Bible
-
ప్రభువునందు ఆనందించుటే ఆత్మసంబంధ పండుగ
‘ఒకని జన్మ దినము కంటె మరణ దినమే మేలు’ అన్నది దేవుని దృష్టికోణం. ఉన్నతంగా చెప్పబడిన ఈ మాట అందరి గూర్చి అయినా, మరి ముఖ్యంగా, ఒక్క క్రీస్తును గురించి మాత్రమే ఇది చెప్పబడిందంటూ బైబిలు పండితులు వ్యాఖ్యానిస్తుంటారు. సువార్తలు రెండు మూడు లేవు. నాలుగైదు లేనే లేవు. ఒక్కటే సువార్త. అదే క్రీస్తు మరణ సువార్త. ఒక్క క్రీస్తు మరణాన్ని సువార్తగా కాకుండా ఇక వేరే ఏది సువార్తగా ప్రకటించిన వాడు శాపగ్రస్తుడని బైబిలు చాలా ఖండితంగా చెప్పుటను ప్రతి ఒక్కరూ మనస్సు పెట్టి అలోచించాలి. (గలతీ 1:6–10 ).‘ఆయన భుజములపై రాజ్య భారముండును’,‘నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది’ అను భవిష్యత్ ప్రవచనాలు క్రీస్తు నందు క్రీస్తు సంఘమనే రాజ్య స్థాపన ద్వారా నెరవేర్చబడ్డాయి. అపొస్తలుల బోధకు కట్టుబడి విధేయంగా దానికి తలవంచే క్రీస్తు ప్రభువు సంఘాలలో ఆత్మసంబంధిత పండుగ వాతావరణం ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది.అపొస్తలుడైన ΄ûలు బోధ ప్రకారంగా ‘ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించుడి. మరల చెప్పుదును. ఆనందించుడి’(ఫిలిప్పీ 4:4). ఒకరు ఇలా ఎల్లప్పుడూ క్రీస్తు నందు ఆనందిస్తే అతనికి నిత్యమూ పండుగే. క్రీస్తు సువార్త విని లోబడి ఒక ΄ాపి రక్షించబడితే ఇలా మరణంలో నుండి జీవములోనికి దాటితే పరలోకంలో గొప్ప పండుగ వాతావరణం నెలకొంటుంది. భూలోకం వైపు తొంగి చూస్తూ దేవ దూతలు, దేవ దూతలు సమక్షంలో దేవదూతలే చేసుకోనే పండుగ అది. నిజానికి క్రీస్తు మరణ సత్య సువార్తే ఇంతటి గొప్ప పండుగ వాతావరణాన్ని ఇక్కడ అక్కడ అంతటా సృష్టించ గలదు. సత్య సువార్త అంతటి శక్తిమంతమైనది మరి. ఎందుకంటే ఇది మనిషియోచన వలన కలిగినది కాదు. సమాజంగా కూడి క్రీస్తు పునరుత్థాన దినమనే ప్రభువు దినమును పరిశుద్ధ దిన ఆచారంగా ఎంచి క్రీస్తు ద్వారా దేవున్ని ఆరాధిస్తూ ఇలా ఆత్మసంబంధంగా ఆనందిస్తే అదే సంఘమునకు అసలు సిసలైన పండుగ వాతావరణం. దీన్నే ఇశ్రాయేలీయుల రాజైన క్రీస్తు ప్రభువు నందు ఆనందించడంగా చెప్పవచ్చు. ఇది పండుగ కంటే మించినది. వారమునకు ప్రప్రథమ దినములైన ఒక సంవత్సరంలోని యాభై రెండు ఆదివారాలు ప్రభువు నందు ఆనందించగలిగితే అవి క్రైస్తవులకు ఎప్పుడూ పండుగ దినములే.ప్రతి ఆదివారం క్రీస్తు ద్వారా దేవున్ని ఆరాధించడం దేవుని రాజ్యానికి ఆయన నీతికి ప్రప్రథమ స్థానం ఇవ్వడంగా, వాటిని మొదట వెదకడంగా గ్రంథం చెబుతుంది. దేవుడు ఘనపరచి గొప్ప చేసిన ఉపదేశ క్రమాన్ని అనుసరించి చూస్తే,అపొస్తలుల బోధ ప్రకారంగా క్రైస్తవులు పరిశుద్ధ లేఖనాలను మీరి తమకు నచ్చినట్టుగా ఏ పండుగలు చేయకూడదు. దేవుడు చేయమని అజ్ఞాపించి చెప్పిన పండుగలు అన్నీ ΄ాత నిబంధనలోనే ఉన్నాయి. ఇప్పుడైతే, భౌతిక సంబంధ ఆచార వ్యవహారాలతో ముడిపడిన పండుగలు చేసి దేవుని ఏనాడూ ఘనపరచలేరు.ధర్మశాస్త్రంలోని ముఖ్యమైన ఏడు పండుగలు అన్నీ కొత్తనిబంధన ఆత్మ సంబంధ ఆరాధనలోకి వచ్చి చేరి ఇలా విలీనం అయ్యి అందు ఒద్దికగా నిండుగా నిక్షిప్తమవడం విశేషం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు ద్వారా అద్వితీయ సత్యదేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించుటను మించిన పరిశుద్ధ దినం, ఇట్టి పండుగ వాతావరణం మరొకటి ఎక్కడా కానరాదు. మనోనేత్రాలు వెలిగించబడితేనే ఈ సత్యం అర్థమవుతుంది. భౌతికపరమైన పండుగలు ఆచార వ్యవహారాలు అన్నీ క్రీస్తునందు సిలువలో కొట్టివేయబడ్డాయి. మృత్యుంజయుడైన క్రీస్తును బట్టి నూతన సృష్టి అనబడే క్రైస్తవులకు సంవత్సరంలోని ప్రతి ఒక్క ఆదివారం ఆత్మ సంబంధ పండుగ దినమే.అపొస్తలులు, ఆదిమ సంఘము వారు ఆత్మ సంబంధులుగా సత్య సంబంధులుగా పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించారు తప్ప వారు ఎలాంటి పండుగలు చేయలేదు. వారి బోధలు, వారి వారి నడతలు మనకు ఎప్పుడూ శిరోధార్యమే అనుటలో ఎలాంటి సందేహం లేదు. క్రొత్త నిబంధన పూర్తిగా ఆత్మ సంబంధమైనది. దాన్ని అలాగే మనం ఆచరించబద్దులము. – జేతమ్ -
కిమ్ దేశంలో దారుణ శిక్షలు.. రెండేళ్ల చిన్నారినీ వదల్లేదు!
ఉత్తరకొరియా అధ్యక్షుడి నిరంకుశ పాలన గురించి తరచూ వార్తల్లో వింటూనే ఉంటాం. వివాదాస్పద నిర్ణయాలతో గ్లోబల్ మీడియాలో నిలుస్తుంటారు. భయంకరమైన చట్టాలతో దారుణ శిక్షలకు గురిచేస్తుంటారు. ఇలాంటి ఓ విషయాన్నే అమెరికా నివేదిక వెల్లడించింది. ఆ దేశంలో బైబిల్ కలిగి ఉన్నవారికి మరణశిక్షను విధిస్తున్నారంట. ఆ కుటుంబ సభ్యులను కఠిన శిక్షలకు గురిచేస్తున్నారు. అలా ఓ రెండేళ్ల చిన్నారికి కూడా జీవితఖైదు విధించినట్లు నివేదిక పేర్కొంది. జైళ్లలో మగ్గుతున్న 70 వేల మంది అమెరికా విదేశాంగ శాఖ 'అంతర్జాతీయ మత స్వేచ్ఛ 2022' పేరుతో ఓ నివేదిక విడుదల చేసింది. ఉత్తరకొరియాలో ఇతర మత విశ్వాసాలను అవలంభించిన వారిపై దారుణంగా ప్రవర్తిస్తున్నారని నివేదిక పేర్కొంది. దాదాపు 70 వేల మంది క్రిస్టియన్స్ జైళ్లలో మగ్గుతున్నారని వెల్లడించింది. మత గ్రంథాన్ని కలిగి ఉండటం, మతపరమైన కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగాలతో 2009లో ఓ చిన్నారి కుటుంబాన్ని అరెస్టు చేశారు. వారందరికీ జీవిత ఖైదు విధించారని నివేదిక వెల్లడించింది. దారుణ వేధింపులు ఆ దేశంలో మతపరమైన శిక్షలు అనువభవిస్తున్న వారందరు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. శారీరక హింస, జీవించే హక్కుకు భంగం వాటిల్లడం, పారదర్శక విచారణ జరపకపోవడం, లైంగిక వేధింపులతో వారిని వేధిస్తున్నారని నివేదిక వెల్లడిచ్చింది. కొరియా ఫ్యూచర్ అనే లాభాపేక్ష లేని సంస్థ డిసెంబర్ 2021లోనే ఓ నివేదికను విడుదల చేసింది. మతపరమైన స్వేచ్ఛ ఆ దేశంలో అడుగంటిపోయిందని తెలిపింది. మత స్వేచ్ఛను కోరుకుంటే వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపింది. అవయవాల దోపిడి, హత్యలు అత్యాచారం వంటి దారుణాలకు ఒడిగడుతున్నారని పేర్కొంది. చదవండి: ‘స్నేక్ వైన్’ అంటే ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే... -
ఆసియాలో అతిపెద్ద చర్చి కరుణాపురంలో
ఎటుచూసినా ఉట్డిపడుతున్న కళాసంపద...జెరూసలెం నుంచి తెచ్చిన మట్టి..బైబిల్ నియమాల ప్రకారం కట్టడాలు.. భక్తులే భాగస్వాములై రోజుకు 500 మంది చొప్పున స్వచ్ఛందంగా నిర్మాణ పనుల్లోపాలుపంచుకున్న వైనం.. ఏకకాలంలో సుమారు 30 వేల మంది ప్రార్థన చేసుకొనే వీలు.. ఇవీ వరంగల్ శివారు కరుణాపురంలో 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం విశిష్టతలు. ఆసియా ఖండంలో అతిపెద్ద చర్చిగా నిర్వాహకులు పేర్కొంటున్న ఈ ప్రార్థనా మందిరం ఈ నెల 4న అంగరంగ వైభవంగా ప్రారంభానికి సిద్ధమైంది. ప్రారంబోత్సవానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, అన్ని వర్గాల వారిని అహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు, దైవజనులు పాల్సన్రాజ్, జయప్రకాష్లు తెలిపారు. లక్ష మందికి భోజనాలు ఏర్పాటు చేశామన్నారు. అద్భుత కట్టడంగా.. కరుణాపురం క్రీస్తు జ్యోతిప్రార్ధన మందిరం అపురూప కట్టడంగా దర్శనమిస్తోంది. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాది వేశారు. రెండంతస్తుల్లో హాల్‌ను రూపొందించారు. చర్చి నిర్మాణానికి ఇప్పటివరకు రూ. 70 కోట్లు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. చర్చి ప్లింత్ ఏరియా 1,50,000 చదరపు అడుగులు కాగా, మొత్తంగా 240 అడుగుల వెడల్పు, 240 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించారు. ఇందులో ఒకేసారి 30 వేల మంది భక్తులు ప్రార్థనలు చేసుకోవచ్చు. వికీపీడియా ప్రకారం ఆసియాలో అతిపెద్ద చర్చిగా నాగాలాండ్‌లోని జున్హెబోటోలో ఉన్న బాప్టిస్ట్ చర్చి ఉంది. ఆ చర్చి పొడవు 203 అడుగులు, వెడల్పు 153 అడుగులు, ఎత్తు 166 అడుగులు. అందులో ఏకకాలంలో 8,500 దాకా ప్రార్థనలు చేసుకొనే వెసులుబాటు ఉంది. ప్రస్తుతం కరుణాపురంలో నిర్మితమైన క్రీస్తుజ్యోతి ప్రార్థనా మందిరం నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చి కౌన్సిల్‌తో అనుబంధంగా ఉండటం విశేషం. ప్రత్యేకతలు ఇవీ.. ♦ చర్చి పైభాగంలో అమర్చిన అల్యూమినియం గోపురాన్ని (డోమ్) అమెరికా నుంచి తెప్పించారు. ఫ్రాన్స్ నుంచి నెక్సో సౌండ్ సిస్టం కొనుగోలు చేశారు. ♦ మందిరం లోపల రీసౌండ్ రాకుండా సౌండ్‌ప్రూఫ్ మెటీరియల్ అద్దారు. ♦ భక్తుల కోసం హెలికాప్టర్ పంకా తరహాలో భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. ♦ ప్రార్థనామందిరం లోపల వియత్నాం నుంచి తెచ్చిన మార్బుల్స్ వేశారు. ♦ పిల్లర్ల నిర్మాణంలో హాలెండ్ టెక్నాలజీ వాడారు. చర్చి భవనం చుట్టూ ఏసుక్రీస్తు జన్మవృత్తాంతాన్ని అద్దాల చిత్తరువులతో రూపొందించారు. ♦ ఎల్ఈడీ స్క్రీన్స్‌తో కూడిన ప్రత్యేక వేదిక, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ♦ చుట్టూ దీపస్తంభాలు.. ఇంకుడు గుంతలు నిర్మించారు. ♦ భవనం శంకుస్థాపనలో జెరూసలెం నుంచి మట్టి.. బైబిల్లో పేర్కొన్న విధంగా వజ్రాలు, రాళ్లు వేశారు. చర్చి చుట్టూ ఆలివ్ (ఏసుక్రీస్తు ప్రార్థనలు ఈ ఆలివ్ చెట్ల మధ్యనే ప్రార్థనలు చేసేవారు) చెట్లు ఏర్పాటు చేశారు. -
భయం నుండి విడుదల
కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును (సామె 1:33). మానవుని పట్టి పీడుస్తున్న అనేక భయాల్లో ఒకటి ‘భవిష్యత్తును గూర్చిన భయం’. తనకు వచ్చే రోగాల్ని బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, గత జీవితాన్ని గురించి భయపడేది కేవలం పది శాతమైతే మిగతా తొంభైశాతం భయం భవిష్యత్తులో ఏం జరగబోతుంది... అనే దానిపై ఆధారపడి ఉంటుందని మానసిక శాస్త్రవేత్తల వివరణ. భవిష్యత్తును గూర్చి తెలీదు గనుక దాని గురించి భయపడడం సహజం. అయితే కొందరు ప్రతి చిన్నదానికి భయపడి తమ చుట్టూ ఉన్నవారిని భయపెడుతుంటారు. దినదినం మానవుడు భయం గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాడన్నది వాస్తవ దూరం కాదు. భయంతో మనిషి తన జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాడు. ఆనందమయం చేసుకోలేకపోతున్నాడు. భయం మనిషిలో ఉన్న స్వాభావిక ధైర్యాన్ని నిర్వీర్యం చేస్తుంది. భయం వలన మానవుడు తాను చేయాలనుకున్న పనులు చేయలేడు. అనేక మంచికార్యాలను నిలువరించే శక్తి భయానికి మాత్రమే ఉంది. భవిష్యత్తు చాలా అందమైనది. సర్వశక్తుడైన క్రీస్తులో అది సురక్షితమైనది. భవిష్యత్తు మీద ఉన్న ఆశలను నిర్వీర్యం చేసేది నీలో ఉన్న భయమే. జీవితంలో కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని నిర్దిష్ట పరిధుల్లో భయం ఉండడం సహజమే కానీ కొంతమంది భయకారణం లేని చోట కూడా విపరీతంగా భయపడుతూ ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణాల్లో ఒకటి మనిషిలో ఉన్న భయాన్ని పోగొట్టుట. రాత్రివేళ తమ మందను కాచుకొంటున్న గొర్రెల కాపరులకు ఇయ్యబడిన వాగ్దానం భయపడకుడి. వారికున్న భయం బహుశా ఇంకెంత కాలం ఈ గొర్రెలను మేపుతూ ఉండాలి? వాటిని ప్రజల పా పపరిహారార్థమై దేవాలయానికి తరలించాలి? దూత చెప్పిన వర్తమానం వారి కోసం రక్షకుడు వచ్చాడు. ఆయన సర్వలోక పా పా న్ని మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని వాక్యమైన బైబిల్లో అనేకచోట్ల భయపడకుడి అనే వాగ్దానం స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి గుండెల్లో గూడు కట్టుకుపోయిన భయాన్ని రూపుమాపడానికే దేవుడు ఈ లోకానికి అరుదెంచాడు. ఆయన ధైర్యవంతుడు గనుకనే ఆయనలో ఉన్న ధైర్యాన్ని ఉచితంగా మనకు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. యేసుక్రీస్తు నీ హృదయంలో ఉంటే ‘దేవుడు నాకు వెలుగును రక్షణయునై యున్నాడు నేను ఎవరికి భయపడుదును’ అని దావీదు వలే నువ్వు కూడా చెప్పగలవు (కీర్తన 27:1). శత్రువులతో తరుమబడినప్పుడు తల దాచుకోవడానికి కూడా అవకాశం లేని సందర్భాల్లో దేవునియందు విశ్వాసముంచి తనలో ఉన్న ప్రతి భయాన్ని జయించిన దావీదు ధన్యజీవిగా మారాడు. నీవు దేవునియందు నమ్మికయుంచి ధైర్యంతో ముందుకు సాగిపో మిత్రమా! – డా. జాన్ వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ -
అతి చిన్న బైబిల్
బైబిల్ కావాలంటే ఎక్కడైనా దొరుకుతుంది. కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న ఈ బైబిల్ చూడాలంటే మాత్రం బ్రిటన్‌లోని లీడ్స్ సిటీ లైబ్రరీకి వెళ్లాలి. అంతేకాదు... చదవాలంటే భూతద్దం కావాలి. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత చిన్న బైబిల్. ఐదు సెం.మీ. పొడవు... మూడున్నర సెం.మీ. వెడల్పు, పలుచటి ఇండియన్ పేపర్‌తో దీన్ని రూపొందించారు. సాధారణంగా బైబిల్స్ పాతనిబంధన, కొత్త నిబంధన ప్రకారం విడివిడిగా ఉంటాయి. కానీ రెండింటినీ కలిపి 876 పేజీల్లో ప్రింట్ చేశారు. 1911లో రూపొందించినట్టుగా భావిస్తున్న ఈ బైబిల్ 16వ శతాబ్దానికి చెందిన ‘చైన్డ్ బైబిల్’ అనుకరణగా భావిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో లీడ్స్ లైబ్రరీలో ఎన్నో పురాతన పుస్తకాలను కనిపెట్టారు. దాదాపు 3 వేల పుస్తకాలను వెలుగులోకి తేగలిగారు. కొన్ని 15వ శతాబ్దానికి చెందినవి కూడా అందులో ఉన్నాయి. ఆ సమయంలోనే ఈ టినీ బైబిల్ లైబ్రేరియన్ కంటపడింది. ఈ టినీ బైబిల్ పబ్లిష్ అయిన కాలంలో అతి చిన్న బైబిల్‌గా నమోదైందని, కానీ ఇది నిజం కాకపోవచ్చని స్పెషల్ కలెక్షన్స్ సీనియర్ లైబ్రేరియన్ రిహాన్ ఇస్సాక్ చెబుతున్నారు. ఇదెక్కడినుంచి వచ్చిందన్న సమాచారం కూడా తమ దగ్గర లేదని, ఎవరైనా డొనేట్ చేసిందై ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. అయితే... ఇదే అతి చిన్నదా? ఇంతకుముందేమైనా ఉన్నాయా? వంటి విషయాలన్నీ పక్కన పెడితే.. ఆ బైబిల్‌ను చూసేందుకు విద్యావేత్తలు, పరిశోధకులు వస్తారని లైబ్రరీ నిర్వాహకులు భావిస్తున్నారు. ఆసక్తి ఉంటే సాధారణ పౌరులు సైతం వచ్చి ఈ బైబిల్ చదవొచ్చని లైబ్రేరియన్ ఇస్సాక్ చెబుతున్నారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
కొత్త విలువలతో సరికొత్తగా జీవిద్దాం...
