Microsoft co-founder
-
డిజిటల్ టెక్నాలజీకి పెద్దపీట
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై తనకెంతో ఆసక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. టెక్నాలజీలో తాను నిపుణుడిని కాకపోయినా దానిపై చిన్నపిల్లలకు ఉండే ఉత్సుకత తనకు కూడా ఉందని తెలిపారు. అదేసమయంలో టెక్నాలజీకి తాను బానిస కాలేదని వివరించారు. ప్రధాని మోదీ మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ‘చాయ్ పే చర్చ’ నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయం, వాతావరణ మార్పులు, మహిళా సాధికారత, కృత్రిమ మేధ వంటి కీలక అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయా రంగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని బిల్‌గేట్స్‌కు తెలియజేశారు. ఇండియాలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో నూతన సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. బిల్‌గేట్స్‌తో మోదీ ఇంకా ఏం చెప్పారంటే... కృత్రిమ మేధ.. మంత్రదండం కాదు ‘‘నేడు డిజిటిల్ ప్రజా మౌలిక సదుపాయాల అవసరం చాలా ఉంది. డిజిటల్ టెక్నాలజీపై ప్రజలకు అవగాహన పెంచాలి. కృత్రిమ మేధ(ఏఐ) వంటి శక్తివంతమైన సాంకేతికత దురి్వనియోగమయ్యే ప్రమాదం పొంచి ఉంది. నైపుణ్యం లేని వ్యక్తుల చేతుల్లో ఇలాంటి టెక్నాలజీ పడితే దుష్పరిణామాలు తప్పవు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలి. నియమ నిబంధనలు అమలు చేయాలి. ఏఐతో సృష్టించే కంటెంట్‌లో వాటర్‌మార్క్‌ను జోడించాలి. ఏఐతో సృష్టించే డీప్‌ఫేక్‌ల విషయంలో అప్రమత్తత అవసరం. ఏఐని అన్నీ సాధించిపెట్టే మంత్ర దండంగా చూడొద్దు. అంటే కృత్రి మేధ విలువను తగ్గించడం నా ఉద్దేశం కాదు. గత ఏడా ది జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో ఏఐని నేను ఉపయోగించుకున్నా. పలు కార్యక్రమా ల్లో నా ప్రసంగాలను వేర్వేరు భాషల్లో ప్రసా రం చేయడానికి ఈ టెక్నాలజీ తోడ్పడింది. భూగోళాన్ని కాపాడుకోవాలి వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా పెను సవాళ్లు విసురుతున్నాయి. భూగోళాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. విద్యుత్ లేదా ఉక్కు వినియోగాన్ని అభివృద్ధికి కొలమానంగా చూపుతున్నారు. ఈ ధోరణి కచ్చితంగా మారాలి. విద్యుత్, ఉక్కు విచ్చలవిడి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి చేటు తప్పదన్న సంగతి మర్చిపోవద్దు. ఇకపై గ్రీన్ జీడీపీ, గ్రీన్ ఎంప్లాయ్మెంట్ వంటి పరిభాషను ఉపయోగించాలి. వస్తువుల పునఃశుద్ధి, పునరి్వనియోగం ఇండియాలో చాలా సహజం. ఇప్పుడు నేను ధరించిన జాకెట్ రీసైకిల్ చేసిన ఉత్పత్తే. టెక్నాలజీ అంటే కేవలం సేవలను విస్తరించడానికే కాదు, సామాన్య ప్రజల జీవితాలను మరింత సులభతరం చేయాలని నేను నమ్ముతున్నా. తృణధాన్యాల సాగుకు ప్రాధాన్యం గత ఏడాది ఇండియాలో జీ20 సదస్సు నిర్వహించిన తర్వాత వాతావరణ మార్పులపై యుద్ధంలో వేగం పెరిగింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవాలంటే మన జీవన శైలిని పర్యావరణ హితంగా మార్చుకోవాలి. ప్రకృతి, పర్యావరణహితమైన నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి. విద్యుత్‌ను వృథా చేస్తే, నీటిని విచ్చలవిడిగా ఉపయోగిస్తే అనుకున్న లక్ష్యం సాధించలేం. తక్కువ నీరు అవసరమయ్యే తృణధాన్యాల సాగును పెంచడానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. తృణధాన్యాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పెద్ద ముప్పుగా మారింది. త్వరలో కొలువుదీరే మా నూతన ప్రభుత్వ హయాంలో మహిళలకు.. ముఖ్యంగా బాలికలకు సరై్వకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తాం. సాంకేతిక ప్రజాస్వామీకరణ పునరుద్పాతక ఇంధన రంగంలో మేము శరవేగంగా దూసుకెళ్తున్నాం. గ్రీన్ హైడ్రోజన్ తయారీలో మరింత అభివృద్ధి సాధించడానికి కృషి చేస్తున్నాం. ‘సాంకేతిక ప్రజాస్వామీకరణ’ మా విధానం. డిజిటల్ విప్లవంలో గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట వేశాం. ఈ రంగంలో అందరికీ సమాన అవకాశాలు కలి్పస్తున్నాం. డిజిటల్ విప్లవానికి సామాన్య ప్రజలే నాయకత్వం వహించాలన్నది మా ఆకాంక్ష. ఆ దిశగా ‘డ్రోన్ దీదీ’ పథకాన్ని ప్రవేశపెట్టాం. నమో యాప్‌లో సెల్ఫీ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఇండియా చూపుతున్న చొరవను, వేగాన్ని బిల్‌గేట్స్ ప్రశంసించారు. ఈ విషయంలో ఇతర దేశాలకు మార్గదర్శిగా మారిందని కొనియాడారు. కృత్రిమ మేధను తాను ఉపయోగించుకుంటున్న తీరును గేట్స్‌కు మోదీ తెలియజేశారు. తన సెల్‌ఫోన్‌ను గేట్స్‌కు ఇచ్చి, అందులోని ‘నమో’ యాప్ ద్వారా సెల్ఫీ తీయాలని కోరారు. అందులోని టెక్నాలజీతో పాత ఫొటోలూ కనిపిస్తాయని అన్నారు. గతంలో తామిద్దరం దిగిన ఫొటోలను గేట్స్‌కు చూపించారు. -
భారత డిజిటల్ నెట్వర్క్ భేష్
న్యూఢిల్లీ: భారత్‌లోని డిజిటల్ పబ్లిక్ నెట్వర్క్ భేషుగ్గా ఉందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసించారు. దేశీయంగా విశ్వసనీయమైన, చౌకైన కనెక్టివిటీ లభిస్తుందని చెప్పారు. భారత్ అత్యంత చౌకైన 5జీ మార్కెట్ కావచ్చని ఆయన పేర్కొన్నారు. బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన జీ20 సంబంధ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గేట్స్ ఈ విషయాలు తెలిపారు. ఆధార్, చెల్లింపుల వ్యవస్థ, మరింత మందిని బ్యాంకింగ్ పరిధిలోకి తెచ్చేందుకు భారత్ సాధించిన పురోగతి తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు. ప్రాథమిక ఆధార్ రూపకల్పనపై ఇన్వెస్ట్ చేయడం సహా చెల్లింపుల విధానాన్ని సులభతరం చేయడంలో భారత్ సమగ్రమైన ప్లాట్‌ఫాంను రూపొందించిందని గేట్స్ చెప్పారు. ఈ విషయంలో మిగతా దేశాలకు ఆదర్శంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వర్ధమాన దేశాలు ఇలాంటి వాటి అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. -
హాట్ టాపిక్‌గా బిల్‌గేట్స్ డేటింగ్, ఎవరా కొత్త గర్ల్ ఫ్రెండ్?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డాడంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఒరాకిల్ మాజీ సీఈవో భార్య పౌలా హర్డ్‌తో గతేడాది నుంచే డేటింగ్లో ఉన్నట్లు రకరకాల కథనాలు వచ్చాయి. దీనికి తోడు ఆ ఇద్దరు ఇటీవల ఒక ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్లో జంటగా కనిపించడంతో ఈ పుకార్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పౌలా హర్డ్ 2019లో క్యాన్సర్‌తో పోరాడి మరణించిన ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ భార్య. పౌలా హర్డ్ కూడా ఈవెంట్ నిర్వాహకురాలిగా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందని ఆమెకు మంచి పేరుంది. అంతేగాదు ఆమె గతంలో టెక్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేసింది. పౌలా కూడా పలు దాతృత్వ కార్యక్రమాలు చేస్తుండటం విశేషం. కాగా. బిల్‌గేట్స్ 30 సంవత్సరాల వివాహం అనంతరం మెలిండా గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఐతే తాము విడిపోయినప్పటికీ ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి సారించే తమ ఫౌండేషన్‌తో మాత్రం ఇరువురం కలిసే పనిచేస్తామని ప్రకటించడం గమనార్హం. (చదవండి: మీ పనికీ, జీవితానికీ మధ్య సమతుల్యత ఉందా?: రాండ్‌స్టాడ్స్ అధ్యయనం) -
500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద వేలం... మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడి ఆర్ట్ కలెక్షన్
న్యూయార్క్: దివగంత మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు పాల్ అలెన్‌కి సంబంధించిన ఆర్ట్ సేకరణలను వేలం వేయనున్నట్టు క్రిస్టీస్ ప్రకటించింది. ఈ ఆర్ట్ విలువ సుమారు రూ. 7 వేల కోట్లు పైనే ఉంటుందని పేర్కొంది. దాదాపు 150కి పైగా ఆర్ట్ కలెక్షన్లను వేలం వేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు ఇది 500 ఏళ్ల కళా చరిత్రలో అతి పెద్ద అత్యంత అసాధారణమైన ఆర్ట్ వేలంగా వెల్లడించింది. వీటిలో ఫ్రెంచ్ చిత్రాకారుడి పాల్ సెజాన్చే ఆర్ట్ "లా మోంటాగ్నే సెయింట్ విక్టోయిర్" కూడా ఉంటుందని పేర్కొన్నారు. దీని విలువే సుమారు రూ. 650 కోట్లు ఉంటుందని వేలం సంస్థ వెల్లడించింది. వీటిని బిలియనీర్ ఆస్తులతో కలిపి ఈ వేలం వేస్తుందని తెలిపింది. అలెన్ కోరిక మేరకు వేలం వేయగా వచ్చిన మొత్తాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తామని సంస్థ పేర్కొంది. అంతేకాదు అలెన్ దృష్టిలో కళ అనేది విశ్లేషణాత్మకమైన భావోద్వేగంతో కూడుకున్నదని వెల్లడించింది. కళాకారుడు అంతర్గత దృక్కోణం మనందరికి స్ఫూర్తినిచ్చేలా వాస్తవిక దృక్ఫథాన్ని వ్యక్తం చేస్తోందని అలెన్ విశ్వసించేవాడని క్రిస్టీస్ వేలం సంస్థ చెబుతోంది. వేలం సంస్థ సీఈవో గుయిలౌమ్ సెరుట్టి మాట్లాడుతూ... ఈ వేలం ఈవెంట్ మరెవ్వరికీ జరగని విధంగా ఉంటుందని అన్నారు. 1975లో బిల్ గేట్స్‌తో కలిసి మైక్రోసాఫ్ట్‌ను స్థాపించిన అలెన్.. 2018లో మరణించారు. (చదవండి: రైలు పైకి ఎక్కేందుకు శతవిధాల యత్నం...పోలీస్ ఎంట్రీతో..) -
రానున్న 6 నెలలు ప్రమాదకరం: బిల్ గేట్స్
వాషింగ్టన్: రానున్న నాలుగు నుంచి ఆరు నెలలు కరోనా మహమ్మారి మరింత విజృంభించే ప్రమాదం ఉందని మైక్రోసాఫ్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ హెచ్చరించారు. గేట్స్‌కు సంబంధించిన ‘బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్’ కోవిడ్–19 కు టీకా రూపొందించే కార్యక్రమంలో భాగస్వామిగా ఉంది. ‘అమెరికాలో రానున్న 4 నుంచి 6 నెలలు కరోనా మహమ్మారి ముప్పు భారీగా పెరిగే ప్రమాదముంది. ఐహెచ్ఎంఈ(ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఇవాల్యుయేషన్) అధ్యయనం ప్రకారం అదనంగా 2 లక్షల వరకు మరణాలు సంభవించవచ్చు. అయితే, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తదితర నిబంధనలు పాటిస్తే ఆ సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు’ అని బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ఇలాంటి మహమ్మారి ప్రమాదం పొంచి ఉందని బిల్ గేట్స్ 2015లోనే హెచ్చరించారు. 2015లో తాను అంచనా వేసిన దానికన్నా ఈ వైరస్ మరింత ప్రమాదకారి అని తేలిందని గేట్స్ ‘సీఎన్ఎన్’ వార్తాసంస్థకు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరోనా టీకా ప్రపంచంలోని అందరికీ అందాల్సి ఉందని, అందుకు అమెరికా సహాయపడాలని గేట్స్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అమెరికా స్వార్థంగా ఆలోచించకూడదన్నారు. టీకాపై ప్రజల విశ్వాసం పెంచేందుకు బహిరంగంగానే తాను వ్యాక్సీన్‌ను తీసుకుంటానన్నారు. -
ప్రపంచమంతా పంపిణీ చేయగలదు
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నింటికీ కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేసి పంపిణీ చేయగల సత్తా భారత ఫార్మా పరిశ్రమకు ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అన్నారు. కరోనా టీకాకు సంబంధించి భారత్‌లో ఎన్నో కీలక ఘట్టాలు పూర్తయ్యాయని, టీకా డోసుల్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసే సత్తా ఫార్మా ఇండస్ట్రీకి ఉందని ఆయన కొనియాడారు. ‘కోవిడ్–19: వైరస్‌పై భారత్ యుద్ధం’పేరుతో గురువారం డిస్కవరీ ప్లస్ చానల్లో ప్రసారమైన డాక్యుమెంటరీలో గేట్స్ మాట్లాడారు. అతి పెద్ద దేశం, కిక్కిరిసిన జనాభా, పట్టణాల్లో జనసాంద్రత వంటి అంశాల వల్ల కరోనా వైరస్‌తో భారత్ ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందన్నారు. టీకాల తయారీలో భారత్‌కు మించిన దేశం లేదన్నారు. సీరం వంటి అతి పెద్ద సంస్థలు సహా ఎన్నో ఫార్మా కంపెనీల సహకారంతో ప్రపంచ దేశాలకు టీకాలను పంపిణీ చేయగలదని గేట్స్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ కూడా భాగస్వామిగా ఉందని చెప్పారు. వివిధ రకాల పరిశోధనలకు సహకారం అందిస్తూనే యూపీ, బిహార్లలో ఆరోగ్య రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని గేట్స్ వివరించారు. -
ఉద్యోగుల కారు నంబర్లూ గుర్తుపెట్టుకున్నా..
► వారాంతాల్లోనూ పని చేస్తూనే ఉండేవాణ్ని ► మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ లండన్: పని వేళల్లో ఉద్యోగులను అనుక్షణం పర్యవేక్షించేవాణ్నని, వారి లెసైన్స్ ప్లేట్లన్నీ కూడా గుర్తుపెట్టుకునే వాణ్నని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. అప్పట్లో సెలవు తీసుకోవాలనే ఆలోచనే ఉండేది కాదని, వారాంతాల్లో కూడా పనిచేస్తూనే ఉండేవాణ్నని వివరించారు. బీబీసీ రేడియోకి ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా అప్పట్లో తన మేనేజ్మెంట్ తీరును వివరించిన గేట్స్.. కొన్ని జ్ఞాపకాలనూ నెమరువేసుకున్నారు. ‘నాకు సెలవులు తీసుకోవాలనే ఆలోచనే ఉండేది కాదు. నా విధానాలు, ప్రమాణాలను మా కంపెనీలో పనిచేసే మిగతావారిపై రుద్దకుండా ఉండటానికి కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చేది. నాకు ప్రతీ ఒక్కరి లెసైన్సు ప్లేటు (వాహనం నంబరు) కూడా గుర్తుండేది. పార్కింగ్ లాట్లోకి చూసి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్లారన్నవి లెక్కేసుకునే వాణ్ని’ అని బిల్ గేట్స్ చెప్పారు. అయితే కంపెనీ పరిమాణం పెరుగుతున్న కొద్దీ తాను నిబంధనలు కూడా క్రమంగా సడలించాల్సి వచ్చిందని తెలిపారు. టెక్ దిగ్గజం యాపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌తో తన అనుబంధాన్ని కూడా గేట్స్ వివరించారు. స్టీవ్ ఒకోసారి చాలా కఠినంగా ఉండేవాడని, ఒకోసారి ఎంతగానో ప్రోత్సహించేవాడిగా ఉండేవాడని ఆయన చెప్పారు. తామిద్దరం కలిసి కూడా పనిచేశామన్నారు. యాపిల్ 2కి తాను సాఫ్ట్వేర్ కూడా రాశానని గేట్స్ చెప్పారు. ఎదుటివారి నుంచి అసాధారణమైన పనిని రాబట్టగలిగే దిట్ట జాబ్స్ అని కితాబిచ్చారు. క్లాసులో అమ్మాయిల మధ్య నేనొక్కణ్నే.. పంథొమ్మిదో ఏట హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి బైటికొచ్చి, మైక్రోసాఫ్ట్‌ను ప్రారంభించిన గేట్స్.. తన కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. క్లాసు మొత్తంలో మిగతా అబ్బాయిలెవరూ లేకుండా మొత్తం అమ్మాయిల మధ్యలో తానొక్కడే ఉండేలా మైక్రోసాఫ్ట్ మరో వ్యవస్థాపకుడు పాల్ అలెన్‌తో కలసి షెడ్యూలింగ్ సాఫ్ట్‌వేర్‌ను మార్చేసిన వైనాన్ని ఆయన వివరించారు. అలెన్ కాలేజీ చదువు అప్పటికే పూర్తయిపోవడంతో అది తనకు లాభించిందని గేట్స్ తెలిపారు. అయితే అమ్మాయిలతో మాట్లాడటంలో తాను అంతంతమాత్రమేనని, దీంతో అంతమంది చుట్టూ ఉన్నా వారితో పెద్దగా మాట్లాడేవాణ్ని కానని ఆయన చెప్పారు.