చేసినా ఒక్కరికే శిక్ష!: పక్కింటి కుర్రాడు -
ఈ హీరోయిన్ గుర్తుందా? ప్రభాస్, నాగార్జునతో మాత్రమే!
ఈ హీరోయిన్ పుట్టింది లండన్‌లో.. కానీ హీరోయిన్ కావాలనుకుంది. అలా ప్రయత్నం చేసి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్, నాగార్జున లాంటి హీరోలతో నటించింది. వీటిలో ఒకటి ఇండస్ట్రీలో బెస్ట్ ఫిల్మ్ కాగా, మరొకటి యావరేజ్‌గా నిలిచింది. వీటి తర్వాత ఈమెకు ఛాన్సులు వచ్చాయి గానీ ఒకే ఒక్క కారణంతో యాక్టింగ్‌కి పూర్తిగా దూరమైపోయింది. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఈమె స్టోరీ ఏంటి? (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరిగేకొద్ది గ్లామర్ తగ్గుతుంది. అదేంటో ఈమెకు మాత్రం అది రివర్స్‌లో జరుగుతున్నట్లు అనిపిస్తుంది. లేకపోతే 40 ఏళ్లు వయసు, ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ యంగ్ హీరోయిన్లు పోటీ ఇచ్చేలా తయారైంది. ఇంతకీ ఈమె పేరు చెప్పలేదు కదు. అన్షు అంబానీ. ఇప్పటికీ గుర్తురాలేదా? 'మన్మథుడు' ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో కనిపించే హీరోయిన్ ఈమెనే. ఇక ఈమె పేరు అన్షు అంబానీ. భారతీయ మూలాలున్న ఈ బ్యూటీ లండన్‌లో పుట్టి పెరిగింది. చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండటంతో హీరోయిన్ అవుదామనుకుంది. దీంతో ప్రయత్నాలు చేసింది. అలా ప్రభాస్ కెరీర్ మొదట్లో చేసిన 'రాఘవేంద్ర' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఇది షూటింగ్ పూర్తి చేసుకునేలోపు, నాగార్జున 'మన్మథుడు'లో ఈమె ఓ హీరోయిన్గా చేసింది. (ఇదీ చదవండి: ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!) ఇలా తెలుగులో కేవలం రెండంటే రెండు సినిమాలు చేసింది. 'మిస్సమ్మ' చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసింది. తమిళంలో 'జై' అనే మూవీ చేసింది. ఈ క్రమంలోనే ఈమెకు పలు చిత్రాల్లో అవకాశాలొచ్చాయి. కానీ ఈమె వాటిని అంగీకరించలేదు. తిరిగి లండన్ ఫ్లైట్ ఎక్కేసింది. దీనికి కారణం ఏంటా అని చూస్తే.. సినిమాలు చేద్దామనే ఇంట్రెస్ట్ ఉంది గానీ కేవలం ఒకటి రెండు అని ముందే ఫిక్స్ అయిందట. అలా తన డ్రీమ్ నెరవేరగానే ఇంటికెళ్లిపోయింది. ఇక లండన్‌కి వెళ్లిపోయిన అన్షు.. సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇండియన్ డిజైనర్ వేర్ బిజినెస్ చేస్తూ బిజీగా ఉంది. ఫ్రీ టైంలో జిమ్ వర్కౌట్ వీడియోలు, గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఒకప్పటి క్యూట్‌గా ఉండే ఈమె ఇప్పుడు 40ల్లోనూ హాట్‌గా కనిపిస్తూ ఆశ్చర్యపరుస్తోంది. మరి ఈమెని చూడగానే మీలో ఎవరైనా గుర్తుపట్టారా? లేదా ఇదంతా చదివిన తర్వాత గుర్తుపట్టారా? View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) View this post on Instagram A post shared by Anshu Saggar (@actressanshuofficial) (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) -
'మన్మథుడు' హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
అన్షు అంబానీ.. ఈ పేరు పెద్దగా విని ఉండకపోవచ్చు కానీ మన్మథుడు హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. ఈ సినిమాలో బేల చూపులతో అమాయకంగా మాట్లాడే ఆమె పాత్ర ఇప్పటికీ చాలామందికి గుర్తుండే ఉంటుంది. కెమెరా మ్యాన్ కబీర్ లాల్.. అన్షును దర్శకుడు విజయ్ భాస్కర్‌కు పరిచయం చేశాడు. అలా ఆమె కింగ్ నాగార్జునతో 'మన్మథుడు'లో నటించే ఛాన్స్ కొట్టేసింది. 2002లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ కొట్టి అన్షుకు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ మరుసటి ఏడాది ఆమె ప్రభాస్‌తో 'రాఘవేంద్ర' సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ చనిపోయే పాత్రలే చేసిందీ భామ. తర్వాత 'జై' అనే తమిళ చిత్రంలో నటించిన ఈ హీరోయిన్ ఆ తర్వాత చిత్రపరిశ్రమలో కనిపించకుండా పోయింది. లండన్‌లో పుట్టి పెరిగిన అన్షు రెండు సినిమాలతోనే సునామీ సృష్టించింది. కానీ ఇండస్ట్రీకి ఓ అతిథిలా వచ్చి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న వ్యాపారవేత్త సచిన్ సగ్గార్‌ను పెళ్లాడి లండన్‌లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం అన్షు అక్కడ ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఇన్స్పిరేషన్ కౌచర్ అనే డిజైనింగ్ షాప్ కూడా ఉంది. అక్కడ టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ హీరోయిన్లు వేసుకునే దుస్తులనే తిరిగి రెడీ చేయించి అమ్మకాలు చేస్తోందట. ఇదిలా వుంటే గతంలో ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో మన్మథుడు సుందరి ఆ రూమర్లను కొట్టిపారేస్తూ తను లండన్‌లో సంతోషంగా జీవిస్తున్నానని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అన్షు ఇండస్ట్రీని వదిలేసి సుమారు 18 ఏళ్లవుతోంది. ఈ మధ్యే ఆమె తిరిగి సినిమాల్లోకి రానుందంటూ కథనాలు వచ్చాయి. కానీ ఇంతరవకు వాటిపై స్పష్టత రాలేదు. ఆమె తిరిగి వచ్చే అవకాశాలూ కనిపించడం లేదు. అయినప్పటికీ ఏదో అద్భుతం జరిగి ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తే బాగుండు అంటున్నారు అభిమానులు. చదవండి: నటి టాప్‌లెస్ ఫొటో, నెటిజన్‌పై సెటైర్ ‘ప్రేమ దేశం’ హీరో వినీత్ టాలీవుడ్‌కి ఎందుకు దూరమయ్యాడంటే.. -
17 ఏళ్ల తర్వాత ఆ నటి రీ ఎంట్రీ ఇవ్వనుందా?
అక్కినేని నాగార్జున నటించిన మన్మథుడు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటి అన్షు అంబాని అందరికి గుర్తుండే ఉంటుంది. అదేనండి ‘గుండెల్లో ఏముందో కళ్లల్లో తెలుస్తుంది.. పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది’.. అంటూ కింగ్‌తో కలిసి ఆడిపాడారు అన్షు. విజయ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి సినిమాతో ఎందరో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ప్రభాస్‌కు జంటగా ‘రాఘవేంద్ర’లో నటించారు. అనంతరం 2004లో వచ్చిన మిస్సమ్మలో గెస్ట్ రోల్ పోషించిన అన్షు తరువాత మరే ఇతర చిత్రంలోనూ కనిపించలేదు. 2003లో లండన్‌కు చెందిన సచిన్ సాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప ఉన్నారు. తాజాగా అన్షు మళ్లీ సినిమాల్లోకి రానుందని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత అన్షు అంబానీ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అన్షు కీలక పాత్రను పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్షును చిత్ర యూనిట్ సంప్రదించగా ఇందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే అలనాటి ముద్దుగుమ్మను మళ్లీ వెండితెరపైకి చూసుకోవచ్చు. #NTR30గా రూపొందనున్నఈ సినిమాకు ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కాగా ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కానున్నాడు. చదవండి: సుస్మితతో పెళ్లి.. ప్రియుడి కామెంట్ చదవండి: ‘చావుకబురు చల్లగా’ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది -
శరీరం లేకపోతేనేం...
