Bill Gates Finds Love Again With Paula Hurd, Know Who Is Paula Hurd - Sakshi
Sakshi News home page

Bill Gates Dating: 67 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డ బిల్‌గేట్స్‌

Published Fri, Feb 10 2023 1:34 PM | Last Updated on Fri, Feb 10 2023 2:27 PM

Bill Gates Finds Love Again In Paula Hurd  - Sakshi

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ మళ్లీ ప్రేమలో పడ్డాడంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఒరాకిల్‌ మాజీ సీఈవో భార్య పౌలా హర్డ్‌తో గతేడాది నుంచే డేటింగ్‌లో ఉన్నట్లు రకరకాల కథనాలు వచ్చాయి. దీనికి తోడు ఆ ఇద్దరు ఇటీవల ఒక ఆస్ట్రేలియా ఓపెన్‌ టోర్నమెంట్‌లో జంటగా కనిపించడంతో ఈ పుకార్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.  పౌలా హర్డ్‌ 2019లో క్యాన్సర్‌తో పోరాడి మరణించిన ఒరాకిల్‌ మాజీ సీఈవో మార్క్‌ హర్డ్‌ భార్య.

పౌలా హర్డ్‌ కూడా ఈవెంట్‌ నిర్వాహకురాలిగా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందని ఆమెకు మంచి పేరుంది. అంతేగాదు ఆమె గతంలో టెక్‌ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేసింది. పౌలా కూడా పలు దాతృత్వ కార్యక్రమాలు చేస్తుండటం విశేషం. కాగా. బిల్‌గేట్స్‌​ 30 సంవత్సరాల వివాహం అనంతరం మెలిండా గేట్స్‌ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఐతే తాము విడిపోయినప్పటికీ ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి సారించే తమ ఫౌండేషన్‌తో మాత్రం ఇరువురం కలిసే పనిచేస్తామని ప్రకటించడం గమనార్హం.

(చదవండి: మీ పనికీ, జీవితానికీ మధ్య సమతుల్యత ఉందా?: రాండ్‌స్టాడ్స్‌ అధ్యయనం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement