oracle
-
ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలల కష్టం.. చివరికి ఏమైందంటే?
బెంగళూరు : మంచి కంపెనీ. సంస్థ పేరుకు తగ్గట్లు ప్యాకేజీ. అందుకే ఓ టెక్కీ ఆ ఆ భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. కేవలం నాలుగు రౌండ్లు జరిగే ఒక్క ఇంటర్వ్యూ కోసమే ఏడు నెలలు కష్టపడ్డాడు. అలా అని సదరు టెక్కీ.. క్ బెంచ్ స్టూడెంటా అంటే అదీ కాదు. చదువులో టాపర్. ఎంఎన్ఎన్ఐటీ అలహాబాద్ పూర్వ విద్యార్థి. మరి ఒక్క ఇంటర్వ్యూ కోసం ఏడు నెలలు ఎందుకు కష్టపడాల్సి వచ్చిందని అడిగితే.. సదరు టెక్కీ ఏం చెప్పారంటే?ఉత్తరప్రదేశ్ వారణాసి జిల్లాకు చెందిన చిత్రాంశ ఆనంద్. భారత్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఒరాకిల్‌లో కంపెనీలో రెండేళ్ల పాటు పనిచేశాడు. ఏడాదికి రూ.40 లక్షలు ప్యాకేజీ. మంచి శాలరీ, అనుభవం కోసం మరో కంపెనీలో చేరేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం గట్టి ప్రయత్నాలే చేశాడు. చివరికి ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌లో తన అనుభవానికి తగ్గట్లు ఉద్యోగం ఉందని తెలుసుకుని అప్లయి చేశాడు.అనంతరం తన ఇంటర్వ్యూల కోసం ఏడు నెలల రీసెర్చ్ చేశాడు. రేయింబవళ్లు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యాడు. ఇందుకోసం లీట్‌కోడ్ ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నాడు. ఇందులో పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో నిర్వహించే టెక్నికల్ రౌండ్‌ను ఎలా చేధించవచ్చో తెలుసుకోవచ్చు. అలా ఏడు నెలల అనంతరం ఉబెర్ ఇంట్వ్యూకి అటెండ్ అయ్యాడు. నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూలో బోర్డ్ సభ్యులు అడిగిన రెండు ప్రశ్నలకు నేను చదవిన చదువుకు.. సంబంధం లేదు. అయినప్పటికీ వాటికి ఆన్సర్ ఇచ్చాడు. ఇంటర్వ్యూ క్రాక్ చేశాడు. రూ.60లక్షలు ఇచ్చేందుకు ఉబర్ ముందుకు రావడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు.ఈ సందర్భంగా ఆనంద్ ఒరాకిల్,ఉబర్‌లో ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాడు. ఒరాకిల్‌లో ఐదు రోజులకు మూడురోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి వచ్చింది. ఉబర్‌లో వారానికి రెండు రోజులు మాత్రమే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. పైగా ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఒకవేళ అవసరమైతే ఎక్కువ గంటలు పనిచేస్తా. అందులో నాకెలాంటి అభ్యంతరం లేదు. నా కెరియర్ ప్రారంభంలో ఉంది కాబట్టి ఆఫీస్- పర్సనల్ లైఫ్ విషయాల్లో ఎలాంటి ఆందోళన చెందడం లేదు. నేను అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడి పనిచేయాలి. ఆ తర్వాత లైఫ్ బ్యాలెన్స్ విషయాలపై దృష్టిసారిస్తా అని చెప్పుకొచ్చాడు. -
టెకీలకు గుడ్‌న్యూస్.. 2 లక్షల మందికి ట్రైనింగ్
క్లౌడ్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీలలో భారత్‌లోని 2 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఒరాకిల్ ప్రకటించింది. ఇందులో భాగంగా ఒరాకిల్, తమిళనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ రాష్ట్రంలోని విద్యార్థులకు ఉపాధి ఆధారిత శిక్షణను అందించడానికి ‘నాన్ ముదల్వన్’ కింద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయి.పెరుగుతున్న యువ జనాభా ఉన్న భారత్‌లోని టాప్ 12 రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. యువత, యువ ప్రొఫెషనల్స్ తమను తాము మెరుగుపరుచుకోవడానికి, కెరీర్ లక్ష్యాలను సాధించడానికి ఒక వేదికను అందించే బాధ్యతలో భాగంగా నాన్ ముదల్వన్ను ప్రారంభించినట్లు టీఎన్ఎస్డీసీ ఎండీ జె ఇన్నోసెంట్ దివ్య చెప్పారు.ఒరాకిల్ సర్టిఫికేషన్‌ను ప్రొఫెషనల్స్‌కు ఇండస్ట్రీ స్టాండర్డ్‌గా గుర్తిస్తారని, ఇది జ్ఞానాన్ని పెంచడమే కాకుండా, కంపెనీలు కోరుకునే నైపుణ్యాలను కూడా ధ్రువీకరిస్తుందని ఒరాకిల్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రాంతీయ ఎండీ శైలేందర్ కుమార్ అన్నారు. దీంతో ఉద్యోగ అవకాశాలు, స్థిరత్వం పెరుగుతాయన్నారు. -
ఒరాకిల్‌లో ఏం జరుగుతుంది.. మరోసారి ఉద్యోగుల తొలగింపు షురూ!
ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించుకుంటున్నాయి.ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. తాజాగా గ్లోబల్ టెక్ కంపెనీ ఒరాకిల్ మరోసారి లేఆఫ్స్‌కు తెరతీసింది. ఈ ఏడాది ప్రారంభంలో 3,000 మందిని ఫైర్ చేసిన టెక్ దిగ్గజం..తాజాగా,ఆ సంస్థకు చెందిన హెల్త్ విభాగం యూనిట్ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. ఒరాకిల్ 2021 డిసెంబర్ నెలలో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ సంస్థ సెర్నెర్ను 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అనంతరం అవుట్ పేషెంట్స్‌కు ట్రీట్మెంట్, ఆర్మీ అధికారులకు జీవితకాలం హెల్త్ కేర్ సర్వీస్‌లను అందించే యూఎస్ ప్రభుత్వానికి చెందిన యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ప్రాజెక్ట్‌కు దక్కించింది. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో నిర్వహణ సమయంలో సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తాయి. కారణంగా యూఎస్ డిపార్ట్మెంట్ పలువురు పెషెంట్లతో కుదుర్చుకున్న ఒప్పొందాలు రద్దయ్యాయి. ఈ ఒప్పందాలు ప్రాజెక్ట్ ఆగిపోయింది. తాజాగా, ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఒరాకిల్ తన సెర్నెర్లో పనిచేసే ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఇప్పటికే ఆ విభాగంలో కొత్తగా నియమించుకునేందుకు ఉద్యోగులకు జారీ చేసిన జాబ్ ఆఫర్లను కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధిత ఉద్యోగులకు ఒరాకిల్ నెల రోజుల వేతనంతో పాటు, ప్రతి ఏడాది సర్వీసుకు గాను అదనంగా ఓ వారం వేతనం, వెకేషన్ డేస్‌కు చెల్లింపులతో కూడిన పరిహార ప్యాకేజ్‌ను ఒరాకిల్ ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. -
హాట్ టాపిక్‌గా బిల్‌గేట్స్ డేటింగ్, ఎవరా కొత్త గర్ల్ ఫ్రెండ్?
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మళ్లీ ప్రేమలో పడ్డాడంటూ వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఒరాకిల్ మాజీ సీఈవో భార్య పౌలా హర్డ్‌తో గతేడాది నుంచే డేటింగ్లో ఉన్నట్లు రకరకాల కథనాలు వచ్చాయి. దీనికి తోడు ఆ ఇద్దరు ఇటీవల ఒక ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నమెంట్లో జంటగా కనిపించడంతో ఈ పుకార్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. పౌలా హర్డ్ 2019లో క్యాన్సర్‌తో పోరాడి మరణించిన ఒరాకిల్ మాజీ సీఈవో మార్క్ హర్డ్ భార్య. పౌలా హర్డ్ కూడా ఈవెంట్ నిర్వాహకురాలిగా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుందని ఆమెకు మంచి పేరుంది. అంతేగాదు ఆమె గతంలో టెక్ ఎగ్జిక్యూటివ్‌గా కూడా పనిచేసింది. పౌలా కూడా పలు దాతృత్వ కార్యక్రమాలు చేస్తుండటం విశేషం. కాగా. బిల్‌గేట్స్ 30 సంవత్సరాల వివాహం అనంతరం మెలిండా గేట్స్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఐతే తాము విడిపోయినప్పటికీ ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పేదరికాన్ని తగ్గించడంపై దృష్టి సారించే తమ ఫౌండేషన్‌తో మాత్రం ఇరువురం కలిసే పనిచేస్తామని ప్రకటించడం గమనార్హం. (చదవండి: మీ పనికీ, జీవితానికీ మధ్య సమతుల్యత ఉందా?: రాండ్‌స్టాడ్స్ అధ్యయనం) -
గుడ్‌న్యూస్ : టిక్‌టాక్ బ్యాన్పై వెనక్కి..
వాషింగ్టన్ : జాతీయ భద్రతను కాపాడటానికి చైనా సామాజిక యాప్‌లు టిక్ టాక్, వీ చాట్ లను ఆదివారం నుంచి నిషేధిస్తూ అమెరికా జారీచేసిన ఆదేశాలపై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అమెరికాలో బహుళజాతి కంప్యూటర్ టెక్నాలజీ సంస్థ ఒరాకిల్‌తో టిక్‌టాక్ జట్టు కట్టేందుకు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాల కోసం సాంకేతిక భాగస్వామిగా కొనసాగించేందుకు ఒరాకిల్-వాల్‌మార్ట్ టిక్‌టాక్ యాజమాన్యం వేదికగా ఎంచుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. దీంతో టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవాలన్న మైక్రోసాఫ్ట్-వాల్‌మార్ట్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాగా టిక్‌టాక్, వీ చాట్ యాప్‌ల యాజమాన్యాలు అమెరికా చేతికి రాకపోతే, వాటిపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ గతనెలలోనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం సెప్టెంబర్ 20 నుంచి నిషేదం అమల్లోకి రానుంది. అయితే తాజా ఒప్పందం ప్రకారం.. ఈ గడువును సెప్టెంబర్ 27 వరకు పెంచినట్లు తెలుస్తోంది. టిక్‌టాక్, ఒరాకిల్ మధ్య డీల్‌కు అమెరికా ప్రభుత్వం త్వరలోనే అధికారిక ఆమోదముద్ర పడనుంది. దీనిపై ట్రంప్ ఇదివరకే తుది నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టిక్‌టాక్, వీచాట్‌ల బ్యాన్.. చైనా స్పందన) జాతీయ భద్రతకు ముప్పుగా చూపుతూ దేశీయ కార్యకలాపాలను అమెరికా సంస్థకు అమ్ముకోకపోతే ఈ నెల 20 నుంచి టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒరాకిల్ చేతికి అమెరికా టిక్‌టాక్ ఆపరేషన్స్ వచ్చాయి. అయితే ఈ డీల్ విలువ, టిక్‌టాక్‌లో ఒరాకిల్‌కు మెజారిటీ వాటా ఏదైనా దక్కబోతున్నదా? అన్న వివరాలపై మాత్రం స్పష్టత లేదు.. అమెరికాలో టిక్‌టాక్ వ్యాపారాన్ని సుమారు రూ.1.84 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ డీల్‌కు అమెరికా ప్రభుత్వం అనుమతి కూడా రావాల్సి ఉన్నది. మరోవైపు టిక్‌టాక్ యుఎస్ కార్యకలాపాలను సంపాదించడానికి ఆసక్తి ఉందని మైక్రోసాఫ్ట్ ఆగస్టు ప్రారంభంలో తెలపగా.. దానిని టిక్‌టాక్ యాజమాన్యం సున్నితంగా తిరస్కరించింది. చివరికి ఒరాకిల్ సంస్థ టిక్ టాక్ కొనుగోలుకు సిద్ధమైంది. దీంతో పూర్తి హక్కులు అమెరికా సంస్థదై ఉండాలన్న తన వాదనకు ఒరాకిల్ కట్టుబడి ఉంది. అంతేకాదు ఈ ఒప్పందం ద్వారా గణనీయమైన వాటా ప్రభుత్వ ఖజానాకు చేరాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం కూడా నెరవేరనుంది. -
డీల్ నచ్చలేదు.. సంతకం చేయను : ట్రంప్
వాషింగ్టన్ : చైనా సంస్ధ బైట్ డ్యాన్స్ యాజమాన్యంలోని ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ ఒరాకిల్ డీల్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో బ్రేకులు పడనున్నాయి. సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం ఒరాకిల్ టిక్‌టాక్ అమెరికా వ్యాపారం కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించేందుకు తాను సిద్దంగా లేనని ట్రంప్ వెల్లడించారు. ప్రధానంగా బైట్‌డాన్స్‌కు మెజారిటీ వాటా, ఒరాకిల్ సంస్థకు మైనారిటీ వాటా ప్రకారం కుదరనున్న ఒప్పందానికి తాను వ్యతిరేకమని చెప్పారు. జాతీయ భద్రతకు సంబంధించినంతవరకు అది100 శాతం అమెరికా సంస్థదై ఉండాలి. ప్రతిపాదిత ఒప్పందంపై సంతకం చేయడానికి తాను సిద్ధంగా లేననీ, ఈ ఒప్పందాన్ని తాను పరిశీలించాల్సి ఉందని పేర్కొన్నారు. తుది డీల్ ఇంకా కుదరలేదన్నారు. దీనిపై గురువారం అధికారులతో సమావేశం కానున్నట్లు ట్రంప్ చెప్పారు. భద్రతకు ముప్పు, గోప్యత ఆందోళనల నేపథ్యంలో టిక్‌టాక్ ను అమెరికా సంస్థకు విక్రయించాలని, లేదంటే నిషేధిస్తామని ట్రంప్ బైట్‌డాన్స్‌కు గడువు విధించారు. ఈ డీల్ ద్వారా పెద్ద మొత్తం యుఎస్ ట్రెజరీకి వెళ్లాలని గతంలోనే ట్రంప్ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో టిక్ టాక్ బిజినెస్ ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ తదితర సంస్థలు ఆసక్తిని చూపాయి. చివరికి ఒరాకిల్ సంస్థ టిక్ టాక్ కొనుగోలుకు సిద్ధమైంది. మొదట్లో ఒరాకిల్ ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించిన ట్రంప్, అద్భుతమైన వ్యక్తి అంటూ సంస్థ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్ పై ప్రశంసలు గుప్పించిన సంగతి తెలిసిందే. కానీ తాజా ఒప్పందంపై ట్రంప్ అసంతృప్తి బిడ్ విజయవంతపై అనుమానాలను రేకెత్తిస్తోంది. టిక్ టాక్ కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించే లేదా తిరస్కరించే అధికారం ట్రంప్ చేతిలోనే. దీంతో పూర్తి హక్కులు అమెరికా సంస్థదై ఉండాలన్న తన వాదనకు కట్టుబడి ఉన్నారు, అంతేకాదు ఈ ఒప్పందం ద్వారా గణనీయమైన వాటా ప్రభుత్వ ఖజానాకు చేరాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశం. దీంతో అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం మరోసారి ప్రశ్నార్ధకంగా మారింది. -
టిక్‌టాక్ రేసు నుంచి మైక్రోసాఫ్ట్ అవుట్
న్యూయార్క్: వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ అమెరికా విభాగాన్ని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దక్కించుకోలేకపోయింది. మైక్రోసాఫ్ట్‌కి విక్రయించరాదని చైనాకు చెందిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ నిర్ణయించుకుంది. అమెరికాలో తమ కార్యకలాపాల కోసం మరో ఐటీ దిగ్గజం ఒరాకిల్ను టెక్నాలజీ భాగస్వామిగా ఎంచుకుంది. మైక్రోసాఫ్ట్ ఒక ప్రకటనలో ఈ విషయాలు తెలిపింది. ‘టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్‌కు విక్రయించబోమని బైట్‌డ్యాన్స్ తెలియజేసింది‘ అని పేర్కొంది. అయితే, ఇటు దేశ భద్రతను కాపాడుతూనే అటు టిక్‌టాక్ యూజర్లకు కూడా ప్రయోజనకరంగా ఉండేలా తాము కొనుగోలు ప్రతిపాదనను రూపొందించినట్లు వివరించింది. మరోవైపు, ఒరాకిల్ కేవలం టెక్నాలజీ భాగస్వామిగానే లేక టిక్‌టాక్‌లో మెజారిటీ వాటాలు కూడా కొనుగోలు చేస్తుందా అన్న విషయంపై స్పష్టత లేదని పరిశ్రమవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఇది విక్రయ డీల్‌గా ఉండకపోవచ్చని వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనంలో పేర్కొంది. యూజర్ల డేటా భద్రతపై ఆందోళన నేపథ్యంలో టిక్‌టాక్‌ను సెప్టెంబర్ 20లోగా ఏదైనా అమెరికన్ కంపెనీకి అమ్మేసి వైదొలగాలని, లేకపోతే నిషేధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం తెలిసిందే. దీంతో రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌తో కలిసి మైక్రోసాఫ్ట్.. టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు బరిలోకి దిగింది. అయితే, టెక్నాలజీ బదలాయింపు సమస్యగా మారింది. మరోవైపు, ఒరాకిల్ వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్‌తో సన్నిహిత సంబంధాల కారణంగా ఆ కంపెనీకే టిక్‌టాక్‌ను అప్పగించే యోచనలో ట్రంప్ ఉన్నట్లు తెలుస్తోంది. -
టిక్‌టాక్‌పై సోషల్ వీడియో దిగ్గజం కన్ను
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద చైనా షార్ట్ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ టిక్‌టాక్ కొనుగోలు రేసులో అమెరికాకు చెందిన మరో దిగ్గజ సంస్థ నిలిచింది. ప్రముఖసోషల్ వీడియో ప్లాట్‌ఫామ్ ట్రిల్లర్ చైనాకు చెందిన బైట్‌డాన్స్‌ను సంప్రదించినట్టు తెలుస్తోంది. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రసిద్ధ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సెంట్రికస్ ద్వారా 20 బిలియన్ డాలర్ల బిడ్‌తో సంప్రదించినట్లు రాయిటర్స్ శనివారం తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారతదేంలోని టిక్ టాక్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు యోచిస్తున్నట్టు పేర్కొంది. (టిక్‌టాక్ : రేసులో మరో దిగ్గజం) టిక్‌టాక్ కాకుండా టిక్‌టాక్ యజమాన్య సంస్థ బైట్‌డాన్స్‌కు నేరుగా బిడ్ చేసినట్లు ట్రిల్లర్ వెల్లడించింది. సెంట్రికస్ ద్వారా బైట్‌డాన్స్ ఛైర్మన్‌కు నేరుగా ఆఫర్‌ను సమర్పించామనీ, స్వీకరణ ధృవీకరణ కూడా తమకు చేరిందని ట్రిల్లర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాబీ సర్నెవెష్ట్ చెప్పారు. డైరెక్టుగా ఛైర్మన్తోనే సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. అయితే, ఈ వార్తలను టిక్‌టాక్ తోసిపుచ్చింది. అలాంటి ఆఫర్‌ను అందుకోలేదని తెలిపింది. దీంతో ఈ వ్యవహారంలో గందరగోళం నెలకొంది. (వీచాట్ బ్యాన్ : డ్రాగన్ టిట్ ఫర్ టాట్ వార్నింగ్) టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ తన అమెరికా, కెనడియన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కార్యకలాపాలను విక్రయించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్దేశించిన 90 రోజుల గడువు లోపల ఒక ఒప్పందానికి రావాలని భావిస్తోంది. సుమారు. 20-30 బిలియన్ల డాలర్ల పరిధిలో డీల్ ఖాయం చేసుకోవాలని భవిస్తోంది. అటు రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మైక్రోసాఫ్ట్ తో జతకడుతున్నట్లు ధృవీకరించింది. దీంతో మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, వాల్ మార్ట్ మూడు దిగ్గజ కంపెనీలతో బైట్‌డాన్స్ చర్చలు జరుపుతోంది. కాగా జాతీయ భద్రతా సమస్యలరీత్యా టిక్‌టాక్ ను నిషేధిస్తామని ఇప్పటికే హచ్చరించిన ట్రంప్ అమెరికా కార్యకలాపాలను విక్రయించాలని ఒత్తిడి పెంచారు. ఇందుకు 45 రోజుల్లోపు అమెరికాలో బైట్‌డాన్స్ ఎటువంటి లావాదేవీలు జరపకుండా నిషేధిస్తూ ట్రంప్ ఆగస్టు 6న ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత దీన్ని 90 రోజులకు పెంచుతూ ఆగస్టు 14 న మరో ఉత్తర్వుపై సంతకం చేశారు. మరోవైపు ట్రంప్ మొదటి ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుపై టిక్‌టాక్ దావా వేసిన సంగతి తెలిసిందే. -
టిక్‌టాక్ : ట్రంప్ మరో ట్విస్టు
వాషింగ్టన్ : చైనా వీడియో యాప్ టిక్‌టాక్ విక్రయానికి సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ట్విస్టు ఇచ్చారు. టిక్‌టాక్‌ను అమెరికా దిగ్గజ టెక్ సంస్థ ఒరాకిల్ కొనుగోలు చేయవచ్చని, ఇది మంచి కంపెనీ అంటూ వ్యాఖ్యానించారు. అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్ గొప్ప సంస్థ, దాని యజమాని అద్భుతమైన వ్యక్తి అని తాను భావిస్తున్నానని, ట్రంప్ మంగళవారం సాయంత్రం విలేకరులతో చెప్పారు. టిక్‌టాక్‌ను నిర్వహించే సామర్థ్యం కచ్చితంగా ఒరాకిల్ సంస్థకు ఉందని తాను నమ్ముతున్నానని తెలిపారు. మరో టెక్ సంస్థ మైక్రోసాప్ట్ ఇప్పటికే ఈ రేసులో ముందున్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. (రిలయన్స్ చేతికి టిక్‌టాక్?) ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లో టిక్‌టాక్ కొనుగోలుకు బైట్‌డ్యాన్స్ తో సంప్రదింపులు జరుపుతోన్న కొంతమంది పెట్టుబడిదారుల సరసన ఒరాకిల్ కూడా చేరిందన్న వార్తల అనంతరం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. కాగా జాతీయ భద్రతకు ముప్పు చేస్తోందన్న ఆరోపణలతో ట్రంప్ సర్కార్ టిక్‌టాక్‌పై నిషేధం దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్‌టాక్ అమెరికా వ్యాపారాన్ని అమెరికాలోని ఏదేని సంస్థకు విక్రయించడమా, లేక నిషేధమా తేల్చుకోమంటూ 90 రోజుల గడువు విధించింది. మరోవైపు టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ బైట్‌డాన్స్‌తో చర్చలు జరుపుతోంది. చివరికి ఏ కంపెనీ టిక్‌టాక్‌ను సొంతం చేసుకుంటుందనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. -
అమెరికాలో తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
వాషింగ్టన్: అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భారతీయుడు ఒకరు మంగళవారం అకస్మాత్తుగా చనిపోయాడు. నార్త్ కరొలినాలో నివసించే శివ చలపతి రాజు ఆరకిల్ సంస్థలో డెవలపర్‌గా ఉన్నారు. అంతకుముందు, ఆయన విప్రో, బ్రిటిష్ పెట్రోలియం సంస్థల్లో పనిచేశారు. రాజు మృతికి కారణాలు తెలియరాలేదు. ఆయన గ్రీన్‌కార్డ్ దరఖాస్తు ప్రస్తుతం పరిశీలనలో ఉంది. గ్రీన్‌కార్డ్ లేకపోవడం వల్ల రాజు భార్య బాబీ సౌజన్య భారత్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజు మృతదేహాన్ని భారత్‌కు పంపించేందుకు మిత్రులు పీడ్మాంట్ ఏరియా తెలుగు అసోసియేషన్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారని అమెరికన్ బజార్ పత్రిక పేర్కొంది. కాగా శివ చలపతి రాజు రాజమండ్రిలో చదువుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గట్టిపోటీ: ఒరాకిల్ భారీగా ఉద్యోగాలు
ప్రముఖ మల్టినేషనల్ కంప్యూటర్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్‌తో గట్టిపోటీకి సిద్దమైంది. ఈ పోటీలో భాగంగా ఒరాకిల్ భారీగా ఉద్యోగ నియామకాలకు గంట మోగించింది.. తమ క్లౌడ్ సాఫ్ట్వేర్ బిజినెస్‌లో మరో ఐదు వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనున్నట్టు తెలిపింది. వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రిలో సేల్స్‌ఫోర్స్ ఇంక్‌కు గట్టి పోటీగా నిలబడి మార్కెట్ షేరును దక్కించుకోవాలని ఒరాకిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్వార్టర్లో ఒరాకిల్ రెవెన్యూలు 58 శాతం మేర పైకి ఎగిశాయి. ఇండస్ట్రిలో గట్టిపోటీతో పాటు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్నాలజీ సంస్థలు నియామకాల జోరును కొనసాగిస్తున్నాయి. 2018 వరకు అమెజాన్.కామ్ ఇంక్ కూడా లక్ష మంది వర్కర్లను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఆపిల్ ఇంక్ కూడా అమెరికా మానుఫ్రాక్ట్ర్చరింగ్లో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్టు తెలిపింది. -
ఇండియన్ టెకీలకు భారీ అవకాశాలు
న్యూఢిల్లీ: ఒకవైపు దేశీయ ఐటీ కంపెనీలు దేశీయ టెకీలకు షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటోంటే.. దిగ్గజ కంపెనీలకు భారతీయ టెకీలకు తీపికబురు అందించాయి. తాజా నివేదికల ప్రకారం మైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్, ఒరాకిల్, ఫేస్బుక్, గూగుల్ ఇండియా లాంటి టెక్మేజర్లు భారతీయ సాఫ్ట్ వేర్లను నియమించుకోనున్నాయి. తద్వారా భారతీయ సమాచార సాంకేతిక (ఐటి) సర్వీసు ప్రొవైడర్లతో టాలెంట్ వార్‌కు దిగాయని ఓ రిపోర్ట్ వెల్లడించింది. అమెరికా ఆధారిత సంస్థలు తమ సొంత మార్కెట్లో అభద్రత పెరుగుతున్నప్పటికీ, ప్రపంచ ప్రత్యర్థుతో పోటీ కారణంగా ఇండియన్ ఐటీ నిపుణులను ఎంచుకుంటున్నాయట. ఇందులో భాగంగానే ఫేస్బుక్ , లింక్డ్ ఇన్, తదితర కంపెనీలు కొన్ని గత నాలుగు నెలలలో భారత్ లో తమ ఉద్యోగుల సంఖ్య రెట్టింపు చేసినట్టు సమాచారం. భారతదేశంలో ప్రపంచ అంతర్గత కేంద్రాలు (జిఐసిలు) భారత టెకీల ఉద్యోగాల కల్పనలో పెద్ద పాత్ర పోషిస్తాయని బైన్ & కంపెనీ ఇటీవల ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది. భారతీయ జిఐసిలు తదుపరి మూడు నుండి ఐదు సంవత్సరాల్లో ప్రపంచ సి-స్థాయి అధికారుల ఫార్చ్యూన్ 1,000 కంపెనీల్లో చోటు సంపాదించుకుంటాయని అగ్రశ్రేణి పెట్టుబడి ప్రాధాన్యతల మరింత చురుకైన పాత్రను పోషిస్తాయని నివేదించింది. అలాగే ఈ సంస్థల్లో ఎక్కువ సీనియర్ నాయకులు, ప్రత్యేకంగా సీఈవో లకు దిగువస్థాయి ఉద్యోగులు బారత్వెలుపలి ఈ జీఐసీలను నిర్వహించనున్నారని ఈ నివేదిక తెలిపింది. డిజిటల్ టెక్నాలజీలో భారతదేశం ప్రయోగాత్మక ప్రదేశంగా ఉందని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ,పరిశోధనా సంస్థ జినోవ , మేనేజ్మెంట్ మేనేజర్,ఆనంద్ సుబ్రమణ్యం చెప్పారు. ఈ సంస్థల భారతీయ డెలివరీ కేంద్రాలు ప్రపంచ వనరులతో సమానంగా ఉన్నాయని, వారు పోటీని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ సంస్థలకు చెందిన భారత్ కేంద్రాలు తమ పేరెంట్ సంస్థ ల కొత్త సామర్థ్యాలను ఏర్పరుచుకునేందుకు, సముచితమైన సాంకేతిక పరిజ్ఞాన రంగాలలో సమర్థతను పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయని కోరుతున్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇ-కామర్స్, డిజిటల్ టెక్నాలజీ, రిటైల్, సప్లయ్ ఛైన్ సాంకేతిక పరిజ్ఞానాలు, కోర్ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో నెట్ వర్కింగ్, వర్చ్యువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కంటైనర్సిజేషన్, విశ్లేషణలు, బిగ్ డేటా, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో నియామకాలను చేపట్టినట్టు లాయిస్ మేనేజింగ్ డైరెక్టర్ జేమ్స్ బ్రాండ్ట్ తెలిపారు. భారత్ లో వెయ్యిమంది ఉద్యోగులతో ఉన్న సంస్థ తమ ఐటీ మరియు విశ్లేషణ సామర్థ్యాలను , వృద్ధి వ్యూహాన్ని పెంచుకోనున్నట్టు తెలిపింది. టార్గెట్ , లోవ్స్ వంటి ఇతర అమెరికా ఆధారిత సంస్థలు మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా విశ్లేషణ, నెట్వర్కింగ్ వంటి రంగాల్లో భారతదేశంలో ఇంజనీర్లను నియమించుకుంటాయి. భారతదేశంలో 2,500 మంది ఉద్యోగులను కలిగి ఉన్న టార్గెట్ ఇండియా టెక్నాలజీ, మార్కెటింగ్, సరఫరా చెయిన్, యానిమేషన్ వంటి నిపుణులను నియమించుకోనుంది. జావా మరియు ఓపెన్ సోర్స్ సామర్థ్యాలతో, మెషిన్ లెర్నింగ్, న్యూరో-లింగ్విస్టిక్ ప్రోగ్రాంలో నైపుణ్యం కలిగినవారిని తాము ఎంపిక చేయనున్నట్టు టార్గెట్ ఇండియాలో హెచ్ఆర్ హెడ్ షాలిని నటరాజ్ తెలిపారు టెక్నాలజీకి అదనంగా, కంప్యూటర్లో రూపొందించబడిన యిమేజరీ అండ్ యానిమేషన్లో భారతదేశం ప్రతిభను కలిగి ఉందనీ, తమ మార్కెటింగ్ బృందం సీజీఐ సామర్ధ్యాలను విస్తరించ నుందన్నారు. కాగా అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్1 బీ వీసాల కొత్తనిబంధనల నేపథ్యంలో దేశీయ ఐటి దిగ్గజాలు అమెరికా టెకీల నియామకాలపై దృష్టి సారించాయి. దేశీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు షాకిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. -
టెక్ కుబేరుల అడ్డా.. ఈ నగరమే!
కాలిఫోర్నియా సరికొత్త టెక్ బిలియనీర్ గా ఈ ఏడాది ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ అవతరించారు. 54 బిలియన్ డాలర్ల (రూ.36,0747 కోట్ల) సంపదతో టెక్ రంగంలో అత్యంత సంపన్నుడిగా నిలిచిన ఆయన.. ఒరాకిల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ల్యారీ ఎలిసన్ను అధిగమించారు. గత ఏడాది కాలిఫోర్నియా అత్యంత సంపన్నుడి టైటిల్ ఎలిసన్ కు దక్కింది. ఫోర్బ్స్ పత్రిక తాజాగా ప్రచురించిన రెండో వార్షిక టెక్ కుబేరుల జాబితాలో జ్యూక్ మొదటి స్థానంలో నిలువగా.. రెండోస్థానంలో ఎలిసన్ నిలిచారు. టాప్ 100 మంది టెక్ బిలియనీర్లతో ఫోర్బ్స్ జాబితా రూపొందించగా అందులో 37 మంది టెక్ దిగ్గజాలు అమెరికాలోని కాలిఫోర్నియాలోనే నివసిస్తుండటం గమనార్హం. టెక్ మహా సంపన్నులుగా కీర్తి గడించిన వీరి ఉమ్మడి సంపద 332.4 బిలియన్లు కాగా.. ప్రపంచ టాప్ 100 టెక్ కుబేరుల సంపదలో ఇది మూడోవంతు కావడం విశేషం. గత ఏడాది ఫేస్ బుక్ షేర్ విలువ రాకెట్ వేగంతో పెరిగిపోవడంతో జుకర్ బర్గ్ సంపద అమాతం పెరిగిపోయింది. ఫేస్ బుక్ స్టాక్ విలువ ఏకంగా 30శాతం పెరుగడంతో ఆయన సంపదకు అదనంగా 12.8 బిలియన్ డాలర్లు పోగయ్యాయి. ఇక తన జీవితకాలంలో ఫేస్ బుక్ లోని 99శాతం వాటాను సేవాకార్యక్రమాలకు వెచ్చిస్తానని ప్రకటించి జ్యూక్ తన ఉదారగుణాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. టెక్ కుబేరుడిగా ఫోర్బ్స్ జాబితాలో రెండోస్థానంలో ఉన్న ఒరాకిల్ స్థాపకుడు ల్యారీ ఎలిసన్ సంపద గత ఏడాదికాలంలో ఏమంతగా పెరుగలేదు. దీనికితోడు ఒరాకిల్ స్టాక్ విలువ గతంలో పడిపోయినప్పటికీ.. అది రికవరీ చేసుకోవడానికి గడిచిన ఏడాది సరిపోయింది. ఎలిసన్ నికర సంపద ప్రస్తుతం 51.7 బిలియన్ డాలర్లు (రూ. 