’రెండేళ్లు గడిచిన తర్వాత’ ఫరో ఒక కల కన్నాడని బైబిల్ చెబుతోంది (ఆది 41:1). కాలం సరస్సు లాగా నిలకడగా ఉండదు, ఒక నది లాగా అది సాగిపోతూనే ఉంటుంది. హెబ్రీయుల మూలపితరుల్లో ఒకరైన యాకోబు ముద్దుల కుమారుడు యోసేపు, ఈజిప్ట్ దేశంలో అకారణంగా, చెయ్యని నేరానికి గాను అన్యాయంగా జైల్లో గడిపిన ’ren-de’ గడిచిపోయాయంటాడు పరిశుద్ధాత్మ దేవుడు. కేవలం 17 ఏళ్ళ యువకుడుగా యోసేపు కన్న ఒక కల అతని భవిష్యత్తును ఒక భయంకరమైన ’పీడకల’గా మార్చేసింది. అతని 11 మంది సోదరులనూ అతడే ఏలుతాడన్న భావం వచ్చే ఆ కలను బట్టి, సోదరులు పగబట్టి అతన్ని ఈజిప్ట్ వర్తకులకు ఒక బానిసగా అమ్మేసి, అడవిలో క్రూర మగం దాడి చేసి అతన్ని చంపేసిందని తండ్రికి అబద్ధం చెప్పారు. ఈజిప్తులో పోతీఫెరనే ఈజిప్ట్ సైన్యాధిపతి అతన్ని బానిసగా కొనుక్కోగా తన తెలివితేటలు, దేవుని అపారమైన కృపతో అతని ఇల్లంతటిలో అతి ముఖ్యుడుగా యోసేపు ఎదిగాడు. కానీ తన నీతివంతమైన, భక్తిపూర్వకమైన ప్రవర్తనను బట్టి చెయ్యని నేరానికి రెండేళ్లు జైలువాసాన్ని అనుభవించాడు. ఆ రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో కన్న ఒక కల భావాన్ని తెలిపేందుకు అతను జైలునుండి విడుదల పొంది వచ్చి ఫరో చక్రవర్తి ముందు నిలబడ్డాడు. రాబోయే ఏడేళ్లు ఈజిప్తులో పుష్కలంగా పంటలు పండుతాయని, ఆ తర్వాత ఏడేళ్లపాటు భయంకరమైన కరువు నెలకొంటుందని దేవుడు ఆ కల ద్వారా ముందుగానే వెల్లడించిన వాస్తవాల్ని యోసేపు ఫరోకు తెలిపాడు. పంటలు పుష్కలంగా పండినపుడు ఆ అదనపు పంటంతా జాగ్రత్తగా కోట్లలో దాచి కరువులో అనేక దేశాల వారికి దాన్నే అమ్మడం ద్వారా ఈజిప్ట్ దేశాన్ని ఒక గొప్ప సంపన్న ఆర్ధికవ్యవస్థగా మార్చుకోవచ్చంటూ యోసేపు సూచిస్తే, ‘యోసేపు దేవుని ఆత్మ, జ్ఞానవివేకాలున్నవాడు’ అని గ్రహించి తన రాజ్యంలో తన తర్వాత రెండవ స్థానానికి హెచ్చించి తన దేశాన్నంతా అతనికి అప్పగిస్తే, యోసేపు ఈజిప్తును ఆ తర్వాతి 14 ఏళ్లలో యోసేపు ఒక మహా సంపన్నమైన, శక్తివంతమైన దేశంగా మార్చాడు. లోకపరమైన ప్రలోభాలు, శోధనలకు అతీతంగా దైవభక్తితో, గొప్ప విశ్వాసంతో సాగే విశ్వాసి జీవితంలో వచ్చే సమస్యలు, ఆటంకాలు కేవలం, అతని జీవితంలో దేవుని శాశ్వతమైన ప్రణాళికల నెరవేర్పును అవి ఎంతమాత్రమూ అడ్డుకోలేవని రుజువు చేసే బైబిల్ ఉదంతమిది. దేవుడేర్పర్చుకున్న వారి మీద లోకంలోని అసమర్థులు వాడే ఆయుధాలే అబద్ధాలు, అసూయ!! జీవితంలో శక్తికి మించిన సమస్యలెదురైనపుడు, అకారణంగా నలిగిపోతున్నపుడు, తన 17 ఏళ్ళ నుండి 30 ఏళ్ళ దాకా యోసేపు తలవంచుకొని బతికాడు. దానికి పరిష్కారంగానే దేవుడు ఫరోకే ఒక కలననుగ్రహిస్తే, దాని భావం తెలిపే స్థాయికి ఒక్క సారిగా దేవుడు అతన్ని ఎంతటి అనూహ్యమైన, అత్యున్నతమైన స్థితికి హెచ్చించాడంటే, అతనిపట్ల అసూయతో, పగతో రగిలిపోయినవాళ్లంతా ఇపుడతణ్ణి తలెత్తి ఆకాశంలో చూడాల్సి వస్తోంది. జీవితంలో కొన్నిసార్లు చితికిపోయి, వెనకబడ్డప్పుడు కంగిపోవడం దేవుని సంకల్పం కానే కాదు. దేవుడు మనల్ని హెచ్చించే సమయం దాకా ఆయన బలమైన బాహువు కింద మనం దీనమనస్కులమై బతకాలన్నదే ఆయన సంకల్పం(1 పేతురు 4:6). దేవునికి తలవంచి దీనంగా బతకడంలో ఉన్న ఆశీర్వాదం, మిడిసిపాటుతో తలెగరేస్తూ, తనకు తిరుగులేదన్నట్టుగా విశృంఖలంగా బతికే అహంకారికి, అసూయాపరుడికి, అసమర్ధుడికి మిన్నువిరిగి మీద పడేదాకా అర్థం కాదు. ఎంతో బలమైన ఇనుప స్తంభాన్ని కూడా తుప్పు తినేసినట్టు, మేధావులను, మహా మహులను కూడా ‘అసూయ’ బలహీనులను చేస్తుంది. అందుకే ప్రేమించడాన్ని మించిన విజయం లేదు, అసూయను మించిన శాపం, శిక్షా లేదు. యోసేపు జీవితం లో పీడకల లాంటి జైలువాసపు రెండేళ్లు గడిచిపోయినట్టే, కోవిడ్ 19 అనే మహమ్మారితో సాగిన గత ఏడాది కూడా గడిచిపోయింది. కొత్త ఏడాదిలో ప్రేమ, శాంతి, సంతృప్తి వంటి దైవిక ఈవులతో పదిమందికీ ప్రయోజనకరం గా బతుకుదాం, ఈ వినూత్న విలువలతో లోకాన్ని వెలుగుమయం చేద్దాం. – రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
విశ్వాసమే నడిపించింది
యేసు ప్రభువు ఈ లోకాన్ని విడిచిన తరువాత శిష్యులందరినీ ప్రభువు సమదృష్టితోనే చూశాడు. అయితే పేతురు. యోహానులను ఎక్కువగా ప్రేమించాడు. వారు కూడా ప్రభువుపై అచంచల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచారు. యేసుక్రీస్తు నామంతో అద్భుతాలను చేశారు. ప్రుభువుపై ఉన్న నమ్మకమే వారిని ఆ విధంగా ప్రేరేపించింది. అంతేకాని వారు తమ శక్తి చేత ఏమీ చేయలేదు. ప్రభువు నామంలో అద్భుతం ఉందని తెలిసి కూడా ఎక్కడా వారు వృథాగా యేసు క్రీస్తు నామాన్ని ఉచ్చరించలేదు. అత్యవసర పరిస్థితులలో ఒక సన్నివేశాన్ని చూసినప్పుడు, బాధ కలిగిన ప్పుడు వారు యేసు నామాన్ని విశ్వాసంతో, నమ్మకంతో పలికేవారు. అటువంటి ఉదంతం బైబిలులో ఉంది. ఒకరోజు దేవాలయంలోనికి పేతురు, యోహాను వెళుతుండగా పుట్టుకతోనే అవిటివాడైన ఒక వ్యక్తిని కొంతమంది మోసుకు వచ్చి అక్కడ దేవాలయపు మెట్లపై కూర్చోబెట్టేవారు. ఆ కుంటివాడు వచ్చి పోయే వాళ్లను చూసి ‘‘ధర్మం చేయండి బాబూ’’ అని అడిగేవాడు. సరిగ్గా అదే సమయానికి పేతురు, యోహాను దేవాలయానికి వెళ్తుండగా వారి చూపు ఆ కుంటివాడి మీద పడింది. తదేకంగా వారు ఆ కుంటివాణ్ణి చూశారు. కుంటి వాడు కూడా వాళ్లు ఏమైనా ఇస్తారేమోనని ఆశగా, ఆబగా వాళ్లవైపు చూస్తూ ఉన్నాడు. అప్పుడు పేతురు, యోహానులు ఆ కుంటివాణ్ణి చూసి ‘‘వెండి, బంగారు మా దగ్గర లేవు. మాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాము’’అన్నారు. ఆ మాటకు వాడి కళ్లు విశాలమయ్యాయి. ఏదో పెద్ద బహుమతి (కానుక) ఇస్తారులే అనుకున్నాడు. పేతురు, యోహాను ఇద్దరూ ఒకేసారి ‘‘నజరేయుడైన యేసుక్రీస్తు నామంతో చెబుతున్నాము. నీవు పైకి లేచి నడుస్తావు’’అని వాడి చేతులు పట్టుకుని విశ్వాసంతో, నమ్మకంతో ప్రకటించారు. ఆశ్చర్యం! ఆ మాటకు వాడి కాళ్ల చీలమండలలో బలమునొంది దిగ్గున లేచాడు. పరుగున దేవాలయంలోనికి వెళ్లి గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించసాగాడు. నమ్మకం, విశ్వాసం దైవంపై ఉంటే ఏదైనా సాధించవచ్చనేదానికి ఈ ఉదాహరణ చాలు. (అపొ.కాం. 3:1–8) – కనుమ ఎల్లారెడ్డి -
ధన్యకరమైన విశ్వాసి దానియేలు
దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నిగో అనే నలుగురు యూదు యువకుల విశ్వాసాన్ని ప్రస్తావిస్తూ, వాళ్ళు ‘సింహాల నోళ్లు మూశారు, అగ్ని బలాన్ని చల్లార్చారు... బలహీనులైనా బలపర్చబడ్డారు’ అని బైబిల్ పేర్కొంది (హెబ్రీ 11:33.34). విశ్వాసం బలహీనుల్ని కూడా మహా బలులను చేస్తుంది. దానియేలు యుక్తవయసులో యెరూషలేము నుండి బబులోను చెరకు బానిసగా వచ్చాడు. కానీ బబులోను చక్రవర్తి దర్యావేషు అతని విశేష ప్రతిభను గుర్తించి, అక్కడి 120 మంది ఉన్నతాధికారులపైన నియమించబడిన ముగ్గురు అత్యున్నతాధికారుల్లో ముఖ్యుడుగా అంటే ప్రధానమంత్రిగా దానియేలును నియమించాడు (దాని6:1,2). ఒక యూదు బానిసకు అన్యదేశంలో దేవుడిచ్చిన అరుదైన ఆధిక్యత, గుర్తింపు ఇది. అయితే దానియేలును ఓర్వలేకపోయిన ఆ 122 మంది అధికారులు కుట్రతో ముప్పై రోజుల పాటు దేశంలో రాజును తప్ప మరెవరినీ ఆశ్రయించకూడదన్న శాసనాన్ని తెచ్చారు. దానియేలు మాత్రం తన గది కిటికీలు తెరిచి మరీ ఆ ముప్పై రోజులూ తన దేవునికి ప్రార్థించగా, అధికారుల వత్తిడి మేరకు చక్రవర్తి ఆకలితో నకనకలాడుతున్న సింహాలున్న గుహలో అతన్ని వెయ్యగా, దేవుడు అద్భుతంగా సింహాల నోళ్లు మూసివేసి అతన్ని సజీవంగా కాపాడాడు. పిదప కుట్రదారులైన అధికారులనందరినీ చక్రవర్తి అదే గుహలో వేయగా సింహాలు వారిని తినేశాయి. దానియేలు బబులోను చక్రవర్తికి విధేయుడే. కాని అతని అత్యున్నతమైన, అంతిమమైన విధేయత మాత్రం చక్రవర్తికి పైగా ఉన్న దేవునికే!! విశ్వాసాన్ని ప్రసంగాల్లో, మాటల్లో, సిద్ధాంతాల్లో ఒలకబోస్తే ప్రయోజనం లేదు. క్రైస్తవం మాటల్లో కాదు, చేతల్లో, ఆచరణలో రుజువయ్యే విశ్వాస పథం. పాత నిబంధనలోని 39 పుస్తకాల్లోనూ దైవజనులు ఎన్నెన్నో గొప్ప విశ్వాసకార్యాలు చేశారు. కాని మొత్తం పాతనిబంధనలో ‘విశ్వాసం’ అనే మాట కేవలం రెండే రెండు సార్లు వాడారు. కాని వారి మహాకార్యాలను వివరించే హెబ్రీ 11 వ అధ్యాయంలోనే, ‘విశ్వాసం’ అనే పదాన్ని పరిశుద్ధాత్ముడు 40 వచనాల్లో 24 సార్లకు పైగా వాడాడు. విశ్వాసమనే మాటే వాడకుండా, అంతటి మహా విశ్వాసాన్ని ఆచరణలో చూపిన పాత నిబంధన కాలపు విశ్వాస వీరుల ముందు, పొద్దున్నుండి సాయంత్రం దాకా విశ్వాసం పైనే ప్రసంగాలు చేస్తూ, విశ్వాసులమని పిలిపించుకొంటూ, విశ్వాసాన్ని ఆచరణలో మాత్రం అణువంతైనా చూపలేని నేతి బీరకాయల్లాంటి మనమెక్కడ నిలుస్తాం?? సింహాల గుహలో పడ్డాక దానియేలును రక్షించే బదులు, అసలు సింహాల గుహలో పడకుండా దేవుడతణ్ణి రక్షించలేడా? అని ప్రశ్నించొచ్చు. తప్పకుండా రక్షించగలడు, కాని సీసాలోని మాత్ర శరీరంలోకి వెళ్లి రుగ్మతను పారదోలితేనే కదా దానికి విలువ? ఆచరణలో రుజువు కాని విశ్వాసానికి ఆవగింజంత కూడా విలువ లేదు. విశ్వాసాన్ని ఆచరణలో చూపలేని పిరికివాళ్ళకు, వాళ్ళెంతటివారైనా, పరలోకంలోకి ప్రవేశం లేదు.క్రీస్తు ఆచరించి బోధించిన విశ్వాసం, ప్రబోధాలు, నీతిమాటలు, సూక్తులకు అతీతమైనది. అంతటి మహత్తరమైన విశ్వాసానికి డబ్బు రూపాన్ని, లోక సంబంధమైన ఆస్తులు, విలాసాల రూపాన్నివ్వడం భ్రష్టత్వం!! సమాజంలో ఎంత ఉన్నతస్థాయి ఉంటే, ఎంత డబ్బుంటే వాళ్ళు అంత గొప్ప పరిచారకులు, విశ్వాసులనడం దౌర్భాగ్యపు వక్రీకరణ, అది కేవలం అవకాశవాదం, ఆత్మీయావగాహనా లోపం. చైనా దేశాన్నంతా సువార్తమయం చేసిన హడ్సన్ టేలర్ ఒకానొక సమయంలో పస్తులుంటూ, ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ‘నా జేబులో 25 పైసలే ఉన్నాయి, కాని నా గుండెలో మాత్రం దేవుడిచ్చిన బోలెడు వాగ్దానాలున్నాయి’ అంటూ భార్యకు రాసిన ఉత్తరం ఇప్పటికీ లండన్ మ్యూజియంలో ఉంది. ఆ విశ్వాసంతోనే చైనాలో టేలర్ చేసిన మహా కార్యాలు దేవుని జీవగ్రంథంలో శాశ్వతంగా లిఖించబడి ఉన్నాయి. నా వద్ద 25 పైసలే ఉన్నాయంటూ ప్రకటించిన హడ్సన్ టేలర్ కోట్లలో తేలియాడుతున్న ఈనాటి మెగా సేవకులు, సెలెబ్రిటీ ప్రబోధకులతో పోల్చితే నిరుపేదవాడే!! అయితే కేవలం విశ్వాసంతో దేవుని వాగ్దానాలు నమ్మి చైనా నిండా సువార్తను నింపిన హడ్సన్ ముందు ఈ పరిచారకులు, ప్రబోధకులవి కుప్పిగంతులే, చిరిగిన మురికి వస్త్రాలే!!! – రెవ.డా.టి .ఎ.ప్రభుకిరణ్ సంపాదకులు: ఆకాశధాన్యం email:prabhukirant@gmail.com -
మనిషిలోని దైవత్వాన్ని లోకం చూడాలి
‘నేను చేసే క్రియలకన్నా గొప్ప క్రియలు మీరు చేస్తారు’ అన్నాడు ఒకసారి యేసుప్రభువు (యోహాను 14:12). ‘నీవు పాపివి’ అంటూ వేలెత్తి చూపించిన యేసుప్రభువే మనిషిని ఇంతగా హెచ్చించడం ఒకింత ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. దేవుడు మానవుణ్ణి తన స్వరూపంలో సృష్టించాడని బైబిల్ చెబుతోంది. అంటే మనిషి స్వరూపం, స్వభావం, సౌందర్యం, అతనిలోని స్వతంత్ర భావన, సాధికారత, సదాశయాలు, సద్భావనాలన్నీ దేవుని లక్షణాలే. అందువల్ల గొప్పపనులు చెయ్యగలిగిన శక్తిసామర్థ్యాలను దేవుడు మనిషిలో ముందే నిక్షిప్తం చేశాడు. కాకపోతే మనిషిలోని స్వతంత్ర భావనలతోనే చిక్కు ఏర్పడింది. మనిషిని తన చెప్పుచేతల్లో నడిచే ఒక మరయంత్రంగా కాకుండా స్వతంత్ర చలనం, జీవనమున్న ఒక ‘సామాజిక శక్తి’ గా దేవుడు ప్రేమతో, కనికరంతో తయారు చేశాడు. లోకాన్ని పగలంతా వెలుగుతో నింపే సూర్యుణ్ణి దేవుడు సృష్టిస్తే, రాత్రిళ్ళు కూడా ఎంతో వెలుగు నిచ్చే విద్యుచ్ఛక్తిని దానితో వెలిగే బల్బును థామస్ అల్వా ఎడిసన్ అనే మానవుడే కనుగొన్నాడు. అదే విద్యుచ్ఛక్తితో మరెన్నో పనులను మనిషి సునాయాసంగా చేసుకోగలుగుతున్నాడు. నడిస్తే గంటకు మహా అయితే నాల్గు కిలోమీటర్లు మాత్రమే నడిచే మనిషి అదే గంటకు 120 కిలోమీటర్లు నడవగల్గిన వాహనాలను, రైళ్లను, గంటకు 800 కిలోమీటర్లు దూరం ఎగిరి ప్రయాణించగల్గిన విమానాలను ఆవిష్కరించి వాటితో తన జీవితాన్ని సులభ సాధ్యం చేసుకున్నాడు. ఏ విధంగా చూసినా ఇవన్నీ గొప్ప క్రియలే, సంతోషించదగిన విజయాలే. అయితే మనిషి తన సామాజిక బాధ్యతలు నెరవేర్చే విషయంలో కూడా అంతే సమున్నతంగా వ్యవహరించి గొప్ప క్రియలు చేయాలన్నది దేవుని ఆకాంక్ష. అయితే బైబిల్ గ్రంథం మూడవ అధ్యాయంలోనే మానవ చరిత్రను, ఆధ్యాత్మికతను సమూలంగా మరో మలుపు తిప్పిన పరిణామం ఏర్పడింది. తొలిమానవులైన ఆదాము, హవ్వ దైవాజ్ఞను ఉల్లంఘించి పాపం చేశారు. నాల్గవ అధ్యాయంలో రెండవతరం వాడైన కయీను అసూయతో, పట్టరాని కోపంతో తన తమ్ముడైన హేబెలును హత్యచేసి మానవజాతిని మరింత పతనం వైపునకు మళ్ళించాడు.. అప్పటికి ప్రపంచ జనాభా నలుగురే!! పైగా వారికి శత్రువులంటూ ఎవరూ లేరు. అయినా దుర్మార్గం అంతగా ప్రబలింది. సమస్య ఎక్కడుంది? దేవుడు తనకు సహవాసంగా ఉండేందుకుగాను ఏర్పర్చుకున్న మనిషి ఇంతగా దేవునికి ఎందుకు దూరమయ్యాడు? అతని స్వతంత్ర భావనలే దానిక్కారణం. ఆ స్వతంత్ర భావనలే స్వార్థానికి, గర్వానికి, దౌర్జన్యానికి ఇలాంటి మరెన్నో దైవవ్యతిరేక దుర్లక్షణాలకు బీజాలు వేశాయి. ఆ కారణంగానే మనిషి ఒక అడుగు పురోగమనం వైపునకు మరో అడుగు తిరోగమనం వైపునకు అన్నవిధంగా ఈనాటి తన జీవనశైలిని నిర్మించుకున్నాడు. సామాజిక బాధ్యతలు నెరవేర్చడంలో పూర్తిగా వెనకబడ్డాడు. ఇప్పటి టర్కీ దేశంలో ఉన్న లుస్త్ర అనే ప్రాచీన పట్టణంలో పౌలు, బర్నబా పరిచర్య చేస్తున్నపుడు, అవిటివాడైన ఒక వ్యక్తిని పౌలు బాగుచేశాడు. వాళ్లిద్దరూ చెప్పిన సువార్తకన్నా ఈ అద్భుతకార్యం అక్కడి ప్రజలను గొప్పగా ఆకర్షించింది. అక్కడి వాళ్లంతా తమ మధ్యకు దేవుళ్ళు దిగి వచ్చారంటూ సంబరపడి వాళ్ళిద్దరికీ తమ దేవుళ్ళ పేర్లు కూడా పెట్టారు. వాళ్లకు సన్మానం చేసి జంతువులను వారికి బలివ్వడానికి కూడా ప్రయత్నిస్తే పౌలు, బర్నబా వారిని తీవ్రంగా మందలించారు. ‘మేము దేవుళ్ళం కానే కాదు, జీవము గల్గిన దేవుని వైపునకు మిమ్మల్ని తిప్పడానికి గాను యేసు సువార్త చెప్పడానికి వచ్చామంతే!!’ అంటూ వారిని శాంతింప జేశారు. ఈ రోజుల్లో కూడా సువార్తకన్నా, అద్భుతాలకే ప్రజల ప్రాధాన్యం. సువార్తికులకన్నా, అద్భుతాలు చేసే వారికే ఎక్కువ ఫాలోయింగ్!! ఇలా మనిషిలో దేవుళ్లను చూసేందుకు లోకం ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ మనిషిలోని ప్రేమ, క్షమాపణ, నమ్రతతో కూడిన తన దైవికస్వరూపాన్నే లోకం చూడాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
రాహాబును ధన్యజీవిని చేసిన దేవుడు...
శారా, రేచెల్, రూతు, మేరీ, సలోమి... లాంటి బైబిల్ స్త్రీల పేర్లున్న వాళ్ళు మనకు కనిపిస్తారు కానీ రాహాబు అనే పేరు కూడా బైబిల్ స్త్రీదే అయినా ఆ పేరు మనకు వినిపించదు. ఎందుకంటె ఆమె యెరికో పట్టణానికి చెందిన ఒక వేశ్య. నిజమే, ఒక వేశ్య పేరు ఎవరు పెట్టుకుంటారు? సమాజం అత్యంత హీనమైన జాతికి చెందిన స్త్రీల జాబితాలో రాహాబును ఆమె వృత్తిని బట్టి చేర్చింది కాని యెరికోలో ఆమె చేసిన పరిచర్యను బట్టి, దేవుడామెను కొత్తనిబంధనలో అబ్రాహాము, నోవహు, ఇస్సాకు, యాకోబు, దావీదు వంటి మహా విశ్వాసవీరులతో సమానంగా వారి జాబితాలో చేర్చి అత్యున్నతమైన జాతికి చెందిన స్త్రీగా హెచ్చించాడు (హీబ్రు 11:31). ఇశ్రాయేలీయులైన ఇద్దరు విశ్వాసులు యెరికో పట్టణానికి వేగు చూసేందుకు వస్తే వారికి తన ఇంట్లో ఆశ్రయమిచ్చి, యెరికోపై విజయం సాధించడానికి అవసరమైన సమాచారాన్ని, స్ఫూర్తిని అందించి సహకరించింది రాహాబు. నిజానికి ఆ కాలంలో, శత్రువులైన వేగుల వాళ్ళపై ఒక కన్నేసి, వారి సమాచారాన్ని రాజుగారికి అందిస్తూ వారిని అప్పగించే నియమం వేశ్యలకుండేది. అందుకు వారికి బోలెడు బహుమతులు, నగదు దొరికేది.. అందువల్ల రాహాబు ఎదుట ఆనాడు రెండు మార్గాలున్నాయి. ఆ ఇద్దరు వేగులనీ యెరికో రాజుకు అప్పగించి ఆర్థికంగా లాభపడి, రాజుగారి చేత ’శభాష్’ అనిపించుకోవడం మొదటిదైతే, వారిని దాచిపెట్టి, కాపాడి, వారికవసరమైన సమాచారాన్నిచ్చి, రాబోయే ఇశ్రాయేలీయుల దండయాత్రలో మృత్యువాత పడకుండా తనను, తన వారిని కాపాడుకోవడమనేది రెండవమార్గం. లోకపరంగా ఆలోచిస్తే మొదటిమార్గంలో బోలెడులాభముంటే, రెండో మార్గంలో బోలెడు నష్టముంది, పైగా ప్రాణహాని కూడా ఉంది. వేగులవాళ్ళు తన ఆతిథ్యం పొంది వెళ్లారన్న విషయం తెలిసిన మరుక్షణం యెరికో రాజు తనకు మరణశిక్ష విధించే ప్రమాదం ఎంతో ఉంది. ఆమె స్థానంలో ఉంటే మనమేం చేస్తాం? డబ్బుకోసం కాకపోయినా, ప్రాణగండం నుండి తప్పించుకునేందుకైనా, నా ఓటు రాజుగారికే అంటాం. దేవుని కోసం, ఎప్పుడో ఎవరో మన పట్టణాన్ని గెలిచినప్పుడు. వాళ్ళు మనల్ని చంపకుండా ఉండేందుకు, ఇప్పుడు ప్రాణాలకు ‘రిస్కు’ తెచ్చుకోవడం అవివేకమనుకుంటాం. దేవుని పనిని గాలికొదిలేసి, చేతికందిన అవకాశాన్ని వాడుకొని, అందినంత సంపాదించి మనల్ని మించిన తెలివైన వారు లేరనుకుంటాం.ఏది చేపట్టినా ఇందులో మనకెంత లాభం? అని మాత్రమే ఆలోచించే సమాజంలో, ప్రాణాలకు ముప్పు తెచ్చుకొని మరీ వేగులవాళ్ళను కాపాడి యెరికో జైత్రయాత్రలో తనదంటూ ఒక పరోక్ష పాత్రను పోషించాలన్న నిర్ణయం తీసుకున్న రాహాబు లాంటి వాళ్ళు పిచ్చివాళ్ళు, నష్టజాతకులు, తెలివితక్కువదద్దమ్మలే!!! జీవితమంతా అప్రతిష్టతో వేశ్యగా బతికిన రాహాబు ముంగిటికి దేవుడొక జీవితకాలపు సువర్ణావకాశాన్ని ఆనాడు తెచ్చిపెట్టాడు. రాహాబు ఆ అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకుని, జీవితమంతా తాను అపవాది గుప్పిట్లో బతికినా, ఇకనుండైనా దేవుని పక్షంగా ఆయన ప్రియమైన కుమార్తెగా బతుకుతానని నిర్ణయించుకొని ధైర్యంగా ముందుకు సాగి జీవన సాఫల్యాన్ని పొందింది. అలా తననీ, తన కుటుంబాన్నీ దేవుని కృపావలయంలో నిలబెట్టి ఆశీర్వాదాలు పొందింది. చివరికి తన వంశావళిలోనే దేవుడామెను చేర్చాడంటే, ఆమెను, ఆమె పరిచర్యను ఎంతగా ప్రేమించాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని పిల్లలమని చెప్పుకొంటూ ఒక్కరోజైనా, ఒక్కటైనా దేవుణ్ణి ప్రసన్నపర్చే పనిచెయ్యకుండా, దేవునిపక్షం వహించకుండా తటస్థంగా, నామకార్థంగా బతకడంకన్నా, రాహాబులాగా ప్రాణాలకు తెగించి ఒక్కరోజైనా దేవుని పక్షంగా నిలబడటం ఎంత మహా భాగ్యమో తెలిపే గొప్ప ఉదంతమిది. క్రియలులేని విశ్వాసం మృతమని బైబిల్ స్పష్టంగా చెబుతూ ఉంటే, కేవలం చర్చలు, ప్రసంగాలు, ప్రగల్భాలు, సిద్ధాంతాలు, కొత్తభాష్యాలు, వివరణలతో పరలోకానికి వెళ్లిపోదామనుకోవడం కేవలం ఒక భ్రమ. కాణీ ఖర్చు, రవ్వంత ‘రిస్కు’ లేకుండా దేవునిసేవ ‘బహు గొప్పగా’ చేసి, పరలోకంలో ప్రథమ స్థానాన్ని కొట్టేయాలన్నది చాలామంది ప్రయాస. రాహాబునే రక్షించిన దేవుడు నన్ను రక్షించడా? అనుకోకుండా. నన్నే రక్షించిన దేవుడు రాహాబును రక్షించడా? అనుకునే తగ్గింపుతో కూడిన జీవిత విధానం మాత్రమే మనల్ని దేవుని సర్వసత్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది, అంటే రాహాబులాంటి పాపిని నేను కాదని అతిశయించడం కాదు, నావంటి పాపి ఈ లోకంలోనే లేడు అనుకోవడం వల్ల పరలోకం మనకు మరింత దగ్గరవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
విశ్వాసికి ప్రభువే భద్రతావలయం
క్రైస్తవుడుగా మారిన పౌలు మీద యూదులు, ముఖ్యంగా వారిలోని సద్దూకయులు అనే తెగవారు పగబట్టి ఎలాగైనా సరే అతన్ని చంపేవరకు పచ్చినీళ్ళు కూడా ముట్టకూడదని శపథం చేశారు. కోటలోనే కావలిలో ఉన్న పౌలును విచారణకోసమని బయటికి రప్పించి ఆయన్ని చంపేయాలన్నది వారి కుట్ర. అయితే పౌలు మేనల్లుడు అది విని వెళ్లి భద్రతాధిపతులకు చెబితే ఆ రాత్రే ఇద్దరు శతాధిపతులు, 200 మంది సైనికులు, 200 మంది ఈటెలు విసిరేవారితోపాటు 70 మంది గుర్రపు రౌతులతో భద్రతనిచ్చి పౌలును అత్యంత సురక్షితంగా వారు కైసరయకు పంపారు (అపో.కా.23:12–25). మన ఆయుష్కాలపు లెఖ్ఖ దేవుని జీవగ్రంథంలో రాయబడి ఉందని బైబిల్ చెబుతోంది (కీర్తన 139:16). అంటే మన ఆయుష్కాలాన్ని తగ్గించే శక్తి కానీ, పెంచే శక్తి గాని మనుషుల చేతుల్లో లేదన్నది దాని తాత్పర్యం. ఇపుడు అందరికీ అందుబాటులో ఉన్న ఈ బైబిల్ గ్రంథమే ఆ కాలంలోనూ ‘తోరా’ పేరుతో అప్పటి యూదులకు కూడా అందుబాటులో ఉన్నా, ప్రతి విశ్రాంతి దినం నాడు వాళ్లంతా దాన్ని చదువుతున్నా, ఈ వాక్యం అందులో రాయబడి ఉన్నదని తెలిసినా, సద్దూకయులు దేవుని ఈ వాక్యానికి విరుద్ధంగా పౌలును చంపి ఆయన ఆయుష్కాలాన్ని తగ్గించేద్దామనుకున్నారు. వాళ్ళు పౌలు హత్యకు కుట్రనైతే చేశారు కానీ మూడు విషయాలను మర్చిపోయారు. మానవుని ఆయుష్కాలాన్ని తన వశంలో పెట్టుకున్న దేవుని సాన్నిధ్యం అనునిత్యం పౌలుకు తోడుగా ఉన్నదని వాళ్ళు మర్చిపోయారు. ఆ కారణంగానే తమ కుట్ర సంగతి విని అధికారులకు చేరవేసే ఒక వ్యక్తిని పౌలు మేనల్లుడి రూపంలో దేవుడే అక్కడ ఏర్పాటు చేశాడని కూడా వాళ్లకు తెలియదు. అన్నింటికన్నా ముఖ్యంగా, పౌలు ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నపుడు దేవుడే ఆయనతో అంతకుముందు రాత్రి మాట్లాడి ‘ధైర్యంగా ఉండు, యెరూషలేము లోలాగే నీవు రోమా పట్టణంలో కూడా నన్ను గూర్చి సాక్ష్యమియ్యవలసి ఉన్నది’ అని వెల్లడించాడు (23:11). అంటే కనీసం రెండున్నర ఏళ్ళ తర్వాత రోమాకు వెళ్లే వరకు నీకు ఆయుష్కాలమున్నదని దేవుడు ఆయన్ను హత్యచేయాలని కుట్ర పన్నుతున్న యూదుల మధ్య ఉన్నపుడే పౌలుకు తెలియజేశాడన్నమాట!!! దేవుని ఈ ‘భద్రతా వలయం’ విశ్వాసి చుట్టూ ఉన్నంతవరకు విశ్వాసిని ఈ లోకం కానీ, అతని శత్రువులు కానీ, మరే ఇతర ప్రమాదాలు కానీ ఏమీ చేయలేవని దాని అర్థం. మరణం కనుచూపు మేరలోనే ఉన్నట్టు కనిపిస్తున్నా అది విశ్వాసిని తాకడానికి దేవుని సెలవు కావాలి. దేవుడు తన కృపకొద్దీ అతడికి ఈ పరిరక్షణా వ్యవస్థను ఏర్పర్చి, దాన్ని తన పర్యవేక్షణలోనే పెట్టుకున్నాడు. రోగాలు, బాధలు, ప్రమాదాలు, కుట్రలు, కుతంత్రాలు ఉప్పెనలా మీద పడుతున్నా మన ప్రాణం మీద మాత్రం వాటికి అధికారం లేదు. ఆ విషయాన్నే దేవుడు తన భక్తుడైన యోబు విషయంలో అపవాదికి ఆజ్ఞ ఇచ్చాడు (యోబు 2:6). దేవుని కృపకు, ప్రేమకు ఇది పరాకాష్టే కదా!! అందుకే శత్రువుల భయంతో వాళ్ళ కుట్రల మధ్య దినమొక గండంగా బతికిన దావీదు తన కీర్తనలో ‘గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను ఏ అపాయానికీ భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండం ఆదరిస్తుంది‘ అంటాడు (23:4). చివరికి మరణం సంభవించినపుడు కూడా విశ్వాసికి దాంట్లో భయపడేదేమీ లేదు. మరణం విశ్వాసికి ఒక గదిలోనుండి మరో గదిలోకి వెళ్లడం లాంటిదే. కాకపోతే ఆనందమేమిటంటే వదిలేసే గదిలోనూ దేవుడు విశ్వాసి వెన్నంటే ఉంటాడు, మరణానంతరం అతడు ప్రవేశించే కొత్తగదిలోనూ అతనికి స్వాగతమివ్వడానికి దేవుడు ఎదురుచూస్తుంటాడు. ఆ ఆనందంతోనే పౌలు ‘మనం బతికినా, చనిపోయినా ప్రభువు వారమేనన్న’ ధీమా వ్యక్తం చేస్తాడు (రోమా 8:14). ప్రభువుకోసం బతకడంలోని ఆనందాన్ని అనుభవించని వాడికి ప్రభువుకోసం చనిపోయే ధైర్యముండదు. ఆ కారణం వల్లే జీవితంలో ఎంతో ధైర్యంగా బతికిన వారు వాళ్ళు కూడా మరణానికి భయపడుతుంటారు. ప్రభువు కోసం జీవించడంలో, మరణించడంలో కూడా విశ్వాసి నిర్భయుడు. అందువల్ల దేవుని గ్రంథంలో లెక్కించి రాయబడిన రోజులు పూర్తి కాకమునుపు విశ్వాసిని మరణం ఒడిలో వేయగల శక్తి ఏదీ ఈ లోకంలో లేనే లేదు. రెవ.డా.టì .ఎ.ప్రభుకిరణ్ email: prabhukirant@gmail.com పఠనీయం అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీపనగరీజడానాం చైతన్య స్తబక మకరంద శ్రుతిఝరీదరిద్రాణాం చింతామణి గుణనికా, జన్మజలధౌనిమగ్నానాం దంష్ట్ర్రామురరిపు వరాహస్య భవతీ! పఠించే విధానం: ఈ శ్లోకాన్ని 40 రోజులపాటు ప్రతిరోజూ ప్రాతఃకాలంలో స్నానం చేసి 11మార్లు పఠించి అమ్మవారికి ధూపదీప హారతులివ్వాలి. పారాయణ ఫలం: సంసారకష్టాలు తొలగి ప్రశాంతత లభిస్తుంది. ధనహీనులకు దారిద్య్ర బాధలు తొలగి ధనప్రాప్తి కలుగుతుంది. ధనుఃపౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాఃవసన్త స్సామన్తో మలయమరుదాయోధన రథఃతథాప్యేక స్సర్వం హిమగిరిసుతే కామపి కృపామ్‌అపాఙ్గాత్తే లబ్ధ్యా జగదిదమనఙ్గో విజయతే పారాయణ విధానం: స్నానం చేసి శుచిగా ఉండి ఈ శ్లోకాన్ని 108 రోజులపాటు రోజుకు 108 మార్లు పఠించాలి. చెరకు రసాన్నిౖ నెవేద్యంగా సమర్పించాలి. పారాయణ ఫలం: దంపతుల మధ్య అన్యోన్యత పెరిగి సత్సంతానం కలుగుతుంది. -
విజ్ఞానగని, విశ్వాసమణి ప్రొఫెసర్ విజయం
వాస్తవాన్నే జీవితంగా మలుచుకొని లోకానికి క్రైస్తవాన్ని ఆచరణలో చాటిన ఒక మహా విశ్వాసి ఉదంతం ఈ వారం. గొప్ప మేధావి, పరిశోధకుడు, ఆదర్శప్రాయమైన యూనివర్సిటీ అధ్యాపకుడు, భూగర్భ శాస్త్రజ్ఞుడు, రచయిత, బైబిల్ పండితుడు, తాను విశ్వసించిన క్రైస్తవాన్ని ఆచరిస్తూ అత్యున్నత ప్రమాణాలతో జీవించిన మహా విశ్వాసి ప్రొఫెసర్ బి.యి.విజయం, తన 86వ యేట ఈ జనవరి 30న కన్ను మూశారు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో భూగర్భ శాస్త్రం (ఎ్ఛౌ ౌజy)లో పట్టభద్రుడై, ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి, అత్యున్నత పదవులు అలంకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ భూగర్భ శాస్త్ర విభాగానికి అధిపతిగా, జియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా సైంటిస్టుగా, మన దేశపు తూర్పు కనుమల్లో అణుధార్మిక శక్తి కలిగిన అత్యంత విలువైన భూగర్భ ఖనిజ నిల్వల్ని కనుగొనడంలో, బీహార్ ధన్‌బాద్ బొగ్గుగనులకు చెందిన అత్యంత విస్తారమైన నిల్వలను కనుగొనడంలో ఆయన దేశానికి చేసిన సేవ ఆవిరళమైనది. సౌదీ అరేబియా దేశంలో కూడా, ఆ దేశ ప్రభుత్వం ఆహ్వానం మీద అక్కడికెళ్లి చమురు నిల్వలున్న పలు ప్రదేశాలను అప్పట్లో ఆయనే గుర్తించారు. వారి వైజ్ఞానిక సేవల్ని గుర్తిస్తూ, ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రతిభా పతకాన్ని ప్రొ.విజయంకు బహూకరించి ఎం.ఎస్.స్వామినాథన్, వర్గీస్ కురియన్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ దిగ్గజాల సరసన ఆయన్ను నిలబెట్టింది. రాయలసీమలోని ఒక గ్రామంలో ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి, కష్టపడి చదివి పట్టుదలతో, స్వయంకృషితో, ప్రపంచస్థాయి శాస్త్రజ్ఞుడుగా ఎదిగి, పటిష్టమైన క్రైస్తవ పునాదులున్న మచ్చలేని క్రైస్తవ విశ్వాసిగా జీవించిన ప్రొ.విజయం జీవితం ఎన్నో తరాలకు స్ఫూర్తిదాయకం. ఆయన మన దేశమే కాదు మొత్తం ప్రపంచం గర్వించదగిన మహా మేధావి, క్రైస్తవం, మానవత్వం పరిమళించిన మహామనిషి. ఒక్కమాటలో ‘తెలుగు క్రైస్తవం’ సగర్వంగా ప్రపంచానికందించిన మణిమాణిక్యమాయన! ప్రొఫెసర్ విజయం సహాయం పొందిన అసంఖ్యాకుల్లో ఈ రచయిత కూడా ఒకరు. సాక్షిలో క్రైస్తవ వ్యాసాన్ని క్రమం తప్పక చదివి, తన అమూల్యమైన లభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు విజయం. అలా ‘సాక్షి’ ద్వారా మళ్లీ ఏర్పడిన సాన్నిహిత్యంతో తరచుగా కలుసుకొంటున్నపుడు, భూగర్భశాస్త్రంలో ఆయనెంత ప్రవీణుడో, బైబిల్ పరిజ్ఞానంలో కూడా అంతే పట్టుగల్గిన వాడన్నది వెల్లడైంది.. ఈ రచయితతోపాటు ఆయన ఇజ్రాయేల్ దేశాన్ని సందర్శించినప్పుడు ఎంతో విలువైన సమయం గడపడం సాధ్యమైంది. అప్పుడు ఈజిప్ట్‌లో సీనాయి ఎడారిలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా చోట్ల రాళ్లను పరిశీలించి, ‘ఇక్కడ బంగారం నిల్వలున్నాయి’ అన్నారాయన. అదే విషయాన్ని ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఒక పరిశోధకుల బృందం ఇటీవల ధృవీకరించడం వార్తల్లో తెలుసుకొని ఆయన ప్రతిభకు ఆశ్చర్యపోక తప్పలేదు. రాయలసీమ సిఎస్ ఐడియాసిస్కు మొట్టమొదటి భారతీయ బిషప్‌గా నియమించబడ్డ రైట్ రెవ. జాన్ బన్యన్ ఐదుగురు సంతానంలో కనిష్ఠుడాయన. నీతి నియమాలకు కట్టుబడి ఎంతో నిజాయితీగా పరిచర్య చేసిన బిషప్ జాన్ బన్యన్ నుండి క్రమశిక్షణ, భక్తి బాల్యం నుండే ప్రొఫెసర్ విజయంకు అలవడ్డాయి. నిజాయితీపరుడైన బిషప్ కుమారుడుగా విలాసాలకు దూరంగా, అతి సాధారణంగా ఆయన జీవితం సాగింది. పేదరికాన్ని, పేదల నిస్సహాయతను అలా ఆయన చాలా దగ్గరి నుండి చూశారు. అందుకే పేదల్ని, నిరాశ్రయుల్ని, అభాగ్యుల్ని ఆయన హృదయపూర్వకంగా ప్రేమించి ఎన్నో సహాయ కార్యక్రమాలు తన సేవాసంస్థ ద్వారా చేపట్టారు. ‘ఎవరినైనా ఆదుకున్న రోజున భలే నిద్రపడుతుందయ్యా’ అనేవారాయన. నిజ క్రైస్తవానికి ఇంతకు మించిన విశ్లేషణ, నిద్రలేమి అనే భయంకర వ్యాధికి దీన్ని మించిన చికిత్స ఉందా? ఎంతో స్నేహపాత్రుడు, గుండెలో ప్రేమ, కనికరాల ఊటలు ఉన్నాయా అనిపించేంత గొప్పగా స్పందించి సాయం చేసే వితరణ శీలి, సాత్వికుడు, వినయ మనస్కుడు అయిన విజయం లేని లోటు పూడ్చలేనిది. ఆయన విడిచి వెళ్లిన క్రైస్తవ వారసత్వం మాత్రం వెలలేనిది. –రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
బైబిల్ కాపాడినా..
పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో అమెరికా పర్యాటకుడు జాన్ అలెన్ చౌ హత్యకు కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న ఘటనలు తాజాగా వెలుగుచూశాయి. కోపోద్రిక్తులైన సెంటినల్ తెగ ప్రజలు వేసిన బాణం అతని చేతిలోని బైబిలుకు తగలడంతో తొలుత ప్రాణాలతో బయటపడ్డాడు. అలెన్‌కు పరిచయస్తుడైన స్థానికుడు అలెగ్జాండర్ పోలీసులకు అందజేసిన డైరీలో ఈ వివరాలున్నాయి. అలెన్ క్రైస్తవ మతాన్ని విపరీతంగా విశ్వసించేవాడని, క్రీస్తు బోధనల్ని సెంటినల్ ప్రజలకు పరిచయం చేయడానికే వెళ్లినట్లు తేలింది. హత్యకు ముందు అలెన్ డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం..ఆ రోజు సాయంత్రం ఇద్దరు సెంటినల్ తెగ ప్రజలకు కానుకలు ఇవ్వబోయాడు. వారు కోపంతో వేసిన బాణం అతని చేతిలోని బైబిల్‌కు తగిలింది. -
హృదయాన్ని పదిలంగా చూసు కోవాలి...
హెబ్రోను నుండి దావీదుపురం లేదా యెరూషలేముకు తన రాజధానిని మార్చిన తర్వాత అక్కడ దావీదు చక్రవర్తి తన నివాసం కోసం గొప్ప రాజప్రాసాదాలను, తన సిబ్బంది, సైన్యం కోసం వందలాది ఇళ్లను కట్టించాడు. అత్యంత పవిత్రమైన దేవుని నిబంధన మందసాన్ని కూడా దావీదుపురానికి తెచ్చి, ఒక గుడారం వేసి అందులో ఉంచాడు. అయితే ఎంతో దీనస్థితి నుండి చక్రవర్తి స్థాయికి ఎదిగిన తానేమో దేవదారు పలకలు పొదిగిన మహా భవనాల్లో నివసించడం, తన ఔన్నత్యానికి కారకుడైన దేవదేవుని ప్రత్యక్ష సన్నిధికి సాదృశ్యమైన నిబంధన మందసమేమో తాత్కాలికమైన ఒక గుడారంలో ఉండటం దావీదుకు బాధకలిగించింది. వెంటనే ప్రవక్తయైన నాతానును దావీదు పిలిపించి, దేవుని నిబంధన మందసం కేంద్రంగా ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించాలనుకొంటున్నానని ప్రకటించాడు.దేవునికి మందిరం కట్టాలనుకోవడమనేది ఎంతో ఉదాత్తమైన ఆలోచన, అందులో తప్పేముంది? అన్న భావనతో, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ నాతాను దావీదుకు జవాబిచ్చాడు (1 దిన 17:1–14). అదే సమస్య అయ్యింది. రాజులకైనా, సామాన్య ప్రజలకైనా, ప్రవక్తగా నాతాను ప్రతి విషయాన్నిదేవుని సన్నిధిలో విచారించి తెలుసుకొని వారికి బదులివ్వాలి. కాని అది చక్రవర్తి ఆలోచన, పైగా మందిరం కడతానంటున్నాడు కదా, అందులో తప్పేముంది? అన్న ఉద్దేశ్యంతో నాతాను ’నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ’ రాజుకు పూర్తి స్వేచ్ఛనివ్వడం దేవుడు హర్షించలేదు. నాకు మందిరాన్ని దావీదు కాదు, అతని కుమారుడైన సొలొమోను కడతాడంటూ ఆ రాత్రి దేవుడు నాతానుతో సెలవిస్తే, అదే విషయాన్ని నాతాను మరునాడు దావీదుకు తెలియజేశాడు. ఇశ్రాయేలు దేశానికి దావీదు చేసినంత సేవ మరెవరూ చేయకున్నా, మందిరం కట్టే ఘనతను మాత్రం దేవుడు అతనికియ్యలేదు. అలా దావీదు కట్టిన మహా మందిరంగా చరిత్రలో పేరుగాంచవలసిన యెరూషలేము మందిరం, దేవుని చిత్తంతో సొలొమోను కట్టిన మందిరంగా ప్రసిద్ధి చెందింది. దేవుని పనులు మనుషుల ఆలోచనలతో కాదు, దైవాభీష్టం మేరకు జరిగినప్పుడే లోక కల్యాణమవుతుంది. దైవప్రతినిధిగా నాతాను దేవుని సంకల్పాన్ని తెలుసుకోకుండా, నీ హృదయంలో ఉన్నదంతా చేయమంటూ దావీదును ప్రోత్సహించడం దేవునికి రుచించలేదు. పైకి మహాచక్రవర్తిగా అందరి మన్ననలందుకొంటున్న దావీదు హృదయం లోపలి పొరల్లోని రహస్యపుటాలోచనలు, దురాలోచనలు ప్రవక్తే అయినా మానవమాత్రుడైన నాతానుకు తెలియదు, కాని దేవదేవునికి తెలుసు. దావీదు, చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలన్న రహస్యాలోచనతో మందిరాన్ని కడతానంటున్నాడా లేక నిజంగా దేవుని మహిమ కోసమే కడతానంటున్నాడా... అన్నది దేవుడు తెలుసుకోలేడా? అందుకే, హృదయం చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధిగలది అంటోంది బైబిల్ (యిర్మీ 17:9). బైబిల్లో దైవిక విషయాల్లో ‘హృదయం’ అనే ప్రస్తావన వచ్చినపుడు, అది శరీరానికంతటికీ రక్తప్రసరణ చేసే ‘గుండె’గా కాక, మానవ జీవన స్థితిగతులన్నింటికీ మూలమైన, కీలకమైన నిర్ణయాలను చేసే ఒక ‘ఆలోచనావ్యవస్థ’గా దాన్ని అర్థం చేసుకోవాలి. దావీదు అది సరిగ్గా అర్థం చేసుకున్నాడు గనకే దేవుని ఆలోచనకు సమ్మతి తెలిపాడు, ‘నా హృదయానికి ఏక దృష్టిననుగ్రహించు’ అంటూ ప్రార్థించాడు (కీర్తన 86:11), తన నడవడిక, ఆలోచనల్లో ఏవీ దేవునికి అగోచరం కాదంటూ దేవుని స్తుతించాడు (కీర్తన 139). జీవితంలో మనం ఆయా నిర్ణయాలు తీసుకుంటాము. ఆ నిర్ణయాలే మన గమ్యాన్ని నిర్దేశించి, జీవితాన్ని శాసిస్తాయి. అయితే దేవుని సహాయంతో కాక మానవ హృదయంతో ఆలోచించి తీసుకున్న కొన్ని నిర్ణయాలే దీర్ఘకాలంలో తీరని అశాంతిని రేపి జీవితాన్ని దుర్భరం చేసిన ఉదంతాలు ఎన్నో ఉంటాయి. అందువల్ల స్వభావసిద్ధంగా ఒక ‘స్వతంత్ర ఆలోచనా వ్యవస్థ’గా పని చేయాలనుకునే మన హృదయానికి ‘దేవుని వాక్యం’ అనే కళ్లెం వేయడం శుభప్రదమైన పరిణామం. విచ్చలవిడితనం, అహంకారం, స్వార్థం, దుర్మార్గం వంటి అనేక పాపాలకు ప్రాప్తిస్థానంగా దుర్గంధపూరితమై ఉన్న హృదయానికి స్వచ్ఛమైన దైవవాక్యంతో ఉదకస్నానం చేయించాలి. దేవుణ్ణి అలా అక్కడే స్థిరప్రతిష్ఠ చేసుకోవాలి. అప్పుడది జీవజలాల ఊటలకు, లోకళ్యాణకారకమైన ఆలోచనలకు, చెరగని పవిత్రతకు స్థిర నివాసమై జీవితంలో శాంతి పరిమళించడానికి పునాది అవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
మీ జీవితాశయం ఏమిటో మీకు తెలుసా?
బతకడానికి మీరేం చేస్తుంటారు? అన్న ప్రశ్నకు జవాబిస్తాం. కాని దేనికోసం మీరు బతుకుతున్నారు? అనే ప్రశ్నను మాత్రం దాటవేస్తాం. డబ్బు, పేరు, అధికారం కోసమే బతికే వాళ్ళున్నా ఆ మాట ఒప్పుకొనే నిజాయితీ వారికుండకపోవచ్చు. జాలరిగా వృత్తిలో ఎంతో ప్రావీణ్యమున్న పేతురు యేసును ఎరుగక ముందు గలిలయ సరస్సులో ఒక రాత్రంతా శ్రమించినా ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. పేతురుకు అది ఘోర వైఫల్యం, అవమానం కూడా. అలా కుమిలిపోతున్న పేతురును మరునాడు ఉదయమే యేసు కలుసుకొని, దోనెలో అతనితో పాటు సరస్సు లోతుల్లోకి వెళ్ళాడు. అక్కడ యేసు మాట మేరకు పేతురు మళ్ళీ వలలు వేస్తే ఈ సారి విస్తారంగా చేపలు దొరికాయి. ’నేను చేపలు పట్టలేని అసమర్ధుణ్ణి ప్రభువా !!’ అని అంతకు మునుపు వాపోయిన పేతురు (లూకా 5:5), యేసు మహాత్మ్యాన్ని కళ్లారా చూసిన తర్వాత ఇపుడు ’నేను పాపాత్ముడను ప్రభువా !!’ (8:8) అంటూ సాగిలపడ్డాడు. మనుషుల కోసం చేపలు పట్టడం కాదు, ఇకనుండి నాకోసం మనుషులనే పట్టమంటూ యేసుప్రభువు అతనికి మేలుకొల్పునిస్తే, పేతురు, అతని పాలివారైన యాకోబు, యోహాను అన్నీ అక్కడికక్కడే వదిలేసి యేసును వెంబడించారు. చేపలు పట్టి జీవిస్తున్నామని చెప్పుకునే స్థాయి నుండి, యేసుప్రేమను ప్రకటించడానికి జీవిస్తున్నామని సగర్వంగా చెప్పుకునే అత్యున్నతమైన ఆత్మీయ స్థాయికి వారు ఎదిగారు. మేధావులమైనా, ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా, చాలా మంచివారమని లోకం ఎంతగా పొగిడినా, మనం పాపులమేనని బైబిల్ చెబుతోంది (రోమా 3:23). ఇది చాలామందికి రుచించని విషయం. బంగారాన్ని నగ రూపంలో మెడలో వేసుకున్నప్పుడు దానికున్న సౌందర్యం, గనుల్లో ముడిసరుకుగా ఉన్నపుడు బంగారానికుండదు. నిజానికపుడది వికారంగా ఉంటుంది. అయితే ముడిసరుకుగా ఉన్నా, మెడలో నగగా మెరిసినా బంగారం విలువ మాత్రం ఏ మాత్రం తగ్గదు. పాపియైనంత మాత్రాన అతనిపట్ల దేవుని ప్రేమ కూడా అణుమాత్రమైనా తగ్గదు సరికదా, ఒక పరమ కంసాలి లాగా దేవుడు పాపిని ప్రేమతో తన చేతుల్లోకి తీసుకొని, ప్రక్షాళన చేసి, ఆత్మీయ వన్నెతో కూడిన ఒక దివ్యరూపాన్నిచ్చి దిశానిర్దేశం చేసేందుకు పాపి కోసం ఆయన నిరంతరం తపిస్తాడని బైబిల్ చెబుతోంది (యెషయా 30:18). మన జీవనోపాధి ఏమిటి? అన్నది లోకానికి ముఖ్యం, కాని మన జీవితాశయం ఏమిటి? అన్నది దేవుని దృష్టిలో అత్యంతవిలువైన అంశం. శక్తి నిండిన జీవితాన్నంతా జీతం కోసం ఎవరికో ధారపోసి, రిటైరయ్యి, రోగాల పుట్టగా మారి, బతుకు మీద ఆశలుడిగిపోతున్నపుడు, చేవ చచ్చి కేవలం ఇక ‘చావు ఘడియ’ కోసం దీనంగా ఎదురుచూసే పరిస్థితి తన పిల్లల జీవితాల్లో ఎన్నటికీ ఉండకూడదన్నదే దేవుని అభీష్టం. జీవితాన్ని చేజార్చుకొని బాధపడుతూ కేవలం చావడానికి బతికే బదులు, ‘నాకున్న ఈ ఒక్క రోజైనా దేవుని కోసం బతుకుతాను. ఒక నిరాశ్రయుడు లేదా నిర్భాగ్యుని ఆదుకొని, అతని మొహాన దేవుని పేరిట చిరునవ్వు వెలిగించి, ఒక సదాశయాన్ని నెరవేర్చుకున్న సంతృప్తితో సగర్వంగా చనిపోతాను’ అని ఎవరన్నా తీర్మానించుకుంటే దేవుడే ఎక్కువగా సంతోషిస్తాడు, తన పరలోక ద్వారాలు తెరిచి మీకు నిత్యత్వమనే వెలలేని బహుమానమిస్తాడు. ఒకసారి కారులో ఊరికెళ్తున్న ఒక జంటకు దారిలో తమ చిన్నపాప కోసం పాలు అవసరమైతే అక్కడి ఒక ఫైవ్ స్టార్ట్ హోటల్లో 500 రూపాయలు తీసుకొని ఒక చిన్న సీసాలో పాలు అమ్మారట. కాసేపయ్యాక మధ్య దారిలో పాపకు మళ్ళీ పాలు అవసరమై అక్కడున్న చిన్న గుడిసెలాంటి హోటల్ లోని ఒక పేద ముసలాయన్నడిగితే, సీసానిండా పాలు నింపి ఇచ్చాడు. అతనికి వంద రూపాయలివ్వబోతే, నేను పేదవాణ్ణే కాని ఒక పసిపాప కడుపు నింపి పైసలు సంపాదించే దౌర్భాగ్యం నాకు లేదమ్మా! పాపకు దారిలో మళ్ళీ పాలు అవసరమవుతాయేమో, ఇదిగో మరో సీసా పాలు కూడా తీసుకెళ్లండి, అన్నాడట ఆ పేద వృద్ధుడు. ప్రతి వ్యక్తినీ దేవుడు మరొక వ్యక్తికి ఆసరాగా ఉండాలనే సృష్టించాడు. అదే ఆయన సృష్టి ధర్మం. కాని దైవ నిర్దేశిత విలువలకు పాడె కడుతున్నాం. అదీ మన దౌర్భాగ్యం!! – రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
స్త్రీలు–పిల్లల భద్రత భారత్‌కు భారమా?
ఈ భూమండలం మీద స్త్రీలకు భారత్ అత్యంత ప్రమాదకర దేశమని తేలింది. సంఘర్షణాత్మక ప్రాంతాలలో వున్న ఈ తీవ్రతకు ర్యాంకులు ఇచ్చే క్రమంలో థామ్సన్ రాయిటర్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో అఫ్గానిస్తాన్, సిరియా, సోమాలియా, యెమెన్ దేశాలు ఇండియా తర్వాతి స్థానాల్లో వున్నాయి. అంతర్జాతీయ నిపుణులు ఇచ్చిన గ్రేడింగ్‌లో ఆహార భద్రతలో నాలుగు, వివక్షలో మూడవ స్థానాల్లో మనం నిలిచాం! నిర్భయ నేరగాళ్లకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసిన నేపథ్యంలో ఇప్పుడయినా ...‘వార్ జోన్ రేప్’ మీద అధ్యయనం జరగాలి. మానవ ఇతిహాసంలో స్త్రీ మీద జరిగిన మొట్టమొదటి అత్యాచారం ఏది? అందుకు మనం ‘బైబిల్’ చూడాలి. అలా అంటే, అది మతం గురించి మాటలాడ్డం కాదు. అటు కూడా చూస్తేనే, సంక్షుభిత కాలంలో చరిత్ర – జాగ్రఫీలు మనకు మార్గదర్శనం అవుతాయి. కారణం – ‘బైబిల్ ల్యాండ్’ భారత్ ఉన్నది ఆసియాలోనే, ఒకప్పుడు ఆసియాలో జాతులు వాటి సంస్కృతులు వేర్వేరు అయినప్పటికీ, స్త్రీ పురుష సంబంధాలు మాత్రం – భౌగోళిక, శీతోష్ణస్థితి కేంద్రితంగా ఒక సారూప్యతతో వుండేవి. ఉష్ణమండలమైన ఆసియాలో ఆ తాపం ఎక్కువ. స్త్రీలు ఇంటి పనులు, పిల్ల ల్నిసాకడం, పశుపోషణ, పాడి, సాగు పనులకు చేదోడు, బావుల నుంచి నీళ్ళు తేవడం.. ఇలా ఏదో ఒక అవసరంతో ‘ఆమె’ గడప దాటి బయటకు రావడం ఇక్కడ తప్పనిసరి. ‘ఆమె’పై తొలి అత్యాచార ఘటన–రెండు భిన్నజాతులకు చెందిన సంపన్నకుటుంబాల్లో జరిగింది. దీని బాధితురాలు జేకబ్–లేయాల కుమార్తె–దీనా. ఇది చరిత్రలో మొదటి ‘రేప్’ సంఘటనగా బైబిల్లో (ఆదికాండం 34 అధ్యాయం) రికార్డు అయింది. అంతేకాదు ఇది అపారమైన హింసకు, ఒక జాతి హననానికి కారణం అయింది. జరిగింది ఇది – సంపన్నుడైన జేకబ్‌కు ఇద్దరు భార్యలు, మరో ఇద్దరు దాసీలకు కలిపి మొత్తం 12 మంది కుమారులు, ఒక కుమార్తె. కరువు వల్ల జేకబ్ కనాను చేరి, ఆ పట్టణ నాయకుడు హమోరు వద్ద భూమి కొని అక్కడ స్థిరపడతాడు. జేకబ్–లేయాల ఏకైక కుమార్తె దీనా అందమైనది. ఆమె హమోరు కూతుళ్ల వద్దకు స్నేహంగా వెళుతుంది. తమ ఇంటికి వచ్చిన దీనా మీద హమోరు కొడుకు షెకేము అత్యాచారం చేస్తాడు. ఆమెను బందీ చేసి, ఆమెను నాకిచ్చి పెళ్ళి చేయమని తన తండ్రిని జేకబ్ వద్దకు పంపుతాడు. కీ.పూ. 1929 లో నాటి ఈ సంఘటన కాలానికి –‘రాజ్యవ్యవస్థ’ గానీ, ‘న్యాయవ్యవస్థ’గానీ లేదు. అయినా ఇది జరిగింది రెండు సంపన్న కుటుంబాల్లో కనుక తక్షణ న్యాయం అమలయింది. జేకబ్ ఇద్దరు కుమారులు షిమ్యోను–లేవీలు హమోరు కుమారుడు షెకేమును చంపి తమ చెల్లెలు దీనాను వారు ఇంటికి తీసుకువస్తారు. ఒక్కడు – శారీరక వాంఛకు లోనై నిగ్రహాన్ని, విచక్షణను కోల్పోయినందుకు, అతని తెగ మొత్తం హతమవుతుంది. ఆ పట్టణం జేకబ్ స్వాధీనం అవుతుంది. కొడుకులు చేసింది చూసి హతాశుడైన తండ్రితో– ‘‘వాడు, వేశ్యతో వ్యవహరించినట్టు, మా సహోదరితో ప్రవర్తించవచ్చునా?’’ అని కొడుకులు అడుగుతారు. ఈ వ్యూహకర్త లేవీ మనవడే మోజెస్. ఈ 12 తెగలు వేర్వేరు దిక్కులకు విడిపోవడానికి ముందు, జెహోవా మానవ జాతికి ‘సివిల్ కోడ్’గా ఇచ్చిన ‘టెన్ కమాండ్ మెంట్స్’ అమలు చేయమని ఈ మోజెస్‌కు అప్పగించాడు. వాటిలో ఏడవ ఆజ్ఞ – వ్యభిచారం చేయవద్దు. అలా అది, రాజ్యం పరిధి బయట– ఒక నైతిక రుజువర్తనంగా మారింది. అయితే క్రీస్తు జీవించి ఉన్నప్పుడు కూడా జెరూసలేము పీఠాధిపతులు అదే ‘మోజెస్ లా’తో, వ్యభిచారిణిని రాళ్ళతో కొట్టి చంపాలన్నప్పుడు–జీసస్ ‘మీలో ఆ పని చేయనివాడు మొదటి రాయి వేయండి’ అనడం ద్వారా– ‘ఆజ్ఞల’ అమలులో ప్రజాస్వామీకరణను అమలులోకి తెచ్చాడు. పశ్చిమ ఆసియాలోని ‘బైబిల్ ల్యాండ్’ నుంచి, ఇప్పుడు ‘భారత్’ను వేరుచేసి చూడ్డం కుదిరే పని కాదు. ఎందుకంటే మన పైకి వచ్చిన మొఘలులు, సుల్తానులు మంగోలుల దండయాత్రలకు ముఖ ద్వారమైన ఢిల్లీది ఐదు వేల ఏళ్ల చరిత్ర. సుల్తానులు 700 ఏళ్ళు దీన్ని పాలించారు. క్రీ.శ. 1398 డిసెం బర్లో తైమూర్ ఢిల్లీని నేలమట్టం చేశాడు. జైళ్ళలో వున్న లక్ష మంది యుద్ద ఖైదీలను చంపాడు. ఆ తర్వాత మొఘలులు.. బ్రిటిష్ పాలకుల సుదీర్ఘ పాలన. దీనిని మానవ శాస్త్రం దృష్టితో చూసినప్పుడే నేటి భారతీయుల‘ప్రవర్తనా శైలి’ మూలాలు మనకు అర్థమవుతాయి. అప్పుడే, గతంలో ‘స్త్రీ’పట్ల వెల్లువెత్తిన లైంగిక కాంక్షలో వైపరీత్యాలు తెలుస్తాయి. ‘నిర్భయ’ సంఘటన తర్వాత, ఢిల్లీ అమ్మాయి, యూనివర్సిటీ ఆఫ్ కోపెన్హెగాన్లో దక్షిణ ఆసియా స్టడీస్ సెంటర్ డైరెక్టర్ రవీందర్ కౌర్ అప్పట్లో ‘సూర్యాస్తమయ భయాన్ని గెలవాలి’ శీర్షికతో ఒక వ్యాసం రాశారు. అందులో–‘‘సూర్యాస్తమయ వేళకు ఇంటికి చేరుకోవాలి, ఇది నేను 90 దశకంలో యూని వర్సిటీలో చేరినప్పుడు మా అమ్మ నా వద్ద తీసుకున్న మాట. అప్పట్లో ఇక్కడ ఆడపిల్లలు ఉన్న ప్రతి ఇంటా ఇదే పరిస్థితి’’ అంటారామె. ఎక్కడైనా యుద్ధకాలంలో పిల్లలు, స్త్రీలు దురాక్రమణదారుల తొలి లక్ష్యాలు అవుతారు. కానీ, ఆనాటి ఈ యుద్ధ ప్రాంతాలు వేల ఏళ్ల తర్వాత కూడా నాటి ‘చీకటి చరిత్ర’ ను ఇంకా వీపున మోస్తున్నాయి. 2013 ఏప్రిల్ 11న లండన్‌లో జరిగిన ‘జి–8’ దేశాల వేదిక భేటీలో–సంఘర్షణాత్మక ప్రాంతాల్లో లైంగిక హింస మీద ‘హిస్టారిక్’ పేరుతో ఒక ఒప్పం దం జరిగింది. అక్కడ – ‘‘ఇందులో ‘వార్ జోన్ రేప్’ అంశాన్ని ఈ వేదిక మీద ఉంచుతున్నాము. ఇక మీదట దీని ప్రాధాన్యత ఎంత మాత్రం తగ్గడానికి వీలులేదు. 17, 18 శతాబ్దాల నాటి బానిస వ్యాపా రం మళ్ళీ తిరిగి లైంగిక హింసగా కొత్త రూపం తీసుకుంది’’ అని ఆ వేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ ఈ పీడనకు బలయ్యేది– ఎస్సీ, ఎస్టీ, అల్పసంఖ్యాక వర్గాలు, సంచార జాతులే. వీరి పిల్లలు, స్త్రీల భద్రత ఆ కుటుంబాలకే కాదు, ప్రభుత్వాలకు సైతం అలవికాని పనవుతోంది. సామాన్య కుటుం బాల్లో–ఈడొచ్చిన పిల్లలు ఉంటే, వారి వల్ల ఎప్పుడు ఎటువంటి సమస్య ఇంటి మీదికి వస్తుందో అని పెద్దలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. ఎదుగుతున్న కులాల్లో, ఆర్థిక సమస్యల తీవ్రత కొంత తగ్గినప్పటికీ, భద్రత ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న కొత్త సమస్య. అయితే ఈ పరిస్థితికి కారణమైన మూలాలను విడిచి ఇప్పటికీ ప్రభుత్వాలు వీటిని శాంతిభద్రతల అంశంగా చూడ్డం నిరాశ కలిగిస్తున్నది. వ్యాసకర్త: జాన్సన్ చోరగుడి, అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత మొబైల్: 98662 24828 -
ఎవరీ పనిలేని దేవుడు?
సాక్షి, ముంబై: ఎవరీ పనిలేని దేవుడు? అంటూ వ్యాఖ్యలు చేసి ఫిలీప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్ వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం ఒక కార్యక్రమంలో ఆయన బైబిల్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బైబిల్ రచనపై మాట్లాడుతూ.. దేవుడు ఈవ్, ఆడంను ఎందుకు సృష్టించాలి. వారు సన్మార్గంలో నడవక మనందరికీ ఎందుకు జన్మనివ్వాలి? వారి పిల్లలమైన మనం ఇలా ఎందుకుండాలి? అని అన్నారు. మనం సృష్టించిన ప్రతి వస్తువు ఏదో ఒక సందర్భంలో దాని స్వభావానికి భిన్నంగా పని చేయొచ్చు కదా వ్యాఖ్యానించారు. ఫిలిప్పీన్స్‌లో నార్కోటిక్స్ డ్రగ్స్ మాఫియాను అరికట్టే క్రమంలో దేశాధ్యక్షుడు రొడ్రిగో డ్యూటర్ట్ ఎందరో చావులకు కారణమయ్యాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అమాయకులను పొట్టనబెట్టుకున్నారంటూ క్యాథలిక్ క్రైస్తవ మత పెద్దలు కూడా ఆయనపై తరచూ విమర్శలు గుప్పిస్తున్నారు. తనపై ఆరోపణలు చేసిన మత పెద్దలను విమర్శించే క్రమంలో.. డ్యూటర్ట్ క్రైస్తవ మత విశ్వాసాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. క్యాథలిక్ క్రైస్తవంపై, బైబిల్‌పై, దేవుడిపై ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసే వ్యక్తి దేశానికి అధ్యక్షుడుగా ఉండరాదంటూ బిషప్ పోబ్లో విర్జిలో డేవిడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధ్యక్షుడిగా డ్యూటర్ట్ పనిరాడంటూ ఫేస్బుక్లో కామెంట్ చేశారు. దేశంలో దాదాపు 80 శాతం ఉన్న క్యాథలిక్ క్రైస్తవుల మత విశ్వాసాల పట్ల అధ్యక్షుడి తీరు సరిగా లేదని సోషల్ మీడియాలో ఆయనపై దుమ్మెత్తి పోస్తున్నారు. -
చేతి రాతతో బైబిల్...
విశ్రాంత జీవితానికి కొత్త అర్థాన్ని చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఓరుగల్లు వాసి వడ్డేపల్లి గోపాల్. చేతి రాతతో తెలుగులో బైబిల్ రాసిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇత్తడి రేకులపై చేతితో బైబిల్‌ను తెలుగులో రాస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రచయితగా, గాయకుడిగా, శిల్పిగా, చిత్రకారుడిగా కూడా రాణిస్తున్నారు. వరంగల్‌లోని రంగంపేటకు చెందిన వడ్డేపల్లి కనకయ్య–పార్వతమ్మ దంపతుల కుమారుడు గోపాల్ 1948లో జన్మించారు. రంగంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టెన్త్ వరకు చదువుకు న్నారు. 1982లో వరంగల్ కేఎంసీలో అటెండర్‌గా చేరారు. ఉమ్మడి కరీం నగర్ జిల్లా మహాముత్తారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్‌గా 2006లో ఉద్యోగ విరమణ పొందారు. క్రైస్తవుడైన గోపాల్ బైబిల్‌ను పలుసార్లు పఠనం చేయడం ప్రారంభించారు. దీంతో చేతితో బైబిల్‌ను రాయాలనే సంకల్పించారు. 18 నెలలు..1,029 పేజీలు.. 1,029 పేజీల బైబిల్‌ను పలుమార్లు చదివిన తర్వాత చేతితో రాయాలని నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ బాండ్ పేపర్‌ను చిరిగిపోకుండా తీసుకుని.. చదివే వీలుగా బట్టర్ పేపర్‌ను మధ్యలో ఏర్పాటుచేశారు. సుమారు 20 కిలోల బరువుతో 1,029 పేజీల పుస్తకాన్ని ప్రత్యేకంగా బైండింగ్ చేయించారు. 2011 జనవరిలో బాల్‌పాయింట్ పెన్నుతో రాయడం ప్రారంభించి.. 2012 జూన్ 13న బైబిల్‌ను పూర్తి చేశారు. యేసు క్రీస్తు మాటలు ఎరుపు రంగు, కీర్తనలు ఆకుపచ్చ రంగు, ప్రకటన గ్రంథం నీలి రంగు, రాజుల మొదటి గ్రంథం నలుపు రంగు, దిన వృత్తాంతం వయిలెట్, హీజ్‌కీయా గ్రంథం ముదురు నీలి రంగులో అందించారు. గోపాల్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అనే గ్రంథాన్ని రాశారు. ఇందులో 626 పాటలు, 26 మంది రచయితలను పరిచయం చేశారు. ఇత్తడి రేకులపై బైబిల్.. ఎగ్జిక్యూటివ్ పేపర్‌తో రూపొందించిన బైబిల్ కాలగమ నంలో పాడైపోతుందని భావించిన గోపాల్ మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నీళ్లు, నిప్పులో పడినా పాడైపోకుండా ఉండేందుకు ఇత్తడి రేకులపై బైబిల్ రాయాలని నిర్ణయించారు. 2017 జూన్ నుంచి ఇత్తడి రేకులపై బాల్‌పాయింట్ పెన్నుతో బైబిల్‌ను రాస్తున్నారు. గోపాల్ రాసిన గ్రంథాలు.. గోపాల్ సంఖ్యల ప్రాధాన్యత అనే పుస్తకాన్ని 2010లో రచించారు. యేసేబు కన్నకలలు ఇతి వృత్తంతో 2014 లో కలవరం అనే పుస్తకానికి నాంది పలికారు. 2015లో నయమాను కుష్టు రోగి, 2016లో ప్రార్థన మరియు కృప అంశాలు అనే పుస్తకాన్ని రాశారు. ప్రస్తుతం ఆత్మ అనే పుస్తకాన్ని రాస్తున్నారు. – కాజీపేట అర్బన్ భవిష్యత్ తరాల కోసం.. భవిష్యత్ తరాల కోసం ఇత్తడి రేకులపై బైబిల్‌ను రాస్తున్నా. చేతితో బైబిల్‌ను రాయడం దైవ సంకల్పం. చేతితో రాసిన బైబిల్‌ను వీక్షించేందుకు వరంగల్‌లోని రంగంపేటను సందర్శించవచ్చు, వివరాలకు 9491065030లో సంప్రదించవచ్చు. – గోపాల్, చేతిరాత బైబిల్ సృష్టికర్త -
అక్షరాల క్రిస్మస్
క్రైస్తవులకు బైబిల్ పవిత్ర గ్రంథం. కాని సాహిత్య ప్రేమికులకు అది కథల కాణాచి. అప్పట్లో సెన్సార్లు వుంటే కొన్నింటిని నిషేధించేవాళ్లేమో కూడా! ఆధ్యాత్మికము, ఆముష్మికమెంతవుందో ఐహిక విషయాల ప్రస్తావన కూడా అంత వుంది బైబిల్లో. మత ప్రాధాన్యత కోసం కాకుండా, సాహిత్యపరంగా దీని గురించి మాట్లాడుకుంటే, బైబిల్‌కు కింగ్ జేమ్స్ ఇంగ్లిష్ అనువాదం ఒక మాస్టర్‌పీస్ అన్నది నిర్వివాదాంశం. అనుకరణీయం ఆ శైలి. సాల్మ్స్ లేదా సాంగ్ ఆఫ్ సాంగ్స్ అద్భుతమైన సాహిత్యం కాదనగలరా ఎవరైనా? మనసును ఆకట్టుకునే ఉపమానాలు, కథా కథన నైపుణ్యం దీన్ని క్రైస్తవేతరులకు కూడా అత్యంత ప్రియమైన సాహిత్య గ్రంథంగా మార్చాయి. గాంధీకి ‘సెర్మన్ ఆన్ ది మౌంట్’ చాలా ఇష్టమైన సాల్మ్. క్రైస్తవ సాహిత్యం ‘అపోస్టోలిక్ ఫాదర్స్’తో ప్రారంభమైంది. వీళ్ల ఏకైక లక్ష్యం ‘క్రైస్తవ జీవితం, నడవడి ఎలా వుండాలి’ అని బోధించడమే! అపాలజిస్ట్లు మూడో శతాబ్దంలోనే మత విశ్వాసాలను ప్రచారం చేస్తూ రచనలు కొనసాగించారు. అలా ప్రారంభమైంది మతపరమైన సాహిత్యసృష్టి. చక్రవర్తి కాన్స్టంటైన్ మత స్వేచ్ఛను ప్రసాదించారు. క్రూసేడ్స్‌లో తర్వాతి రోజుల్లో అనేకమంది ప్రాణత్యాగాలు చేశారు. సెయింట్ జస్టిన్ (సి. 165), సెయింట్ సిప్రిమన్ ఆఫ్ కార్తేజ్ (సి. 258)ల త్యాగాలను స్మరిస్తూ ప్రత్యక్ష సాక్షులు గ్రంథాలు రచించారు. క్రైస్తవులు మానవ జాతి ద్రోహులనీ, పాపులనీ, యూదులు దాడి చేసినప్పుడు అపాలజిస్ట్లు వీళ్ల వాదనలను తిప్పికొడుతూ పలు రచనలు చేశారు. వీటిలో ముఖ్యమైనవి ‘లెటర్స్ టు డయాగ్నెటస్’, ‘సెల్సస్’, ‘ఒరిజెన్’. అంతే కాదు, క్రైస్తవ బోధనలు, గ్రీకు తత్వశాస్త్రం కన్నా ఉత్కృష్టమైనవని వాదించారు వీరు. ఇక, బైబిల్, ఎన్ని పుస్తకాలకు ప్రేరణగా నిల్చిందో ఊహించడం కష్టం. సరదాగా కొన్నింటిని గురించి చెప్పుకుందాం. ఎ క్రిస్మస్ కెరోల్. రచయిత : చార్లెస్ డికెన్స్ నూనూగు మీసల నూతన యవ్వనంలో రాసిన ‘స్కెచెస్ బై బాజ్’ నుంచి బెస్ట్ సెల్లింగ్ రచయిత చార్లెస్ డికెన్స్ (1812–1870). రచయితగానే కాదు, పత్రికా సంపాదకుడిగా, తన నవలల్లోని నాటకీయమైన భాగాలను రంగస్థలం మీద హావభావ యుక్తంగా నటించి అశేష ప్రేక్షకులను అలరించాడు. ఇంగ్లిష్ సాహిత్య చరిత్రలో అత్యంత జనరంజకమైన రచయిత డికెన్స్. ఇప్పటికీ ఆయనను చదవని పాఠకులుండరు. రావిశాస్త్రి గారికి అభిమాన రచయిత. పేదల పక్షపాతి. ‘ఎ క్రిస్మస్ కెరోల్’ పూర్తి పేరు ‘ఎ క్రిస్మస్ కెరోల్ ఇన్ ప్రోస్, బీయింగ్ ఎ ఘోస్ట్ స్టోరీ ఆఫ్ క్రిస్మస్’. 1843లో తొలిసారి అచ్చయిందిది. కెరోల్స్, క్రిస్మస్ ట్రీస్ వంటి సంప్రదాయాలలో మార్పులను గురించి బ్రిటిష్ వాళ్లు ఆలోచించుకుంటున్న కాలమది. అప్పటికే వాషింగ్టన్ ఇర్వింగ్, డగ్లస్ జెరాల్డ్ల క్రిస్మస్ కథలను చదివిన డికెన్స్ కొత్తగా ఏదో రాయాలనుకున్నాడు. (అప్పటికే మూడు క్రిస్మస్ కథలు రాశాడు.) నిరుపేదలు, అన్నార్తులుగా ఉన్న వీధి బాలల కోసం నడుపుతున్న ఫీల్డ్ లేన్ రాగ్డ్ స్కూల్‌ను సందర్శించినప్పుడు ఐడియా తట్టింది. అక్కడ పిల్లల పరిస్థితి జంతువులకన్నా హీనం. వాళ్ల కోసం వచ్చిన నిధుల్ని కాజేసే వారే అందరూ. ఇలాంటి స్వార్థపరులలో మార్పు వస్తే ఎలా ఉంటుంది? పాపులు నిష్కృతి పొందగలిగిన పద్ధతి ఇదే కదా! అవును. ఇదే క్రిస్మస్ సందేశం. ఎబెనెజర్ స్క్రూజ్ ఒక లోభి. జేకబ్ మార్లీతో కలిసి వ్యాపారం చేస్తుంటాడు. జేకబ్ మార్లీ మరణించిన ఏడేళ్ల తర్వాత, తెల్లవారి క్రిస్మస్ అనగా, గడ్డకట్టుకు పోయే ఒక చలి రాత్రి లండన్‌లో ప్రారంభమవుతుంది కథ. స్క్రూజ్‌కు క్రిస్మస్ అంటే అసహ్యం. ఎవరికీ చిల్లిగవ్వ సాయం చెయ్యడు. ఆ రాత్రి, స్క్రూజ్‌కు మార్లీ ప్రేతాత్మ కనిపిస్తుంది. బరువైన ఇనుప గొలుసులతో బంధించబడి, డబ్బు నింపిన భోషాణాలతో భూమ్మీదకు వచ్చాడు మార్లీ. దురాశ, పిసినారితనం కలిసి ఒక జీవిత కాలంలో పోగు చేసిన డబ్బు అది. డబ్బు బాగానే ఉంటుందేమో గానీ అది తనకు గుదిబండగా మారితే ఏం సుఖం! ఈ దురదృష్టం తనకు పట్టకుండా ఉండాలంటే ఒక పద్ధతుందని స్క్రూజ్‌కు సలహా ఇస్తాడు మార్లీ. అతడి వద్దకు మూడు ఆత్మలు వచ్చి, ఎలా చెయ్యమని చెబితే అలా చెయ్యాలి. లేదా తనకూ ఈ గొలుసులు, భోషాణాల బరువు మోయక తప్పదు. మొదటి ఆత్మ – ఘోస్ట్ ఆఫ్ క్రిస్మస్ పాస్ట్ – వచ్చి స్క్రూజ్‌కు అతడు బాల్యంలో తిరుగాడిన ప్రదేశాలను చూపిస్తుంది. ఆ అమాయకత్వం, నిర్మల మనస్తత్వం. అవే గదా మనిషి జీవితాంతం పదిలపరచుకోవాల్సినవి! చెల్లెలు ఫ్యాన్ అంటే తనకు ప్రాణం ఆ రోజుల్లో. ఉద్యోగం ఇచ్చిన తొలి యజమాని తనను సొంత కొడుకులా ఆదరించాడు. తొలిప్రేయసి బెల్లె కూడా కనిపిస్తుంది. అతడి మనస్తత్వం తెలిసి, అతడు డబ్బును తప్ప మనుషుల్ని ప్రేమించడని గ్రహిస్తుంది. ఇక రెండవ ఆత్మ – ఘోస్ట్ ఆఫ్ ది క్రిస్మస్ ప్రెజెంట్ – అందరూ ఆనందంగా క్రిస్మస్ డిన్నర్ ఆరగిస్తున్న ప్రదేశాలకు తీసుకెళుతుంది. ఒక పేద కుటుంబంలో, ఓ కుర్రాడు టినీ టిమ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంటాడు. అతడికి వైద్య సాయం అందకపోతే, మరణించడం తథ్యమని స్క్రూజ్‌కు చెబుతుంది ఆత్మ. ఇగ్నోరెన్స్, వాంట్ అనబడే ఇద్దరు పిల్లలు కనిపిస్తారు. వాళ్లిద్దరూ తిండిలేక అల్లాడుతున్నారు. మూడవ ఆత్మ – ఘోస్ట్ ఆఫ్ ది క్రిస్మస్ యెట్ టు కమ్ – భవిష్యత్తులో క్రిస్మస్ పండుగ ఎలా జరుపుకుంటారో చూపిస్తుంది. ఊళ్లో వాళ్లంతా అసహ్యించుకునే ఒక వ్యక్తి మరణిస్తే ఏమవుతుందో కళ్లారా చూస్తాడు. భోజనం పెడతామంటే తప్ప ఎవరూ అతడి అంతిమ యాత్రలో పాల్గొనటానికి కూడా నిరాకరిస్తారు. ఇంటి పనివాళ్లు అతడి వస్తువులు దొంగిలిస్తారు. అతడి మరణానికి వారూ బాధపడరు సరికదా, అతడికి బాకీ ఉన్న ఒక పేద దంపతులు, భారం వదిలినందుకు సంతోషిస్తారు. మరోచోట టినీ టిమ్ మరణానికి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు. చివరికి అతడికో సమాధి చూపిస్తుంది ఆత్మ. దానిమీద స్క్రూజ్ పేరు రాసి ఉంటుంది. పాడుబడిన ఆ సమాధి చూసి స్క్రూజ్లో పరివర్తన వస్తుంది. క్రిస్మస్ ఉదయం. నిద్రలేచిన స్క్రూజ్ పూర్తిగా మారిపోతాడు. ఉన్న సంపదతో సత్కార్యాలు చేస్తూ అందరికీ సహాయం చేస్తూ జీవితశేషం గడుపుతాడు. ఇంగ్లిష్‌లో పరమలోభికి పర్యాయ పదం స్క్రూజ్. 19 డిసెంబర్ 1843 నాడు ప్రచురితమైన ఈ కథ, క్రిస్మస్ నాటికి మొదటి ఎడిషన్ పూర్తిగా అమ్ముడుపోయింది. 1844 నాటికి పదమూడు ఎడిషన్లు అచ్చయింది. నిజానికి, ఆనాటి నుండి ఈనాటి దాకా, ఇది ఎప్పుడూ ఔటాఫ్ ప్రింట్లో లేదు. ఇంచుమించు ప్రపంచ భాషలన్నింటిలోకీ అనువాదమైంది. ఇది ఎన్నిసార్లు రంగస్థలం మీద ప్రదర్శించబడిందో, మరెన్నిసార్లు సినిమాగా వచ్చిందో ఎవరికీ స్పష్టంగా తెలియదు. ఇటీవల, 2009లో, క్రిస్మస్ కారోల్ కథతో సినిమా వచ్చింది. హాస్యనటుడు జిమ్ క్యారీ స్క్రూజ్గా కనిపించి అలరించాడు. ఇదిగాక, డికెన్స్ రాసిన ది చైమ్స్ (1844), ది క్రికెట్ ఆన్ ది హార్త్ (1845), ది బ్యాటిల్ ఆఫ్ లైఫ్ (1846) కూడా క్రిస్మస్ సందర్భంగా రాసిన పుస్తకాలే! ది ఇన్ఫెర్నో రచయిత : దాంతె అలిగెరి ఇటాలియన్ మహాకవి దాంతె అలిగెరి (1265–1325) రాసిన డివైన్ కామెడీ సమకాలీన అధికార వర్గాల అవినీతిని ఎండగట్టటానికి సంధించిన వజ్రాయుధం. సెవెన్ డెడ్లీ సిన్స్ (ఏడు మహా పాపాలు) గురించీ, ఈ పాపాలు చేసిన ఆనాటి వ్యాపార, రాజకీయ, ప్రముఖుల గురించీ ఇందులో ప్రస్తావిస్తాడు దాంతె. నరకం, పాప ప్రక్షాళన జరిగే లోకం, స్వర్గం అనబడే మూడు లోకాలలో వర్జిల్ మహాకవి తోడుగా ప్రయాణిస్తాడు. పాపులు నరకంలో అనుభవిస్తున్న శిక్షల్ని కళ్లారా చూస్తాడు. జీవితకాలంలో వీళ్లందరూ అష్టయిశ్వర్యాలనూ అనుభవించినవాళ్లే. ‘‘ఇప్పుడేమయింది వీళ్ల పరిస్థితి?’’ అని ప్రశ్నిస్తాడు. పారడైజ్ లాస్ట్ రచయిత : జాన్ మిల్టన్ ఇంగ్లిష్ భాషలోని మహా కావ్యాలలో ఒకటి జాన్మిల్టన్ (1608–1674) రాసిన పారడైజ్ లాస్ట్. ఈడెన్ ఉద్యానవనంలో ఆడం, ఈవ్లు నిషేధింపబడిన ఫలం ఆపిల్‌ను తమ తమ అమరత్వాన్ని కోల్పోయిన వైనాన్ని చిత్రిస్తుందిది. సి.ఎస్.లూయీ మాటల్లో.. ‘‘ఇందులోని నీతి సార్వజనీనమైనది. భగవదాజ్ఞను శిరసావహించిన మనిషి ఆనందంగా జీవించగలడు. ఉల్లంఘిస్తే దు:ఖమూ, పతనమూ అతని కోసం నిరీక్షిస్తుంటాయి.’’ ది బ్రదర్స్ కరమజోవ్ రచయిత : దొస్తాయేవ్స్కీ (1821–81) రష్యన్ రచయిత దొస్తా్తయెవ్స్కీ తొలిరోజుల్లో ప్రగతిశీల, రాడికల్ మేధావుల సాహచర్యంలో గడిపాడు. ఇరవై ఏడో ఏట ఈయన రాసిన పూర్ ఫోక్ (పేద జనం – 1846) నవలిక పాఠకులను విశేషంగా ఆకర్షించటమే గాక, విమర్శకుల మెప్పు కూడా పొందింది. రాడికల్స్‌తో కలిసి ఆయన ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డట్టుగా ఆధారాలు లేవు. ఆరోజుల్లో మన మేధావులు ఎక్కువగా సుధీర్ఘమైన చర్చలతోనే కాలక్షేపం చేసేవారు. మొత్తం మీద ఒకనాడు వీళ్లంతా ఒక గదిలో సమావేశమైనప్పుడు జార్ సైనికులు వీరిని చుట్టుముట్టి, రాజద్రోహం నేరం మోపి, విచారణ జరిపారు. సోషలిస్టులతో పరిచయాలు పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. పైగా, ప్రభుత్వాన్ని కూలదోయటానికి కుట్ర చేశారని అభియోగం. మరణశిక్ష విధించారు. కుట్రదారులందర్నీ ఫైమిగ్ స్క్వాడ్ కాల్చి చంపుతుంది. చివరిరోజు రానే వచ్చింది. నిందితులందరూ వరుసగా నిల్చున్నారు. సైనికులు తుపాకులు గురి చూశారు. జార్ గారికి అదేమి వినోదమో, దొస్తాయేవ్స్కీకి చివరి క్షణంలో క్షమాభిక్ష ప్రసాదించాడు. ఇప్పుడు ఈ తుంటరి, సైబీరియా మంచు ఖండంలో కఠిన కారాగారవాస శిక్ష అనుభవించాలి. ఆ దుర్భర నరకమే మన రచయితను అంతర్ముఖుణ్ని చేసింది. బైబిల్ తప్ప మరో పుస్తకం చదివే అవకాశం లేదక్కడ. తన అహంభావం, విచ్చలవిడితనం, సుఖలాలసతల పర్యవసానమది. ఇవన్నీ బైబిల్ నిబంధనలను అతిక్రమించటమే. పశ్చాత్తాపానికి మించిన శిక్షలేదు. బాధలను అనుభవించటం ద్వారానే మనిషి నిష్కృతిని పొందగలడు. పవిత్రతకు నిర్వచనం జీసస్‌లాగా జీవించడమే. విప్లవభావాలు ఆవిరైనాయి. జార్ చక్రవర్తికి విధేయత ప్రకటించి జైలుగోడలు దాటాడు. (అప్పటికే అతణ్ని మూర్ఛరోగం పట్టుకుంది.) ఆ తర్వాత ఆయన రాసిన నవలలన్నింటిలోనూ ఏదో ఒక పాత్రో, లేదా ప్రధానపాత్రో – జీసస్కు ప్రతిరూపంలా కనిపిస్తాడు. అన్ని కష్టాలూ పడతాడు. అన్ని అవమానాలూ ఎదుర్కొంటాడు. దొస్తా్తయేవ్స్కీ రాసిన చివరి నవల బ్రదర్స్ కరమజోవ్. (షేక్స్పియర్, సెర్వాంటెస్, గోతె, దాంతెలతో సరితూగగల నలుగురు రష్యన్లలో ఒకడు దొస్తొయేవ్స్కీ. మిగతా ముగ్గురు గొగోల్, టుర్గెనీవ్, టాల్‌స్టాయ్.) బ్రదర్స్ కరమజోవ్‌లో, థ్రిల్లర్ ప్రక్రియలో తాత్విక, ఆధ్యాత్మిక విషయాలను చర్చించిన తొలి రచయిత దొస్తొయేవ్స్కీ. సామాజిక విషయాలతోనే కథ నడిపినా, క్రైస్తవ విశ్వాసాలకు అనుగుణంగా ఆధ్యాత్మికాన్వేషణ దీని ప్రధానోద్దేశం. కథలోని ప్రధాన పాత్ర జీవిత పరమార్థాన్ని అన్వేషించిన క్రమం పాఠకుల్లో కొత్త వెలుగులు నింపుతుంది. ఇందులోని గ్రాండ్ లిక్విజిషన్ అధ్యాయం ప్రపంచ సాహిత్యంలోని అత్యద్భుతమైన తాత్విక చర్చల్లో ఒకటిగా గుర్తింపబడింది. యూరోప్‌లోని మధ్య యుగాలలో చర్చి అధికారాన్ని ధిక్కరించిన వాళ్లను అవిశ్వాసులుగా ప్రకటించి వారికి మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలు విధించేవారు. ఒకనాడు క్రీస్తు సెవిల్ నగరంలో బైబిల్లో చెప్పినట్టుగా పలు మిరాకిల్స్ కూడా చేసి చూపుతాడు. జనం ఆయన్ను ఆరాధిస్తారు. కాని ఇంక్విజిషన్ నామకులు ఆయన్ను అరెస్టు చేసి, మరుసటిరోజు సజీవ దహనం చెయ్యాలని ఆదేశిస్తారు. ఆ రాత్రి జైలు గదిలో గ్రాండ్ ఇంక్విజిటర్ ఆయన్ను సందర్శించి చర్చికి ఆయన అవసరం లేదని స్పష్టం చేస్తాడు. పైగా, ఆయన రాకవల్ల చర్చి అధికారానికి, కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుంది. అధ్యాయం చివర, అప్పటిదాకా గ్రాండ్ ఇంక్విజిటర్ను నిశ్శబ్దంగా విన్న జీసస్, అతణ్ని ముద్దు పెట్టుకుంటాడు. గ్రాండ్ ఇంక్విజిటర్, ‘‘వెళ్లిపో! మళ్లీ ఈ చుట్టుపక్కల కనిపించకు..’’ అని జీసస్‌ను ఆదేశిస్తాడు. ఆ తర్వాత నగరంలోని చీకటి సందుల్లో ఎక్కడో అదృశ్యమయ్యాడు జీసస్.నవల ముగింపులో, ప్రధానపాత్ర ఇవాన్, ‘‘మత విశ్వాసాలతో డెవిల్కు స్థానముందిగానీ, కోర్టులు డెవిల్ ఉన్నట్లు అంగీకరించవు గదా, అతడు ఇక్కడే ఎక్కడో దాగున్నాడని నా విశ్వాసం..’’ అంటూ చెయ్యని నేరానికి శిక్ష అనుభవించటానికి సిద్ధపyì, జీసస్‌లా, ‘‘సోదరులారా! ఈమెను క్షమించండి.’’ అంటూ తప్పు సాక్ష్యం చెప్పిన స్త్రీని క్షమిస్తాడు. సాంగ్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ రచయిత : విలియమ్ బ్లేక్ ఇంగ్లిష్ కవి, చిత్రకారుడు, ఎంగ్రేవర్ విలియం బ్లేక్ (1757 –1827)జీవితమంతా పేదరికంలో, అనామకంగానే గడిపాడు. అయినా, సంతోషంగా తృప్తితో బతకటం ముఖ్యం. ‘పేరులోన ఏమి పెన్నిధి ఉన్నది?’ అనుకున్నాడు. కిరాణా కొట్టు యజమాని ఇంట్లో పుట్టి, స్కూలుకు వెళ్లే అవకాశం లేక, స్వంతంగా, స్వయంకృషితో, చదువు నేర్చుకున్నాడు. తరువాత, ఒక ఎంగ్రేవర్ వద్ద అసిస్టెంటుగా చేరి ప్రత్యేక ప్రతిభను ప్రదర్శించాడు. బ్లేక్ తన కాలంనాటి హేతువాద దృక్పథాన్ని, భౌతికవాదాన్ని నిరసించాడు. మనుషులందర్నీ – మానవజాతిని – ఈవిల్ పట్టి పీడిస్తున్నదని నమ్మాడు. అయినా మనిషి ‘లో వెలుగు’, ‘ఆధ్యాత్మికత’ కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు. భగవంతుడు ఎప్పుడూ మనల్ని ఓ కంట కనిపెడుతూనే ఉంటాడని బ్లేక్ ప్రగాఢ విశ్వాసం. ఇవన్నీ సరేగానీ, బ్లేక్ తన కవిత్వాన్ని అచ్చేసుకున్న పద్ధతి మాత్రం సాహిత్య చరిత్రలో అపూర్వం. రాగిరేకులను చిత్రాలతో, కవితలతో అలంకరించాడు. స్వయంగా వాటికి రంగులు అద్దాడు. సమకాలీనులకు బ్లేక్ ‘తిక్క మనిషి’, ‘ఉన్మాది’గా కనిపించినా, ఇప్పుడు ఆ రాగిరేకులు కలెక్టర్స్ ఐటమ్స్. ఆయన కవిత్వంలో మార్మికత ధ్వనిస్తుంది. హేతువాద యుగంలో హేతుబద్ధతను నిరసించిన తాత్విక, మార్మిక కవి బ్లేక్. ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా రచయిత : సి.ఎస్.లూయీ ఇంగ్లిష్ నవలా రచయిత, కవి, విద్యావేత్త, మధ్యయుగాల చరిత్ర మీద పరిశోధన చేసినవాడు, విమర్శకుడు, మతశాస్త్రంలో దిట్ట, క్రైస్తవ మత సమర్థకుడు క్లైవ్ స్టేపుల్స్ లూయీ (1898–1963) ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయాలలో ఉన్నత పదవుల్లో పనిచేశాడు. ఈయన.. మరో ప్రముఖ నవలా రచయిత టోల్కీన్కు మంచి మిత్రుడు. లూయీ మొదట చర్చ్ ఆఫ్ ఐర్లాండ్‌లో బాప్టిజం తీసుకున్నప్పటికీ, తరువాత మత విషయాలకు దూరంగా జరిగాడు. మళ్లీ ముప్ఫై రెండో ఏట, టోల్కీన్, ఇతర మిత్రుల ప్రోద్బలంతో ఆంగ్లికనిజమ్కు తిరిగొచ్చాడు. ఈయన రచనల మీద మత విశ్వాసాల ప్రభావం అధికంగా ఉంటుంది. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో, ఈయన క్రైస్తవ విలువల గురించి చేసిన రేడియో ప్రసంగాలతో ఈయనకు కీర్తి ఇనుమడించింది. లూయీ అనేక రచనలు చేసినప్పటికీ, ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా అత్యధికంగా అమ్ముడుపోయింది. టీవీ, రేడియో, సినిమా మాధ్యమాల్లో కూడా ఇది శ్రోతలు, ప్రేక్షకులను అలరించింది. ఈ క్రానికల్స్ ఏడు ఫాంటసీ నవలల బాలసాహిత్యం. 10 కోట్ల ప్రతులు అమ్ముడయ్యాయి. 47 భాషల్లోకి అనువాదమైంది. ఒక ఊహాలోకం నార్నియాలో జరుగుతుంది కథ. మంత్రాలు, మాయలు, మాట్లాడే జంతువులూ, వాటిమధ్య పిల్లల సాహసకృత్యాలూ పాఠకుల్ని కట్టిపడేస్తాయి. క్రైస్తవ సిద్ధాంతాలు, బైబిల్ నిబంధనలు, గ్రీకు, రోమన్ పురాణగా«థలు, సాంప్రదాయక బ్రిటిష్ ఫెయిరీ టేల్స్ కలిసిన రంగుల లోకం నార్నియా. సాధారణంగా బాలసాహిత్యంలో మతభావనలకు పెద్దపీట వెయ్యరు. తొలిసారిగా, లూయీ, ఆ పనిచేసి కృతకృత్యుడయ్యాడు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ రచయిత : జె.ఆర్.ఆర్. టోల్కీన్ కొందరి దృష్టిలో ఇరవయ్యవ శతాబ్దంలో వచ్చిన అత్యుత్తమ సాహిత్యమిది. ‘బైబిల్ ప్రేరణతో ఇది రాయబడింది అనే బదులు, బైబిల్ సారాన్నే కథగా మలిచాడు టోల్కీన్’ అన్నారు. ఇంగ్లిష్ రచయిత, కవి, భాషా శాస్త్రవేత్త, యూనివర్సిటీ ప్రొఫెసర్ జాన్ రొనాల్డ్ ర్యూల్ టోల్కీన్ (1892–1973), ది హోబిట్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, ది సిల్మరిలియన్ల రచయితగా జగద్విఖ్యాతి సంపాదించాడు. టోల్కీన్కు ముందు కూడా అనేకమంది ఫాంటసీలు ప్రచురించినప్పటికీ, ది హోబిట్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్‌తో ఫాంటసీ ప్రక్రియ పునర్జన్మ ఎత్తినట్లైంది. చాలామంది కొత్త పాఠకులు టోల్కీన్నే ఫాదర్ ఆఫ్ ఫాంటసీగా బ్రహ్మర«థం పట్టారు. 2008లో ది టైమ్స్ పత్రిక, ఈయన్ను 1945 నుంచి రాస్తున్న 50మంది గొప్ప రచయితల్లో ఒకడిగా గుర్తించింది. టోల్కీన్ పూర్వీకులు 18వ శతాబ్దంలో జర్మనీ నుంచి వలస వచ్చి అతిత్వరగా ఇంగ్లిష్ సంస్కృతీ సంప్రదాయాలకు అలవాటు పడ్డారు. మొదటి ప్రపంచయుద్ధ కాలంలో, బ్రిటిష్ సైన్యంలో పనిచేసిన టోల్కీన్ 1920లో లీడ్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ రీడర్‌గా చేసి అతిత్వరగా ప్రొఫెసర్‌గా ప్రమోషన్ పొందాడు. ఆ తర్వాత, విద్యారంగంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నప్పటికీ, ది హోబిట్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ పుస్తకాలు రాయగలిగాడు టోల్కీన్. కేవలం మత విశ్వాసాల కోసమే కాదు, కథా కథన నైపుణ్యం కోసం ఈ పుస్తకాలను చదువుతారు. మిథోఫియా రచయిత : జె.ఆర్.ఆర్. టోల్కీన్ కేవలం తన నవలల్లో అక్కడక్కడా వాడటానికి మాత్రమే కవిత్వం రాయలేదు టోల్కీన్. మితోఫియా ఒక కవిత. 1931లో తన మిత్రులు లూయీ, హ్యూగో డైసన్లతో సాహితీచర్చ తర్వాత, టోల్కీన్ ఇది రాశాడు. టోల్కీన్ మిత్లను సమర్థించాడు. మైథాలజీ ఒక సృజనాత్మక కళ. అత్యంత మౌలిక విషయాలను స్పృశిస్తుందిది. మిత్స్ అంటే ఇష్టం లేదని చెప్పిన లూయీని ఉద్దేశించి (మిత్స్ అన్నీ అబద్ధాలు, అవాస్తవాలు అన్నాడు లూయీ) రాసిన కవిత ఇది. ‘‘మిత్ అంటే సృష్టికి పునసృష్టి చేయటమే. అంటే సృష్టికర్తను చేరుకోవడమే’’ అని తన వాదనకు క్రైస్తవ మత విశ్వాసాలతో సమర్థిస్తాడు టోల్కీన్. మర్డర్ ఇన్ ద కేథడ్రల్ రచయిత : టి.ఎస్.ఎలియట్ చర్చి, మత విశ్వాసాల పరిరక్షణ కోసం ప్రాణాలిచ్చిన వాడు సెయింట్ థామస్ బెకెట్. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ బ్రిటిష్ కవి టి.ఎస్. ఎలియట్ (1888–1965) రాసిన పద్యనాటకమిది. లండన్‌లోని క్యాంటర్బరీ కేథడ్రల్‌లో 1170లో జరిగిన ఆర్చి బిషప్ థామస్ బెకెట్ హత్య ఇందులో ఇతివృత్తం. (1935లో తొలిసారి దీన్ని ప్రదర్శించారు.)ఒక వ్యక్తి – ఆర్చి బిషప్ – రాజ్యాధికారాన్ని ధిక్కరించడం, తర్వాతి పరిణామాలు చిత్రిస్తుంది. యూరోప్‌లో ఫాసిజం బలం పుంజుకుంటున్నప్పుడు ప్రదర్శితమైన ఈ నాటకం, ఆనాటి మేధా లోకాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. 1126 నుండి 1170 దాకా ఆర్చి బిషప్ ఆఫ్ క్యాంటర్బరీగా పనిచేసిన థామస్ బెకెట్ను కాథలిక్ చర్చి, ఆంగ్లికల్ కమ్యూనియన్, ఒక సెయింట్‌గా ఆరాధిస్తుంది. పోప్ అలెగ్జాండర్ 3, ఈయన్ను 1173లో సెయింట్‌గా ప్రకటించాడు. పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ రచయిత : జాన్ బన్యన్ ఇంగ్లిష్ రచయిత, పర్షియన్ ప్రీచ్, జాన్ బన్యన్(1628–1688)ను మనం ఇంకా గుర్తుపెట్టుకోవడానికి కారణం ఆయన రాసిన పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. ఇదిగాక, ఆయన మరో 60 రచనలు కూడా చేశారు కానీ, అవన్నీ ఒకరకంగా సెర్మన్స్ మాత్రమే. ఆదర్శ క్రైస్తవ జీవితాన్ని కథగా చెప్పాడు బన్యన్. సచ్ఛీలత, సన్మార్గం సృష్టికర్తను చేరటానికి దగ్గరదారులు. గాంధీకి ఇష్టమైన పుస్తకం ప్రిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. 1938 నాటికి పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ 1300 ఎడిషన్లలో అచ్చయింది. ఈ పుస్తకం పూర్తిపేరు ‘ది పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ఫ్రం దిస్ వరల్డ్, టు దట్ విచ్ ఈజ్ టు కమ్’. మత ప్రచార గ్రంథాలలో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇప్పటి వరకు 200 భాషల్లోకి అనువాదమైంది. ఇంతవరకు ఔట్ ఆఫ్ ప్రింట్లో లేదు. ఇవన్నీ గాక, ఇంగ్లిష్‌లో రాయబడిన తొలినవలగా కూడా దీన్ని గుర్తిస్తారు. ఇందులోని కథంతా ఒక స్వప్నంలా సాగుతుంది. కథానాయకుని పేరు క్రిస్టియన్. అతడు, తన నగరం (సిటీ ఆఫ్ డెస్ట్రక్షన్) నుండి సెలెస్టియల్ సిటీ దాకా ప్రయాణిస్తాడు. అతడు మోస్తున్న బరువు, అతడు చేసిన పాపాలు, అతని చేతిలోని పుస్తకం బైబిల్. దాన్ని చదవడం వల్ల జ్ఞాననేత్రం తెరుచుకుంది. నిత్యనూతనంగా ఇప్పటికీ పాఠకులను అలరిస్తూనే ఉంది పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. ది ఫాదర్ బ్రౌన్ స్టోరీస్ రచయిత : జి.కె.చెస్టర్టన్ ఇంగ్లిష్ రచయిత, కవి, తత్వవేత్త, నాటకకర్త, జర్నలిస్టు, వక్త, మతశాస్త్ర ప్రచారకుడు, విమర్శకుడు గిల్బర్ట్ కీచ్ చెస్టర్టన్ (1874–1934). ఈయన ఇన్ని ప్రక్రియల్లో ఎంత గణనీయమైన కృషి చేసినా, అశేష పాఠకులకు మాత్రం ఈయన ఫాదర్ బ్రౌన్ మిస్టరీ డిటెక్టివ్ కథల రచయితగానే సుపరిచితుడు. ఫాదర్ బ్రౌన్ ఒక కల్పిత పాత్ర. రోమన్ కాథలిక్ ప్రీస్ట్. ఔత్సాహిక డిటెక్టివ్. 1910–1936 మధ్య చెస్టర్టన్ ఫాదర్ బ్రౌన్ చేధించిన 53 కథలు ప్రచురించాడు. (ఇవి రాస్తున్న క్రమంలోనే 1922లో చెస్టర్టన్ కాథలిక్‌గా తీర్థం పుచ్చుకున్నాడు.) షెర్లాక్ హోమ్స్ లాగా మేధస్సుతో గాక, తన ఇన్‌ట్యూషన్‌తో మిస్టరీని సాల్వ్ చేస్తాడు బ్రౌన్. మానవ ప్రవృత్తిని లోతుగా అర్థం చేసుకొని, వాళ్ల లోపాలను సహానుభూతితో చూడగలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. బ్రౌన్ కాథలిక్ విశ్వాసం అతనికా సిక్స్త్సెన్స్ కలిగించింది. వ్యక్తిలోని ఆధ్యాత్మిక, తాత్విక కోణాలకు ప్రాధాన్యతనిస్తాడు బ్రౌన్. ఈలోకంలోని ప్రతి వ్యక్తి ఒక కన్ఫెషన్ బాక్స్‌లో నిల్చున్నట్టే చూస్తాడు. టీవీ సీరియల్స్‌గా, సినిమాగా కూడా ఫాదర్ బ్రౌన్ కథలు బాగా ప్రాచుర్యం పొందాయి. డ్రాక్యులా రచయిత : బ్రాం స్ట్రోకర్ స్ట్రోకర్ సృష్టించిన ‘డ్రాక్యులా’.. మనుషుల రక్తం తాగి బలిసే పిశాచి. బైబిల్లో చెప్పిన ఈవిల్కు ప్రతిరూపమే డ్రాక్యులా. ఈ పిశాచాల నుండి రక్షించుకోవాలంటే క్రిస్టియన్ ప్రార్థన, శిలువ వంటివి మాత్రమే ఉపయోగపడతాయి. డ్రాక్యులా సినిమాగా ఎన్నిసార్లు వచ్చిందో, ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో చెప్పడం చర్విత చర్వణమే అవుతుంది. జేన్ ఐర్ రచయిత : చార్లెట్ బ్రాంటీ బ్రాంటీ క్లాసిక్ నవలలోని హీరోయిన్ జేన్. ప్రియుడు, కాబోయే భర్త రోచెస్టర్ ఎంత కోరుకున్నా, ఆమె, వివాహం దాకా తన పవిత్రతను కాపాడుకుంటుంది. ఇది బైబిల్లో చెప్పిన సెక్సువల్ మోరాలిటీ అండ్ మ్యారేజ్‌కు సంబంధించిన నిబంధనలలో ఒకటి. పీర్స్ ప్లోమాన్ రచయిత : విలియమ్ లాంగ్లాండ్ మధ్యయుగాల నాటి కావ్యమిది. క్రైస్తవ జీవన ఔన్నత్యం, సచ్ఛీలతను శ్లాఘించడం రచయిత ఉద్దేశం. ది శాక్రిఫైజ్ రచయిత : జార్జ్ హెర్బర్ట్ ఇంగ్లిష్ భక్తి కవుల్లో ప్రముఖుడు జార్జ్ హెర్బర్ట్ (1593–1633). క్రీస్తు శిలువనెక్కిన సంఘటన శాక్రిఫైజ్లోని ఇతివృత్తం. ది డార్క్‌నైట్ ఆఫ్ ది సోల్ రచయిత : జాన్ ఆఫ్ ద క్రాస్ ఇదొక మార్మిక కావ్యం. సృష్టికర్తను చేరుకోవటానికి ఆత్మ చేసే ప్రయాణాన్ని చిత్రిస్తుంది. హోలీ సానెట్ 11, 12 రచయిత : జాన్ డాన్ ఆధ్యాత్మిక కవిత్వం రాసిన మరో బ్రిటిష్ కవి జాన్ డాన్ (1572 – 1631). ఈయన చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో క్లెరిక్గా పనిచేశాడు. సానెట్ 11, 12 క్రైస్తవ జీవితంలో సువార్త ప్రాముఖ్యతను వివరిస్తాయి. ఈయన కలం నుండి వెలువడిన సానెట్స్ అన్నింటిలోనూ ఇవే ఉత్తమమైనవంటారు.బైబిల్‌తో ప్రభావితమైన ఈ క్లాసిక్ పుస్తకాలే కాదు, బైబిల్‌తో ప్రేరణ పొంది లేదా దాన్ని వ్యాఖ్యానిస్తూ (కొన్నిసార్లు వివాదాలు సృష్టిస్తూ..) అనేకమంది నవలలు ప్రచురించారు. ఈ శతాబ్దపు తొలి రోజుల్లో హెవెన్, ఈడెన్, ఫ్లడ్‌ల గురించి మార్క్‌ట్వేన్ రాసిన హాస్య, వ్యంగ్య వ్యాసాలన్నీ కలిపి, ‘ది బైబిల్ అకార్డింగ్ టు మార్క్‌ట్వేన్’ పేరుతో వచ్చినప్పుడు పెద్ద సంచలనం సృష్టించింది. డి.హెచ్.లారెన్స్ (ది మ్యాన్ హూ డైడ్), జోస్ సరమగో (ది గోస్పెల్ అకార్డింగ్ టు జీసస్ క్రైస్ట్), నార్మన్ మెయిలర్ (ది గోస్పెల్ అకార్డింగ్ టు ది సన్)లు వివాదాస్పద రచయితలే. ఇంకా, పలు పాపులర్ నవలలు, బెస్ట్ సెల్లర్ కూడా బైబిల్ ప్రేరణతో వెలువడ్డాయి. ఉదాహరణకు హ్యారీ పాటర్ చివరి పుస్తకంలో కథానాయకుడు లోక కళ్యాణం కోసం ఆత్మత్యాగం చేసి పునరుద్ధానం పొందుతాడు. జోనెస్టర్ సృష్టించిన సూపర్‌మ్యాన్ ఏకైక లక్ష్యం దుష్ట శిక్షణ – శిష్ట రక్షణ. డాన్ బ్రౌన్ రాసిన ‘దావించీ కోడ్’కు మూలాలు బైబిల్లో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మతగ్రం«థాలు ఇష్టపడని వాళ్ల కోసం బైబిల్‌ను ‘బుక్ ఆఫ్ గాడ్’ పేరుతో వాల్టర్ వాంగరిన్ ఒక నవలగా ప్రచురించాడు. ఇదో బెస్ట్ సెల్లర్. – ముక్తవరం పార్థసారథి ప్రముఖ రచయిత, అనువాదకులు సైన్స్‌ఫిక్షన్‌లో బైబిల్..! ఇటీవలే, బైబిల్ ప్రేరణతో కనీసం ఆరు సైన్స్ ఫిక్షన్/ఫాంటసీ సినిమాలు వచ్చాయి. 1. డెస్పరేషన్ 2. హ్యారీపాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ 3. ది లయన్, ది విచ్ అండ్ ది వార్డ్రోబ్ 4. నోవా 5. అవతార్ 6. లెఫ్ట్ బిహైండ్ క్రిస్మస్... హాలీవుడ్... హాలీవుడ్ చరిత్రలో, క్రిస్మస్ సమయంలో, బైబిల్లోని ఏదో ఒక అంశం ఆధారంగా వచ్చిన సినిమాలకు లెక్కేలేదు. మచ్చుకు కొన్నింటిని మాత్రం ఇక్కడ చెప్పుకుందాం.. ఎ క్రిస్మస్ కెరోల్ (1938) ఇట్స్ ఎ వండర్ఫుల్ లైఫ్ (1946) మిరాకిల్ ఆన్ థర్టీ ఫోర్త్ స్ట్రీట్ (1947) వైట్ క్రిస్మస్ (1954) ఎ చార్లీ బ్రౌన్ క్రిస్మస్ (1965) బ్లాక్ క్రిస్మస్ (1974) క్రిస్మస్ ఈవిల్ (1980) ది స్నోమ్యాన్ (1982) మిక్కీస్ క్రిస్మస్ కెరోల్ (1983) గ్రెమ్లిన్స్ (1984) డై హార్డ్ (1988) హోమ్ ఎలోన్ (1990) ఎడ్వార్డ్ సిసర్హ్యాండ్స్ (1990) ది మప్పెట్ క్రిస్మస్ కెరోల్ (1992) ది నైట్మేర్ బిఫోర్ క్రిస్మస్ (1993) ఎల్ఫ్ (2003) బ్యాడ్ సాంతా (2003) ఆర్థర్ క్రిస్మస్ (2011) – వగైరా వగైరా.. షేక్స్పియర్ నాటకాలు మన జాబితాలో షేక్స్పియర్ నాటకాలకూ, సానెట్స్కూ చోటు కల్పించారు పండితులు. మర్చెంట్ ఆఫ్ వెనీస్ ఇందులోని రెండు ప్రధాన పాత్రలు షైలాక్, ఆంటోనియో పాత, కొత్త కన్వీనెంట్స్ను ప్రతిబింబిస్తాయి. ‘‘రాతపూర్వక ఒప్పందం ప్రాణం కావాలంటుంది. సహృదయత నవ జీవనాన్ని ప్రసాదిస్తుంది.’’ మెజర్స్ ఫర్ మెజర్ బైబిల్ సందేశాన్ని అన్యాపదేశంగా చెప్పిన నాటకమిది. ఇందులోని ప్రధాన పాత్రలు మనిషికీ, భగవంతునికీ ఉన్న సంబంధాన్ని చిత్రిస్తాయి. సానెట్ 129 కామప్రవృత్తి.. శరీరం, బుద్ధి మీద ఎలాంటి దుష్ఫలితాలు చూపిస్తుందో కవితాత్మకంగా చిత్రిస్తుంది సానెట్ 129. మక్బేత్ మంత్రాలు, మాయలు ఉన్నాయి గనక, ఈ నాటకాన్ని నిషిద్ధ సాహిత్యంగా పరిగణిస్తారు కొందరు సాంప్రదాయక క్రైస్తవులు. కాని డెవిల్ మనల్ని పాపాలకు ఎలా ప్రేరేపిస్తుందో అద్భుతంగా చిత్రించాడు షేక్స్పియర్. మక్బేత్ ఆంబిషన్ అతని పతనానికి దారితీసింది. విచ్‌క్రాఫ్ట్ అంటే పడిచచ్చే కింగ్ జేమ్స్ ముందు ప్రదర్శించటం కోసం షేక్స్పియర్ ఈ నాటకం రాశాడు. -
క్రైస్తవం సంస్కరణోద్యమం!!
చప్పదనం, చీకటి క్రైస్తవంలో, విశ్వాసుల్లో ఉండేందుకు వీల్లేదు. ఎందుకంటే మీరు లోకానికి ఉప్పు, వెలుగు వంటివారని యేసు ప్రభువు ప్రకటించారు (మత్తయి 5:13–16). ఉప్పుకు, వెలుగుకు ఉన్న ఒక ప్రధాన లక్షణం ఏమిటంటే, వాటి ధర్మాన్ని, బాధ్యతను ఎంతో మౌనంగా అవి చేసుకు పోతాయి. ఎన్ని అడ్డంకులొచ్చినా అవి లోకాన్ని రుచిమయం, వెలుగుమయం చేయకుండా మానవు. క్రైస్తవం కేవలం ప్రసంగాలు, రచనలు, పాటలు, ఉపవాస ప్రార్థనలు, చర్చిల నిర్మాణం కాదు. క్రైస్తవం ఒక మహాసంస్కరణోద్యమం. అది తనను తాను నిరంతరం సంస్కరించుకుంటూ, సమాజ సంస్కరణ, సమాజ కల్యాణానికి పాటు పడుతూ ఉంటుంది. క్రైస్తవంలో చీకటి కోణాలకు, మోసాలకు, అపవిత్రతకు ఏమాత్రం తావులేదు. క్రైస్తవులను లోకం కోటి కళ్లతో నిశితంగా చూస్తుందన్నది నూటికి నూరుపాళ్లు నిజం. క్రైస్తవం ద్వారా లాభపడిన ప్రతిసారీ లోకం క్రైస్తవాన్ని కళ్లకద్దుకుంది. కాని క్రైస్తవం పేరిట ప్రజల్ని మభ్యపెట్టి, మోసం చేసినప్పుడు కూడా ఎవరూ మాట్లాడకూడదు, అడ్డురావద్దు అనుకోవడం ఆత్మవంచనే కాదు అనాగరికం కూడా. తప్పులెత్తి చూపిన వారు విలన్లని అనుకోకుండా, మన తప్పులు మనం సవరించుకుని, మరింత శక్తితో ముందుకు సాగితే అదెంత ఆశీర్వాదకరం, దేవునికి అదెంత మహిమకరం? పూర్వం పదోతరగతి ఫెయిలయిన వాడికి ఏదైనా వృత్తివిద్యా కోర్సు నేర్పించి, ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేర్చేవారు. ఇప్పుడు అలాంటి వారి చేతికొక బైబిలిచ్చి ‘సేవ చే సుకో, లోకాన్ని దున్నుకో’ అని చెబుతున్నారంటే మన పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. క్రైస్తవమంటే కర్ణభేరిని పగలగొట్టి ముక్కలు చేసే లౌడ్ స్పీకర్ల నుండి వెలువడే అరుపులు, కేకలు, పాటలు, డప్పువాయిద్యాలనుకునే పరిస్థితి తెచ్చుకున్నాం. క్రైస్తవం 4,500 ఏళ్ల ప్రాచీన మతం. లౌడ్ స్పీకర్లను కనుక్కుని వందేళ్లు కూడా కాలేదు. అలాటి లౌడ్స్పీకర్లు క్రైస్తవానికి బ్రాండ్ అంబాసిడర్లు ఎలా అవుతాయి? అంటే స్వస్థతల్ని, దేవుని అద్భుతాల్ని నేను విశ్వసించనని కాదు. దేవుని శక్తిని సంపూర్ణంగా అర్థం చేసుకున్న నేను, ఆరోగ్యపరంగా చాలా బలహీనుణ్ణి. రాత్రి పడుకున్నాక మర్నాడు ఉదయాన్ని నేను సజీవంగా చూసిన ప్రతిసారీ అదొక దేవుని అద్భుతమని, దేవుడిచ్చిన స్వస్థత అని, నమ్మి, తల వంచి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. కాని వాటిని అడ్డుపెట్టుకుని పేరు, డబ్బు సంపాదించుకునే వారిని, అమాయకులను దేవుని శక్తి ప్రదర్శన పేరిట మోసం చేసేవారిని తప్పక ఖండిస్తాను. మారమని వారికి చెబుతున్నా కూడా! యేసు వస్త్రపు చెంగు పట్టుకుని, అపొస్తలుల వస్త్రాలు, నీడ తాకి ప్రజలు బాగయ్యారు కదా! అంటారేమో!! నిజమే, కాని వారి వస్త్రాలను అపొస్తలులు అంగట్లో పెట్టి అమ్మ లేదు కదా! సమర్థించుకోవడానికి, మారకుండా ఉండేందుకు వెయ్యి కారణాలు ఉండొచ్చు. కాని సంస్కరించుకోవడానికున్న ఒక చిన్న కారణం చాలు మనం లోకానికి ఆశీర్వాదకరంగా మారడానికి. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
దైవిక శక్తి ఎన్నడూ దిగజారదు!
