గూగులా..? ఒరాకిలా..? గెలుపెవరిది.. | Google To Face Off Against Oracle Next Week in $8.8 Billion Lawsuit | Sakshi
Sakshi News home page

గూగులా..? ఒరాకిలా..? గెలుపెవరిది..

Published Fri, May 6 2016 2:03 PM | Last Updated on Sun, Sep 3 2017 11:32 PM

గూగులా..? ఒరాకిలా..? గెలుపెవరిది..

గూగులా..? ఒరాకిలా..? గెలుపెవరిది..

శాన్ ఫ్రాన్సిస్కో : కాపీ రైట్ దావాపై రెండు టెక్నాలజీ దిగ్గజాల మధ్య అసలు సిసలైన యుద్ధం ప్రారంభం కాబోతుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ పై వచ్చే సోమవారం జరగబోయే కాపీరైట్ విచారణలో గూగుల్, ఒరాకిల్ లు నువ్వా..? నేనా ..? అంటూ వాదించుకోబోతున్నాయి.

ఒకవేళ ఈ కేసులో ఒరాకిల్ నెగ్గితే గూగుల్ ఆ కంపెనీకి 8.8 బిలియన్ డాలర్లు(880 కోట్ల డాలర్లు) చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జావా ప్రొగ్రామింగ్ లాంగ్వేజ్ లో గూగుల్ ఆండ్రాయిడ్ కాపీ రైట్ ను ఉల్లంఘించిందని ఒరాకిల్ వాదిస్తున్నది. కాపీ రైట్ చట్టం ప్రకారం న్యాయంగానే జావా లాంగ్వేజ్ ను వాడుకుంటున్నామని, దానికి ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని గూగుల్ చెబుతోంది. ఈ రెండు కంపెనీల మధ్య వాదనలు 2012లోనే ప్రారంభమయ్యాయి. సోమవారం ఈ రెండు కంపెనీల వాదనలపై జ్యూరీ ఎదుట విచారణ జరగనుంది.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై వచ్చే వారం కాపీరైట్ విచారణ సందర్భంగా ఒరాకిల్ కోరిన 8.8 బిలియన్ డాలర్లను గూగుల్ చెల్లించాల్సిన వస్తే మార్కెట్లో ఈ సెర్చ్ ఇంజన్ దిగ్గజంపై ప్రభావం చూపగలదని పెట్టుబడిదారులు, విశ్లేకులు భావిస్తున్నారు. అయితే ఆ ప్రభావం పెట్టుబడిదారులపైన తక్కువగానే ఉంటుందని ఎఫ్ బీబీ క్యాపిటల్ పార్టనర్స్ రీసెర్చ్ డైరెక్టర్ మికీ బైలీ తెలిపారు. ఎందుకంటే ఆ మొత్తాన్ని గూగుల్ ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందని, ఈ ప్రభావం గూగుల్ పై తక్కువగానే చూపుతుందని పేర్కొన్నారు.

అయితే ఈ జావా లాంగ్వేజ్ ను ఆండ్రాయిడ్ లో భవిష్యత్ లో ఎప్పుడూ గూగుల్ వాడుకోకుండా నిషేధాజ్ఞలు విధించాలని ఒరాకిల్ కోరుతోంది. ఇప్పుడు కొనసాగిస్తున్న ఈ రాయల్టీ చర్చలతో మరింత పరపతిని పెంచుకోవాలని భావిస్తోంది. అయితే ఈ నిషేధాజ్ఞలను జడ్జినే విధించాల్సి ఉంటుంది కాబట్టి తీర్పు వన్ సైడ్ వచ్చే సూచనలున్నాయని నిపుణులంటున్నారు. ఇప్పటివరకూ ఆండ్రాయిడ్ డివైజ్ ల ద్వారా అడ్వర్టైజింగ్, సెర్చ్ రెవెన్యూలను 29 బిలియన్ డాలర్ల(2900కోట్ల డాలర్లు)వరకూ గూగుల్ ఆర్జించిందని ఒరాకిల్ అంచనా వేసింది.

యాప్ లు, ఆండ్రాయిడ్ ఫోన్ల అమ్మకాల ద్వారా అదనంగా 11.6 బిలియన్ డాలర్లు(1160 కోట్ల డాలర్లు) గూగుల్ పొందిందని కోర్టు  డాక్యుమెంట్ లో ఒరాకిల్ పేర్కొంది. వీటిలో ఆండ్రాయిడ్ లాభాలు 11.4 బిలియన్ డాలర్లగా(1140కోట్ల డాలర్లు) తెలిపింది. మొత్తంగా 8.8 బిలియన్ డాలర్లును కాపీ రైట్ ఉల్లంఘనల కింద గూగుల్ ను ఒరాకిల్ కోరేందుకు సిద్ధమైంది. అయితే ఆండ్రాయిడ్ విజయంతో, జావా ప్రాధాన్యతను ఒరాకిల్ ఎక్కువ చేసి చూపుతుందని గూగుల్ చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement