జెన్‌సర్ టెక్నాలజీస్ చేతికి ‘ప్రొఫెషనల్ యాక్సెస్ ’
న్యూఢిల్లీ: రిటైల్ ఈ-కామర్స్ సొల్యూషన్స్ అందించే ప్రాఫెషనల్ యాక్సెస్ సంస్థను మధ్య తరహా సాఫ్ట్‌వేర్ సంస్థ జెన్‌సర్ టెక్నాలజీస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించి ఫ్రొఫెషనల్ యాక్సెస్(పీఏ) సంస్థతో ఒప్ప ందం కుదుర్చుకున్నామని పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న జెన్‌సర్ టెక్నాలజీస్ గురువారం తెలిపింది. అయితే ఎంత మొత్తానికి పీఏ సంస్థను కొనుగోలు చేసింది వెల్లడించలేదు.
అమెరికా, ఇంగ్లాండ్, లాటిన్ అమెరికా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లోని మధ్య, భారీ రిటైల్ సంస్థలకు ఈ-కామర్స్ సొల్యూషన్స్‌ను న్యూయార్క్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పీఏ కంపెనీ అందిస్తోందని వివరించింది. ఈ సంస్థ కొనుగోలుకు కావలసిన నిధులను అంతర్గత వనరులు, రుణాల ద్వారా సమకూర్చుకుంటామని పేర్కొంది. పీఏ ఆదాయం 3.8 కోట్ల డాలర్లని వివరించింది. ఈ డీల్‌కు ఆర్థిక సలహాదారులుగా ఐసీఐసీఐ సెక్యూరిటీస్, న్యాయ సలహాదారులుగా భారత్‌లో నిషిత్ దేశాయ్ అసోసియేట్స్, అమెరికాలో స్టాల్ కోవెన్ క్రోలే ఆడిస్ ఎల్‌ఎల్‌సీలు వ్యవహరించాయని జెన్‌సర్ టెక్నాలజీస్ పేర్కొంది.