నేలకు దిగిన నక్షత్రాలు | Christmas Figurines and Statues | Sakshi
Sakshi News home page

నేలకు దిగిన నక్షత్రాలు

Published Sun, Dec 20 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:15 PM

నేలకు దిగిన నక్షత్రాలు

నేలకు దిగిన నక్షత్రాలు

యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ ఫలాలతో నిండి, యేసు చుట్టూ తిరుగుతూ నృత్యం చేశాయట. పక్షులు, పువ్వులు కూడా ఈ ఆనందలో పాలు పంచుకున్నాయట. ఆ సందడి చూసి ఆకాశం లోని చుక్కలు నేలకు దిగి వచ్చి వెలుగులు విరజిమ్మాయట. కానీ ‘ఫర్ ట్రీ’ (క్రిస్మస్ ట్రీ) అనే చెట్టు దిగులుగా కనిపించిందట. ఇది గమనించిన చుక్కలు ఆ చెట్టుని ‘ఎందుకు దిగులుగా ఉన్నావు?’ అని ప్రశ్నించాయి. ‘‘ఆ చెట్లకేమో ఫలాలున్నాయి. ఈ మొక్కలకేమో పువ్వులు ఉన్నాయి. అందుకే అవి అందంగా ఉన్నాయి.

ఫలాలు, పువ్వులు లేని నేను ఎలా సంబరాలు జరుపుకుంటాను?’’ అందట దిగులుగా. నక్షత్రాలు జాలి పడి తమ అందం, తేజస్సుతో ఆ చెట్టును నింపి ఆ సంబరంలో దాన్నో ప్రత్యేక ఆకర్షణగా నిలిపాయట. ఇది చాలా ప్రాంతాల్లో చెప్పుకునే కథ. అయితే క్రీస్తు పుట్టిన సమయంలో ఆకాశంలో ఓ కొత్త తార పుట్టి, అది గొర్రెల కాపరులకు, ముగ్గురు జ్ఞానులకు ఆయన దగ్గరకు వెళ్లే దారి చూపించిందని బైబిల్ చెబుతోంది. దానికి గుర్తుగానే ఇంటి వద్ద స్టార్ పెట్టడం, క్రిస్మస్ ట్రీకి కూడా స్టార్స్ తగిలించడం జరుగు తోందనేది అందరి నమ్మకం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement