

2002లో వచ్చిన 'మన్మథుడు' సినిమాలో హీరోయిన్‌గా అడుగుపెట్టింది అన్షు.

ఆ తర్వాత మరో రెండు తెలుగు చిత్రాల్లో మాత్రమే నటించింది.

ఆమె పూర్తి పేరు అన్షు అంబానీ కాగా..ఈ ముద్దుగుమ్మ లండన్‌లో జన్మించింది.

పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లోనే సెటిలైపోయింది.

ఇటీవల భారత్ తిరిగొచ్చిన అన్షు నాగార్జునతో కలిసి పార్టీ కూడా చేసుకుంది.

ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న ఈ ముద్దుగుమ్మ వైజాగ్‌లో ఎంజాయ్ చేస్తోంది.

వైజాగ్ బీచ్‌లో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా షేర్ చేసింది.

మరోసారి టాలీవుడ్‌లో నటించనున్నట్లు టాక్ కూడా వినిపించింది.

తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరిస్తుందేమో వేచి చూడాల్సిందే.





