Allen
-
ఇంతకీ.. ఎవరీ 'జో అలెన్ వీగెల్'!?
నమ్మకాన్ని పెనవేసుకుని పుట్టే మోసానికి.. కేవలం బలి తీసుకోవడమే తెలుసు. దానికి చట్టమంటే మహా అలుసు. చేసింది ఎంతటి ఘోరమైనా.. పరపతి నీడలో.. పలుకుబడి ముసుగులో.. శిక్షాస్మృతిని సైతం వెక్కిరిస్తుంది. అసలు ఈ నేరచరిత నేటిది కాదు. నేటితో ఆగేదీ కాదు. అలా అని, ఏదొక ప్రాంతానికే పరిమితమూ కాదు. ఎందుకంటే.. అది మానవసమూహంలో మంచితనం ముసుగుతో తిరుగుతుంది. ఎదుటివారి అవసరాన్ని, అమాయకత్వాన్ని, ఆశల్నీ, ఆలోచనలనీ.. అన్నింటినీ అంచనా వేసి, పొందాల్సిన లాభాన్ని పొందాకే.. అదను చూసి.. దెబ్బకొడుతుంది. ప్రపంచ చరిత్రలో అలా దెబ్బతిన్న బాధితుల గాథలు అన్నీ ఇన్నీ కావు. వాటిలో ‘జో అలెన్ వీగెల్’ ఉదంతం ఒకటి.1970, జూలై 2. పద్దెనిమిదేళ్ల ‘జో అలెన్ వీగెల్’ ఆశలన్నీ కుప్పకూలిన రోజది. తన మృత్యువుకు ప్రణాళిక ముందే సిద్ధమైందని, తనతో ఉన్నవారే యమకింకరులని ఆమెకు తెలియని రోజది. తెలిసే సమయానికి.. ఆమె లేనేలేదు. అమెరికాకు చెందిన ‘జో అలెన్ వీగెల్’.. చదువుకునే రోజుల్లో స్థానికుడైన మైక్ క్లైన్ అనే స్నేహితుడ్ని ప్రేమించింది. ఇద్దరిదీ సుమారు ఒకే వయసు. అతడు చాలా ఆస్తిపరుడు, అందగాడు. మెడిసిన్ చదువుతున్నాడు.‘త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం’ అని అతడ్ని తన కన్నవారికి పరిచయం చేసింది జో. మొదటి నుంచి శ్రామికులైన జో తల్లిదండ్రులు.. ఆ జంటను చూసి.. అతడి బ్యాగ్రౌండ్ చూసి ఎంతగానో మురిసిపోయారు. జో.. మైక్‌తో కలసి వెళ్లిందంటే వారికో ధైర్యం. ఏ సమస్య వచ్చినా మైక్ చూసుకుంటాడులే అనే ఓ నమ్మకం. జూలై 2 రాత్రి కూడా జో.. అతడితోనే వెళ్లింది కానీ తిరిగిరాలేదు.మరునాడు జో కోసం ఆమె తండ్రి జోసెఫ్ వీగెల్.. మైక్‌ని కలసి ఆరా తీశాడు. ‘మాకు వివాహం అయ్యింది. తను నా భార్య.. తన గురించి మీకంత శ్రద్ధ అవసరం లేదు’ అంటూ తిక్కగా సమాధానం చెప్పాడు మైక్. అతడ్ని ఆ తీరులో ఎప్పుడూ చూడలేదు జోసెఫ్. ‘గొడవపడ్డారా? నిన్న రాత్రి మీరిద్దరూ బయలుదేరే ముందు కూడా గొడవపడటం నేను విన్నాను. అసలేం జరిగింది? జో నిజంగా ఎక్కడికి వెళ్లిందో చెప్పు?’ అంటూ నిదానంగా, సముదాయింపుగా అడిగాడు జోసెఫ్.ఆ వాదనలో ‘తెలియదు’ అని ఒకసారి.. ‘బంధువుల ఇంటికి వెళ్లింది’ అని మరోసారి చెప్పాడు మైక్. వెంటనే జోసెఫ్.. మైక్ చెప్పిన బంధువుల ఇంటికి వెళ్లి మరీ జో గురించి వాకబు చేశాడు. ఇక్కడికి రాలేదని బంధువులు తెలపడంతో.. నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి.. ‘మా అమ్మాయి కనిపించడం లేదు.. కాబోయే అల్లుడు మైక్‌పై అనుమానం ఉంది, కంప్లైంట్ తీసుకోండి’ అని కోరాడు జోసెఫ్. టీనేజ్ పిల్లలు ఇంట్లో చెప్పకుండా ట్రిప్‌లకు వెళ్లడం, కొన్నిరోజులకు మళ్లీ తిరిగి రావడం కామన్ కాబట్టి.. సరైన ఆధారం లేకుండా కేసు నమోదు చేసుకోలేమని.. పోలీసులు తేల్చేశారు. దాంతో జో పేరెంట్స్‌కి జో కోసం ఎదురుచూడటం తప్ప మరో దారి లేకుండా పోయింది.సరిగ్గా మూడురోజులకి.. కొన్ని మైళ్లదూరంలో ఉన్న విన్నెబాగో సరస్సులో జో.. కేవలం లో–దుస్తులతో శవమై తేలింది. బాడీని జో పేరెంట్స్ గుర్తుపట్టడంతో కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు మొదలుపెట్టారు. జో కాళ్లకు.. బరువైన కాంక్రీట్ బండ, బరువైన వాటర్ టిన్ను కట్టి ఉన్నట్లు గుర్తించారు పోలీస్ అధికారులు. శవం పైకి తేలకుండా ఉండటానికే అలా చేసి ఉంటారని ప్రా«థమిక నిర్ధారణకు వచ్చారు. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించారు. ఆ రిపోర్ట్‌లో జో గొంతు నులమడం వల్లే చనిపోయిందని.. ఆమె 4వ నెల గర్భవతి అని తేలింది.పైగా ఆ సరస్సు ఒడ్డునే మైక్ నివాసం కావడంతో జో కేసు మొత్తం మైక్ చుట్టూనే తిరిగింది. అయితే జో బాడీ దొరికిన రోజే.. మైక్ యూరప్ చెక్కేశాడు. జో బాడీకి కట్టిన ఆ కాంక్రీట్ బండ.. మైక్ స్నేహితుడి ఇంటి ముందు ఉన్న మరిన్ని బండలతో సరిపోలింది. పైగా ఆ బండకు కట్టిన తాడు.. మైక్ ఇంట్లోని స్పీడ్ బోట్లో ఉండే బెల్ట్ అని తేలింది. ఇక మైక్ వాడే కారులో.. ఒక టవల్ దాని నిండా జో తల వెంట్రుకలు ఉన్నాయి. అవి జో మరణానికి ముందు.. తల నుంచి బలవంతంగా లాగినట్లు నేర పరిశోధనలో తేలింది. అంటే జోను చంపే సమయంలో తీవ్రమైన పెనుగులాట జరిగిందని అధికారులు నిర్ధారించుకున్నారు.ఈలోపు ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉన్న మైక్ తండ్రి డొనాల్డ్ క్లైన్.. కొడుకుని కాపాడుకోవడానికి విశ్వప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మీడియా కన్ను.. విన్నెబాగో సరస్సు ఒడ్డున ఉన్న మైక్ ఖరీదైన ఇంటి మీద పడింది. పోలీసులతో పాటు రిపోర్టర్స్ కూడా ఆ ఇంటిని శోధించి.. మైక్ ఇంటి అందాన్ని.. ఆ ఇంట్లో ఉన్న కార్లు, స్వీడ్ బోట్స్ లెక్కల్ని వాటి ధరల్నీ చెబుతూనే.. ‘జోకి అన్యాయం చేసిన మైక్ ఎక్కడ?’ అనే ఎన్నో కథనాలను ప్రచురించారు. జో గర్భిణి అని తెలుసుకున్నవారంతా మైక్ కుటుంబంపై దుమ్మెత్తిపోశారు.ఇక సరిగ్గా వారానికి యూరప్ నుంచి తిరిగి వచ్చిన మైక్‌ని అరెస్ట్ చేసి విచారణకు పంపించారు. అయితే అతడు నోరు విప్పలేదు. ఏం జరిగిందో చెప్పలేదు. జోను చంపింది తానేనని ఒప్పుకోలేదు. అదంతా అతడి లాయర్ సలహానే అని మీడియా గగ్గోలుపెట్టింది. కేసు నడుస్తుండగానే బెయిల్‌పై బయటికి వచ్చిన మైక్.. వాయిదాల ప్రకారం కోర్టుకు వచ్చిపోతుండేవాడు. జో హత్యపై తీవ్రమైన అభియోగాలు ఎదురవడంతో.. జూలై 24న గ్రాండ్ జ్యూరీలో మైక్.. బెయిల్ రద్దు చేస్తూ.. తిరిగి మైక్‌ని అదుపులోకి తీసుకోమని ఆదేశాలొచ్చాయి. అయితే ఆ రోజు నుంచి మైక్ ఎవరికీ కనిపించలేదు. నేటికీ దొరకలేదు.మైక్ మారుపేరుతో తన ఎడ్యుకేషన్ మొత్తం పూర్తి చేసి.. పశువైద్యుడిగా జీవితాన్ని రీస్టార్ట్ చేశాడని.. ఇప్పటికీ అతడు.. లాటిన్ అమెరికాలో రహస్యంగా, సురక్షితంగా జీవిస్తున్నాడని చాలామంది చెబుతుంటారు. అతడి ఆచూకీ ప్రపంచానికి తెలియకపోవచ్చు కానీ.. తన తండ్రి డొనాల్డ్‌కి కచ్చితంగా తెలుసు అని అధికారులు సైతం నమ్మారు. 1988లో డొనాల్డ్ మృతి చెందాడు. అంతకుముందే జో పేరెంట్స్ కూడా ఈ కేసుపై పోరాడి పోరాడి.. అనారోగ్యసమస్యలతో చనిపోయారు. ఈరోజుకి మైక్ బతికి ఉంటే అతడికి డెబ్బై రెండేళ్లు దాటి ఉంటాయని అంచనా. అతడికి సంబంధించిన పలు ఊహాచిత్రాలు.. నేటికీ ఎఫ్‌బీఐ రికార్డ్స్‌లో ‘మోస్ట్ వాంటెడ్’ నోట్‌తో కనిపిస్తుంటాయి.ఏది ఏమైనా.. జో మృతిలో మైక్ హస్తం ఉందనే స్పష్టత అతడి మిస్సింగ్‌తో తేలిపోతుంది. కానీ ఆమెను మైక్ ఎందుకు చంపాడు? ఎవరెవరు ఈ కుట్రలో పాల్గొన్నారు? జో తల్లి కాబోతుందన్న నిజం తెలిసి కూడా చంపేశాడా? అసలు మైక్ ఏమైపోయాడు? ఎటుపోయాడు? ఎక్కడున్నాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు మాత్రం నేటికీ మిస్టరీనే మిగిలిపోయాయి. – సంహిత నిమ్మన -
500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం... మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి ఆర్ట్ కలెక్షన్