34,5381 కోట్లు)గా ఉంది. ఈ ఇద్దరే కాదు కాలిఫోర్నియాకు చెందిన పలువురు టెక్ దిగ్గజాలు కూడా ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించారు. గూగుల్ సహ వ్యవస్థాపకులు ల్యారీపేజ్, సెర్గీ బ్రిన్ వరుసగా 39 బిలియన్ డాలర్లు, 38.2 బిలియన్ డార్లతో ఈ జాబితాలో చేరారు. గూగుల్ స్టాక్ విలువ 20శాతం పెరుగడంతో వీరి సంపద ఉమ్మడిగా 11బిలియన్ డాలర్లమేర పెరిగింది. ఇక కాలిఫోర్నియాలో నివసించే ఐదో రిచెస్ట్ టెక్ బిలియనీర్ గా గూగుల్ చైర్మన్ ఎరిక్ షుమిడ్ట్ 11.2 బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు. కాలిఫోర్నియాకు చెందిన ఏకైక మహిళ టెక్ బిలియనీర్ గా మెగ్ వైట్మన్ నిలిచారు. హ్యావ్లెట్ పాకర్డ్ ఎంటర్ ప్రైస్ సీఎవో అయిన ఆమె 2.2 బిలియన్ డాలర్ల సంపదతో ఈ జాబితాలో చోటు సంపాదించారు. ఈ-బే కంపెనీకి ఒక దశాబ్దంపాటు సీఈవోగా వ్యవహరించిన వైట్మన్ కు ఆమె సంపదలో అధికమొత్తం 'ఈబే' ద్వారానే దక్కింది. -
ఒరాకిల్ భారీ డీల్
ప్రపంచ డేటా బేస్ విపణిలో సింహభాగాన్ని ఆక్రమిస్తున్న సాప్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్, క్లౌడ్ సాప్ట్ వేర్ కంపెనీ నెట్సూట్ను భారీ మొత్తంలో కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ డీల్ విలువ 9.3 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.62,407కోట్లు)గా వెల్లడించింది. వేగవంతంగా పెరుగుతున్న క్లౌడ్ మార్కెట్లో తన బిజినెస్‌లను విస్తరించడానికి ఈ డీల్ కుదుర్చుకున్నట్టు తెలిపింది.ఈ కొనుగోలు డీల్‌తో నెట్సూట్ షేర్లు ఒక్కసారిగా 18.6శాతానికి ఎగిసి, అంతర్జాతీయంగా ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 108.64 డాలర్లుగా రికార్డు అయ్యాయి. అదేవిధంగా ఒరాకిల్ షేర్లు సైతం 1.6శాతం పెరిగి, ప్రీమార్కెట్ ట్రేడింగ్‌లో 41.3డాలర్లుగా నమోదయ్యాయి. ఈ అగ్రిమెంట్ ప్రకారం నెట్సూట్ ఒక్క షేరుకు ఒరాకిల్ 109 డాలర్లను చెల్లించనుంది.ఒరాకిల్, నెట్సూట్ రెండు సంస్థలు మార్కెట్ ప్లేస్ లో దీర్ఘకాలం కలిసి పనిచేస్తాయని ఒరాకిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ హర్డ్ తెలిపారు. సాప్ట్ వేర్ దిగ్గజంగా ఉన్న ఒరాకిల్‌తో ఈ డీల్ కుదుర్చుకోవడం, తమ క్లౌడ్ సొల్యూషన్లు చాలా పరిశ్రమలకు, దేశాలకు విస్తరిస్తాయని నెట్సూట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాచ్ నెల్సన్ ఆశాభావం వ్యక్తంచేశారు. ఒరాకిల్ లో జాయిన్ అవ్వడం చాలా గర్వంగా భావిస్తున్నామని, తమ నూతనావిష్కరణలు పెంచుకుంటామని తెలిపారు. తన ప్రత్యర్థులు ఎస్ఏపీ ఎస్ఈ, మైక్రోసాప్ట్ కార్పొరేషన్ లకు పోటీగా ఒరాకిల్ క్లౌడ్ బేస్డ్ మోడల్ లపై తన బిజినెస్ లను మరల్చాలని కంపెనీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒరాకిల్, నెట్సూట్ను కొనుగోలు చేయబోతుందని పేర్కొంది. 1998లో నెట్సూట్ను స్థాపించారు. క్లౌడ్ కంప్యూటింగ్ రెవల్యూషన్లో నెట్సూట్ ముందంజలో ఉంది.ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ అప్లికేషన్లు అందించడంలో ఈ కంపెనీనే మొదటిది. క్లౌడ్ మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచడానికి ఒరాకిల్ ఇప్పటికే టెక్స్టురా, ఓపవర్ వంటి కంపెనీలను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
ఒరాకిల్ కు భారీ షాక్
శాన్ ఫ్రాన్సిస్కో : ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీ ఒరాకిల్ కార్పొరేషన్ కు కాలిఫోర్నియా జ్యూరీ నుంచి భారీ షాక్ ఎదురైంది. హెచ్ పీ ఇటానియం సర్వర్ కేసులో హెచ్ పీ ఎంటర్ ప్రైజెస్ కు 20 వేల కోట్లకు పైగా (300 కోట్ల డాలర్లు) నష్టపరిహారం చెల్లించాలని ఒరాకిల్ ను జ్యూరీ ఆదేశించింది. 2012లోనే ఈ కేసుపై మొదటి దశ ట్రయల్ నడిచింది. హెచ్ పీ ఇటానియం ఆధారిత సర్వర్లతో ఒరాకిల్ సాప్ట్ వేర్ డెవలప్ చేసే ఒప్పందాన్ని ఉల్లఘించడంతో ఈ కేసు ప్రారంభమైంది. కాంట్రాక్ట్ ఉల్లంఘన కేసును ఒరాకిల్ పై హెచ్ పీ నమోదుచేసింది. ఇటానియం ప్రాసెసర్ ను ఇంటెల్ ఇంక్ తయారుచేసింది. ఈ చిప్ కు కాలం చెల్లిపోవడంతో, 2011లో ఒరాకిల్ సాప్ట్ వేర్ డెవలప్ చేయడం ఆపివేసింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం ఆ చిప్ వాడుకలో ఉన్నా లేకపోయినా ఒరాకిల్ హెచ్ పీకి సపోర్టు చేయడం కొనసాగించాలని హెచ్ పీ వాదించింది. ఈ చిప్ కు కాలం చెల్లడంతోనే ఎక్స్ 86 మైక్రో ప్రాసెసర్లపై దృష్టిసారించామని ఇంటెల్ సైతం స్పష్టంచేసింది. అయినా హెచ్ పీ ఈ కేసుపై కోర్టు గడపతొక్కింది. హెచ్ పీకి నష్టం జరిగిందని భావించిన శాంట క్లారా సుపీరియర్ కోర్టు జడ్జి జేమ్స్ క్లెయిమ్ బర్గ్ ఒరాకిల్ నష్టపరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశించారు. జ్యూరీ తీర్పుతో హెచ్ పీ తృప్తిపొందిందని, తగిన ఆధారాలు చూపించడంతో ఈ కేసును తప్పక అధిగమిస్తామని తమకు ముందు నుంచే తెలుసని హెచ్ పీ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిండెంట్ జాన్ ఘల్ట్ చెప్పారు. ఒరాకిల్ సాప్ట్ వేర్ ను డెవలప్ చేయడం ఆపివేయడం కాంట్రాక్టును ఉల్లఘించడమేనని స్పష్టంచేశారు. అయితే ఈ తీర్పుపై తాము అప్పీల్ కు వెళ్తామని ఒరాకిల్ జనరల్ కౌన్సిల్ డోరైన్ డాలే పేర్కొన్నారు -
ఒరాకిల్ కు ఆమె దెబ్బ
