stars
-
హీరోల్లో రెబల్ స్టార్ టాప్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా ప్రతినెల సినీ స్టార్లకు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు దేశవ్యాప్తంగా అగ్రస్థానంలో ఉన్న స్టార్ల జాబితాను వెల్లడిస్తుంది. అంతేకాకుండా మోస్ట్ అవైటేడ్ చిత్రాల వివరాలు కూడా ప్రకటిస్తుంది. తాజాగా డిసెంబర్ నెలకు సంబంధించిన వివరాలను ట్విటర్ వేదికగా పోస్ట్ చేసింది. డిసెంబర్-2024లో ఇండియాలో అత్యంత ఆదరణ ఉన్న హీరో, హీరోయిన్లు జాబితాను వెల్లడించింది.హీరోల్లో మొదటి ప్లేస్‌లో రెబల్ స్టార్..హీరోల విషయానికొస్తే దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ ఉన్న స్టార్స్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఆ తర్వాత రెండో స్థానంలో పుష్పరాజ్ అల్లు అర్జున్ చోటు దక్కించుకున్నారు. వీరిద్దరి తర్వాత మూడో ప్లేస్‌లో దళపతి విజయ్ ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్ బాబు, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ టాప్-10 లిస్ట్‌లో ఛాన్స్ కొట్టేశారు.హీరోయిన్లలో సమంత టాప్..హీరోయిన్ల విషయానికొస్తే సమంత టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ తర్వాత బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణె వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరుసగా పుష్ప భామ రష్మిక మందన్నా, తండేల్ హీరోయిన్ సాయి పల్లవి, త్రిష, నయనతార, కాజల్ అగర్వాల్, శ్రీలీల, శ్రద్ధాకపూర్ ఉన్నారు. ఈ జాబితాలను హీరో, హీరోయిన్ల క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఆధారంగానే వెల్లడించినట్లు తెలుస్తోంది. Ormax Stars India Loves: Most popular female film stars in India (Dec 2024) #OrmaxSIL pic.twitter.com/cRd7Jb4WsI— Ormax Media (@OrmaxMedia) January 19, 2025 Ormax Stars India Loves: Most popular male film stars in India (Dec 2024) #OrmaxSIL pic.twitter.com/Tniww2cO7Z— Ormax Media (@OrmaxMedia) January 19, 2025 -
లైగర్ బ్యూటీ బర్త్‌డే.. ఇక్కడికీ వచ్చేశాడ్రా బాబూ! (ఫోటోలు)
-
కేరళలో దేవీ నవరాత్రి సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న సెలబ్రిటీలు (ఫోటోలు)
-
Anchor Lasya: యాంకర్ లాస్య బర్త్ డే.. సందడి చేసిన బుల్లితెర తారలు (ఫోటోలు)
-
అనంత్-రాధిక పెళ్లికి హాజరయ్యే హాలీవుడ్ స్టార్స్ వీళ్లే! (ఫోటోలు)
-
వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్ ఎవరు?
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి? అని కళ్లకు గంతలు కట్టి అడుగుతారు. కానీ గంతలు కట్టకుండానే ఫొటోలు చూపించి, వీరి వీరి గుమ్మడిపండు ఈ స్టార్ ఎవరు? అని అడిగితే... పేరు చెప్పడానికి తడబడాల్సిందే. అలా పోల్చుకోలేనంతగా మారిపోయారు కొందరు స్టార్స్. గుర్తుపట్టలేని వెరైటీ గెటప్స్‌లో ఆ స్టార్స్ కనిపించనున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.⇒ మేకోవర్, కొత్త గెటప్ అనగానే వెంటనే గుర్తొచ్చే హీరోల్లో విక్రమ్ ఒకరు. ‘పితామగన్’ (‘శివపుత్రుడు’), సేతు, అపరిచితుడు, ఐ, కోబ్రా’... ఇలా చెప్పుకుంటూ పోతే విక్రమ్ చేసిన ప్రయోగాత్మక చిత్రాల్లోని పాత్రల జాబితా ఎక్కువగానే ఉంటుంది. తాజాగా ‘తంగలాన్’లోనూ విక్రమ్ వినూత్నంగా కనిపించనున్నారు. పద్దెనిమిదో శతాబ్దంలో కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) నేపథ్యంలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘తంగలాన్’ తీశామని ఈ చిత్రదర్శకుడు పా. రంజిత్ పేర్కొన్నారు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్లు మాళవికా మోహనన్, పార్వతీ తిరువోత్తుల గెటప్స్ కూడా పూర్తి డీ–గ్లామరస్‌గా, ఆడియన్స్ గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి.⇒ తమిళ హిట్ ఫిల్మ్ ‘సారపట్ట పరంపరై’లో డీ–గ్లామరస్ రోల్లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు హీరోయిన్ దుషారా విజయన్. ఇప్పుడైతే మరీ గుర్తుపట్టలేని గెటప్‌లో కనిపించనున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’ సినిమాలోనే ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఈ సినిమాలో దుషారతో పాటు వరలక్ష్మీ శరత్‌కుమార్, అపర్ణా బాలమురళి కూడా డీగ్లామరస్ రోల్స్‌లోనే కనిపిస్తారు. సందీప్ కిషన్, కాళిదాసు ఇతర లీడ్ రోల్స్‌లో నటించారు. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో ముగ్గురు అన్నదమ్ముల కథగా సాగే ఈ మూవీ ఈ నెల 26న రిలీజ్ కానుంది.⇒ కథ డిమాండ్ చేస్తే అందులోని గెటప్‌లోకి అవలీలగా మారిపోతారు కమల్‌హాసన్. ‘భామనే సత్యభామనే’లో బామ్మగా, పది అవతారాల్లో ‘దశావతారం’ వంటి చిత్రాలు అందుకు మంచి ఉదాహరణలు. ‘దశావతారం’ (2008) తర్వాత కమల్ ఒకే సినిమాలో ఎక్కువ గెటప్స్‌లో కనిపించలేదు. ఇప్పుడు ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’)లో ఐదారు గెటప్స్‌లో కనిపించనున్నారు. వీటిలో ఒకట్రెండు గెటప్స్ ఇప్పటికే బయటకు రాగా మిగిలినవి థియేటర్స్‌లో సర్ప్రైజ్గా ఉండబోతున్నాయని తెలిసింది. ‘భారతీయుడు 2’ కథ రీత్యా కమల్ వందేళ్ల వయసుపైబడిన సేనాపతి పాత్రలో నటించారు. మొత్తంగా ఆయన ఎన్ని పాత్రల్లో కనిపిస్తారో థియేటర్స్‌లోనే చూడాలి. ఇక శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇండియన్ 2’ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ నెల 12న విడుదల కానుంది. ⇒ డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్‌ను మెప్పించడంలో ధనుష్ ముందు ఉంటారు. ఈ విలక్షణ హీరో ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ములతో ‘కుబేర’ సినిమా చేస్తున్నారు. ఇందులో నాగార్జున మరో హీరో. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా, సామాజిక అసమానతల మేళవింపుతో రానున్న ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ధనుష్ బిచ్చగాడి గెటప్‌లో కనిపిస్తారట.⇒ మాస్ హీరో అనిపించుకున్న విశ్వక్ సేన్ లేడీ గెటప్ వేశారు. అది ‘లైలా’ సినిమా కోసం అన్నమాట. ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఫస్టాఫ్ అబ్బాయిగా, సెకండాఫ్ లైలా అనే అమ్మాయిగా కనిపిస్తారు. ఆకాంక్షా శర్మను హీరోయిన్గా పరిచయం చేస్తూ రామ్‌నారాయణ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.⇒ అటు కన్నడకు వెళితే ఇప్పుడు శివ రాజ్‌కుమార్ గెటప్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ‘భైరవనకోనెపాఠ’ అనే చిత్రంలో శివ రాజ్‌కుమార్ గుర్తుపట్టలేని గెటప్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి హేమంత్‌రావు దర్శకుడు. ఈ సినిమా తెలుగు లోనూ రిలీజ్ కానుంది.ఇలా గుర్తు పట్టలేని గెటప్‌కి సై అని, సవాల్‌గా తీసుకుని నటిస్తున్న స్టార్స్ మరికొందరు ఉన్నారు. -
Lok Sabha Elections 2024: తమిళనాడు లోక్‌సభ ఎన్నికలు.. ఓటేసిన స్టార్స్ (ఫోటోలు)
-
Ram Navami 2024: వెండితెర సీతమ్మగా కనిపించిన తారలు వీళ్లే (ఫొటోలు)
-
ప్రముఖ నిర్మాత ఆనంద్ పండిట్ కూతురి పెళ్లి.. మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)
-
గ్రాజియా యంగ్ ఫ్యాషన్ వీక్ అవార్డ్స్ 2024: సీతాకోక చిలుకల్లా మెరిసిన భామలు
గ్రాజియా ఇండియా 2024 వేడుక అట్టహాసంగా జరిగింది. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో బాలీవుడ్ తారలు మెరిసారు. పలువురు తారలు వివిధ కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా శ్రద్ధాకపూర్, కరిష్మా కపూర్, శోభితా ధూళిపాళ, సినీ శెట్టి అవార్డులను గెల్చుకోగా, మౌనీ రాయ్, మృణాల్ ఠాకూర్, బాబీ డియోల్, కరణ్ జోహార్ లాంటి స్టార్లు ఈ వేదికమీద స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అనేకమంది ఇండస్ట్రీ ప్రముఖులు సూపర్ ఫ్యాషన్ డిజైనర్లు, మోడల్స్ ఈ ఈవెంట్లో సందడి చేశారు. గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024లో 14 ఎడిషన్‌లో యువ డిజైనర్లు, ఫ్యాషన్ బ్రాండ్లు సృజనాత్మకతతో ఆసక్తికరంగా నిలిచాయి. అజియో గ్రాజియా యంగ్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024 కొంతమంది విన్నర్లు ♦ కరిష్మా కపూర్ ఫరెవర్ ఇన్ ఫ్యాషన్ కేటగిరీ అవార్డు ♦ శ్రద్ధా కపూర్ ఫ్యాన్ ఫేవరెట్ కేటగిరీకి సంబంధించి అవార్డు ♦ శోభితా ధూళిపాళ ఫ్యాషన్ ట్రైల్బ్లేజర్ విభాగంలో అవార్డు ♦ బ్రేక్‌త్రూ స్టైల్ విభాగంలో సినీ శెట్టి అవార్డు ♦ పీపుల్స్ ఛాయిస్ (ఫిమేల్ ): దిశా పటాని ♦ పీపుల్స్ ఛాయిస్ (మేల్): బాబీ డియోల్ ♦ Gen Z స్టైల్ స్టార్: అనన్య పాండే ♦ స్టైల్ : కరణ్ జోహార్ ♦ ఫ్యాషన్ NXT: సిద్ధాంత్ చతుర్వేది ♦ బెస్ట్ డ్రెస్ తానియా ష్రాఫ్ -
ఆస్కార్ పార్టీలో మెరిసిన తారలు
-
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్.. కలర్‌ఫుల్ లుక్‌లో మెరిసిన సినీతారలు (ఫొటోలు)
-
'ఇటు చెన్నై... అటు ముంబై' వార్‌కు దిగిన మన గ్యాంగ్‌స్టార్స్
బాక్సాఫీస్‌ను లూటీ చేయడానికి గ్యాంగ్‌స్టర్‌గా మారారు కొందరు స్టార్స్. వెండితెరపై ఈ హీరోలు గ్యాంగ్‌వార్ చేస్తున్నారు. గ్యాంగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాల్లో గ్యాంగ్‌స్టర్స్‌గా మారిన ఆ కోలీవుడ్ గ్యాంగ్‌స్టార్స్ గురించి తెలుసుకుందాం. గ్యాంగ్‌స్టర్ రంగరాయ గ్యాంగ్‌స్టర్ రంగరాయ శక్తివేల్ నాయకర్‌గా మారారు కమల్‌హాసన్. ‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్‌హాసన్ చేస్తున్న పాత్ర పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. 1987లో చేసిన ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం తర్వాత హీరో కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి, నాజర్, గౌతమ్ కార్తీక్, జోజూ జార్జ్, ఐశ్వర్యా లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ‘నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. కాయల్ పట్టినమ్. నన్ను క్రిమినల్, గుండా, యాకుజా అని పిలుస్తారు. యాకుజా అంటే జపాన్ భాషలో గ్యాంగ్‌స్టర్ అని అర్థం’ అంటూ ‘థగ్ లైఫ్’లోని తన పాత్ర గురించి ఈ సినిమా టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ వీడియోలో చెప్పుకొచ్చారు కమల్. ఆర్. మహేంద్రన్, కమల్‌హాసన్, మణిరత్నం, ఎ. శివ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. స్టూడెంట్ టు గ్యాంగ్‌స్టర్ ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా!’) వంటి సందేశాత్మక బయోపిక్ తీసిన తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఓ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ చేయనున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీలో సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ లీడ్ రోల్స్ చేస్తారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుంది. చెన్నై, తిరుచ్చి లొకేషన్స్‌తో పాటు హర్యానాలో కూడా కొంత షూటింగ్ ప్లాన్ చేశారట. ఇక కథ రీత్యా స్టూడెంట్ స్థాయి నుంచి గ్యాంగ్‌స్టర్ వరకు ఎదిగే వ్యక్తి పాత్రలో సూర్య కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌ను ఆరంభించారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్. ఇది జీవీ ప్రకాశ్‌కు నూరవ చిత్రం కావడం విశేషం. ఇటు చెన్నై... అటు ముంబై తమిళనాడులో ఒకటి, ముంబైలో మరొకటి... ఇలా రెండు గ్యాంగ్‌లు మెయిన్టైన్ చేస్తున్నట్లున్నారు హీరో ధనుష్. ముందు తమిళనాడుకు వెళితే... ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాయన్’. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ కిషన్, కాళిదాసు, సెల్వ రాఘవన్, ప్రకాశ్‌రాజ్, దుషారా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముగ్గురు అన్నదమ్ములు (ధనుష్, సందీప్ కిషన్, కాళిదాసు)ల మధ్య నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్‌స్టర్ డ్రామా అట ‘రాయన్’. ధనుష్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం, ఆయనకు కెరీర్లో యాభైవ చిత్రం కావడం విశేషం. ఓ గ్యాంగ్‌స్టర్ చెఫ్‌గా ఎందుకు కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది? గ్యాంగ్‌స్టర్ గొడవలు అతని కుటుంబాన్ని, జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయనే అంశాలు ‘రాయన్’ చిత్రంలో ఉంటాయని టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ముంబై గ్యాంగ్స్టర్స్ మాఫియా నేపథ్యంలో సాగే ‘డీఎన్ఎస్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారని తెలిసింది. నాగార్జున ఓ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. కథ రీత్యా ధనుష్, నాగార్జున ఈ సినిమాలో గ్యాంగ్స్టర్స్ రోల్స్ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పుస్కూరు రామ్మోహన్, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ధారావి’ అనే టైటిల్‌ను పరిశీ లిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలతో పాటు గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తమిళంలో మరికొన్ని చిత్రాలు రానున్నాయి. -
మరో బిజినెస్‌లోకి గౌరీ ఖాన్ : గ్రాండ్ లాంచింగ్, స్టార్ల సందడి
ప్రముఖ ఇంటీరీయర్ డిజైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ భార్య గౌరీఖాన్ కొత్త బిజినెస్ షురూ చేశారు. ముంబైలోని తొలి రెస్టారెంట్ ‘టోరీ’ ని మంగళవారం రాత్రి ఘనంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా గౌరీ ఖాన్ స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు, ఇంటీరియర్, ఫ్యాషన్ డిజైనర్లు ఈ వేడుకలో సందడి చేశారు. నిర్మాత కరణ్ జోహార్, భావనా పాండే, నటులు సంజయ్ కపూర్, మహీప్ కపూర్, చుంకీ పాండే, నీలం కొఠారి,సీమా సజ్దేహ్ తదితరులు మెరిసారు. ముఖ్యంగా సుస్సానే ఖాన్ తన ప్రియుడు, నటుడు అర్స్లాన్ గోనితో కలిసి లాంచ్‌కి హాజరై స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. కాగాఇంటీరీయర్ డిజైనర్‌గా వ్యాపార రంగంలో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తూ, అనేక మంది సెలబ్రిటీల ఫ్యావరెట్‌గా మారిపోయింది గౌరీ ఖాన్. అలాగే రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గౌరీఖాన్. ఇపుడికముంబైలోని విలాసవంతమైన ఏరియాలో లగ్జరీ హెటెల్తో హాస్పిటాలిటీ రంగంలో కూడా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. -
వెంకటేశ్ టు అల్లు అర్జున్.. ఈ ఏడాది ఒక్క సినిమా లేదు
ఈ ఏడాది సిల్వర్ స్క్రీన్ కొందరు స్టార్స్‌ని మిస్సయింది. వెంకటేశ్, నాగార్జున, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్.. ఈ హీరోలు నటించిన చిత్రాలు 2023లో రిలీజ్ కాలేదు. ఈ స్టార్స్ వెండితెరపై కనిపించకపోవడం వారి అభిమానులను కాస్త నిరుత్సాహ పరిచే విషయం. మరి.. 2024లో ఈ స్టార్స్ ఏ చిత్రాలతో వెండితెరపై కనబడతారో తెలుసుకుందాం. ‘సైంధవ్’ రావాలి కానీ... ‘సైంధవ్’ రిలీజ్ ప్లాన్ మారడంతో ఈ ఏడాది తెలుగు తెరపై వెంకటేశ్ కనిపించే అవకాశం లేదు. వెంకటేశ్ కెరీర్లో రూపొందుతున్న 75వ సినిమా ‘సైంధవ్’. ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకుడు. నిజానికి ఈ చిత్రాన్ని డిసెంబరు 22న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అదే తేదీకి ప్రభాస్ ‘సలార్: సీజ్ ఫైర్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధం కావడంతో ‘సైంధవ్’ రిలీజ్ జనవరి 13కు వాయిదా పడింది. ఇలా ఊహించని విధంగా వెంకటేశ్ ఈ ఏడాది తెలుగు తెరకు దూరంగా కావాల్సిన పరిస్థితి. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్ట్ సారా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ మీడియాలో, సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతో హిందీ తెరపై వెంకీ కనిపించడం ఈ స్టార్ ఫ్యాన్స్‌ను కాస్త ఆనందపరిచే విషయం. నా సామి రంగ.. వచ్చే ఏడాదే గత రెండేళ్లలో మూడు సినిమాలతో (2021లో ‘వైల్డ్ డాగ్’, 2022లో ‘బంగార్రాజు’, ‘ది ఘోస్ట్’) సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసిన నాగార్జున ఈ ఏడాది మాత్రం గ్యాప్ ఇచ్చారు. నాగార్జున తాజా చిత్రం ‘నా సామి రంగ’ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల కానుంది. సో.. ఈ ఏడాది అక్కినేని ఫ్యాన్స్‌కు నాగార్జున సిల్వర్ స్క్రీన్‌పై కనిపించరు. వచ్చే ఏడాది ఆరంభంలో నాగ్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ‘నా సామి రంగ’ రూపంలో ఉంటుందని చిత్ర యూనిట్ పేర్కొంది. విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. వేసవి నుంచి సంక్రాంతికి.. ‘సర్కారువారి పాట’తో గత ఏడాది సూపర్ హిట్ అందుకున్నారు మహేశ్‌బాబు. అన్నీ సజావుగా సాగినట్లయితే ఈ ఏడాది కూడా వెండితెరపై మహేశ్‌బాబు సందడి ఉండేది. మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’ను ఈ ఏడాది వేసవిలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి 12కి వాయిదా వేశారు. ఇలా మహేశ్ ఈ ఏడాది థియేటర్స్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా ఈ చిత్రాన్ని సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. 2024 నుంచి నో గ్యాప్ 2018లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ మళ్లీ స్క్రీన్‌పై కనిపించింది ‘ఆర్ఆర్ఆర్’ (2022) సినిమాలోనే. ఆ సినిమా కమిట్మెంట్ కారణంగా 2019, 2020, 2021లో ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. ఇక 2023 నుంచి అయినా ఎన్టీఆర్ సినిమాలు వరుసగా విడుదలవుతాయనుకున్న ఆయన ఫ్యాన్స్ మరికొంత సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి. ఎందుకంటే... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవర’ తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సో.. ఈ ఏడాది ఎన్టీఆర్ స్క్రీన్‌పై కనపడరు. ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇక ఎన్టీఆర్ ఓ లీడ్ రోల్లో నటించనున్న ‘వార్ 2’ (ఇందులో హృతిక్ రోషన్ మరో హీరో), ‘దేవర’ రెండు భాగాలు, ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీ.. ఇలా వరుస సినిమాలతో ఈ స్టార్ 2024 నుంచి గ్యాప్ లేకుండా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉంది. లేట్‌గా డ్యూటీ ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో రామ్‌చరణ్ నటిస్తున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తు న్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేసినా వీలుపడలేదు. వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి శంకర్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఇందులో కియారా అద్వానీ నాయిక. మరోవైపు ఈ ఏడాదే విడుదలైన సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’లోని ఓ పాటలో రామ్‌చరణ్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ఇది చరణ్ ఫ్యాన్స్‌కు కాస్త ఊరట కలిగించింది. రెండేళ్ల తర్వాతే పుష్ప రూల్ ‘పుష్ప’ చిత్రంలోని తొలి భాగం ‘పుష్ప: ది రైజ్’ ఎంతటి ఘనవిజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిందే. 2021లో విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును కూడా తెచ్చిపెట్టింది. దీంతో ‘పుష్ప’ మలి భాగం ‘పుష్ప: ది రూల్’ పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మేకర్స్ ప్లాన్ చేసినట్లుగా మలి భాగం 2023లో విడుదల కాలేదు. క్యాస్టింగ్, కథ విషయాల్లో ఈ సినిమా స్పాన్ మరింత పెరగడం, చిత్రీకరణ వాయిదా పడుతుండటంతో 2024 ఆగస్టు 15న ‘పుష్ప: ది రూల్’ను రిలీజ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. సో.. ఈ ఏడాది కూడా అల్లు అర్జున్ థియేటర్స్‌లో కనిపించరు. సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. జగపతిబాబు, సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రధారులు.ఇలా మరికొందరు స్టార్స్‌ని 2023 సిల్వర్ స్క్రీన్ మిస్సయ్యింది. -
ఆకాశంలో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయట!
రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే కోట్ల కొద్దీ నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని ఆకారాలూ కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నక్షత్రాలన్నీ స్థానం మారిపోతాయని.. ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని అంటున్నారు. మరి దానికి కారణం ఏమిటో తెలుసా? మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ, సమీపంలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండూ ఢీకొని కలసిపోనుండటమే. ఇప్పటికే ఈ రెండూ ఒకదానికొకటి సమీపంలోకి వస్తున్నాయి. మరో 375 కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొనడం మొదలవుతుంది. సుమారు 700 కోట్ల ఏళ్ల తర్వాత రెండూ పూర్తిగా కలసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయి. ఈ క్రమంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోతాయి. వాటి స్థానాలు మారిపోతాయి. మరి ఇలా రెండూ దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్నప్పుడు మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై నాసా ఓ వీడియోను రూపొందించింది. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ తీసిన చిత్రాలు, దాని సాయంతో చేసిన పరిశీలన ఆధారంగా సిద్ధం చేసిన ఈ వీడియోను.. చంద్ర అబ్జర్వేటరీ పేరిట ఉన్న ‘ఎక్స్ (ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది. మనం చూసేది పాలపుంతే కాదు..! మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే) గెలాక్సీ అంటూ ఫొటోల్లో, ఇంటర్నెట్లో మనం చూస్తున్నది నిజానికి పాలపుంత ఫొటో కానే కాదు. అసలు మనం పాలపుంత మొత్తం చిత్రాన్ని తీయడం సాధ్యమే కాదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్న పాలపుంత గెలాక్సీలో మధ్య భాగానికి ఓ పక్కన మన సూర్యుడు, భూమి ఉన్నాయి. పాలపుంత గెలాక్సీ మొత్తాన్ని దాటి బయటికి వెళితే తప్ప దీనిని ఫొటో తీయలేం! ఎలాగంటే.. సముద్రం మధ్య చిన్న పడవలో కెమెరా పట్టుకుని కూర్చున్న మనం వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్రం మొత్తాన్ని ఫొటో తీయగలమా? ఇదీ అంతే.. మరి మనం చూసే పాలపుంత చిత్రం ఏమిటి అంటారా.. దాదాపుగా పాలపుంతలా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ చిత్రమే. ఈ గెలాక్సీయే భవిష్యత్తులో పాలపుంతను ఢీకొట్టేది. -
వెండితెరపై స్టార్స్‌ను కలిపిన సూపర్ హిట్ కథలు
కొన్ని కథల్లో అతిథి పాత్రలకు కూడా ‘స్టార్’ రేంజ్ యాక్టర్లు కావాల్సి వస్తుంది. కథలో ఆ పాత్రలకు అంత ప్రాధాన్యం ఉంటుంది. ఆప్రాధాన్యాన్ని గ్రహించి అతిథి పాత్రలకు స్టార్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అలా కొన్ని క్రేజీ కాంబినేషన్స్‌ని కొన్ని కథలు కలిపాయి. ఆ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. కల్కి కలిపింది ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ వంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్‌హాసన్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా ఇద్దరు లెజెండరీ నటులను, ఒక స్టార్ డైరెక్టర్ని ‘కల్కి’ కలిపింది. భారతీయ ఇతిహాసం మహాభారతం స్ఫూర్తితో మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కర్ణుడిని ΄ోలిన పాత్రలో కనిపించనున్నారని టాక్. అమితాబ్ క్యారెక్టర్ మహాభారతంలోని అశ్వథ్థామ పాత్రను ΄ోలి ఉంటుందని భోగట్టా. అలాగే కమల్‌హాసన్ విలన్ పాత్ర ΄ోషిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళిది అతిథి పాత్ర. ఆయన ఎలాంటి పాత్రలో కనిపిస్తారనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని జనవరి12 విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. కన్నప్పలో శివుడు? మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో స్టార్ హీరో ప్రభాస్ నటించనున్నారు. ఈ మూవీకి ‘మహాభారత’ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించ నున్నారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నటుడు, నిర్మాత మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల శ్రీకాళహస్తిలోప్రారంభమైంది. శివ భక్తుడైన కన్నప్ప, ఆయన భక్తి నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. కన్నప్పగా మంచు విష్ణు నటించనున్నారు. శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని టాక్. కోలీ స్టార్‌తో టాలీ స్టార్ ‘సార్’ వంటి హిట్ సినిమా తర్వాత తమిళ హీరో ధనుష్ తెలుగులో నటిస్తున్న రెండో స్ట్రయిట్ ఫిల్మ్ ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్). శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించనున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో తెలుగు స్టార్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించనున్నారు. నాగార్జున పుట్టినరోజుని (ఆగస్టు 29) పురస్కరించుకుని ‘డీ 51’ చిత్ర నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు ఈ చిత్రంలో ఆయన నటించనున్న విషయాన్ని వెల్లడించారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో నాగార్జున పాత్రకి చాలాప్రాధాన్యం ఉందని టాక్. ప్రస్తుత సమాజంలో నెలకొన్న అసమానతల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందట. ఈ చిత్రంలో రష్మికా మందన్న కథానాయికగా నటిస్తారు. వార్కి సిద్ధం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియాని మించిన స్థాయిలో స్టార్డమ్ సొంతం చేసుకున్నారు హీరో ఎన్టీఆర్. ఇప్పటివరకూ తెలుగు సినిమాలు మాత్రమే చేసిన ఆయన తొలిసారి పరభాషా చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. హృతిక్ రోషన్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందనున్న ‘వార్ 2’ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన ‘వార్’ (2019) సినిమాకు సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందనుంది. -
కలర్‌ఫుల్ ఓనమ్
పంటలు ఇంటికి వచ్చిన వేళ..వంటలు ఘుమఘుమలాడిన వేళ..ఇంట్లో పండగ వేళ... ఇలా ఓనమ్ పండగను ఘనంగా జరుపుకున్నారు కొందరు తారలు.కేరళప్రాంతంలో పంటలు వచ్చే ఈ మాసంలో ఓనమ్ పండగ జరుపుకుంటారు. మంగళవారం పండగ సందర్భంగా పలువురు కథానాయికలు అందంగా ముస్తాబై, మెరిసిపోయారు. ఓనమ్ సాద్య పేరుతో దాదాపు 26 రకాల వంటకాలను అరిటాకులో వడ్డించుకుని, ఆరగించారు. పండగ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ∙మిర్నా మీనన్ ∙మాళవికా మోహనన్ ∙కల్యాణి ∙అపర్ణా దాస్ అదా శర్మ -
ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ.. చూసేందుకు రెడీనా..?
బాక్సాఫీస్ కలెక్షన్లు దండుకోవడానికి థియేటర్స్ స్టేషన్లో కొందరు స్టార్స్ పోలీసాఫీసర్స్‌గా చార్జ్ తీసుకోనున్నారు. కొందరు పోలీస్ యూనిఫామ్ వేసుకుని, సెట్స్‌లో లాఠీ తిప్పుతున్నారు. మరికొందరు కథలు విన్నారు.. యూనిఫామ్‌తో సెట్స్‌కి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఇక ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ వివరాలు తెలుసుకుందాం. మళ్లీ డ్యూటీ ‘మూండ్రు ముగమ్’ (1982), ‘పాండియన్ ’ (1992), హిందీలో ‘హమ్’ (1991), ‘దర్బార్’ (2020)... ఇలా ఇప్పటివరకూ రజనీకాంత్ ఏడెనిమిది చిత్రాల్లో పోలీసాఫీసర్‌గా నటించారు. మళ్లీ రజనీ పోలీస్‌గా చార్జ్ తీసుకోనున్నారట. టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ముస్లిమ్ పోలీసాఫీసర్ పాత్రలో రజనీ కనిపించనున్నారని టాక్. సుభాస్కరన్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. ఇక ఆగస్టు 10న విడుదల కానున్న ‘జైలర్’ చిత్రంలో రజనీ జైలర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. పోలీస్ స్పిరిట్ పోలీసాఫీసర్‌గా ప్రభాస్ కటౌట్ స్క్రీన్‌పై సూపర్‌గా ఉంటుందని, సిల్వర్ స్క్రీన్‌పై ఖాకీ డ్రెస్ వేసిన ఫుల్ లెంగ్త్ పోలీసాఫీసర్ పాత్రలో ప్రభాస్‌ను చూడాలని ఆయన ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఆశపడుతున్నారు. వీరి ఆశ ‘స్పిరిట్’తో తీరనుందనే టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని తెలిసింది. భూషణ్ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా, క్రిషణ్ కుమార్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివర్లో ్రపారంభం కానుందట. పుష్పర కాలం తర్వాత... ‘శౌర్యం (2008)’, ‘గోలీమార్ (2010)’ వంటి చిత్రాల్లో గోపీచంద్ పోలీస్‌గా సిల్వర్ స్క్రీన్‌పై డ్యూటీ చేశారు. పుష్కర కాలం తర్వాత గోపీచంద్ మళ్లీ పోలీస్‌గా లాఠీ పట్టారు. హర్ష తెరకెక్కిస్తున్న ‘భీమా’ చిత్రం కోసమే పోలీస్‌గా డ్యూటీ చేస్తున్నారు గోపీచంద్. కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ఆఫీసర్ అర్జున్ పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు నాని. ‘హిట్’ ఫ్రాంచైజీలో ‘హిట్ 3’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘హిట్ 1’లో విశ్వక్సేన్, ‘హిట్ 2’లో అడివి శేష్ పోలీసాఫీసర్స్‌గా నటించారు. ‘హిట్ 3’లో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ్రపారంభమవుతుందట. కొన్ని సన్నివేశాల్లో... హీరో నితిన్ పోలీసాఫీసర్‌గా చార్జ్ తీసుకున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎక్స్ట్రా’ (ప్రచారంలో ఉన్న టైటిల్). శ్రీలీల హీరోయిన్. ఇందులో హీరోగా నటిస్తున్న నితిన్ కొన్ని సీన్స్‌లో పోలీస్‌గా కనిపిస్తారట. అమరన్.. ఇన్ ది సిటీ ‘బ్లాక్’, ‘సీఎస్ఐ: సనాతన్’ వంటి చిత్రాల్లో ఆది సాయికుమార్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్‌గా సిల్వర్ స్క్రీన్ క్రైమ్స్‌ను చేధించారు. తాజాగా ‘అమరన్: ఇన్ ది సిటీ చాఫ్టర్ 1’ చిత్రంలో ఆది సాయికుమార్ పోలీసాఫీసర్‌గా ఓ కేసును పరిశోధిస్తున్నారు. ఎస్. బాలేశ్వర్ దర్శకత్వంలో ఎస్వీఆర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ది కానిస్టేబుల్ ‘హ్యాపీ డేస్’, ‘కొత్త బంగారు లోకం’, ‘కుర్రాడు’ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వరుణ్ సందేశ్ తాజాగా పోలీస్ డ్రెస్ వేసుకున్నారు. ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది కానిస్టేబుల్’. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ కానిస్టేబుల్ పాత్ర చేస్తున్నారు. ‘బలగం’ జగదీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదే ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఎవరు? హంతకులు ఎవరు? అనేది కనిపెట్టేందుకు జేడీ చక్రవర్తి ఓ స్కెచ్ వేశారు. పోలీసాఫీ సర్గా జేడీ చక్రవర్తి వేసిన ఈ స్కెచ్ డీటైల్స్ ‘హూ’ సినిమాలో తెలుస్తాయి. జేడీ చక్రవర్తి నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. రెడ్డమ్మ కె. బాలాజీ నిర్మించారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తారు. పోలీసులే ప్రధాన నిందితులైతే... దోషులను పట్టుకునే పోలీసులే నిందులైతే ఏం జరుగు తుంది? అనే కథాంశంతో దర్శకుడు తేజా మార్ని ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రంలోని ముఖ్య తారలంతా పోలీసులుగా నటిస్తున్నారని తెలిసింది. ‘ఖడ్గం’ (2002), ‘ఆపరేషన్ దుర్యోధన’ (2007), ‘టెర్రర్’ (2016) వంటి సినిమాల్లో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన శ్రీకాంత్ ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ పోలీస్‌గా కనిపిస్తారు. ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానుంది. పోలీస్ రన్నర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘రన్నర్’. విజయ్ చౌదరిని దర్శకుడిగా పరిచయం చేస్తూ విజయ్ భాస్కర్, ఫణీంద్ర, ఎం. శ్రీహరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో తండ్రీ కొడుకుల అనుబంధంతో సాగే ఈ చిత్రంలో పోలీసాఫీసర్ పాత్రలో జానీ మాస్టర్ నటిస్తున్నారని తెలిసింది. వీరే కాదు... మరికొందరు కూడా పోలీసాఫీసర్లుగా కనిపించడానికి రెడీ అవుతున్నారు. -
సొంత సినిమా కాదు.. అయినా సరే స్టార్ యాక్టర్స్ అలా
ఒక సినిమా గురించి ఒక స్టార్ పరిచయం చేస్తే ఆ మాటలు మంత్రాల్లా పని చేస్తాయి. ప్రేక్షకుల దృష్టి ఆ సినిమావైపు మళ్లేలా చేస్తాయి. ఆ మాటలు సినిమాకి అదనపు ఆకర్షణ అవుతాయి. అందుకే కొన్ని చిత్రాలకు స్టార్స్‌తో ‘వాయిస్ ఓవర్’ చెప్పిస్తుంటారు. అలా ఈ మధ్యకాలంలో ‘వాయిస్ ఓవర్’ ఇచ్చిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. దళపతికి ఉలగ నాయగన్ మాట ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లియో’. ఈ సినిమాకి ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్‌హాసన్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. ‘మాస్టర్’ తర్వాత విజయ్–లోకేష్ కాంబినేషన్లో ‘లియో’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో త్రిష హీరోయిన్గా, సంజయ్ దత్ విలన్‌గా చేస్తున్నారు. జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్ రిలీజ్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం టీజర్‌కి కమల్‌హాసన్‌తో వాయిస్ ఓవర్ చెప్పించారని టాక్. అలాగే ఈ చిత్రంలో కమల్ హాసన్ అతిథి ΄పాత్రలో కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. అక్టోబర్ 19న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. సాలే గురించి చెప్పిన టిల్లు ‘డీజే టిల్లు’ సినిమా సూపర్ హిట్ కావడంతో హీరో సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రత్యేకించి యూత్‌లో అతని ఫాలోయింగ్ రెట్టింపయ్యింది. ఈ క్రేజ్ దృష్ట్యా ‘భాగ్ సాలే’ చిత్ర యూనిట్ సిద్ధు జొన్నలగడ్డతో వాయిస్ ఓవర్ చెప్పించింది. తన వాయిస్‌తో ‘భాగ్ సాలే’ చిత్ర నేపథ్యాన్ని వివరిస్తారు సిద్ధు. కేడీ కోసం మల్టీ స్టార్స్ యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘కేడీ: ది డెవిల్’. ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రీష్మా నానయ్య హీరోయిన్. శిల్పా శెట్టి, సంజయ్ దత్, విజయ్ సేతుపతి కీలకపాత్రలు చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూ΄÷ందుతోన్న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, తమిళ భాషల్లోనూ విడుదలకానుంది. ఈ సినిమా టైటిల్ టీజర్‌కి కన్నడలో చిత్ర దర్శకుడు ప్రేమ్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, హిందీలో సంజయ్ దత్, మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో విజయ్ సేతుపతి ఇచ్చారు. ఇంకా తెలుగు వాయిస్ ఓవర్ పూర్తి కాలేదట. అక్టోబర్ 15న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. -
ఇన్‌స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు! జాబితాలో ఎవరున్నారంటే?
-
నక్షత్రాకాశం మాయం కానున్నదా?
చిన్నతనంలోనూ, కొన్నేళ్ల క్రితం కూడా పల్లెకు వెళ్లి ఆరుబయట పడుకుంటే ఆకాశంలో నక్షత్రాలు ధాన్యం ఆరబోసినట్టు చిక్కగా కనిపించేవి. పట్నం చేరిన తరువాత నక్షత్రాలు కనిపించడం కరువైపోయింది. ఇందుకు కారణం ‘కాంతి కాలుష్యం’ అని సులభంగానే చెప్పవచ్చు. మనుషులు ఏర్పాటు చేసుకున్న వెలుగులు ఆకాశంలోకి కూడా వెదజల్లబడి అక్కడ చుక్కలను మనకు కనిపించకుండా చేస్తున్నాయి. నక్షత్రాలనూ, అంతరిక్షంలోని ఇతర అంశాలనూ పరిశీలించే ఖగోళ శాస్త్రజ్ఞులకు ఇదంతా పెద్ద సమస్యగా చాలా కాలంగానే తెలుసు. కనుక అంతరిక్షంలో నుంచి ఈ కాంతి కాలుష్యాన్ని కొలతలు వేసి చూశారు. అయితే అంతరిక్షంలోని ఉపగ్రహాలు కాంతిని మనిషి కళ్ళు చూసినట్టు చూడలేవు. కనుక వాటికి కనిపించే అంశాలు మనకు కనిపించే అంశాల కంటే వేరుగా ఉంటాయి. మనిషి సృష్టించిన వెలుగులు ఆకాశంలో ఎటువంటి ప్రభావాలను చూపిస్తున్నాయి అన్న ప్రశ్న గురించి పరిశోధనలు మొదలయ్యాయి. జర్మనీ దేశంలో క్రిస్టఫర్ కైబా అనే పరిశోధకుని నాయకత్వంలో ఒక జట్టు ఈ అంశం గురించి బాగా పరిశీలిస్తున్నది. నక్షత్ర పటాలను వారు తయారు చేస్తున్నారు. ఒక పట్టణంలో బాగా వెలుతురుంటే పెద్ద నక్షత్రాలు మాత్రమే కనిపిస్తాయి. అటువంటి ప్రదేశాలతో ఒక పటం తయారు చేస్తారు. ఆ తరువాత అంతగా వెలుగులేని నక్షత్రాలు కూడా కనిపించే పటం ఒకటి ఉంటుంది. వాటిని మామూలుగా మనిషి కళ్ళు కూడా చూడగలుగుతాయి. 2011వ సంవత్సరంలో మొదలయ్యి మొన్న మొన్నటి దాకా సాగిన ఈ ప్రయత్నంలో ప్రపంచమంతటా కనీసం 50,000 మంది పౌర పరిశోధకులు పాల్గొన్నారు. ఎక్కడికక్కడ ఆకాశంలో వెలుగులను, నక్షత్రాలను వాళ్లంతా లెక్కలు వేశారు. ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య తేడాలు ఉండడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. యూరోప్ ఖండంలో కాంతి కాలుష్యం ఏటేటా ఆరున్నర శాతం పెరుగుతున్నదని వాళ్లంతా లెక్క తేల్చారు. అటు ఉత్తర అమెరికాలో ఈ కాలుష్యం 10 శాతం కంటే ఎక్కువగా ఉంది. అవును మరి, అక్కడ వెలుగులు కూడా చాలా ఎక్కువ కదా! మొత్తానికి మొత్తం ప్రపంచంలో సగటున ఏటేటా తొమ్మిది శాతం వరకు కాంతి కాలుష్యం పెరుగుతున్నట్టు కనుగొన్నారు. మామూలుగా ఆలోచిస్తే ఇదేమంత గొప్ప విషయం కాదు అనిపించవచ్చు. కానీ దాని ప్రభావం మాత్రం అంచెలంచెలుగా పెరిగిపోతుంది. ఏటా పది శాతం కాంతి కాలుష్యం అంటే ప్రతి ఏడు ఎనిమిది సంవత్సరాలకు నక్షత్రాలు కనిపించడం సగానికి సగం తగ్గుతుంది అని అర్థమట. అసలు కొంతకాలం పోతే ఆకాశంలో నక్షత్రాలు కనిపించనే కనిపించవేమో అంటున్నారు పరిశోధకులు. టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా ఈ కాలుష్యం బాగా పెరుగుతున్నది అని పరిశోధకులు తేల్చారు. నివాసాల దగ్గర ఉండే వెలుగు ప్రభావం అక్కడ ఉండే మనుషుల మీద చాలా ఉంటుంది. అక్కడి జంతువులు, మొక్కల మీద కూడా ఈ వెలుగు ప్రభావం బాగా ఉంటుంది. వెలుగు వల్ల గజిబిజిపడ్డ పక్షులు తమ వలస మార్గాలను సరిగ్గా అనుసరించలేకపోతాయి. చివరకు మిణుగురు పురుగులు కూడా ఈ వెలుగుకు తికమక పడతాయి. మనుషులకు కలిగే ఆరోగ్య ప్రభావాలలో నిద్రలేమి అన్నిటికంటే ముఖ్యంగా ఉంటుంది. కాంతి కాలుష్యాన్ని ఎవరికి వారు తగ్గించడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. ‘అంతర్జాతీయ చీకటి ఆకాశం సంఘం’ అనేది ఒకటి తయారై ఉందని, అది తీవ్రంగా పనిచేస్తున్నదని మామూలు మనుషులకు తెలియకపోవచ్చు. వెలుగులను మరింత తెలివిగా వాడుకోవాలని వారు ఎక్కడికక్కడ ప్రచారం చేస్తున్నారు. వీధి దీపాల కాంతి పైకి పోకూడదు, కిందకు మాత్రమే రావాలి అని వారు సలహా ఇస్తున్నారు. విద్యుత్తును ఆదా చేయగల బల్బులను వాడాలని కూడా చెబుతున్నారు. వెలుగు కాలుష్యం గురించి అందరికీ తెలియజేయడం చాలా అవసరం. ఇంటి బయట రాత్రంతా అనవసరంగా వెలుగుతున్న బల్బులను స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఇటువంటి ఏర్పాట్లను ఎక్కడికక్కడ స్థానికంగా చర్చించి, అక్కడి పరిస్థితులకు అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. దాని అర్థం అందరూ చీకటిలో బతకండి అని మాత్రం కానే కాదు. కాంతి కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ప్రకృతి అందం పాడవకుండా ఈ వెలుగులను వాడాలి. రాత్రిపూట ఆకాశం అన్నిటికన్నా అందమైన దృశ్యం. దాన్ని చేతనైనంతవరకు కాపాడుకోవాలి. చుక్కలు అంటే ఉల్కలు రాలిపడడం, చంద్రగ్రహణం వంటి వాటిని అందమైన దృశ్యాలుగా గుర్తించి పరిశీలించాలి. రాత్రిపూట ప్రకృతిని పరిశీలించే అదృష్టం గలవారు ఆ అందం గురించి ఎంతైనా చెప్పగలుగుతారు. రాత్రి ఆకాశం నిజంగా అందమైనది. ముందు తరాలకు అందమైన నక్షత్రాకాశాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కె.బి. గోపాలం వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత ‘ మొబైల్: 9849062055 -
ఎన్ని ప్లాప్ వచ్చిన టాలీవుడ్ ని వదిలేదే లే ....
-
నార్త్ ఆడియెన్స్ కోసం బీటౌన్ స్టార్స్ కి ప్రాధాన్యత ఇస్తున్న టాలీవుడ్
-
ఇతర గ్రహాలపై జీవజాలం.. ఓజోన్ పొర ఆధారం
అనంతమైన విశ్వంలో మనం జీవిస్తున్న ఈ భూగోళంపైనే కాకుండా ఇతర గ్రహాలు, నక్షత్రాలపైనా జీవజాలం ఉందా? ఇప్పుడు లేకపోయినా గతంలో ఎప్పుడైనా ఉండేదా? ఒకవేళ ఉంటే అవి ఎలాంటి జీవులు? ఈ ప్రశ్నలు ఎన్నో శతాబ్దాలుగా భూమిపై మానవాళిని వెంటాడుతూనే ఉన్నాయి. సువిశాలమైన విశ్వంలో భూమికి ఆవల జీవుల ఉనికిని కనిపెట్టేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు అలుపెరగకుండా అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. మన పాలపుంత(గెలాక్సీ)లో ఇప్పటిదాకా 5,000కుపైగా గ్రహాలను కనిపెట్టారు. వాటిపై జీవులు ఉన్నాయా? అనేది తెలుసుకొనేందుకు కృషి చేశారు. ఇందుకోసం ఎన్నెన్నో పద్ధతులు అనుసరించారు. ఇతర గ్రహాలపై జీవజాలం ఉన్నట్లు ఇప్పటివరకైతే బలమైన ఆధారాలేవీ లభించలేదు. పరిశోధనల్లో భాగంగా శాస్త్రవేత్తలు మరో కొత్త పద్ధతిపై దృష్టి పెట్టారు. అదేమిటో తెలుసుకోవడం ఆసక్తికరమే. ► మన భూగోళానికి రక్షణ కవచం ఓజోన్ పొర అన్న సంగతి తెలిసిందే. అత్యంత హానికరమైన అల్ట్రావయొలెట్(యూవీ) రేడియేషన్ నుంచి ఓజోన్ పొర రక్షిస్తోంది. అందుకే భూమిపై కోట్లాది జీవులు నిక్షేపంగా మనుగడ సాగిస్తున్నాయి. ► ఏదైనా గ్రహాన్ని మందపాటి ఓజోన్ పొర ఆవరించి ఉంటే ఆ గ్రహంపై జీవుల ఉనికి సాధ్యమని దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే అంశాన్ని సరికొత్త అస్త్రంగా మార్చుకుంటున్నారు. ► ఏదైనా నక్షత్రానికి లోహతత్వం(మెటాలిసిటీ) ఎక్కువగా ఉంటే దాని చుట్టూ ఉన్న గ్రహాలపై రక్షిత ఓజోన్ పొర ఆవరించి ఉంటుందని గుర్తించారు. ► ఈ అధ్యయనం వివరాలను ‘నేచర్ కమ్యూనికేషన్’ పత్రికలో ప్రచురించారు. ► విశ్వ పరిణామ క్రమంలో కొత్తగా పుట్టుకొస్తున్న నక్షత్రాలకు లోహతత్వం అధికంగా ఉంటున్నట్లు తేల్చారు. ఇలాంటి నక్షత్ర మండల్లాలోని గ్రహాల చుట్టూ దట్టమై ఓజోన్ పొర ఏర్పడుతుందని, తద్వారా అక్కడ జీవులు ఉద్భవించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ► అధిక లోహతత్వం ఉన్న నక్షత్రాల పరిధిలోని గ్రహాలే జీవుల అన్వేషణకు మెరుగైన లక్ష్యాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ► గ్రహాల చుట్టూ రక్షిత ఓజోన్ పొర ఏర్పడాలంటే దానికి సంబంధించిన నక్షత్రానికి ఏయే లక్షణాలు ఉండాలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. ► విశ్వంలో గ్రహాలను కలిగిన చాలా నక్షత్రాల ఉష్ణోగ్రత 5,000 నుంచి 6,000 డిగ్రీల సెల్సియస్ ఉంది. మన నక్షత్రమైన సూర్యుడు ఇదే విభాగంలోకి వస్తాడు. ► సూర్యుడి నుంచి వెలువడుతున్న అల్ట్రావయొలెట్ కాంతి(రేడియేషన్) మన భూగ్రహ వాతావరణంపై చూపిస్తున్న సంక్లిష్టమైన ప్రభా వాన్నే ఇతర గ్రహాల వాతావరణంపైనా చూపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ అన్నా సపిరో ఒక ప్రకటనలో వెల్లడించారు. ► నక్షత్రాల్లోని లోహతత్వం వాటి నుంచి ఉద్గారమయ్యే అల్ట్రావయెలెట్ కాంతిని ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. యూవీ రేడియేషన్ నక్షత్రాల సమీపంలో కక్ష్యలో తిరిగే గ్రహాల వాతావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందన్న దానిపై దృష్టి సారించారు. ► మన భూగోళంపై ఉన్న వాతావరణం ఇక్కడి జీవ పరిణామ క్రమాన్ని తెలుసుకొనేందుకు ఉపకరిస్తుందని, ఇదే సూత్రాన్ని ఇతర గ్రహాలకు సైతం వర్తింపజేయవచ్చని సైంటిస్టు జోస్ లెలీవెల్డ్ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
దసరా బరిలో స్టార్స్.. బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ ఫైట్
-
అంతరిక్షంలో బంగారం!