న్యూయార్క్: దివగంత మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు పాల్ అలెన్‌కి సంబంధించిన ఆర్ట్ సేకరణలను వేలం వేయనున్నట్టు క్రిస్టీస్ ప్రకటించింది. ఈ ఆర్ట్ విలువ సుమారు రూ. 7 వేల కోట్లు పైనే ఉంటుందని పేర్కొంది. దాదాపు 150కి పైగా ఆర్ట్ కలెక్షన్లను వేలం వేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇది 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద అత్యంత అసాధారణమైన ఆర్ట్ వేలంగా వెల్లడించింది. వీటిలో ఫ్రెంచ్ చిత్రాకారుడి పాల్ సెజాన్చే ఆర్ట్ "లా మోంటాగ్నే సెయింట్ విక్టోయిర్" కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీని విలువే సుమారు రూ. 650 కోట్లు ఉంటుందని వేలం సంస్థ వెల్లడించింది. వీటిని బిలియనీర్ ఆస్తులతో కలిపి ఈ వేలం వేస్తుందని తెలిపింది. అలెన్ కోరిక మేరకు వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తామని సంస్థ పేర్కొంది. అంతేకాదు అలెన్ దృష్టిలో కళ అనేది విశ్లేషణాత్మకమైన భావోద్వేగంతో కూడుకున్నదని వెల్లడించింది. కళాకారుడు అంతర్గత దృక్కోణం మనందరికి స్ఫూర్తినిచ్చేలా వాస్తవిక దృక్ఫథాన్ని వ్యక్తం చేస్తోందని అలెన్ విశ్వసించేవాడని క్రిస్టీస్ వేలం సంస్థ చెబుతోంది. వేలం సంస్థ సీఈవో గుయిలౌమ్ సెరుట్టి మాట్లాడుతూ... ఈ వేలం ఈవెంట్ మరెవ్వరికీ జరగని విధంగా ఉంటుందని అన్నారు. 1975లో బిల్ గేట్స్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన అలెన్.. 2018లో మరణించారు. (చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..) -
బైబిల్ కాపాడినా..
పోర్ట్ బ్లెయిర్: అండమాన్ నికోబార్ దీవుల్లో అమెరికా పర్యాటకుడు జాన్ అలెన్ చౌ హత్యకు కొన్ని గంటల ముందు చోటుచేసుకున్న ఘటనలు తాజాగా వెలుగుచూశాయి. కోపోద్రిక్తులైన సెంటినల్ తెగ ప్రజలు వేసిన బాణం అతని చేతిలోని బైబిలుకు తగలడంతో తొలుత ప్రాణాలతో బయటపడ్డాడు. అలెన్‌కు పరిచయస్తుడైన స్థానికుడు అలెగ్జాండర్ పోలీసులకు అందజేసిన డైరీలో ఈ వివరాలున్నాయి. అలెన్ క్రైస్తవ మతాన్ని విపరీతంగా విశ్వసించేవాడని, క్రీస్తు బోధనల్ని సెంటినల్ ప్రజలకు పరిచయం చేయడానికే వెళ్లినట్లు తేలింది. హత్యకు ముందు అలెన్ డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం..ఆ రోజు సాయంత్రం ఇద్దరు సెంటినల్ తెగ ప్రజలకు కానుకలు ఇవ్వబోయాడు. వారు కోపంతో వేసిన బాణం అతని చేతిలోని బైబిల్‌కు తగిలింది. -
‘కంటి’పై నలుసు పడనివ్వరు!
