![Microsoft Co Founder Paul Allens Art Collection Up For Auction - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/26/America.jpg.webp?itok=91Av0yBG)
న్యూయార్క్: దివగంత మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు పాల్ అలెన్‌కి సంబంధించిన ఆర్ట్ సేకరణలను వేలం వేయనున్నట్టు క్రిస్టీస్ ప్రకటించింది. ఈ ఆర్ట్ విలువ సుమారు రూ. 7 వేల కోట్లు పైనే ఉంటుందని పేర్కొంది. దాదాపు 150కి పైగా ఆర్ట్ కలెక్షన్‌లను వేలం వేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇది 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద అత్యంత అసాధారణమైన ఆర్ట్ వేలంగా వెల్లడించింది.
వీటిలో ఫ్రెంచ్ చిత్రాకారుడి పాల్ సెజాన్‌చే ఆర్ట్ "లా మోంటాగ్నే సెయింట్ విక్టోయిర్" కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీని విలువే సుమారు రూ. 650 కోట్లు ఉంటుందని వేలం సంస్థ వెల్లడించింది. వీటిని బిలియనీర్ ఆస్తులతో కలిపి ఈ వేలం వేస్తుందని తెలిపింది. అలెన్ కోరిక మేరకు వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తామని సంస్థ పేర్కొంది.
అంతేకాదు అలెన్ దృష్టిలో కళ అనేది విశ్లేషణాత్మకమైన భావోద్వేగంతో కూడుకున్నదని వెల్లడించింది. కళాకారుడు అంతర్గత దృక్కోణం మనందరికి స్ఫూర్తినిచ్చేలా వాస్తవిక దృక్ఫథాన్ని వ్యక్తం చేస్తోందని అలెన్ విశ్వసించేవాడని క్రిస్టీస్ వేలం సంస్థ చెబుతోంది. వేలం సంస్థ సీఈవో గుయిలౌమ్ సెరుట్టి మాట్లాడుతూ... ఈ వేలం ఈవెంట్ మరెవ్వరికీ జరగని విధంగా ఉంటుందని అన్నారు. 1975లో బిల్ గేట్స్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన అలెన్.. 2018లో మరణించారు.
(చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..)
Comments
Please login to add a commentAdd a comment