న్యూయార్క్ : సిలికాన్ వ్యాలీ దిగ్గజం ఒరాకిల్ షేర్లు అంతర్జాతీయ మార్కెట్లో నాలుగు శాతానికి పైగా కుదేలవుతున్నాయి. ఒరాకిల్ కంపెనీ మాజీ అకౌంటెంట్ పై నమోదైన విజిల్ బ్లోయర్ దావాతో ఈ షేర్లు పతనమవుతున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్ అమ్మకాల డేటాను ఎక్కువగా చేసి చూపించడంతో మాజీ అకౌంటెంట్ స్వెత్లానా బ్లాక్బర్న్ పై ఈ దావా కేసు నమోదైంది. శాన్ ఫ్రాన్సిస్కో లోని అమెరికా జిల్లా కోర్టులో బుధవారం ఈ కేసు నమోదైంది. అమ్మకాల వసూళ్లను అంచనావేసిన దానికంటే మిలియన్ డాలర్లలో ఎక్కువగా రికార్డులో చూపిందనే ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు. ఆమె చూపిన క్లౌడ్ కంప్యూటింగ్ అమ్మకాల డేటా అంతా అశాస్త్రీయమని దావా పేర్కొంటోంది. అయితే ఈ ఆరోపణలను ఒరాకిల్ ఖండించింది. కౌంటర్ దాఖలు చేస్తామని పేర్కొంది. తమ క్లౌడ్ కంప్యూటింగ్ డేటా కచ్చితమైనవని, శాస్త్రీయమైనవని ఒరాకిల్ అధికార ప్రతినిధి డెబోరా హిలింగర్ తెలిపారు. ఈ మాజీ ఉద్యోగి ఒరాకిల్ లో ఏడాది కంటే తక్కువ రోజులే పనిచేసిందని, అకౌంటింగ్ గ్రూప్ లో ఆమె అసలు పనిచేయలేదని పేర్కొన్నారు. పేలవమైన ప్రదర్శనతో తనని ఒరాకిల్ నుంచి తీసివేశామని డెబోరో చెప్పారు. క్లౌడ్ కంప్యూటింగ్ డిపార్ట్ మెంట్ కు బ్లాక్బర్న్ మాజీ సీనియర్ ఫైనాన్స్ మేనేజర్. అయితే ఆమె పదేపదే అశాస్త్రీయమైన లెక్కలు చూపుతుందని ఈ దావా పేర్కొంది. బ్లాక్బర్న్ పై కంపెనీ పలు మార్లు సీరియస్ అయినా కూడా ఆమె ప్రవర్తనలో ఎలాంటి తేడా లేదని వెల్లడించింది. ఈ అశాస్త్రీయమైన రిపోర్టులు నివేదిస్తూ... ప్రజలను, కంపెనీని తప్పుదోవ పట్టిస్తున్నందుకు బ్లాక్బర్న్ పై విజిల్ బ్లోయర్ కింద కేసు నమోదైంది. ఈ దావా కేసు బయటికి పొక్కగానే ఒరాకిల్ షేర్లు 4.6శాతం మేర పడిపోయాయి. -
ఒరాకిల్ పై గూగుల్ ఘన విజయం
శాన్ ఫ్రాన్సిస్కో : కాపీ రైట్ దావాపై రెండు టెక్నాలజీ దిగ్గజాల మధ్య జరిగిన అసలు సిసలైన యుద్ధంలో, ఒరాకిల్ పై ఆల్ఫాబెట్ కంపెనీ గూగుల్ ఘన విజయం సాధించింది. ఎంతో కాలంగా సాగుతున్న ఈ యుద్ధంలో మంగళవారం గూగుల్ కు అనుకూలంగా అమెరికా జ్యురీ తీర్పునిచ్చింది. దీంతో ప్రపంచంలో చాలా స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ సాప్ట్ వేర్ ను అభివృద్ధిచేయడానికి గూగుల్ కాపీరైట్ చట్టాలను ఉల్లఘించి జావా లాంగ్వేజ్ అక్రమంగా వాడుతుందని ఒరాకిల్ ఎంతో కాలంగా వాదిస్తున్నది. అయితే అమెరికా కాపీరైట్ చట్టాల ప్రకారం న్యాయబద్ధంగానే జావా డెవలప్ మెంట్ ప్లాట్ ఫామ్ ద్వారా ఆండ్రాయిడ్ సాప్ట్ వేర్ ను గూగుల్ క్రియేట్ చేస్తుందని, దానికి ఎటువంటి చెల్లింపులు అవసరం లేదని జ్యురీ ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో కాపీరైట్ ఉల్లంఘన కింద గూగుల్ పై వేద్దామనుకున్న 900 కోట్ల డాలర్ల జరిమానాపై ఒరాకిల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు కంపెనీల మధ్య వాదనలు 2012లోనే ప్రారంభమయ్యాయి. మంగళవారం ఈ రెండు కంపెనీల వాదనలు జ్యూరీ ఎదుట విచారణకు వచ్చాయి. సాప్ట్ వేర్ డెవలపర్స్ ఈ కేసు తీర్పును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకవేళ ఒరాకిల్ గెలిస్తే, సాప్ట్ వేర్ కాపీరైట్ వ్యాజ్యాలు పెరుగుతాయని భయాందోళనలకు కూడా గురయ్యారు. గూగుల్ కు అనుకూలంగా తీర్పురావడంతో వారందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. గూగుల్ ఈ విజయాన్ని ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ లో, జావా ప్రొగ్రామింగ్ కమ్యూనిట్ లో, సాప్ట్ వేర్ డెవలపర్స్ ల విజయంగా అభివర్ణించింది. వినియోగదారులకు కొత్త ప్రొడక్ట్ లను అందించడానికి ప్రీ ప్రొగ్రామింగ్ లాగ్వేంజ్ లు ఇక ఎంతో సహయ పడతాయని తెలిపింది. మరోవైపు గూగుల్ ఈ కోర్ జావా టెక్నాలజీని అక్రమంగా వాడుకుంటూ ఆండ్రాయిడ్ లను డెవలప్ చేస్తుందని తాము గట్టిగా విశ్వసిస్తున్నట్టు ఒరాకిల్ జనరల్ కౌన్సిల్ డోరియన్ డాలే చెప్పారు. దీనిపై మరో అప్పీలుకు వెళ్తామని తెలిపింది. ఈ కేసు నేపథ్యంలో ఒరాకిల్, గూగుల్ షేర్లు కొంత ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ కేసు విచారణ సందర్భంగా ఎలాంటి అనుమతులు లేకుండా లిమిటెడ్ గా ప్రొగ్రామింగ్ మెటిరియల్ ను సాప్ట్ వేర్ డెవలపర్స్ వాడుకోవచ్చని అమెరికా కాపీరైట్ చట్టాలు ఉన్నాయని అమెరికా జిల్లా జడ్జి విలియం అల్సప్ చెప్పారు. గూగుల్ వాడుకున్న ఈ జావా ఎలిమెంట్స్ కాపీరైట్ ప్రొటక్షన్ కిందకు రావని, చట్టాల ప్రకారం న్యాయబద్ధంగానే జావా లాంగ్వేజ్ ను వాడుకుందని జ్యురీ పేర్కొంది. -
గూగుల్ కి భారీ ఊరట..
శాన్ ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం గూగుల్ కు పెద్ద ఊరట లభించింది. మల్టీ బిలియన్ డాలర్ల దావా కేసులో కోర్టు గూగుల్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీgతో జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాపీ రైట్ వివాదంలో రెండు టెక్నాలజీ దిగ్గజాల మధ్య సాగిన హోరా హోరీ యుద్ధానికి ప్రస్తుతానికి తెరపడింది. ఈ తీర్పును పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఒరాకిల్ మళ్లీ పోరుకు రడీ అవుతోంది. ఆండ్రాయిడ్ ఎకో సిస్టమ్ విజయానికి ఈ తీర్పు నిదర్శనమని గూగుల్ వ్యాఖ్యానించింది. జావా ప్రోగ్రామింగ్ క్యమూనిటీ కాపీ రేట్స్ విషయంలో, సాప్ట్ వేర్ అభివృధ్దిలో నూతన ఆవిష్కరణలకు నాంది అవుతుందని ఒక ప్రకటనలో తెలిపింది. సాఫ్ట్ వేర్ డెవలపర్లకు ఇదిముఖ్యమైన విజయమని, సృజనాత్మకతకు ప్రోత్సాహాన్నందిస్తుందని కంప్యూటర్ కమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎడ్ బ్లాక్ చెప్పారు. ఇది ఇలా ఉంటే ఈతీర్పును వ్యతిరేకించిన ఒరాకిల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ను గూగుల్ చట్టవిరుద్ధంగా వాడుతోందని గట్టిగా నమ్మువుతున్నామని వాదించింది. మరోసారి అప్పీలు కు వెళ్లనున్నట్టు స్పష్టం చేసింది. కాగా జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ లో గూగుల్ ఆండ్రాయిడ్ కాపీ రైట్ ను ఉల్లంఘించిందని ఒరాకిల్ ఆరోపించింది. దీనికి గాను తమకు గూగుల్ ఆ కంపెనీకి 8.8 బిలియన్ డాలర్లు(880 కోట్ల డాలర్లు) చెల్లించాలంటూ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కాపీ రైట్ చట్టం ప్రకారం న్యాయంగానే జావా లాంగ్వేజ్ ను వాడుకుంటున్నామని, దానికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదంటూ ఒరాకిల్ ఆరోపణలను గూగుల్ ఖండించింది. ఈ రెండు కంపెనీల మధ్య వాదనలు 2012లో మొదలైన సంగతి తెలిసిందే.. -
గూగులా..? ఒరాకిలా..? గెలుపెవరిది..
శాన్ ఫ్రాన్సిస్కో : కాపీ రైట్ దావాపై రెండు టెక్నాలజీ దిగ్గజాల మధ్య అసలు సిసలైన యుద్ధం ప్రారంభం కాబోతుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై వచ్చే సోమవారం జరగబోయే కాపీరైట్ విచారణలో గూగుల్, ఒరాకిల్ లు నువ్వా..? నేనా ..? అంటూ వాదించుకోబోతున్నాయి. ఒకవేళ ఈ కేసులో ఒరాకిల్ నెగ్గితే గూగుల్ ఆ కంపెనీకి 8.8 బిలియన్ డాలర్లు(880 కోట్ల డాలర్లు) చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ లో గూగుల్ ఆండ్రాయిడ్ కాపీ రైట్ ను ఉల్లంఘించిందని ఒరాకిల్ వాదిస్తున్నది. కాపీ రైట్ చట్టం ప్రకారం న్యాయంగానే జావా లాంగ్వేజ్ ను వాడుకుంటున్నామని, దానికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని గూగుల్ చెబుతోంది. ఈ రెండు కంపెనీల మధ్య వాదనలు 2012లోనే ప్రారంభమయ్యాయి. సోమవారం ఈ రెండు కంపెనీల వాదనలపై జ్యూరీ ఎదుట విచారణ జరగనుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై వచ్చే వారం కాపీరైట్ విచారణ సందర్భంగా ఒరాకిల్ కోరిన 8.8 బిలియన్ డాలర్లను గూగుల్ చెల్లించాల్సిన వస్తే మార్కెట్లో ఈ సెర్చ్ ఇంజన్ దిగ్గజంపై ప్రభావం చూపగలదని పెట్టుబడిదారులు, విశ్లేకులు భావిస్తున్నారు. అయితే ఆ ప్రభావం పెట్టుబడిదారులపైన తక్కువగానే ఉంటుందని ఎఫ్ బీబీ క్యాపిటల్ పార్టనర్స్ రీసెర్చ్ డైరెక్టర్ మికీ బైలీ తెలిపారు. ఎందుకంటే ఆ మొత్తాన్ని గూగుల్ ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని, ఈ ప్రభావం గూగుల్ పై తక్కువగానే చూపుతుందని పేర్కొన్నారు. అయితే ఈ జావా లాంగ్వేజ్ ను ఆండ్రాయిడ్ లో భవిష్యత్ లో ఎప్పుడూ గూగుల్ వాడుకోకుండా నిషేధాజ్ఞలు విధించాలని ఒరాకిల్ కోరుతోంది. ఇప్పుడు కొనసాగిస్తున్న ఈ రాయల్టీ చర్చలతో మరింత పరపతిని పెంచుకోవాలని భావిస్తోంది. అయితే ఈ నిషేధాజ్ఞలను జడ్జినే విధించాల్సి ఉంటుంది కాబట్టి తీర్పు వన్ సైడ్ వచ్చే సూచనలున్నాయని నిపుణులంటున్నారు. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ డివైజ్ ల ద్వారా అడ్వర్టైజింగ్, సెర్చ్ రెవెన్యూలను 29 బిలియన్ డాలర్ల(2900కోట్ల డాలర్లు)వరకూ గూగుల్ ఆర్జించిందని ఒరాకిల్ అంచనా వేసింది. యాప్ లు, ఆండ్రాయిడ్ ఫోన్ల అమ్మకాల ద్వారా అదనంగా 11.6 బిలియన్ డాలర్లు(1160 కోట్ల డాలర్లు) గూగుల్ పొందిందని కోర్టు డాక్యుమెంట్ లో ఒరాకిల్ పేర్కొంది. వీటిలో ఆండ్రాయిడ్ లాభాలు 11.4 బిలియన్ డాలర్లగా(1140కోట్ల డాలర్లు) తెలిపింది. మొత్తంగా 8.8 బిలియన్ డాలర్లును కాపీ రైట్ ఉల్లంఘనల కింద గూగుల్ ను ఒరాకిల్ కోరేందుకు సిద్ధమైంది. అయితే ఆండ్రాయిడ్ విజయంతో, జావా ప్రాధాన్యతను ఒరాకిల్ ఎక్కువ చేసి చూపుతుందని గూగుల్ చెబుతోంది. -
హైదరాబాద్, విజయవాడల్లో ఒరాకిల్ స్టార్టప్ ఇంక్యుబేటర్లు
ముంబై: ఐటీ దిగ్గజం ఒరాకిల్ దేశవ్యాప్తంగా తొమ్మిది స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నది. హైదరాబాద్, విజయవాడలతో పాటు మరో ఆరు నగరాల్లో ఒరాకిల్ స్టార్టప్ క్లౌడ్ యాక్సిలిటరేర్ పేరుతో ఈ స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నామని ఒరాకిల్ సంస్థ తెలిపింది. వృద్ధిలోకి వస్తున్న ఎంటర్ప్రెన్యూర్లకు తగిన మార్గదర్శకత్వం అందించడం, వృద్ధి చెందుతున్న కంపెనీలకు ఉత్తమ టెక్నాలజీని అందించడం లక్ష్యాలుగా ఈ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. క్లౌడ్ టెక్నాలజీ పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ఉపయోగపడేలా చూడడం, దేశాన్ని మార్చే బిజినెస్ ఐడియాలున్న ప్రతి వ్యక్తి క్లౌడ్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని ఒరాకిల్ ప్రెసిడెంట్ థామస్ కురియన్ చెప్పారు. చిన్న సంస్థలకు మార్గదర్శకత్వం వహించడం కీలకమైన అంశమని, విజయవంతమైన స్టార్టప్‌లను నిర్వహించిన సీఈఓలు, వెంచర్ క్యాపిట్ పండ్స్ సూచనలు, సలహాలను ఈ ఇంక్యుబేటర్లు అందిస్తాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ సేవలందిస్తున్నప్పటికీ ఇలాంటి ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. బెంగళూరులో తొలి స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను నేడు(శుక్రవారం) ఏర్పాటు చేస్తామని కురియన్ తెలిపారు. -
స్టార్టప్ కంపెనీలకు ఒరాకిల్ దన్ను
కొత్తగా వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వారికి చేదోడువాదోడుగా.. అభివృద్ధి చెందుతున్న కంపెనీలకు టెక్నాలజీని అందిస్తున్న ఒరాకిల్.. దేశవ్యాప్తంగా తొమ్మిది స్టార్టప్ ఇంక్యుబేటర్లను స్థాపించబోతోంది. దేశానికి మేలు చేసే ఏ వ్యాపార ఆలోచనైనా తాము ప్రోత్సహిస్తామని ఒరాకిల్ అధినేత థామస్ కురైన్ తెలిపారు. పెద్ద కంపెనీలకే కాకుండా ప్రతి ఒక్కరికీ తమ సేవలను అందించడమే లక్ష్యమన్నారు. ఈ ఇంక్యుబేటర్ వల్ల వెంచర్ కేపిటల్ ఫండ్స్ నుంచి కొత్తగా ప్రారంభించబోయే కంపెనీలకు సూచనలు, విజయవంతమైన స్టార్టప్‌ల మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సలహాలు అందిస్తామన్నారు. ఒరాకిల్ స్టార్టప్ క్లౌడ్ యాక్సిలేటర్‌ను మొదట బెంగళూరులో ప్రారంభిస్తామని, ఇది అమెరికా తర్వాత రెండో అతి పెద్ద స్టార్టప్ హబ్‌గా నిలవబోతుందని చెప్పారు. ఇలా వచ్చే 12 నెలల్లో మిగతా ప్రాంతాల్లో స్టార్టప్ హబ్ లను నెలకొల్పుతామన్నారు. ముంబై, పుణే, చెన్నై, గుర్గవ్, హైదరాబాద్, తిరువనంతపురం, విజయవాడలలో ఈ సెంటర్లను ప్రారంభించబోతున్నట్టు ఒరాకిల్ తెలిపింది. -
క్యాట్ - 2016లో మెరిసిన ప్రకాశం జిల్లా వాసి
మార్కాపురం: క్యాట్-2016 ప్రవేశ పరీక్షలో ప్రకాశం జిల్లా వాసి మెరిశాడు. మార్కాపురానికి చెందిన గొంట్లా వెంకట శ్రీచరణ్ 99.1 శాతం మార్కులను సాధించాడు. క్యాట్ 2015 ప్రవేశ పరీక్షల్లో శ్రీచరణ్‌కు 97.3 శాతం మార్కులు రాగా కళాశాలలో సీటు రాలేదు. దీంతో 2016 అర్హత పరీక్షలు రాయగా 99.1 శాతం మార్కులు వచ్చాయని అతని తండ్రి రాంబాబు తెలిపారు. శ్రీచరణ్ గౌహతిలో ఐఐటీ పూర్తి చేశాడు. ప్రస్తుతం ఒరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పారు. -