శాస్త్రులు, పరిసయ్యలు కొందరు యేసును ఒక సూచక క్రియ అంటే అద్భుతం చేయమని అడిగారు. యేసు చేసిన అద్భుతాలతో ఆ ప్రాంతమంతటా ఆయనకెంతో పేరు వచ్చింది. అయితే, పేరుకోసం, తన దైవత్వాన్ని రుజువు చేయడం కోసం యేసు ఎన్నడూ అద్భుతాలు చేయలేదు. ఆయా వ్యక్తుల అవసరాలు తీర్చడానికి మాత్రమే ఆయన అద్భుతాలు చేశాడు. అలాంటి అద్భుతాల గురించి విన్న వారు ఆయన అద్భుతాలు చేస్తుంటే ప్రత్యక్షంగా చూడాలని చాలామంది ఉబలాటపడ్డారు. యూదయలో రోమా ప్రతినిధిగా ఉన్న పిలాతు కూడా తన ఎదుట విచారణ కోసం తలదాచుకుని నిలబడి ఉన్న యేసు క్రీస్తు ఏదైనా ఒక అద్భుతం చేస్తే చూసి ఆన ందించాలనే గాక, దాన్ని ఆసరాగా తీసుకుని ఆయన్ని విడుదల చేయాలనీ పిలాతు అభిమతం. కాని యేసు అద్భుతం చేయలేదు సరికదా తలవంచి పిలాతు విధించిన సిలువ శిక్షను భరించి చరిత్రలో రోమా ప్రభుత్వం సిలువ వేసి చంపిన కరడుగట్టిన నేరస్తులందరిలోకి అత్యంత సాత్వికుడిగా పేరు పొందాడు. యేసు అద్భుతాలు చేశాడని నాలుగు సువార్తలూ సవివరంగా పేర్కొన్నాయి. ఆయన శిష్యులు, ఇతర అపొస్తలులు కూడా చేసిన అద్భుతాల ప్రస్తావన అపొస్తలుల కార్యముల గ్రంథంలో ఉంది. ఆయన కొందరికి స్వస్థత వరాన్నిస్తాడని, తనను విశ్వసించేవారు తాను చేసిన కార్యాలకన్నా గొప్ప కార్యాలు చేస్తారని యేసే స్వయంగా చేసిన ప్రకటన కూడా బైబిలులో ఉంది (యోహాను 14:12). కాని ఈ స్వస్థతలు, అద్భుతాలు చేసే దైవిక శక్తిని లోక ప్రయోజనాలు, స్వార్థం, ధనార్జన కోసం వాడేందుకు అనుమతి మాత్రం బైబిలులో ఎక్కడా లేదు. ఈ వరాన్ని అడ్డుపెట్టుకుని డబ్బు, పేరు సంపాదించడానికి, ప్రజల్ని అల్లకల్లోలం పాలు చేయడాన్ని దేవుడు అనుమతించలేదు. పాపాలను క్షమించి పరలోకాన్ని ప్రసాదించ గల రక్షకుడిగా గాక, యేసును కేవలం స్వస్థతలు, అద్భుతాలు చేసే గారడీవాడిగా చిత్రీకరించడం కన్నా భ్రష్టత్వం మరొకటి లేదు. పరిశుద్ధాత్మశక్తి నిజంగా ఉన్న వాడి నోట డబ్బు మాటే రాదు. డబ్బున్న చోట పరిశుద్ధాత్ముడుండడు. ఈ రెండూ పర స్పర విరుద్ధాంశాలు. అవి ఎన్నడూ కలవవు. లోకాన్ని మార్చే ‘దైవిక శక్తి’ లోకంతో ఎన్నడూ రాజీపడదు. రాజీపడ్డ మరుక్షణం ఆ శక్తి నిర్వీర్యమవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ -
బైబిలులో దేవుడు గీసిందే తిన్నని గీత!
గొప్ప విశ్వాసిగా, మహా రచయితగా మారకముందు పి.ఎస్. లూయిస్ పరమ నాస్తికుడు. లోకంలో జరిగే అన్యాయాలు, దౌర్జన్యాలను చూసి దేవుడనేవాడుంటే లోకంలో ఇంత అధ్వానంగా, ‘వంకర’గా ఎందుకుంటుందనుకొని తిరుగుబాటు చేశాడు. కాని వేలెత్తి చూపేవన్నీ వంకరగీతలంటున్నానంటే ఎక్కడో ‘తిన్నని గీత’ కూడా ఉండాలి కదా! అనిపించి అన్వేషిస్తే బైబిలులో దేవుడు గీసిందే ‘తిన్నని గీత’ అని తెలుసుకున్నానని ఆయనొకసారి వివరించాడు. పాత నిబంధన, కొత్త నిబంధనగా రెండు భాగాలున్న బైబిలును లోకజ్ఞానంతో అర్థం చేసుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఈ రెండు భాగాల్లోని ‘దైవప్రత్యక్షత’ను వివరించ పదాలు మనిషి కనిపెట్టినవైనా, ఆ తత్వం, భావం మాత్రం పూర్తిగా పారలౌకికం, దైవికం. అందుకే పీహెచ్‌డీలున్న మేధావులనుకునేవారు వారికి అర్థం కాని అత్యంత సూక్ష్మమైన, సునిశితమైన బైబిలులోని దైవికాంశాలను పామరులు, అర్థపామరులైనవారు బోధించడం చూస్తాం. యేసుక్రీస్తు ఆరోహణం, పునరాగమనం మధ్యకాలాన్ని, కృపాయుగం లేక క్షమాయుగంగా దేవుడు ప్రకటించి తన క్షమ, ప్రేమతత్వాన్ని రుజువు చేసుకున్నాడు. క్రమశిక్షణను నూరిపోయాలనుకున్న తండ్రి ప్రేమ కుమారుణ్ణి దండిస్తుంది. ప్రేమతో క్షమించి ముద్దాడుతుంది కూడా! ఈ తత్వాలన్నింటినీ సమగ్రంగా వివరించే ‘బైబిలు గ్రంథాన్ని మేధస్సుతో కాదు, మోకాళ్ల మీదుండి చదవాలి. ఈ అద్భుతమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. కృపయు, సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాయి అని వివరించాడు (యోహాను 1:17). గది ఎంత అపరిశుభ్రంగా ఉందో చూపించే కరెంటు బల్బులాంటిదే ధర్మశాస్త్రం. కాని అది పాపాన్ని, అపరిశుద్ధతను ప్రక్షాళనం చేయలేదు. అందుకు వ్యాక్యూమ్ క్లీనర్లాంటి దైవ క్షమాగుణం, ప్రేమతత్వం కావాలి. అవి యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి పరిచయం చేయబడ్డాయి. లోకాన్ని ప్రక్షాళనం చేస్తున్నాయి. దండించే శక్తి గల వానికే, క్షమించడానికి అధికారం ఉంటుంది. దేవుని నుండి నానాటికీ దూరమవుతున్న మానవాళి తిరిగి దేవునితో యేసుక్రీస్తు ద్వారా అనుసంధానం కావడానికి దేవుడే ప్రసాదించిన ఒక సువర్ణావకాశం ఈ ‘కృపాయుగం’. గాడి తప్పిన లోకంలో సాగుతున్న అరాచకాలు, అమానవీయత ఈ అంతటికీ పరిష్కారం దేవుని క్షమాగుణం, ప్రేమతత్వంలోనే ఉందనడానికి వేరే రుజువులు కావాలా? – రెవ. డా. టి.ఎ. ప్రభుకిరణ్ -
అంజూరపు చెట్టుకు యేసు శాపం!
యెరూషలేము వెళ్తూ ఆకలిగొన్న యేసు పండ్లు కోసుకొని తినేందుకు ఒక అంజూరపు చెట్టు వద్దకు వెళ్లాడు. నిండా ఆకులే తప్ప ఒక పండూ లేని ఆ చెట్టును యేసు శపించగా అది వెంటనే వాడిపోయింది. ‘పరిశుద్ధ వారం’లో ఈ ఉదంతాన్ని ధ్యానిస్తూ ఉంటాము. మానవుడు మంచి పనులు చేసినందుకు మెచ్చి దేవుడు రక్షణనివ్వడు. దేవుడు తన ఉచితమైన కృపతో రక్షించిన మానవుడు విశ్వాసిగా దేవుని విశ్వాసం, సహవాసం, ప్రేమలో ఎదుగుతూ సత్కార్యాలు చేస్తేనే దేవుడు మెచ్చి ఆశీర్వదిస్తాడని బైబిలు చెబుతోంది. దాన్నే యేసు ప్రభువు ఫలించడం అన్నాడు. అంజూరపు చెట్టు ఆకులు అత్యంత ఆకర్షణీయమైనవి, దాని పళ్లు మాత్రం అంత అందంగా ఉండవు. ఆకులతో ఆకర్షించిన అంజూరపు చెట్టు బాటసారికి పళ్లివ్వకపోతే దానికసలు విలువేముంది? క్రైస్తవమంటే ప్రసంగాలు, నీతి బోధలు చేయడం, సిద్ధాంతాలు వల్లించడం కాదు. తనను వలే తన పొరుగు వారిని ప్రేమించడమని యేసు చాలా స్పష్టంగా బోధించాడు. స్వార్థానికి దురాశకు, అసూయకు, దుర్మార్గతకు, కుతంత్రాలకు విశ్వాసిలో చోటు లేదు. ప్రభువులో వేరు పారి ఎదుగుతూ, పొరుగువారిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ వారి పక్షంగా నిలబడటమే నిజమైన క్రైస్తవమని, అలా ఫలించని చెట్టులాంటి విశ్వాసులకు చాలా ‘కఠినమైన తీర్పు’ తప్పదని యేసు బోధించాడు (యోహాను 15:1–11). యేసు తన ముప్ఫై మూడున్నరేళ్ల ఈ లోకజీవితంలో ప్రసంగాల ద్వారా కన్నా తన జీవితం ద్వారానే అందరినీ ప్రభావితం చేశాడు. తన ప్రేమనంతా ఆచరణలోనే చూపించాడు. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
చదవని బైబిల్.. వెలగని కాగడా వంటిదే!
• సువార్త గలిలయకు 150 కిలో మీటర్ల దూరంలో యెరూషలేముంటుంది. యేసు బోధ విని బాగుపడేందుకు కాదు, ఆయన బోధల్లో లోపాలెత్తి చూపించి, ఆయనకే ఎదురు బోధ చేసేందుకు వాళ్లంతా అంత ప్రయాసపడి రావడం ఆశ్చర్యకరం!! యేసును చూసి, ఆయన బోధ వినే భాగ్యాన్ని పొందిన ఎంతోమంది నిరక్షరాస్యులు, అజ్ఞానులు తమ జీవితాన్ని ధన్యం చేసుకొంటుండగా, మహా మేధావులుగా ముద్రపడినవారు ఆ భాగ్యాన్ని చేజార్చుకొని, యేసుతో వాతలు వేయించుకొని భ్రష్టులుగానే తిరుగుముఖం పట్టిన పరిసయ్యులనేమనాలి? కొందరంతే!! బోధ చేయడానికి, ఖండించడానికి, గద్దించడానికి ఇతరులకు బుద్ధి చెప్పడానికే తాము పుట్టామన్న దుర్భావనలో ఉంటారు (2 తిమోతి 4:2). కాని దానికి ముందుగా తమలోని అజ్ఞానపు అంధకారాన్ని గుర్తించి సరిచేసుకోలేని గురివింద గింజలు వాళ్లు. అలా పప్పులో కాలేసి చివరికి నరకంలో చేరే మాట అటుంచితే, లోపాలెత్తి చూపడం, విమర్శించడమే వ్యాపారంగా మారి విజ్ఞత లోపించిన తొందరపాటు నిర్ణయాలతో ఈ లోకంలోనే తమ జీవితాన్ని అశాంతితో నరకప్రాయం చేసుకుంటారు వాళ్లు. ఎంత ఉన్నా ఇంకేదో పొందలేకపోతున్నామన్న అభద్రతా, అసంతృప్తి భావన పరోక్షంగా వారి మాటలు, చేతల్లో ధ్వనిస్తూంటుంది. దేవుని బోధలు వినేందుకు ఈనాడు వందల మైళ్లు ప్రయాణించే అవసరం లేదు. దేవుని మాటలు, బోధల సంగ్రహ సారాంశంగా బైబిలు గ్రంథం విశ్వాసులందరికీ అందుబాటులో ఉంది. బైబిలు గ్రంథం జీవితాన్ని సరైన బాటలో నడిపించే కాగడాలాంటిది. అయితే దాన్ని ^è దివినపుడు మాత్రమే అలా వెలిగే కాగడా అవుతుంది. చదవని బైబిలు గ్రంథం, వెలగని కాగడావంటిదే! దైవ భయంతో, వినమ్రతతో, అత్యంత విధేయతతో చదివితే అది జీవితాన్ని కుటుంబాన్ని కూడా ఆనందమయం చేస్తుంది. విమర్శించడానికో, లోపాలు చూడడానికో మిడిమిడి జ్ఞానపు మేధావిలాగా చదివితే మాత్రం జీవితంలో మిగిలేది అంధకారమే, అశాంతే, భ్రష్టత్వమే. – రెవ.డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్ -
అందం పాదాల్లో ఉంటుందా?
సిరియా శత్రుసైన్యం షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేసింది. ద్వారం మూసుకొని పట్టణం లోపల ఉన్న ఇశ్రాయేలీయులకు ఆహారం, నీరు తదితర అత్యవసర సరుకులు అందకుండా చేశారు. సిరియా సైనికులు పట్టణం లోపల కొంత కాలానికి ఆహారం నిండుకుంది. తర్వాత పక్షులు, గాడిదలూ చంపుకొని తిన్నారు. పిదప తల్లితండ్రులు తమ పిల్లల్నే చంపుకొని తినేంత దౌర్భాగ్యకరమైన దుర్భర క్షామం పట్టణంలో నెలకొంది. ఈ క్రీడంతా దేవుడే చేశాడు. ఇక ఆయన్ను నేనెందుకు ప్రార్ధించాలంటూ ఎదురు తిరిగారు షోమ్రోను రాజు (2 రాజులు 6:33). దేవుడు ఇంత భయంకరమైన క్షామాన్ని 24 గంటల్లో తొలగించి రేపు ఈ వేళకు సమృద్ధి ఆహారాన్నిస్తాడని ఎలీషా ప్రవక్త చెప్పాడు. పట్టణం లోపల కరవు రూపంలో, వెలుపల శత్రువుల రూపంలో మృత్యువు సంచారం చేస్తూంటే దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచి ఆహారమిస్తాడా? అని ఎకసెక్కాలాడాడు ఒక అధికారి. ప్రవక్త మాటల్ని ఎవరూ నమ్మలేనంత నిరాకారమైన క్షామం అది. అయితే ఎవరు నమ్మినా నమ్మకున్నా దేవుడు మాట తప్పేవాడు కాదు. ఆయన తన కార్యాన్ని నెరవేర్చి తీరుతాడు. షోమ్రోనును చుట్టుముట్టిన సిరియా సైన్యంలో దేవుడు గందరగోళం సృష్టించాడు. ఇశ్రాయేలీయులు పెద్ద ఎత్తున దాడికి రానున్నారన్న భ్రమ కల్పిస్తూ గుర్రాలు, రథాల ఉరుకులు, పరుగుల ధ్వని వారికి వినిపించడంతో శత్రువులు తమ గుడారాల్లో రెండేళ్ల కోసం దాచుకున్న ఆహార సరుకుల్ని పడవేసి ప్రాణాలు దక్కించుకోవడానికి రాత్రికి రాత్రి పారిపోయారు. పట్టణం చుట్టూ శత్రువులు లేరు కాని వారు వదిలివెళ్లిన ఆహారం విస్తారంగా పడి ఉంది. దేవుణ్ణి నమ్మక, అది తెలియక పట్టణం లోపల ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. తన మాటల్ని రాజులు, అధికారులు, ప్రముఖులు నమ్మకపోతే దేవుడు కుష్ఠురోగులనైనా వాడుకుంటాడు. పట్టణం లోపలికి ప్రవేశార్హత లేని కుష్ఠు రోగులు నలుగురు ఆకలికి తాళలేక శత్రువుల వద్దనైనా ఆహారం దొరుకుతుందేమోనన్న ఆశతో సిరియన్ల శిబిరానికి వెళ్ళారు. అక్కడ శత్రువులెవరూ లేకపోగా వాళ్లు వదిలి వెళ్లిన ఆహారం కనిపించింది. కరువుతీరా తిన్నారు. అయితే అంత ఆహారాన్ని తామే తినాలనుకోవడం అన్యాయమనుకున్నారు. ఆహారం సమృద్ధిగా పడి ఉందన్న ‘సువార్త’ను ఆ నలుగురు కుష్ఠురోగులూ పరుగెత్తుకెళ్లి పట్టణంలో ప్రకటించగా వాళ్లంతా వచ్చి తినగలిగినంతా తిని ఇళ్లకు సమృద్ధిగా ఆహారాన్ని తీసుకెళ్లారు. దేవుడు చెప్పినట్టే 24 గంటల్లో దుర్భరమైన కరవు సమృద్ధిగా మారింది. అయితే రాజులు అధిపతులు అవిశ్వాసులు కాగా, దేవుడు అంటరానివారు, పరమ వికారమైన వ్యక్తులైన కుష్ఠురోగులను వాడుకున్నాడు. అందాన్ని వ్యక్తుల ముఖారవిందాల్లో వెదుకుతుంది లోకం. కాని పదిమందికీ సాయం చేయడానికి ఉరుకులు పరుగులెత్తే పాదాలల్లోనే నిజమైన అందం ఉందంటాడు దేవుడు. ‘నాకు నా కుటుంబానికే అంతా కావాలనుకునేవాడు చూసేందుకు పైకి ఎంత అందగాడైనా పరమ వికారి అంటాడు దేవుడు. పక్కవాడికి, పదిమందికి లాభం కలగాలని పాకులాడేవాడు పరమ వికారంగా ఉన్నా, అతడు కుష్ఠురోగిౖయెనా అతనే నా దృష్టిలో అందగాడంటాడు దేవుడు. సమాధాన సువార్తను ప్రకటించేవారి పాదాలు ఎంతో సుందరమైనవని బైబిలు అందుకే చెబుతోంది (రోమా 10:14–15). – రెవ. డాక్టర్ టి.ఎ. ప్రభుకిరణ్