వాషింగ్టన్: మన పాలపుంతలో గ్రహాలతోపాటు కోట్ల సంఖ్యలో నక్షత్రాలు ఉన్నాయి. సమీపంలోని రెండు నక్షత్రాలు పరస్పరం ఢీకొని శక్తివంతమైన కొత్త నక్షత్రంగా ఏర్పడుతుంటాయి. ఇలాంటి పరిణామాన్ని కిలోనోవా అంటారు. మనం ఉంటున్న నక్షత్ర మండలంలో మరో అరుదైన కిలోనోవాకు అంకురార్పణ జరిగినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూగోళం నుంచి 11,000 కాంతి సంవత్సరాల దూరంలో రెండు న్యూట్రాన్ నక్షత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నట్లు తేల్చారు. తొలుత నాసాకు చెందిన నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ శాస్త్రవేత్తలు గమనించారు. అనంతరం చిలీలో అమెరికన్ అబ్జర్వేటరీలో ఉన్న స్మార్ట్ 1.5 మీటర్ టెలిస్కోప్ సాయంతో కిలోనోవా పరిణామాన్ని నిర్ధారించారు. అధ్యయనం ఫలితాలను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. త్వరలో సంభవించబోయే కిలోనోవా కోసం శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు నక్షత్రాలు కలిసిపోయినప్పుడు భారీ పేలుడు సంభవిస్తుందని, ఇందులో బంగారం లాంటి లోహాలు ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా నక్షత్రాలు, గ్రహాల పుట్టుకతోపాటు అంతరిక్ష రహస్యాలను ఛేదించేందుకు ఈ కిలోనోవా దోహదపడుతుందని భావిస్తున్నారు. విశ్వంలో ఇప్పటిదాకా 10 కిలోనోవాలో సంభవించినట్లు అంచనా వేస్తున్నారు. ఒక భారీ నక్షత్రం జీవితకాలం కనీసం 10 లక్షల సంవత్సరాలు ఉంటుందని, ఆ తర్వాత అందులో పేలుడు జరిగి, న్యూట్రాన్ స్టార్ ఉద్భవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు వివరించారు. -
NASA: తారల తాండవం!
న్యూయార్క్: ఫొటోలో చక్రంలా తిరుగుతూ కనువిందు చేస్తున్నది ఓ అందమైన తారా మండలం. దాని చుట్టూ ఆనంద తాండవం చేస్తున్నట్టు కన్పిస్తున్నవి భారీ నక్షత్రాలు! లెడా 2046648గా పిలుస్తున్న ఈ నక్షత్ర మండలం భూమికి ఏకంగా వంద కోట్ల కాంతి సంవత్సరాలకు పైగా దూరంలో హెర్క్యులస్ నక్షత్రరాశిలో ఉందట! దీన్ని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇటీవలే తన అత్యాధునిక నియర్–ఇన్ఫ్రా రెడ్ కెమెరా (ఎన్ఐఆర్ కామ్) సాయంతో బంధించింది. మరుగుజ్జు తారగా మారిన డబ్ల్యూడీ1657ను పరిశీలిస్తున్న క్రమంలో యాదృచ్ఛికంగా ఈ గెలాక్సీ కంటబడిందని నాసా పేర్కొంది. ‘‘విశ్వావిర్భావపు తొలినాళ్లకు చెందిన సుదూర గెలాక్సీలను కనిపెట్టడం, పరిశోధించడమే ప్రధాన లక్ష్యంగా జేమ్స్ వెబ్‌ను తయారు చేయడం తెలిసిందే. ఆయా గెలాక్సీల రసాయనిక కూర్పు తదితరాలను కూడా విశ్లేషించగల సామర్థ్యం దాని సొంతం. తద్వారా వాటి ఆవిర్భావానికి కారణమైన భారీ మూలకాలు ఎలా పుట్టుకొచ్చిందీ తెలిసే ఆస్కారముంటుంది’’ అని ఒక ప్రకటనలో వివరించింది. -
తారలు తెర‘మరుగు’.. ఆ రోజు ఎంతో దూరంలో లేదు
బెంగళూరు: మబ్బుల్లేని రాత్రి వేళ అలా ఆకాశంలోకి చూసినప్పుడు లెక్కలేనన్ని నక్షత్రాలు తళుకుమంటూ కనువిందు చేస్తుంటే ఎంతో బావుంటుంది కదా! కానీ వినువీధిలో తారల తళుకులు నానాటికీ తగ్గిపోతున్నాయి. 2011తో పోలిస్తే 2022 నాటికి అబ్జర్వేటరీల కెమెరా కంటికి కన్పిస్తున్న నక్షత్రాల సంఖ్య ఏకంగా 10 శాతం తగ్గిందని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది! అయితే, దీనికి కారణం నక్షత్రాలు నశించిపోవడం కాదు. భూమిపై కృత్రిమ వెలుగులు మితిమీరి పెరిగిపోవడం! మరోలా చెప్పాలంటే కాంతి కాలుష్యమన్నమాట!! దాంతో కాస్త తక్కువ ప్రకాశంతో కూడిన నక్షత్రాలన్నీ సదరు కృత్రిమ వెలుగు మాటున మరుగున పడిపోతున్నాయట! ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితని యూనివర్సిటీ ఆఫ్ శాంటియాగో డీ కాంపొస్టెలా భౌతిక శాస్త్రవేత్త ఫాబియో ఫాల్చీ ఆవేదన వెలిబుచ్చారు. ‘‘కాంతి కాలుష్యం ఏటా 7 నుంచి 10 శాతం చొప్పున పెరిగిపోతోంది! ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది’’ అని ఆయనన్నారు. ‘‘ఒకప్పట్లా చిక్కటి చీకటితో నిండిన రాత్రుళ్లు ఎప్పటికీ తిరిగిరావు. ముఖ్యంగా నగరాల్లోనైతే రాత్రిపూట వెలుగులు అనివార్యంగా మారి దశాబ్దాలు దాటింది. కానీ పరిస్థితి పూర్తిగా చేయి దాటకుండా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆకాశంలో కేవలం వేళ్లపై లెక్కబెట్టగలిగినంతకు మించి చుక్కలు కన్పించని రోజు ఎంతో దూరంలో లేదు’’ అంటూ హెచ్చరించారు. -
నక్షత్రాల అవిర్భావం గుట్టు విప్పిన భారత టెలిస్కోప్!
న్యూఢిల్లీ: బిగ్‌బ్యాంగ్ తర్వాత 20 కోట్ల ఏళ్లకు ఏర్పడ్డ తొలి నక్షత్రాల రహస్యాలను భారత టెలిస్కోప్ బహిర్గతం చేసింది. బెంగళూరులోని రామన్ పరిశోధనా సంస్థ (ఆర్ఆర్ఐ)లో డిజైన్ చేసి, నిర్మించిన సరస్–3 రేడియో టెలిస్కోప్‌తో నక్షత్రాల గుట్టును బయట పెట్టారు. 2020 మార్చిలో కర్ణాటకలోని దండిగనహళ్లి చెరువు వద్ద, కొంతకాలం శరావతి బ్యాంక్ వాటర్స్ వద్ద ఈ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేశారు. విశ్వం ఎలా ఏర్పడిందో తెలుసుకొనేందుకు ఆర్ఆర్ఐతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఆర్ఓ), యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్, యూనివర్సిటీ ఆఫ్ టెల్ అవివ్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. సరస్–3 టెలిస్కోప్ డేటాను ఇటవలే విశ్లేషించారు. బిగ్‌బ్యాంగ్ అనంతరం తొలుత ఏర్పడిన నక్షత్ర మండలాల్లోని 3 కంటే తక్కువ శాతం వాయువులు నక్షత్రాలుగా రూపాంతరం చెందినట్లు గుర్తించామని ఆర్ఆర్ఐ ప్రతినిధి సౌరభ్ సింగ్ చెప్పారు. దేశీయంగా అభివృద్ధి చేసిన సరస్–3 రేడియో టెలిస్కోప్ కాస్మిక్ డాన్ ఆస్ట్రోఫిజిక్స్‌పై అవగాహన మరింత పెంచుకొనేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. బిగ్‌బ్యాంగ్ అనంతర కాలాన్ని కాస్మిక్ డాన్‌గా వ్యవహరిస్తారు. అప్పటి గెలాక్సీల్లో అత్యధిక సాంద్రత కలిగిన కృష్ణ బిలాలు (బ్లాక్ హోల్స్) ఉండేవి. -
అదో అధోజగత్తు.. శ్మశానసదృశ ప్రాంతం.. మృతప్రాయ నక్షత్రాల అడ్డా!
కాలం తీరి మృతప్రాయంగా మారి రాలిపడ్డ పురాతన నక్షత్రాలతో కూడిన మరుభూమి వంటి ప్రదేశాన్ని పాలపుంతలో ఓ మూలన వ్యోమగాములు తొలిసారిగా గుర్తించారు! మన పాలపుంత వైశాల్యాన్ని మథిస్తున్న క్రమంలో ఈ శ్మశానసదృశ ప్రాంతం యాదృచ్ఛికంగా వారి కంటపడటం విశేషం! పదులు వందలూ కాదు, లెక్కకు మిక్కిలి సంఖ్యలో మృత నక్షత్రాలు అక్కడున్నాయట. ఇవన్నీ ఒక్కొక్కటిగా బ్లాక్‌హోల్స్‌లోకి అంతర్ధానమవుతున్నాయట. అంతరిక్షంలో దీన్ని ఒకరకంగా అధోజగత్తుగా చెప్పవచ్చని సైంటిస్టులు అంటున్నారు. దీని ఎత్తు పాలపుంతతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువగా ఉందట! పాలపుంతలోని ద్రవ్యరాశిలో ఇవే కనీసం మూడో వంతు ఉంటాయట. ఈ మృత నక్షత్రాలన్నీ చాలా పురాతనమైనవని, ఎప్పుడో మన పాలపుంత పాలబుగ్గల ప్రాయంలో ఉన్నప్పుడు ఏర్పడ్డ బాపతని నాసా పేర్కొంది. మారుమూల చీకట్లలో దాగుండటం వల్ల ఇంతకాలం కంటపడలేదని చెప్పుకొచ్చింది. అన్నట్టూ, ఈ అధోజగత్తు తాలూకు ఒక కొస మనకు 65 కాంతి సంవత్సరాల కంటే దూరం ఉండదట! -
రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్!
17 వలయాలతో వయ్యారాలు పోతున్న జంట తారలివి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వీటిని తాజాగా గుర్తించింది. ఎనిమిదేళ్లకోసారి అవి పరస్పరం సమీపంగా వచ్చినప్పుడల్లా రెండింటి వాయు ప్రవాహాలతో రేగే అంతరిక్ష ధూళి ఇలా వలయాల రూపు సంతరించుకుంటోందట. దీన్ని రోదసిలో లార్డ్ ఆఫ్ ద రింగ్స్‌గా శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. భూమి నుంచి 50 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ జంట తారలను వూల్ఫ్–రాయెట్ 140గా వ్యవహరిస్తున్నారు. వీటిలో ఒకటి సూర్యుని కంటే కనీసం 25 రెట్లు పెద్దదట. దాని జీవితకాలం ముగింపుకు వస్తోందని నాసా తెలిపింది. అది నెమ్మదిగా కృశించి బ్లాక్‌హోల్‌గా మారడానికి ఎంతోకాలం పట్టదని చెబుతోంది. -
అప్పటి చైల్డ్ ఆర్టిస్టులే ఇప్పుడు స్టార్ సెలబ్రిటీలు
తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్. నిజానికి హీరోలు, హీరోయిన్స్, కమెడియన్ ఇలా స్టార్స్ అంతా …టీనేజ్ తర్వాతే సిల్వర్ స్క్రీన్ మీద జర్నీ మొదలుపెడతారు. కానీ…వీరిలో కొందరు మాత్రం బాల్యం నుంచే వెండితెర మీద మెరిసిన వాళ్లు ఉన్నారు. అలాంటి టాలీవుడ్ సెలబ్రిటీస్‌పై స్పెషల్ స్టోరీ.. పసిప్రాయంలోనే తమలోనే నటనాసామర్థ్యాన్ని, చాతుర్యాన్ని ప్రదర్శించిన వాళ్లు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు. 1979లో నీడ చిత్రంతో బాలనటుడుగా పరిచయం అయ్యా డు. బాలనటుడుగా తొమ్మిది సినిమాల్లో నటించాడు. బాలనటుడిగా వెండితెర మీద సత్తా చాటిన స్టార్స్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరొకరు. బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర హిందీ వెర్షన్లో తొలిసారిగా నటించాడు జూ.ఎన్టీఆర్. ఆ తర్వాత ఎం.ఎస్. రెడ్డి నిర్మాణంలో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణం చిత్రంలో రాముడుగా అద్భుతమైన నటనని ప్రదర్శించాడు. ఏడవ ఏటే బాలనటుడిగా.. స్టార్ కమెడియన్ అలీ బాలనటుడుగానే వెండితెర మీద నవ్వులు పూయించాడు. తన ఏడవ ఏట నుంచే నటించడం మొదలుపెట్టాడు అలీ 1979లో సీతాకోకచిలుకతో బాలనటుడుగా పరిచయమైయ్యాడు. తొలి చిత్రం నుంచే హస్యాన్ని పండించడంలో తనదైన ప్రతిభను చాటాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్టార్ ఇమేజ్ ఇక బాలనటుడుగానే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న కొద్ది మందిలో తరుణ్ ఒకడు. మనసు మమత చిత్రంతో బాలనటుడుగా తరుణ్ కెరీర్ మొదలైంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పదికి పైగానే చిత్రాల్లో నటించాడు. బాలనటుడుగా మూడు నంది అవార్డులను అందుకున్నాడు. అంజలి చిత్రానికి జాతీయ అవార్డు కూడా తీసుకున్నాడు. ప్రహ్లాద పాత్రలో రోజా రమణి ఇక బాలనటులు గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మొదట ప్రస్తావించాల్సిన పేరు రోజా రమణినే. భక్త ప్రహ్లాద చిత్రంలో ప్రహ్లాద పాత్ర చేసిన రోజా రమణి నటన విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత కథానాయికగా కూడా అనేక చిత్రాల్లో రోజా రమణి నటించారు. ఆ కొద్దిమందిలో శ్రీదేవి ఒకరు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో బాలనటిగా నటించి రికార్డు సృష్టించింది శ్రీదేవి. ఆ తర్వాత ఈ భాషా చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా కూడా దశాబ్దాల పాటు తన సత్తా చాటింది. బాలనటిగా పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది శ్రీదేవి. దక్షిణాదిన చైల్డ్ ఆర్టిస్ట్‌గానే స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. భావోద్వేగాలను అద్భుతంగా పలికించే కొద్ది మంది చైల్డ్ ఆర్టిస్టులో ఒకరుగా శ్రీదేవి గుర్తింపు పొందింది. బాలనటిగా హేమాహేమీల్లాంటి స్టార్స్‌తో పోటీ పడుతూ నటించి మెప్పించింది. శంకరాభరణంతో నంది అవార్డు చైల్డ్ ఆర్టిస్ట్‌గా,హీరోయిన్గా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన మరో నటి తులసి. తొలి చిత్రం భార్య. ఆ చిత్రంలో రాజబాబు కుమారుడుగా తులసి నటించింది.అప్పుడు ఆమె వయస్సు ఏడాదిన్నర మాత్రమే. ఆ తర్వాత సీతామహాలక్ష్మి చిత్రంతో అందరి దృష్టిలో పడింది తులసి. ఆ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో ఆమెదీ ఒకటి. తులసి పైన మూడు పాటలను చిత్రీకరించారు. ఇక శంకరాభరణం చిత్రం గురించి చెప్పక్కర్లేదు. ఆ చిత్రంలో అద్భుతంగా నటించింది. ఆ సినిమాకి గానూ ఉత్తమ బాలనటిగా నంది అవార్డును కూడా అందుకుంది. సిరివెన్నెల.. పెద్ద సంచలనమే బాలనటిగానూ, హీరోయిన్‌గానూ వెండితెర మీద వెలిగిన స్టార్ మీనా. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మీనా తొలి చిత్రం నిన్జనగల్. తమిళంలో రజినీకాంత్, కమలహాసన్ ఇద్దరితోనూ బాలనటిగా నటించింది. హీరోయిన్‌గానూ చేసింది. బాలనటిగా మీనాకు బాగా పేరు తెచ్చిన సినిమా సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పెద్ద సంచలనమే రేపింది. ఆ చిత్రంలో హీరో సర్వదమన్ బెనర్జీ, మూగ అమ్మాయిగా నటించిన సుహాసి నిలతో పోటీ పడుతూ నటించింది మీనా. అంధ బాలికగా మీనా నటనకి చాలా ప్రశంసలు లభించాయి. -
‘చుక్కలు’ చూపించే హోటల్
ఆరుబయట పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను లెక్కపెట్టడం... గ్రాండ్ పేరెంట్స్‌తో కథలు చెప్పించుకోవడం... 80ల్లోని పిల్లలకు ఓ మధురమైన జ్ఞాపకం. అలా ముచ్చట్లతోనే నిద్రలోకి జారుకునేవాళ్లు. ఇప్పుడు అట్లాంటి ఆరుబయట పడుకునే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది స్విట్జర్లాండ్‌లోని ఓ హోటల్. దాని పేరు నల్ స్టెర్న్ హోటల్ (జీరో స్టార్ హోటల్). దీని ప్రత్యేకత ఏంటంటే... ఒక ప్లాట్‌ఫామ్ మీద డబుల్ కాట్బెడ్, అటూఇటూ ల్యాంప్స్. అంతే.. గోడలు ఉండవు. తలు పులు ఉండవు. పైకప్పు అసలే లేదు. ఏకాంతం, రక్షణ కలిగించే ఏ సదు పాయమూ ఉండబోదు. హోటలియర్ డానియేల్ కార్బొనియెర్ రూపొందించిన ఈ ప్రాజెక్టు ఆలోచన స్విస్ ఆర్టిస్టులు ఫ్రాంక్ రిక్లిన్, పాట్రిక్ రిక్లిన్ బ్రదర్స్‌ది. ఇక్కడ స్టే చేస్తే.. ‘రాత్రంతా నిద్ర పట్టలేదు...’, ‘ఏం చప్పుళ్లురా బాబోయ్’ అనే ఫిర్యాదులు రావొచ్చు. కానీ ఆ ఆలోచన కల్పించేందుకే దీన్ని తయారు చేశామంటున్నారు రిక్లిన్ బ్రదర్స్. వచ్చిన అతిథులకు ప్రపంచంలో ఉన్న సమస్యలు ప్రత్యేకించి... వాతావరణంలో వస్తున్న మార్పులు, యుద్ధం, మాయమవుతున్న మానవత్వం వంటివన్నీ భూమికెంత నష్టం చేస్తున్నాయో తెలియజెప్పడమే ఈ ‘జీరో స్టార్ హోటల్స్’ లక్ష్యమని చెబుతున్నారు. ఇక హోటల్లో ఒక నైట్ స్టే చేయాలంటే.. దాదాపు రూ. 27 వేలు చెల్లించాల్సి ఉంటుంది. డ్రింక్స్, బ్రేక్‌ఫాస్ట్ అన్నీ అక్కడికే తెచ్చిస్తారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి. ప్రస్తుతానికి సైలన్ గ్రామంలోని ఓ పెట్రోల్ బంక్ పక్కన, మరో వైన్యార్డ్లో, పిక్చర్‌స్క్వేర్ కొండ పక్కన వీటిని ఏర్పాటు చేశారు. -
తారల తళుక్కులను చూసేద్దాం!
