
హీరోయిన్లలోనూ రష్మిక, నయనతార, అనుష్క తదితరులు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ప్రస్తుతమున్న దక్షిణాది హీరోయిన్లలో పారితోషికం ఎవరికి ఎక్కువ? ఆ నంబర్ ఎంత?

టాప్-5 జాబితా తీసుకుంటే ఐదో స్థానంలో అనుష్క శెట్టి ఉంది. ఈమె రూ.6 కోట్ల వరకు తీసుకుంటోందట.

నాలుగో స్థానంలో త్రిష ఉంది. 96 చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చిన ఈ బ్యూటీ రూ.10 కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట.

మూడో స్థానం నయనతారది. జవాన్ చిత్రంతో హిందీలోనూ అడుగుపెట్టింది. రూ.10-12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట.

ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్. కానీ తెలుగు సినిమా రాజ్యమేలుతోంది. దక్షిణాది సినిమాలు, దక్షిణాది హీరోహీరోయిన్లే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్. హీరోల్లో అయితే ప్రభాస్, అల్లు అర్జున్.. దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ సంపాదించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

రెండో ప్లేస్ రష్మికది. పుష్ప రెండు సినిమాలకు కలిపి రూ.10 కోట్ల వరకు తీసుకుందంట.

రీసెంట్ బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ సెన్సేషన్ 'ఛావా'లో నటించినందుకు రష్మికకు రూ.4 కోట్లు ఇచ్చారట.

తొలిస్థానంలో ప్రస్తుతం సాయిపల్లవి ఉన్నట్లు తెలుస్తోంది. రీసెంట్ హిట్ 'తండేల్' కోసం ఈమెకు రూ.5 కోట్లు ఇచ్చారట.

ప్రస్తుతం సాయిపల్లవి హిందీలో రామాయణ్ చేస్తోంది. ఇందుకోసం రూ.18-20 కోట్లు పారితోషికం ఇస్తున్నారట. (నోట్: పైన చెప్పిన నంబర్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రాసినవి)