మన్మథుడు మనుషుల మనసులో మోహాన్ని రేకెత్తించగల వరాన్ని జన్మతః కలిగినవాడు. తనకు కలిగిన వరం ఎంతమేరకు ఫలిస్తుందో పరీక్షించేందుకు ఆ మన్మథుడు స్వయంగా తన తండ్రి మీదే బాణాలను సంధించాడట. దాంతో కోపగించుకున్న తండ్రి మున్ముందు శివుని మూడోకంటికి భస్మం అయిపోతావంటూ శపించాడు. అయితే ఆ శాపం లోక కళ్యాణానికే ఉపయోగపడింది. దక్షయజ్ఞంలో తన భార్య సతీదేవి భస్మం అయిపోయిన తరువాత శివుడు విరాగిగా మారిపోయాడు. సుదీర్ఘమైన ధ్యానంలో మునిగిపోయాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న తారకాసురుడు అనే రాక్షసుడు, ఆ శివునికి కలిగే సంతానం వల్లే తనకు మృత్యువు ఉండాలన్న వరాన్ని కోరుకున్నాడు. వైరాగ్యంలో కూరుకుపోయిన శివునికి సంతానం కలుగదన్నది అతని ధీమా! శివుని మనసుని ఎలాగైనా మరలుగొల్పి, పార్వతీదేవిగా అవతరించిన సతీదేవి మీద అతని మనసుని లగ్నం చేయాలని భావించారు దేవతలు. ఆ కార్యాన్ని సాధించేందుకు వారికి మన్మథుడే కీలకంగా తోచాడు. పార్వతీదేవి, శివుడు ధ్యానం చేసుకునే వనంలోకి ప్రవేశించే సమయంలో అతని మీదకు తన పూలబాణాలను సంధించాడు. దాంతో ధ్యానం చెదిరిన శివుడు కోపంతో తన మూడో కంటిని తెరిచి ఆ మన్మథుని భస్మం చేశాడు. అయితేనేం! అప్పటికే ఆయన హృదయానికి మన్మథ శరాలు గుచ్చుకునిపోయాయి. తన కంటి ఎదురుగా ఉన్న పార్వతి మీదకి దృష్టి మరలింది. మన్మథుని భార్య రతీదేవి వేడుకోళ్లతో ఆయన మనసు కరిగింది. మన్మథుని మళ్లీ జీవింపచేశాడు. కానీ చేసిన తప్పుకి శిక్షగా ఇక మీదట మన్మథుడు ఎలాంటి శరీరమూ లేకుండా ఉండిపోతాడని శపించాడు. అప్పటి నుంచీ మన్మథునికి ‘అనంగుడు’ అన్న పేరు స్థిరపడిపోయింది. మన్మథుడు అనంగుడే కావచ్చు. కానీ అవసరం అయినప్పుడు ప్రేమికులను కలిపేందుకు సర్వసన్నద్ధంగా బయల్దేరతాడు. ప్రేమ రాయబారాలు నడిపే చిలుకే అతని వాహనం, తియ్యటి చెరుకుగడే అతని విల్లంబు, మల్లె వంటి అయిదు రకాల పుష్పాలే అతని బాణాలు... వాటితో అతను మనసులను మధించి వేయగలడు. అలా మనసుని మథించేవాడు కాబట్టి మన్మథుడు అని అంటారట.– డి.వి.ఆర్. -
‘పాకెట్ మనీ కోసమే సినిమాలు చేశా’
తాను నటినెందుకయ్యానో తెలుసా? అని అంటున్నారు నటి రకుల్‌ప్రీత్‌సింగ్. కథానాయకిగా రాణిస్తున్న ప్రతి నటి తానెందుకు నటినయ్యాను? ఎలా అయ్యాను? వంటి విషయాల గురించి ఏదో కారణం ఉందని చెబుతుంటారు. మనం వింటుంటాం. మరి రకుల్‌ప్రీత్‌సింగ్ ఏం చెబుతున్నారో చూసేస్తే పోలా. ఈ అమ్మడికి కోలీవుడ్‌లో ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం అనే ఒక్క విజయం మినహా సరైన మరో సక్సెస్ లేదన్నది నిజం. అయితే టాలీవుడ్లో రెండు మూడు విజయాలను తన ఖాతాలో వేసుకున్నారీ బ్యూటీ. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒక్కో చిత్రమే రకుల్‌ప్రీత్‌సింగ్ చేతిలో ఉన్నాయి. ఇకపోతే కోలీవుడ్‌లో సూర్యతో నటించిన ఎన్జీకే చిత్రంపై ఈ భామ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం కూడా నిరాశపరిచింది. దీని గురించి రకుల్‌ప్రీత్‌సింగ్ తాను ఎన్జీకే చిత్రంలో నటించడానికి ప్రధాన కారణాలు రెండు అని చెప్పుకొచ్చారు. దర్శకుడు సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తే నటనను మరింత మెరుగుపరుచుకోవచ్చునని, ఇక రెండో విషయం హీరో సూర్య కావడం అన్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ ఇంతకు ముందు తెరకెక్కించిన 7జీ.రెయిన్బో కాలనీ, కార్తీ హీరోగా నటించిన ఆయిరత్తిల్ ఒరువన్ చిత్రాలు తనను బాగా ఆకట్టుకున్నాయన్నారు. నిజంగానే సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటించడం వినూత్న అనుభంగా పేర్కొన్నారు. తాను కార్తీ, సూర్య ఇద్దరితోనూ నటించానని, ఇద్దరూ చాలా భిన్నమైన వ్యక్తులని తెలిపారు. సూర్య, కార్తీ ఇద్దరూ కఠిన శ్రమజీవులు అన్నారు. ఎలాంటి గర్వం లేకుండా చేసేపనిని ఇష్టపడి చేస్తారని అంది. తనకు తమిళం కంటే తెలుగు భాష బాగా తెలుసని, తెలుగులో సరళంగా మాట్లాడగలనన్నారు. తమిళ చిత్రాలకు అయితే సంభాషణలను హిందీలో రాసుకుని చెబుతానని, అది కాస్త కష్టతరం అయినా సవాల్‌గా తీసుకుని నటిస్తానని చెప్పారు. ఇంకో విషయం ఏమిటంటే తాను మొదట పాకెట్ మనీ కోసమే సినిమాల్లో నటించానని తెలిపారు. ఆ తరువాత కెమెరా ముందు నిలబడి నటించడం చాలా నచ్చడంతో పూర్తిగా నటిగా మారిపోయానని రకుల్‌ప్రీత్‌సింగ్ చెప్పుకొచ్చారు. కోలీవుడ్‌లో ఈ అమ్మడికి రవికుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్‌తో రొమాన్స్ చేస్తున్న చిత్రం ఒక్కటే ఉంది. అదేవిధంగా తెలుగులో నాగార్జునతో మన్మథుడు 2, హిందీలో మర్జావాన్ అనే ఒక చిత్రంలో నటిస్తున్నారు. -
మన్మథుడితో ‘మహానటి’
కింగ్ నాగార్జున ‘మన్మథుడు’ చిత్రంలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. మళ్లీ అదే స్టైల్లో ఎంటర్టైన్మెంట్ అందించడానికి యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ‘మన్మథుడు-2’ చిత్రాన్ని నాగార్జునతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోర్చుగల్ షెడ్యూల్లో కీలక సన్నివేశాల్ని షూట్ చేసింది చిత్రయూనిట్. పోర్చుగల్ షెడ్యూల్లో రకుల్‌ప్రీత్-నాగార్జునపై సీన్స్‌ను తెరకెక్కించగా.. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్లో కీర్తి సురేష్ జాయిన్ అయింది. తాజాగా వీరిద్దరిపై రొమాంటిక్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ లోకేషన్‌లోని ఓ పిక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమంత కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ సందడి చేయనున్నారు. ఈ చిత్రానికి చైతన్య భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. Look who joined our set today! The adorable @KeerthyOfficial 😊#Manmadhudu2Diaries @iamnagarjuna @Rakulpreet @vennelakishore @AnnapurnaStdios @AnandiArtsOffl @Viacom18Studios @mynnasukumar @chaitanmusic pic.twitter.com/RfW9B6kGUt — Rahul Ravindran (@23_rahulr) 4 June 2019 -