సాక్షి, అమరావతి: కాంతి కాలుష్యానికి (లైట్ల వెలుతురు పెద్దగా లేని ప్రాంతం) దూరంగా చీకటి ఆకాశంలో టెలీస్కోప్‌ల సాయంతో నక్షత్రాలను వీక్షించడమే ఆస్ట్రో పర్యాటకం. ఇది ఎత్తైన కొండలు, దట్టమైన కోనలు, హిమ పర్వతాల ప్రాంతాల్లో సాంకేతికతతో కూడిన ఎకో టూరిజంగా ఆహ్లాదాన్ని పంచుతోంది. ఇందులో పర్యాటకులు స్పష్టమైన రాత్రి ఆకాశాన్ని అన్వేషిస్తూ (నైట్ స్కై టూరిజం) గ్రహాలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఖగోళ వస్తువులు, ఉల్కాపాతాలను వీక్షించవచ్చు. ఆస్ట్రో–ఫొటోగ్రఫీ నేర్చుకోవచ్చు. ఖగోళ శాస్త్రజ్ఞులు సైతం ఆకాశంపై పరిశోధనలకు రాత్రి శిఖరాగ్ర ప్రదేశాల్లోనే ఎంచుకొంటారు. ఉపాధి వనరుగా.. ఆస్ట్రో టూరిజం స్థానిక వర్గాలకు బలమైన ఆర్థిక, సామాజిక ఉపాధి వనరుగా మారుతోంది. లద్ధాఖ్‌లో స్థానిక మహిళలకు ఆస్ట్రో టూరిజంలో టెలిస్కోప్‌ల వినియోగంలో శిక్షణ పొంది నక్షత్రాలు, నక్షత్ర రాశులను గుర్తించడంలో పర్యాటకులకు గైడులుగా వ్యవహరిస్తూ ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆస్ట్రో–స్టే పేరిట స్థానిక గృహాల్లోనే పర్యాటకులకు బస కల్పించి ఉపాధి పొందుతున్నారు. ఉత్తరాఖండ్, రాజస్థాన్‌ల్లో ఖగోళ పర్యాటక ప్రదేశాల్లో టూరిస్టుల కోసం గుడిసెలు ఏర్పాటు చేస్తూ.. భోజనాలు అందిస్తూ..సంగీత కచేరీలతో అలరిస్తూ సంపాదిస్తున్నారు. ఉత్తరాఖండ్‌లోని బెనిటల్ ఆస్ట్రో గ్రామంగా మారింది. ఇక్కడ పర్యాటకులను ఆకట్టుకునేందుకు ‘ఆస్ట్రో విలేజ్ పార్టీలు’ పెడుతున్నారు. దేశంలో ఇలా.. దేశంలో తొలి సారిగా రాజస్థాన్ ప్రభుత్వం మొత్తం 33 జిల్లాల్లో ఆస్ట్రో టూరిజాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి జిల్లాలో టెలిస్కోప్‌లు ఏర్పాటు చేయడంతో పాటు ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో కూడా ఆస్ట్రో టూరిజం కోసం కేంద్రాన్ని నిర్వహిస్తోంది. రాజధాని జైపూర్‌లోనే 4 నక్షత్ర వీక్షణ కేంద్రాలను పెట్టింది. ఇప్పటికే ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో పుదుచ్చేరి, కర్ణాటకలోని విరాజ్‌పేట, మడికేరి, గోవా, కేరళలోని మున్నార్‌లో ఆస్ట్రో ఫోటోగ్రఫీ సెషన్లు, ప్లానెటరీ పెరేడ్, ‘మెస్సియర్ మారథాన్’ పేరుతో చీకటి ఆకాశాన్ని వీక్షించేందుకు మొబైల్ అబ్జర్వేటరీలు నడుస్తున్నాయి. తమిళనాడులో తక్కువ జనసాంద్రత కలిగిన ఏలగిరి కొండలు, ఊటీకి ఖగోళ పర్యాటకం పెరుగుతోంది. లద్ధాఖ్‌కు ప్రత్యేక గుర్తింపు! ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశాల్లో లద్ధాఖ్లోని హన్లే గ్రామం ఒకటి. ఈ ప్రాంతాన్నే ఇటీవల మొట్టమొదటి డార్క్ స్కై రిజర్వ్‌గా ప్రకటించారు. ఇది శీతల ఎడారి ప్రాంతం కావడంతో ఏడాది పొడవునా పొడి వాతావరణంతో ఆకాశంలో పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ క్రమంలోనే పరిశోధనల కోసం రాత్రిపూట ఆకాశాన్ని కాంతి కాలుష్య కారకాల నుంచి పరిరక్షించే దిశగా ప్రత్యేక బృందం కృషి చేస్తోంది. -
భూమి పుట్టుకపై కొత్త ఆధారం
Origin Of The Earth: భూమి అంతర్భాగం (ఎర్త్ కోర్) నుంచి లీకవుతున్న హీలియం వాయువు, భూమి పుట్టుకపై కొత్త ఆధారాలనిస్తోంది. ఎర్త్ కోర్ నుంచి హీలియం3 వాయువు భారీగా లీకవుతున్నట్లు తాజాగా సైంటిస్టులు కనుగొన్నారు. ఈ వాయువు నక్షత్రాల పుట్టుకకు కారణమైన నెబ్యులాలో ఎక్కువగా కనిపిస్తుంది. నెబ్యులా (నక్షత్ర ధూళి)లో హైడ్రోజన్, హీలియం అధికంగా ఉంటాయి. ఇవి క్రమంగా స్వీయ ఆకర్షణకు గురై ధూళి, వాయువులుగా మారతాయి. అనంతరం ఆయా అణువుల మధ్య మరింత ఆకర్షణ పెరిగి ఘనపదార్థ్ధాలుగా మారతాయి. ఘనపదార్థ్ధం సైజు పెరిగే కొద్దీ దాని గ్రావిటీ (గురుత్వాకర్షణ శక్తి) పెరుగుతుంది. మరి భూమి కూడా ఇలాగే ఏర్పడి ఉంటే వాతావరణంలో భారీగా హీలియం ఉండాల్సిఉంటుంది. అయితే 400 కోట్ల సంవత్సరాల క్రితం ఏదో ఒక భారీ అంతరిక్ష శిల భూమిని ఢీకొట్టి ఉంటుందని, అప్పుడు భూవాతావరణంలో మరియు ఉపరితలంలో ఉన్న హీలియం అంతరిక్షంలోకి మాయమై ఉంటుందని సైంటిస్టులు వివరిస్తున్నారు. ఇప్పటికీ ప్రతిఏటా దాదాపు 2 కిలోల హీలియం3 వాయువు భూమి నుంచి లీకవుతోందని చెప్పారు. భూ లోపలి పొరల్లోని ఈ లీకేజీపై మరింత అధ్యయనం జరపాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సోలార్ నెబ్యులా నుంచి పుట్టుక భూ అంతర్భాగంలో హీలియం 3 వాయువు కనిపించడంతో భూమి సోలార్ నెబ్యులా నుంచి పుట్టిందనేందుకు బలమైన ఆధారంగా సైంటిస్టులు పేర్కొన్నారు. కోట్లాది సంవత్సరాల క్రితం భూ ఆవిర్భావం జరిగింది. కానీ అది ఎలా జరిగిందనే విషయమై పలు అంచనాలున్నాయి. తాజా ఆధారంతో బిగ్‌బ్యాంగ్ అనంతరం సూర్యుడి పుట్టుక సందర్భంగా భూమి కూడా ఆవిర్భవించి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హీలియం3 వాయువు నిల్వలు ఇంకా భూమి అంతర్భాగంలో భారీగా ఉండొచ్చని భావిస్తున్నారు. తాజా పరిశోధన వివరాలను జర్నల్ ఏజీయూలో ప్రచురించారు. హీలియం3తో పాటు యురేనియం, థోరియం క్షీణతతో పలు మూలకాలు ఏర్పడి భూమి రూపుదిద్దుకొని ఉండొచ్చని పరిశోధనలో వెల్లడించారు. కేవలం ట్రిటియం అణువు రేడియోధార్మిక క్షీణత వల్ల మాత్రమే హీలియం 3 ఏర్పడుతుంది. నక్షత్ర ధూళిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. – నేషనల్ డెస్క్, సాక్షి. (చదవండి: చర్చల్లో పురోగతి ) -
karnataka: ఆకాశంలో వింత.. ఎగబడ్డ జనం
Straight Line Of Stars In The Sky, శివమొగ్గ: ఆకాశంలో దూరదూరంగా దర్శనమిచ్చే నక్షత్రాలు ఒకే వరుసలో రైలులా వెళ్తున్నట్లు కనిపించడంతో శివమొగ్గవాసులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. సోమవారం రాత్రి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈ ఆకాశ వింత కనువిందు చేసింది. దీంతో తమ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసి మురిసిపోయారు. అవి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తరువాత తెలిసింది ఏమిటంటే అమెరికాకు చెందిన స్టార్‌లింక్ సంస్థ ప్రయోగించిన ఉపగ్రహాలు ఇలా ఆకాశంలో సంచరిస్తున్నట్లు తెలిసి ఔరా అనుకున్నారు. ప్రపంచంలో ప్రతి మూలకూ ఇంటర్నెట్ వసతిని అందించడానికి ఆ సంస్థ ఇటీవల సుమారు 52 శాటిలైట్లను ఒకే వరుసగా అమర్చి ప్రయోగించింది. ఇవి ప్రపంచంలో అన్ని దేశాల మీదుగా సంచరిస్తూ ఉంటాయి. భూమి మీద నుంచి సుమారు 580 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంటాయి. ఏదేమైనా ఈ శాటిలైట్ కొన్ని గంటలపాటు అందరిలో కుతూహలాన్ని నింపింది. చదవండి: (కరుణ ‘నీడ’ ఇక లేరు.. స్టాలిన్ ఘననివాళి) -
ఆకాశంలో నాలుగు చుక్కలు.. గ్రహాంతర వాసులులేనా!?
గ్రహాంతరవాసులు.. ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి మనలో ఏదో తెలియని ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. విశ్వంలో ఏలియన్స్ ఉన్నారని వారికి మనుషుల కంటే అధిక శక్తులు ఉంటాయని, టెక్నాలజీ గురించి కూడా తెలుసని చాలాకాలం నుంచి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రహాంతర వాసులు ఉన్నారా? లేరా? చర్చ ఈనాటిది కాదు. ఎప్పటి నుంచో ఈ విషయంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలువురు తాము అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ (యూఎఫ్ఓ)లను చూశామని ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. అయితే ఒకవేళ నిజంగా ఏలియన్స్ ఆకాశం చక్కర్లు కొడితే.. అవి భూమి మీదికి ఎందుకు రాలేకపోతున్నాయని శాస్త్రవేత్తలు సైతం సందేహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: చైనా దిగ్గజ కంపెనీలో చీకటి యవ్వారాలు.. కామ పిశాచాలపై ‘నో’ యాక్షన్ అయితే తాజాగా.. ఏలియన్స్‌కు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వార్తల్లోకి వచ్చింది. ఆకాశంలో అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ చక్కర్లు కొట్టిన వీడియో ప్రసుత్తం సోషల్ మీడియాలో వైరల్ మారింది. అది ఏలియన్స్ పంపిన యూఎఫ్ఓనా లేదా ఏదైనా ఏయిర్ క్రాఫ్టా? అని చర్చ జరుగుతోంది. అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ అంటే.. ఆకాశంలో ఎగురుతూ కనిపించే గుర్తు తెలియని వస్తువు లేదా ఏలియన్స్ ఫ్లైయింగ్ మిషిన్. ఏదైన ఏయిర్ క్రాఫ్టు లేదా స్పేస్ షిప్‌లు ఆకాశంలోకి ఎగిరినప్పుడు వాటికి సంబంధించిన రాడార్ సిగ్నల్స్ ఉంటాయన్న విషయం తెలిసిందే. అయితే యూఎఫ్ఓ వంటి వాటికి రాడార్ సిగ్నల్స్ ఉండవు. ఇక కొన్ని సార్లు రాడార్లుకు సంబంధించిన సిగ్నల్ కాకుండా వింత మిషన్లు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంటాయి! అయితే వాటివి ఇతర గ్రహాల నుంచి వచ్చిన మిషన్‌గా సైంటిస్టులు భావిస్తుంటారు. భూమిపై నుంచి ఎలాంటి ఫ్లైట్ లేదా స్పేస్ షిప్ గాల్లోకి ఎగిరిగినా అందుకు సంబంధించిన రాడార్ సిగ్నల్స్ ఉంటాయి. పైలెట్స్ వాటిని సులభంగానే గుర్తిస్తారు కూడా. తాజాగా ఓ పైలెట్‌కు ఆకాశంలో వింత ఆకారంలో యూఎఫ్ఓ కనిపించింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా ఓ పైలెట్ విమానంలో ప్రయాణిస్తున్నాడు. కొంత దూరం ప్రయాణించాక నాలుగు చుక్కలు ఒకదాని పక్కన ఒకటి ప్రయాణించిటం గమనించాడు. ఆ దృశ్యాన్ని చూసిన పైలెట్ ఆశ్చర్యానికి గురై తన కెమెరాలో బంధించాడు. కొంత దూరం ప్రయాణించిన ఆ చుక్కలు.. ఒక్కసారిగా అదృశ్యమైపోయాయి. అవి ఏలియన్స్ యూఎఫ్ఓలని నెటిజన్లు సోషల్ మీడియలో కామెంట్లు చేస్తున్నారు. యూఎఫ్‌వోలకు సంబంధించిన పలు వీడియోలు గతంలో చాలా సార్లు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. A pilot claims he saw a fleet of #UFOs over the Pacific Ocean. The video was shot at around 39,000 feet. 🛸👽 The suspected #alien aircraft took the form of ‘weird’ rotating lights moving across the sky. 😳 What are your thoughts on the footage? 👀🤔 pic.twitter.com/N0I2WS2kYq — Chillz TV (@ChillzTV) December 7, 2021 -
నక్షత్రాలు మెరిసేది అందుకేనంట!
మెరుస్తున్న నక్షత్రాలు ఓవైపు.. భూమిపై నగరాల విద్యుత్ ధగధగలు మరోవైపు.. మధ్యలో నారింజ రంగులో వాతావరణం మిలమిలలు.. భూమి, వాతావరణం, అంతరిక్షంలో కాంతులు మూడూ ఒకేచోట కనిపిస్తున్న అరుదైన చిత్రమిది. థామస్ పెస్కెట్ అనే ఫ్రెంచ్ వ్యోమగామి.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి ఈ ఫొటో తీశారు. రాత్రిళ్లు భూమ్మీది విద్యుత్ లైట్ల కాంతులు ఐఎస్ఎస్లోని వారికి స్పష్టంగా కనిపిస్తాయి. అదే నక్షత్రాలు ఎప్పుడూ అలా మెరుస్తూనే ఉంటాయి. చదవండి: ఐన్‌స్టీన్, హాకింగ్‌లకన్నా ఈ చిన్నారి బుర్ర మరింత స్మార్ట్ కానీ భూమి వాతావరణంలో సుమారు 75 కిలోమీటర్ల ఎత్తున ఉండే సోడియం పొర వెలుగులు మాత్రం.. ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే కనిపిస్తాయి. సూర్యుడు, నక్షత్రాల నుంచి వచ్చే కాంతి, రేడియేషన్ ప్రభావం వల్ల.. సోడియం పొర నారింజ రంగులో మెరుస్తుంది. అది ఇలా రాత్రిపూట వెలుగులు విరజిమ్మడం, భూమ్మీది కాంతులు, నక్షత్రాల మెరుపులు జతకూడటం మాత్రం అరుదే. ఇంతేకాదు.. జాగ్రత్తగా గమనిస్తే ఈ నారింజ రంగు పొరపైన సన్నగా ఆకుపచ్చ రంగులో మరోపొరనూ చూడొచ్చు. ఆక్సిజన్ ఆయాన్లతో కూడిన ఈ పొర సౌర రేడియేషన్ కారణంగా.. ఆకుపచ్చ రంగులో మెరుస్తుంది. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్! Co2ను గాల్లోంచి గుంజేసి రాళ్లూరప్పల్లో కలిపేస్తది -
మృత నక్షత్రాల్లో ఘోస్ట్ పార్టికిల్ ఆనవాళ్లు..!
వాషింగ్టన్: అణు నిర్మాణం తెలిసిన వాళ్లకు ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే వీటికన్నా సూక్ష్మమైనవి, కీలకమైనవి పలు అణువుల్లో ఉంటాయని ఆధునిక భౌతిక శాస్త్రం వెల్లడిస్తోంది. ఇలాంటి సూక్ష్మాతిసూక్ష్మ అణువులలో చాలావాటి ఉనికిని గుర్తించడం కూడా జరిగింది. అయితే చాలా దశాబ్దాలుగా భౌతిక శాస్త్రవేత్తలకు అర్థం కాకుండా దాగుడుమూతలు ఆడుతున్న ఒక పార్టికిల్ కోసం అన్వేషణ జరుగుతూనే ఉంది. ఈ అంతుచిక్కని పార్టికిల్‌కు సైంటిస్టులు ముద్దుగా ‘ఘోస్ట్ పార్టికిల్’ అని పేరు పెట్టుకున్నారు. దీని శాస్త్రీయ నామం ‘యాక్జియాన్’. తాజాగా ఈ పార్టికిల్ ఆనవాళ్లు డెడ్ స్టార్స్(మృత నక్షత్రాలు) వెలువరించే ఎక్స్‌రే కిరణాల్లో కనిపించాయి. అమెరికాకు చెందిన చంద్ర టెలిస్కోప్ ద్వారా ఈ ఎక్స్‌రేలను గుర్తించారు. వీటి ఉనికి స్పష్టంగా బయటపడితే విశ్వ రహస్యాల్లో కొన్ని కీలకమైనవాటి గుట్టు బయటపడుతుందని సైంటిస్టులు సంబరపడుతున్నారు. ముఖ్యంగా ‘డార్క్ మ్యాటర్’ గురించి మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు. తాజా పరిశోధన వివరాలు ఫిజికల్ రివ్యూ లెటర్స్‌లో పబ్లిష్ అయ్యాయి. మిన్నిసోటా యూనివర్సిటీకి చెందిన రేమండ్ కో అభిప్రాయం ప్రకారం ’’ యాక్జియాన్స్ ఉనికి గుర్తించడం ఫిజిక్స్‌లో అతిపెద్ద ఘటనల్లో ఒకటి. ఇప్పటివరకు ఇవి ఉన్నాయని మాత్రమే నమ్ముతున్నాం. తొలిసారి వీటి ఉనికి స్పష్టంగా డెడ్స్టార్స్ నుంచి విడుదలయ్యే ఎక్స్‌రేల్లో కనిపించింది. మ్యాగ్నిఫిసెంట్ సెవెన్గా పిలిచే న్యూట్రాన్ స్టార్స్ నుంచి రావాల్సిన మోతాదుకు మించి ఎక్స్‌రే ఉద్ఘాటన గుర్తించారు. ఈ అదనపు ఎక్స్‌రేలు సదరు నక్షత్ర కోర్ భాగంలో ఉన్న యాక్జియాన్స్ వల్ల వచ్చాయని చెప్పవచ్చు’’ అని వివరించారు. న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఢీకొన్నప్పుడు ఈ యాక్జియాన్లు విడుదలవుతాయి. అనంతరం నక్షత్రం నుంచి వెలికి వచ్చినప్పుడు లైట్ పార్టికిల్స్గా మారి ఎక్స్‌రేల రూపంలో బహిర్గతమవుతాయని తాజాగా ఫలితాలు నిరూపిస్తున్నాయి. అయితే సాధారణ లైట్ పార్టికిల్స్ కన్నా యాక్జియాన్లలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. వీటిని 1970ల్లో తొలిసారి ప్రతిపాదించారు. ఇవి ఉన్నాయని నిరూపితమవుతే డార్క్‌మ్యాటర్ కూడా ఉన్నట్లేనని సైంటిస్టులు భావిస్తున్నారు. -
విద్యాశాఖ బలోపేతానికి ‘స్టార్స్’
న్యూఢిల్లీ: పాఠశాల విద్య బలోపేతానికి తీసుకువస్తున్న జాతీయ విద్యా విధానం కింద ‘స్టార్స్’ ప్రాజెక్టుకి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) అమలులో భాగంగా స్ట్రెంథెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్ (స్టార్స్) ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన మంత్రి మండలి ఈ ప్రాజెక్టుకి ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. రూ.5,718 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన స్టార్స్ ప్రాజెక్టుకి ప్రపంచ బ్యాంకు రూ.3,700 కోట్ల ఆర్థిక సాయం అందిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడం, ఉపాధ్యాయుల నాణ్యతా ప్రమాణాలను పెంచి పాఠశాలలు మంచి ఫలితాలు రాబట్టేలా చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ‘‘చదువు అంటే బట్టీ పట్టి రాయడం కాకుండా సబ్జెక్టులపై అవగాహన పెంచుకుంటూ నేర్చుకోవడం అన్న ప్రాతిపదికపైన ఈ విధానాన్ని తీర్చి దిద్దాం’’ అని జవదేకర్ చెప్పారు. విద్యార్థులపై మార్కుల ఒత్తిడి లేకుండా బోధనా పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకు రావడం కోసం ఈ స్టార్స్ ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నట్టు ఆయన చెప్పారు. హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఒడిశాల్లో విద్యా రంగంలో నాణ్యత పెంచడానికి తొలుత కృషి చేయనున్నట్టు చెప్పారు. రూ.520 కోట్ల ప్యాకేజీ.. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌లకు రూ.520 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని కూడా కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలు కశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు లబ్ధి చేకూరేలా చేయడమే కేంద్రం లక్ష్యమని జవదేకర్ చెప్పారు. -
నక్షత్రాలతో సెల్ఫీ కావాలా?
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని... అని పాడుకోవడమే కాదు.. ఇకపై నక్షత్రాలతో సెల్ఫీ కూడా తీసుకోవచ్చు. అంతరిక్షంలోకి టూర్.. జాబిలిపై ఇల్లు... అరుణ గ్రహంపై కాలనీ! తరచూ కనిపించే ఇలాంటి వార్తలను చూసినప్పుడల్లా ఆశ్చర్యంగా అనిపించ వచ్చుగానీ, ఇవన్నీ బాగా డబ్బున్న వారికే సాధ్యమయ్యే పనులని కూడా స్పష్టమైపోతుంది. కోట్లకు కోట్లు పోసి అంతరిక్షానికి అందరూ వెళ్లలేరుగా. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటంటారా? అంతరిక్షంలో ఉన్న ఫీలింగ్ ఇచ్చే సెల్ఫీలు తీసుకోవచ్చు అంటోంది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ! విషయం ఏంటంటే.. స్పీట్జర్ స్పేస్ టెలిస్కోపును ప్రయోగించి 15 ఏళ్లు అవుతున్న సందర్భంగా నాసా ఓ వినూత్నమైన స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది. ఐఫోన్‌తోపాటు ఆండ్రాయిడ్‌కూ అందుబాటులోఉన్న ఈ యాప్‌ను ఓపెన్ చేసి కనిపించే ఫ్రేమ్ మధ్యలో మన ముఖం ఉండేలా చూసుకుని ఫొటో తీసుకుంటే చాలు. అంతరిక్ష వ్యోమగామి స్టైల్లో మన తలకు ఓ హెల్మెట్ అమరిపోతుంది. ఆ తరువాత గత 15 ఏళ్లలో స్పీట్జర్ తీసిన వందలాది అద్భుతమైన నక్షత్ర మండలాలు, అంతరిక్ష ఫొటోల బ్యాక్‌గ్రౌండ్‌తో సెల్ఫీ సిద్ధమైపోతుంది. చిన్న ఇబ్బంది కూడా ఉందండోయ్.. ఈ సెల్ఫీలను నేరుగా ఆప్ ద్వారానే షేర్ చేసుకునే వీల్లేదు. గ్యాలరీలోకి వెళ్లి ఫొటోలు సెలెక్ట్ చేసుకుని సామాజిక మాధ్యమాల్లోకి షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ పేరు ఏంటంటారా? నాసా సెల్ఫీస్ అని ప్లేస్టోర్‌లో సెర్చ్ చేయడమే.. -
నక్షత్రం పేలితే... వాన కురుస్తుంది!