ముగ్గురు శ్వేతజాతీయులు తెలుగువారికి ప్రాతఃస్మరణీయులు. ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణగా మార్చిన సర్ ఆర్దర్ కాటన్, తెలుగు భాషను సుసంపన్నం చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. మరొకరెవరు? వెండితెరపై వెన్నెలను పరచి తెలుగువారికి కనులపండుగలను ప్రసాదించిన అద్వితీయ సినిమటోగ్రాఫర్ మార్కస్ బార్ట్లే! ముంబైలో ప్రెస్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ న్యూస్‌రీల్ కెమెరా అసిస్టెంట్‌గా లైటింగ్ అరేంజ్ చేసే బార్ట్లే తిరువళ్లువర్ (1941) చిత్రానికి సినిమటోగ్రాఫర్గా సినీరంగానికి పరిచయం అయ్యారు. వాహినీ వారి స్వర్గసీమ (1945) ద్వారా బి.ఎన్.రెడ్డి బార్ట్లేను తెలుగు సినిమాలకు పరిచయం చేశారు. బి.ఎన్ సోదరుడు బి.నాగిరెడ్డి నిర్మించిన చిత్రాల ద్వారా తరతరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నారు. బార్ట్లే సినిమటోగ్రఫీ ఆయా సినిమాలలోని సన్నివేశాలను మనోజ్ఞంగా మార్చివేస్తుంది. సినిమా టెక్నాలజీ ప్రాథమిక దశలో ఉన్న రోజుల్లో, హాలీవుడ్‌తో పోల్చుకుంటే నూరవవంతు కూడా తగిన పరికరాలు లేని రోజుల్లో మార్కస్‌బార్‌ట్లే ఫొటోగ్రఫీ హాలీవుడ్‌ను సైతం ఆశ్చర్యపరచింది. ఉదాహరణకు: ‘స్వర్గసీమ’లో నాగయ్య-జయమ్మలు మాట్లాడుకునే సన్నివేశంలో క్లోజప్‌లో జయమ్మ మోముపై గాలికి కదిలే ఆకులనీడలు, పాతాళభైరవిలో మాయలఫకీర్ చేతిని నరుక్కోవడం, తిరిగి మంత్రమహిమచే అతికించుకోవడం, మాయాబజార్లో మూడు జంటల ‘లాహిరి లాహిరి, ఘటోత్కచుని ‘వివాహభోజనంబు’ పాట, ‘జగదేకవీరుని కథ’లో అనేక రామారావుల సంగీతకచేరీ, తదితర సన్నివేశాలను చూసి నేటికీ మనం పరవశిస్తాం! మార్కస్బార్ట్లేపై త్రిపురనేని సాయిచంద్ రూపొందించిన డాక్యుమెంటరీని ఇటీవల హైదరాబాద్‌లో ప్రదర్శించిన సందర్భంగా ఆయన కుమారుడు అలెన్బార్ట్లే, అయన శ్రీమతి పదహారణాల తెలుగమ్మాయి సారాతో విచ్చేశారు. అలెన్బార్ట్లేతో ఇంటర్వ్యూ సారాంశం : ఈ సందర్భాన్ని ఎలా భావిస్తున్నారు? ఇదో గొప్ప సందర్భం. ప్రైస్ టు తెలుగు పీపుల్. డాక్యుమెంటరీ రూపొందించిన సాయిచంద్‌కు, నాన్నపై అభిమానాన్ని వ్యక్తం చేసిన భరద్వాజ, ఎస్.గోపాలరెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు కినిగె అనిల్, బ్నిం, తదితరులకు ముఖ్యంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఇక్కడి (లామకాన్) వాతావరణం కూడా చాలా సహజంగా ఉంది. ఈ క్షణాలు మరచిపోలేనివి. లైటింగ్ రిహార్సల్స్! నాన్నతో ఒక మలయాళ సినిమా షూటింగ్‌కు మాత్రమే వెళ్లాను. ఆయన సాధారణంగా స్టూడియోకి తీసుకువెళ్లరు. లైటింగ్ అమర్చుకునేందుకు ఏకాంతాన్ని కోరుకుంటారు. తానెంతో గౌరవించే దర్శకులను సైతం లైటింగ్ అమర్చుకునే సందర్బంలో సెట్లోకి రావద్దనే వారట. లైటింగ్ పూర్తయ్యాక ఆయా సన్నివేశాల్లోని నటీనటులందరితో రిహార్సల్స్ చేయించేవారట. తాననుకున్న ఎఫెక్ట్ రాబట్టాకే షూటింగ్‌కు ‘రెడీ’ అనేవారట. ఈ డాక్యుమెంటరీలోనూ ఆయనో విలువైన మాట చెప్పారు. ‘చిత్రకథలో ఒరిజినాలిటీ ఎంత ముఖ్యమో ప్రతీ సన్నివేశంలో లైటింగ్ కూడా అంతే ముఖ్యం’ అన్నారు. ‘కంటి’పై నలుసు పడనివ్వరు! పగటిపూట మాయాబజార్లో వెన్నెలరాత్రిని చిత్రీకరించిన నాన్న ఆర్ట్ ఫిలిమ్లపై కూడా తన ముద్ర వేశారు. ఆయన ప్రతిభ వెనుక అసాధారణమైన కృషి ఉంది. ఆదివారం నాన్న షూటింగ్ పెట్టుకునేవారు కాదు. తప్పనిసరిగా ఇంట్లో ఉండేవారు. ఇంటి వాతావరణాన్ని ఆనందిస్తూనే కెమెరా లెన్స్‌లను శుభ్రం చేసుకునేవారు. ఏమాత్రం తేమ ఉన్నా, సూక్ష్మాతిసూక్ష్మమైన ధూళికణం ఉన్నా ప్రేక్షకులకు ఇవ్వాల్సింది ఇవ్వలేం అనేవారు! కంటిపాపకంటే కెమెరాలెన్స్ను జాగ్రత్తగా చూసుకునేవారు. ఎప్పుడూ అప్టుడేట్గా ఉండేవారు. వారసత్వపు విశేషాలు సినిమటోగ్రఫీని ఆర్ట్ అండ్ సైన్స్ కలయికగా అభివర్ణిస్తారు. పెద్దన్నయ్య ‘మార్కస్’ నాన్న వారసత్వంగా ఆర్ట్‌ను అందిపుచ్చుకున్నారు. సినిమటోగ్రఫర్గా కొన్ని చిత్రాలకుపనిచేసి దివంగతులైనారు. నాకు అందులోని సైన్స్ అబ్బింది. నాన్న నుంచి ‘సైన్స్’ పార్ట్‌ను నేను అనుసరిస్తున్నాను. ‘బార్ట్లే లెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్’ నిర్వహిస్తున్నాను. డిజిటల్ కెమెరాలకు ఫిలిం కెమెరా లెన్స్‌లను అమర్చుతున్నాను. హాలివుడ్, యూరోప్ దేశాలకు లెన్స్‌లు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వ్యాపారవిషయాలను సారా చూస్తోంది. మా పెద్దమ్మాయి నతాషా నా వలెనే ఇంజనీరింగ్ చేసింది. చిన్నమ్మాయి సాషా (19) స్వయంగా సినిమటోగ్రఫీ చేస్తూ ఫిలిమ్లు రూపొందిస్తోంది. ‘ఇప్పుడప్పుడే నా గురించేం చెప్పకు’ అంటుంది! - పున్నా కృష్ణమూర్తి మన మార్కస్ బార్ట్లే రెండు మలయాళ, నాలుగు హిందీ సినిమాలకూ సినిమటోగ్రఫీ చేశారు.‘చెమ్మీన్’ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా (1978) కేన్స్ గోల్డ్‌మెడల్ పొందారు. మత్స్యకారుల జీవితకథ అయిన ఆ చిత్రంలో షార్క్ చేపల కదలికలను కథానుగుణంగా అద్భుతంగా చూపారు. తాను లైటింగ్ అరేంజ్ చేసుకునే సమయంలో దర్శకుడిని కూడా సెట్లోకి అనుమతించేవారు కాదు. ఆదివారం తప్పనిసరిగా సెలవు తీసుకునేవారు. అదీ, కెమెరాలు, లెన్స్‌లు సరిచూసుకునేందుకే! తనవద్ద శిష్యరికం చేసిన బి.ఎన్.కొండారెడ్డి, బాబూరావులు ఉత్తమ సినిమటోగ్రాఫర్లుగా ఎదిగారు. షావుకారు, పాతాళభైరవి, పెళ్లిచేసిచూడు, మిస్సమ్మ, జగదేకవీరునికథ, గుండమ్మకథ, అప్పుచేసి పప్పుకూడు... తదితర చిత్రాలలో బార్ట్లే కెమెరాతో చేసిన చిత్రానువాదం చిరస్థాయిగా ఆకట్టుకుంటుంది.