పోర్చుగల్‌కి బై
కొన్ని రోజులుగా పోర్చుగల్‌లో మన్మథుడు హంగామా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఫారిన్లో కెమెరా ముందు మన్మథుడి అల్లరికి ఫుల్స్టాప్ పడింది. పోర్చుగల్‌కి బై బై చెప్పనున్నారు ‘మన్మథుడు 2’ టీమ్. నాగార్జున హీరోగా ‘చిలసౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మన్మథుడు 2’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. సమంత, కీర్తీ సురేశ్ కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలిసింది. తొలుత స్మాల్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో కంప్లీట్ చేసిన చిత్రబృందం ప్రస్తుతం పోర్చుగల్ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసింది. ‘‘పోర్చుగల్ షెడ్యూల్ పూర్తిచేశాం. కొంచెం కష్టంగా అనిపించినా సెట్లో ఫన్ ఉండటంతో ఈ 32రోజుల షెడ్యూల్‌ను హ్యాపీగా కంప్లీట్ చేశాం’’ అని రాహుల్ రవీంద్రన్ పేర్కొన్నారు. అక్కడ కీలక తారాగణంపై ముఖ్య సన్నివేశాలతోపాటుగా ఓ పాటను చిత్రీకరించినట్లు తెలిసింది. అంటే మన్మథుడు అండ్ టీమ్ బ్యాక్ టు హోమ్ అన్నమాట. ఈ షెడ్యూల్లోనే సమంత కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రావు రమేష్, నాజర్, ఝాన్సీ, ‘వెన్నెల’ కిశోర్, దేవ దర్శిని కీలక పాత్రలు చేస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. 2002లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ఇది సీక్వెల్ అని తెలిసిందే. -
మన్మథుడు–2లో మహానటి
‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు కీర్తీ సురేష్. ఆ సినిమాలో ఆమె నటన గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ చిత్రం తర్వాత నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రం చేస్తున్నారు. ఇటీవలే నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా సైన్ చేశారు. తాజాగా ‘మన్మథుడు 2’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించేందుకు అంగీకరించారు. ఇప్పటికే ఈ చిత్రంలో ఓ కీలకపాత్రకు సమంత ఎంపికైన విషయం తెలిసిందే. నాగార్జున, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘మన్మథుడు 2’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. మనం ఎంటర్ప్రైజెస్, ఆనందీ ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