‘‘నదులు, సముద్రాల్లోని నీరు ఆవిరై ఆకాశానికి చేరితే మేఘం ఏర్పడుతుంది.. తగిన పరిస్థితులు ఏర్పడినప్పుడు మేఘం కాస్తా వానగా మళ్లీ భూమిని చేరుతుంది’’. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న విషయం ఇదే. బాగానే ఉందిగానీ.. మరి ‘తగిన’పరిస్థితులు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? ఈ సందేహాలు మీకెప్పుడైనా వచ్చాయా? డెన్మార్క్ శాస్త్రవేత్తలిప్పుడు దీనికో ఆశ్చర్యకరమైన కారణం కనిపెట్టారు. ప్రకృతి గురించి మనకంతా తెలుసుఅనుకునే వారు కూడా ముక్కున వేలేసుకునే ఆ వివరాలేమిటో చూసేయండి మరి! రాత్రిళ్లు ఆకాశానికేసి చూస్తే బోలెడన్ని నక్షత్రాలు కనిపిస్తాయి కదా... వీటిల్లో కొన్ని తమలోని ఇంధనం ఖర్చయిపోవడం వల్ల ఢామ్మని పేలిపోతుంటాయి. సూపర్ నోవా అని పిలిచే ఈ పేలుళ్ల కారణంగా భారీ మొత్తంలో కాస్మిక్ కిరణాలూ వెలువడుతుంటాయి. కోటానుకోట్ల మైళ్ల దూరాలు దాటుకుని భూమిని చేరే ఈ కిరణాలు వాతావరణం పైపొరల్లో మేఘాలు ఏర్పడేందుకు ‘తగిన’పరిస్థితులు కల్పిస్తుంటాయని డెన్మార్క్ శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా తెలుసుకున్నారు. ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదూ.. కొంచెం వివరంగా అర్థం చేసుకుందాం. చల్లటి నీళ్లు ఉన్న గాజుగ్లాసును కాసేపు అలాగే ఉంచితే..గోడలపై గాల్లోని ఆవిరి కాస్తా నీరుగా మారడం మనం గమనించే ఉంటాం. అచ్చం ఇలాంటి ప్రక్రియే ఆకాశంలోనూ జరుగుతుంది. కాకపోతే గాజు గ్లాసుకు బదులుగా అక్కడ ఏరోసాల్స్ ఉంటాయి. దుమ్మూ, ధూళితోపాటు అనేక రకాల రసాయనాల సూక్ష్మ కణాలనే ఏరోసాల్స్ అంటారు. వీటిల్లో కొన్నింటికి పరిసరాల్లోని నీటి ఆవిరిని ఆకర్షించే ప్రత్యేక లక్షణముంటుంది. ఇవే విత్తనాల మాదిరిగా వ్యవహరించి.. మేఘమనే చెట్టు ఎదిగేలా చేస్తాయి. విత్తనాలు ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ మేఘాలు ఏర్పడతాయి. అందుకు తగ్గట్టుగానే వానలూ పడతాయన్నమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. సూపర్నోవాల కారణంగా వెలువడే కాస్మిక్ కిరణాలు వాతావరణం పై పొరల్లో చేసే కొన్ని మార్పుల కారణంగా ఏరోసాల్స్ అధిక మోతాదులో విత్తనాలుగా మారతాయని డెన్మార్క్ శాస్త్రవేత్తలు గుర్తించారు. నీటి ఆవిరితో కూడిన గాజు చాంబర్‌పైకి కాస్మిక్ కిరణాలను ప్రయోగించినప్పుడు ఆవిరి కాస్తా ద్రవంగా మారడం ఎక్కువైందని.. దాదాపు వందసార్లు ఇదే ప్రయోగాన్ని పునరావృతం చేసి.. ఒకే రకమైన ఫలితాలు సాధించామని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. సూర్యుడూ కారణమే... వాతావరణం పై పొరలను తాకే కాస్మిక్ కిరణాల మోతాదు మన సూర్యుడిపై చర్యల ఆధారంగా ఉంటాయని డెన్మార్క్ శాస్త్రవేత్తలు అంటున్నారు. దాదాపు దశాబ్ద కాలంపాటు సూర్యుడిపై పేలుళ్లు పెరగడం.. ఆ తరువాత పదేళ్లు తగ్గుతుండటం మనకు తెలిసిందే. దీని కారణంగా సూర్యుడి విద్యుదయస్కాంత క్షేత్ర తీవ్రతలోనూ తేడాలొస్తాయి. తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ కాస్మిక్ కిరణాలు మేఘాలున్న ప్రాంతానికి చేరతాయి... ఎక్కువైనప్పుడు తక్కువవుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే భూమ్మీద పదేళ్లపాటు మేఘాలు ఏర్పడటం కొంచెం ఎక్కువగా ఉండి.. ఉష్ణోగ్రతలు పడిపోతే... మరో పదేళ్లపాటు పెరుగుతూ ఉంటాయన్నమాట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఉష్ణోగ్రతలు అతితక్కువ స్థాయికి చేరిన విషయం తెలిసిందే. 2008 నుంచి సూర్యుడిపై పేలుళ్ల వంటివి క్రమేపీ మందగిస్తున్నట్లు నాసా రికార్డులు చెబుతుండటం ఇక్కడ గమనార్హం. ఏమిటి దీని ప్రాముఖ్యత? నక్షత్రాల పేలుళ్లు... సూర్యుడి అయస్కాంత క్షేత్ర తీవ్రతలకు.. మేఘాలు ఏర్పడేందుకు మధ్య సంబంధం ఉందన్నది ఇప్పటివరకూ తెలియని విషయం. చరిత్రను తిరగేసినా.. సూర్యుడిపై చర్యలకు అనుగుణంగానే భూమ్మీద ఉష్ణోగ్రతలు, వానల్లో మార్పులు వచ్చిన విషయం స్పష్టమవుతుంది. మానవ చర్యల కారణంగా భూమి క్రమేపీ వేడెక్కుతోందని... పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి ఇది 3.6 డిగ్రీలకు చేరుకుని వాతావరణ మార్పులతో మానవ మనుగడ కష్టమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో డెన్మార్క్ శాస్త్రవేత్తల ప్రయోగానికి ప్రాముఖ్యత ఏర్పడింది. గత పదివేల ఏళ్లలో భూమి సగటు ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల కంటే ఎక్కువ స్థాయికి చేరుకున్న సందర్భాలు అనేకమున్నాయని.. ఇవన్నీ సూర్యుడిపై జరిగే చర్యలు.. తద్వారా కాస్మిక్ కిరణాల మోతాదుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడటం వల్లనేనని వీరు అంచనా వేస్తున్నారు. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో? – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సినిమా కష్టాలు
-
విశ్వంలో మరో గ్రహవ్యవస్థ..
వాషింగ్టన్: రెండు నక్షత్రాలు, మూడు భారీ గ్రహాలతో కూడిన సరికొత్త గ్రహ వ్యవస్థను కార్నెగీ ఇన్స్టిట్యూషన్ ఫర్ సైన్స్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ గ్రహ వ్యవస్థ ఆవిష్కరణ ద్వారా మన సౌర కుటుంబం పుట్టుక, పరిణామానికి సంబంధించి మరింత సమాచారం లభించనుందని, భవిష్యత్‌లో భూమిని పోలిన గ్రహాలను గుర్తించడంలోనూ ఉపయోగపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. మన సూర్యుడిని పోలిన నక్షత్రాలు రెండు ఉన్న గ్రహ వ్యవస్థలు విశ్వంలో చాలా ఉన్నాయి. అయితే కొత్తగా గుర్తించిన వ్యవస్థ తాలూకూ నక్షత్రాలు కేవలం 360 ఆస్ట్రనామికల్ యూనిట్స్ (భూమి నుంచి సూర్యుడికి ఉన్న దూరం ఒక ఆస్ట్రనామికల్ యూనిట్) అంతరం మాత్రమే ఉండటం విశేషం. మిగిలిన నక్షత్రాల మాదిరిగా వీటిల్లో ఇనుము, ఆక్సిజన్ వంటివి లేవు. అధిక భాగం హైడ్రోజన్, హీలియం వాయువులే ఉన్నాయి. గురుగ్రహం పరిమాణంలో సగం ఉన్న ఒకటి, ఒకటిన్నర రెట్లు ఉన్న మరో గ్రహం నక్షత్రం చుట్టూ తిరుగుతుంటే.. దాదాపు 2.5 రెట్లు ఎక్కువ సైజున్న గ్రహం రెండో నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఏర్పడిన తొలి నాళ్లలోనే ఈ నక్షత్రాలు తమ పరిసరాల్లోని చిన్న చిన్న గ్రహాలను తనలోకి లాగేసుకుని ఉంటుందని జొవానా టెస్కే చెబుతున్నారు. -
స్టార్స్‌కి ఆ సత్తా లేదా?
- దాసరి ‘‘చిన్న చిత్రాలకు ఆడియో, ప్రమోషన్ ఫంక్షన్స్ అవసరం. పెద్ద చిత్రాలకు వాటితో పనిలేదు. సినిమా విడుదలకు ముందే ఆడియో ఫంక్షన్స్, ట్రైలర్స్, కొన్ని సీన్స్ విడుదల చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నారు. విడుదలయ్యాక ఆ అంచనాలు రీచ్ కాలేక ఇటీవల చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పెద్ద చిత్రాలకు ప్రమోషన్స్ ఎందుకు? థియేటర్లకు ప్రేక్షకులను రప్పించే సత్తా స్టార్స్‌కు లేదా? సినిమా ఫ్లాప్ అయితే హీరోలు తిరిగి డబ్బులు చెల్లించే పరిస్థితి వస్తోంది. సినిమా విడుదలకు ముందు ఎటువంటి ఫంక్షన్స్ చేయొద్దని పెద్ద చిత్రాల నిర్మాతలను కోరుకుంటున్నా. కొత్తవారితో తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అని దాసరి నారాయణరావు అన్నారు. సమర్, అక్షిత, కిమయ ప్రధానపాత్రల్లో గుండేటి సతీష్ కుమార్ దర్శకత్వంలో పేర్ల ప్రభాకర్, తౌట గోపాల్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కొత్త కొత్తగా ఉన్నది’. వంశీ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని దాసరి ఆవిష్కరించి తెలంగాణ సాంస్కృతికశాఖ చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు అందించారు. ఈ సందర్భంగా నిర్మాత సి. కల్యాణ్ మాట్లాడుతూ- ‘‘రంగస్థల నటుడైన ప్రభాకర్‌గారు నిర్మాతగా మారడం అభినందనీయం. సతీష్ కథపై ఎంతో నమ్మకంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు’’ అన్నారు. ‘‘మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలనే కోరిక ఈ చిత్రంతో తీరింది’’ అని నిర్మాతలు చెప్పారు. -
పొడవాటి గౌన్లు.. హొయలొలికించిన భామలు
అమెరికాః ఫ్యాషన్ ప్రపంచం రోజురోజుకూ విస్తరిస్తోంది. డిజైనర్లు విభిన్న రీతులను ప్రదర్శించడంలో తమ ప్రతిభను అత్యద్భుతంగా చాటుతున్నారు. ఇటీవల ప్రారంభమైన మెట్ గాలా ఫ్యాషన్ పెరేడ్ అందుకు తార్కాణంగా నిలిచింది. అందమైన పొడవాటి గౌన్లు ధరించి, ఎర్రతివాచీపై ఒయ్యారాలొలికించిన మోడల్స్ సందర్శకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఫ్యాషన్ కు మరోపేరైన మెట్ గాలా 2016 సంబరాలు అమెరికాలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి హాలీవుడ్ నటీనటులు, ఫ్యాషన్ డిజైనర్లు అనేకమంది హాజరయ్యారు. విలక్షణమైన డిజైన్లతో కూడిన విభిన్న దుస్తులు ధరించిన సెలబ్రిటీలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నారు. ప్రతియేటా మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ సంస్థకు నిధులు సేకరించేందుకు ఈ మెట్ గాలా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కార్యక్రమంలో ఫ్యాషన్ ప్రముఖ మోడల్స్ తో పాటు, నటీనటులు కూడ స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొస్తారు. ఈసారి కార్యక్రమం ప్రారంభోత్సవంలో హాలీవుడ్ తారలు ప్రత్యేకాకర్షణగా నిలిచారు. ఫ్యాషన్ పెరేడ్ లో పాల్గొన్న మోడల్స్... తమ దుస్తుల డిజైన్లలో ఒక్కోరు ఒక్కో ప్రత్యేకతను ప్రదర్శించారు. మినీలూయిస్ విట్టన్, మెటాలిక్ రబ్బరు గివెన్సీ గౌన్లు, అద్దకాలతో కూడిన లేజర్ కట్ యాక్రిలిక్స్, షిఫాన్ బుర్బెర్రీ దుస్తులతోపాటు... గొలుసులతో అల్లినట్లుగా కనిపించే చెయిన్ మెయిల్ బాల్మెయిన్ వంటి అనేక రకాల అదరగొట్టే డిజైన్లను ధరించిన మోడల్స్ ర్యాంప్ పై హొయలొలికించారు. ఫ్యాషన్ షోలో తన ఫేరీ టేల్ దుస్తులతో విభిన్నతను చాటిన క్లారీ డేన్స్ ప్రత్యేకతగా నిలువగా, కెన్డాల్ జెన్నర్ ఫ్యాషన్ ప్రపంచాన్ని తన దుస్తులతో విభిన్నంగా చూపారు. జిగి, జాయిన్ లు రోబో కాప్ లుక్ తో మెట్ గాలా బెస్ట్ కపుల్ గా గుర్తింపు పొందారు. -
కూల్ గురూ!
సమ్మర్ ధమాకా అదివారం హాయి హాయిగా గడిచిపోయింది. సోమవారం తరుముకొచ్చేసింది. మళ్లీ ఆరు రోజుల పాటు ఆఫీస్. ఒకపక్క ఎండలు మండిపోతుంటే కాలు బయటపెట్టాలంటే ఒళ్లు మండిపోతుందని భయం అనుకుంటూ టీవీ ఆన్ చేసింది ఆ టీనేజ్ గాళ్. తెరపై కాజల్ అగర్వాల్ తళుక్కుమంది. ఓ యాడ్‌లో మెరిసిపోయింది. ఆ.. ఏముందిలే? ఎంచక్కా మేకప్ వేసుకుని ఉంటుంది. ఆ మేకప్ చెరిగిపోకుండా పక్కనే టచప్ చేయడానికి పర్సనల్ అసిస్టెంట్లు ఓ ముగ్గురైనా ఉంటారనుకుంది ఆ అమ్మాయి. అంతలోనే సమ్మర్‌కి స్టార్స్ అయినా ఒకటే.., కామన్ పీపుల్ అయినా ఒకటే కదా.. పైగా స్టార్స్ ఎప్పుడూ అందంగానే కనిపించాలాయె. మరి.. సమ్మర్లో అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తారో? ఏమో అనుకుంది. సరిగ్గా ఈ విషయాన్నే కాజల్ అగర్వాల్ ముందుంచింది ‘సాక్షి’. సమ్మర్లో అందాన్ని కాపాడుకోవడానికి మీరేం చేస్తారో చెప్పడంతో పాటు కొన్ని టిప్స్ కూడా ఇవ్వండి అంటే.. ‘కూల్ గురూ’ అంటూ కాజల్ అగర్వాల్ చక్రాల్లాంటి కళ్లు తిప్పుకుంటూ టకా టకా చెప్పేసింది. * ఈసారి ఎండలు బాగానే ఉన్నాయి. హీరోయిన్ అయిన ఈ తొమ్మిదేళ్లల్లో ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఇంత ఎండలను నేను దాదాపు చూడలేదు. అలాగని షూటింగ్ లేకపోతే బాగుంటుందనుకోవడం లేదు. ఏ సీజన్ అయినా నాకు నో ప్రాబ్లమ్. చేతినిండా పని ఉంటే చాలు. కానీ, సీజన్‌కి తగ్గట్టుగా లైఫ్‌స్టైల్‌ని కొంత మార్చుకుంటా. * సమ్మర్, వింటర్ ఏ సీజన్‌కైనా అలోవెరా బెస్ట్. ఆ గుజ్జుని ఒంటికి పట్టించుకుని స్నానం చేస్తే ఎండకు కమిలిపోయిన చర్మానికి పూర్వ నిగారింపు వచ్చేస్తుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములతో పోల్చితే ఇంట్లోనే పెంచుకోవడానికి వీలైన అలోవెరా బెస్ట్. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా నేను విటమిన్ సి సీరమ్ కూడా ఉపయోగిస్తా. అందుకే నా చర్మం ఎప్పుడూ మెరుస్తూ ఉంటుంది. * ఏదైనా క్రీములు వాడాలనిపిస్తే ఫ్రూట్ మాయిశ్చరైజర్స్ వాడండి. నేను వాటినే ప్రిఫర్ చేస్తాను. కెమికల్ క్రీమ్స్‌తో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లోనైనా ఇబ్బందే. అందుకే వాటి జోలికి మాత్రం వెళ్లను. ముఖ్యంగా కోకోనట్‌తో చేసిన మాయిశ్చరైజర్స్‌ను వాడితే రోజంతా ఫ్రెష్‌గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. * వేసవిలో బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్‌ను కచ్చితంగా ఒంటికి పట్టించండి. అలాగే వీలైనంతగా ఒంటిని కవర్ చేసుకుని వెళ్లండి. ఎందుకంటే డెరైక్ట్‌గా సూర్యకిరణాలు శరీరాన్ని తాకితే చర్మం కమిలిపోయే ప్రమాదం ఉంది. * ఈ సీన్లో కాటన్ దుస్తులు హాయిగా ఉంటాయి. షూటింగ్స్‌లో సీన్‌కి అనుగుణంగా డ్రెస్సులు వాడతాం కాబట్టి, మెటీరియల్ సెలక్ట్ చేసుకునే వీలుండదు. అందుకే విడిగా మాత్రం కాటన్ దుస్తులు వాడతాను. వదులుగా ఉండేవి సెలక్ట్ చేసుకుంటాను. * వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగండి. ఎక్కడికెళ్లినా చేతిలో ఓ నీళ్ల బాటిల్ మాత్రం తప్పనిసరిగా ఉంచుకోండి. రోజుకు కనీసం రెండుసార్లయినా కొబ్బరినీళ్లు తాగండి. అలాగే మజ్జిగ మాత్రం మిస్ కాకండి. * ఈ వేసవిలో మన శరీరానికి బాగా చల్లదనాన్ని ఇచ్చేవాటిలో ఫ్రూట్స్‌కి ప్రధాన స్థానం ఇవ్వాలి. అందుకే పండ్ల రసాలు బాగా తాగండి. * సమ్మర్లో దుమ్ము బాగా ఉంటుంది. ఆ దుమ్ము ఎంచక్కా కూరగాయాల మీద సెటిలైపోతుంది. అందుకే వండే ముందు బాగా కడగండి. ఉప్పు నీటిలో కడిగితే ఇంకా బెస్ట్. * వేసవిలో చాలా మంది భయపడేది వడదెబ్బకే. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు నెత్తి మీద టోపీ, కళ్లకు కూలింగ్ గ్లాసస్ పెట్టుకోవాలి. * చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సమ్మర్‌ని హాయిగా సాగనంపేయొచ్చు. మరి... వింటర్లో ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ప్రస్తుతానికి సమ్మర్లో తగినంత కేర్ తీసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం. -
సూర్యుడు ‘చిన్న’బోయాడు!
లండన్: సూర్యుడితో పోల్చి చూస్తే భూమి పరిమాణం గోలీ అంత.. అవునా? మరి మన సూర్యుడు కూడా గోలీ పరిమాణమంత కనిపిస్తే. ఇదేంటనుకుంటున్నారా..? సూర్యుడి కన్నా వంద రెట్లకు పైగా పెద్దవిగా ఉన్న 9 నక్షత్రాలను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. నాసా స్పేస్ టెలిస్కోప్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ సాయంతో సూర్యుడికి 1,70,000 కాంతి సంవత్సరాల దూరంలో ఓ భారీ నక్షత్రాల సముదాయం ఉన్నట్లు కనుగొన్నారు. ఆ సముదాయాన్ని ఆర్136గా గుర్తించారు. ఆ తొమ్మిది నక్షత్రాలు భారీగా ఉన్నాయని, వేడిని ప్రసరిస్తూ ప్రకాశిస్తున్నాయని తెలిపారు. సూర్యుడి కన్నా 50 రెట్లు పెద్ద నక్షత్రాలు డజన్లకొద్దీ ఉన్నాయని, అయితే 9 మాత్రం సూర్యుడికి 100 రెట్లకన్నా పెద్దవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం విశ్వంలో అతిపెద్ద నక్షత్రంగా ఆర్136ఏ1 ఉందని, అది సూర్యుడికి 250 రెట్లు పెద్దదిగా ఉంటుందని చెప్పారు. ఒక నెలకు మన భూమి పరిమాణమంత మెటీరియల్‌ను అవి కోల్పోతాయని, భారీగా బరువు తగ్గిపోతుండటం మూలంగా వాటి జీవితకాలం తక్కువని యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ షెఫ్ఫీల్డ్‌కు చెందిన పరిశోధకుడు పౌల్ క్రౌతెర్ తెలిపారు. -
గురుత్వ తరంగం ఏమిటి?
వందేళ్ల క్రితం ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన గురుత్వ తరంగాలు బ్లాక్‌హోల్స్ గుట్టు రట్టు చేయడంతో పాటు కీలక సమాచారాన్ని అందించనున్నాయి. దీంతో విశ్వ ఆవిర్భావ రహస్యాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. గురుత్వ తరంగాల ప్రయోగం తీరుతెన్నులు క్లుప్తంగా.. రబ్బరు షీట్‌ను తీసుకోండి.. గాల్లో వేలాడేలా నాలుగువైపులా పట్టుకోండి. పది కిలోల బరువున్న గుండును దాని మధ్యలో ఉంచారనుకోండి. ఏమవుతుంది? గుండు బరువుకు షీట్ వంగిపోతుంది. ఆ ప్రాంతంలో ఓ గుంతలాంటిది ఏర్పడుతుంది. ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతంతో చెప్పిందీ ఇదే! కాలం, ప్రదేశాల కూర్పు రబ్బరుషీటైతే... ద్రవ్యరాశి అధికంగా ఉన్న గ్రహాలు, నక్షత్రాలు అన్నీ ఇనుప గుళ్లన్నమాట! కాలం ప్రదేశాలు రెండూ వంపునకు గురైతే దాన్నే గురుత్వశక్తి అంటారని ఆయన చెప్పారు. ఇంతకీ ఈ సోది అంతా ఇప్పుడెందుకని అనుకుంటున్నారా? ఈ గురుత్వ శక్తి తాలూకూ తరంగలను శాస్త్రవేత్తలు తొలిసారి గుర్తించారన్న వార్తలు మీరు చదివే ఉంటారు కదా... అందుకన్నమాట! ఈ గురుత్వ తరంగాలేమిటి? అవి ఎలా ఏర్పడతాయి? వీటిని గుర్తించేందుకు చేసిన ప్రయోగం ఏమిటి? మొత్తమ్మీద అసలీ ప్రయోగంతో మనకు ఒరిగేదేమిటి? అన్న విషయాలను తెలుసుకుంటే.... గురుత్వ తరంగాలు పుట్టేదిలా.. ద్రవ్యరాశి ఉన్న చోట కాలం, అంతరిక్షం వంపునకు గురవుతాయని చెప్పుకున్నాం కదా... ద్రవ్యరాశిని బట్టి ఈ వంపులో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. పైన చెప్పుకున్న ప్రయోగంలో పదికిలోల ఇనుప గుండు ఉండగానే.... మరో అరకిలో గుండును రబ్బరుషీట్ ఓ చివర వదిలితే ఏమవుతుంది? బరువు తక్కువున్న గుండు నెమ్మదిగానైనా పెద్ద గుండు వద్దకు చేరుకుంటుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నా.... గ్రహాలన్నీ సూర్యుడి (సౌరకుటుంబంలో అత్యధిక ద్రవ్యరాశి ఉన్న ఖగోళ వస్తువు) ఇదే కారణం. మరి... సూర్యుడకి కొన్ని రెట్లు ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న కృష్ణ బిలాలు... అవికూడా కొంచెం దగ్గరదగ్గరా ఉంటే? ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటూ ఉంటాయి. వికర్షించుకుంటూ ఉంటాయి కూడా. ఫలితంగా వీటి చుట్టూ ఉన్న కాల, ప్రదేశాల వంపులో తేడాలు వచ్చేస్తాయి. నిశ్చలంగా ఉన్న నీటిలో అకస్మాత్తుగా ఓ గులకరాయిలో పడితే పుట్టే అలల మాదిరిగా గురుత్వ తరంగాలు పుడతాయి. కృష్ణబిలాల ఆకర్షణ, వికర్షణలతోపాటు ఇంధనం ఖర్చయిపోయిన నక్షత్రాలు పేలిపోయినప్పుడు (సూపర్నోవే), ఈ విశ్వం ఆవిర్భావానికి కారణమైన మహా విస్ఫోటం వంటి అనేక సంఘటనల ద్వారా గురుత్వ తరంగాలు పుట్టి... విశ్వమంతా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. లిగో శాస్త్రవేత్తలు గుర్తించింది రెండు కృష్ణబిలాలు లయమైపోవడం వల్ల పుట్టిన తరంగాలనే! ఈ తరంగాలు విశ్వమంతా వ్యాపిస్తూ... అక్కడి కాలం, ప్రదేశాల వంపును కూడా మారుస్తూంటాయి. మన భూమినే తీసుకుంటే ఈ గురుత్వ తరంగాల కారణంగా ఇది అతిసూక్ష్మ స్థాయుల్లో సంకోచ, వ్యాకోచాలకు గురవుతూంటుంది. గుర్తించింది ఇలా.. పైన చెప్పుకున్న రబ్బరు షీట్ ఉదాహరణనే తీసుకుందాం. ఈ రబ్బరుషీట్పై ఇద్దరు వ్యక్తులు కొంచెం ఎడంగా నిలబడి ఉన్నట్లు ఊహించుకోండి. ఇద్దరి మధ్య దూరాన్ని కొలవాలంటే... రబ్బరుషీట్పై ఏదైనా గుర్తులు ఉంచుకుని (కిలోమీటర్ రాయి వంటివి) లెక్కించవచ్చు. అయితే గురుత్వ తరంగాల ప్రభావంతో రబ్బరు షీట్ కూడా సంకోచ, వ్యాకోచాలకు గురవుతూంటుంది కాబట్టి ఇద్దరి మధ్య దూరం కూడా మారుతూంటుంది. మార్పులు ఉన్నట్లు నిర్ధారణైతే ఐన్‌స్టీన్ ప్రతిపాదించింది కరెక్టేనని చెప్పవచ్చు. లిగో ప్రయోగం ద్వారా సాధించింది కూడా ఇదే! లిగో ప్రయోగంలో రెండు ప్రాంతాల్లో దాదాపు నాలుగు కిలోమీటర్ల పొడవైన గొట్టాలను ఉపయోగించారు. ఎల్ ఆకారంలో ఉన్న ఈ గొట్టాల్లో ఒకటి భూమి తాలూకూ సంకోచాన్ని, మరొకటి వ్యాకోచాన్ని గుర్తించిందన్నమాట. లేజర్ కాంతి కిరణం గొట్టం ఒక చివరి నుంచి మరో చివరకు చేరేందుకు పట్టిన సమయాన్నిబట్టి దూరాన్ని లెక్కించారు. గురుత్వ తరంగాలు ఢీకొన్నప్పుడు ఈ దూరంలో తేడాలు వచ్చినట్లు గుర్తించారు. తద్వారా గురుత్వ తరంగాలు ఉన్నట్లు నిర్ధారించారు. - సాక్షి, హైదరాబాద్ ప్రయోజనం? విశ్వం ఆవిర్బావం మొదలుకొని అనేక ఖగోళ విషయాలను కొత్త కోణంలో అర్థం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటివరకూ మనం రేడియో తరంగాల ద్వారా మాత్రమే విశ్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మహా విస్ఫోటం తరువాత విశ్వం ఎలా విస్తరించిందన్న విషయంతోపాటు, కృష్ణబిలాలను అర్థం చేసుకునేందుకు, లిగో ప్రయోగం కోసం అభివృద్ధి చేసిన టెక్నాలజీలు కొన్ని సాధారణ ప్రజలకూ ఉపయోగపడేవే. -
నేలకు దిగిన నక్షత్రాలు
యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ ఫలాలతో నిండి, యేసు చుట్టూ తిరుగుతూ నృత్యం చేశాయట. పక్షులు, పువ్వులు కూడా ఈ ఆనందలో పాలు పంచుకున్నాయట. ఆ సందడి చూసి ఆకాశం లోని చుక్కలు నేలకు దిగి వచ్చి వెలుగులు విరజిమ్మాయట. కానీ ‘ఫర్ ట్రీ’ (క్రిస్మస్ ట్రీ) అనే చెట్టు దిగులుగా కనిపించిందట. ఇది గమనించిన చుక్కలు ఆ చెట్టుని ‘ఎందుకు దిగులుగా ఉన్నావు?’ అని ప్రశ్నించాయి. ‘‘ఆ చెట్లకేమో ఫలాలున్నాయి. ఈ మొక్కలకేమో పువ్వులు ఉన్నాయి. అందుకే అవి అందంగా ఉన్నాయి. ఫలాలు, పువ్వులు లేని నేను ఎలా సంబరాలు జరుపుకుంటాను?’’ అందట దిగులుగా. నక్షత్రాలు జాలి పడి తమ అందం, తేజస్సుతో ఆ చెట్టును నింపి ఆ సంబరంలో దాన్నో ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయట. ఇది చాలా ప్రాంతాల్లో చెప్పుకునే కథ. అయితే క్రీస్తు పుట్టిన సమయంలో ఆకాశంలో ఓ కొత్త తార పుట్టి, అది గొర్రెల కాపరులకు, ముగ్గురు జ్ఞానులకు ఆయన దగ్గరకు వెళ్లే దారి చూపించిందని బైబిల్ చెబుతోంది. దానికి గుర్తుగానే ఇంటి వద్ద స్టార్ పెట్టడం, క్రిస్మస్ ట్రీకి కూడా స్టార్స్ తగిలించడం జరుగు తోందనేది అందరి నమ్మకం. -
సినీ తారలంటూ హైటెక్ వ్యభిచారం
బీజింగ్: సోషల్ మీడియాను ఉపయోగించుకుని హైటెక్ పద్ధతుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను చైనా పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 1000 మందికి పైగా సెక్స్ వర్కర్ల ఫొటోలను మోడల్స్, సినీ తారలుగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. గత మార్చి నుంచి 103 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ పబ్లిక్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. హాంకాంగ్ సరిహద్దుల్లోని షెంజెన్ నగరం కేంద్రంగా నెట్వర్క్ సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ యాప్ ద్వారా సెక్స్ వర్కర్ల ఫొటోలు, వారి సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏజెంట్ల ద్వారా వ్యభిచార కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సెక్స్ వర్కర్లను మోడల్స్, సినీ తారలుగా నమ్మబలికి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
జయప్రద కుమారుడి వివాహ విందులో తారల సందడి
-
గాత్రదాత.. సుఖీభవ
సిటీలోని డబ్బింగ్ స్టూడియోలు స్టార్స్‌తో కళకళలాడుతున్నాయి. పెద్ద హీరోలు, ఎంతో బిజీగా ఉండే స్టార్స్ సైతం డబ్బింగ్ చెప్పేందుకు సరదా పడుతుండడమే దీనికి కారణం. టాలీవుడ్లో కొత్తగా వేళ్లూనుకుంటున్న ఈ ట్రెండ్ ఓవైపు డబ్బింగ్ ఆర్ట్‌కు స్టార్ హోదా ఇస్తూనే మరోవైపు ఇతర భాషల హీరోలకు గాత్రదాతల కొరతను తీరుస్తోంది. - శిరీష చల్లపల్లి టాలీవుడ్ సినిమాలతో వచ్చే క్రేజ్ అంత ఇంత కాదు. అందుకే భాషా ప్రావీణ్యం లేకపోయిన ఇతర భాష హీరోలు సైతం తెలుగులో నటించాలని ఇష్టపడుతుంటారు. లేదా కనీసం తమ సినిమాలు తెలుగులో అనువాదం కావాలని ఆశిస్తుంటారు. అన్యభాషా చిత్రాలు తెలుగులోకి అనువాదమైనప్పుడు ఆ హీరో ఆకారాన్ని, బాడీ లాంగ్వేజ్‌ని బట్టి సరిపడే వాయిస్ ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్‌ని అతి కష్టం మీద వెతికి పట్టుకుంటుంటారు డెరైక్టర్లు. ఫుల్ హ్యాపీ ‘ప్రేమలీల’ సినిమా కోసం సల్మాన్‌ఖాన్‌కి డబ్బింగ్ చెప్పాలని అడిగినప్పుడు, నా వాయిస్ ఆయన పర్సనాలిటీకి , పాత్రకు హైలైట్ అవుతుందని చెప్పినప్పుడు హ్యాపీగా ఒప్పేసుకున్నాను. నా మీద నమ్మకముంచి, ఇలాంటి ఒక ప్రయోగం నాతో చేయించినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. - రామ్‌చరణ్ (ట్వీటర్ ద్వారా) అన్ని కళల్లోనూ ప్రూవ్ చేసుకోవాలి సైజ్ జీరో సినిమా కోసం తమిళ్ టాప్ హీరో ఆర్యకు డబ్బింగ్ చెప్పాలని అడిగినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇన్నాళ్లు ఒక హీరోగా నిలబడేందుకు నా వంతు కృషి చేస్తున్నాను. అయితే నాకంటూ ఒక మంచి గుర్తింపు రావడానికి, ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి నాలో ఉన్న విభిన్న రకాల టాలెంట్లను ప్రూవ్ చేసుకోవ డం అవసరమే. నాలోని ఒక కొత్త కళను గుర్తించి ఆర్య లాంటి పెద్ద హీరోకు డబ్ చెప్పమనడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ప్రయో గాలకు నేను ఎప్పుడూ రెడీనే. - నందు ఫస్ట్ అండ్ బెస్ట్ ఛాన్స్ మొట్టమొదటి సారిగా వేరొక నటుడికి నా వాయిస్ ఇవ్వాలని డెరైక్టర్ మణిరత్నం గారి నుంచి కాల్ వచ్చినప్పుడు చాలా ఎగ్జయిట్ అయ్యాను. తెలుగు దనం మిస్ కాని వాయిస్ కాబట్టే నన్ను సెలెక్ట్ చేశారని చెప్పడంతో మరింత థ్రిల్‌గా ఫీల్ అయ్యాను. పైగా మణిరత్నం లాంటి లెజెండ్ మూవీలో ఏదో రకమైన అవకాశం వస్తే ఎలా కాదనగలను.. సో వెంటనే ఒప్పేసుకున్నా. ఓ కొత్త ప్రయోగం చేసినందుకు సంతోషంగా కూడా ఉంది. - నాని స్టార్స్‌లోనూ డబ్బింగ్ క్రేజ్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో పెద్ద హీరోలు సైతం డబ్బింగ్ చెప్పడాన్ని క్రేజీగా ఫీల్ అవుతున్నారు. ఉదాహరణకి ‘ఓకే బంగారం ’ సినిమాలో హీరోగా చేసిన మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ స్వతహాగా తమిళ్, మలయాళం భాషల్లో ప్రావీణ్యుడు. తెలుగు భాషా నైపుణ్యం లేకపోవడంతో దుల్కర్‌కి మన తెలుగు హీరో నాని మొదటి సారిగా డబ్బింగ్ చెప్పారు. అదే విధంగా సైజ్ జీరో చిత్రంలో హీరో ఆర్యకు నందు చెబితే, తాజాగా విడుదలైన సల్మాన్‌ఖాన్ డబ్బింగ్ చిత్రం ‘ప్రేమలీల’లో ఆయన పాత్రకు రామ్‌చరణ్ డబ్బింగ్ చెప్పడంతో.. ఈ డబ్బింగ్ ట్రెండ్‌కి స్టార్ స్టేటస్ స్థిరపడినట్టయింది. దీంతో మరింత మంది హీరోలు నిస్సంకోచంగా డబ్బింగ్‌కు సై అంటున్నారు. -
బాలీవుడ్ స్టార్లు షాకయ్యారు!
ముంబై: తాజాగా సంభవించిన భూకంపంతో బాలీవుడ్ స్టార్లు దిగ్భ్రాంతి చెందారు. అఫ్గానిస్థాన్, పాకిస్థాన్‌తోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న భూకంపం ప్రభావాన్ని తాము కూడా ఎదుర్కొన్నమంటూ పలువురు సినీతారలు పేర్కొన్నారు. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు వివేక్ ఒబ్రరాయ్, ప్రీతి జింతా, రణ్వీర్ షోరెయ్, అలీ జఫర్ తదితరులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఈ విషయమై స్పందించారు. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతతో నమోదైన భూకంపం ఘటనపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎవరేమన్నారంటే.. వివేక్ ఒబెరాయ్: అహ్మదాబాద్‌లో ఇప్పుడే భూకంపాన్ని చవిచూశా. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఆశిస్తున్నా. మేమున్న హోటల్ మొత్తం ఊగిపోయింది. అలీ జఫర్: నాకు అనుభవంలోకి వచ్చిన అత్యంత తీవ్రమైన భూకంపం ఇది. రణ్వీర్ షోరెయ్: భూకంపం ప్రభావ ప్రాంతాల్లో ఉన్నవారి క్షేమం కోసం ప్రార్థిస్తున్నా. సురక్షితంగా ఉండండి. అద్నాన్ సమీ: భూకంపం వల్ల ప్రభావితమైన వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. దేవుడి సంరక్షణలో అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రీతిజింతా: ఓ మై గాడ్: భూకంపం వచ్చింది. నెహా ధూపియా: భూకంపం గురించి వార్తలు వస్తున్నాయి. చాలా ఆందోళనగా ఉంది. మీరు, మీ ఆప్తులు అందరూ క్షేమంగా ఉన్నారని తలుస్తున్నా. -
నక్షత్రాలు పూచే దారిలో...
విహంగం ‘కవిత్వం కాగితాల మీదే కనిపిస్తుంది అని అనుకుంటాం గానీ... ఎక్కడైనా కనిపిస్తుంది’ అంటాడు ప్రసిద్ధ చిత్రకారుడు విన్సెంట్ వాంగో. ఆయనన్న ఆ మాట డచ్ ఆర్టిస్ట్, డిజైనర్ డాన్ రూసేగార్డెకు ఇష్టం. అలాగే ఆయన పెయింటింగ్స్ అంటే కూడా. వాంగో పెయింటింగ్‌లో కలర్స్ మాత్రమే కాదు... కవిత్వం కూడా ఉంటుంది! కవిత్వం అంటే సౌందర్యం! ఆ సౌందర్యాన్ని ఎక్కడంటే అక్కడ చూసే వీలున్నప్పుడు... రోడ్డు మీద మాత్రం ఎందుకు చూడకూడదు అనుకున్నాడు రూసేగార్డే ఒక రాత్రి రోడ్డు మీద ప్రయాణిస్తూ. అప్పుడు అతని ఆలోచనల్లో నుంచి పుట్టిందే ‘వెలుగుదారి’. నెదర్‌ల్యాండ్స్‌లోని ఇన్‌దోవెన్ పట్టణంలో కిలోమీటరు మేర ఉన్న ఈ వెలుగు దారిని చూడడానికి, రాత్రివేళల్లో దానిపై ప్రయాణం చేయడానికి వాంగో అభిమానులు మాత్రమే కాదు... దేశ విదేశాల పర్యాటకులంతా కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇన్‌దోవెన్ పట్టణంలో పెద్ద పెద్ద భవంతులను రంగుల లైట్లతో అలంకరిస్తారు. అందుకే ఈ పట్టణాన్ని ‘సిటీ ఆఫ్ లైట్’ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ‘సిటీ ఆఫ్ లైట్’ కిరీటంలో ‘వాంగో రోడ్డు’ కలికితురాయిగా చేరింది. దాంతో ‘‘కొత్తదారిని చూశాం, కొత్త దారిపై ప్రయాణించాం అనే అనుభూతికి ప్రయాణికులు లోనవడానికే ఈ రోడ్డుకు రూపకల్పన చేశాను. దీనికి దేశీయంగానే కాదు... అంతర్జాతీయంగా కూడా మంచి స్పందన లభిస్తోంది’’ అంటూ మురిసిపోతున్నాడు రూసేగార్డె. వాంగో పుట్టి పెరిగిన బ్రాబంట్ ప్రాంతంలో ‘వాంగో సైకిల్ రూట్’ ఉంది. కిలో మీటరు పొడవైన ఈ అందమైన రోడ్డుపై 50,000 సోలార్-పవర్డ్ స్టోన్స్‌ను అమర్చారు. ఇవి పగలు సూర్యకాంతిని గ్రహించి, రాత్రి వేళల్లో వెలుగుతుంటాయి. ఆకాశం మబ్బుపట్టి, రాళ్లు ఛార్జ్ అయ్యే పరిస్థితి లేనప్పుడు ‘ఎల్ఈడీ లైట్లు’ రోడ్డును వెలిగేలా చేస్తాయి. మరో విశేషమేమిటంటే ఈ రోడ్డు మీద ముందుకు వెళుతున్న కొద్దీ వాంగో జీవితంతో సంబంధం ఉన్న ఎన్నో ప్రదేశాలు కనిపిస్తాయి. భవిష్యత్తులో ఈ వెలుగుల దూరాన్ని మరింతగా విస్తరించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అది విని వారేవా అంటున్నారు అభిమానులు. ‘‘పర్యటించడం అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి మిత్రుడి ద్వారా వాంగో రోడ్డు గురించి విని ఆశ్చర్యపోయాను. అక్కడికి వెళ్లిన తరువాతగానీ నా మనసు శాంతించలేదు. నా అభిమాన చిత్రకారుడి పేరు మీద ఉన్న దారిలో ప్రయాణిస్తుంటే...భూమి మీద ప్రయాణించినట్లు లేదు ఎక్కడో కళాప్రపంచంలో విహరించినట్లుగా ఉంది’’ అంటున్నాడు వర్ధమాన ఇంగ్లండ్ చిత్రకారుడు డంకెన్ స్మిత్. స్మిత్ నోటి ద్వారా వాంగ్ వెలుగు దారి గురించి విన్న అతని మిత్రులు నెదర్ల్యాండ్స్ వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ‘‘ఒక ప్రాంతం యొక్క సాంస్కృతిక చరిత్రను తెలుసుకోవడానికి ప్రజలెప్పుడూ ఆసక్తికరంగా ఉంటారు. అయితే దాన్ని ఏ మాధ్యమంలో చెబుతున్నామనేది కూడా ముఖ్యమే. వాంగో చిత్రకళా ఘనతను, చరిత్రను పరిచయం చేయడానికి ఇదొక మంచి మార్గం’’ అంటున్నాడు రూసేగార్డె తన కళల రోడ్డు వైపు చూస్తూ. వాంగో గీసిన పలు చిత్రాల బ్యాక్‌డ్రాప్‌లో ఇన్‌దోవెన్ కనిపించడం గమనార్హం. నెదర్ల్యాండ్స్ ఆర్థికవ్యవస్థకు ‘పర్యాటకం’ అనేది ఎంత కీలకం అన్నది పక్కనపెడితే... పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం ఏ అవకాశాన్నీ జార విడుచుకోకపోవడం విశేషం. రాజధాని ఆమ్స్టర్డామ్కు మాత్రమే పర్యాటకులు పరిమితం కాకుండా వారు చూసే పర్యాటక క్షేత్రాలు ఎప్పటికప్పుడు పెంచడానికి అక్కడి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాభిమానులను ఆకర్షించడానికి నెదర్‌ల్యాండ్స్‌కు దొరికిన మంచి అవకాశం... ఈ వాంగో రోడ్డు. వాంగో 125వ వర్థంతి సందర్భంగా రూపొందించిన ఈ వెలుగు దారిలో పయనించడానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తున్నారు. వారందరి కోసం సైకిళ్లు అద్దెకివ్వడం, రోడ్డు పరిసరాల్లో వాంగోను గుర్తుకు తెచ్చే కళాకృతులు ఏర్పాటు చేయడంలాంటి మరెన్నో నిర్మాణాత్మకమైన పనులు చేపడుతోంది అక్కడి ప్రభుత్వం. అవి కూడా పూర్తయిపోతే... ‘వాంగో రోడ్డు’ నెదర్లాండ్స్ టూరిటం అభివృద్ధిలో మరింత ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరెందరో కళారాధకుల మనసులను మైమరపింపజేస్తుంది. -
నక్షత్రాలు దూసిన ఆకాశం
ప్రతి ఆడకూతురూ ప్రదక్షిణ చేస్తుంది. ఆషాఢం వచ్చిన ప్రతిసారీ ఆ చెట్టు.. నక్షత్రాలు దూసిన ఆకాశం తూరుపులా రుబ్బురోలు పండేకా సంధ్యవేళకి పడతుల పడతి పేరెత్తగానే సిగ్గు మందారం అరచేతిలో విచ్చుకుంటుంది అరా కొరా మిగిలిన ఆనందాన్ని ఆటలో బుడంకాయలాంటి నాకు అరచేతిలో అప్పచ్చి అంటూ చందమామని నాకు పంచిన మర్నాడు మధ్యలో బంతి ఆకు ఎలా వచ్చిందో నేను చెప్పను గోరింటాకు చెట్టున్న మా పాపత్త వాడ అంతటికీ బంధువు ఆషాఢం వచ్చిన ప్రతిసారీ ఆ చెట్టు నక్షత్రాలని దూసిన ఆకాశం - వర్మ కలిదిండి ఫోన్: 9948943337 సాహిత్యం పేజీలో (ఆగస్టు 2, 2015) ‘రాబోవు పుస్తకం’ కింద ‘జయమ్’ గురించిన అనుబంధం చదివి రాస్తున్నాను. పుణేలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కొన్ని దశాబ్దాలుగా నిష్ణాతులైన పండితులు వ్యాస మహాభారతంలో శతాబ్దాలుగా ఎవరికై వారు చొప్పించిన ఉపాఖ్యానాలు, అసంబద్ధ చేర్పులు ఏరి చివరికి జైమిని రాసిన జయం కావ్యానికి చేరువకావాలన్నది వారి లక్ష్యం. దానికోసం అన్ని లిపులలో ఉన్న ప్రాచీన గ్రంథాలని సేకరించి, క్రిటికల్ ఎడిషన్‌ని పదకొండు సంపుటాలుగా ప్రచురించారు. ఎనిమిదవ శతాబ్దం పూర్వపు ప్రతులు దొరకలేదు. అన్వేషణ ఇంకా జరుగుతోంది. భగవద్గీత భారతంలో భాగం కాదని నిరూపించారు. ఉపగీతని నిరాకరించారు. రీసెర్చ్ ఇంకా జరుగుతోంది. డాక్టర్ ఇరావతి కర్వే రాసిన యుగాంత పుస్తకం ఉపోద్ఘాతంలో మరింత సమాచారం లభ్యమవుతుంది. అదే మార్గంలో బహుశా ఒంటరిగా సాగుతున్న నాయుని కృష్ణమూర్తి అభినందనీయులు. - గబ్బిట కృష్ణమోహన్ ప్రపంచ మూలవాసీ దినోత్సవం (9 ఆగస్టు 2015) సందర్భంగా నల్లమలలో మూలవాసీ చెంచులతో ఆత్మీయ కలయిక ఆదివాసీ తెగకు సంబంధించిన సంక్షేమ పథకాల రూపకల్పనలో ప్రత్యేక దృష్టి కోణం ఉండాలి. వారి స్థానిక, ప్రాంత అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. వాటి అమలు విధానంలో జాగ్రత్త వహించాలి. ఒకే పథకం అన్ని తెగలకీ, ఒక్కో తెగలోని వివిధ ప్రాంతాలలో నివసించే అందరికీ యాంత్రికంగా వర్తింపజేయడం సరికాదు. ప్రస్తుతం మూలవాసీ చెంచులు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. వారి నేల వారిది కాకుండా పోతున్నది. నీరు, రవాణా, వైద్యం, ప్రభుత్వ పథకాల అమలు వంటి ఎన్నో రంగాలలో వారు ఎదుర్కొనే సాధకబాధకాలను అధ్యయనం చేసి, వారికి చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. శ్రీశైలం ప్రధాన రహదారిపై మన్ననూరు దగ్గర, ఫరాబాదుకి 20 కిలోమీటర్ల దూరంలోని అటవీప్రాంతంలో గల అప్పాపూర్ (లింగాల మండలం, మహబూబ్‌నగర్) చెంచు గ్రామం, దాని పరిసరాల్లోని ఆరు గ్రామాల చెంచుల మధ్యన ఒక సభ ఏర్పాటుచేస్తున్నాం. చెంచుల నోటి సాహిత్యం, సంస్కృతి, భాషా విశేషాలు, జీవనవిధానం, ఆర్థికాంశాలను అధ్యయనం చేస్తాం. నాగర్‌కర్నూల్ శాఖ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో అదే రోజున వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాం. మొదట చెంచులదే అయిన కిన్నెర తంత్రీ వాద్యం ఇప్పుడు అక్కడ కనిపించకుండా పోయింది. అడవి పందులు, సొర తీగను, కాయలను నాశనం చేయడం వల్ల సొరబుర్రలు, విత్తనాలు మాయమయ్యాయి. అందువల్ల కిన్నెర వాద్యం తయారీ ఆగిపోయింది. అయితే చెంచుల పన్నెండు మెట్ల కిన్నెర వాద్యాన్ని ఏడు మెట్ల కిన్నెరగా మార్చుకొని మహబూబ్‌నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల డక్కలి వారు కిన్నెరను తమదిగా స్వీకరించి, మైదాన గ్రామాల్లో వినిపిస్తున్నారు. ఈ కిన్నెరవాద్యాన్ని తిరిగి చెంచులకు బహూకరించనున్నాం. అలాగే చెంచుల కిన్నెర వాదన కూడా ఏర్పాటుచేశాం. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ కేంద్రంగా పనిచేసే ‘చెంచులోకం’ సంస్థ, సిడాస్ట్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పాలమూరు విశ్వవిద్యాలయ ఆచార్యులు, పరిశోధక విద్యార్థులు, రచయితలు పాల్గొంటారు. ఆసక్తి ఉన్నవారందరికీ ఆహ్వానం. మరిన్ని వివరాలకు బెల్లి యాదయ్య ఫోన్: 9848392690. - జయధీర్ తిరుమలరావు అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక పుస్తక పరిచయ సభ ‘సాహితీమిత్రులు’ ఆధ్వర్యంలో నేడు సాయంత్రం 6 గంటలకు విజయవాడ, మొగల్రాజపురంలోని మధుమాలక్ష్మి చాంబర్స్‌లో శిఖామణి పుస్తకాలు ‘పొద్దున్నే కవిగొంతు’, ‘స్మరణిక’, ‘తెలుగు మరాఠీ దళిత కవిత్వం’ పరిచయ సభ జరగనుంది. వక్తలు పాపినేని శివశంకర్, సీతారాం, బండ్ల మాధవరావు. -
మనం ఏపాటి!
సూర్యుని పరిమాణం భూమి కన్నా వేల రెట్లు పెద్దది. ఇంకా చెప్పాలంటే పదమూడు లక్షల భూగోళాలు ఇమిడిపోయేంత పెద్దది సూర్యగోళం. భూగోళానికి అతి సమీపంలో ఉన్న నక్షత్రమే సూర్యుడు. సూర్యునికన్నా పెద్ద నక్షత్రాలు విశ్వంలో కోటానుకోట్లు ఉన్నాయి. అందుకే ఈ విశ్వం ఎత్తుగానీ, లోతుగానీ, వెడల్పు గానీ అంచనా వేయలేం. 360 డిగ్రీలలో ఎటువైపు చూసినా విశ్వం ముందుకు సాగుతూనే ఉంటుంది. అన్ని కోణాలలో విశ్వం ఒకే రీతిగా, అనంతంగా పయనిస్తూనే ఉంటుంది. కాబట్టే కీర్తనకారుడు అంటాడు: ‘‘దేవా, నువ్వు కలుగజేసిన చంద్ర నక్షత్రాలను చూస్తుంటే, నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకోడానికి వాడే పాటి వాడు?’’ అని. మనం జీవితకాలమంతా ప్రయాణించినా దగ్గర్లోని ఒక నక్షత్రాన్ని కూడా చేరలేం. ఇటీవల ‘నాసా’ వారు చేసిన పరిశోధనల్లో ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అంతరిక్షంలో ‘తార్కికంగా ఆలోచించే మేఘాలు’ ఉన్నాయట! మేఘం అంటే సాధారణ భూవాతావరణంలో వర్షించే మేఘం కాదు. కొన్ని లక్షల నెబ్యూలాలు (నక్షత్ర సమూహాలు), వాటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని.. అంటే గుంపుగా కనిపించే ఓ మహా నక్షత్ర సముదాయాన్ని ఖగోళ శాస్త్రంలో మేఘం అని అంటారు. మరి తార్కికంగా ఆలోచించే మేఘాలు అంటే? జీవం కలిగిన ఓ మహాశక్తి విశ్వంలో ఉన్నదని అంతరార్థం. అలా పరోక్షంగా దేవుని ఉనికిని ధృవీకరించారు ఖగోళ శాస్త్రజ్ఞులు. కనుక మనం ఏ మతస్తులమైనా, దేవుడు ఒక్కడేనన్న సత్యాన్ని గ్రహించాలి. ఆ మహాశక్తిమంతుడైన దేవుడిని మనసారా ఆరాధించి, ఆయన పట్ల భయభక్తులతో, చెడు మార్గాన్ని, తలంపులను విసర్జించి, సన్మార్గంలో పయనించాలి. - యస్.విజయ భాస్కర్ -
నక్షత్రాలను పూచిన క్షిపణులు
‘‘యుద్ధంలో తుపాకీ పేల్చడం కంటే, ఒక క్రిస్మస్ చెట్టు దగ్గర కొవ్వొత్తి వెలిగించడమే ముఖ్యం’’. - కెప్టెన్ నిమానీ, సాగ్జన్ (జర్మనీ పదాతిదళం) భూగోళం మీద ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ మొదటి ప్రపంచయుద్ధం అన్ని యుద్ధాల వంటిది కాదు. క్రైస్తవం రూపుదిద్దుకున్న తరువాత ఎన్నో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. కానీ మహాయుద్ధం వేళ, రణభూమిలో జరిగిన ఆ ఒక్క క్రిస్మస్ పండుగను చరిత్ర మరచిపోలేదు. అందుకే, డిసెంబర్ 25, 1914 న జరిగిన ఆ మహోన్నత ఉత్సవం గురించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచం మొత్తం స్మరించుకుంటోంది. ప్రభూ! ఇవాళయినా యుద్ధం లేకుండా చూడు! మనిషిని మనిషి చంపుకునే క్రూరత్వం నుంచి కొన్ని ఘడియలైనా ఈ మనుషుల్ని రక్షించు!’ అనుకున్నాడు స్కాట్ సోల్జర్ ఆల్ఫ్రెడ్ ఆండర్సన్. రక్తాన్ని గడ్డకట్టించే చలిలో, మసక వెన్నెట్లో పుప్పొడిలా కురుస్తోంది మంచు. క్రిస్మస్ రాత్రికి సరైన వాతావరణం. అంతటి యుద్ధంలోనూ బెల్జియం శివారు ప్రాంతంలో ధ్వంసం కాకుండా మిగిలిన ఆ చర్చి నుంచి హఠాత్తుగా గంటల మోత లీలగా వినిపించింది. దాని కోసమే ఎదురు చూస్తున్న ఆ చుట్టుపక్కల కందకాలలోని మిత్రరాజ్యాల (ఇంగ్లండ్, దాని మిత్రులు)సైనికులు ఒక్కసారిగా మోకాళ్ల మీద వంగి ప్రార్థించారు, ఆ చిమ్మ చీకట్లోనే. అప్పుడే, త్రిరాజ్య కూటమి కందకాలలో అంటే జర్మన్లు, వాళ్ల మద్దతుదారుల కందకాలలో ఏదో కలకలం. ఒళ్లు ఝల్లుమంది, ఇంగ్లిష్ వారి సేనలకీ మిత్ర దేశాల సేనలకీ. మనసు కీడును శంకిస్తున్నా ఆయుధం అందుకోవడానికి చేయి రావడం లేదు. ట్రెంచ్కోటు జేబులో ఉన్న ‘కొత్త నిబంధనలు’ పుస్తకం మీద చేయి వేసి, ప్రభూ! ఇవాళయినా యుద్ధం లేకుండా చూడు! మనిషిని మనిషి చంపుకునే క్రూరత్వం నుంచి కొన్ని ఘడియలైనా ఈ మనుషుల్ని రక్షించు!’ అనుకున్నాడు స్కాట్ సోల్జర్ ఆల్ఫ్రెడ్ ఆండర్సన్. యుద్ధానికి వస్తుంటే తల్లి ఆశీర్వదించి ఇచ్చిన బైబిల్ అది. ఆ తరువాత జరిగిన కథే చరిత్రలో ఓ అద్భుతం. అందుకే మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులు తమ ఉత్తరాలలో, డైరీలలో ఈ ఘట్టం గురించి ఇలాంటి వర్ణనలు ఎన్నో చేశారు. నో మ్యాన్స్ల్యాండ్లోనే వెస్ట్రన్ ఫ్రంట్‌లో ఫ్రిలింఘీన్ అండ్ హూప్లైన్స్ సెక్టర్లో అనేక చోట్ల క్రిస్మస్ పండుగ జరిగింది. ఆ ప్రాంతాన్నే ఫ్లాండర్స్ అని పిలుస్తారు. ఇది ఫ్రాన్స్ సరిహద్దుకు కాస్త దూరంగా, బెల్జియంకు దగ్గరగా ఉంటుంది. అక్కడే సాగ్జన్ల కందకం, స్కాట్ల కందకం, కొన్ని గజాల దూరంలో జర్మన్లదీ, బ్రిటిష్ వాళ్ల కందకాలూ ఎదురెదురుగానే ఉండేవి. జర్మన్ల కాల్బలమే సాగ్జన్లు. ఇంగ్లిష్ సేనలో భాగం స్కాట్లు. వెస్ట్రన్ ఫ్రంట్ పోరాట రేఖ పొడవునా ఇదే పద్ధతి. బెల్జియం రేవు పట్టణం ఓస్టెండ్ నుంచి, పశ్చిమ ఫ్రాన్సు వరకు, అంటే ఇంగ్లిష్ చానల్ వరకు- చూస్తూ చూస్తూ ఉండగానే అలా ఏడు వందల కిలోమీటర్ల పోరాట రేఖ తయారయింది. దీనికే పశ్చిమ రంగమని జర్మనీ పేరు పెట్టింది. రాయల్వెల్ష్, నార్త్ఫోక్ రెజిమెంట్, వార్విక్ రెజిమెంట్- లక్షా అరవై వేల బ్రిటిష్ సేన , లక్షా ముప్పయ్ ఎనిమిదివేల వలస భారత సేన ఫ్లాండర్స్‌లో ఉండి యుద్ధం చేశాయి. ఫ్రెంచ్ రష్యా, బెల్జియం, సెర్బియా, గ్రీస్, కెనడా, పోర్చుగీస్ సేనలు ఉన్నాయి. అవతలి వైపున జర్మనీతో పాటు, సాగ్జన్లు, ఆంగ్లో సాగ్జన్లు, బవేరియా, ఆస్ట్రియా సేనలు మోహరించాయి. ఈ సేనల కందకాల మధ్య దూరం కొన్ని కొన్ని చోట్ల 60 గజాలు కూడా లేదు. కందకాల మధ్య ఖాళీ స్థలాన్నే న్యో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. దాదాపు పాతిక కిలోమీటర్ల మేర క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చాలాకాలం రహస్యంగా ఇంత గొప్ప చారిత్రక ఘట్టం వెంటనే వెలుగు చూడలేదు. బ్రిటన్‌కు చెందిన రాయిటర్ వార్తా సంస్థ ప్రచురణను నిలిపివేసింది. కానీ న్యూయార్క్ టైమ్స్ అదే జనవరిలో ఈ సంచలన కథనం ప్రచురించింది. తరువాత సైనికులు ఇళ్లకు రాసిన ఉత్తరాల ద్వారా కొంత వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పుడు దీని గురించి తెలిసిన వారంతా నేటి ప్రపంచానికి ఈ ఘట్టం గొప్ప సందేశాన్ని ఇవ్వగలుగుతుందని చెబుతున్నారు. అంకురార్పణ మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918)లో పోరాడుతున్న దేశాలలో ఒకటి రెండు మినహా మిగిలినవి క్రైస్తవాన్ని పాటించేవే. కాబట్టి క్రిస్మస్కైనా (యుద్ధం ఆరంభమైన తరువాత వచ్చిన తొలి క్రిస్మస్) కాల్పుల విరమణ పాటించాలని డిసెంబర్ 7, 1914న నాటి పోప్ పదిహేనో బెనెడిక్ట్ పిలుపునిచ్చారు. ఆయనైనా ఆ ప్రకటన వరకే పరిమితమైనారు. యుద్ధ కండూతితో వేగిపోతున్న దేశాధినేతలు ఒక మతాధిపతి మాటను మన్నిస్తారని పోప్ భ్రమలు పెట్టుకోలేదని తెలుస్తూనే ఉంది. కానీ రెండు వైపుల సైనికులు, ముఖ్యంగా జర్మన్లు, బవేరియన్లు, సాగ్జన్లు పండుగ జరుపుకోవాలని పట్టుదలగా ఉన్నారు. దీనిని ముందే పసిగట్టిన బ్రిటిష్ ఎక్స్‌పెడిషనరీ సేనల అధిపతి ఫీల్డ్ మార్షల్ జాన్ డెంటన్ పింక్‌స్టోన్ ఫ్రెంచ్ (సర్ జాన్ ఫ్రెంచ్) తన సేనలకు పాల్గొనవద్దంటూ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ కింది స్థాయిలో ప్రయత్నాలు చాలా తీవ్రంగానే జరిగాయి. పైగా క్రిస్మస్కల్లా యుద్ధం ముగిసిపోతుందనీ, తామంతా ఇళ్లకు చేరుకుంటామనీ సైనికులు నమ్మారు. సొంత కుటుంబాల నుంచి వచ్చి పడిన క్రిస్మస్ కానుకలు యుద్ధరంగంలో పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. బ్రిటిష్ సేనలో సెకండ్స్కాట్స్ దళానికి చెందిన లెఫ్టినెంట్ ఎడ్వర్ట్ హూల్సేకు జర్మనీ నాయకత్వంలోని త్రిరాజ్య కూటమికి చెందిన నిమానీ అనే కెప్టెన్ క్రిస్మస్కు నాలుగు రోజుల ముందు మర్కర్ అనే స్కౌట్ కుర్రాడి చేత రహస్యంగా చిన్న ఉత్తరం పంపాడు. మర్కర్ స్కాట్లాండ్వాడే. క్రిస్మస్ రోజు కాల్పుల విరమణ గురించి ఆలోచించమని నిమానీ కోరాడు అందులో. ఆ అద్భుత వేకువలో బెల్జియం శివారు ప్రాంతంలోని ఆ చర్చి నుంచి గంటలు వినపడిన తరువాత చినుకుల్లా మొదలైన వర్షం ఆ లిప్తలోనే కుంభవృష్టిలా మారినట్టు ఆ కలకలారావం విస్తరించింది. కానీ కాస్త శ్రద్ధగా విన్న తరువాత అది కలకలం కాదని అనిపించింది. కొన్నివేల గొంతులు ఒకేసారి పలుకుతున్నట్టు ఉంది. దాడి కాబోలునని బ్రిటిష్ సైనికులు అనుమానించారు. కానీ అది ఏదో పాటలాగా ఉంది. ‘సిల్లేనాట్, హిలీజ్ నాట్...’ జర్మన్ పాట, బాణీ మాత్రం ఐరోపా అంతటికీ చిరపరిచితం. అది క్రిస్మస్ నాడు పాడే ‘సెలైంట్ నైట్ ...’ బాణీ. మిత్రరాజ్యాల కందకాలలో ఎక్కడో ఏదో బృందం కూడా పాట అందుకుంది. పాట పూర్తయిందో లేదో, క్రిస్మస్ తాత వేషంలో ఉన్న జర్మనీ పదాతి దళ సభ్యుడు ఒకరు బ్రిటిష్ వాళ్ల ప్రధాన కందకానికి దగ్గరగా వచ్చి ‘మెర్రీ క్రిస్మస్’ అని అరిచాడు. కందకం నుంచి బ్రిటిష్ సైనికులు కూడా బయటకు వచ్చారు. అతడి చేతిలో ఒక బోర్డు గజిబిజి ఇంగ్లిష్‌లో -‘ఉయ్ నో షూట్’, యూ నో షూట్’ అనివుంది. అప్పుడు సైనికాధికారులు మాట్లాడుకున్నారు. నో మ్యాన్స్ ల్యాండ్ దగ్గర నుంచి జర్మన్ సైనికులు బ్రిటిష్ వారిని సాదరంగా స్వాగతించారు. పండుగ జరుపుకోవడానికి నిర్ణయమైపోయింది. చుట్టుపక్కల కందకాల నుంచి జర్మన్లు, ఇంగ్లిష్ వాళ్లు, సాగ్జన్లు, స్కాట్లు వచ్చి చేరారు. కొన్ని నిమిషాలలోనే నో మ్యాన్స్ ల్యాండ్ వేలమందితో నిండిపోయింది. చాలా మంది చేతిలో ధగధగలాడుతున్న చైనా లాంతర్లు, కొవ్వొత్తుల మాదిరిగా వారి మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. సైనికాధికారుల కరుకు శాసనాలను ధిక్కరించి వచ్చామన్న భయం ఏ కోశానా కనిపించలేదు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కరచాలనాలు చేసుకున్నారు. నిజానికి యుద్ధరంగంలో శత్రువుతో చేయి కలిపితే శిక్ష మరణదండనే! అది ధిక్కారం. ఏ స్థాయి అధికారినైనా, సైనికుడినైనా ఇందుకు పాల్పడితే వేకువ కాల్పులలో చంపుతారు. థామస్ హైగేట్ అనే ఒక సైనికుడిని ఆ సెప్టెంబర్‌లో అదే శిక్ష వేసి కాల్చి చంపారు కూడా! అప్పటికే సిద్ధం చేసి పెట్టిన పెద్ద కట్టెల గుట్టకు నిప్పు పెట్టాడొక సాగ్జన్ సోల్జరు. లాంతరు మూత తెరిచి కెనడా సైనికుడొకరు ఆముదం పోశాడు. కొద్దిసేపటికే మంటలు పైకి లేచాయి. ఒక జర్మనీ సోల్జరు పెద్ద పెట్టెతో కేకులు తెచ్చి అందరి నోటికి అందించాడు. మరో పక్క ఒక బెల్జియం సోల్జరు ఇంకో పెద్ద పెట్టెతో డ్రైఫ్రూట్స్ తెచ్చి అందరికీ పంచాడు. కొందరు బీరు సీసాలు తెచ్చారు. స్కాట్ సోల్జర్లు బ్యాగ్‌పైప్‌లు మోగిస్తూ అక్కడకి వచ్చారు. వెంటనే రెండువైపుల వారి మిలటరీ బ్యాండ్లు క్రైస్తవ గీతాలను మోగిస్తూ వచ్చాయి. కొందరు మౌతార్గన్లు మోగిస్తుంటే, ఇంకొందరు మంట చుట్టూ నిలబడి క్రైస్తవగీతాలు అందుకున్నారు. పారిస్ ఒపేరా గాయకుడు విక్టర్ గ్రానీర్ మంట ఎదుట నిలబడి పాట అందుకున్నాడు- ‘ఓ హోలీ నైట్...’. ఆ ప్రాంతం మొత్తం గానంలో ఓలలాడిపోయింది. పెను వైరాగ్యం మంట నెమ్మదిగా శాంతించింది. కొద్దిగా వెలుగు వచ్చింది. వాద్యగోష్టి మౌనం దాల్చింది. అప్పుడు కనిపించిన దృశ్యాన్ని దగ్గర నుంచి ప్రతి సైనికుడు తనను తాను అసహ్యించుకున్నాడు. అడుక్కో శవం. కుళ్లి ఉబ్బిన శవాలు, కాళ్లు తెగినవి, షెల్ దెబ్బకు తెగి చెట్లకు వేలాడే అవయవాలు... నగ్నంగా వున్నవీ, ఎలుకలు కొరికేసినవీ, పదిహేనేళ్ల బాల సైనికుల శవాలూ, పాతికేళ్ల యువకుల శవాలూ, నలభయ్లలో ఉన్న వాళ్ల శవాలూ! ముందు అనుకున్నట్టే జర్మనీ వైపు శవాలని వారి సైనికులు, ఇంగ్లండ్ వైపు యుద్ధం చేస్తూ కన్నుమూసిన వారి శవాలని వీరు బెల్జియం శివార్లలో ఒకచోటికి చేర్చారు. ఒక దాని పక్కన ఇంకొకటి - పద్ధతి ప్రకారం గోతులు తవ్వించారు. ప్రతీ గోతిలోను ఒక శవం ఉంచి, సామూహికంగా ప్రార్థించి పూడ్చి పెట్టారు. ఆ తరువాత ఎవరి కందకాలలో వాళ్లు ఆదరాబాదరా స్నానాలు ముగించారు. దుస్తులు మార్చుకున్నారు. పదిన్నర ప్రాంతంలో స్కాట్ల కందకంలో ఎవరో లేచి బైబిల్ నుంచి కొన్ని స్తోత్రాలు చదివారు. అప్పుడే జర్మన్లు పంపించిన మాంసం కూర వచ్చింది. ఇక్కడ నుంచి మద్యం అక్కడికి వెళ్లింది. అప్పటికి బాగా ఎండొచ్చింది. నేల కొంచెం ఆరింది. మిత్రుల, ఆప్తుల, సహోద్యోగుల అంత్యక్రియలతో బరువెక్కిన ఇరువైపు సైనికుల మనసులు తేలికపడ్డాయి. అనుకున్నట్టే గంటన్నర తరువాత అంతా నో మ్యాన్స్ ల్యాండ్‌కి వచ్చారు. శాంతి కపోతాల దర్శనం అప్పటి దాకా కొంచెం దూరం నుంచి నో మ్యాన్స్ ల్యాండ్ మీద కనిపించిన దృశ్యాన్ని చూసిన అందరి ముఖాల మీద చిరునవ్వు విరిసింది. తోటి సైనికుల మృతదేహాలను ఖననం చేసిన తరువాత ఆవహించిన వైరాగ్యం ఒక్కసారిగా బద్దలైంది. గడచిన ముప్పయ్, ముప్పయ్ అయిదు గంటల నుంచి అసలు పేలుడే లేదు. ఎక్కడ నుంచి వచ్చాయో వందల పావురాలు. వేకువన సైనికులు పడేసిన కే కు, చాక్లెట్ ముక్కలనీ, ఇతర తినుబండారాలనీ తాపీగా పొడుచుకుని తింటున్నాయి. కానుకలు, కళలు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులలో రకరకాల రంగాలవారు, నిపుణులు, కళాకారులు, క్రీడాకారులు ఉన్నారు. మ్యాజిక్ బాగా తెలిసిన ఓ జర్మనీ సోల్జరు తన ప్రతిభను చూపితే, నిజ జీవితంలో బార్బర్ అయిన ఒక బ్రిటిష్ ఆ కాసేపు తాత్కాలిక సెలూన్ తెరిచి తల ఒక్కింటికి రెండు సిగరెట్ల రుసుం తీసుకుని వేణీసంహారం గావించాడు. ఎలా పట్టుకొచ్చారో కొందరు సైనికులు తాము కొట్టి తెచ్చుకున్న పందిని సరదాగా కాలుస్తున్నారు. అక్కడే కనిపించిన ఒక జర్మన్ సోల్జర్ని చూసి ‘నీవు లండన్‌లో వెయిటర్‌గా పని చే శావ్ కదా’ అని అడిగాడు ఒక ఇంగ్లిష్ అధికారి. ‘ఔన’న్నాడతడు, జర్మన్ యాసతో ఇంగ్లిష్‌లో. ఈ వాస్తవాన్ని 2003లో తాను రాసిన పుస్తకం ‘పెద్ద యుద్ధంలో చిన్న ఘట్టం’ (క్రిస్మస్ శాంతి ఒప్పందమే ఇతివృత్తం) అనే పుస్తకంలో మైఖేల్ జ్యూర్గ్ అనే జర్మన్ నమోదు చేశాడు. యుద్ధం మొదలు కావడానికి ముందు ఇంగ్లండ్‌లో ఎనభయ్ వేల మంది జర్మన్లు ఉన్నారు. చాలామంది చక్రవర్తి విల్హెల్మ్ పిలుపు అందుకుని సైన్యంలో చేరినవాళ్లే. కానీ వాళ్ల కుటుంబాలు మాత్రం యుద్ధం తీవ్ర రూపం దాల్చిన సమయంలో కూడా అక్కడే ఉన్నాయి. నిజానికి ఇంగ్లిష్ మాట్లాడడం వచ్చిన కొందరు జర్మన్ల వల్లనే ఈ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. మధ్యాహ్నం వారందరికీ ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ఆడారు. వెదురుబొంగులను నిలిపి, తమ టోపీలతో గోల్‌పోస్ట్‌ను తయారు చేసుకుని, చిత్తడిగా ఉన్న ఆ నేలతోనే ఆట ఆడారు. ఇందులో 3:2 స్కోరుతో జర్మనీ విజయం సాధించింది. కానీ యుద్ధంలో అది ఓడిపోయింది. అలాగే యుద్ధరంగంలో పావురాలు ఎగిరే దృశ్యాన్ని చూసే అవకాశం సైనికాధికారులు మళ్లీ ఎప్పుడూ రానివ్వలేదు. యువరాణి క్రిస్మస్ కానుక చరిత్ర ఎరుగని ‘గ్రేట్‌వార్’కు వెళ్లిన బ్రిటిష్ సేనలకీ, వలస దేశాల సైనికులకీ క్రిస్మస్ పర్వదినాన ప్రత్యేకమైన కానుకను అందించాలని యువరాణి మేరీ ఆలోచించింది. బ్రిటిష్ చక్రవర్తి ఐదో జార్జి, రాణి మేరీల కుమార్తె ఈమె. వెంటనే ఇంగ్లండ్ జాతీయ పత్రికలలో నవంబర్, 1914లో ఒక ప్రకటన వెలువడింది. ‘సెయిలర్స్ అండ్ సోల్జర్స్ క్రిస్మస్ ఫండ్’ పేరుతో వచ్చిన ఈ ప్రకటనలకి అనూహ్య స్పందన వచ్చింది. 1,62,591 పౌండ్లు వచ్చి పడ్డాయి. ‘సముద్రం మీద ఉన్న ప్రతి నావికుడికీ, సమరభూమిలో ఉన్న ప్రతి సైనికుడికీ’ ఈ కానుక అందాలని యువరాణి భావించింది. కుప్పతెప్పలుగా వచ్చిన నిధులను బట్టి ‘కింగ్స్ యూనిఫారమ్’ ధరించిన వారితో (సైనికులు, నావికులు) పాటు యుద్ధం పనులకు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ, డాక్టర్లకీ, నర్సులకీ, మరణించిన సైనికుల భార్యలకూ లేదా ఇతర కుటుంబ సభ్యులకూ కూడా ఈ కానుక అందించాలని నిర్ణయించారు. ఇలాంటి వారు - 2,62,019 5 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పు, 1.5 అంగుళాల ఎత్తు ఉన్న ఈ ఇత్తడి పెట్టెలను యాడ్స్హెడ్ అండ్ రామ్సే సంస్థ సుందరంగా రూపొందించింది. 4,26,000 పెట్టెలు తయారు చేయడానికి సన్నాహాలు చేశారు. అవసరమైన ఇత్తడిని అమెరికా నుంచి (అప్పటికి ఆ దేశం యుద్ధంలో దిగలేదు) దిగుమతి చేసుకున్నారు. మూత మీద యువరాణి మేరీ శిరస్సు బొమ్మను ఉబ్బెత్తుగా అచ్చువేశారు. బొమ్మకు అటు ఇటు ఆమె పేరుతో ఇంగ్లిష్ అక్షరం ‘ఎం’ అని ముద్రించారు. జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న బెల్జియం, జపాన్, మాంటెనీగ్రో, ఫ్రాన్స్, రష్యా పేర్లు కూడా నలుమూలలా అచ్చువేశారు. ‘జాతి అందిస్తున్న అపురూప కానుక’ అంటూ డిసెంబర్ 25, 1914 నాటికి దిగ్విజయంగా 3,55,000 పేటికలను అందించగలిగారు. మిగిలినవి సకాలంలో ఉత్పత్తి చేయలేకపోవడంతో 1915, 16 వరకు కూడా యుద్ధభూమికి వస్తూనే ఉన్నాయి. ఆఖరికి ఈ కానుక అందలేదని 1919లో కూడా వాపోయినవారు ఉన్నారు. ఇంతకీ ఈ పెట్టెలో ఏం ఉన్నాయి? మూడు, నాలుగు రకాల స్థాయిలుగా విభజించి, అందుకు తగ్గట్టు కొన్ని వస్తువులు పెట్టారు. ఆఫీసర్ హోదా కలిగిన వారికి అందించిన పెట్టెలలో ఒక పైప్, ఔన్స్ పొగాకు, 20 సిగరెట్లు, లైటర్ ఉన్నాయి. పొగతాగని వారి కోసం సిగరె ట్లు, పొగాకు స్థానంలో పెన్సిల్, స్వీట్ ప్యాకెట్ పెట్టారు. భారత సిపాయీలకి స్వీట్లు, సుగంధ ద్రవ్యాల పెట్టెలు అందాయి. నర్సులకి పూర్తిగా చాక్లెట్లు పెట్టిన పెట్టెలు ఇచ్చారు. రాచ కుటుంబం పేరు మీద క్రిస్మస్ శుభాకాంక్షలు, యుద్ధంలో విజయం సాధించాలంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసే గ్రీటింగ్ కార్డు మాత్రం అన్ని పెట్టెలలోనూ ఉంచారు. వేదిక ఎక్కబోతున్న జ్ఞాపకం మొదటి ప్రపంచ యుద్ధ ఘట్టాలను ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల గుర్తు చేసుకుంటున్నారు. స్ట్రాట్ఫోర్ట్ అపాన్ ఎవాన్‌లో జరగబోయే ప్రదర్శన అలాంటిదే. విలియం షేక్స్పియర్ పుట్టిన ఈ ప్రాంతంలో ఆయన పేరు మీదే ఏర్పాటు చేసిన షేక్స్పియర్ రాయల్ థియేటర్లో క్రిస్మస్ శాంతి ఒప్పందం ఇతివృత్తంగా ఒక నాటకం వేదిక ఎక్కబోతున్నది. మొదటి ప్రపంచంలో పాల్గొన్న వార్విక్ సైనికులే పాత్రలుగా ఈ నాటకం రూపొందుతోంది. ఈ ప్రాంతంలోనే పుట్టి ఆ యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్ రాబర్ట్ హ్యామిల్టన్ అక్షరబద్ధం చేసిన కొన్ని అనుభవాల ఆధారంగా ఫిల్ పోర్టర్ అనే నాటకకర్త రాసిన నాటకమిది. మొదటి ప్రపంచ యుద్ధం నూరేళ్ల సందర్భంగా జరప తలపెట్టిన కార్యక్రమాల గురించి చర్చించడానికి మొన్న మార్చిలో ఏర్పాటు చేసిన ఒక సమావేశమే ఫిల్కు ఈ నాటకం రాయడానికి ప్రేరణ ఇచ్చింది. మహాయుద్ధంలో పాల్గొన్న సైనికుల వారసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కుటుంబాలకు ఆ సైనికులు చెప్పిన జ్ఞాపకాలనూ, రాసిపెట్టిన కథనాలనూ ఈ సమావేశంలో వారంతా వినిపించారు. - డా. గోపరాజు నారాయణరావు -
నో షేవ్ నవంబర్
ప్రొస్టేట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేందుకు కళాకారులంతా ఒక్కటయ్యారు. మారియట్ హోటల్ మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో శుక్రవారం ప్రారంభమైన ‘నో షేవ్ నవంబర్’ ఫొటో ఎగ్జిబిషన్‌ను వేదికగా చేసుకున్నారు. 35 ఏళ్లు దాటిన మగవాళ్లలో వచ్చే ఈ క్యాన్సర్‌ని ఆదిలోనే గుర్తిస్తే అంతమొందించొచ్చనే జాగృతిని కల్పించే విధంగా 54 రకాల ఫొటోలను ప్రదర్శనకు ఉంచారు. ఇందులో హీరోయిన్లు సంజన, సదా, అక్ష, సుప్రియా ‘నో షేవ్ నవంబర్’ పేరుతో ప్లకార్డులు పట్టుకున్న ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ‘ప్రపంచమంతా ఈ నెలలో మగవాళ్లు గడ్డాలు, మీసాలు గీసుకోరు. ఎందుకని వారినడిగితే ప్రొస్టేట్ క్యాన్సర్ గురించి వివరిస్తారు. ఇలా ఈ క్యాన్సర్ గురించి ప్రజల్లో జాగృతిని కల్పించే ప్రయత్నం జరుగుతోంద’ని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీ క్యూరేటర్ కాలీ సుధీర్ తెలిపారు. -
గురుత్వాకర్షణ తరంగాలకు.. తారల తళుకులకు లింకు!
న్యూయార్క్: విశ్వంలో అదృశ్యరూపంలో ప్రయాణిస్తూ ఉండే గురుత్వాకర్షణ తరంగాలకు, నక్షత్రాల ప్రకాశానికి సంబంధం ఉందట! ఈ లింకు ఆధారంగా గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించొచ్చని న్యూయార్క్‌లోని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ ఖగోళ భౌతికశాస్త్రవేత్త బారీ మెక్‌కెర్నాన్ వెల్లడించారు. విశ్వంలో పెద్ద గురుత్వాకర్షణ తరంగాలు తమచుట్టూ తాము వేగంగా తిరిగే పెద్ద సైజు ద్రవ్యరాశుల వల్ల ఉత్పత్తి అవుతాయని తెలిపారు. విశ్వంలో గురుత్వాకర్షణ తరంగాల ఉనికిపై ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతంలో ప్రతిపాదించారు. అయితే, గురుత్వాకర్షణ తరంగాల ప్రభావం పదార్థంపై స్వల్పంగానే ఉంటుందని భావిస్తుండగా.. కృష్ణబిలాల వంటి పెద్ద సైజు పదార్థాల నుంచి ఉత్పత్తి అయ్యే గురుత్వాకర్షణ తరంగాలు పదార్థంపై ఎక్కువగానే ప్రభావం చూపుతాయని ప్రస్తుత అంచనా. కానీ, భూమి, అంతరిక్షం నుంచి లేజర్ కిరణాల ప్రయోగాలతోనే గురుత్వ తరంగాలను అంచనా వేస్తున్నారు. అయితే, ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతున్న అతిశక్తిమంతమైన రెండు కృష్ణబిలాల నుంచి వచ్చే గురుత్వ తరంగాల వల్ల సమీపంలోని పెద్దనక్షత్రాలన్నీ ఒకేసారి ప్రకాశవంతంగా మెరిసిపోతాయని, ఆ తర్వాత చిన్న నక్షత్రాలు మెరుస్తాయని, దీన్ని బట్టి గురుత్వ తరంగాలను గుర్తించవచ్చని మెక్‌కెర్నాన్ పేర్కొన్నారు. -
చుక్కల ఆకాశంలోకి...చక్కగా ప్రయాణమై!
రాత్రిపూట ఆకాశంలో చుక్కలను చూస్తుంటే...ఎంత కాదన్నా భావుకత తన్నుకు వస్తుంది. ఆకాశంలోకి వెళ్లి చుక్కలతో చక్కగా మాట్లాడాలనే కల కంటాం కూడా. అది వాస్తవరూపం దాల్చని అందమైన కల. అయితే రాత్రి వచ్చే కలలకు మాత్రం ఈ నిబంధన వర్తించదు. భేషుగ్గా...ఆకాశదేశానికి వెళ్లి అందమైన చుక్కలతో తనివితీరా మాట్లాడవచ్చు. కొద్దిమందికి చుక్కల దగ్గరికి వెళ్లినట్లు కల వస్తుంటుంది. దీని అర్థం ఏమిటో తెలుసుకుందాం... ఆకాశం అనేది మనలో ఎప్పటి నుంచో ఉన్న సుదీర్ఘ లక్ష్యం అయితే, అక్కడికి వెళ్లి చుక్కలను పలకరించడం అనేది లక్ష్యాన్ని చేరుకోవడాన్ని లేదా చేరువ కావడానికి చేసే ప్రయత్నాన్ని సూచిస్తుంది. ఇక ప్రేమికుల విషయంలో అయితే ‘ప్రేమ ఫలించడం’ అనే అర్థంలో దీన్ని చూడవచ్చు. మాటమాత్రంగా కూడా ఎప్పుడూ ఊహించని అవకాశాలు వచ్చి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసినప్పుడు కూడా ఇలాంటి కలలు వస్తుంటాయి. ఆకాశంలో చుక్కలు ఉన్నట్టుండి రాలిపడడం, లేదా ఆకాశం నల్లగా మారి చుక్కలు కనిపించకపోవడం అనేది... మంచి అవకాశం ఒకటి వచ్చినట్లే వచ్చి చేజారడాన్ని సూచిస్తుంది. కొన్ని మానసిక విశ్లేషణల ప్రకారం, వచ్చే జన్మ లక్ష్యాలను ఇప్పుడే నిర్దేశించుకొని వాటి గురించి ఎక్కువగా ఆలోచించేవారికి కూడా చుక్కల మధ్య విహరించినట్లు కలలు వస్తాయి. ఆధ్యాత్మిక విశ్లేషణల ప్రకారం అయితే, సరికొత్త జ్ఞానానికి చేరువ కావడాన్ని ఈ కల సూచిస్తుంది. శాస్త్రసాంకేతిక విషయాల మీద ఆసక్తి ఉన్నవాళ్లకు, అంతరిక్షం ఎప్పుడూ ఒక ప్రహేళిక లాంటిదే. వారిలో ఎప్పటికప్పుడు ఎన్నో ప్రశ్నలు మొలకెత్తుతుంటాయి. వాటికి సమాధానాలు మాత్రం అంత తేలిగ్గా దొరకవు. అలాంటి వారు ఆకాశంలోకి వెళ్లి చుక్కలతో మాట్లాడడం అనేది... సమాధాన తృష్ణను ప్రతిబింబిస్తుంది. -
విశ్వ రహస్యాల అన్వేషణకు ‘భేష్’!
చుక్కల లోకం గుట్టు విప్పాలి. గామా కిరణాల లోగుట్టు పసిగట్టాలి. ఖగోళ చరిత్రను మలుపు తిప్పాలి. ఈసీఐఎల్ మేస్ టెలిస్కోపు అదే చేయబోతోంది అందుకే లడఖ్‌కు బయలుదేరింది... విశ్వాంతరాళాల నుంచి దూసుకువచ్చి లిప్తపాటులో మాయమయ్యే కాంతిపుంజాలను ఒడిసిపడితేనే అల్లంత దూరంలోని చుక్కల లోకం గుట్టు తెలుస్తుంది. నక్షత్రాలు, వాటి పేలుళ్ల వెనక ఉన్న మర్మం అంతు పడుతుంది. భూ వాతావరణంలోకి ప్రవేశిస్తూనే రూపుమార్చుకునే గామా కిరణాల ఉనికిని గుర్తిస్తేనే ఖగోళం సంగతులు అర్థమవుతాయి. అందుకే.. గామా కిరణాల గుట్టు విప్పేందుకు హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) శాస్త్రవేత్తలు మేస్ టెలిస్కోపును తయారు చేశారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోపు, ఎత్తై ప్రదేశంలో ఏర్పాటుచేసే అతిపెద్ద టెలిస్కోపు అయిన మేస్ ఇంతకూ ఏం చేస్తుంది? దీని కథాకమామిషు ఏమిటి? గామా కిరణాలపై నిఘా నేత్రం... విశ్వం పుట్టు, పూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలంటే రోదసిలో సుదూర తీరాల నుంచి దూసుకువచ్చే శక్తిమంతమైన గామా కిరణాలపై అధ్యయనం ఓ మంచి అవకాశం. మిలమిల మెరిసే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రపేలుడు అవశేషాలు, గెలాక్సీ కేంద్రాలు, మొదలైన వాటి నుంచి వెలువడే గామా కిరణాలపై అధ్యయనం వల్ల వాటి గురించి తెలుసుకునేందుకు వీలవుతుంది. తద్వారా ఖగోళ భౌతికశాస్త్రం, ప్రాథమిక భౌతికశాస్త్రం, గామా కిరణాల ఆవిర్భావం, వాటి వేగం వెనక ఉన్న ప్రక్రియ గురించి మరింత బాగా అవగాహన చేసుకోవచ్చు. అయితే ఈ గామా కిరణాలు అత్యధిక శక్తితో దూసుకొస్తుంటాయి. చాలా శక్తితో కూడిన ఈ ఫొటాన్లను భూమిపై నుంచి నేరుగా గుర్తించడం సాధ్యం కాదు. మామూలుగా అయితే ఇవి నేరుగా భూమికి చేరితే జీవకోటి ఉనికికే ప్రమాదకరం. కానీ ఈ కిరణాలు భూవాతావరణంలోకి ప్రవేశించగానే విద్యుదావేశ కణాలను వెదజల్లుతాయి. ఫలితంగా నీలికాంతితో కూడిన రేడియేషన్ ఫ్లాష్ మాదిరిగా మెరిసి మాయమైపోతుంది. ఇదెంత వేగంగా జరుగుతుందంటే ఒక సెకనులో కొన్ని వందల కోట్ల వంతు సమయంలోనే. దీనినే సెరెంకోవ్ కాంతి లేదా సెరెంకోవ్ రేడియేషన్ అంటారు. ఈ కాంతిని గుర్తించి ఫొటోలు తీయడంతోపాటు ఇతర సమాచారాన్ని అందించడమే మేస్ టెలిస్కోపు పని అన్నమాట. పనితీరు ఇలా... మేస్ టెలిస్కోపులో కాంతిని పసిగట్టేందుకు 356 అద్దాల పలకలు ఉంటాయి. టెలిస్కోపు కేంద్రభాగంలో ప్రతిఫలించే సెరెంకోవ్ ప్రక్రియలు, వాటి లక్షణాలను పసిగట్టేందుకు 1200 కిలోల బరువైన హైరెసోల్యూషన్ ఇమేజింగ్ కెమెరా ఉంటుంది. ఇది సెరెంకోవ్ కాంతిని ప్రతిఫలింపచేసే లైట్ కలెక్టర్లకు అభిముఖంగా ఉంటుంది. వీటన్నిటి సమన్వయంతో గామా రే ఫొటాన్ను శక్తిని, చిత్రాన్ని ఈ టెలిస్కోపు రికార్డు చేస్తుంది. సమాచారాన్ని గంటకు 50 జీబీల వేగంతో ఆప్టికల్ ఫైబర్ ద్వారా కంట్రోల్‌రూంలోని కంప్యూటర్ సిస్టమ్‌కు చేరవేస్తుంది. ఆరు చక్రాలతో ఉండే మేస్ ఆకాశంలో ఏ దిక్కున ఉన్న ఖగోళ వస్తువునైనా పరిశీలించేందుకు అనుగుణంగా తిరగగలదు. ఇప్పటిదాకా అమెరికా, యూరోప్వంటి దేశాలు, సమాఖ్యలే ఇంత భారీ టెలిస్కోపులను నిర్మించాయి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (ముంబై) సహకారంతో దీనిని ఈసీఐఎల్ స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించింది. సౌర విద్యుత్‌తో పనిచేసే మేస్ ప్రారంభమైతే.. గామా రే అధ్యయనంలో భారత్ కీలక స్థానంలో నిలవనుంది. ప్రత్యేకతలు... ప్రపంచంలో ఎక్కడినుంచైనా దీనిని రిమోట్‌తో నియంత్రించవచ్చు. గంటకు 30 కి.మీ. వేగంతో గాలులు వీచినా స్థిరంగా నిలబడగలదు. పార్కింగ్ పొజిషన్లో ఉంచితే గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీచినా తట్టుకోగలదు. నిర్దేశిత ఖగోళ వస్తువును నిరంతరాయంగా, కచ్చితత్వంతో అనుసరిస్తుంది. దిశను, ఎత్తును కూడా ఆటోమేటిక్‌గా మార్చుకుంటుంది. ‘మేస్’డేటా! పూర్తిపేరు: మేజర్ అట్మాస్ఫెరిక్ సెరెంకోవ్ ఎక్స్పెరిమెంట్ (మేస్) గుర్తింపు: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గామా రే టెలిస్కోపు ఎత్తై ప్రాంతంలో ఏర్పాటయ్యే అతిపెద్ద టెలిస్కోపు ఎత్తు: సముద్రమట్టానికి 4,500 మీటర్లు వ్యాసం: 21 మీటర్లు బరువు: 180 టన్నులు ఖర్చు: రూ.45 కోట్లు స్థలం: హన్లే, లడఖ్ ప్రారంభం: 2016, జనవరిలో -
న్యూ స్పేస్ టెక్నాలజీ...గ్రహశకలాలకు ‘గాలం’!
గ్రహాలు, గ్రహశకలాలపై అధ్యయనం ద్వారా విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, మన భూమి పుట్టుపూర్వోత్తరాల గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు. అందుకే.. గ్రహాలు, గ్రహశకలాల నుంచి మట్టి, శిలల నమూనాలను సేకరించేందుకు శాస్త్రవేత్తలు ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. కానీ.. ఇప్పటిదాకా చంద్రుడు, ఇటోకవా అనే గ్రహశకలం నుంచి మాత్రమే నమూనాలు సేకరించగలిగారు. సుదూర ప్రదేశాలకు ప్రయాణించి గ్రహాలపై, గ్రహశకలాలపై వ్యోమనౌకలను దింపి నమూనాలను సేకరించి.. భూమికి తీసుకురావడమన్నది ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. క్యూరియాసిటీ లాంటి రోవర్లు గ్రహాలపై దిగి మట్టిని విశ్లేషించి సమాచారం పంపగలిగినా.. మనిషి నేరుగా చేసే పరీక్షలకు, యంత్రాలు చేసే పరీక్షలకూ చాలా తేడా ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఇప్పటిదాకా ఆశించిన పురోగతి సాధ్యం కాలేదు. అయితే.. గ్ర హశకలాలకు ‘గాలం’ వేసి వాటి నుంచి నమూనాలు సేకరించే పనిని సులభం చేసే ఓ అద్భుత స్పేస్ టెక్నాలజీని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన రాబర్ట్ వింగ్లీ బందం అభివద్ధిపరుస్తోంది. ఖగోళ వస్తువుల నుంచి నమూనాల సేకరణను కొత్తపుంతలు తొక్కించనుందని భావిస్తున్న ఈ అంతరిక్ష ‘గాలం’ సంగతేంటో చూద్దాం... ఈటెలు రువ్వి... నమూనాలు సేకరిస్తారు! చేపలు పట్టడానికి గాలం ఉపయోగిస్తారు. తిమింగలాలు పట్టేందుకు? ఈటెల్లాంటి పెద్ద గాలాన్ని ఉపయోగిస్తారు. కాకపోతే చేపలకు కొక్కెంలాంటి గాలం వేస్తారు. తిమింగలాలకు ఈటెలాంటి హార్పూన్ (తెలుగులో పంట్రకోల, రువ్వుటీటె అంటారు)లను యంత్రాల సాయంతో వేగంగా వదులుతారు. ముందు భాగం బాణంలా ఉండే ఈ హార్పూన్ తిమింగలాల శరీరంలోకి దిగిన తర్వాత చిక్కుకుపోతుంది. దీంతో హార్పూన్‌ను బలమైన తాడుతో మోటార్ల సాయంతో వెనక్కి లాగుతూ తిమింగలాలను ఓడ దగ్గరికి తీసుకొస్తారు. మరి.. ఈ ఐడియాను అంతరిక్షంలో ఎలా ఉపయోగిస్తారంటే... రాకెట్ మాదిరిగా మొనదేలిన కవచంతో ఉన్న హార్పూన్లను వ్యోమనౌకల ద్వారా పంపుతారు. హార్పూన్‌ను వ్యోమనౌక కు మైళ్లకొద్ది పొడవుండే దఢమైన తాడుతో కడతారు. చంద్రుడు లేదా ఓ గ్రహ శకలం సమీపంలోకి వ్యోమనౌక వెళ్లిన తర్వాత హార్పూన్ బలంగా విడుదలవుతుంది. దీంతో సెకనుకు ఒక కి.మీ. వేగంతో హార్పూన్ దూసుకుపోయి ఆ ఖగోళ వస్తువు ఉపరితలంలోకి దిగబడిపోతుంది. హార్పూన్ నేలలోకి దిగిపోగానే దాని కవచం విడిపోతుంది. ఇంకేం.. లోపల ఉండే డబ్బాలోకి కొన్ని కిలోల వరకూ మట్టి, రాళ్లు చేరిపోతాయి. శాంపిల్‌తో కూడిన హార్పూన్‌ను తాడు సాయంతో వ్యోమనౌక వెనక్కి లాక్కుని భూమికి తిరిగి వచ్చేస్తుందన్నమాట. నాసా నుంచి రెండేళ్లుగా నిధులు అందుకుంటున్న శాస్త్రవేత్తలు ఈ స్పేస్ హార్పూన్ని బ్లాక్‌రాక్ ఎడారిలో ఇటీవల విజయవంతంగా పరీక్షించారు. అంతరిక్షంలోనూ హార్పూన్ల ప్రయోగానికి వీరు సిద్ధమవుతున్నారు. ప్రయోజనాలు చాలానే... స్పేస్ హార్పూన్లతో గ్రహశకలంపై వేర్వేరు చోట్ల శాంపిళ్లను సేకరించవచ్చు. వ్యోమనౌకను దింపాల్సిన అవసరం లేనందున ఇంధనం బాగా ఆదా అవుతుంది. గ్రహాల ఉపరితలంపై కొన్ని మీటర్ల లోతు నుంచీ నమూనాలు సేకరించొచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా.. విఫలమైన ఉపగ్రహాలకు చెందిన శకలాలు ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, మనం పంపే ఉపగ్రహాలకు ముప్పు తెస్తున్నాయి. అలాంటి శకలాలపైకి హార్పూన్లను వదిలి, అవి గుచ్చుకున్నాక.. శకలాలను భూవాతావరణంలోకి ఈడ్చుకొచ్చి మండించొచ్చని అంటున్నారు. అలాగే.. భూమిపై అగ్నిపర్వతాల బిలాల నుంచి, అణు ప్రమాదాలు జరిగి రేడియోధార్మికత తీవ్రంగా ఉన్న చోటు నుంచి, ఇతర ప్రతికూలమైన ప్రదేశాల్లో ఆకాశం నుంచే శాంపిళ్లను సేకరించొచ్చని చెబుతున్నారు. -
చండీగఢ్‌లో మెరిసే 'తార' ఎవరో ?