పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో అమెరికా పర్యాటకుడు జాన్ అలెన్ చౌ హత్యకు కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న ఘటనలు తాజాగా వెలుగుచూశాయి. కోపోద్రిక్తులైన సెంటినల్ తెగ ప్రజలు వేసిన బాణం అతని చేతిలోని బైబిలుకు తగలడంతో తొలుత ప్రాణాలతో బయటపడ్డాడు. అలెన్‌కు పరిచయస్తుడైన స్థానికుడు అలెగ్జాండర్ పోలీసులకు అందజేసిన డైరీలో ఈ వివరాలున్నాయి. అలెన్ క్రైస్తవ మతాన్ని విపరీతంగా విశ్వసించేవాడని, క్రీస్తు బోధనల్ని సెంటినల్ ప్రజలకు పరిచయం చేయడానికే వెళ్లినట్లు తేలింది. హత్యకు ముందు అలెన్ డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం..ఆ రోజు సాయంత్రం ఇద్దరు సెంటినల్ తెగ ప్రజలకు కానుకలు ఇవ్వబోయాడు. వారు కోపంతో వేసిన బాణం అతని చేతిలోని బైబిల్‌కు తగిలింది.
Comments
Please login to add a commentAdd a comment