భారతీయ సాఫ్ట్వేర్ మార్కెట్ వృద్ధి 10 శాతం
న్యూఢిల్లీ : గతేడాది రెండో అర్ధ భాగంలో భారతీయ సాఫ్ట్వేర్ మార్కెట్ వృద్ధి 10 శాతంగా నమోదైంది. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్ వంటి టాప్ ఐటీ కంపెనీలు స్థిరంగా రెండంకెల వృద్ధిని నమోదు చేయడమే దీనికి కారణమని ఇంటర్నేషనల్ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తన నివేదికలో తెలిపింది. నివేదిక ప్రకారం.. భారతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో ప్రాథమికంగా అప్లికేషన్ డెవలప్మెంట్ డిప్లాయ్‌మెంట్, అప్లికేషన్స్, సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ సాఫ్ట్వేర్(ఎస్ఐఎస్) అనే మూడు భాగాలున్నాయి. అప్లికేషన్ డెవలప్మెంట్ డిప్లాయ్‌మెంట్ మార్కెట్ వృద్ధి 9.5 శాతంగా, అప్లికేషన్స్ మార్కెట్ వృద్ధి 10.8 శాతంగా, ఎస్ఐఎస్ మార్కెట్ వృద్ధి 8.5 శాతంగా ఉంది. అప్లికేషన్ ప్లాట్‌ఫామ్స్, కంటెంట్, ఆపరేషన్స్, మ్యానుఫ్యాక్షరింగ్ అప్లికేషన్స్ వంటి తదితర సెకండరీ మార్కెట్ విభాగాలు కూడా మంచి వృద్ధినే నమోదుచేశాయి. -
ఐటీ..పిటీ
ఇదిగో ఒరాకిల్... ఇదిగో ఆపిల్... అదిగదిగో మైక్రోసాఫ్ట్...! విశాఖ నగరానికి బడా ఐటీ కంపెనీలు వస్తున్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఊదరగొడుతోంది. కానీ వాస్తవం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉండటం విస్మయకర వాస్తవం. విశాఖవైపు బడా ఐటీ కంపెనీలు ఏవీ కన్నెత్తి చూడటం లేదు. ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు కూడా చేయడం లేదు. ఆసక్తి చూపించే కంపెనీలకు విశాఖలో కోరిన భూమి ఇవ్వడానికి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోంది. మరోవైపు విశాఖకంటే నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోనే కావల్సినంత భూమి ఇస్తామని ప్రతిపాది స్తోంది. పెద్ద కంపెనీలను దూరం చేసేలా ప్రభుత్వమే పకడ్బందీగా వ్యూహాన్ని అ మలు చేస్తుండటం విశాఖ ఐటీ ప్రగతికి విఘాతంగా మారింది. -సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం ఇక్కడ ఇవ్వలేం... అక్కడైతే ఇస్తాం ప్రపంచంలో ప్రముఖ ఐటీ సంస్థలను రాష్ట్రంలో యూనిట్లు స్థాపించేలా చేయడానికి ప్రభుత్వ ఐటీ శాఖ సలహాదారు జె.వి.సత్యన్నారాయణ, ఐటీ కార్యదర్శి సంజయ్ జాజు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. వారు ఐటీ ప్రాజెక్టులపై ఒరాకిల్, ఆపిల్, డెల్ తదితర సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో తమ యూనిట్లు స్థాపించేందుకు ఆ సంస్థలు ఆసక్తి కనబరచలేదని తెలుస్తోంది. అందుకు ప్రధాన కారణం ఆ సంస్థలు కోరినంత భూమి, ఇతరత్రా మౌలిక వసతులను విశాఖపట్నంలో కల్పించలేమని ప్రభుత్వం చేతులెత్తేయడమే. ఎకరా, అర ఎకరాకు మించ భూములు ఇవ్వలేమని తేల్చిచెప్పేశారు. దాంతో తాము విశాఖపట్నంలో యూనిట్లు స్థాపించలేమని ఆ సంస్థలు కుండబద్దలు కొట్టేశాయి. కానీ ఐటీ ఉన్నతాధికారులు ఆ సంస్థలకు విజయవాడ-మంగళగిరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కోరినంత భూమి ఇవ్వగలమని చెప్పడం గమనార్హం. బెంగుళూరు, చెన్నైలకు కూడా సమీపంలో ఉంటుందని చెబుతూ విజయవాడ-మంగళగిరి, నెల్లూరు, చిత్తూరులకు అనుకూలంగా ప్రభుత్వం బలమైన వాదన వినిపిస్తోంది. ఒరాకిల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు అక్కడ 50 ఎకరాల చొప్పున కూడా కేటాయించగలమని ప్రతిపాదిస్తుండటం గమనార్హం. ఇప్పటికే పై డేటా అనే సంస్థకు అప్పటికే మంగళగిరి ఆటోనగర్‌లో ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించడం ఇందుకు నిదర్శనం. ఆ సంస్థ రూ.600కోట్లతో నెలకొల్పే యూనిట్‌కు త్వరలో భూమి పూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు కూడా. చోటా కంపెనీలకూ పెండింగే : విశాఖ వచ్చేసరికి చిన్న చిన్న కంపెనీలతోనే ప్రభుత్వం సరిపెడుతోంది. ఐటీ శాఖ 24 కంపెనీలకు భూముల కేటాయింపు కోసం ఏపీఐఐసీకి ప్రతిపాదించింది. వాటికి గంభీరం, మధురవాడలో 15 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఒక్కొ కంపెనీకి దా దాపు అర ఎకరా ృొప్పునే భూములు కేటాయించాలని ప్రతిపాదించారు. ఆ 24 సంస్థలు కూడా దాదాపు ఎన్ఆర్ఐలుగా వ్యక్తిగతంగా స్థాపించేవే. అంతేగానీ ఒక్కటి కూడా పెద్ద ఐటీ కంపెనీ లేనే లేదు. అంటే పెద్ద ఐటీ కంపెనీలకు విజయవాడ-మంగళగిరి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భూములు కేటాయించడానికి ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ఈమేరకు ఆ జిల్లాల కలెక్టర్లు కూడా ఎంతైనా భూమి కేటాయిస్తామని ఏపీఐఐసీకి ప్రతిపాదించారు. అదే విశాఖ జిల్లా వచ్చేసరికి భూములు ఇవ్వలేమని రెృెన్యూ అధికారులు ఏపీఐఐసీకి తేల్చిచెప్పేశారు. -
ఒరాకిల్ ప్రెసిడెంట్‌గా భారతీయుడు
థామస్ కురియన్ నియామకం న్యూఢిల్లీ: అంతర్జాతీయ సాఫ్ట్వేర్ దిగ్గజాల్లో మరో కంపెనీ సారథ్య బాధ్యతలు భారతీయుడికి దక్కాయి. ఒరాకిల్ ప్రెసిడెంట్‌గా థామస్ కురియన్ (48) నియమితులయ్యారు. ఆయన ఒరాకిల్‌లో 1996లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (ప్రోడక్ట్ డెవలప్మెంట్)గా చేరారు. కురియన్ నియామకం వార్త తెలియగానే కేరళలో ఆయన కుటుంబసభ్యులు సంబరాలు జరుపుకున్నారు. కురియన్ కుటుంబం కొట్టాయం జిల్లా పాంపడికి చెందినది కాగా ఆయన విద్యాభ్యాసం బెంగళూరు, అటుపైన అమెరికాలో సాగింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన ఎంబీయే చేశారు. పలు అంతర్జాతీయ వెంచర్ ఫండ్స్, సాఫ్ట్వేర్ కంపెనీల బోర్డుల్లో కూడా ఆయన సలహాదారుగా పనిచేశారు. 2009లో ఒరాకిల్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత సాఫ్ట్వేర్ విభాగం వార్షిక అమ్మకాలు 18.9 బిలియన్ డాలర్ల నుంచి 29.2 బిలియన్ డాలర్లకు ఎగిశాయి.