వర్కింగ్ హాలిడే
‘సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయోచ్’ అంటున్నారు సమంత. అంటే.. షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి ఫుల్ రెస్ట్ తీసుకుంటున్నారా? కాదు, కాదు. ఇది వర్కింగ్ హాలిడే. నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మథుడు 2’ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. నాగార్జున, పి. కిరణ్ నిర్మాతలు. ఇందులో సమంత ఓ స్పెషల్ రోల్లో కనిపించనున్నారు. తన పార్ట్ షూటింగ్ కోసం పోర్చుగల్‌లో ఉన్నారు సమంత. ‘‘ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ (రాహుల్ రవీంద్రన్, ‘వెన్నెల’ కిశోర్, సమంత) కలసి షూటింగ్ చేస్తే చాలా ఫన్‌గా ఉంటుంది’’ అని ఈ ఫొటోను షేర్ చేశారు సమంత. ‘మనం, రాజుగారి గది 2’ తర్వాత సమంత, నాగార్జున కలసి యాక్ట్ చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ చిత్రంలో తన పాత్ర చిత్రీకరణ పూర్తయ్యాక ‘96’ రీమేక్ షూట్లో జాయిన్ అవుతారామె. స్యామ్ నటించిన ‘ఓ బేబి’ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. -
పోర్చుగల్‌లో మన్మథుడు
పోర్చుగల్‌లో ‘మన్మథుడు–2’ టీమ్ చాలా హుషారుగా షూటింగ్ చేస్తున్నారు. ఆ షూటింగ్‌కి సంబంధించి చాలా ఫొటోలను విడుదల చేశారు. నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది. -
రకూల్
పోర్చుగల్‌లో షూటింగ్‌కు అంతా అనువుగా ఉన్నప్పటికీ ‘మన్మథుడు 2’ టీమ్‌లో మాత్రం హాట్ హాట్ వాతావరణం ఉందని, అందుకు కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగే కారణమనే వార్తలు రెండు రోజులుగా నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదని తెలిసింది. అంత కూల్‌గానే సాగుతోందట. నాగార్జున హీరోగా ‘చి..ల..సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాగ్ సరసన రకుల్ర్ పీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. అయితే రకుల్ నటన పట్ల టీమ్ సంతృప్తిగా లేదనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై రాహుల్ రవీంద్రన్ కూడా స్పందించారు. ‘‘ప్రచారంలో ఉన్న వార్తలు నిజం కాదు. అవి కేవలం పుకార్లు మాత్రమే. పోర్చుగల్ షెడ్యూల్ స్టార్ట్ అయిన తొలి రోజు నుంచే రకుల్ మా టీమ్‌తో ఉన్నారు. ఆమె మంచి ప్రతిభాశాలి. అద్భుతంగా నటిస్తోంది. టీమ్ అందరం హ్యాపీగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. సో.. ర‘కూల్’ అన్నమాట. ఇక్కడ ఇన్సెట్లో ఉన్న నాగార్జున ఫొటోను రాహుల్ రవీంద్రన్ షేర్ చేసి, ‘ఈ ఒక్క సీన్ మీ కోసమే’ అని ట్వీట్ చేశారు. 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ‘మన్మథుడు 2’ సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్నారు. -
ఈ ఒక్క సీన్ మాత్రం మీకోసమే!
బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంటూ.. ఇక్కడ మల్టీస్టారర్లకు ఓకే చెప్తూ.. సోలోగానూ సినిమాలు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు కింగ్ నాగార్జున. ఇటీవలె దేవదాస్‌తో పలకరించిన నాగ్.. అటు బాలీవుడ్లో ‘బ్రహ్మాస్త్ర’లో ఓ కీలకపాత్రను పోషిస్తున్నారు. నాగ్ ప్రస్తుతం ‘మన్మథుడు2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ‘చి.ల.సౌ’తో డైరెక్టర్‌గా మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ రవీంద్రన్.. మన్మథుడు2ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోర్చుగల్‌లో షూటింగ్ జరుపుకుంటొంది చిత్ర యూనిట్. నాగ్‌కు సంబంధించిన ఓ షాట్‌ను రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన ట్విటర్లో నాగ్ ఫోటోను షేర్ చేస్తూ.. ఫిట్‌నెస్‌లో ఈ మనిషి.. అంటూ దండం పెడుతూ.. కింగ్ ఫ్యాన్స్.. ఈ ఒక్క సీన్ మాత్రం మీకోసమే అని ట్వీట్ చేశారు. ఈ చిత్రంలో సమంత ఓ ముఖ్యపాత్రను పోషిస్తుండగా.. వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. This man.... pah! Fitness goals! 🙏🏽🙏🏽🙏🏽 King fans... ee okka scene maatram mee kosame💛 pic.twitter.com/6Gg3Rfo9G3 — Rahul Ravindran (@23_rahulr) April 18, 2019 -
నాగ్ అరుదైన రికార్డ్
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. తన జనరేషన్ హీరోలందరూ రొమాంటిక్ సినిమాలకు గుడ్‌బై చెప్పేసినా నాగ్ మాత్రం ఇప్పటికీ మన్మథుడు ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు. అదే బాటలో ఓ అరుదైన ఘనత సాధించాడు. తమ ఫ్యామిలీలో మరో జనరేషన్ హీరోలతో నటించిన హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ నాగ్ మాత్రం తకన్న ముందు జనరేషన్‌తో నటించిన హీరోయిన్లతో పాటు తన తరువాతి జనరేషన్‌తో నటించిన హీరోయిన్లతోనూ కలిసి నటిస్తున్నాడు. అక్కినేని నాగేశ్వరరావుతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శ్రీదేవితో నాగార్జున పలు సూపర్ హిట్ సినిమాలు చేశాడు. తాజాగా తన తనయుడు నాగచైతన్య సరసన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో నటించిన రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి నటిస్తున్నాడు నాగ్. అంటే తండ్రి సరసన హీరోయిన్గా చేసిన భామతో, కొడుకు సరసన హీరోయిన్గా చేసిన భామతోనూ కలిసి నటించిన అరుదైన రికార్డ్‌ను సాధించాడు కింగ్. ప్రస్తుతం చిత్రకరణ జరుపుకుంటున్న మన్మథుడు 2లో నాగ్, రకుల్ జంటగా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. -
‘మన్మథుడు 2’ ఫ్యామిలీతో కింగ్
కింగ్ నాగార్జున టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మథుడు 2’. ఈ సినిమా షూటింగ్ గత వారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ తో కలిసి నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ ఇంట్రస్టింట్ అప్డేట్ ఇచ్చారు నాగార్జున. చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సెల్ఫీ దిగిన నాగ్ ఆసెల్పీని తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు. ‘నేను నా మన్మథుడు 2 ఫ్యామిలీ!!! లవింగ్ ఇట్’ అని కామెంట్ చేశారు. ఈ సెల్ఫీలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్, రాహుల్ రవీంద్రన్, సీనియర్ నటి లక్ష్మి, వెన్నెలకిషోర్, రావు రమేష్, ఝాన్సీ తదితరులున్నారు. ఫస్ట్ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
రెండో మన్మథుడు షురూ
నాగార్జున హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘మన్మథుడు’. కె.విజయ్ భాస్కర్ దర్శకత్వంలో 2002లో వచ్చిన ఈ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పదహారేళ్ల తర్వాత నాగ్ ‘మన్మథుడు 2’ చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) నిర్మిస్తున్నారు. ఇందులో నాగ్‌కి జోడీగా రకుల్‌ప్రీ™Œ సింగ్ నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాగచైతన్య కెమెరా స్విచ్చాన్ చేయగా, అమల అక్కినేని క్లాప్ ఇచ్చారు. ‘‘మన్మథుడు’ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని నాగార్జున ఈ సినిమా చేస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూరప్‌లో ప్రారంభం కానుంది. ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ చైతన్య భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఎం.సుకుమార్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. నాగార్జున సోదరి నాగసుశీల, మేనల్లుడు, హీరో సుశాంత్ పాల్గొన్నారు. లక్ష్మి, ‘వెన్నెల’ కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు ఈ చిత్రంలో నటించనున్నారు. -
వరుస సీక్వెల్స్‌కు కింగ్ రెడీ
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం హిందీలో భారీ బడ్జెట్ మూవీ బ్రహ్మాస్త్రలో నటిస్తున్నా నాగ్, త్వరలో మన్మథుడు 2లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు చిలసౌ ఫేం రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ఈ సినిమా తరువాత సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వల్గా తెరకెక్కనున్న బంగార్రాజు సినిమాను పట్టాలెక్కించేందుకు ఓకె చెప్పాడట. ఈ సినిమాలో బంగార్రాజు పాత్రలో నాగ్ నటించనుండగా ఆయన మనవడిగా నాగచైతన్య కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా రాజుగాది గది సీక్వెల్ కూడా తెర మీదకు వచ్చింది. రాజు గారి గది 2లో ఇంట్రస్టింగ్ రోల్లో కనిపించిన నాగ్, ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న రాజుగారి గది 3లో నటించేందుకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇలా వరుసగా సీక్వెల్ సినిమాలతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు కింగ్ నాగార్జున. -
మన్మథుడు మొదలు
సుమారు 17 ఏళ్ల తర్వాత మళ్లీ మన్మథుడి పాత్రలోకి ఎంట్రీ ఇవ్వడానికి నాగార్జున రెడీ అయ్యారు. 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’లో నటించనున్నారాయన. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 25న హైదరాబాద్‌లో ప్రారంభం కానుందని టాక్. ‘చి.ల.సౌ’ చిత్రంతో దర్శకుడిగా మారిన హీరో రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్, పాయల్‌రాజ్‌పుత్ కథానాయికలు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 4 వరకూ సాగనుందట. ఆ తర్వాత ఏప్రిల్ 12కి చిత్రబృందం పోర్చుగల్ ప్రయాణం కానున్నారు. ఇందులో నాగార్జున భార్యగా రకుల్ ప్రీత్ కనిపించనున్నారని టాక్. సీక్వెల్ కాబట్టి మొదటి పార్ట్ కథకు కొనసాగింపుగా ఉంటుందా? లేక అందులోని పాత్రలు మాత్రమే తీసుకుంటారా? వేచి చూడాలి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం రిలీజ్ కావచ్చు. -
స్పెషల్ గెస్ట్!
స్క్రీన్ మీద సందడి చేయడానికి మామా, కోడలు నాగార్జున, సమంత మరోసారి రెడీ అవుతున్నారట. ‘రాజుగారి గది 2’లో నాగార్జున, సమంత నటించిన విషయం తెలిసిందే. నాగార్జున లేటెస్ట్ చిత్రం ‘మన్మథుడు 2’. ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ ఇది. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రకుల్ ప్రీత్ సింగ్, పాయల్ రాజ్‌పుత్ కథానాయికలు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జునే నిర్మించనున్నారు. ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లో వచ్చే పాత్రలో సమంత కనిపించనున్నారని టాక్. సుమారు 5–10 నిమిషాలు ఆమె కనిపిస్తారట. ఈ పాత్రకు సమంత అయితే బావుంటుందని, కోడలిని మామ అడగటం, స్యామ్ వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయాయని ఇండస్ట్రీ టాక్. అలాగే చిత్రదర్శకుడు రాహుల్, సమంత మంచి స్నేహితులు. కెరీర్ స్టార్టింగ్‌లో సమంత చేసిన తమిళ చిత్రం ‘మాస్కోవిన్ కావిరి’లో రాహుల్, సమంత జంటగా నటించారు. సో.. రాహుల్ గెస్ట్‌గా చేయమంటే సమంత కాదంటారా? ఈ నెలలో రెగ్యులర్ షూటింగ్ కానున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం షూటింగ్ పోర్చుగల్‌లో జరగనుంది. ఇందులో నాగార్జున భార్యగా రకుల్ నటించనున్నారని సమాచారం.